పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మార్చి 2014, శనివారం

Pardhasaradhi Vutukuru కవిత

కృష్ణా తరంగాలు సభ్యులకు విన్నపం రేపు మన చిత్రం కవిత పోటీ 50 పూర్తీ చేసుకోబోతున్నాం . ఈరోజు నుంచి కనీసం 10 లైన్ లు నుండి 15 లైన్స్ లో కవిత రాయాలి .. రేపు అనగా 16-03-2014 ,ఆదివారం డి న్యూస్ ఫీడ్ లో పెడుతున్నాం , ఆసక్తి వున్నా కవులు పాల్గొన వచ్చు , దీంట్లో లైక్ లకు ప్రాధాన్యత వున్నది . కావున దయచేసి ఈ మార్పు గమనించ గలరు . ఇది క్రొత్త ప్రయోగం , పోటీ కేవలం నా గ్రూపు అని అనిపించుకోవాలి అని కాదు , మన అందరి పోటీ అని భావిస్తారు అని కవులు ఉత్సాహం గా పాల్గొంటారు అని భావిస్తున్నా . ఇంట వరకు విజయవంతం గా పోటీ పెట్టగలిగాం అంటే , కేవలం మీ అందరి సహకారం తోనే , మీ సహకారం పూర్తిగా ఇస్తారని భావిస్తున్నా . మీ స్నేహితుడు అడ్మిన్ కృష్ణా తరంగాలు పార్ధసారధి ఉటుకూరు 9059341390

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m7oXGq

Posted by Katta

Sarada Kotra కవిత



by Sarada Kotra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oXFycF

Posted by Katta

Atmakuru Ramakrishna కవిత



by Atmakuru Ramakrishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m7oZ0P

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: నిరాశ ఏల..: నిరాశ ఏలనే నా చెలి.. కష్టాల కొలిమిలో నిను వదలడం నా తరమా..! డీలా ఏలనే నా చెలి.. నష్టాల నెగడులో నిను వీడటం నా వశమా..! బెంగేలనే నా చెలి.. నిర్జీవం కమ్మిన నిస్సత్తువలో నిను ముంచేయటం నా తలపా..! బేలతనమేలనే నా చెలి.. విదీర్ణమయిన నీ ముఖచంద్రం కాంచుటయే నా తపమా..! నేనున్నాను అన్నింటా..!! ఎల్ల వేళలా నీ చెంత..!! 15/03/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gn2Q6t

Posted by Katta

Swatee Sripada కవిత

కాసీపు ................ ఎక్కడి నుండో ఓ చల్లని పలకరింత ముసురుపట్టిన ఊహల చుట్టూ ఓ గాలి వీవనలా రెపరెప లాడినప్పుడు ఆపినా ఆగలేని శ్రావణ మేఘాన్నవుతాను లోలోని ఆకాశానికీ బయటి నేలకూ వంతెనలు వేసే నీటిధారలై తలపులు వరదలై వాగులై ముంచెత్తే వేళ మౌనం దారంతా పరచుకుని ఇంకా విచ్చుకోని నిద్రగన్నేరు స్వప్నంలా ముకుళించుకున్న రాగాలమధ్య తడబాటు వాయులీనాన్నవుతాను కొమ్మకొమ్మనా వసంత౦ తొలి సారి చూలి౦తై సిగ్గులు పొటమరించిన వేళ ఎప్పుడో జీవన ప్రా౦గణాన సుతిమెత్తని అడుగులసడి సరిగమల అలికిడి సాయంత్రపు సంధ్యవేళ ముసిరే మల్లెల పరిమళమై ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. క్షణం పాటు నన్ను నేను మరచి నాగస్వర వశీకరణలో నీ నీడ నీటిపొరలో ఓడి ఒదిగిపోతాను శీతల పవనాల హేమంతాన్ని తలకు చుట్టుకుని జబ్బుపడ్డమనసుకు ఊరటనివ్వాలనుకున్నా మూసిన కనురెప్పల మధ్య విస్ఫోటి౦చె అగ్ని పర్వతాలు ఆగి ఆగి తలపులనూ తలుపులనూ తట్టే కూనిరాగాలు బీడువారిన రోజులను సాగుచేసుకు హరిత వనాలు నాటి నాటి ఆనెలు మొలచిన అరచేతులు అలసిసొలసి సొమ్మసిల్లినా వివశామైన క్షణాల్లో కాలం దోచుకున్న దోపిడిలో మిగిలినవి రిక్తహస్తాలూ ఎండి తడారిన కంటి చూపులూ నన్నిలా కాస్సేపు ఈ అనుతాపాల మధ్య మేను వాల్చనీ ఖాళీగా మారిన నా చిరునవ్వుల పొదలకు చిరుమొగ్గలు అతికించుకోవాలి. మాటలు మర్చిపోయిన నా ఊసులకు అక్షరాలూ దిద్ది౦చాలి

