పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, మార్చి 2014, సోమవారం

Kaaram Shankar కవిత

అమ్మ ఒక మహా కావ్యం కారంశంకర్ అమ్మ అనగానే అమృతం తాగినట్టుంటుంది! కలుషిత సమాజంలో కల్మషం లేనిది అమ్మ ప్రేమే కదా!! అమ్మ చుట్టు ఆలోచన లు పరిభ్రమిస్తున్న ప్పుడల్లా నేను పసివన్నై పోతాను !! నేనిప్పటికీ అమ్మ పాడిన జోల పాటల్లో ఉయలూగుతుంటాను అప్పట్లో అమ్మ పాల కమ్మదనాన్ని మగత నిద్ర లొనూ చప్పరించేవాన్ని! ఎప్పటికీ అమ్మ గర్భం ఓ వెచ్చని మందిరమే కదా! నిష్కల్మష నిలయమే సదా!! అమ్మా! నీ గుండెలపై చిట్టి పొట్టి కాళ్ళతో తన్నినప్పుడు ముగ్దు రాలివై నా కాళ్ళని కుడా ముద్దాడే దానివి! నన్ను చూసి మురిసిపోయి ముచ్చట్లాడే దానివి గుర్తుందా ...? నీ నోట్లో వేలు పెట్టి నే నాడుకున్నప్పుడు! కొసపంటితో నా చేతి వేళ్ళను మృదువుగా కొరికి గమ్మతులాడే దానివి! అమ్మా! నువ్వు అమ్మవి మాత్రమే కావు నా ప్రాణ స్నేహితురాలివి !! జ్యరమొచ్చి అల్లాడినప్పుడు నన్ను నీ గుండెలకు హత్తుకుంటే చాలు ! ఏ మందులు అక్కర్లేకుండా పోయేవి !! ఇప్పటికీ నిన్ను తలచుకుంటే చాలు! ఎంతో ఉపశమనం పొందుతాను!! అమ్మా నీ కళ్ళతోనే నా హృదయాన్ని ఎక్సరే తీసేదానివి అంతేనా ... నీ తల వెంట్రుకలతో దృష్టి తీసేదానివి ! నువ్విప్పటికి నా మానసిక గాయాల్ని స్వస్తత పరిచే సై క్రియా టిస్ట్ వి ! ఎన్నటికి చెరగని నా స్మృతి పతానివి నిన్ను తలచుకుంటే చాలు! ఏ గాయమైనా మాయమవ్వల్స్లిందే!! అమ్మా నువ్వో అద్బుత వాక్యనివి మహా కావ్యానివి !!

by Kaaram Shankar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PaGNuo

Posted by Katta

Kavi Savyasaachi కవిత

మిత్రులకోసం..కొన్ని..మినీ..కవితలు... ఎప్పుడో రాసుకున్నవి.... 31/03/2014 ఖమ్మం ----- ఖమ్మం కళలకు గుమ్మం మతవిద్వేషాలనసలే నమ్మం ప్రేమ సుధాధారలమ్మం భరతమాత చరణాల విరిసిన చిరు సుమం ఖమ్మం అనూష ----- వసంతకోకిల గొంతుమూగవోయింది మావిచిగురెపుడో మాడిపోయింది కట్టుకున్న కలలసౌధం కూలిపోయింది అర్థరాత్రి అనూష రాలిపోయింది విభజన ----- జనామోదం మాకక్కరలేదు ఓటు..సీటు...మాకెంతో స్వీటు గుండెల్ని రెండుగా చీలుస్తాం మాతృభాష నాలికని నిలువుగా తెగ్గొస్తాం తెలంగాణ ------ నా తెలంగాణ తీగలు తెగిన వీణ రక్తాశృవుల రోదన తెగిపడిన వీరుల ఆక్రందన అన్నపు మెతుకుల ఆవేదన

by Kavi Savyasaachi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PaGLCT

Posted by Katta

Rajasekhar Gudibandi కవిత

కవిసంగమం మిత్రులందరికీ జయ హో నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

by Rajasekhar Gudibandi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fH06lx

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ తియ్యని తెలుగు @ _ కొత్త అనిల్ కుమార్ జయనామ ఉగాది రోజునా ఎందరో మహానుబావులన్నారు... మన భాషని. పాల మీది మీగాడని... తేనెలూరు తెలుగని కాని,నేనంటున్నాను. ముట్టుకుంటే రాలిపోయే పుప్పొడి లాంటి పూతరేకని, పట్టుకుంటే కందిపోయే పాలకోవా అని, వాసన తో కడుపు నింపే బూరెలని, మనసుండబట్టలేక ఆరగించాలనిపించే సున్నుండ లని, మాటలు రాక వర్ణాలు పులుముకున్న పంచదార చిలకలని, వంపులు చుట్టి చక్కర దుప్పటి కప్పుకున్న కాజాలని, కడుపునా తీపి బండాగారం నింపిన కజ్జికాయాలని, చక్కని రుచిని పంచె చక్కర పొంగలి అని, పరమాత్మను సైతం మెప్పించే పరమాన్నమని, పండుగను వెంట తెచ్చే పాయసమని, పసిడి రంగులో పులకింత పెట్టె పూర్ణమని, ఇంత తియ్యని తెలుగు మన చెంతనుండగా... వగరు పుట్టించే పరభాషలు మనకెలా ?!

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mq9C0O

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mq9BtV

Posted by Katta

Chi Chi కవిత

_లోకంతల_ ప్రస్తుతం ఒక తలకాయలో ఈ లోకం పనిచేయుట లేదు మరియు లేదు లోకమాచూకి పట్టే భాద్యతలో తల మునకలేస్తూ కళ్ళు తెరవాలనే కనీస తలంపు కూడా లేకుండా కనిపించట్లేదంటూ కదలకుండా కునక్కుండా కల్పించుకోకుండా కిమ్మనకుండా ఉంటే ఎదురొచ్చిన చీకటి కనురెప్పల్ని తట్టిందట!! పాపం తట్టేదెవరో ఏంటో తెరవకుండా తెలుస్కోడానికి రెప్పలకు peephole లేక లోకమేనేమోనన్న సందేహం కూడా లేకుండా రెప్పలు తెరిచేంతలో చప్పుడాగిపోయిందట!! చప్పుడేమయిందో కూడా తెలుస్కోవాలని లేకుండా కళ్ళు తెరిచేసాక అసలు తెరిచినట్టే లేని చీకట్ని చూసి లోకాన్ని చూడలేని తలకు కళ్ళెందుకనుకుని పీక్కోకుండా చీకట్నే చూస్తుంటే వెనకనుంచి తలమీద ఫాట్మని కొట్టిందెవరో ఏంటో వెనక్కు తిరిగి చూస్తే వెలుగు!! ముందు చీకటి , వెనక వెలుగు లోకం కనిపించని చీకటైనా వెలుగైనా ఒకటేనని అర్థం చేస్కోకుండా వెలుగునే చూస్తున్న ఆ తలకి రెప్పలు తట్టింది చీకటా వెలుగా అన్న సందేహం కుడా రాలేదట!! వెనక్కి తిరిగి చూడకుండా వెలుగునే చూస్తూ లోకాన్ని వెతకాలో వెనుతిరిగి చీకట్లో చీకటే లోకమనుకోవాలో పాపం ఆలోచించలేని తల తప్ప ఏమి లేని ఆ శరీరానికి కళ్ళే దిక్కు!! మొండెం దొరక్కపోయినా పర్లేదు లోకం దొరికితే చాలన్న సంకల్పం కూడా లేకుండా పడున్న దాన్ని చూసి వెలుగు చీకట్లు జాలి చూపకపోయినా, లోకానికే ఆ తలనెత్తుకుని తిరగాలని ఎప్పుడనిపిసస్తుందో..దానికి ఎప్పుడు కనిపిస్తుందో.. కనీసం రెప్పలు తట్టింది లోకమేనేమోనన్న మొదటి సందేహమొచ్చినా చాలు తలా తోకా లేని లోకాన్ని ఆ తలే చూస్కుంటుంది________(31/3/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gU8Fyx

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె ••పెచ్చులూడిన గోడ•• గులాబీ వాసనలు పట్టు గాలి వల- అడవి కల కను మొక్క కన్ను- పురాతన తవ్వకం జరుపు మర్రిచెట్టు కోరిక- సమంగా రెండు చినుకులు రాలు కాలం- తడవడం లేదా నగ్నంగా తడపడం- పెచ్చులూడు ఆకాశం గోడ కుప్పకూలు సమయం- మనిషి యే తీరం గుర్తొ చరిత్రకి అద్ది పోతాడు- 15-03-14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mq9Bdo

Posted by Katta

Srinivasu Gaddapati కవిత

//ఎలక్షన్నామ ఉగాది// ------------------------ *శ్రీనివాసుగద్దపాటి* ---------------------------------------------------------------------- "జయ"నామ ఉగాది జయహో..ఎన్నికలతో ఎన్నెన్నికలలతో.... ఆశలవసంతాల్ని మోసుకొని ఎగిరొస్తున్నావా...?! మోడువారిన బీడుగుండెల్లో ఆశలచివుర్లు మోలిపిస్తావో....! మునుపటిలాగే ..... వాగ్ధానాలజల్లులు కురిపిస్తావో...! ఎప్పటిలాగే నీకెదురేగి ఆహ్వానం పలుకలేను ఆనందంగా ఆరురుచుల్ని ఆస్వాదించనూలేను అరవైఏండ్ల కలసాకారమౌతున్నవేళ అడుగడుగునా అనుమానాల చిక్కుముడులు పునర్ణిర్మాణమా...! నవనిర్మాణమా..?! అసలు గుడిసేలేని అమాయకజీవులకు అదో మిలియండాలర్ ప్రశ్న రోజుకో పార్టీ.. పూటకోనినాదంతో కొత్త కొత్త ఇజాల్ని భుజానవేసుకొస్తున్న కొత్తబిచ్చగాళ్ళు సరికొత్త తాయిలాలతో ఓటర్ల మెదళ్ళను ఖాయిలాచేస్తున్న మాయలమరాఠీల మాటలగారడీలు ఇన్ని అనుమానాలు ఇంత అయోమయంలో ఎలానిన్ను ఆస్వాదించను ఏమని నిన్ను ఆహ్వనించను ఓ జయనామ ఉగాది నీకు జయహో.... 31.03.2014

by Srinivasu Gaddapati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mq9AWX

Posted by Katta

Sita Ram కవిత

☼♀బుల్లి♀☼...... నిలువెత్తు నీరూపం మెదిలింది మదిలోన మురిపించె నీఅందం మరిపించె నాధుఖం భూలోక స్వర్గంబు భువిలోక దివితార నీపాదస్పర్శ కోసం పుడమైనా వేచిచూడదా కదిలించె నీసోయగం రాతిమనిషినైనగాని చలనంలేని మనిషికి వర్ణాలే తెలియవులే వేలతారల నడుమ చందమామనైనగాని నీఓర కనిసైగతో మబ్బులమాటున దాగుండబెట్టవా కదిలే కాలమైనగాని నీఅందానికి దాసోహమవ్వదా భ్రమించే భూమైనగాని నీస్పర్శకై వేచిచూడదా దిష్టిచుక్కలేని నీలేత సోయగానికి నీపాదపద్మాల వద్దనైనగాని దిష్టిచుక్కనయ్యే వరమియ్యరాదే 31-03-2014

by Sita Ram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rY9F8b

Posted by Katta

Cv Suresh కవిత

సి.వి. సురేష్ || నను వీడిన‌ క్షణాలు || ఏ మిట్ట మద్యాహ్నమో! కొన్ని నీడలు వీడిపోతాయి మన ను౦డి నిర్ధాక్షిణ్య౦గా పోతూ పోతూ తన జ్ఞాపకాన్ని ఇక్కడే దిగవిడిచి వెళ్తాయి మెత్తటి ముఖముల్ గుడ్డను విసిరేసి...! తోడై నిలుస్తు౦దనుకొనేలోగా ఎర్రటి తివాచి ని సిద్ద౦ చేసుకొ౦టు౦ది దర్జాగా వెళ్ళే౦దుకు.. జ్ఞాపకానికీ మరచిపోవడానికి మధ్య ఒక అసహన రేఖ‌ ఎప్పుడూ మెదడును చుడుతూనే ఎద చాటున దాగిన కన్నీళ్ళన్ని ఆ నీడ‌ నడిచి వెళ్ళిన దారిపొడవునా వీడ్కోలు చెపుతూనే ఆమె వర్ణచిత్రమొకటి నా గు౦డె గోడపై ఎప్పటి లాగే వ్రేలాడుతూ నవ్వుతో౦ది...! విషాదమైన ఓ గజల్ మనసును గుచ్చి గుచ్చి తన ప్రతిభన‍౦తా చూపుతో౦ది నన్నీ క్షణాన‌! @ సి.వి.సురేష్

by Cv Suresh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hbqWBN

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో హైదరాబాద్ ‘రవీంద్రభారతి’లో జరిగిన 'ఉగాది కవిసమ్మేళనం' లో నేను వినిపించిన కవిత : రెండు కోకిలలు! రచన: ‘కవి దిగ్గజ‘ డా. ఆచార్య ఫణీంద్ర జయము! జయము! జయము! ‘జయ‘ నామ సంవత్స రాంబికా! ఇదే జయమ్ము నీకు! సకల జయము లింక, సంతోషముల దెచ్చు జనని! ‘వత్సరాది’! స్వాగతమ్ము! విస్తరించి మావి వృక్షమ్ము పెద్దగా రెండు శాఖ లెదిగె నిండుగాను! ఒక్కటి ‘తెలగాణ‘, మొక్క ‘టాంధ్ర ప్రదేశ్‘ - తెలుగు మావి రుచులు ద్విగుణమయ్యె! ఉవ్వెత్తు నెగసిన ‘ఉద్యమ ‘ గ్రీష్మాల మండుటెండల లోన మాడినాము - విరుచుక పడుచును వీపులందు కురియు ‘లాఠి ‘ వర్షాల కల్లాడినాము - బందు, హర్తాళ్ళతో వణుకు శరత్తులన్ పలుమార్లు వడవడ వణికినాము - ఆకులట్లు యువకు లన్యాయముగ రాలు శిశిరాలనే గాంచి చితికినాము – తుదకు నిన్నినాళ్ళ కిపుడు పదియునాల్గు వత్సరముల బాధ లుడిగి, ఫలిత మబ్బి, నేటికి కదా విరియుచు నీ తోటి మాకు చివురులెత్తు వసంతమ్ము చేరుచుండె! భారీ తుఫాను లుడిగెను - నీ రాక ‘ఉగాది‘! మాకు! నిజము! ‘యుగాదే‘! వేరుపడె తెలుగుభ్రాతలు! వారికి, వీరికి శుభమిడు బ్రహ్మాండముగాన్! కార, ముప్పు, వగరు, కడు చేదు, పులుపులే కడచి, కడచి, తుదకు కలిగె తీపి! క్రొత్త వత్సరమున క్రొంగొత్త రుచులతో వండినా ‘ముగాది పచ్చ‘డిదిగొ! మెలగుచు స్నేహభావమున మెండుగ నొక్కరితో మరొక్కరున్ తెలుగు సహోదరుల్ పరమదివ్యముగా సహకారమందుచున్, వెలసెడి రెండు రాష్ట్రముల వేగముగా నభివృద్ధి జెందినన్ - తెలుగిక రెండు భాగముల తేజమునన్ ద్విగుణీకృతంబగున్! నిండుకుండ లట్లు రెండు రాష్ట్రాలలో పూర్తిగ నదులెల్ల పొంగి, పొరలి - దండిగా ప్రజలకు దాహార్తి తీర్చుచున్, పంటభూములకును ప్రాణమిడుత! యాదగిరి నారసింహుని యమిత భక్తి నరిగి, మ్రొక్కులనిడుత సీమాంధ్ర జనులు; సింహగిరి నారసింహుని చేరి, ఇంక మ్రొక్కులిడుత తెలంగాణ భూమి ప్రజలు! ఓ ‘జయాఖ్య వర్షమ’! కను డుత్సహించి - రెండు కోకిలల్ కూసె నీ పండుగ కిక! ఈవు ‘తెలగాణ‘, ‘సీమాంధ్ర‘ ఇరు గృహాల తిని ‘ఉగాది పచ్చడి‘, నిడు దీవెనలను! — &&& —

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hbqWBI

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో హైదరాబాద్ ‘రవీంద్రభారతి’లో 'ఉగాది కవి సమ్మేళనం' : కవిసమ్మేళనంలో పాల్గొన్న కవులు : (కుడి నుండి వరుసగా : శ్రీమతి కొండేపూడి నిర్మల, నేను, శ్రీ వాడ్రేవ్ చిన వీరభద్రుడు, డా. రాళ్ళబండి కవితాప్రసాద్, డా. ఎల్లూరి శివారెడ్డి (కవి సమ్మేళనం అధ్యక్షులు), శ్రీ ముక్తేశ్వర రావ్ (గౌరవ అతిథి), శ్రీ శేషం రామానుజాచార్యులు, డా. మసన చెన్నప్ప, శ్రీ యాకూబ్, డా. ఉండేల మాలకొండా రెడ్డి, డా. తిరుమల శ్రీనివాసాచార్య మొ||గు వారు)

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dK4rJj

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | అనాదిగా ఇదే ఉగాది ------------------------------------- గగనాలు పోసిన చినుకుల తలంబ్రాలు- సెలయేటి కాంతకి ఒడిబియ్యాలు, ఊటనేలలో ఎదిగిన చెరుకు బెల్లాలు అవుతాయి. కోయిలమ్మ చివురులతో సరిపెట్టుకుంటే, చిలుకమ్మ పిందెలు చిదిమి వదిలితే, మామిడికొమ్మ మళ్ళీ కాయలు కానుకిస్తుంది. చింతలెరుగని బతుకుండదని, ఈదులాడనంటే ఒడ్డు ఆమడదూరాన్నే ఆగిపోతుందని, పులుపు మేళవింపు చింతచెట్టు తన వంతుగా పంపుతుంది. కాకమ్మ ఎత్తుకెళ్ళిన పళ్ల లెక్కలడగని, గాలిగాడు రాల్చిన ఆకుల అజ పట్టని, వేపమ్మ చేదుమందే శాస్త్రమని పువ్వులో పెట్టి చెప్తుంది. కారాలు చెపుతాయి ఊరూపేరూ వివరాలు- ఆరబోసిన మిరప మిలమిలలే ఉగాది నోటికి కారాలు, కంటికి నీరూను. ఏడేడు సంద్రాలు ఎన్ని యుగాల కన్నీటి కాలువలో? శోకాలు లేనిదే శ్లోకాలు పుట్టవనేమో, రవ్వంత ఉప్పు కలపని ఉగాదికి నిండుదనం రానేరాదు. గులకరాయంత కష్టానికి ఫలం, బండరాయంత సుఖం... కష్ట సుఖాల కలబోతల జీవితాలు ఉగాదికి ఉగాదికీ నడుమ షడ్రుచుల విస్తర్లు. 31/03/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1moVzZv

