పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Vakkalanka Vaseera లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Vakkalanka Vaseera లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, మార్చి 2014, ఆదివారం

Vakkalanka Vaseera కవిత

పిడికెడు అన్నం, రొట్టిముక్కా... కొన్ని కొడవళ్లని, కొన్ని నాగళ్లని కొన్ని పొలాలని, కొన్ని గ్రామాలని కొన్ని గుడిశెల్ని, కొన్ని మేడల్ని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్కా కడుపులో దాచుకున్నాయి కొన్ని పిడికిళ్లని, కొన్ని నినాదాల్ని కొన్ని పోలింగ్‍బూత్‍లని, కొన్ని తుపాకుల్ని కొన్ని అణుబాంబుల్ని, కొన్ని అడవుల్ని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్కా కడుపులో దాచుకున్నాయి కొంత రక్తాన్ని, కొంత క్రూరత్వాన్ని కొంత ద్వేషాన్ని, కొంత కారుణ్యాన్ని కొంత చీకటిని, కొంత కాంతిని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్కా కడుపులో దాచుకున్నాయి కొన్ని ప్రవాహాల నీటిని కొన్ని కార్చిచ్చుల అగ్నిని కొన్ని శ్వాసల ప్రాణవాయువుల్ని కొన్ని దృశ్యాలని, కొంత నిద్రని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్క కడుపులో దాచుకున్నాయి కొన్ని కలల్ని, కొన్ని కోరికల్ని కొంత సంతోషాన్ని, కొంత దు:ఖాన్ని కొన్ని రోజుల్ని కొన్ని శబ్దాలని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్క కడుపులో దాచుకున్నాయి కొందరు అమ్మల్ని, కొందరు నాన్నల్ని కొందరు పూర్వికుల్ని, కొందరు నరుల్ని కొందరు గ్రామ దేవతల్ని, కొందరు కులదేవతల్ని, కొన్ని వర్షాలని, కొన్ని యజ్ఞాలని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్క కడుపులో దాచుకున్నాయి మరకల్లేని మనసులతో సృష్టికర్త ప్రసాదంగా పిడికెడు అన్నం, చిన్న రొట్టి ముక్కా ఇచ్చినా పుచ్చుకున్నా, కాలం కొమ్మలు చాచి కాలిబాటనిండా పూల వనాల నీడల్ని అనుగ్రహించదా? కాలం చేయెత్తి దీవించి మానవీయ జీవితానికి దివ్యసుగంధాలు అనుగ్రహించదా? - వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hnvQ2S