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gn2SeG

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

విద్యార్థుల కవిత్వం ------------ 13. కమలాకర్. ఎ ------------ ఆ ముగ్గురూ.. ఆ ముగ్గురూ.. కాసిన్ని బతుకు కాగితాలను ఏరడానికై సిద్ధమయ్యారు వాళ్లకు అవి ప్రాణం గుండెలపై వాటిని హత్తుకుంటారు అవి బతకడాన్ని నేర్పుతుంటాయి వాళ్లు పోరాటానికి సిద్ధమైన సైనికులు వాళ్ల అదృశ్య తల్లులు చూపుడు వేళ్లతో ఉదయాల్ని చూపిస్తారు వాళ్ల పోరాటాన్ని పుట్టుకతోనే ప్రారంభించినవాళ్లు ఆ ముగ్గురూ.. ఆ పనిలో గొప్ప కార్యకర్తలు ప్రతి తెల్లవారి వాళ్లు సూర్యోదయాన్ని వొంటికి పూసుకుని బయలుదేరుతారు వాళ్లకు ఆ కాగితాలు జీవితాక్షరాలను చూపిస్తుంటాయి వాళ్ల- కళ్ల ముందు కాలం నిలిచి వుంటుంది కాలం మీద వొక అపూర్వమైన సంతకం వాళ్లు! -------------------- 15.03.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nsqjgr

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/భ్రమణం --------------------­-------- కొన్ని సత్యాలు తేలియాడుతుంటాయి అసత్యాలు మరుగున పడినప్పుడు నీటిమీద భారంలేని ఆకుల్లాగా కొన్ని క్షణాలు ఆవిరవుతుంటాయి నాణ్యమైన దివిటీలు వెలిగినప్పుడు వాన చినుకులు చెట్ల కొమ్మలపై గంభీరంగా జారినప్పుడు నిర్వేదంలో కూరుకుపోయిన మొదళ్ళు ఎన్నాళ్ళ జ్ఞాపకాలనో వెంట తెచ్చుకున్నట్టు కొన్ని నిరీక్షణలు అంతమవుతుంటాయి నమ్మకాలు మాయమవుతున్నపుడు The entire world might be bounded with some fucking myth. తిలక్ బొమ్మరాజు 15.04.13

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gn2RYd

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

ప్రముఖ కవి నందిని సిధారెడ్డి ఇటీవలి తన అరవ కవితా సంపుటి " ఇక్కడి చెట్లగాలి " లోంచి ఒక కవితను చూడండి.... \\ తలంపు \\ ఈ లోపల పాట చెవిలో ప్రపంచ రహస్యం ఊదాలె పగలని గుండుకు తొలికొట్టి మందుగుండు పెట్టాలె అర్ధాంగీకారం అనిపించినా మౌనం కూడా వ్యూహమే కూలిపోతున్న ఊరి చెలిమెలో కూరిమి తోడాలె రాత్రిని వెలిగించేది సాహసం ఒక్కటే ఈ లోపల వలసపోయిన వసంత మేఘానికి ప్రేమలేఖ రాయాలె వట్టిపోయిన తరానికి మనిషిని కానుక ఇవ్వాలె స్వభావవిరుద్దమనిపించినా మౌనం కూడా వ్యక్తీకరణే ఈ లోపల కాలం కనురెప్పల మీద జీవితం రచించాలె తడి కోల్పోయిన ఆధిపత్యానికి గడియలు గణించాలె మౌనం నిరంతర దీక్ష తల ఎత్తితే కందిరీగలు తరుముతయి చావు ఒకటే వేలసార్లు వెంటబడుతది ఈ లోపల అక్షరానికి అంతరంగానికి సయోధ్య కుదుర్చాలె యుగానికీ యుద్దానికీ దారి వేయాలె ఈ లోపల గాలి రెక్కల మీద మనిషిని చేరుకోవాలె ఎవరికీ తలవంచని రేషం అద్ది పద్యం ఎగురవేయాలె .......15-03-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nsqg4l