Posted by Katta

Ramakrishna Kalvakunta కవిత

మట్టి తల్లీ ! దండాలు !! ~~~~~~~~~~~~ నా శ్వాసకోశాల్లో ప్రవహిస్తున్న మట్టి పరిమళాలు మనోఫలకంపై ధారలు గా వర్షి స్తున్న స్మృతుల వెన్నెల జలపాతాలు .. ప్రతి ఉషోదయాన విచ్చుకుంటున్న వసంత వేకువ కిరణాలు .. ధ్వంసాలకూ ,నిర్మాణాలకూ నడుమ సాగే నిరంతర యుద్ధాలు ... నన్ను జడత్వ మత్తు ఆవరించినపుడల్లా కవిత్వాన్ని ఆహ్వానిస్తాను కవిత్వ సోపతి పట్టినపుడల్లా మట్టి నన్ను హత్తుకుంటది మనిషి ఎంత ఎత్తులకెదిగినా మట్టే కద పునాది ! శిశిరమై రాలిన పండుటాకుల్ని,ఎండుటాకుల్ని కడుపుల దాచుకుంటది వసంతమై కొత్త చిగుర్లని పొత్తిళ్లనించి మొలకెత్తిస్తది మనిషి చేసిన విషపు గాయాలకు ఛాతీ చీల్చుకుని మొరపెడ్తది ఎన్ని పొద్దుపొడుపుల్ని ,ఎన్ని నెత్తుటి వెన్నెలల్ని , ఎన్ని నిప్పులవర్షాల్ని ,మరెన్ని వరదల సునామీల్ని చూసిందో ! అనంత శతాబ్దాలుగా మోసి వంగిన వీపు పచ్చిపుండైనా నీ కోసం మట్టి తల్లి ఆరాటం ... కండ్లల్ల విషం చిమ్మినా ... నీకు వెన్నుదన్నై నిలుస్తున్నది ప్రేమించడమే జీవలక్షణంగ మురిసే పిచ్చి తల్లి తనువు నిత్యగాయాల కొలిమైనా .. తనయులకోసం ఆగని తండ్లాట! తన గుండె కాన్వాస్ పై ప్రతి ఉగాదికీ అద్దుకుంటున్న కాలపురుషుని ముద్రికలు తల్లిగుండెను యంత్రాల గునపాలతో చిద్రాలు చేస్తున్నా .... రస స్తన్యాన్నిస్తూ ,తరాల మనిషి చరితకు దారి వేస్తున్న .. ఆకుపచ్చ నిచ్చెన..! అలిసిన నీ దేహాన్ని వసంతగాలుల విసనకర్రలతో వీస్తూ ఆఖరి మజిలీ దాకా తోడై నడుస్తున్నది .. మట్టికీ పాదాలకూ నడుమ ఏ అయస్కాంతముందో మట్టికి మనిషికీ మధ్య ఏ అమృతరసబంధముందో వెన్నెముక నాడుల తీగ ల్లో ఏ నిశ్శ బ్ద మార్మిక గీతముందో ప్రతి రాత్రి నీకొక కొత్త చైతన్యదేహాన్నిస్తూ ఆకాశపు గొడుగు నీడన ఆకుల తివాచీ మీద నిన్ను నడిపిస్తది నదుల్లో నీరింకినపుడల్లా .. కనురెప్పలల్ల దాచుకున్న మమకారపు సముద్రాల్ని ఒంటి మీద పారిచ్చుకుంటది నీ కొత్తింటి పెద్దర్వాజాకు మామిడాకు తోరణమై తరాల మనిషి చరితకు ఆలంబనై అల్లుకుంటది పుట్టుకనుంచి దగ్ధమయ్యే దాకా దారిదీపమై , విరబూసిన మందారాల్నీ ,అరవిచ్చిన అరవిందాల్ని మనిషి శిరసున సిగపువ్వై ,నెమలీకై మురిసిపోయే వెర్రితల్లి నిత్యం నా గుండెపొలంలో మమకారపు పంట పండిస్తూ ... నన్నొక హరిత బంధంతో నడిపించే జీవద్రస ప్రవాహమా ! మట్టి మా తల్లీ ! నీకు ఒళ్ళంతా చేతుల్ని చేసి దండం పెడతా !! @డా. కలువకుంట రామకృష్ణ .

by Ramakrishna Kalvakunta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1moVBR6

Posted by Katta

Krishna Mani కవిత

కలుగును జయమిక ******************** ఎండలో దప్పిక నీళ్ళను ఎరుగక ఊపిరి వదలక బతుకుట తప్పక దొరకునని వదలక వెతుకుట ఆపక కలుగును జయమిక ! ************** ఓర్పును చెదరక దేనికి బెదరక పరుగులు చక చక ఉండదు తీరిక రేపటి రోజిక ఉండదు తిక మక అందుకే పోగిక కలుగును జయమిక ! **************** వణికిన తనువిక చెదిరిన కలయిక మాసిన పువ్విక చేయ్యును రణమిక ఒరుగును బలమిక తెగువకు వరమిక కలుగును జయమిక ! ********************* దెబ్బలు మాయక కారిన కన్నిక ఎగురును ఎంచక బలిశల సానిక కావురం తెగునిక వచ్చును బదులిక మోగును ధరువిక కలుగును జయమిక ! కృష్ణ మణి I 31-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gTj7X2

Posted by Katta

Sravanthi Itharaju కవిత

ఉత్సవం గౌరవం ఆనందం ధనం ఐశ్వర్యం.. ఈ ఐదింటి తో మన జీవితల్లొ పంచరత్నకీర్తనల్లా సంతోషం నర్తించాలని పచ్చని జీవన చిత్రం లిఖింపబడాలాని సుఖ శాంతులతో వర్థిల్లాలని కోరుకుంటూ.. జయ నామ సంవత్సరానికి జయజయ ధ్వానాలతో వారివారనుకున్న వారందరికీ..పశుపక్ష్యాదులకు ..ఈ చల్లని చక్కని వసంత శోభల విలసిల్లుతున్న పుడమి తల్లికి..ఈ స్రవంతి తెలుపుతోంది శుభాకాంక్షలు..

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ohxatE

Posted by Katta

Viswanath Goud కవిత

చీకటి భాణాలు ఆకాశంలో కొన్ని చుక్కలు పరిగెడుతుంటాయి ఎవరో తరుముతున్నట్టు, ఏ ఆపన్నహస్తమో అందుకోవాలన్నట్టు... చీకటి తరిమితే వెన్నెల పంచన చేరాలనుకుంటున్నాయి కాబోలు... వెన్నెలను వెంటాడుతూ చీకటిమంట వ్యాపిస్తోందని, నల్లగా కాల్చి రాత్రులకు కాటుక దిద్దబోతోందని.. చీకటి భాణాలు సంధిస్తుంటుంది అమాసని.. వెన్నెలను పడగొట్టాలని వెలుగుల నుండి విడగొట్టాలని... పక్షానికో మారు యుద్ధం ప్రకటిస్తుందని. తాము రాత్రి గుమ్మానికి కట్టిన రాలిపోయే తారాతోరణాలయితే.... వెన్నెల ఆకాశానికి దిష్టి తీసి పెట్టిన కరిగిపోయే కర్పూరమని. ఆకాశపు కొలనులో అమావాస్య అలజడికి చెదిరిపోయే ప్రతిభింబమని.... చెదిరిన ప్రతీసారీ... గడ్డకట్టి పగిలిపోయిన మంచు ముక్కలుగా కరిగి కనుమరుగవుతుందని... తెలియదేమో వాటికి. తెలిసుంటే రావు చుక్కలు వెన్నెలను ఆశ్రయించి..ఏదో ఆశించి. ఎవరు చెప్పారు చుక్కలకు పరిగెడితే పారిపోవచ్చని.. చీకటి నుండి తప్పించుకున్నా పగలుకు తప్పక పట్టుబడి రాత్రిలో బంధీ కాక తప్పదని, ఇదో చక్రవ్యూహమని ఎవరైనా చెప్పాలి వాటికి.! -విశ్వనాథ్ 31MAR14

by Viswanath Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRlRTo

Posted by Katta

Jyothirmayi Malla కవిత

||జ్యోతిర్మయి మళ్ళ|| కవి మితృలందరికీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! గజల్ ఆకాశమే ఒక కాగితం హరివిల్లు దించేసుకోనా నామనసునే కుంచెగా ఒక బొమ్మ నే గీసుకోనా ఆ కొండ కోనల్లో ఆగనా ఆ వాగు నీరల్లె సాగనా నాకంటిలో ఆ సోయగం పదిలంగ నిధి చేసుకోనా ఆ తీగ పువ్వల్లె నవ్వనా ఆ కొమ్మలో కోయిలవ్వనా ఈ గుండెతో ఆ గీతిని లతలాగ పెనవేసుకోనా ఓ మేఘ నీలమై మారనా ఓసంధ్య ఎరుపై జారనా ఆ వర్ణ కాంతులే నిండుగా వొళ్ళంత నే పూసుకోనా మధుమాస సుధఅంత గ్రోలనా మదిఅంత పులకింత తేలనా వసంతమంత ఇంతగా నాచెంత ఉంచేసుకోనా ఓ మావి మాలై మురియనా ఓ రంగవల్లై విరియనా ఉగాదివేళ ఓ జ్యోతినై మీకంట నను చూసుకోనా (31-03-2014) (ఈరోజు విశాఖ పోర్ట్ ట్రస్ట్ సాహితీ సంస్థ 'సాగరి ' నిర్వహించిన కవిసమ్మేళనం కోసం నేను రాసి పాడిన గజల్ )

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRlUi5

Posted by Katta

Kavi Savyasaachi కవిత

||ఈ చరిత్ర నీ రక్తంతో|| నువ్వెవడిని ప్రశ్నిస్తావ్? నువ్వెవడని ప్రశ్నేస్తావ్? నువ్వేమని అడుగుతావ్? నువ్వేదని కడుగుతావ్? వీడు..... నీకు బాగా తెల్సినోడే ఎప్పుడూ కావల్సినోడే...కానీ వీడో ముళ్ళపొదైనా కావచ్చు.. ముళ్ళపందైనా... వీడుమాత్రం కుళ్ళు వెధవ సొల్లు గజ్జి కుక్క... చొంగలు కార్చేసుకుంటు.. చీకట్లు పేర్చేసుకుంటు నోట్లను విసిరేసుకుంటు ఓట్లను పోగేసుకుంటు రాత్రిగొంతుల్లో సారానింపుకుంటు కపట ప్రేమపలుకులొంపుకుంటు జెర్రిలా పాకుతూ కాళ్ళు తెగనాకుతూ డ్రైనేజ్ నోటితో వాగుతూ అసత్యాల అంటకాగుతూ వీడెవడో... గుర్తొచ్చాడా...? అవును...వాడే...వీడు!! నీ గతానికి గోరీకట్టినోడు వర్తమానపు వంచనగాడు భవిత భస్మంచేసేవాడు.. నీ బతుకు భొంచేసేవాడు ఆడు సరే...నువ్వేంటి? నీ జ్ఞానం మోకాలా? అజ్ఞానపు అరికాలా? చరిత్ర చూడలేదా? ధరిత్రి చెప్పలేదా? కాలం నిన్నెప్పుడైనా కనికరించిందా? వెన్నెలెప్పుడైనా నీ బతుకులో కురిసిందా? కష్టాలు.....కన్నీళ్ళు ఆకలికేకలు....ఆక్రందనలు రోగాలూ...రొష్టులూ ఎముకలపోగులూ...రగిలే చితిమంటలూ... ఇవికాక....ఇంకేమైనావుంటే చెప్పు కడుపుమండి అరుస్తావ్ జబ్బలుతెగ చరుస్తావ్ చీపులిక్కరివ్వగానె చిందులు తొక్కేస్తావ్ ఐదు వందలనగానె అర్రులు సాచేస్తావ్ ఎక్కింది దిక్కముందె ఎవడికొ ఓటేసేస్తావ్ ఇగ అడగడానికి నీ హక్కేంది? నీ తిక్కకు లెక్కేంది? తెల్లరేప్పటికి నీ కిక్కు దిగుద్ది నీ బతుకప్పటికే తెల్లారిపోద్ది నువ్వోటేసినోడు మొహమైనా చూడడు అద్దాలమేడనుండి అడుగైనా దాటడు నువ్ తాగినసారా నీ సారాన్ని తాగుతుంది నీ ఆలి సింధూరం రాలి ధూళిలోన కలుస్తుంది ఆడుమాత్రం............. బతుకులు చిదిమేస్తూ... చితుకులు పోగేస్తూ... చితులు వెలిగిస్తూ... ఊసరవెల్లై రంగులు మారుస్తూ... ఈ కధలూ...ఈ వ్యధలూ ఇంకానా...ఇకచాలు!! ఆడు మళ్ళీ కనబడితే... చెప్పిడిచి కొట్టు పాళ్ళూడగొట్టు ఆడి సారాలో ముంచి తీసి అగ్గెట్టు....తన్నితగలెట్టు "అప్పుడే మళ్ళొకడు పుట్టడు మీ కడుపులు కొట్టడు""

by Kavi Savyasaachi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ohxbhg

Posted by Katta

Kavi Savyasaachi కవిత

ఉగాది ----- 31/03/2014 ఉగాది మళ్ళీ వచ్చేసింది..కానీ "గాది"క్కడ నిండుకుంది ఉరితాడు ముందు నిల్చుని ఉగాదినెలా స్వాగతించను? పార్థివదేహాల్ని ముందేసుకొని నడుస్తున్న శవాల్ని చూస్తూ వసంతకోకిలల్నెలా ఆహ్వానించను? మానంకోల్పోయిన తల్లుల్ని చూస్తూ మావిచిగురు రుచులెలా వర్ణించను? పల్లెనోళ్ళకు తాళాలుపడి వలసలు పోతున్నాయ్ నీరింకిన ఊఠబావులు కన్నీరింకిన కళ్ళూ ఇక్కడ దర్శనమిస్తున్నాయ్ బీళ్ళువారి నోళ్ళు తెరుచుకున్న పంటభూముల్లో ఇప్పుడు శవాలు మొలకెత్తుతున్నయ్ అప్పులకెరటాల సునామీ అన్నదాతలను ముంచేస్తున్నాయ్ అంబరాంగన కౌగిలిలో ధరలు ఓలలాడుతున్నాయ్ కార్చిచ్చై కుటుంబాల్ని కాల్చేస్తున్నాయ్ కుప్పతొట్లలోకి ఇప్పటికీ విసిరేయబడుతున్న కర్ణులూ అంగడిలో అమ్మకానికిపెట్టిన పసిమొగ్గలు ఉదయించకుండానే అస్తమిస్తున్న ఆడ శిశువులూ రైలుపెట్టెల్లో... చెత్తకుప్పల్లో... మురికిగుంటల్లో... ఖార్ఖానాల్లో... కరిగిపోతున్న బాల్యం.. నా కనులముందు సినిమా రీళ్ళలా సాగుతుంటే..... గుండెలవిసేలా నింగినంటుతున్న రోదనలలో... వసంతకోకిల గానం అది పలికే నవరాగం నాకెలా వినిపిస్తుంది? అతివల రక్తపు రుచిమరిగిన మృగాళ్ళు ఇంకా మనమధ్యే సంచరిస్తుంటే అంగాంగాన్ని ఆబగా ఆరగిస్తుంటే ఉగాదినెలా స్వాగతించను? ఎన్ని వసంతాలు నన్ను దాటుకొనివెళ్ళాయో ఎన్ని ఆమని గీతాలు మదిమాటునదాగాయో కానీ...ప్రతిసారీ నాకు వేపచేదే మిగిలింది... అయినా ఆశచావని మనిషిని... మళ్ళీ నిన్ను స్వాగతిస్తున్నా... ఇప్పటికైనా... మా జీవన ఉగాది షడ్రుచుల సంగమం కావాలని ఆశిస్తున్నా||

by Kavi Savyasaachi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRlU1q

Posted by Katta

Kamal Lakshman కవిత

ముఖ పుస్తక మిత్రులకు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు.. కమల్

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fFqiNp

Posted by Katta

Subbarayudu G Kameswara కవిత

Kavi Sangama mitrulandaru/ Jaya Jayamani santasillu/ Samvatsaramuu... GREETINGS--subbu

by Subbarayudu G Kameswara



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jqzg5F

Posted by Katta

Shash Narayan Sunkari కవిత



by Shash Narayan Sunkari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fFqiwT

Posted by Katta

Shash Narayan Sunkari కవిత



by Shash Narayan Sunkari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fFqhJ7

Posted by Katta

Shash Narayan Sunkari కవిత



by Shash Narayan Sunkari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jqz8Do

Posted by Katta

Shash Narayan Sunkari కవిత



by Shash Narayan Sunkari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jqz9qK

Posted by Katta

Shash Narayan Sunkari కవిత

పువ్వు వికసించినా మేఘం వర్షించినా నువ్వె గుర్తుకొస్తావు అలలుగా వచ్చి నన్ను తాకిన నీ నవ్వు మధురమయి నిలిచింది నా హ్రుదిలొ మమతానురాగాలు నింపింది నా మదిలో నువ్వు లేక నేను లేను నేను లేక నువ్వు లేవు ...................శేషు

by Shash Narayan Sunkari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fFqbkZ

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: జయనామ ఉగాదికి స్వాగతం...: చైత్రం పూసి కరవాలం దూసి ఓరగ చూసిన చూపుకు చీకటి రక్కసి వడి వడిగా తొలగుచున్న వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! లేత భానుని నులి వెచ్చని కిరణాల కౌగిటిలో శిశిరపు మంచు తదాత్మ్యముగా కరుగుచున్న వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! కరిగిన హిమం కనుమరుగై నీలి ఆకసపుటంచులను చేరి కరి మబ్బులకు కాంతినిచ్చిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! మంచు సముద్రం మాయమవుతూ మోడులు బోయిన ప్రకృతికాంత నుదుటన పచ్చని సింధూరం దిద్దిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! ప్రకృతి కన్య పచ్చని సోయగమునకు విచలితుడయిన చెరుకు విలుకాడు విరివానను శర పరంపరగా కురిపించిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! వత్సరం క్రితమే ఎటో వెళ్ళిపోయిన వసంత కన్య పంచశరుని వింటి మహిమన తిరిగి మహికరుదెంచిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! వసంతం సంతసమొందగ తరులతా సమూహం కుసుమరాగ పుప్పొడి శోభిత భాసితయయి అవని ఎదన ఆకుపచ్చ వస్త్రమును అచ్చాదనముగా పరచిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! భూతలమున అమృతభాండం రసాల వృక్షం చిగురుల గ్రోలి మధించిన కోయిల కూజిత రాగములాలపించిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! ప్రసూనములు హొయలుపోయి జావళీలు పాడుతున్న వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! నవ మల్లియల పరిమళాలు చేమంతుల విరహ వేధనలు చెలి సిగను చేరి హృదయ కుహారములో వసంతములాడిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! ఎటు చూసినా సౌందర్య లోక ఉద్యాన వనమై వనం వనం శుక పికల సమ్మేళనమయిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! దివినున్న అందాలు ఆసాంతం భువికి దిగుమతయిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! సంతోశం సమరసతా సౌందర్యం సౌహార్ధం క్రమత జాగురూకత తప్ప ఇంకేమీ వలదంటున్న జయనామ ఉగాదికి స్వాగతం..! జయనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు...!! 31/03/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rWN0ck

Posted by Katta

Sravanthi Itharaju కవిత

http://ift.tt/1hSP8tA

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hSP8tA

Posted by Katta

Venugopal V కవిత

సంవత్సర ఉగాది పర్వ దిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరమంతా ప్రతి క్షణమూ మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యములతో, సుఖ శాంతి ఐశ్వర్యములతో, గడుపవలెను......

by Venugopal V



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hSP8tu

Posted by Katta

Venugopal V కవిత

సంవత్సర ఉగాది పర్వ దిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరమంతా ప్రతి క్షణమూ మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యములతో, సుఖ శాంతి ఐశ్వర్యములతో, గడుపవలెను......

by Venugopal V



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hSP8dc

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

నవవర్ష శుభాకాంక్షల తో : ....|| 'జయ'వసంతము ||.... చిగురు పసరిక సరిగంచు చీర కట్టి సిగన గోగుపూ రేకుల సిరులు తురిమి చూత సితపుష్ప గుచ్చమ్ము చేత బూని వచ్చె వాసంత లక్ష్మమ్మ వనము పూయ, వెంట కొనితెచ్చె మదనుని వింటి పాట ! వేప చిరుచేదు తేనెలు వేగురింప వచ్చె వెనువెంట 'జయ' నామ వత్సరమ్ము ! నాగరాజు రామస్వామి. Dt:31.03.2014