Posted by Katta

25, మార్చి 2014, మంగళవారం

Vakkalanka Vaseera కవిత

. 80వ ద‌శ‌కంలో రాపజ‌మండ్రిలో సాహితీ వేదిక అనే ఓ సంస్థ ఉండేది. దానివ్య‌స్థాప‌క స‌భ్య‌ల్లో మ‌హేష్ ఒక‌రు. ఇది చ‌క్రాల వెంక‌ట సుబ్బు మ‌హేష్ అనే ఓ సాహితీ మిత్రునితో నా అనుబంధం గురించి. స‌హితీ వేదిక‌తోనూ దానిలోని మిత్ర‌బృందం తో అనుబంధం నాకు క‌విత్జీవ జీవితానుభ‌వాన్నిచ్చింది. ప‌దిరోజుల క్రితం సెల‌వంటూ శాశ్వ‌తంగా వెళ్లిపోయిన మ‌హేష్‌కు నివాళుల‌ర్పిస్తూ రాసిన జ్ఞాప‌కం ఇది. మనుషుల్లోని కవిత్వాన్ని ప్రేమించిన మహేష్‍ అతడికి కవిత్వం ఇష్టం. కవిత్వం కంటే కూడా మనుషుల్లో ఉండే కవిత్వం ఇష్టం. అతడు తన గురించి మర్చిపోయి మనుషుల్ని ప్రేమించాడు. సొంత జీవితం గురించి మర్చిపోయి జీవితాన్ని ప్రేమించాడు. రాజమండ్రి గోదావరి తీరం అతడి అర్తికి తగిన జీవితాన్నిచ్చింది. కాళ్లు తడవ కుండా సముద్రాల్ని దాటిన మేధావి కూడా కళ్లు తడవ కుండా జీవితాన్ని దాటలేడు రాజమిండ్రిలో పేపర్‍మిల్లులో పనిచేసే చక్రాల వెంటక సుబ్బు మహేశ్వర్‍కి వాళ్ల సోదరి ఉత్తరాలు రాసేది. ఓ ఉత్తరంలో ఇది రాసిన కవి పేరుతో సహా ఉంది. అలా నా పేరు మహేష్‍కి పరిచయం. కానీ నన్నెప్పుడూ చూడలేదు. మహేష్‍అనేవాడొకడున్నాడని అతడు తర్వాత కాలంలో నాకు సోదరుడు కాగలడని నాకు కూడా తెలియదు. ఓ సారి మా అన్నయ్య శ్రీ వక్కలంక వెంకట ప్రకాశరావుగారి కోసం పేపర్‍మిల్లుకి వెళ్లాను. ఆయన నన్ను మహేష్‍దగ్గరికి తీసుకెళ్లి వీడు మా తమ్ముడు. ఏవో కవితలు గట్రా రాస్తుంటాడు అని పరిచయం చేశాడు. అప్పుడు నా వయసు 18 ఏళ్లు కావచ్చు. మహేష్‍చాలా స్టె••ల్‌గా ..సేఫ్టీ ఆఫీసర్‍దర్పం ఒలకబోస్తూ ‘‘ ఏం పేరు’’అన్నాడు. ‘‘వసీరా’’ అన్నాను. ఒక్కసారిగా నమ్మలేనట్టు చూశాడు. ఆ తర్వాత ‘‘అహ్హహ్హ హ్హహ్హ హ్హా’’ అంటూ మనస్ఫూర్తిగా నవ్వేశాడు. వసీరా అంటే ఎవడో వృద్ధుడు అనుకున్నాను. ఇంత గుంటడవి అంత వేదాంతం ఎలా రాశావు. అని మరోసారి నవ్వేడు. అది నాకూ మహేష్‍కి మొదటి పరిచయం. తర్వాత మరో రెండేళ్లకి నేను మెడిక••ల్‌ రిప్రజెంటేటివ్‍గా రాజమండ్రి వచ్చాను. మహేష్‍ద్వారా సుబ్బు , ఎరాప్రగడ దంపతులు, భద్రుడు సావిత్రిగారూ ఇలా సాహితీ వేదికలో అందరూ స్నేహితులయ్యారు. వీళ్ల ద్వారా నాకు ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. నిజం చెప్పాలంటే మహేష్‍, భద్రుడూ ,గోపీచంద్‍వీరి ముగ్గురికీ సాహిత్యం పట్ల జీవితం పట్లా ఒక విధమైన మెచ్యూరిటీ ఉండేది. ప్లూరాలిటీని గౌరవించి కలుపుకునే మంచి సంస్కారం వీళ్లకి అంత చిన్న వయసులోనే ఎలా సాధ్యమో నాకు అర్థమయ్యేది కాదు. నిజం చెప్పాలంటే నాకు అప్పుడు అంత మంచి సంస్కారం లేదు. సాహితీ వేదికలో రకరకాల భావజాలం గల కవులు కథకులు విమర్శకులు ఉండేవారు. నాకు గుర్తున్నంత వరకూ నేనూ సావిత్రిగారూ మార్క్సిస్టు భావజాలం గల వాళ్లం. సాహితీ వేదికలో మార్కిస్టు భావజాలంతో రాసిన కవిత్వమైనా మరే కవిత్వమైనా అందులో కవిత్వం ఉందా లేదా అనేది ముఖ్యం. అలంకారాలు కాదు. వేదన, మానవీయ స్పర్శ, జీవితం ఇవి ముఖ్యం. నినాద ప్రాయంగా రాస్తే అస్సలు ఒప్పుకునే వారు కాదు. చీల్చి చెండాడే వారు. . పొయెట్రీలో ఏ మాత్రం తడి ఉన్నా ఇక ఆ కవితల్ని నెత్తిన పెట్టుకుని మరీ పలవరిస్తూ ఉండేవారు. సాహితీ వేదిక కవితా సంకలనానికి ‘ఆర్కెస్టా•’ అని పేరు పెట్టడానికి కూడా కారణం ఇదే. భిన్నస్వరాల ఏకత్వంలోని సింఫనీయే సాహితీ వేదిక అని చెప్పడమే. మహేష్‍ది అశాంతీ వేదనా పలికే తాత్విక స్వరం .. అతడి లైఫ్‍స్టె••ల్‌ ....కూడా అలాగే అశాంతిమయంగా అరాచమైన అన్వేషణాభరితంగా ఉండేది. సైద్ధాంతిక గ్రంధాలు సామూహిక జీవితాన్ని అర్థం చేసుకునే సాధనాలు మాత్రమేనని, జీవితం ఈ సాధనాలకంటే బలమయినదని మహేష్‍నమ్మేవాడు. వేదనా భరితమైన అశాంతి దానినుండి ఏదో తెలియని అన్వేషణా అతడి లోలోపల ఎప్పుడూ అట్టుడుకుతూ ఉండేది. అందుకే అతడి ఫేవరెట్స్ డాస్టోవిస్కీ, బైరాగి, అజంతా, కాఫ్కా, బసవరాజు అప్పారావు. కవికొండల వెంకటరావు.. వేస్ట్ ల్యాండ్‍ఇలియట్‍...జెన్‌హైకూ కవుల్లో ఇస్సా...