Posted by Katta

Mehdi Ali కవిత

!! ఎన్నాళయింది నాన్న? ... !! ఎన్నాళయింది నాన్న నాతొ మనస్ఫూర్తిగా మాట్లాడక ... నిజానికి నువ్వేం మాట్లాడుతావని ... నా దగ్గరికి నువ్వు రావు నీ ప్రపంచం లోకి నేనొస్తె ఏరా బాగ చదువుతున్నావా ..తప్పా నువ్వేం మాట్లాడుతావని ... ఉదయం లేచినప్పటి నుండి రాత్రి .. అది కూడ ఏ రాత్రి నిద్రపోతావొ ..... ఇంటర్నెట్టె నీ ప్రపంచం ఉదయం రాత్రి మధ్యలొ నువ్వు ఆఫీస్ కు వెల్లిపొతావు నెను స్కూల్ కు వెల్లిపొతాను అమ్మ , నువ్వు నేను కలసిఉండే కొద్ది సమయం నీదేమో నీ ప్రపంచం నిన్ను ఏమనలేక అమ్మాదో టీవీ ప్రపంచం మీ ఇద్దరికి చెప్పలేని నా చిన్ని ప్రాయానిదో ఫ్రపంచం మనందరి మధ్యలొ కొన్ని యాంత్రిక పలుకరింపులు మనం అపరిచితులమా నాన్నా ? ఇంతకు ముందు ఏలా ఉండే వాళ్ళం !? ఉదయాన్నే నాకు అన్నీ బొధించే వాడివి చదువులో అవి నన్ను ముందుకు నడిపించేవి సాయింత్రాలు నన్ను తీసుకొని షికార్లకు వెళ్ళేవాడివి నన్ను తీసుకెళ్ళడం కాదు ... నువ్వే కంప్యూటర్ వదలవు ఇంటికి బంధువులు వస్తే ముళ్ళపై కూర్చున్నట్టూ ప్రవర్తిస్తావు వాళ్ళెప్పుడు వెళ్ళిపొతారాని చుస్తావు ఇదేనా నాన్న జీవితం ? ఇదేనా నీ ప్రపంచము ? నీ పరిఘ్ణానం పెంచుకో .. మాక్కాస్తా సమయం ఇచ్హి మాతో కూడా కాస్త ప్రేమను పంచుకో నీకు చెప్పే ప్రాయం నాది కాకపొవచ్హు నెట్ పై చెతులతో ప్రపంచాన్ని ముందుకు తెచ్హుకుంటావే ఆవే చేతులతో అప్పుడప్పుడు నా శిరస్సు ను కూడ నిమురు నాన్న.. 15 -03 14 ( konni akshara doshaalaku kshamaapanalu )