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rWMZVM

Posted by Katta

Rajender Kalluri కవిత

నా అసలు కథ :: నా పేరు “ యుగాది “ కాని.... పలకడం చేతకాక పిలుస్తూ ఉంటారు నన్ను “ ఉగాది “ అని సంవత్సరమంతా ఒకే పనిలో మునిగిపోతాను ఒక పని ముగిసాకే ఇంకో కొత్త పని మొదలు పెడతాను ప్రతి ఏట చైత్ర శుద్ధ పాడ్యమినాడు మా ఊరెలతాను పోతూ పోతూ నా ప్రాణస్నేహితుడు “ఎండాకాలాన్ని” కుడా వెంటబెట్టుకుని మరీ వెళతాను అంతే కాదు , ప్రతి సంవత్సరం ఓ ప్రత్యేక అతిధి ని కుడా తీసుకు వెళతాను మా రాక కోసం మా ఉరుంతా ఎదురు చూస్తుంది అడుగు పెట్టగానే ఆప్యాయంగా పలకరిస్తుంది నా రాకను మా ఊరు మొదటి దినంగా పరిగనిస్తుంది మా రాకను చూసి మామిడి పూతలు నవ్వుతు ఉంటాయి ... కాయలు ఏడుస్తూ రాలిపోతూ ఉంటాయి . “ వసంతానికి ” నేనేంటే చెప్పలేని ప్రేమ .... అందుకే , అదెప్పుడూ... నేనోచ్చినప్పుడే మా ఉరోస్తుంది నా స్నేహితుడు “ ఎండాకాలాన్ని “ చూస్తూనే ఊరంతా భయపడిపోతుంది వాడి రోగాల నుంచి జాగ్రత్త పడటానికి ఊరు ఊరంతా “ పచ్చడి “ తయారీలో మునిగిపోతుంది . అందుకే పలు మార్లు చెప్తూ ఉంటా .. వాడి ధాటిని అదుపు చేసే ఆ ఉన్న కొన్ని చెట్ల నైనా కాపాడుకోమని . సంతోషమనే తీపిని పంచె బెల్లాన్ని , దుఖం అనే చేదు వేపతో కలిపి దానికి చింతపండు లాంటి నేర్పుని జోడించి , మామిడి లాంటి సహనాన్ని కలిపి తయారు చేసిన పచ్చడిని సేవిస్తూ ..... సంతోషం , దుఖం , ఓర్పు , సహనం లాంటిదే “ ఉగాది పచ్చడి “ అనీ , ఇది ప్రతి మనిషి జీవితంలో నేర్చుకునే ఓ పాఠం లాంటిది అని వారికి వారే ఉపదేశించుకుంటారు ...... అలా ఆ రోజంతా ...... అన్నల అభిప్రాయాలు వింటూ వదినల చేతి వంటకాలు తింటూ సాయంత్రం గుళ్ళో శాస్త్రి గారు చెప్పే పంచాంగం విని .... లాభమెంతా నష్టమెంతా అనే వ్యాపారపు లెక్కల్లో మునిగిపోయి మనుషుల మధ్య దురాన్ని పెంచుకుంటున్న ఈ అమాయకులను చూసి , బాధ పడాలో జాలి పడాలో అర్ధం కాక , ఇక సెలవని చెప్పి .... మా తమ్ముడు “ మర్నాడు “ రాకముందే మళ్ళి నా సొంత గూటికి వలస పక్షిలా బయలుదేరుతుంటాను కాని ఈ మొండినా కొడుకు “ ఎండాకాలం “ మాత్రం చస్తే రాడు .... వాడి బావమరది “ వర్షాకాలం “ వచ్చి తన్నే దాక ఆ ఊల్లోనే తిష్ట వేసుక్కూర్చుంటాడు . అలా మా ఉరిని , మా వాళ్ళని , సంవత్సరానికి ఓ సారి కలిసి వస్తుంటాను , కష్ట సుఖాలని పలకరిస్తుంటాను . భయం నిన్ను వెంటాడినా , ధైర్యం తో ముందుకి వెళ్లాలని , అందులో దాగి ఉండే సంతోషాన్ని ఆస్వాదిస్తూ , తీపి రోజులను ఆస్వాదించాలనే ఆశతో బ్రతుకుతూ , సరికొత్త ఆశయంతో ముందుకెల్లాలని కలిసిన వారందరికీ సలహా ఇస్తుంటాను అందుకే , వారికి ఈ “ ఉగాది “ అంటే చాల “ ఇష్టం “ మరియు “ గౌరవం “ కుడా ....... ఈ సారి మా ఉరు వెళ్ళేటప్పుడు .... ప్రత్యేక అతిధి గా “ జయ నామ “ సంవత్సారాన్ని వెంటబెట్టుకు వెళ్తున్నా , వాడి మాట వింటేనే ప్రపంచాన్ని గెలిచినంతగా ఆనందపడిపోతారు ....ఇంక వాడిని నేరుగా చూసారంటే చాల సంతోషిస్తారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను , మీ అందరికి “ నా ఉగాది శుభాకాంక్షలు “ kAlluRi

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hSP7WA

Posted by Katta

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి ||పచ్చనోట్ల వసంతం || ఎన్నికల రుతువులో పచ్చనోట్ల వసంతమొచ్చింది చేదు చెట్ల పువ్వుల నిండా రాజకీయ పరిమళాలు తెచ్చింది దొరికిన ఆకుల్ని దొరికినట్టే తిన్న నోరుపెగల్ని గండుకోయిలలు వాగ్దానాల పాటలే పాడుతున్నాయ్ నేడు ప్రజావనమంతా.... మదికొమ్మ చాటున దాగిన ఓటుల్ని ఒడుపుగా కోసుకోవాలన్న ఆత్రుతే అన్నిచోట్లా ఏదో ఒక నిచ్చెన వాడుకొని ఎగబ్రాకేద్దామన్న ఆరాటమే ఎక్కడ చూసినా .. పంచాగ శ్రవణాలకి వేదికలెక్కడ మిగిలాయ్ కవిసమ్మేళనాలకి ప్రేక్షకుల్నెక్కడ ఉండనిచ్చారు ఊరూరా ఊకదంపుడు ఉపన్యాసాలతోనే వీధులు హోరెత్తిపోతుంటే .. షడ్రుచులు కలిపి వడ్డిస్తారనుకుని ఆశపడి ఏరు దాటించడానికి సాయపడ్డావో మళ్ళీ ఐదేళ్ళు ఎదురు చూడాల్సిందే మళ్ళీ ఆ ముఖం నీకు కనబడాలంటే .. )-బాణం-> 31MAR14

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hSP7G8

Posted by Katta

Pratapreddy Kasula కవిత

http://ift.tt/1pwOCYl

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pwOCYl

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/ఒంటి గ్రామం 1ఈ పూట కురిసిన వాన చినుకుల్లో ఏదో కొత్తదనం ధరణి చెక్కిళ్ళను కొత్తగా ముద్దాడిన నింగి పెదవులు 2ఆ మట్టి పరిమళం మనసు గట్టుపై అలానే పేరుకుపోయింది ఎన్నాళ్ళైనా 3ముక్కుపుటాల్లో ఎడారి రాతలు కొన్ని ఇంకకుండా నడుస్తూ తనువుల్లో తలపుల్లో తడియారని సంతకాలు వసంతం వచ్చినప్పుడల్లా 4కన్నీటి జీరలు పదే పదే చిట్లినా ఒణుకుతున్న ఒంటి గ్రామాలు ఎన్నిమార్లు గండిపడినా అంటుకట్టని విగత సత్యాలు 5చినుకులు చిదిమిన నేలంతా కొండగుహల్లా చిద్రమై వాన భాష్పాలను ఎన్నాళ్ళుగానో మోస్తూ 6పాదాల కిందా మట్టిగాలి ఊపిరాడక చెదలుపట్టి వేలికొనలతో కాసిని పిచ్చి రాతలు 7చిరునవ్వులను లిఖిస్తూ బాధలను మింగేస్తూ మళ్ళీ ఒక వాన కురవాలి తిలక్ బొమ్మరాజు 31.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pwOCHK

Posted by Katta

Lyrics Creater Anil కవిత

పల్లవి : చైత్ర మాసమొచిందని చెపుతున్నది కోయీలమ్మ కుహు కుహు పాటలతో ఉగాదికే స్వాగతం (2) చరణం; పచ్హని పైరుల తాకిడీ చల్లని గాలుల సవ్వడి రంగు రంగుల రంగ వల్లుల లలిత సరగాలతో ప్రక్రుతి మాత పులకరించి పలకరించే ఉగాది "చైత్ర " చరణం 2; తీపి పులుపు ఉప్పు వగురు కారం చేదు షడ్రుచుల సంగమం తో సంక్రమించే ఉగాది తరతరాల చర్రిత లొ తరగని ఈ శిరులతో కలసి మెలసి జరుపుకొనే కనుల పండుగ ఈ పండుగ "చైత్ర" మిత్రులందరికి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ పాటల రచ్యైత అనిల్

by Lyrics Creater Anil



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pwOAjd

Posted by Katta

Renuka Ayola కవిత

కొత్త ఊగాది //రేణుక అయోల// నగరం ఇప్పుడు కొత్తగావుంది పాత తలుపులు చెక్కి కోత్తగడియాలు బిగించినట్లు వుంది కోత్తగా కోయిలపాట వింటునట్లు వుంది నడిచిన రహదారులు ఎక్కిన రిక్షాలు చదివిన చదువులు అన్ని కొత్తగా వున్నాయి ఏళ్ళు గడిచిపోయాయి ఎక్కడి వారమో గూళ్ళుకట్టుకుని రెక్కలోచ్చిన పిల్లలు ఎగిరిపోయిన మిగిలిన గూడులో ఒదిగి నగరంలో నిద్రపోతున్నాము కాని ఈ రోజు కోయిల గొంతు కొత్తగా వినిపించింది నగరంలో ఇప్పుడు ఎన్ని పాటలు పాడినా పదాలకి అర్ధాలు కొత్తగా వున్నాయి కలసిబతుకుదామన్న కోరిక కొత్తగా అనిపించింది ఎప్పుడు విపోయామో అర్ధం కాక విడిపోయారు అన్నవాళ్ల వంక కొత్తగా చూడాలనిపిస్తోంది నగరంలో కొత్త ఉగాది పచ్చడికి కొత్తమాడికాయ కొత్త చింతపండు,కొత్త బెల్లం కావాలి కారం కలపాలని లేదు అది కొత్తదైతే మనసు మండుతుందని కొత్తగా ఆలోచిస్తూ తీసిన ఈ కిటికీలోకి వచ్చిన కొత్తవెలుగులో పెరటిలో మాడిచెట్టుమీద కొత్తమామిడికాయ కొమ్మమీదకూసింది కోయిల గోంతెత్తి గట్టిగా అది మాత్రం ప్రతీ ఏడాది పలకరించే అందరి కోయిల

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gSkqFG

Posted by Katta

Satya Srinivas కవిత

నీడ ఆకుపచ్చ రంగులు పాము తలకాయున్న గొంగళి పురుగు ఆకులపై డొల్ల ముఖచిత్రాల్ని గీస్తూ వుంటుంది ఆ ముఖచిత్రాలనుండి ప్రసరించే సూర్య కిరణం తాకిన నేల కాంతి విస్ఫోటనం నుండి మొలకెత్తిన సీతాకోక చిలుక నాకళ్ళలోని ఆకాశానికి రంగులద్దుతూ పయనిస్తుంది (18-3-14)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gSko0v

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//జీవితపు రుచి// మోగకుండానే వినపడిన రింగుటోన్ వీపుమీద చరుస్తూ ఉలిక్కిపాటుకు గురిచేస్తుంది ఆలోచనలు సమాధానాలు పోచేస్తుంటే సమాధానాలు ప్రశ్నలు వేస్తుంటాయి ఎక్కాలకి తెగని లెక్కలు వేలల్లో లక్షల్లో వెక్కిరిస్తాయి మార్చి ముగింపుకి శీర్షాసనం కూడా బదులివ్వలేనంది గుప్పిట విప్పమంటూ ఎకౌంటెంటూ ఆడిటరూ ఆదేశిస్తారు బ్యాంకరు బ్యాలన్స్ షీట్ తెమ్మని శెలవిస్తాడు తలనొప్పుల టర్నోవరులో వసూలు కాని పద్దు సప్లయర్సుకి చెల్లించాల్సిన బాకీలు కరెంట్ అకౌంటు బ్యాలన్స్ బ్లాంక్ చెక్కులా నవ్వుతుంది ఏ మార్చి31కి కైనా ఈ తిప్పలు తప్పేవి కాదు గానీ ఈ సంవత్సరం ముగింపే ఓ సంవత్సరాది రండి విజయ నామ సంవత్సర ఉగాది పచ్చడి తిని జీవితాన్ని మరోసారి రుచి చూద్దాం!....31.03.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rWcbf6

Posted by Katta

Boorla Venkateshwarlu కవిత

*జయం* కాలం కాళ్ళకింద పచ్చడైన మా బంగారి బతుకు ఇప్పుడు ఉగాది పచ్చడికి ఉవ్విళ్ళూరుతుంది నాయకులారా! మీ నోట్లకు దండాలు మీ నోళ్ళకు దండాలు నిన్నటి రాక పుల్లపుల్లగ మాట్లాడినోళ్ళు చల్ల చల్లగ మారుతుండ్రు పచ్చనోట్లు మెడల ఏసి ప్రజాస్వామ్యం పుస్తెలు తెంపుతుండ్రు మీ ఒగరు మాటల కోటలకు దండాలు చేదు నిజాల మరుసుటానికి చేదు మత్తుల ముంచుతుండ్రు మీ తియ్యటి కోయిల పాటలకు దండాలు ఓటు మీట కోసం సార పొట్లాలు కార పొట్లాలు ఇకమతుగ ఇసురుతుండ్రు సార్లూ మీ పైసకు దండం బార్లూ మీ నిషాకు దండం ఉగాది పచ్చడి తోడు ఇగ మేం సోయి దప్పం నియ్యతి గల్లోడే మా నాయకుడు సేవజేసేటోడే ప్రజా సేవకుడు ఇగ మేం మాట దప్పం అరువై ఏండ్లు కొట్లాడి ఆత్మగౌరవం నిలుపుకున్నం ఆగమైన తెలంగాణ పునర్నిర్మించుకుంటం పోయిన విజయం మాదే వచ్చే జయం మాదే ౩౦.౦౩.౨౦౧౪

by Boorla Venkateshwarlu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rWcdnc

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ --- ।। నా తెలుగు।। --- పెదవులు పలికే షోకుల పలుకుల్లో నలిగిపోతోంది నా తెలుగు భాష. చేతులు రాసే భవిష్యత్తు రాతల్లో బలైపోతోంది నా తియ్యని తెలుగు . ఇది జీవనోపాదికి పునాది మార్గమో .. ! తీయని భాషను మరిచిపోయే తరుణమో .. ! నిద్ర లేచింది మొదలు పరభాషతో నిత్యం యుద్ధమే నా తెలుగుకు . కొలువుల అవసరాల్లో ,పలువురి నిర్లక్ష్యాల్లో కొలిమిలో కాలే ఇనుపముక్కలా. తీయని నిద్రలోనూ ,తెలియని కలవరింతల్లోనూ కానరాదు నా ప్రియతమ తెలుగు . చేదు భాధాలోను ,లోతు గాధలొనూ అవసరమే లేదు అనవసరం అయిపోయిన మన తెలుగు . మా తెలుగుతల్లి మల్లెపూదండ వాడిపోతోంది మా తెలుగు పలుకులు మననుండి వేరు పడిపోతున్నాయి . ఎవరు బ్రతికిస్తారు ?ఎవరు కీర్తిస్తారు ? నా తేటతెలుగు పూల సౌరభాలను ! (తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలతో ... ) (31-03-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rWcd6S

Posted by Katta

Sahir Bharathi కవిత

! ఆధునిక సంగమంలో ఏకాంతత ! .................................................................. పొడుగవుతున్నతరంలో అస్తిత్వం కోల్పోయిన ఆత్మ తాను తన లోకం మరిచి తన జీవనంతో ఉండే తాడును భంగపరిచి ఏ కార్యాన్ని మోసుటకు వాని భుజాల సత్తువని ఎగిరేస్తున్నాడో మరి..! ఏ వంతెనపై నడుచుటకు వాడి దేహనిజస్వరూపానికి సెలవు పలుకుతున్నాడో మరి ..! ఓ ఈ పొద్దు మానవా! నన్ను ఈ సంఘంనుండి బహిష్కరించవా............. ఈ బతుకుకి భేదమైన త్రోవని ఆవిష్కరించే సత్తువను తెలియజేయవా................. sahir bharati. *31.3.2014 : ugaadi : 3.40 am.

by Sahir Bharathi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hScAXP

Posted by Katta

Humorist N Humanist Varchaswi కవిత

వర్చస్వి//జయహో// - - - - - - - - జయహో జయనామ స్మరణం జయహో ఉగాది ఉషోదయం జయహో నూత్నవత్సర ప్రత్యూషం జయహో జన జాగృత వాసంత సమీరం జయహో మధుర చైతన్య గాత్రం జయహో నైర్మల్య నవ నవోన్మేమేషణం జయహో శుకపిక ఆశీ:కలకూజితం జయహో షడ్రసోపేత రసో ఔపాసనం జయ జయహో సుకవి సంగమం! //1.03.2014//

by Humorist N Humanist Varchaswi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hScyPQ

Posted by Katta

Swarnalata Naidu కవిత

శ్రీస్వర్ణ || ఉగాది || అవనిని పలకరించే అరుణారుణిమ గీతికలు పచ్చికబయళ్ళపై మంచు తుంపరల తుషారాలు మత్తిల్లిన కోయిల హిందోళగానాలకి ...దంతక్షతాలకి... మావిచివుళ్ళు సిందూర వర్ణాలనే పులుముకున్నాయి ! తుమ్మెదల ఝంకార నాదాలకి సిగ్గుతో తలవాల్చిన కుసుమపరాగాలు వాసంత సమీరాలకి తేనెసోనలు కార్చే సుమబాలలు మలయమారుతాలు వనకన్య చెక్కిళ్ళపై వ్రాసే మకరికాపత్రాలు తటాకంలో మెరిసే బంగారు వర్ణపు నీరు..సూర్యకిరణాల ప్రతిబింబాలే ! లతల లావణ్యంతొ వనమంతా వింతసౌరభాలు, కమ్మతెమ్మెరల రసభావనలకి .. మయూరాల వింజామరలు కోనేటిలో రాయంచల వలపు విహారాలు..జలపుష్పాల నాట్య విలాసాలు కొమ్మ కొమ్మనూ పలకరించే వసంతుని శ్వాసతో ఆమనికే వింత సొబగులు సెలయేటిలో దాగిన తుంబురుని వీణానాదాలు ! శుకపికాల సంగీతవిభావరి..వేపపూతల సుగంధాలతో..మామిడిపూతలతో మధురఫలాలతో ..మకరందాల జల్లులు కురిపిస్తూ..వనకన్య ధవలవర్ణ కాంతుల్లో హిమవత్పర్వతాలు ..రసమయ జగత్తులో ఒంపుసొంపుల మందాకినీ సోయగాలు ! వయ్యారుల సిగలో మల్లెజాజుల విరహతాపాలు నవనవలాడే నవమల్లికలు కొత్తజంటకు శృంగార ఉద్దీపనలే మదుప సేవనంలో అలిసిన తుమ్మెదలు రెమ్మరెమ్మకు ఆరాటమే మన్మధబాణాల స్పర్శతో పులకించి పోవాలని ! వీధివీధిన పంచాంగ శ్రవణాలు పుట్టింటికి కళ తెచ్చే కొత్త అల్లుళ్ళ ఆగమనం షడ్రుచుల సమ్మేళనం..ఉగాది పచ్చడితో శ్రీకారం..నవ్యజీవనానికి జయనామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ.. పచ్చదనాల హారతినిస్తూ ...వసంతకన్య

by Swarnalata Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dIIs5t

Posted by Katta

Sriramoju Haragopal కవిత

ఒక’ సారీ‘ నిన్న రాత్రి సినీవాలి వెన్నెలలు రాలిపోయిన జాబిలి చెట్టు నింగిలో చుక్కలు నిదురవనంలో కలలసుమాలు ఎత్తుకపోయినట్లు గాలిపెదవులు తడారిపోయి కీచురాళ్లతో మాట్లాడించినట్లు నేలజారిన పూలపుప్పొడుల మీద కరుకుపాదాల మరకలు వెనకకు మర్లిపోయిన కొండవాగు ఆత్మీయశైతల్యం మనసుబండలైపోయిన గుండెకొండ శైథిల్యం ప్రశ్నలే పట్టువిడని విక్రమార్కులై జవాబుల బేతాళులే అంతులేని అహాల చెట్లెక్కి పోతే జీవితకావ్యంలో చింపేసిన మాటలకథలు అతుకుపడని ఆంతర్యాల అంతర్యానం ఎవరు ముందు ఎవరు వెనుక సందేహాలే శాసించే స్నేహాల మోహంమీద నిస్సందేహంగా కన్నీటిలిపి వుండే వుంటుంది నీవైతేనేం, నీదైతేనేం ఏకాంతమేగా నేనైతేనేం వొదలని మౌనం