తిట్లూ తన్నులూ తినే పిల్లాణి చూసి కూడా అతడు అసూయ పడతాడు. అనాథ అనే హైకూని మహేష్‌తరచూ చెప్పేవాడు.. ఇలా వేదనా భరితమైన జీవితవాస్తవాలు చెప్పే కవులెప్పుడూ అతడిని వేధిస్తూ... తడిగా ఉంచేవారు. మల్లయ్యపేటలోని తన బ్రహ్మచారి క్వార్టర్స్‌లో జపనీస్‌హైకూల పుస్తకాలు ఉండేవి. వాటిని సగర్వంగా ప్రదర్శించేవాడు. చదివి విన్పించేవాడు. రాలిన పువ్వు తిరిగి కొమ్మని చేరింది సీతాకోక చిలుక. బహుశ ఈ వాతావరణమేనేమో. నేను నంది వర్థనం చెట్టు వంటి కవితలు రాయడానికి దారితీసింది. ఆ కాలంలో బహుశా మా మిత్ర బృందంలో ఇంకెవరి దగ్గరా అంతగా కన్పించని ఇంకో టాలెంట్‍ కేవలం అతడికి మాత్రమే ఉంది. అదేమంటే ఇటువంటి అశాంతిని వ్యక్తం చెయ్యలేక లోలోన కుతకుత లాడే తన లాంటి వాళ్లని గుర్తించడం. వారి పట్ల కంపాషియన్‍. సహానుభూతి. పరాయీకరణ, ప్రేమరాహిత్యం, మానవ సంబంధాల డొల్లతనం నుండి వచ్చే ఈ అశాంతి గురించి సిద్ధాంతాలు వల్లించే వారిలోనూ , కవిత్వాలు రాసే వారిలోనూ కూడా ఈ విధమైన కంపాషియన్‍చాలా అరుదు. నేను మానవ సంబంధాల కంటే కూడా కవిత్వం చాలా గొప్పదనే భ్రమలో ఉండేవాడిని. మానవ సంబంధాల దగ్గరకొచ్చే సరికి మహేష్‍ కవిత్వం కంటే ఎక్కువ వాల్యూ ఇచ్చేవాడు. ప్రేమరాహిత్యం, మానవ సంబంధాల్లో మానవత్వం లేకపోవడం అతడిని ఎంతగానో బాధించేవి. అందుకే అతడు ఎవరి భావజాలాలు ఎటువంటివి?. ఎవరి అభిప్రాయాలు ఎటువంటివి? అనే ప్రశ్నే లేకుండా అందర్నీ అన్‍కండిషన••ల్‌గా మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు. కుప్పలి పద్మ, శకుంతల ,సావిత్రిగారు. తమ్ముడు, మరియు తమ్మడి తమ్ముడు, ఎర్రాప్రగడ ఇలా ఒకరిద్దరని కాదు స్నేహితులందరి సమస్యల్లో కష్టాల్లో పాలుపంచుకునేవాడు. అలాగే అతగాడికి వయో బేధం కూడా లేదు. పెద్దలతో పిల్లతో కలగలిసిపోయే వాడు. గంధం సీతారామాంజనేయులు గారు అతడిని కొడుకుగా భావించేవారు. శరభేశ్వర శర్మగారు కూడా అతడిని ఎంతగానో ఇష్టపడేవారు. 1984లో మా నాన్నగారు పోయినప్పుడు నా గురించి తెగవర్రీ అయినవాడు మహేష్‍. వసీరాది ససిపిల్లాడి మస్తత్వం వాడి గుండె పగిలిపోయి ఉంటుంది. ఎలా తట్టుకున్నాడో ఏంటో అనుకుంటూ సుబ్రహ్మణ్యంనీ, ఎర్రాప్రగడనీ కూడా బయలు దేరదీసి అమలాపురం వచ్చాడు. నేను ఓ చిన్నపిల్లాడితో ఆడుకుంటూ ఉండటం చూసి వీడు నిజంగా పసివాడే అని కంటనీరు పెట్టుకున్నాడు. అవునురా ‘‘నువ్వు దుఃఖాన్ని గడగడా తాగి భగభగా నవ్వగలవు’’. నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అంటూ వెళ్లిపోయాడు. ఇదంతా ఎందుకంటే అతడికి కవిత్వం ఇష్టం. కవిత్వం కంటే కూడా మనుషులు చాలా చాలా ఎక్కువ ఇష్టం అని చెప్పడానికే. మహేష్‍రంగస్థల నటుడు కూడా. రామనాధంగారి నాటకాల్లోనూ ,కొప్పర్తి అమరలింగేశ్వర రావుగారి నాటకాల్లోనూ కూడా అతడు నటించేవాడు. ఎన్‍.ఆర్‍నంది రాసిన మరోమహోంజదారోలోనూ మహేష్‍నటించినట్లు గుర్తు. భద్రుడు రాసిన స్వాతంత్యోద్యమ శంఖారావం నాటకంలో అతడు రాసిన పాటలు నాకు కంఠతా వచ్చేవి. ఎందుకంటే ఆ నాటకంలో నేను గాంధీ వేషధారిని. దండికడలి తీరంలో స్వేచ్చోదయం అవుతోంది..తెల్లవాడి పాలన ఇక అస్తమించబోతోంది అంటూ రవి అస్తమించని బ్రిటిష్‍సామ్రాజ్యం ఏ స్వేచ్చోదయంతో అస్తమిస్తోందో చాలా సింపు••ల్‌గా తేట పదాలతో అద్భుతంగా రాశాడు. ‘‘సామ్రాజ్యవాది మందు గుండు ఉప్పు ముందు చిత్తురా. స్వేచ్చమీద ఇచ్చనేడు ఉప్పు రూపు దాల్చెరా అని రాశాడు. నన్నయ భారత రచన నాటకం కోసం అతడు ఎంతో రీసెర్చి చేశాడు. పూజ్యులు శ్రీమల్లంపల్లి శరభేశ్వర శర్మగారి దగ్గరికి రోజూ వెళ్లి నన్నయ సారస్వత రహస్యాలను గురించి చర్చించేవాడు. అంతటి హోవంర్క్ చేసే అధ్యయన శీలి మషేష్‍. ఈ నాటకం ముగింపులో పాట నిజానికి నాటకానికే హైలైట్‍. గోదారి తీరాన నన్నయ నుండి మొదలైన తెలుగు కవితా ప్రవాహం ఎన్ని రకాలుగా పరిమాణం చెంది, ఎన్నిముఖాలుగా వికసించిందీ ఆ పాటలో రాశాడు. తెలుగు కవిత్వం పరిణామం చెందుతూ ఈ నాటకం రాసేనాటికి చెరబండరాజు విప్లవ కవిత్వ దశకు వచ్చిందని , ఆఖరి చరణంలో చెరబండరాజుకు లా••ల్‌ సలామ్‍చెప్తూ పాటముగించాడు. నన్నయ నాటకాన్ని చెరబండ రాజుతో ముగించడం బహుశ టి.జె.రామనాధం గారికీ ...మహేష్‍కే చెల్లు. మిత్రమా మహేష్‍నువ్వు రాజమండ్రిలో ఉన్నా, సూళ్లూరుపేటలో ఉన్నా ...ఇంకోలోకంలో ఉన్నా ...నువ్వెక్కడున్నా సుఖశాంతులతో ఉండాలని పరమ శాంతి స్వరూపుడు శాంతిదాత అయిన భగవంతుని ప్రార్థిస్తాను. వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OUsSbA