by Mehdi Ali



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nsqiZW

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gn2P2D

Posted by Katta

Krishna Mani కవిత

ఏది మంచి? ************* కలలు కల్లలైన నాడు మనిషిగా బ్రతకడం కష్టం మనసు రక్కసుగా మారి కార్చిచ్చులాగా మనుగడను దహియిస్తుంది అందులో మండే గుండెలెన్నో ! కనికరం లేని కసాయి కడతేర్చిన ప్రాణాలెన్నో? కాల గమనంలో మనిషి మంచివాడు అందుకేనేమో మనిషి చెడ్డవాడు ! మంచి ఉన్నచోటే చెడు ఉండాలి లేకుంటె రెండూ ఒక్కటేగా ! మానవ చరిత్రలో చెడుపై మంచి గెలుపు అది కేవలం పుస్తకాలలో కొన్ని పేజీలు మాత్రమే ! చేడు గెలవందే రాజ్యాలు కూలాయా ? చేడు గెలవందే తలలు తెగాయా ? మంచి చెడులకి తేడాలేదు అది కేవలం మనిషి స్వార్ధం మీదే ఆధారం అది కేవలం మనిషి ఈర్ష మీదే ఆధారం ! ఇది మంచి అని ఏదీ నిర్వచనం ? ఇది చెడు అని ఎక్కడ శాసనం ? రెంటికీ సమాధానం ఉంటే చెడు లేని మనసులేన్ని ఈ మానవ కూపంలో ? చెడు చెంతకు ఆరాటం దేనికి ? మనిషికేమి రోగం ఒక వైపే ఉండొచ్చుగా ? దేవతలు రాక్షసులు ఎవరు మంచి వారు ? ఒకరికి హాని చెయ్యనివారు మంచివారు, దేవతలు చెడ్డవారు రాక్షసులు అంటారు మరి మానవులు ఎలాంటి వారు ? చెడ్డవాళ్ళు ముమ్మాటికి చెడ్డవాళ్ళు పువ్వుపై కనిపించే తేనెటీగను చూసి మురిసిపోతాం తేనెటీగ పోగేసిన తేనెను తస్కరిస్తాం ....మనం రాక్షసులం కాయలు పండ్లను మురిపాన కని పెంచిన ఎన్నో తల్లులను పిల్లను ఎడబాపే మనం రాక్షసులం ... నిజంగా రక్కసులం దూడల మూతులగట్టి కడుపులగొట్టి ఆవుల కన్నీరును ఒమ్పుతాం దూడల తిత్తుల ఆశపెట్టి బర్రెల గోసల ముడుపుగడతాం....మనం అసురులం పక్షులను జంతువులను బందీలను జేసి బానిస బ్రతుకుకు భద్రత లేదని చిందులేస్తాం ...మనది సిగ్గులేని జన్మ ... మనం రాక్షసులం కృష్ణ మణి I 15-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fIOYs4

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• వెలితి నింపే ఆరాటం •• ఖాళీ ఐన మనసు బావి- చెత్త నిప్పుకున్న గుండె బుట్ట- కొన్ని నా కన్నీళ్లు పీర్చుకున్న మబ్బు ముద్దలు- యెండు నేలపై నా అడుగు మొలకలు- కొమ్మకి కోకిల శవం ఔను తెలుస్తుంది తాడు నేనే- తోపులాటలో చిన్నపిల్ల గుక్క ఏడుపూ నేనూ ఒక్కటే యిప్పుడు- వెలితీ వేలితీ వెలితీ- 14/03/14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fIP0Qw

Posted by Katta

Maheswari Goldy కవిత

M Y L I F E F A N T A S Y…!! MAHESWARI GOLDY Each and every time I see one surprise of my life...!! When I looking in the mirror A completely different personality Standing in front of mine Just like a rainbow Now I should confirm What happens in my lifetime...!! Then I really realized Don’t get wrapped up in the negative Be happy with what you have been given...!! Friends...!! But my heart it bleeds from past mistakes........ This darkness shoots my soul My world seems dead I’ve lost my real life...!! I think my feelings are always In uncontrollable gloom...!! Even though I do not have to leave my life I filled with my smile In my darkroom Till my end…!!

by Maheswari Goldy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fIP0A7

Posted by Katta

Jabeen Unissa కవిత

జాజిమల్లె తీగా...! జాజిమల్లె తీగ లాంటి ఆడజన్మ కస్టమా, కన్న తండ్రి కడుపుకైన బరువు బిడ్డనయ్యానా, కట్టుకున్న భర్తకేమొ కట్నం డబ్బు ముఖ్యమా, ఇరుగు పొరుగు వాల్ల కంటికి ఆటబొమ్మనయ్యానా, (జాజి) ఈ జన్మకింక ఇంత చాలు పాడు లోకమా, ఎన్ని చట్టాలున్న కట్నం బాధ ఆపతరమా, కామ కళ్ళనుంచి ఆడదాన్ని కాపాడతరమా,(జాజి) కలల వచ్చిన పూల దారి ఎక్కడుందమ్మా, కళ్ళు తెరిచి చూస్తె కళ్ళనిండ సాగరమేనంటా, మా జీవితానికె విలువ ఇంక ఎక్కడుందమ్మా, జాజిమల్లె తీగా...! జాజిమల్లె తీగ లాంటి ఆడజన్మ కస్టమా, 15/3/2014

by Jabeen Unissa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OfFji3

Posted by Katta

Ravinder Vilasagaram కవిత

\u003Cపావలా వెలుగులు> పావలాకు విలువేముందాటారా ? నిన్న చుసాను నేను వేయి చంద్రుల వెలుగును! కోటి సూర్యుల కాంతిని!! 15మార్చి2014 (2005లో రాసిన చిన్న కవిత, ఒకరోజు కిరాణ దుకాణంలో చిల్లర లేక ఒక వక్కపొట్లం ఇవ్వడం జరిగింది. అది చూచిన మా మూడేళ్ళ పాప ముఖంలో కనబడిన ఆనందపు వెలుగుల స్పందనే ఈ కవిత.ఇప్పుడు ఆ పావలాలే కనుమరుగయ్యాయి!)