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1haiu5D

Posted by Katta

Sasi Bala కవిత

అందరికీ ''జయ''నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు................శశిబాల ------------------------------------------------- చైత్ర మాస శోభ... చిత్రాల శోభ శిశిరానికి వీడ్కోలు పల్కి వసంతాన్ని స్వాగతించి కోయిలమ్మల కుహు కుహూ .. మేజువాణీలతో ... మమతల మల్లెల సుగంధ హారతులతో .... కల కల విరిసే సెలయేటి కలువల చికిలింత నవ్వులతో కళకళల సిరుల సందడులతో వచ్చింది జయనామ ఉగాది లక్ష్మి ఇంటింట ప్రతియింట సౌభాగ్య గరిమి

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1haitPj

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pw2Ng4

Posted by Katta

Nvn Chary కవిత

ఎన్.వి.ఎన్.చారి సహృదయ సంస్కృతిక కార్య దర్శి జయనామ చైత్ర శుద్ధ పాడ్యమి - ఉగాది శుభా కాంక్షలు నవ వర్షమ రారమ్మిక నవ యవనిక నెత్తుచుంటి నవరస స్పూర్తిన్ భవదాకృతిశ్రీ కృతిగా కవనమ్మున కోరుచుంటి! కావుము జగతిన్ "జయ"హో వత్సర రాజమా విమల వాత్సల్యంబు వర్షించుచున్ నియతిన్ తప్పక రమ్మిటన్ కుటిల దుర్నీతిన్నివారింపగన్ దయతో సజ్జన పక్షపాతి వగుచు సద్బావంబు శోబిల్లగన్ జయవై సహృద యాకృతిన్మనుమాసాంతమ్ము శాంతమ్ముతో లేజిగురాకులందు పవళించితివేమొ విలాస మూర్తివై రాజిలు చుంటివేమొ సుమ రాజిని పుత్తడి రేణు వద్దుచున్ రాజిలుకమ్మ కమ్మని స్వరార్చన యందున స్రొక్కుచుంటివో ఈ జన వాహినిన్ నిలుమ! ఈప్సిత కాంక్షలు దీర్ప శ్రీ జయా ఏదియు కాదు శాశ్వతము మేదినియంతయు భ్రాంతి మంతమే నాదని విర్ర వీగునెడ నాశ విభుండును నవ్వకుండునే వేదన హెచ్చు నీ మదిని వ్రేల్చెడి నేనను భావముండినన్ శ్రేయ వసంతమై తనరు జీవత మంతయు అహంము వీడినన్

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pw2K45

Posted by Katta

Kks Kiran కవిత

ఈమధ్య శ్రీ కృష్ణదేవరాయలు రాసిన "ఆముక్తమాల్యద " చదివాను,,అందులో రాయల వారు అన్ని ఋతువులను అద్భుతంగా వర్ణిస్తాడు, అందులో వసంత ఋతువు వర్ణన చూడండి. విరహ తాపం ఎక్కువైందని ,దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి చేరటం తో వసంతం ఆరంభమయింది .ఆమె విరహ నిట్టుర్పుల వేడికి ఆగ లేక సూర్యుడు చల్లగా ఉంటుందని హిమాలయం వద్ద ఉత్తరానికి మొగ్గాడట .విరహం అనే బాట సారికి దాహమైతే అగ్ని వెంట తడి కూడా వచ్చినట్లు మన్మధుడు దండెత్తి వస్తున్నాడని సూచించే అతని జెండా పై గల మీనం (చేప )తో పాటు మేషం (రాశి )కూడా వచ్చింది .హేమంత చలి యువతుల్ని కావలించింది .వసంతుడు అనే ప్రియుడు ముందుకు వచ్చి వెచ్చదనం కల్పిస్తాడనే భావంతో హేమంతం చివరి ముద్దు పెట్టుకొని వెళ్లిందట .చలాకీ చంద్రుడు సూర్య కిరనాలంత వేడి పుట్టించి విరహుల్ని వేధిస్తున్నాడు .వసంత రుతువు అనే మంత్రిని ,కొత్త గా పుట్టిన వసంతుని బొడ్డు కోసిన కొడవలి లాగా కోయిల కూత యువతీ యువకుల్ని విరహం తో కోస్తున్నాయి .శివునికీ పార్వతీ దేవికీ ప్రణయం కల్పించ టానికి మన్మధుడు వేసిన పూల బాణాల మొనలు విరిగి ,చివుళ్ళు గా వేలుస్తున్నాయత. భూదేవి కడుపు లోంచి పుట్టిన వ్రుక్షాలనే పిల్లలకు పాల పళ్ళు ,దంతాలు మొలిచి నట్లు లేత చిగుళ్ళు పువ్వులు , పిందెలు పుడుతున్నాయి .వన లక్ష్మి రాబోయే మాధవుని అలంకరించ టానికి సింగారించు కొందిట .”. దేవత్వం సిద్ధిన్చినా ,మధు పానం అనే దురభ్యాసాన్ని వదలని తుమ్మెదలను వెక్కిరిస్తూ , తనకుపంచత్వం రారాదని ,పంచమ స్వరం తో కోయిల కూస్తోంది .మాధవుడు మామిళ్ళకు , పూలను సృష్టించి ,పిందెలు గా మార్చి ,మన్మధునికి ఆయుధాలు ,సరఫరా చేస్తున్నాడట .దేవుడే శత్రువుకు మేలు చేస్తుంటే విరహ గ్రస్తులకు దిక్కు లేకుండా పోయిందట .మధు మాసం అనే ఆవు పొదుగు నుండి పాలు కారు తున్నట్లు చంద్రుని వెన్నెలల తో భూలోకం తడిసి ,కమ్మని వాసనలనిస్తోంది .తుమ్మెద బారులు మన్మధ బాణానికి నారిగా మారు తోమ్దట .యువతుల చంద్ర బింబాల వంటి మొహాల కన్నా ,చను దోయి కంటే మాకే ఎక్కువ యవ్వనం వుందని పద్మాలు విరగ బూసి నవ్వు తున్నాయట .భ్రుగు మహర్షి తన్నినా నవ్వేసిన విష్ణు మూర్తి వెంకటేశ్వరుడై ,పద్మాతిని పెళ్ళాడాడు .ఆమె సత్య భామ గా మారింది .స్త్రీలందరికీ ఆ అంశ అంటించింది .ఏ స్త్రీ తన్నినా అశోకవృక్షం బంగారు పూలతో పూసినట్లు నవ్వు తోందట .మాధవుడు రాసాతలాన్ని , మకరంద వర్షం తో ,భూమిని పూలతో ,ఆకాశాన్ని పుప్పొడి తో జయించి ,త్రిలోక విక్రముడైనాదట .చిలకకు జామి పళ్ళు మేత గా ఇచ్చిన వసంతుడు ,ప్రేయసీ ప్రియులకు పూలు పంచి , తుమ్మెదలకు తేనె లిచ్చి ,వసంత లక్ష్మికి వెచ్చని కొగిలి ఇచ్చి ,పక్ష పాతం లేదని పించాడట.....!!!!! - Kks Kiran

by Kks Kiran



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pw2Kkv

Posted by Katta

Kks Kiran కవిత

ఈమధ్య శ్రీ కృష్ణదేవరాయలు రాసిన "ఆముక్తమాల్యద " చదివాను,,అందులో రాయల వారు అన్ని ఋతువులను అద్భుతంగా వర్ణిస్తాడు, అందులో వసంత ఋతువు వర్ణన చూడండి. విరహ తాపం ఎక్కువైందని ,దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి చేరటం తో వసంతం ఆరంభమయింది .ఆమె విరహ నిట్టుర్పుల వేడికి ఆగ లేక సూర్యుడు చల్లగా ఉంటుందని హిమాలయం వద్ద ఉత్తరానికి మొగ్గాడట .విరహం అనే బాట సారికి దాహమైతే అగ్ని వెంట తడి కూడా వచ్చినట్లు మన్మధుడు దండెత్తి వస్తున్నాడని సూచించే అతని జెండా పై గల మీనం (చేప )తో పాటు మేషం (రాశి )కూడా వచ్చింది .హేమంత చలి యువతుల్ని కావలించింది .వసంతుడు అనే ప్రియుడు ముందుకు వచ్చి వెచ్చదనం కల్పిస్తాడనే భావంతో హేమంతం చివరి ముద్దు పెట్టుకొని వెళ్లిందట .చలాకీ చంద్రుడు సూర్య కిరనాలంత వేడి పుట్టించి విరహుల్ని వేధిస్తున్నాడు .వసంత రుతువు అనే మంత్రిని ,కొత్త గా పుట్టిన వసంతుని బొడ్డు కోసిన కొడవలి లాగా కోయిల కూత యువతీ యువకుల్ని విరహం తో కోస్తున్నాయి .శివునికీ పార్వతీ దేవికీ ప్రణయం కల్పించ టానికి మన్మధుడు వేసిన పూల బాణాల మొనలు విరిగి ,చివుళ్ళు గా వేలుస్తున్నాయత. భూదేవి కడుపు లోంచి పుట్టిన వ్రుక్షాలనే పిల్లలకు పాల పళ్ళు ,దంతాలు మొలిచి నట్లు లేత చిగుళ్ళు పువ్వులు , పిందెలు పుడుతున్నాయి .వన లక్ష్మి రాబోయే మాధవుని అలంకరించ టానికి సింగారించు కొందిట .”. దేవత్వం సిద్ధిన్చినా ,మధు పానం అనే దురభ్యాసాన్ని వదలని తుమ్మెదలను వెక్కిరిస్తూ , తనకుపంచత్వం రారాదని ,పంచమ స్వరం తో కోయిల కూస్తోంది .మాధవుడు మామిళ్ళకు , పూలను సృష్టించి ,పిందెలు గా మార్చి ,మన్మధునికి ఆయుధాలు ,సరఫరా చేస్తున్నాడట .దేవుడే శత్రువుకు మేలు చేస్తుంటే విరహ గ్రస్తులకు దిక్కు లేకుండా పోయిందట .మధు మాసం అనే ఆవు పొదుగు నుండి పాలు కారు తున్నట్లు చంద్రుని వెన్నెలల తో భూలోకం తడిసి ,కమ్మని వాసనలనిస్తోంది .తుమ్మెద బారులు మన్మధ బాణానికి నారిగా మారు తోమ్దట .యువతుల చంద్ర బింబాల వంటి మొహాల కన్నా ,చను దోయి కంటే మాకే ఎక్కువ యవ్వనం వుందని పద్మాలు విరగ బూసి నవ్వు తున్నాయట .భ్రుగు మహర్షి తన్నినా నవ్వేసిన విష్ణు మూర్తి వెంకటేశ్వరుడై ,పద్మాతిని పెళ్ళాడాడు .ఆమె సత్య భామ గా మారింది .స్త్రీలందరికీ ఆ అంశ అంటించింది .ఏ స్త్రీ తన్నినా అశోకవృక్షం బంగారు పూలతో పూసినట్లు నవ్వు తోందట .మాధవుడు రాసాతలాన్ని , మకరంద వర్షం తో ,భూమిని పూలతో ,ఆకాశాన్ని పుప్పొడి తో జయించి ,త్రిలోక విక్రముడైనాదట .చిలకకు జామి పళ్ళు మేత గా ఇచ్చిన వసంతుడు ,ప్రేయసీ ప్రియులకు పూలు పంచి , తుమ్మెదలకు తేనె లిచ్చి ,వసంత లక్ష్మికి వెచ్చని కొగిలి ఇచ్చి ,పక్ష పాతం లేదని పించాడట.....!!!!! - Kks Kiran

by Kks Kiran



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pw2Jx1

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ |||చిటారు కొమ్మల్లో మిటాయిపొట్లం||| =================================== అసమానతల నడుమ నిత్యం నయవంచనకు లోనవుతూ పంటి గాటుల మధ్య బాధను అదిమిపట్టి నవ్వుతూ... కృత్రిమం గా బతికేస్తున్నా అవశేషాలు శాపాలై వెంటాడే నీడల్లా తరుముకొస్తుంటే- నీడలోనే ఎన్నో చిత్ర విచిత్రాలు కాలంలో మెరుగులు అద్దుకుంటున్నాయి సూర్యోదయం కూడా ఎర్రగానే ఉంది అస్తమయం కూడా నిప్పులు చెరిగేస్తుంది హఠాత్తుగా జారిపోయే భానుడు కదా నా ఆలోచనల్లా !భావోద్వేగం ఎక్కువే ! తెల్లారని జీవితాల మధ్య ఎన్నో ఎన్నెన్నో నూతన సంవత్సరాలు కరిగిపోతున్నాయి జీవన పోరాటం ఎక్కడి వేసిన గొంగలి అక్కడేలా కొట్టు మిట్టాడుతుంది జ్ఞాపకాలు వారసత్వ పునరావృతాలై పాత చిగురునే తెచ్చుకుంటున్నాయి చెడు జ్ఞాపకాల మధ్య వేప కాడలై అను నిత్యం వెక్కిరిస్తున్నాయి రుచులెరుగని జీవితం షడ్రుచుల కష్టాలు మాత్రం చూపెడుతుంది తరాలు మారిన మారని నవ వసంతం చిటారు కొమ్మల్లో మిటాయిపొట్లం లా కనపడుతుంది నేనింకా చెట్టు కిందే ఉండిపోయా పైకి అమాయకం గా చూస్తూ ఆకాశంలో దాగిన ఆశలన్ని తుర్రు పిట్టల్లా ఎగిరిపోతున్నాయి గోటి పై చుక్క కోసం నేను నిస్తేజం గా చూస్తుండిపోయాను ================== మార్చి ఆఖరు /2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pw2HoN

Posted by Katta

Valluru Murali కవిత

మిత్రులందరికీ శ్రీజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...మురళి

by Valluru Murali



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNAZoy

Posted by Katta

Kapila Ramkumar కవిత

ఆమె పేరు… వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి by NS Murty బ్లాజ్ఞ్మిత్రులకీ, సందర్శకులకీ జయ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకూ మీ కుటుంబానికీ, మీ మిత్రులూ శ్రేయోభిలాషులకీ ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలు కలుగజేయాలని కోరుకుంటున్నాను *** మెత్తని సముద్రపుటిసకమీద నీ పేరు నేను రాసున్నప్పుడు నవ్విన నీ నవ్వు నాకింకా గుర్తే! "ఏమిటది, చంటిపిల్లడిలా! నువ్వు ఏదో రాతి మీద రాస్తున్నాననుకుంటున్నావు!" ఆ క్షణం తర్వాత ఇయాంథే పేరు రాసేను ఏ కెరటమూ ఎన్నడూ చెరపలేనట్టుగా; భావి తరాలు విశాల సాగరంపై చదవగలిగేలా. . వాల్టర్ సేవేజ్ లాండర్ 30 జనవరి 1775 - 17 సెప్టెంబరు 1864 ఇంగ్లీషు కవి . Her Name . Well I remember how you smiled To see me write your name upon The soft sea-sand … ‘O, what a child! You think you’re writing upon stone!’ I have since written what no tide Shall ever wash away; what men Unborn shall read o’er ocean wide And find Ianthe’s name again. . Walter Savage Landor (30 January 1775 – 17 September 1864) English Poet Poem Courtesy: The Oxford Book of Victorian Verse. 1922. Compiled by: Arthur Quiller-Couch (http://ift.tt/1hRvbDB) NS Murty | March 31, 2014 at 12:30 am | Tags: 19th Century, English Poet, Walter Savage Landor | Categories: అనువాదాలు, కవితలు | URL: http://wp.me/p12YrL-3o2

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hRvbDB

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

ఏది ఏమైనా వో...కోయిలా..! కోయిలా..! నీ నోట ఆమని రాగం ఆలపించకముందే ఎన్నికల కోడి కూసింది షడ్రుచుల ఉగాది పచ్చడి అంగిట్లో రంగవల్లులు వేయక మునుపే షడ్రాజకీయ పార్టీలు నవరసాల పొత్తు చట్నీని ఆబగా జుర్రుకుంటున్నాయి పండితుల పంచాంగ శ్రవణం విందు చేయక మునుపే పంచమ శృతిలో పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. కోయిలా..! నువ్వు లేత చివుళ్ళ రుచినాస్వాదించక మునుపే ఓటరన్న పచ్చని జీవితపు చిగురాశల్ని మేస్తూ కొత్త బెల్లం పానకం చవి చూడక మునుపే బెల్లపుసారాయి ,బీరు, చేరువాల ఘుమాయింపుతో మెదడుకు మత్తెక్కి తొక్కిసలాడుతున్నాడు. కోయిలా..! నీ కూత ఒక వసంత ఋతువు!! ఎన్నికల మోత! పంచ వసంతాల పరిపాలనా క్రతువు!! పచ్చని చెట్లతో రంగు రంగుల పూలతో ప్రకృతి తనువంతా పులకింత.! పచ్చ నోట్లతో రంగు రంగుల జెండాలతో ఓటర్లకు కూసింత కలవరింత.!! ఏది ఏమైనా వో ...కోయిలా...! నువ్వు "జయ"నామ వత్సరాన్ని నీ గొంతుతో స్వాగతించు మేము నవతెలంగాణా విజయోత్సవ గీతమై దిగ్దిగంతాలలో ...ధ్వనిస్తాం....ప్రతిధ్వనిస్తాం.