Posted by Katta

18, మార్చి 2014, మంగళవారం

Vakkalanka Vaseera కవిత

సీమంతం నిన్నటివరకూ వీడు తెల్లవారు జామునే నా పక్కలో చేరేవాడు డొక్కలో దూరి కాళ్లు ముడుచుకుని మరీ వెచ్చగా పడుకునే వాడు రోజూ వీడికంటే ముందుగా నేనే నిద్రలేచేదాన్ని వీడిని ఎంతలేపినా ఆ దుప్పటి తీసి ఓ అంతట తల బయటపెట్టేవాడు కాదు రెండు చెవుల్లో సింధూర మందారాలు పెట్టుకుని వాటి మధ్యలోంచి బద్ధకంగా ఓ చిరునవ్వు విసిరి మళ్లీ ముసుగేసేవాడు నిజం చెప్పాలంటే రోజంతా ముసుగులోంచే ఓరగా చూస్తూ మొత్తగా నవ్వుతూ ఆడేవాడు అమ్మ వీడి బుగ్గ గిల్లి బహుశ దక్షిణంవైపు ఒత్తిగిలేలా పడుకోబెట్టినట్టుంది అంతే వీడికేదో అయ్యింది నాకంటే ముందే నిద్రలేస్తున్నాడు. నేను లేచేసరికే ఎర్రటి కళ్లతో చురుక్కున చూస్తున్నాడు వీడో చిత్రకారుడనే సంగతి నాకసలు తెలియనే తెలియదు ఆకుల్లో దూరి రంగులు మార్చేస్తున్నాడు ఆకుపచ్చ పసుపు ఎరుపు రంగుల్ని ఎన్ని రకాలుగా కలిపి ఎన్ని కొత్త ఛాయలు సృష్టించ వచ్చో చూపిస్తున్నాడు ఒక్కో ఆకుమీదా రెండు రంగుల్లోనే వంద రకాల వర్ణక్రీడల నీడలు చూపిస్తున్నాడు మెజీషియన్లాు కొమ్మల్లోకి మునివేళ్లు దూర్చి నీటిగదుల్లో నిద్రపోయే చిగురులని బైటికి లాగుతున్నాడు చిగురుటాకుల బుగ్గలమీది కొత్తరంగుల్ని తన ఇష్టానుసారం దిద్దుతున్నాడు వీడికేమయ్యిందో తెలియదు ఒక్క ఆకు కూడా లేకుండా ఎండి రాలిపోతాయనుకున్న కొమ్మలకి సకల వర్ణాలతో విరగబూస్తున్నాడు వీడితో పాటు మంచులో సుప్తమైన సమస్త వర్ణమయ తేజస్సులనీ పూలలోంచి పలికిస్తున్నాడు పూలగాజులు తొడిగిన కొమ్మల చేతుల్లోని చేటలనిండా రంగుల్ని నింపి దిక్కుల చివరిదాకా తూర్పార బడుతున్నాడు ఎప్పుడో తెలియదుగానీ చూస్తూ చూస్తుండగానే మొత్తంచెట్టునే ఓ అతిపెద్ద పూలగుత్తిగా మార్చాడు నా ఇంట్లో చెట్లనీ నా వీధిలో చెట్లనీ నా ఊర్లో చెట్లనీ పూనకంలా పట్టుకున్నాడు గాలిలో కనిపించని పూనకంలా ఊయలూగుతూ రంగుల తరంగాలై కేరింతలు కొడుతున్నాడు అక్కడితో ఆగలేదు ఈ అబ్బురాల చమత్కారుడు అడవిమీద పడ్డాడు తన భుజం మీది అంగీలా పర్వతాలు మీద మండు టెండని పరిచేశాడు రంగులుమారి ఎండి రాలే ఆకుల్ని మూటకట్టుకుంటూనే అడవంతా గుట్టలు గుట్టలుగా రంగుల ద్వీపాలను నింపేశాడు. ఒళ్లంతా పుప్పొళ్ల వసంతం చల్లుకుని నానా వర్ణమయ ద్వీపాల మీది సుగంధాల్లో ఎండ రెక్కలు విప్పి ఏకాకిగా ఎగురుతున్నాడు అనంతంలో కొత్త శక్తులతో వికసించిన అగ్నిపుష్పాన్ని తురుముకుని పుడమి తల్లి కొత్తజీవంతో పులకించడం పుడమికి సీమంతంలో వసంతం ఇదేనా!!! ఇదేనా!!! ఇల్లిదేనా!!! వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iYxg73

Posted by Katta

15, మార్చి 2014, శనివారం

Vakkalanka Vaseera కవిత

తీపి ఏకంగా తీయని గోళాన్నే ధరించి ఓ చిన్ని గింజ ద్రాక్ష పండులో కూర్చుంది కాంతి సంవత్సరాలకు ఆవలినుండి ద్రాక్షపండు హృదయంలోకి ఏ తీయదనం ప్రవహించిందో? ఏ తీయని స్పర్శకి ఆకుపచ్చని తీగల్లో జలతరంగిణి మోగి తీయని సంగీతం పండంతా నిండిపోయిందో ఏ తీయదనం వల్ల పండు తన గుండెల్లో గింజని దాచుకుందో? పర్వతాలు నదులు సముద్రాలతో వెలుగు చీకట్ల దోబూచుల్లో వాయుదారాల కల్నేతలో దిగంబరాలను అలకరించుకున్న భూగోళం బహుశ భూగోళం అట్టడుగు మట్టంలోని ఓ సరస్సులోపల కూడా ఓ బీజం ఎక్కడో మహాకాశంలో మండే మహాగోళం నుంచి తీయదనం కాంతిగా మారిపోయి కాంతిసంవత్సరలను దాటుకుంటూ నీటిలోకి సైతం దూకి అట్టడుగున ఉన్న బీజాన్ని ముద్దాడటం ఏ తీయదనం? నీటిలోని కాంతి నిర్మల సౌందర్యమై ఆకుపచ్చని అరచేతులు విప్పి హృదయ కమలమై అరవిచ్చి ఆకాశాన్ని ఆహ్వానించడం ఏ తీయదనపు మహాత్యం అన్నిటి కంటే తీయనిది కడుపు తీపి ఆ తీపి అమ్మచూపులో ప్రసరిస్తుంది ఆ తీపి అమ్మ స్పర్శలో ప్రసరిస్తుంది ఆ తీపే కమలాసనం మీద తేనె సరస్సులో రెక్కలల్లార్చుతూ వాలిన నక్షత్ర సంగీతం నుండి కూడా ప్రసరించేది ఎందుకో? ఎందుకో? ఎందుకో ? ఎవరి నిష్కారణ అవ్యాజ కరుణ వల్లనో!!! -----------వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m68KBl

Posted by Katta

14, మార్చి 2014, శుక్రవారం

Vakkalanka Vaseera కవిత

నీ కోసమే! మంచు బిందువు చేతులు చాచింది మట్టిలోపలికి వెళ్లిన వట్టివేరు సైతం చేతులు చాచింది ఆకుపచ్చని గడ్డిపరకై మహావృక్షాలలోని ప్రాణశక్తి నీ కోసం పత్రం, పుష్పం, ఫలం చాచాయి భూగోళ అండం మధ్య సొనగా విస్తరించిన అదృశ్య జలమైదానంలో బహుశ నీ తరంగ నాదాలే వేర్లుగా భూతలం మీది శబ్దాలు చేతులు చాచాయి మహా శూన్యంలోని మెత్తటి పొత్తిళ్లలో ఒత్తిగిలి ఉత్తర దక్షిణాల మధ్య ప్రాక్‍ పశ్చిమాల మధ్య తూగే నీ ఉయ్యాలలో ఊగుతూనే నీ ఉయ్యాలను ఊపడానికి మంచు బిందువు చేతులు చాచింది మెత్తటి మేఘమై పోయి వట్టివేరు చేతులు చాచింది ఆకుపచ్చని గడ్డి పరకై చేతులు చాచింది విశ్వజనని తొలిఆనందాశృవు నీ ఊయలై వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ghp0an

Posted by Katta

4, మార్చి 2014, మంగళవారం

Vakkalanka Vaseera కవిత

ఏపాట నే పాడ‌ను కొల‌త‌లు లేని న‌ల్ల‌ని కాలం కాళ్ల‌నుంచే మొద‌లు కొల‌త‌ల కంద‌ని తెల్ల‌ని నీడ‌లు బ‌హుశ దిగంతాల దాకా న‌ల్ల‌ని కాల‌మూ తెల్ల‌ని నీడ‌లూ జ‌ల‌కాలాడి సృష్టించిన ఆకుప‌చ్చ‌ని స్వ‌ప్నం నిజానికి స్వ‌ప్నం కాదు.... ఓ జీవితం ...కాదు ఓ ప్ర‌పంచం!! ప‌చ్చ‌ల జ‌ల‌కాంతిలో ఎగిరే నీరు త‌ప్ప‌ క‌న్నీరు లేని జీవితంలో కాలాన్ని ధిక్క‌రిస్తూ గ‌డ్డిపోచ లోల‌కం మీద ఊయ‌ల ఊగే ప్ర‌పంచం క‌ప్ప, గ‌డ్డి, మిడ‌త, తూనీగా .. ఎవ‌రైనా ఆకుప‌చ్చ‌ని ఆర్ద్ర‌నిశ్శ‌బ్దాన్ని శృతిచేసి గ‌డ్డిపోచ లోల‌కం ల‌య‌లో ఆల‌పిస్తే? అది న‌ల్ల‌ని మేఘాల‌ పాట‌ విద్యుల్ల‌త‌ల చుట్టూ మొరిసే కాంతి పాట‌ అది నానావ‌ర్ణాల‌తో కులికే భూమి పాట‌ అది స‌మ‌స్త‌వ‌ర్ణాల‌నూ కొత్త‌రంగుల్లోకి మార్చే కాలాగ్ని పాట‌ ఇంతాచేసి అది ఆరుబ‌య‌ల్లో పిల్ల‌ల వాన‌పాట‌ ____________________________వ‌సీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hGGbXC

Posted by Katta

Vakkalanka Vaseera కవిత

అది నాదే! ఓ క‌విత‌ మ‌ట్టిలోంచి చెట్టులో చేరి ఆకుప‌చ్చ‌ని హ‌స్తం చాచి నా మీద క‌విత్వం రాయండి అంటుంది ఇంకో క‌విత రెక్క‌ల్లోంచి ఓ ఈక‌ని పీకి ఆకాశంలో ముంచి త‌నూ రాయ‌డానికి త‌యారైపోతూ త‌న గురించి రాయ‌మ‌ని స‌వాల్ విసురుతుంది మ‌రో క‌విత త‌న‌లోని ఆశ‌ల్ని రాగాల దారాలుగా గాలినిండా అల్లి మంచు ముత్యాల్ని ఒడిసి ప‌ట్టి నా మీద కూడా క‌విత రాయ‌మంటుంది మూడు విడిక‌విత‌లు క‌లిసి ఒకే క‌విత‌ ఇక‌ నేనేం రాసేదీ న‌న్నూ చేర్చుకోమ‌ని అడ‌గ‌డం త‌ప్ప‌ న‌లుగురికీ క‌లిపి ముక్తాంపుగా ఉమ్మ‌డిగా ..ఒకే ఒక చిరున‌వ్వు ఆది నాదే ----------వ‌సీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n5lCWa

Posted by Katta

Vakkalanka Vaseera కవిత

సూర్య‌స్ప‌ర్శ‌ భూమిలో ఎక్క‌డో దాక్కున్నాయి వేళ్లు ఆకాశంలో ఎక్క‌డికో పోయాయి కొమ్మ‌లు మంచు ప‌ర్వ‌తాలు మ‌హాశ్వేత ఫ‌లాలు సూర్య‌స్ప‌ర్శ‌తొ ఫ‌లాలు క‌రిగి అమృత ర‌సగంగ నేలంతా ప్ర‌వ‌హిస్తాయి హిమ‌గిరుల‌పై బంగారు సూర్య సుగంధాలు గుండె నిండా నింపుతాయి గోరు వెచ్వెచ‌ని నిశ్శ‌బ్దాన్ని ఈ మ‌హాస్వ‌ప్నం నిశ్శ‌బ్దం లో నిద్ర‌పోతూ సంచ‌రిస్తోంది దేనిలో నిండిపోయి దేనిలో సంచ‌రిస్తోందో వేరే దేనిలో ఇంకెవ‌రిలో నిండిపోతుంది త‌న‌లో కాకుండా వ‌సీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kOKqjW

Posted by Katta

1, మార్చి 2014, శనివారం

Vakkalanka Vaseera కవిత

హృద‌యం రాత్రి మెత్త‌ని చేతులు చాచి ఈ పిల్ల‌ని ప్రేమ‌గా నిమురుతుంది మొత్త‌టి మ‌బ్బుల బొంత‌లు ప‌రిచి గుప్పెడు న‌క్ష‌త్రాల్ని చుట్టూ చ‌ల్లి ఏకంగా ఓ చంద‌మామ‌నే దిండు ప‌క్క‌న పెట్టినా ఈ పిల్ల‌మాత్రం నోరు వెళ్ల‌బెట్టుకుని క‌ళ్లూ చెవులూ అప్ప‌గించి పిట్ట‌ల‌తో ఎక్క‌డికి వెళ్లిపోయిందో అక్క‌డే సంచ‌రిస్తోంది ఇంకా ఈలోకానికి రాకుండా ఇక్క‌డ దేన్నీ చూడా కుండా బ‌హుశ ఎక్క‌డో ఇంకేదో చూస్తోంది తాను ఎవ‌రి చేతుల్లో నిద్ర‌పోతున్న‌దీ తెలియ‌ని మ‌రోలోకం అర‌చేతుల మీద ఆడుకుంటోంది త‌ల‌నిండా పూల‌తో నిశి నిద్ర‌పోయే లోకం అది ప‌గ‌ళ్లు రెక్క‌లు విప్పి అక్క‌డినుంచే వ‌చ్చే లోకం అది రాత్రీప‌గ‌లూ రెండూ లేని చ‌ల్ల‌ని కాంతి ప‌రిమ‌ళాల వెచ్చ‌ని లోకం కాలం రెక్క‌లు విప్పి గ్ర‌హ‌గోళాల చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేసి-- అదే కాలం తిరిగి రెక్క‌లు ముడుచుకుని త‌న గూటిలో నిద్ర‌పోయే..లోకం ఆలోకంలో సంచ‌రిస్తూ ఈలోకంలో మాత్రం రెప్ప‌లు తెరిచి నిద్ర‌పోతోంది స‌ర‌స్సులో స‌ద్దుమ‌ణిగి పోయిన ఒండ్రు మ‌ట్టి బుర‌ద‌లోంచి త‌ల్లిక‌డుపులోంచి తండ్రి నాభిలోంచి ప్ర‌యాణించి- నీటిలోంచి త‌ల‌బ‌య‌ట పెట్టి ప్ర‌పంచాన్ని చూస్తుంది ప‌క్షుల‌తో క‌లిసి కేరింత‌లు కొట్టి తూనీగ‌ల రెక్క‌ల మీది సంగీతాన్ని ముని వేళ్ల‌తో మీటి నాద సౌంద‌ర్యానికి అశ్చ‌ర్య‌పోయి ..ఆనందించి చివ‌రికి నెమ్మ‌దిగా అన్నిరేకులూ నేత్రాలై విచ్చుకున్నాకా ఈలోకంలో రెప్ప‌లు తెరిచి నిద్ర‌పోతూ ఇంకో లోకంలో సంచ‌రిస్తోంది అగ్ని స‌ర‌స్సులో విక‌సించిన‌ రెక్క‌లు లేని కాళ్లు లేని నిశ్చ‌ల హృద‌య క‌మ‌లం ------------వ‌సీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ewAQkZ