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mmcPyr

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్||ఆశాకిరణం కోసం!|| కుప్పిగంతుల సర్కస్ రాజకీయ కారడవిలో గూళ్ళు మార్చిన పిట్టలు ఆ గూటి గులాంగిరి చేస్తుంటాయి! అపస్వరాలలవాటుగదా! అవేపాత రోత వదలలేక తిట్లపురాణాల్లో నిష్ణాతులు కనుక నోటి దురుసు, దురద వదలలేక పాత రోకటిపాటే పాడుతూ నిన్న తిట్టిన వారి పంచ నేడు చేరి నేడు పొగిడే నరంలేని గాయక నాయకులవుతుంటారు! పద బంధాలకు నిఘంటువులతో పనిలేదు వెతికినా దొరకని భాషాశాస్త్రజ్ఞులు! కొత్త స్వరంలో స్వంత రాగాలాలపిస్తూ మీడియా ప్రలోభాలొదుకోలేక బఫూన్‌ పాత్రధారులతో పోటీ పడుతుంటారు! ప్రణాళికలు లేవు, విధివిధానాలు లేవు! సిద్ధాంతాలు బలాదూరు చేసి బజారుకీడ్చి, సింహాసనావరోహణే ధ్యేయం! దుమ్మెత్తి పోయడానికే ప్రాధాన్యతిస్తారు! పాత సినిమాలో పాటలా " చవటయను నేను! నీ కంటే ఒట్టీ చవటాయను నేను " అని చెవులకు చిల్లులు పెడుతుంటారు! రంగులుమార్చే ఊసరివెల్లులమించి ఎంత గుంజుకోవచ్చు! ఎంత మిగుల్చుకోవచ్చు ననే రంధి తప్ప ఊరివారి బాగోగుల వూసుండకుండా జాగ్రతపడతారు! ఓట్లను రాబట్టుకోటంలో వెర్రివేషాలెన్నైనా వేస్తుంటారు ఇచ్చిన మాట నిలబెట్టరు కాని, చిచ్చులు పెట్టటంలో సిద్ధహస్తవాసులు! కడుపులోంచి మాటలు రావు, వచ్చినా అవి నోటి చివరివే అదీ నోటు చివరివే! చెల్లని నోట్లను యిచ్చి నల్లధనాన్ని తెల్లబరచుకునే యెత్తులువేసి చల్లగా జారుకుందామనుకూంటారు! వట్టి కారు కూతగాళ్ళ ఎత్తులు చిత్తు చేసి చేవకలిగిన నేతల్ని ఎన్నుకోవాలని సామాన్యులు ఈ ఎన్నికల కూడలిలో తోడుకోసం ఎదురుచూస్తున్నారు! వారిని పట్టించుకునే వారికోసం, యిన్నాళ్ళు పడ్డ దగా కుహురంనుండి విముక్తి కలిగే నిత్య జీవన సమరంలో పాలుపంచుకునేవారికోసం,లంచగొండులను, రాజకీయ విటులను '' నోటా ''తో నైనా పోటు పొడవాలని కాదు కాదు ధీటైన నేతను ఎన్నుకోవాలని ఎదురుచూస్తున్నారు! సహస్ర వృత్తుల బడుగుజీవుల సమరశీల పోరు పటిమ జయకేతనమేగిరేలా సమ సమాజ శక్తులపునరేకీకరణ కోసం సర్వ సత్తాక సామాజిక పాలకులకోసం రేపటి ప్రజాస్వామ్య నూతన అరుణకాంతికోసం ఎదురుచూస్తున్నారు! 31.3.2014 ఉదయం 5.30

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNbh3e

Posted by Katta

Soma Sunder Rao Nimmaraju కవిత

మిత్రులందరికి యుగాది శుభాకాంక్షలు

by Soma Sunder Rao Nimmaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNbi7w

Posted by Katta

Kodanda Rao కవిత

KK//గతం-స్వాగతం// ************** గడిచినదంతా గతం, అది ఎన్నో మంచి,చెడుల సమ్మేళనం, గడిచినదంతా గతం, అది చేసిందిలే ఎంతో కొంత శుభం, గడిచినదంతా గతం, ఆ గతంవైపు చూస్తూ కూర్చుండిపోతే మనం అక్కడే ఆగిపోతాం, గడిచినదంతా గతం, ఆ క్రితం కన్నా, గతం కన్నా బాగుంటుందిలే ఈ నవ సంవత్సరం, మనందరి తరఫునా ఇది నా అశాభావం... అందుకే మిత్రులారా... నే చెబుతున్నా మనసారా నవ యుగాదికి స్వాగతం, ఈ జయనామ సంవత్సరం కలిగించుగాక, సర్వ జనులకెల్ల జయం... విజయం... ==================================== Date: 30.03.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iPfxMg

Posted by Katta

Rvss Srinivas కవిత

||జయ ఉగాది || మావిచివుళ్ళను ఆరగించిన గండుకోయిల మత్తెక్కి మధురగీతాలు ఆలపిస్తుంటే వగరు మామిడిపిందెలను కొరుకుతూ తీపి పలుకులు వల్లిస్తూ చిలుకలు సందడి చేస్తుంటే ప్రతితరువు చిత్రసుమాల సొబగులద్దుకుంటూ వసంతునితో కళ్యాణానికి ముస్తాబులౌతుంటే ప్రకృతి కాంత పచ్చని పట్టుచీర చుట్టుకొని ప్రతి మార్గంలో సుమాలు వెదజల్లుతుంటే కొమ్మల కొప్పులెక్కిన సిరిమల్లెలు పలుదిశల పరిమళనృత్యం చేస్తుంటే తుంటరి తుమ్మెదలు ఝుంకారాలు చేస్తూ విరికన్నెల ప్రసాదాలకై ప్రదక్షిణలు చేస్తుంటే చెరకు విల్లుతో మదనుడు సుమశరసంధానం చేస్తూ తేనెటీగల అల్లెతాడును ఏకబిగిన మ్రోగిస్తుంటే శ్రీగంధం పూసుకొని సుమలతలు చుట్టుకొని చైత్రరథం చక్రాలధ్వనితో పుడమిని పులకింపజేస్తూ తరువులన్నిటినీ పలకరిస్తూ…సుమగంధాలను ఆఘ్రాణిస్తూ శిశిరాన్ని తరిమి కొడుతూ…విజయదుందుభి మ్రోగిస్తూ జయకేతనం ఎగురవేస్తూ…విచ్చేసాడు ఋతురాజు అపజయమెరుగని ‘జయ’నామధేయుడు. - శ్రీ. 31/03/14

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iPfxvK

Posted by Katta

Patwardhan Mv కవిత

కాల్ కత!! మనం కాలాన్ని గోడకు వేలాడదీసి సంబరపడుతుంటామా అదేమో నిశ్శబ్దంగా మన కాళ్ళ కింది ఇసుకను తవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. . ********************************************************* తేదీల పేర్లూ రోజుల పేర్లూ వారాల పేర్లూ వత్సరాల పేర్లూ మారుతున్నాయి కానీ ఓ పిచ్చి తమ్ముడూ! మన బత్కు లేమైనా మారుతున్నాయా? కాలందీ,రాజ్యందీ ఒకే స్వభావం. 31-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hQ67N4

Posted by Katta

30, మార్చి 2014, ఆదివారం

Satya NeelaHamsa కవిత

-- అయినా ఆ కళే వేరు.. ^^^^^^^^^^^^^^^^^^^^^^^ -సత్య విధి వధిలేసిన బతుకుల మధ్య గొంతులొ ఎండిన మెతుకుల మధ్య పల్లపు దారుల గతుకుల మధ్య కడుపు కాలితే పుట్టేది కళ, అయినా ఆ ఆకలితీర్చే కళే వేరు... రెప రెప లాడే నెత్తుటి జెండా భుజాన మోసే పథాన సాగి ఎదురు నిలిచిన నిబ్బర గుండెల విప్లవాల తో పుట్టేది కళ, అయినా ఆ ఉద్యమాల కళే వేరు... విజయవికాస కష్ట స్వేధమై సత్యబీజపు నిత్యసేధ్యమై కృషి కార్యాల ఇష్ట సాధనై ప్రతిఘటన నుండి పుట్టేది కళ, అయినా ఆ ప్రగతినిచ్చే కళే వేరు... పెద్దలు పేర్చిన ఫలాల పంట తోడుక నీడగ కదిలే వెంట ధార్మిక జ్ఞాన కర్మలనుండి సంప్రదాయం నుండి పుట్టేది కళ, అయినా ఆ సంస్కరించే కళే వేరు... -సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mkPlK9

Posted by Katta

Sriramoju Haragopal కవిత

ఒక’ సారీ‘ నిన్న రాత్రి సినీవాలి వెన్నెలలు రాలిపోయిన జాబిలి చెట్టు నింగిలో చుక్కలు నిదురవనంలో కలలసుమాలు ఎత్తుకపోయినట్లు గాలిపెదవులు తడారిపోయి కీచురాళ్లతో మాట్లాడించినట్లు నేలజారిన పూలపుప్పొడుల మీద కరుకుపాదాల మరకలు వెనకకు మర్లిపోయిన కొండవాగు ఆత్మీయశైతల్యం మనసుబండలైపోయిన గుండెకొండ శైథిల్యం ప్రశ్నలే పట్టువిడని విక్రమార్కులై జవాబుల బేతాళులే అంతులేని అహాల చెట్లెక్కి పోతే జీవితకావ్యంలో చింపేసిన మాటలకథలు అతుకుపడని ఆంతర్యాల అంతర్యానం ఎవరు ముందు ఎవరు వెనుక సందేహాలే శాసించే స్నేహాల మోహంమీద నిస్సందేహంగా కన్నీటిలిపి వుండే వుంటుంది నీవైతేనేం, నీదైతేనేం ఏకాంతమేగా నేనైతేనేం వొదలని మౌనం

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gQuCyx

Posted by Katta

Jaligama Narasimha Rao కవిత



by Jaligama Narasimha Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mkPjSE

Posted by Katta

Rama Krishna Perugu కవిత



by Rama Krishna Perugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gQuCia

Posted by Katta

Radha Ramanaguptha Jandhyam కవిత

JAYA NAMA Ugadi subhakanshalu...

by Radha Ramanaguptha Jandhyam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gQuCi0

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

మృదువుగా , మధురం గా కవిత ని కవిత లా రాయాలన్న విశ్వప్రయత్నం లో ఇంకో సారి ఓడిపోతూ ............... నిశీధి | దురాశ | జీవితం ఒక్కసారి హత్తుకో నన్ను మనస్పూర్తిగా , మరో ఆశగా తడికళ్ళతో తమకంగా తత్వాలకి తపనలకి దూరంగా నాలో నన్ను వెతుక్కునే ప్రయత్నం ఫలించేలా తెలియక వేసిన తడబాటు అడుగులు మధుర జ్ఞాపకాలై తెలిసిన మెలుకువ ఒప్పులు ముందుటడుగుల్లా మిగిలిపోయేలా కళ్ళ పుసుల్లా కరిగిపోయే ఊసులుగా కాకుండా కంటి రెప్పలా మిగిలే ఇంకో ఉదయాన్నివ్వు నిద్ర లో ఉలిక్కిపడే పసితనం ని జో కొట్టే అప్యాయతవవ్వు పువ్వులో నవ్వు చూడగలిగే నవ్వుల వెనక దాగున్న బాధ అర్ధం అయ్యేలా మృదుత్వాన్ని ఒక సారైనా ఇవ్వు తీరని కోరిక అంటావా ? హుమ్మ్ నా నిన్నుగా నీతో కలిసి నీతో పాటు ఓడిపోతూ నాలో నిన్ను గెలిపిస్తూ నీ భయాలు వేదనలు నాలో దాచుకుంటూ ప్రయాణిస్తూన్నానుగా ఆ మాత్రం చేయలేవా? నా కోసం ? ఒక్కసారి మెత్తగా హత్తుకోలేవా ? బాధలన్ని బరువు తగ్గిన మేఘాల్ల్లా కరిగి కన్నీటిలో జారి పరుగులెత్తేలా కౌగిలించుకోలేవా ? నిశీ !! 30 / 03 / 14

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mkPkWB

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-35 బొంది లో కరెంట్ ఉన్నట్టుండి కట్ అయినపుడు అంతసేపు నవనవలాడే దేహం బిర్ర బిగుసుకొని కట్టెలా మారిపోతుంది... సంపాదించుకున్న అనుభవాలన్నీ అంతటితో తెగిపోవలసిందేనా...? పునర్జన్మ ఉంటేగనక అక్కడికి బదిలీ అవుతాయా ...? ఏ ఉపన్యాసమూ..ఏ ఉపదేశమూ ఈ దాహాన్ని పూర్తిగా తీర్చదెందుకని..? శూన్యంలో ప్రవహించే వాయువు వంటి మన్సు ఏదో చెబుదామని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది... అంతర్జాలంలో ఒక కిటికీ నుంచి ఇంకో కిటికీ కి ఎలా పోతుంటామో అంతర్ ప్రపంచంలో కూడా అదే తంతు..! ------------------------------------------------- 30-3-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jLRcdM

Posted by Katta

Rajkumar Bunga కవిత

ఆర్కే ||బుంగలు (1)|| ఔను ... ఎంత ఉతికిన మనసు పరిశుద్దత సంతరించుకోవడం లేదు. బహుసా మాసిన గుడ్డతో శవాన్ని మనసుని కలిపి చుట్టాలేమో! ఏమో మనసు గుర్రం ఎగరావచ్చు.... పరిశుద్దినివైపు!! ఆర్కే ||బుంగలు (1)||20140330

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gQ6lJ2

Posted by Katta

Nirmalarani Thota కవిత

ఏదో పద సవ్వడి..వడివడిగా గుమ్మానికి వ్రేలాడుతూ చూపుల తోరణాలు . . వయ్యారి వసంతమా వచ్చేస్తున్నావా? నీ మూన్నాళ్ళ వగలన్ని మళ్ళీ ఒలికిస్తావా ? చివుళ్ళు వేయడం ఆనక చిదిమేయడం నీకే చెల్లు.. వినిపిస్తుందా నీకు ఎండుటాకుల గలగలలో అడియాశల ఆత్మ విలాపం కనిపిస్తుందా నీకు మోడుబారిన గుండెల్లో ఆత్మీయతల చరమ గీతం నా పిచ్చిగానీ . . గడిచిపోయిన నిన్నటి శిథిల శిశిరంలో రాలిపోయిన ఆశల ఆకులెన్నని ఈ వసంతాన్నడిగితే ఏం చెపుతుంది ? అది రాలిన చోటే తను పుట్టానని మిడిసిపడుతూ గర్వంగా చెపుతుందా..? లేక ఇదే ప్రశ్న రేపు నేను రాలిపోయాక వచ్చే వసంతాన్నడుగుతావా అని దిగులు పూల హారాలతో బదులిస్తుందా.? కాలానికి ఋతువులెన్ని మారినా అనుభూతుల చివుళ్ళ జాడేది? పంచ వన్నెల పంచాంగాలెన్ని పరచినా మస్తిష్కపు మంచు పొరలు తొలగవేం? యుగాలు దాటే ఉగాదులెన్ని ఎదురొచ్చినా ఎద కోయిల కూయదేం? పల్లవించని స్పందనల్లో గొంతు దాటని కూజితాలన్నీ నిశ్శబ్ధ సంగీతాలేనా? ఉదయించని స్తబ్ధ ఉగాదులేనా? నిర్మలారాణి తోట [ తేది: 30.03.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hoeOBN

Posted by Katta

Gvs Nageswararao కవిత

//సంకల్పం// గరిమెళ్ళ నాగేశ్వర రావు// మొన్న రాత్రివేళ హఠాత్తుగా మాయమైపోయిన వెన్నెల ఎక్కడికి వెళ్ళిపోయిందో అని వెదుక్కుంటూ వుంటే... వేపచెట్టు కొమ్మల రెమ్మల్లోంచి పువ్వులై నవ్వుతూ కనిపించిందది. కోయిల గానం లోంచి వినిపించే ధ్వానం లోనూ చిగురుల వగరులని దానం చేసిన మామిడి కొమ్మ త్యాగం దాగుందట మొగ్గ తొడిగేవేళ మల్లె మొక్క మదిలో.. మన్మధుడు రధమెక్కి కదులుతూ మెదిలి ఉంటాడు.. అందుకే గమ్మత్తుగా మత్తెంకించే ఈ పరిమళం. తూరుపు కొండల లోంచి శిరసెత్తిన తొలికిరణం వేకువ దేహం మీద కాలం కానుకలా వెలిగే ఆభరణం మేఘం తో మేఘం తాకినప్పుడు మోగిన మోహన రాగమేదో మలయ వీచికతో కలిసి మంగళ గీతం పాడిందట ఊహా జనిత ఉత్ప్రేరకం లాంటి ఉత్సాహమే కదా ఉగాది అంటే! ఊహల ఉయ్యాల దగ్గర హృదయపు చెవి పెట్టి విను కొత్త శిశువు చెబుతుంది రేపటి ఉగ్గుపాల ఊసులు వసంతాన్ని స్వాగతిస్తూ తొలికోడి కూయగానే మొదలయ్యింది సంవత్సరం పొడవునా సాగాల్సిన జీవనోత్సవం. నోరు తెరచి స్వాగతించగానే ఆరు రుచులపచ్చడి ఆలోచనల లోలోపలికీ చేరి అరిగినట్టే ఉంది.. నవనాడులనూ శుద్ది చేసి జీవన యుద్ధానికి సిద్ధం చేస్తుంది. పంచాంగ శ్రవణంలో వినిపించే భవితవ్యం ఒక హెచ్చరిక రాజ్యపూజ్యమెదురైతే ఉప్పొంగి పొంగి పోకు అవమానం బెదిరిస్తే భయపడుతూ లొంగిపోకు మేషమైన సింహమైన, మిధునమైన మీనమైన రాశి ఫలం చెబుతుందట గంటల పంచాంగం రాశేదైన రాసిందేదైనా అసలు బలం నీలోనే ఉందన్నది యదార్ధం కందాయ ఫలంలో సున్నా ఎక్కడ ఉన్నా నీహృదయం లో దానిని చేరనీకు ఆగ్రహం పోయి గ్రహాలన్నీ అనుగ్రహాలించాలంటే చెయ్యాలి నువ్వొక దానం..నువ్వుల దానం కాదది అహాన్ని దహనం చేస్తూ 'నేను ని వదిలే దానం అది. మిత్రమా ఈ పండగవేళ మది మలినానికీ తలకడిగి కొత్తగా ధరించి మానవత్వాన్ని పట్టుదల వస్త్రంలా. శాంతి ఎప్పుడూ హోమగుండం లోచి పుట్టదు. అది ప్రేమ భాండం లోంచి పుడుతుంది. పదిమంది కలిసిన చోటే పండగ మొదలౌతుంది చిరునవ్వు పూసిన చోటే ఉగాది చిగురిస్తుంది . 30/3/2014