Posted by Katta

27, ఫిబ్రవరి 2014, గురువారం

Vakkalanka Vaseera కవిత

గోదావరి ఇదే చిక్కు తన గురించి రాద్దామనుకున్నపుడల్లా.. నేనేమో ఏరికోరి మంచి మంచి శబ్దాలు పోగేసుకుని పెద్ద వీరుడిలా సిద్ధమవుతాను తానేమో ఇలా మౌనంగా ప్రత్యక్షం మోనాలిసాలాగా, శిరిడీ సాయిలాగా నవ్వీ నవ్వనట్లుగా నవ్వుతోందో? లేక మౌన గంభీరం నిశ్చల నిర్వికల్పంగా ఉందో? ఏ సంగతీ ఎంతమాత్రం బయటికి తెలియనివ్వదు తన గురించి రాయాలంటే నిజానికి అర్థం పర్థం లేని అద్దంలాంటి అక్షరాలు కావాలి ఒక వేళ అటువంటి నిశ్శబ్దాక్షరితో వెళ్తే తనేం చేస్తుందో తెలుసా!!! పర్వతాలను ఒరుసుకుంటూ బండరాళ్ల చర్మం మీద మృదంగం వాయిస్తూ రాళ్లలో నిదురోయే పువ్వుల్ని పలకరిస్తూ తాను ఎప్పుడో ఎక్కడో భద్రంగా దాచిన గజ్జెలు తీసి కాళ్లకు కట్టుకుంటుంది నడకో నృత్యమో పరుగో తెలిసేలోగా గలగల పకపకా నవ్వుతూ పిట్టల పాటల్ని వెంట తరుముతూ పిచ్చిదాన్లా ఉరకలేస్తుంది ఇంత తీయగా కవ్వించి మరీ అందీ అందక వేధించే ఆమెతో నేనెలా వేగేది? చప్పుడు లేకుండా పాపికొండల్లో ఈమెగారి సిగపాయల్లో పాకే పడవలోంచి హఠాత్తుగా ఓ పుష్పం గాలిలో వికసించి ఈమెని తాకిన మరుక్షణాన్నే ఓ వృత్తాన్ని వదిలిమాయమవుతుంది. నది బుగ్గమీద సొట్టలా మెరిసిన వృత్తమూ అదృశ్యమవుతుంది ఈ డింపుల్ బేబీ అందాల్ని పట్టుకునే వల ఇంకా పుట్టలేదు శబ్దాలు పనికి రావు...పోనీ మౌనమా అంటే మన అందరి మౌనాన్నీ మింగేసే మహాగంభీర మౌనం తనది పోనీ శబ్దాలా అంటే అన్ని శబ్దాలనూ ముంచేసే మహోధృత గర్జన ఆమెది ఈమె గురించి రాయడానికి ఒక్కటే దారి ఒక్కొక్కటీ పూర్తిగా బట్టలన్నీ విప్పెయ్యాలి ఒక్కొక్కటీ పూర్తిగా శబ్దాలన్నీ విప్పేసి గట్టున పారెయ్యాలి నిశ్శబ్దభారాన్ని నెమ్మదిగా దించి ఇసుక తీరం మీద వదిలెయ్యాలి ఒకే ఒక్క గెంతులో దూకెయ్యాలి ఈతకొట్టే కాళ్లూ చేతులూ కేరింతలూ ఈదే కొద్దీ వాటి చుట్టూ గుత్తులు గుత్తులుగా వికసించి... జలజల రాలే నీటి నవ్వుల పారిజాతాలూ జీవనదిని వర్ణించడానికి కావాల్సిన శబ్దాలూ నిశ్శబ్దాలూ జీవనదిలోనే నా చేతులు చుట్టూనే ఉన్నాయి పట్టుకోమంటూ ఊరిస్తాయి పట్టబోతే ఇంకెంతో అందంగా ఆనందంగా అందీ అందకుండా ఉడికిస్తాయి వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dF6dWj

Posted by Katta

13, ఫిబ్రవరి 2014, గురువారం

Vakkalanka Vaseera కవిత

రెండు వాక్యాలు రెండు రెక్క‌లూ రెండు వాక్యాలు మాట‌ల మ‌ధ్య మౌనం లా వాక్యాల మ‌ధ్య ఆకాశం న‌దిమీద రెక్క‌లు విప్పే ప‌క్షులు రెండు రెక్క‌లూ రెండ‌క్ష‌రాలు అక్ష‌రాల మ‌ధ్య ప్ర‌వ‌హించే న‌ది నీటిలో నీడ‌లూ అంత‌కంటే పొడ‌వైన‌ అంద‌మైన రెక్క‌లు విప్పుతాయి మాట‌ల నీడ‌ల మ‌ధ్య ఎగిరే ప‌క్షి అద్భుత శ‌బ్దాల రంగుల మీద గింగిర్లు కొట్టి చివ‌రికి మౌన వృక్షం తొర్ర‌లోని ఇంటికి చేరుతుంది ----------వ‌సీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jbzSul