by Gvs Nageswararao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hoeNhn

Posted by Katta

Kushagari Yanganna కవిత



by Kushagari Yanganna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oe2qti

Posted by Katta

Chandrasekhar Vemulapally కవిత

చంద్రశేఖర్ వేములపల్లి || నా చెలి! || దూరంగా ఎక్కడికో నీవు వెళ్ళిపోతూ తలుపులు మూసివేస్తున్న భావనే కన్నీళ్ళై, నా బుగ్గలపై జారి నా ప్రపంచం .... శూన్యం అయిపోతున్నట్లుంటుంది నా భుజస్కందాలే నాకు దూరమై .... నా మనోగతం చీకటి అయోమయమై కాలం భారంగా కదులుతున్నట్లు గోడమీద గడియారమూ, గుండె లయను కోల్పోయి అసంతులనంగా వేగంగా కొట్టుకుంటున్నట్లుంటుంది. నీవు పక్కనున్నప్పటి నీ స్నేహ ఆత్మీయ బుజ్జగింపులు నా మది తెరపై జ్ఞాపకాలై అస్పష్టంగా .... పదే పదే కదులుతూ నీ ప్రతి ఊహ తోనూ నా హృదయం ఆవిరై ఒంటరితనం పై .... తీవ్రమైన అసహ్యం పెరుగుతూ తెలియని అలజడి, న్న నరనరాల్లో పెరిగి ముచ్చెమటలు పడుతుంటాయి. గదిలోని ప్రతి వస్తువు మౌనంగా నీ పేరే జపిస్తూ నా మనసును కలవరపెడుతుంటుంది. తీయని సెంట్ వాసన .... ఏదో బెడ్ రూం లో వరదలై పారి తలగడను అతుక్కునున్న సువాసనల జాడలు బెడ్ రూం నేలపై పరుచుకునున్న నీవు విడిచిన ఆ దుస్తులు వెదజల్లుతున్న నీ స్వేద మత్తు వాసనలు పీల్చేకొద్దీ .... విపరీత భావనలేవో చెలరేగి నా గుండె అల్లల్లాడుతుంది. అకస్మాత్తుగా నా మనస్సు ఖాళీ అయిపోయి నేను అపస్మారక స్థితిలోకి జారుకుంటున్నట్లు నా సర్వమై అమూల్యమైన లక్షణం నిన్ను శాశ్వతంగా కోల్పోతున్నానన్న కారణం ఏదో నన్ను ప్రశ్నిస్తుంటుంది. నిజానికి .... నీవు నానుంచి కోరుకున్నదేమిటని? నా ఆత్మ సమర్పణ నీన్నే ప్రేమిస్తున్నాననే ఆలోచనను దాచలేని నా ఎద భావనను .... నా నోట వినాలనే అని. నీ ఆత్మ సౌందర్యం ప్రకాశమేమో నీ కళ్ళలోనే కనిపిస్తుంది నీ పెదవుల్నుంచి త్రుళ్ళిపడే .... తియ్యని మాటలు మదిని ఊరిస్తూ స్వర్గం ఎంతో సమీపంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. నీవు నా పక్కన ఉన్నప్పుడు నీ నవ్వు నా ప్రపంచాన్ని ఆశావహం గా మారుస్తూ, జంట నక్ష త్రాల్లా ఏ వజ్రాలూ కెంపులకు లేని మెరుపుల్లా లక్షల్లో అరుదైన ఒకే ఒక్క జంటలా మన ప్రేమ మనకు అరుదైన ఆనందాన్నిస్తూ ఏ ప్రత్యామ్నాయమూ లేని దివినుంచి దిగివచ్చి .... భువిలో నా కోసమే జన్మించిన మణివో మాణిక్యానివో అన్నట్లు ఎన్ని జన్మలైనా ఎంత మదనపడైనా పొందాల్సిన సందర్శనీయ బహుమానం నీ అనురాగం అనిపిస్తుంది. నా హృదయం నీకు సమర్పించుకుంటున్నాను నీపై నాకున్న ప్రేమకి గౌరవ సూచన గా సంపూర్ణంగా .... అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది ఆ బ్రహ్మ ఎంతో కష్ట పడి అనురాగము, ప్రేమ .... సమతుల్యం గా శిల్పంగా నిన్ను చెక్కాడేమో అని నా అంతరాంతరాల్లో తుడిచివెయ్యలేని రాగ బంధం నీ ప్రేమే అని అంకితమిస్తున్నాను. నా అమరప్రేమను .... ఎంతో వినమ్రంగా నీవూ, నేనూ ఒకరికి ఒకరం చేరువైన క్షణాల్లో తగిలే నీ వెచ్చని శ్వాస కోసం .... నీ అనురాగం స్నేహం ఆత్మీయతల కోసం .... శారీరకంగా, మానసికంగా నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. నీ ప్రతి కోరిక నా ఆత్మ అభీష్టమే అనుకుని జీవన చరమ ఘట్టం .... స్వర్గం చేరేవరకూ .... కలిసుంటానని మాటిస్తున్నాను. నా ఆత్మ, నీ ఆత్మ ప్రేమకు కట్టుబడి ఉంటుందని 30MAR14

by Chandrasekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNXmq4

Posted by Katta

Tarun Chakravarthy కవిత

తరుణ్ చక్రవర్తి ||నేను ....|| నేను మాట్లాడకపోతే ప్రపంచం మూగవోతుంది నేను కదలకపోతే ఈ జగం నిశ్చలమవుతుంది నేను వినకపోతే ఈ లోకం వేదన అరణ్య రోదనవుతుంది నేను చూడకపోతే వెలుగు చీకటయిపోతుంది నేను శ్వాసించకపోతే గాలులు స్థంభించిపోతాయి ........ నేను అనంతాన్ని నేను దిగ్దిగంతాన్ని నేను తరంగాన్ని నేను కిమ్మీరపు గాలి తెమ్మెరను నేను రేణువును, గోపగోపికా కోపతాప స్వాంతనపు వేణువును నేను భావాన్ని, నేను పక్ష్యాదుల కిలకిలారావాన్ని నేను జగత్తును, నేనే మహత్తును నేను మరచిపోబడ్డ గతాన్ని, నేను దద్ధరిల్లుతున్న ఉద్యమకారుడి స్వగతాన్ని.... నేను మరీచిని, నేను లోక పునర్నిర్మాణం కోసం వెన్నెముకనిచ్చిన దధీచిని. నేను చేతస్సును, నేను ప్రజాశ్రేయస్సు కోసం ఆవిష్కృతమవుతున్న హవిస్సును... నేను కుసుమపేశల శిరీశను, నేను జిగీషను నేను కవిత్వపు వస్త్వైక్యాన్ని, నేను కవి భావనలోని ఏకాత్మతను నేను ప్రపంచపు చైతన్యాన్ని, మానవ హృదయాశావధి నిండిన భావనాత్మక ఔన్నత్యపు ఉనికిని.. నేను భీరువును, నేను ధీరుడిని.... నేను భీకర ఆయుధాన్ని, తండ్రి యెదపై ఆడే చిన్నారి నవ్వుల శీకరాన్ని... నేను బలవంతుడి ధాష్టీకానికి తెగిపడ్డ మెడను.. నేను చలిచీమల చే కట్టబడ్డ దుర్భేద్యపు గోడను... నేను మానవాంతర్గత సంద్రపు కల్లోలాన్ని.. నేను తిమిరలోకపు గుండెలు చీల్చిన ఉదయ శరాన్ని... నేను యుద్ధ సేనాని రథ కేతనాన్ని.. నేను సమాజంలోని అధిపత్యవాదులచే కుంచించబడుతున్న గౌరవమనే వేతనాన్ని... నేను మనిషి గుండెలో విరుస్తున్న వాత్సల్య శిల్పాన్ని.... నేను బండరాళ్ళ ను చీల్చుకుని మొలకెత్తుతున్న వికసిత పుష్పాన్ని.... ... ... ... నేను గాలిని.... నేను వెలుగును... నేను స్వాంతనను... నేను చైతన్యాన్ని.. నేను మనిషి మస్తిష్కంలో ఇంకా ఇంకని మా న వ త్వ పు జా డ ను.....

by Tarun Chakravarthy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNXm9E

Posted by Katta

Ramesh Ragula కవిత



by Ramesh Ragula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oe2pWg

Posted by Katta

Pratapreddy Kasula కవిత

http://ift.tt/1oe2pFW

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oe2pFW

Posted by Katta

Manjunadha Reddy కవిత

ఏమి చేయాలో ఏమి చేస్తున్నామో ఎక్కడికి వేళ్ళలో ఎవరిని కలవాలో ఎవరితో మాట్లాడాలో తెలియలేదు ఎవరికి ఏమి ఇష్టము ఏది కష్టము తెలియదు ధర్మము ఏమి అధర్మము ఏమి తెలియదు దానమేది దొరతనమేది తెలియదు దావా ఏది ద్వారం ఏది తెలియదు మంచి ఏది మర్మము ఏది తెలియదు అందము ఎందుకు ఆనందము ఎందుకు తెలియదు ఆవేశాలు ఆక్రోశాలు ఎందుకు తెలియదు ఆలోచనలు అవసరాలు ఎందుకు తెలియదు సుఖమెందుకు దుఖమందుకు తెలియదు వేశామెందుకు వెతుకులాట ఎందుకు తెలియదు వేదన ఎందుకు వెక్కిరింత ఎందుకు తెలియదు పాట ఎందుకు అట ఎందుకు తెలియదు పల్లవి ఎందుకు పరువం ఎందుకు తెలియదు శాసనం ఏంటి చామంతి ఎవరు తెలియదు భంధం అనుభంధం ఏమిటికి తెలియదు త్యాగం స్నేహం ఏమిటికో తెలియదు @ G. Manju 30/03/2014

by Manjunadha Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mj4nA3

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

అరుణమణులు... 1 మరో మారు పార్టి జెండ మార్చావా కండువా!? ఎటుబడితే అటునడిచే రాజకీయ శిఖండివా!? 2 ఎవరికైన వుండాలోయ్ ప్రజాస్వామ్య నిబద్దత వోటు తోటి ఋజువుచెయ్ రాజకీయ విశుద్దత. 3 ఎన్నికలపుడే పుట్టే "నేత" కాడు హ్యూమనిస్టు ఓట్లు గుంజె ఎత్తుగడల చిఠాయే మ్యానిఫెస్టు. 4 చేతిలోకి డబ్బువస్తె అవుతావా నరపతి!? నోటు కోరకు ఓటునమ్మి కోల్పోకోయ్ పరపతి!! 5 "మూసీ"నది చరిత్రంత మురుగు నీట మునిగింది ప్రజాస్వామ్య ఘనతనంత పచ్చ నోటు మింగింది. . 30.3.14.

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rSrUvQ

Posted by Katta

Venkata Hanumantha Ramakrishna Tummalachervu కవిత

నా కాశ్మీర్ భూలోకం లో నాకం లా విలసిల్లేది నా కాశ్మీర్ // నా తల్లి తలపై మల్లె పువ్వై పరిమళించేది నా కాశ్మీర్ // ఆకశం లో వెలుతురు తోటై మురిపించేది నా కాశ్మీర్ // అందాల గుల్మొహర్ లా విరబూసేది నా కాశ్మీర్// పసి పాప నవ్వులా మంచు వెన్నెలలు కాసేది నా కాశ్మీర్ // శంకర బోధామృత పునీత పులకిత గాత్ర నా కాశ్మీర్ // సనాతన భారత జీవిత పథ నిర్దేశిక నా కాశ్మీర్ // అరమరిక లెరుగని నా పూర్వీకుల అమాయకత్వానికి బలి పశువైంది నా కాశ్మీర్ // ఆశ్రయ దాతలను నిరాశ్రయులను చేసి// స్వాతంత్ర పోరాటం అంటారు నర మాంస భక్షకులు // వితండ వాదాన్ని చరిత్ర చేసి అబద్ధాన్ని బాగ అలంకరించి // మా నెత్తుటి మరకలపై మసి పూసి మాయం చేసి // అన్యాయాన్ని న్యాయం గా నిరూపిస్తున్నాయి ధివాంధములు // మా శరీరాన్ని ఒక్కో ముక్కా కొరుక్కు తింటూ // చచ్చి పోతున్నాం బాబో అని మొత్తుకొంటుంటే // మా ఆకలి తీరడమే సెక్క్యులరిజం అంటాయి గుంట నక్కలు // నా వాళ్ళను చంపే ఇజం నాభూమిని దిగమింగే ఇజం // నా దెశం విడగొట్టే ఇజం ఎంత పెద్ద నిజమైనా // అది మా పాలిటి పగబట్టిన మరణ శాసనం // మా కాశ్మీర్ మాకు కావాలి మా దెశం మాది కావలి // మాకు బిరుదులొద్దు మాకు సెక్క్యులరిజం భుజ కీర్తులొద్దు// మాకు మాకశ్మీర్ కావాలి మా స్వర్గం మాకు కావాలి // హెల్ విథ్ యువర్ సెక్క్యులరిజం . హెల్ విథ్ యువర్ ఎక్ష్స్ట్రీమిజం // కశ్మీర్ మాది మా తాత తండ్రులది మా కాశ్మీర్ మాకు కావాలి // 30/3/14

by Venkata Hanumantha Ramakrishna Tummalachervu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNw1Eo

Posted by Katta

Vakkalanka Vaseera కవిత

పిడికెడు అన్నం, రొట్టిముక్కా... కొన్ని కొడవళ్లని, కొన్ని నాగళ్లని కొన్ని పొలాలని, కొన్ని గ్రామాలని కొన్ని గుడిశెల్ని, కొన్ని మేడల్ని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్కా కడుపులో దాచుకున్నాయి కొన్ని పిడికిళ్లని, కొన్ని నినాదాల్ని కొన్ని పోలింగ్‍బూత్‍లని, కొన్ని తుపాకుల్ని కొన్ని అణుబాంబుల్ని, కొన్ని అడవుల్ని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్కా కడుపులో దాచుకున్నాయి కొంత రక్తాన్ని, కొంత క్రూరత్వాన్ని కొంత ద్వేషాన్ని, కొంత కారుణ్యాన్ని కొంత చీకటిని, కొంత కాంతిని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్కా కడుపులో దాచుకున్నాయి కొన్ని ప్రవాహాల నీటిని కొన్ని కార్చిచ్చుల అగ్నిని కొన్ని శ్వాసల ప్రాణవాయువుల్ని కొన్ని దృశ్యాలని, కొంత నిద్రని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్క కడుపులో దాచుకున్నాయి కొన్ని కలల్ని, కొన్ని కోరికల్ని కొంత సంతోషాన్ని, కొంత దు:ఖాన్ని కొన్ని రోజుల్ని కొన్ని శబ్దాలని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్క కడుపులో దాచుకున్నాయి కొందరు అమ్మల్ని, కొందరు నాన్నల్ని కొందరు పూర్వికుల్ని, కొందరు నరుల్ని కొందరు గ్రామ దేవతల్ని, కొందరు కులదేవతల్ని, కొన్ని వర్షాలని, కొన్ని యజ్ఞాలని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్క కడుపులో దాచుకున్నాయి మరకల్లేని మనసులతో సృష్టికర్త ప్రసాదంగా పిడికెడు అన్నం, చిన్న రొట్టి ముక్కా ఇచ్చినా పుచ్చుకున్నా, కాలం కొమ్మలు చాచి కాలిబాటనిండా పూల వనాల నీడల్ని అనుగ్రహించదా? కాలం చేయెత్తి దీవించి మానవీయ జీవితానికి దివ్యసుగంధాలు అనుగ్రహించదా? - వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hnvQ2S

Posted by Katta

Nagalakshmi Varanasi కవిత

జయకేతనమేగరేస్తూ 'జయ' ఉగాది- Dt. 29-3-2014 ప్రభాత స్నానం కావించి ధవళ కాంతుల పేటిక తెరిచి సప్త వర్ణాల సొగసులద్దుకుని జయ నామం ధరించి ఉగాది వస్తోందిట ! దేనితో స్వాగతించను? అరవయ్యేళ్ళ పాత పెంకుటిల్లు ఆరంతస్తుల అపార్టుమెంట్ కాంప్లెక్సుగా మారే క్రమంలో గూళ్లు కోల్పోయిన గువ్వలతో పాటే అంతరించిపోయిందేమో ప్రతిసారీ కుహూ కుహూ అంటూ ఉగాదిని స్వాగతించే కోకిలమ్మ వినిపించకుండా పోయింది ! ఇన్నేళ్లూ శిశిరంలో ఆకులు రాల్చేసి వసంతాగమనంతో చిగురులు తొడిగి పూలతో కాయలతో పిల్లలూగే ఉయ్యాలలతో కళ కళలాడిన చెట్లతో పాటే మావి పూతల్లో చెలరేగిన కూతలమ్మ కూడా మౌనగీతమై కనుమరుగై పోయింది ! అన్ని ఋతువుల్లోనూ ఒకలాగే నిలిచే ఆకాశ హర్మ్యాల నడుమ తలదాచుకునే గూడు లేక తరలిపోయిన శుక పికాల నిష్క్రమణం చూశాక కొమ్మా రెమ్మా కనిపించని కాంక్రీటు అడవిలో శిశిరానికీ, వసంతానికీ తేడా ఏముందని ఆమని అలిగింది! పచ్చని తరుశాఖల పందిరిపై రంగు రంగుల పువ్వులు పేర్చి సీతాకోకమ్మలని ఆహ్వానించే ఆమని అశోకవనంలో సీతమ్మలా శోక ముద్రలో మునిగింది ! పూల రెక్కల్లో ఒదిగి నిదురించి , గాలి పాటల్లో కదిలి నర్తించే వసంత భామిని విడిది చేసే చోటు లేక వడిలిపోయింది, వెడలి పోయింది ! ఇపుడు వసంతం వెంట లేకుండా ఉగాది ఒంటరిగా వస్తుందా ? గుమ్మాలకి వాడని ప్లాస్టిక్ ఆకుల తోరణాలతో స్వాగతిస్తే సెల్ ఫోను రింగు టోనులో కోకిల కూతలు పలకరిస్తే షడ్రుచుల పచ్చడి కూడా కొట్లో కొనితెచ్చిన రెడీమిక్స్ గా కనిపిస్తే ఉగాది ముంగిట్లోకి వస్తుందా ? అవమానపడి వెనుదిరిగి పోతుందా ? మనసు నొచ్చుకున్నా మార్పులు నచ్చకున్నా మానవాళిని మన్నించి చీకట్లని చీల్చే కొత్త వేకువై తూరుపు వాకిట్లో ప్రత్యక్షం కమ్మని వేడుకుంటే ఉగాది కాదంటుందా ? విధ్వంసాలకు స్వస్తి చెప్పి వసుధకు వన్నెలద్దుదాం రమ్మంటే హరిత విప్లవానికి పునాదులేద్దాం పదమంటే, ఉగాది రాకుండా ఉంటుందా ? వస్తుందేమో.... ఎన్నిసార్లు విరిగి పడినా తిరిగి పైకేగసే కడలి కెరటంలా ఎంత అవమానించినా ఋతుచక్రంతో పాటుగా తిరిగి తిరిగి ఆగమించే ఆమని ఈసారి ఒక కొత్త వరవడికి శ్రీ కారం చుట్టేందుకో... ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించే అలవాటుకు స్వస్తి పలికి తీరు మార్చుకోక పోతే , ప్రకృతి సమతుల్యత పట్టించుకోకపోతే తుడిచి పెట్టేస్తానని తర్జని చూపించేందుకో... వస్తుందేమో ! వసంతం గ్రీష్మమై మండి పడే దాకా ఉగాది ఉగ్రవాదై ఉరిమేదాకా సుప్త శిలలై నిలిచిపోకుండా మన తరం చేసిన తప్పిదాలన్నిటినీ తక్షణమే దిద్దుకుని పర్ణశాలల ప్రాంగణాల్లో వసతులిచ్చి తూనీగల సంగీతం వినిపిస్తే, రాలిన పూరెక్కల తివాచి పరిచి భ్రమర గీతాలతో స్వాగతిస్తే వసంతాన్ని వెంట పెట్టుకుని వన్నెల వెన్నెలమ్మలా వెలుగుల వేకువమ్మలా ఉగాది వచ్చేస్తుంది ! వయసుమళ్ళిన సంఘాన్ని వ్యర్ధ ప్రలాపాలిక చాలించి యువతరానికి దారిమ్మనీ, నవ భావాలకు చోటిమ్మనీ ప్రేరేపిస్తూ ఉగాది వస్తుంది ! స్వార్ధ శక్తులకు కాలం చెల్లిపోయిందని హెచ్చరిస్తూ నోటిస్తే వోటిచ్చే రోజులు మారాయనీ యువ శక్తి ప్రభంజనమై దూసుకొచ్చి దేశ పటాన్ని పునర్లిఖిస్తుందనీ జాతి భవితను తీర్చిదిద్దుతుందనీ భరోసా కలిగిస్తూ ఉగాది వస్తుంది ! అన్న దాతకు అప్పుల్లేని జీవితాన్నీ పీడకలలు లేని నిద్రనీ ప్రసాదించి సకల జనావళికీ కూడూ గూడూ ఒనగూడే ఒరవడి సృష్టించేందుకు ఉగాది వడివడిగా వస్తుంది ! కుళ్లిన వ్యవస్థ లోంచే కొత్త మొలకలు పుట్టుకొస్తాయని ఆశల చిగురుల గుబురుల్లో నవ రాగాల మృదు గమకాలు పల్లవించే కోకిలల కొత్త గొంతులు వినిపిస్తూ కలరవాల కలకలమై అదిగో ... అదిగదిగో ... ఉగాది వస్తోంది ! వసంత శోభను వెంట పెట్టుకుని మళ్లీ మన నేలను హరితసీమగా మార్చేందుకు జయ నామం ధరించి ఉగాది వచ్చింది ! జయ జయ ధ్వానాల మధ్య జయ కేతనమెగరేస్తూ ఉగాది వచ్చేసింది ! *************

by Nagalakshmi Varanasi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k9QfYv