Posted by Katta

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Vakkalanka Vaseera కవిత

శృతిల‌య‌లు కాలం నిద్రపోయిన నీలి సరస్సులో తడిసి పురాతన సుగంధాలు వెదజల్లే నీ కేశాల నీడలు క్రమంగా..నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఎప్పుడు కొండ దిగాయో తెలియదు లోయంతా పరుచుకుంటాయి చిరుగాలి తీయ‌ద‌నంలో నిండా మునిగి గ‌డ్డిదుబ్బుల కంకుల మీద క‌వ్వించుకుని ఉన్మత్తంగా ఎగిరే తూనీగ‌ల వెంట ప‌రుగెడుతూ... గ‌డ్డి మైదానాల మీది ముత్యాల పంట‌ని దోసిళ్ల కొద్దీ ఎత్తుకుని చీర‌చెంగులో పోసుకుని మురిసిపోతూ.. నీ కేశాల నీడలు ఎప్పుడు కొండ దిగాయో తెలియ‌దు లోయంతా ప‌రుచుకుంటాయి చెట్ల తలలల్ని నిమురుతూ గడ్డిపరకల కుదుళ్లని అల్లుకుంటూ.... నీ వ్యోమ కేశాల నీడల్ని తాగి అల్లిబిల్లిగా వట్టివేళ్లు మట్టిలో క‌మ్మ‌ని ప‌రిమ‌ళాల‌తో అల్లుకున్న బుట్టలనిండా చల్లని వడగళ్ల పళ్లు నీ వ్యోమ కేశాల మీంచి మహాశూన్యంలో ఎగురుతూ తేనెల ఆవిరులు నీ కేశాల నీడల వెంటే కొండ దిగుతూ గడ్డిపువ్వుల నుదిటిమీద ముద్దులు కురిపిస్తూ... లోయంతా నీ మేని నీలివర్ణమే అవరించి లోయంతా నీ నీలి మేనివర్ణమే ఆక్రమించి నీ నీలి మేనివర్ణమే లోయ శిరస్సు మీది ఆకాశంలో కరిగిపోయి అనంతమై వ్యాపించి ఉంది. ఈ అనంతమే లోయల‌తో సహా నన్నూ తనలోకి తీసుకుని జోలపాడి ఓలలాడిస్తుంది ఈ అనంతమే నాలోంచి తొంగిచూస్తూ లోయల నిండా పరివ్యాప్తమవుతూ తూనీగ‌ల ఉన్మత్త శృతిలో నిశ్శబ్దంగా ప్రతి ధ్వనిస్తుంది ఈ అనంత‌మే నీ అర్థ నిమీలిత నీల‌ నేత్రాల‌లోని ఝుంకారంతో శృతిచేసుకుని ల‌యిస్తుంది. ---వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1olkC1J

Posted by Katta

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

Vakkalanka Vaseera కవిత

మాఘపొద్దు పెనుచీకటి అరచేతి మీద రేఖలు అడవులు నల్లని తామరాకు ఈనెల్లా కొండల దారులు అంతరిక్షం నుంచి ఒక్కొక్క రేకూ విచ్చుకుని నల్ల కలువై విరిసిన రాత్రి !!! రాత్రి చీకటిపొదుగులో తలదూర్చి పాలుతాగి అలాగే ఎప్పుడో మాగన్నున పడి .. నిద్రలోకి జారుకున్నాయి వృక్షాలు రాత్రంతా చలిగాలిలో ఆదమరిచి నిద్రపోయాకా మెలకువ వచ్చే సరికి ఆకుల చివర్ల నుండి ఇంఒ•• ఎ•ంంగా జారే మౌన బిందువుల్లో కరుణతో చిరునవ్వే ఏడు రంగుల సుప్త స్వరాలు రాత్రి గర్భంలో తపస్సు తర్వాత చాచిన ఆకుపచ్చని దోసిళ్ల నిండా ఓ వెచ్చని అమృత ఫలం దోసిట్లోని ఫలాన్ని పెదవులకు ఆన్చి వెచ్చ వెచ్చగా... నెమ్మది నెమ్మదిగా.. కొద్ది కొద్దిగా... బొట్టు బొట్టుగా... ప్రాణ రసాన్ని సిప్‍ చేసే కొద్దీ ప్రాణం లేచి వస్తుంది ప్రాణులకి శిలల్లో నిద్రపోయే ప్రాణశిశివు సైతం మత్తుగా ఒత్తిగిలుతుంది !!! రంగులు మార్చబోయే ఆకుల అరచేతుల మీంచీ ఇక లోయంతా ఎగరవా రుతువుల సీతాకోక చిలుకలు? వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1b7HFtU

Posted by Katta

8, ఫిబ్రవరి 2014, శనివారం

Vakkalanka Vaseera కవిత

నిశ్శబ్దఘోష సుతిమెత్తటి తడినితాపే రాయి రాయిఒడిలొ చేతులుచాచి నుంచునీ రాయిపొట్టమీద ఆడుకుంటూనూ ఆకుపిల్లలు నోరారానిండుగా గలగలానవ్వేశిల ఆకుపిల్లలచేతుల్లో అల్లిబిల్లిసీతాకోకలు ఆకుపిల్లలకళ్లనిండా ఆనందపు చంద్రకళలు అడవి నిమురుతుందిశి లశిరోజాలనుప్రేమగా రాయికితలదువ్వి జడవెయ్యడం ఒక్కఅడవికేసాధ్యం ఆకుపచ్చనికాంతిలో తలంటుస్నానం చేసినశిలలు లోయలోకి ధవళజలపాతాన్నిఅంజలిస్తూ ఆకునుంచి శిలనుంచి జలపాతంతోసహా అందరిదీ ఒకే నిశ్శబ్దసాగరఘోష ఓమ్‍మ్‍మ్‍మ్‍మ్‍..........శివోహం .............వసీరా గిరులూఝరులూ తరులూవిరులూ నిరతము నీ నామగానమే సంత్‍ తుకారామ్‍ ఈకవితకు ఈవాక్యాలుస్ఫూర్తి ఈలైన్లువిన్నప్పుడు చెట్లూపుట్టలూ దేవుణ్ణిస్మరించడవేమిటనినవ్వుకున్నాను. నాగురుదేవులకృపవల్ల ఒకానొకక్షణంలో తుకారామ్‍హృదయం .నాకుఈవిధంగా అనుభూతంఅయ్యింది అదిమీతోపంచుకోవడం...ఆనందంగాఉంది వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bbpAes