Posted by Katta

Rambabu Challa కవిత

చల్లా గౙల్-2/ dated 30-3-2014 పంచ భూతములొక్కటై నను గేలి చేస్తే ఏమి సేతును వంచనాభ్ధి ఒక్క ఉదుటున ముంచి వేస్తే ఏమి సేతును భాష్మ చిల్మను కావలొక అస్పష్ట రూపము కదలెను భ్రమను గొలిపే ఎండ మావిగా మారిపోతే ఏమిసేతును కడలి ఒడ్డున చెలియ పేరును రాసు కొంటిని ప్రేమతో కక్ష గట్టిన జలధి చేతులు చెరిపి వేస్తే ఏమిసేతును ప్రేమ దేవత చిత్రపటమును పూలతో పూజించితే విరులు సైతం పడగ విప్పి కాటు వేస్తే ఏమిసేతును గుండెలో దిగబడిన బాకును పెరికినా బ్రతకొచ్చు "చల్లా" ఆమె రాసిన ప్రేమ లేఖలు నన్ను కాల్చితే ఏమిసేతును

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k9QfIa

Posted by Katta

Abd Wahed కవిత

తేనెకన్న తీయనైన ఆ రోజులు గుర్తున్నాయా అమ్మ ఒడిన నేర్చుకున్న ఓనమాలు గుర్తున్నాయా చింతబరికెతో టీచరు నేర్పించిన ఎక్కాలెన్నో చింతచెట్టు పంచుకున్న ఆ పులుపులు గుర్తున్నాయా గిల్లికజ్జ కోట్లాటలు తాయిలాలు కాకెంగిళ్ళూ కారంలా చురుక్కుమనె జ్ఙాపకాలు గుర్తున్నాయా పై చదువులు, కొత్త కొలువు, అమ్మకంట ముత్యాల్లాగే జారిపడిన ఎడబాటుల ఉప్పునీళ్ళు గుర్తున్నాయా తొలిప్రేమలు తొలిఆశలు ప్రయత్నాలు వైఫల్యాల్లో పడుచుదనం చవిచూసిన పొగరువగరు గుర్తున్నయా చేజారిన కాలంలో చేయలేని సంకల్పాల్లో చేదురుచిని తలచలేని మతిమరుపులు గుర్తున్నాయా

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dGd1c4

Posted by Katta

కంచర్ల సుబ్బానాయుడు కవిత

(^^^) ఉగాది కవితల పోటీ * కవితా ప్రియులకు ఆహ్వానం ఉగాది సందర్భంగా సాహితీ సేవ http://ift.tt/1dGcZkf కూటమి ఆధ్వర్యంలో కవితల పోటి నిర్వహించదలిచాము . ఆసక్తి కల కవులు, కవయిత్రులు ఈ పోటీలలో పాల్గొనగలరు. * కాస్త సామాజిక స్పృహా కలిగిన అంశం రాయొచ్చు * కవిత10 నుండి 35 లైన్లుకు మించరాదు *కవిత కొత్తదై ఉండవలెను. ఏ ఇతర గ్రూప్ ల లోను మరియు ఇతర పత్రికల లోను ప్రచురితమై ఉండరాదు . *కవితల పోటీకి పంపిన కవితలను విజేతలు ప్రకటించే వరకు ఏ ఇతర గ్రూపులలోను, మరే ఇతర చోట్లా పోస్ట్ చెయ్యరాదు * మీ కవితలను ఉగాది కవితల పోటీ అని ఈ పిన్డ్ పోస్ట్ కిందనే తేది స్పష్టం గా వేసి ఈ నెల 31 వ తేది రాత్రి 12 గంటలు లోగా పోస్టు చెయ్యవలెను . * సమయం దాటినా తర్వాత వచ్చిన కవితలు పరిశీలనా లోకి తీసుకోబడవు *న్యాయ నిర్ణేతలుదె తుది నిర్ణయం . ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు. గమనిక ===== ఉగాది కవితల పోటీలలో విజేతలైన వారికి వచ్చే నెలలో హైదరాబాద్లో జరిగే సాహిత్య సభలో బహుమతులు ప్రధానం చెయ్యబడును .. అదే విధం గా గతం లో సాహితీ సేవ నిర్వహించిన కవితల పోటీలో గెలుపొందిన విజేతలు ప్రధమ బహుమతి పొందిన శ్రీనివాస్ వాసుదేవ్ గారికి , ద్వితీయ బహుమతి పొందిన భారతి కాట్రగడ్డ గారికి , తృతీయ బహుమతి పొందిన వర్చస్వీ గారికి కన్సొలేషన్ బహుమతులు పొందిన భాస్కర్ పాలమూరు గారికి ,వెంకటేష్ వలన్దాస్ గారికి , లుగేంద్ర పిళ్ళై గారికి , నవీన్ కుమార్ కొమ్మినేని గారికి కూడా హై దరాబాద్ లో వచ్చే నెలలో జరిగే సాహిత్య సదస్సు లో(తేది త్వరలో ప్రకటించ గలము ) ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేయటం జరుగుతుంది. ఇట్లు కత్తిమండ ప్రతాప్, పుష్యమి సాగర్ అడ్మిన్స్, సాహితీ సేవ. http://ift.tt/1dGcZkf

by కంచర్ల సుబ్బానాయుడు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k9Qhzv

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/తడి ఎడారి..... నేనూ మరికొంచం నిశ్శబ్దం గదిలో ఒంటరిగా ఒకరికిఒకరు తోడుగా కూర్చుని కొన్ని క్షణాలను కష్టంగా ఖర్చుపెడుతూ జ్ఞాపకాల ధూళి ఉప్పు సంద్రంగా నేలంతా తవ్వుతూ కనిపించని రహస్య సొరంగాలను పచ్చని ఆకులపై గాలి బిందువులుగా శోదిస్తూ నిశ్చలంగా కొంచం నిబ్బరంగా నాలో నన్ను చదువుతూ వాడిపోయిన వెన్నెల కెరటాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయోనని హిమపు ఆలోచనలు ఇంకిపోయిన తేనె ఎడారులు వెల్లువెత్తిన శిధిలాలు దివిటీ వెలుగులో కనిపించకుండా ఇప్పుడు ఇంకా ఒంటరిగానే నేనూ నా నిశ్శబ్దం తిలక్ బొమ్మరాజు 30.03.13

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QtRedm

Posted by Katta

Krishna Mani కవిత

ఇంకోటి లేదు ************* ఒక పందిలో ప్రవేశించి చూసాను బురదలో ఉన్న సుఖం ఇంకోటి లేదు ! కోతిలో చేరి చూసా కొమ్మలంచులో ఊగే సుఖం ఇంకోటి లేదు ! ఒక పాములో దిగి చూసా ఒళ్ళు చుట్టుకొని మత్తున పండే సుఖం ఇంకోటి లేదు ! ఒక పక్షిలో ఎగిరి చూసా లోకాన్ని చిన్నగా చూసి మురిసే సుఖం ఇంకోటి లేదు ! సాగరంలో మునిగి చూసా సాధ్యమైనంత ఎక్కువగా ఒదగడంలో ఉన్న సుఖం ఇంకోటి లేదు ! ఒక చెట్టులో దాగి చూసా కన్నీళ్ళతో కడుపు నింపడంలో ఉన్న సుఖం ఇంకోటి లేదు ! మనషిలో తొంగి చూసా పక్కవాడిని తొక్కడంలో ఉన్న సుఖం ఇంకోటి లేదు ! కృష్ణ మణి I 30-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k9zUmI

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

లఘుకవితలు -2: ( http://ift.tt/QtRdGs) ....|| 1-1=0 ॥.... రెండు వాక్యాలు ఒక్క మనసు మాట మౌన సంభాషణం ముచ్చట ముగియనేలేదు ముగిసింది నాటకం కొందరి అర్ధాంతర బతుకు కథ విషాదాంత ఏకాంకిక ! ....|| 2 *2=0 ॥.... రెండు రెండ్లు ఆరంటే కాదంటావు! రెండు రెండ్లు ఎనిమిదంటే కాదంటావు! పోనీ రెండు రెండ్లు మూడంటే కాదనే అంటావు ! ఇక రెండు రెండ్లు నాలుగని చచ్చినా అనను ఎందుకంటే నీవు కానేకాదంటావని నాకు తెలుసు రెండు రెండ్లు జీరోనే మన జీవితాల్లా! మన మధ్య కుదురని సయోధ్యలా ! ....॥ 3,4,5=0 ॥.... ముడులు మూడు వేసినా ఊడుతూనే వున్నవి తాళిబొట్లు , నాలుగు మూలల ఆటలో కూలుతూనే వున్నవి స్తంభాలు , పంచపాండవులు మంచపు కోళ్లు అటక కెక్కాడు ఐదవవాడు , చివరికు మిగిలిన శేషం పూజ్యం ! ....|| 6=0||.... ఛాతీ విరుచుకొంటూ బయటికొచ్చాడు సిక్స్ పాక్స్ వీరుడు! 'అవునవును, సరిలేరులే నీకెవ్వరూ?' ఎకసక్కెమాడింది ఒరుసుకుంటూ వెళ్ళిన బక్క పల్సని గాలి పిల్ల ఎక్కడి నుండి వచ్చి పడిందో నలుసు భగ్గుమంది కన్ను గింజుకు చస్తున్నాడు ఖంగు తిన్నకండల మానవుడు! ---నాగరాజు రామస్వామి, Dt 30.03.2014.

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QtRdGs

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

లఘుకవితలు -2: ( http://ift.tt/QtRdGs) ....|| 1-1=0 ॥.... రెండు వాక్యాలు ఒక్క మనసు మాట మౌన సంభాషణం ముచ్చట ముగియనేలేదు ముగిసింది నాటకం కొందరి అర్ధాంతర బతుకు కథ విషాదాంత ఏకాంకిక ! ....|| 2 *2=0 ॥.... రెండు రెండ్లు ఆరంటే కాదంటావు! రెండు రెండ్లు ఎనిమిదంటే కాదంటావు! పోనీ రెండు రెండ్లు మూడంటే కాదనే అంటావు ! ఇక రెండు రెండ్లు నాలుగని చచ్చినా అనను ఎందుకంటే నీవు కానేకాదంటావని నాకు తెలుసు రెండు రెండ్లు జీరోనే మన జీవితాల్లా! మన మధ్య కుదురని సయోధ్యలా ! ....॥ 3,4,5=0 ॥.... ముడులు మూడు వేసినా ఊడుతూనే వున్నవి తాళిబొట్లు , నాలుగు మూలల ఆటలో కూలుతూనే వున్నవి స్తంభాలు , పంచపాండవులు మంచపు కోళ్లు అటక కెక్కాడు ఐదవవాడు , చివరికు మిగిలిన శేషం పూజ్యం ! ....|| 6=0||.... ఛాతీ విరుచుకొంటూ బయటికొచ్చాడు సిక్స్ పాక్స్ వీరుడు! 'అవునవును, సరిలేరులే నీకెవ్వరూ?' ఎకసక్కెమాడింది ఒరుసుకుంటూ వెళ్ళిన బక్క పల్సని గాలి పిల్ల ఎక్కడి నుండి వచ్చి పడిందో నలుసు భగ్గుమంది కన్ను గింజుకు చస్తున్నాడు ఖంగు తిన్నకండల మానవుడు! ---నాగరాజు రామస్వామి, Dt 30.03.2014.

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QtRdGs

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ | లోపలి మైదానం ................................ రోజూ ఏదో ఒకటి తెలుస్తూనేవుంటుంది,కొత్తగా ఏదో నేర్చుకున్నట్లుగానే ఉంటుంది,మరీముఖ్యంగా నాగురించి నేను. ఒకరిద్దరైనా కలుస్తారు .వాళ్ళు నాలోకి ,నేను వాళ్లలోకి వెళ్లి కూచున్నాక అక్కడికిక ప్రయాణం ముగుస్తుంది. ఆతర్వాత ముగిసినరోజుని లోపలి మైదానంలోకి అలా అలా తిరిగేందుకు పంపిస్తాను.కన్నీళ్లుగానో,బిగ్గరగా నవ్వుకునే నవ్వులగానో, లోపలికే ముడుచుకున్న నిన్నటిలాంటి అనుభవంగానో ఆ మైదానంనిండా ఎత్తుపల్లాల గుంతలు. ఆ తర్వాత అలిసి,సేదతీరి,కలగలిసి,విడివడి వొంటరిగా మిగిలాక వస్తూపోతూవుండే కరెంటుకు వెలిగి ఆరిపోయే బల్బుగురించి ఎవరో ఒకరు ప్రస్తావిస్తారు. 30.3.2014

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jK2nnn

Posted by Katta

Kancharla Srinivas కవిత

కొత్తగ మొలిచిన సరిహద్దులు చూసి రెండుగ చీలిన తెలుగింటిని చూసి ఎక్కడ వాలాలో తెలియక ఆమని సందేశం ఏమని కూయాలోనని రెక్కలాడిస్తున్నావ్ గళ మౌనం వహిస్తున్నావ్... కలవర పడకే కోయిల కుహుకుహూలు కూయిలా తెలుగు తరువుకు కొత్త కొమ్మ కాసింది తెలంగాణ విరబూసిందంతే కొమ్మలు రెండైనా తెలుగు చెట్టొకటే శాఖలు వేరైనా వేరు మూలం ఒకటే యాభై ఆరు వర్ణాల వర్ణమాల వర్ణమేం తగ్గలేదు మా అక్షరాలు అక్షరాలా అలానే ఉన్నాయ్ హల్లులూ పొల్లు పోలేదు ప్రాంతాలు వేరైనా భాష సమైక్యమే జంట తొటల మావి చివుర్లు తిను తెలుగు జాతిని నిలిపే మధుర గానం ఆలపించు...

by Kancharla Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gODaWL

Posted by Katta

Ramakrishna Kalvakunta కవిత



by Ramakrishna Kalvakunta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gbPkD7

Posted by Katta

Boorla Venkateshwarlu కవిత

నోట్ ఎన్నికల సంగ్రామంలో నోట్ల చెట్లూపి కట్టలు రాల్చే గ్రామ సింహాలు ఎప్పుడూ ఒక బొక్కకే లొంగిపోతాయి తెలుసుకో నీ చెమట చుక్కల్ని బ్రాందీ చుక్కల్తో వెలకట్టే వినయపు నక్కలు శవాల్నీ పీక్కుతింటాయి పోల్చుకో ఈ ఐదేళ్లూ నీ ఐదేళ్ళూ నోట్లోకి వెళ్ళాలంటే ఒక నీ బలహీనతను ఉచితంగా తీర్చేవానికంటే నోటివ్వని వాడు “నోటా” కు చోటివ్వని వాడు నోటిని ప్రజల కోసం మైక్ లా వాడేవాడు సింహాసనమెక్కాలోయ్ నోట్ చేస్కో

by Boorla Venkateshwarlu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hmRq7N

Posted by Katta

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు – 27 . మన కేరళ సోదరులు మంచి కవిత్వం అందిస్తున్నారనడానికి ఇదొక మంచి ఉదాహరణ. గాలికి దీపం అటూ ఇటూ కదలాడడం ఒక ప్రకృతి సిద్ధమైన అనుభవం. దానికి ఒక తాత్త్విక ఊహను జతపరచడం కవిత్వపు సొగసు. మనిషికి ఎప్పుడూ ఒకరి నీడలో బ్రతుకుతూ, తన ఉనికిని కోల్పోవడం కన్నా దుఃఖభాజనమైన విషయం మరొకటి ఉండదు. ముఖ్యంగా స్వేచ్ఛా ప్రియులకి. లౌకికమైన అవసరాలకీ, (ప్రధానమంత్రో, మరో మంత్రో, సలహాదారో వంటి) లౌల్యాలకీ గొప్ప గొప్ప మేధావులే తమ స్వాతంత్ర్యాన్నీ, వాక్స్వాతంత్ర్యాన్ని, తనఖాపెట్టుకుని, ఒకరి నీడలో మసలడం మనం నిత్యం చూస్తున్నదే అనుకొండి. ఈ కవిత అలాంటి వాళ్ళని ఉద్దేశించి వ్రాసినది కాదు. దాస్యం కోరుకునేవాళ్లకి స్వాతంత్ర్యపు విలువ తెలీదు. భావదాస్యాన్ని మించిన దాస్యం మరొకటి ఉండదు. అది అంతఘోరమైనది. (హెచ్చరిక: మనమందరమూ ఈ క్షణంలో కూడా ఏదోరకమైన భావదాస్యానికి, తెలిసీ, తెలియకా లోనై ఉన్నవాళ్ళమే. కనుక ఒకరిని ఆక్షేపించే పనిలేదు. స్వేచ్ఛ అన్నది మనకున్న భావదాస్యాలనుండి విముక్తి అవడానికి ప్రయత్నిస్తూ, కొత్తవాటికి దాసులం కాకుండా పరిరక్షించుకునే నిరంతర ప్రక్రియ.) కవి ఎంతబాగా చెబుతున్నాడో గమనించండి. దీపంక్రింద నీడ చేసే విన్యాసం కేవలం వినోదానికి కాదట, ఎల్లప్పుడూ దీపం ( ప్రమిద, లేదా కొవ్వొత్తి) క్రింద పొర్లుతూ ఉండడం వల్ల కలిగే దుఃఖాన్ని మరిచిపోవడానికి చేసే ప్రక్రియ...ట. నిరాకారమైన నీడకే అంత స్వాతంత్ర్యేచ్ఛ ఉంటే, మనకి ఎంత ఉండాలి. అది ఎవరికి వారు ఆత్మావలోకనం చేసుకుని తెలుసుకోవలసిన విషయం.. ప్రయాస... వీరన్ కుట్టీ, మలయాళ కవి. . ఈ నీడ, ముందుకీ వెనక్కీ నడయాడుతూ తనరూపాన్ని పెంచుకుంటూ, కుంచించుకుంటూ పోవడం అదేదో కాలక్షేపానికి ఆడే వినోదక్రీడ కాదు. . అది, తను ఎల్లకాలమూ ఒకరి పాదాలక్రిందే పొర్లుతూ తన ఉనికి కోల్పోతున్నందుకు పడే దుఃఖాన్ని మరిచిపోడానికి చేసే ప్రయాస... . వీరన్ కుట్టీ, మలయాళ కవి . . The Effort . This Is No Trivial Pastime, This Play of the Shadow, Stretching and Shrinking Its Own Image... It Could Be an Attempt To Forget the Sorrow Of Being Overshadowed, Forever Stuck Beneath Another…! . Malayalam Original: Veeran Kutty Veeran Kutty is a Lecturer at Government College, Madapally, Kerala. (English Rendering: Girija Chandran)

by Nauduri Murty



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gaZB2q

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ ఓటు @ _ కొత్త అనిల్ కుమార్ 30/3/2014 కళ్ళు తెరిచి చూడు మనసు పెట్టి చూడు ఓటంటే నీ చేతిలో దీటైన ఆయుధం అలసత్వం తో ఆదమరిస్తే చీకటే. ఓటును నిర్లక్ష్యం చేస్తే సమాజ మనుగడకు చేటే. సేవ ముసుగులో రాజకీయం చేసే సామాజిక ఉద్యోగిని ఎన్నుకో ఓటుతో .. ఎలాంటి వాడు ప్రజలకు కావాలనే ప్రశ్నకు సమాదానం చెప్పు ఓటుతో వేలెత్తి చూపిస్తూ కాలం గడిపేయకు వేలోత్తే సమయమిది ఓటేసి చూయించు . నోటుతో ఓటమ్ముకుని ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు దారుడివి కాబోకు. తడబడి తలవంచకు తలబడి గెలిపించుకో పొరబడితే తగలబడి పోతావ్. _ కొత్త అనిల్ కుమార్

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gCulON

Posted by Katta

Patwardhan Mv కవిత

నమ్మకు నమ్మకు ఈ రేయిని: ఈ రాత్రి చీకటి సిగ్గుపడి, భయపడి తన కళ్ళను గట్టిగా మూసుకుంటుంది. రౌడీ సీసా కరెన్సీని వెంటేసుకొని వీధి గద్దె మీదే ఓటరుపై అత్యాచారం చేస్తుంది. ఈ రాత్రే ప్రజాస్వామ్యానికి వెంటిలేటర్ తొలగించబడి అనుమానం రాని రీతిలో హత్య కావించబడుతుంది. అంతరించిన డైనోసార్లు మళ్ళీ అవతరించే రాత్రి. అసలైన మేనిఫెస్టోలు రాయబడే రాత్రి రేపు ఇనుప బాక్సుల్లో నిండేవి ఈ రాత్రి కార్చిన రక్తపు చుక్కలే ! అవును ఈ రాత్రే ,ఎన్నికల ముందు రాత్రి. 29-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fz2qL9

Posted by Katta

Sadasri Srimanthula కవిత



by Sadasri Srimanthula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fz2niG

Posted by Katta

29, మార్చి 2014, శనివారం

Ravinder Vilasagaram కవిత

పంచుడు ?????? పంచుడు పంచుడు పంచుడు ఏ వీధిలో చూసినా ఏ ఇంటి ముందు చూసినా ఏ ఇంటి వెనక చూసినా లెక్కలన్ని పక్కగా చేసి, ఆ చిత్రగుప్తునికి కూడా సాధ్యం కాని వేగంతొ యుద్ధప్రాదికంగా ప్రత్యర్థ వ్వూహాల్ని చిత్తు చేస్తూ నిఘానేత్రాల్ని పరిహాసం చేస్తూ దాచిందంతా పంచేస్తున్నారు నిన్నటి దాకా నిండు కుండలా నిగనిగలాడిన పెట్టెలన్నీ రాత్రికి రాత్రి ఖాళీ అయి ఓటర్ల చుట్టు పేదలై తిరుగుతున్నాయి! తెల్లారితే గానీ తెలియదు ఈవీఎం లన్నీ నిండుకుంటాయో లేదో!! ప్రజాస్వామ్యం పరి సమాప్తమవుతుందో కాదో !!! ??????? మార్చి 29, 2014 మున్సిపోల్సు ముందు రాత్రి.

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLHuV7

Posted by Katta

Kavitha Prasad Rallabandi కవిత

Dear Friends! I am sending to u link of "laksha padyarchana" Pl click it. You will get a pro-forma. Pl fill it and submit. That will reach my mail. I will write a poem of your choice and send to ur mail,apart from posting on FB wall. Pl repost if have already requested in any other medium . I am waiting for your poetic requisition.... Yours poetically Dr.Rallabandi Kavithaprasad http://ift.tt/1iLHswr

by Kavitha Prasad Rallabandi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLHswr

Posted by Katta

Keerthana Chocolover కవిత

THE WOMAN IN THE BLACK SARI The woman in the black sari; Is strangely unknown to me; A neighbor of mine; So calm and kind - A tranquil and pleasant lady is she; Her rose petaled shaped lips make me wonder; Is she Aphrodite, who made me surrender, To her beauty filled with serenity? ; The woman in the black sari; Is as strange as is her sari; Wears nothing but black - A stringed cotton blouse Extending to her hands; And a deep U at her back; Revealing her immaculate skin Covering her beautifully chiseled scapula Acclimatizing the beauty of that area. - A jet black chiffon sari Arranged like a meandering river Turned black; The woman in black sari; - whose eccentricity keeps me adhered to her and thoughtful about her age; her hair - a color as deep as her apparel is; the thick mass plaited side wards - falling to her hips ; with the loose knot making - the semi curled curves rest on her wide shoulders; her willowy waist and the navel -conspicuous through the sari which she was never wary of. The woman in black sari; for I may think is married; for the traditional red sticker lies on her forehead; the color in par with the dominating red hue of her lips with the rose adding the effect to her signature style; She walks up to the balcony; reads a book; never noticing my pensive look; my gaze mostly occupied towards the deep rosy lips; the lower one especially so temping and so thick; hours and hours go by; never leaving my state of abeyance ; apparent that she secedes from mutual company The woman in black sari -the only sentence I use to describe her; as she is anonymous; for nobody went to her; for she went to nobody; some say that she's from another state; some say that she doesn't like to affiliate; Some say that she is not permitted to go out anywhere; Which is hard for me to assimilate? The woman in the black sari is strangely unknown to me; a few months later - the house's empty; not a sign of the one who took away my heart along with her; those unfadable memories which will never blur; Some say that she left; Some say that she's dead; Various unthinkable reasons - proving her emigration; The fact which now makes me dread About losing my own self; For having never met her; for which I'm now regretful. -KANNY

by Keerthana Chocolover



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1obFn2o

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి బాధాకరం పువ్వులెక్కడా ఈర్ష్యపడవు అందుకే అవి అంతర్సౌందర్యంతో నిండి ఉంటాయి నక్షత్రాలెక్కడా ఈర్ష్యపడవు అందుకే అవి అందుకోలేని ఎత్తులో మెరుస్తూ ఉంటాయి మనమే మన మనుషులమే ఈర్ష్యపడుతూ ఉంటాం అందుకే మొహాలు వాడిపోతూ ఉంటాయి భగవంతుడు ప్రసాదించిన అద్బుతమైన సౌందర్యాన్ని మన మూర్ఖపు మనసులు పొగుట్టుకుంటూ ఉంటాయి ఎంత బాధాకరం? 29Mar2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k61Jw8

Posted by Katta

Jayashree Naidu కవిత

జయశ్రీ నాయుడు || ఓ వారాంతపు వేళ.. || అతీత అవ్యక్తాల్లో అస్పష్టమైనా అసంగతమైనా ఆ ప్రపంచపు రహదారులే ఓ ఆత్మావకాశ సంభాషణం స్పృశించే గమకాల లయబద్ధ హృదయ సంకోచ వ్యాకోచ స్పందనం ఆనంద విషాద స్పృశ్యాస్పృశ్య సదృశ చిత్రలేఖనం పౌర్ణమినీ నిశ్శబ్ద పోరాటాల నిశీధినీ ప్రకృతి వికృతుల వేర్పాటులో నలిగిన నా సైనిక శ్రేణి రగులున్న క్షణాల సాక్ష్యం చెప్పాలా.... సహనం శాంతి కోసమే... అశాంతి తప్పని సరైనపుడు సంధి అసహనం తోనే మరి! గరుడ గమనాలు హృదయం లో సంధించిన క్షణాలెప్పుడైనా ఎరుకేనా చిద్రమైన కోటలకు హరితవనాల చెంగు కప్పి అరువు చిరునవ్వులే పరిచిన దారులు చూస్తూ మురిసే వేళలొస్తున్నాయి!!!! 29-3-2014

by Jayashree Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QrFfNH

Posted by Katta

Sahir Bharathi కవిత

! School ! .............................. చిన్నిచిన్ని అడుగులతో మొదలైన చదువు శిశువుకి జ్ఞానంతో బరువైన బ్యాగుగా తోడవుతుంది. తడబడుతున్న పాదాలకి నడకని చిత్రీకరిస్తుంది . లోకంలో ఈదుటకు గ్రాంధికజ్ఞానాన్ని వివరిస్తుంది. మనుషులను చదివే కళకు అవసరమైన చిత్రవిచిత్ర సాధనాలను పెంపొందిస్తుంది. ఈరోజు పొట్టకూటికి నన్ను ఏడుసముద్రాలను దాటిస్తుంది. sahir bharati.........#29.3.2014

by Sahir Bharathi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k61IZ7

Posted by Katta

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్//స్తబ్దం// ఇప్పుడు నాకొక మొహం కావాలి నవ్వుతూ ఉండే మొహం లేదూ.... నవ్వుతూ ఉన్నట్టుగా ఒక ముసుగైనా నిస్సహాయ,నిరాశా,నిస్పృహలని దాచి ఉంచే కోటగొడ కావాలి కొన్ని పువ్వులు లేని ఎడారిమొక్కలు కావాలి ఎవ్వరినీ దరిచేరనీయక తమకు తాముగా బతికే రక్కిసపొదల కంచె కావాలి ఎవరిస్తారు స్వచ్చమైన నా నవ్వుని నాకు వాడిపోని పచ్చి గాయం లాంటి నా జీవితాన్ని చీము,నెత్తురుతో నిండి పసి హృదయం లా సున్నితంగా ఉండే ఒక నవ్వుని ఎవరైనా ఉమ్మేయండి తడారి పోయి పగుళ్ళిచ్చిన గుండె మెత్తబడేలా... ఆకలినీ,అంతులేని ధుక్ఖాన్నీ దాచిన ఆ గది తలుపునీ తెరిచి నన్ను మళ్ళీ ఆ పురిటి రక్తం లోకి విసిరేయండి ప్లాస్టిక్ పువ్వుల ప్రపంచం నుండి అనంతానంత ఇసుక దారుల్లో పాదపు గుర్తుల్నిండిన ఎడారుల్లోకి నాకిప్పుడు ఒక వెచ్చని రక్తపు చారిక వంటి మెరుపు కలిగిన నవ్వు కావాలి లేదూ... విరిగి పడి ప్రవహించే మంచు గడ్డ లాంటి జీవితమైనా సరే నా దోసిట్లో వొంపండెవరైనా ఒక్క జిగురు నవ్వుని... లేదూ మనస్సు నిండా నిశ్శబ్ద శూన్యమైనా సరే... 29/03/2014

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jHBbp6

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//నాగరికత// లంకల్లో బాడవాల్లో, రైలు పట్టాలెంబడి తుమ్మముల్లు కాలినిండా గుచ్చుకున్నా రక్తాలోడినా ఒక్క జ్ణాపకమూ గాయమై తరమని రోజులవి.... నాకు తెలుసు ఇప్పుడున్నది నగరం నడిరోడ్డుమీద వదిలేసే నైజం చిన్నప్పుడు బోదెల్లో నెరళ్ళలో బురదలో, దుమ్ములో చిందులేసిన అవేపాదాలు మండుతున్న సూరీడు సిమెంటు పోసిన వేడి రహదారి అరికాళ్ళ బొబ్బలకన్నా మాటలే కటువు ఈ నగరంలో... ఇది నగరం సోదరా! మనుషులకోసం ఇక్కడ వెదక్కు...26.03.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dDIfjS

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష || Sometimes - Sheenagh Pugh ------------------------------------------------------ Sometimes things don’t go, after all, from bad to worse. Some years, muscadel faces down frost; green thrives; the crops don’t fail. Sometimes a man aims high, and all goes well. A people sometimes will step back from war, elect an honest man, decide they care enough, that they can’t leave some stranger poor. Some men become what they were born for. Sometimes our best intentions do not go amiss; sometimes we do as we meant to. The sun will sometimes melt a field of sorrow that seemed hard frozen; may it happen for you. శ్రీశ్రీ రచించిన ఒక గీతం "అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని..." అంటూ సాగుతుంది. 2003 లో తొలిసారి ఈ కవిత చదివితే అదే భావన కలిగింది. ఈ కవితకి మరొక కొసమెరుపు కలపాలి: క్లుప్తంగా 'sometimes we fall short and fail, other times we will find deep inside the courage that hids' అనే సందేశాన్ని పంచే ఈ కవిత తొలిసారిగా (కవి మాటల్లో) "It was originally written about a sportsman who had a drug problem and it expressed the hope that he might eventually get over it - because things do go right sometimes, but not very often... " ఉనికిని సంతరించుకుంది. కానీ, క్రమేణా దీనికి political గా కొంత ప్రాముఖ్యత రావటం, పైగా ఎందరో clinically depressed people దీన్నుంచి ప్రేరణ పొందారనటం ఆమెని బాధించిందని తన మాటల్లోనే తెలుస్తుంది (క్రిందన కలిపిన వ్యాఖ్యలో మరి కొంత). నాకు వెంటనే గుర్తుకు వచ్చే మరొక కవితా పాదం I hold it true, whate'er befall; I feel it when I sorrow most; 'Tis better to have loved and lost Than never to have loved at all. - In Memoriam A.H.H., Alfred, Lord Tennyson The last two lines are usually taken as offering a meditation on the dissolution of a romantic relationship. However the lines originally referred to the death of the poet's beloved friend. పాఠకులు రచయితలు ఎంత వేరుగా ఊహించగలరు, స్వీకరించగలరు అనేందుకు ఒక మంచి ఉదాహరణలు ఈ 2 కవితలు. 29/03/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h5XL31

Posted by Katta

Sita Ram కవిత

♪♫☼బుల్లి☼♫♪ నాగుండెగూటిని విడిచి పోయినా నాహృదయ కోవెలలో నీ ప్రేమజ్యోతి ఎన్ని యుగాలైనా వెలుగుతూనే ఉంటుంది. పుర్ణమి జాబిలి వెన్నెలలా నామదిలో వెలుగుని పంచిన నీవు నాస్వాశలో ప్రణయ పారిజాతమై ఎల్లప్పుడూ పరిమళిస్తూనే ఉంటావు మొదటిసారి నిన్ను కలిసిన తరుణం నీకాలి అందెల చప్పుడు నేటికీ నామదిలో మార్మోగుతూనే ఉంది నానుండి నీవు వెళ్ళిపోయినా నిన్ను కలలోనైనా చూడటానికి నాఆశలనే రెక్కలుగా చేసి నాఊపిరినే నీ నిశ్వాశలా మలిచి నీలో ఒదిగుండాలని ఉంది ప్రియతమా 29.మార్చి.2014

by Sita Ram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hl3S7Y

Posted by Katta

Abd Wahed కవిత

సాంప్రదాయికంగా గజల్ కు ఉన్న ’’ప్రేయసితో సంభాషణ‘‘ అన్నఅర్ధానికి అనుగుణంగా ఒకే రదీఫ్ ఖాఫియాలతో వీలయినన్ని షేర్లను, ఒక సుదీర్ఘ గజల్ గా తెలుగులో రాస్తే... ఈ ప్రయోగం ఎలా ఉందో పాఠకులే చెప్పాలి. ఐదవ విడత ఐదు షేర్లను ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. ఇప్పటికి ఇరవై షేర్లు అయ్యాయి. పదహారవ షేర్గా రాసిన రెండో మత్లాను మళ్ళీ పోస్టు చేస్తున్నాను. మత్లాతో కలిపి చదివితేనే గజల్ అందం. గజల్లో ప్రతి షేర్ దానికదే స్వతంత్రంగా ఉంటుంది, కాబట్టి ఇలా ఒక యాభై లేదా వంద వరకు షేర్లు రాయాలన్నది ఆలోచన. ఈ ప్రయత్నం ఎలా ఉందో చెప్పడం మరిచిపోవద్దు.. ప్రతిమాట తేటతెనుగు తీయదనము లాగున్నది ప్రతి శ్వాస సన్నజాజి పూలవనము లాగున్నది తాకినంత పులకరించె తోటలోని పూలన్నీ పూల చెండు లాంటి చేతి లాలిత్యము లాగున్నది మెరుపుతీగ భుజాలపై వాలుతున్న నీలికురులు పూలసజ్జపై తుమ్మెద ఝుంకారము లాగున్నది కనుపాపల తెరలపైన వాలుతున్న నగుమోమూ కనుచూపే గీసుకున్న దియ చిత్రము లాగున్నది నాజూగ్గా పెదవి విరుపు, కవ్వించే కంటినవ్వు ఎడారిలో ఒయాసిస్సు పలకరింపు లాగున్నది కలువరేకు పాదాలను చూపులతో ముద్దాడితె కావ్యకన్య చరణాలకు నమస్సుమము లాగున్నది

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iKZcrQ

Posted by Katta

Srinivas Reddy Paaruvella కవిత

నిరీక్షణ || పారువెల్ల వాకిట్లో ఎదురుచూపులు పరచబడివున్నా నోట్లోనే నాలుక ముడుచుకొని పడుకోవచ్చు మాట్లాడేందుకు ఇంకేదీ మిగలక పోవచ్చు ప్రాణం పోస్తున్న గాయాలను పదే పదే పలకరిస్తున్న కన్నీళ్లను దగ్గరగా మరింత దగ్గరగా కౌగిలించుకున్నాక రెండు గుండెల నడుమ చోటు దొరకక ఖాళీతనం కాసేపు దిగులుపడుతుంది జ్ఞాపకాలను ఆరేసుకున్న దండెం మౌనాన్ని విడిచి అమృతం కురిపిస్తుంది. దాచుకునవన్నీ చెరిసగం పంచుకోవడం పంచుకున్నవన్నీ పదిలంగా దాచుకోవడం వేయి కన్నుల నిరీక్షణకు వేదమవుతుంది 29-03-2014

by Srinivas Reddy Paaruvella



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hl3RAX

Posted by Katta

కాశి రాజు కవిత

ఈ మధ్య కొప్పర్తి రమణ మూర్తి గారి పుస్తకం "యాభై ఏళ్ల వాన "విడులయింది. చదవాల్సిన కవిత్వం మీకు వీలయితే చదవండి .....

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hl3OoW

Posted by Katta

Naveen Kumar Gadari కవిత

|| నా చిన్నప్పుడు - 1 || నవీన్ కుమార్ గాదరి || తేది : 29-మార్చి- 2014 1) నేను చిన్నగున్నప్పుడు అరికట్నం కట్టుకొని పొద్దుగాల నాలుగ్గంటలకే లేశి నరేష్ గాన్ని, దస్తగిరి గాన్ని, ఎడ్డి రాజు గాన్నీ లేపుకొచ్చి సాయిలు మామ బర్రె కాడి గడ్డాం (గడ్డి వాము) ల నుంచి గింత గడ్డి గుంజుకచ్చి, ఆ పుల్ల ఈపుల్లా పోగేసి, పొగేసి, మంటపెట్టుకొని సలి కాగుకుంట తెల్లారెదాక కూసునేది..!! 2) తెల్లారగట్ల ఆరుగంట్లకు దస్తగిరిగాడు పటేండ్లిల్లకు పాలు తేనీకి పోయేటోడు వాడు పోంగనే, వాని పోరి గురించో లేక వాని పొలం గురించో మాట్లాడుకునేది...!! 3) ఏడుగంట్లకల్లా మంట కాంచి లేశి ఎడ్డి రాజు గానొల్ల యాప చెట్టెక్కి పండ్ల పుల్లలు ఇరుసుకొనేది పది గంట్ల దాకా పండ్లు తోముకొనేది ఎవని పుల్ల ఎక్కువ అరిగితే వాడు గొప్ప..!! 4) అట్ల పండ్లు తోముకుంట మా ఊరి రాం శెర్వుకో లేక చెరువు పక్కనే ఉన్న కర్ణాల బాయిలకో ఈతకు బోయేది నాకు ఈత రాదంటే, నేను నేర్పిస్తానని నరేష్ గాడు నన్నెత్తుకొని కండల వీరునిలా ఫోజిస్తూ బాయిలకు దుమికేటోడు..!! అప్పుడు మాకు ఆ కర్ణాల బాయే ఓ 'బాత్ టబ్ ' ఆ బాయి పక్కనే ఉన్న పొలాలల్లున్న బంకమన్నే మాకు 'డవ్ సోపు '...!! 5) అక్కన్నుంచి సక్కగ గౌండ్ల శీనన్న దగ్గరికి పోయి సల్లగ రొండు బుడ్ల తాటి కల్లు తాగి నాలుగు తాటి ముంజలు తిని సక్కగ ఇంటి బాట పట్టేది..!! 6) ఒస్తొస్త నారాయణ రెడ్డి పటేల్ మామిడి తోట్ల పడి మా చేతికందిన మామిడి కాయలు తెంపుకొని ఎవలు సూడక ముందే దబ్బదబ్బ ఉరుక్కుంటచ్చి ఊరి పొలిమేర్ల ఉన్న తాతమ్మ గుడిసెలకు పోయి ఆ కాయలు కోసి.. ఉప్పూ, కారం తెచ్చి, వాటికి అద్దుకొని తినేది... అబ్బబ్బ.. ఆ రుచే వేరు..!! ఖతం.. మా బ్రేక్ ఫాస్ట్ అయిపోయేది...!!!

by Naveen Kumar Gadari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f4sbX7

Posted by Katta