Posted by Katta

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Vakkalanka Vaseera కవిత

మాఘపొద్దు పెనుచీకటి అరచేతి మీద రేఖలు అడవులు నల్లని తామరాకు ఈనెల్లా కొండల దారులు అంతరిక్షం నుంచి ఒక్కొక్క రేకూ విచ్చుకుని నల్ల కలువై విరిసిన రాత్రి !!! రాత్రి చీకటిపొదుగులో తలదూర్చి పాలుతాగి అలాగే ఎప్పుడో మాగన్నున పడి .. నిద్రలోకి జారుకున్నాయి వృక్షాలు రాత్రంతా చలిగాలిలో ఆదమరిచి నిద్రపోయాకా మెలకువ వచ్చే సరికి ఆకుల చివర్ల నుండి ఇంఒ•• ఎ•ంంగా జారే మౌన బిందువుల్లో కరుణతో చిరునవ్వే ఏడు రంగుల సుప్త స్వరాలు రాత్రి గర్భంలో తపస్సు తర్వాత చాచిన ఆకుపచ్చని దోసిళ్ల నిండా ఓ వెచ్చని అమృత ఫలం దోసిట్లోని ఫలాన్ని పెదవులకు ఆన్చి వెచ్చ వెచ్చగా... నెమ్మది నెమ్మదిగా.. కొద్ది కొద్దిగా... బొట్టు బొట్టుగా... ప్రాణ రసాన్ని సిప్‍ చేసే కొద్దీ ప్రాణం లేచి వస్తుంది ప్రాణులకి శిలల్లో నిద్రపోయే ప్రాణశిశివు సైతం మత్తుగా ఒత్తిగిలుతుంది !!! రంగులు మార్చబోయే ఆకుల అరచేతుల మీంచీ ఇక లోయంతా ఎగరవా రుతువుల సీతాకోక చిలుకలు? వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1b7HFtU

Posted by Katta

3, ఫిబ్రవరి 2014, సోమవారం

Vakkalanka Vaseera కవిత

ప్రేమ పూజారి ప్రేమ‌కి పూజ చెయ్యాలంటే క‌న్నీళ్ల చెట్లెక్కి కాంతిపూలు కోసుకు రావాలి ఎందుకు న‌వ్వుతున్నామో ఎందుకు ఏడుస్తున్నామో తెలియ‌నంత వెర్రితో వాటిని క‌నిపించిన ప్ర‌తివారి నెత్తిన పోసి మ‌ళ్లీ ఏరుకుని మ‌ళ్లీ మ‌ళ్లీ న‌వ్వుకోవాలి మునివేళ్ల‌మీది మంట‌ల‌తో జీవ‌న సౌంద‌ర్యానికి హార‌తివ్వాలి వియెగం చ‌లిగాలిలో నివురు దుప్ప‌టీ క‌ప్పుకుని వ‌ణికుతూన్న‌క‌ల‌ల్నితీసుకెళ్లి నీలాకాశం ఒళ్లో పోసెయ్యాలి అక్క‌డే ప‌క్క‌స‌ద్దు కోడానికి కూడా తోచ‌నంత అశాంతితో న‌డువాల్చి కాస్త ప్ర‌శాంత‌త‌కోసం క‌ళ్లుమూసుకోవాలి గుండెఆవిరితో స్వెట్ట‌ర‌ల్లి స‌ముద్రాన్ని తొడుక్కోమంటూ బ‌తిమ‌లాడాలి వాన‌చినుల రంగుల రాట్నం ఎక్కి గిర‌గిరా బాల్యంలో తిరిగి రావాలి ------------------వ‌సీరా 1985లో ఓ శీతాకాలం రాసిన క‌విత , తేదీ గుర్తు లేదు ఇది నారాయ‌ణ వేణు మాస్టారికి ఇష్ట‌మైన క‌విత‌. వారికోసం మ‌ళ్లీ పెడుతున్నా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nAigvC

Posted by Katta

1, ఫిబ్రవరి 2014, శనివారం

Vakkalanka Vaseera కవిత

ప్రేమ పూజారి ప్రేమ‌కి పూజ చెయ్యాలంటే క‌న్నీళ్ల చెట్లెక్కి కాంతిపూలు కోసుకు రావాలి ఎందుకు న‌వ్వుతున్నామో ఎందుకు ఏడుస్తున్నామో తెలియ‌నంత వెర్రితో వాటిని క‌నిపించిన ప్ర‌తివారి నెత్తిన పోసి మ‌ళ్లీ ఏరుకుని మ‌ళ్లీ మ‌ళ్లీ న‌వ్వుకోవాలి మునివేళ్ల‌మీది మంట‌ల‌తో జీవ‌న సౌంద‌ర్యానికి హార‌తివ్వాలి వియెగం చ‌లిగాలిలో నివురు దుప్ప‌టీ క‌ప్పుకుని వ‌ణికుతూన్న‌క‌ల‌ల్నితీసుకెళ్లి నీలాకాశం ఒళ్లో పోసెయ్యాలి అక్క‌డే ప‌క్క‌స‌ద్దు కోడానికి కూడా తోచ‌నంత అశాంతితో న‌డువాల్చి కాస్త ప్ర‌శాంత‌త‌కోసం క‌ళ్లుమూసుకోవాలి గుండెఆవిరితో స్వెట్ట‌ర‌ల్లి స‌ముద్రాన్ని తొడుక్కోమంటూ బ‌తిమ‌లాడాలి వాన‌చినుల రంగుల రాట్నం ఎక్కి గిర‌గిరా బాల్యంలో తిరిగి రావాలి ------------------వ‌సీరా 1985లో ఓ శీతాకాలం రాసిన క‌విత , తేదీ గుర్తు లేదు ఇది నారాయ‌ణ వేణు మాస్టారికి ఇష్ట‌మైన క‌విత‌. వారికోసం మ‌ళ్లీ పెడుతున్నా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nAigvC

Posted by Katta