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oWtpEM

Posted by Katta

John Hyde Kanumuri కవిత

?? //జాన్ హైడ్ కనుమూరి// ---- మోహించేది రాక్షసే కావచ్చు ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడే వెనుకెనుక ఓ యుద్దానికి వ్యూహ రచన జరుగుతుంది మోహించేది రాణికూడా కావచ్చు తిరస్కరింపబడిన బిగికౌగిలి చెఱశాల పాల్చేస్తుంది లొంగని గుణశీలత యోసేపుదే చెఱశాలనుండి ప్రధానపదవికి వ్యూహ రచన జరుగుతుంది *** రకరకాల మోహాలు, సన్మోహాలు మధ్య లక్ష్మణుణ్ణి యోసేపులను గుర్తించడమెలా!! *** ప్రతీకలన్నీ ప్రక్కకుతోసి ప్రధానపదవికోసం ముక్కుచెవులుకాదు ఎవరి గొంతైనా కోద్దాం ఎవరు ఎవరినైనా మోహించి శయనమందిర పరదాలన్నీ చించేద్దాం!! వంగివంగి మోసే దేహాలపై బాహాటంగానే శయనిద్దాం *** కాపాడాల్సింది ప్రధాన పదవొక్కటే!!!!!! పొందాల్సిందీ ప్రధాన పదవొక్కటే!!!!!! .........................................15.3.2014

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fIh6eZ

Posted by Katta

Nirmalarani Thota కవిత

సుప్రభాత గీతమై నిను మేలుకొలపాలనుకున్నా ప్రత్యూషం ముందే వచ్చి పక పకా నవ్వింది . . పైట కొంగునై నీ నుదుటి స్వేదమద్దాలనుకున్నా పిల్ల గాలి చల్లగా వచ్చి కొంటెగా నవ్వింది . . మెత్తని ఒడినై నీ బడలిన తనువు సేద తీర్చాలనుకున్నా మల్లె పూల పొత్తిళ్ళు మత్తుగా విచ్చి ముసి ముసిగ నవ్వాయి . . జోలపాటనై హాయిగా నిను నిదుర పుచ్చాలనుకున్నా జాబిలమ్మ నెరజాణలా వెన్నెల్లు తెచ్చి జాలిగా నవ్వింది . . మరుసటి రోజైనా నేనే ముందుండాలని మసక చీకట్లు గుట్టుగా దాటి నడిరాతిరే ఆత్రంగా నీ ఇంటి ముంగిలికి చేరుకున్నా. . హు . . మూసివున్న తలుపు వాకిట్లోనే వెక్కిరించింది . . ! నిర్మలారాణి తోట తేది : 15.03.2014

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m68J0j

Posted by Katta

Vakkalanka Vaseera కవిత

తీపి ఏకంగా తీయని గోళాన్నే ధరించి ఓ చిన్ని గింజ ద్రాక్ష పండులో కూర్చుంది కాంతి సంవత్సరాలకు ఆవలినుండి ద్రాక్షపండు హృదయంలోకి ఏ తీయదనం ప్రవహించిందో? ఏ తీయని స్పర్శకి ఆకుపచ్చని తీగల్లో జలతరంగిణి మోగి తీయని సంగీతం పండంతా నిండిపోయిందో ఏ తీయదనం వల్ల పండు తన గుండెల్లో గింజని దాచుకుందో? పర్వతాలు నదులు సముద్రాలతో వెలుగు చీకట్ల దోబూచుల్లో వాయుదారాల కల్నేతలో దిగంబరాలను అలకరించుకున్న భూగోళం బహుశ భూగోళం అట్టడుగు మట్టంలోని ఓ సరస్సులోపల కూడా ఓ బీజం ఎక్కడో మహాకాశంలో మండే మహాగోళం నుంచి తీయదనం కాంతిగా మారిపోయి కాంతిసంవత్సరలను దాటుకుంటూ నీటిలోకి సైతం దూకి అట్టడుగున ఉన్న బీజాన్ని ముద్దాడటం ఏ తీయదనం? నీటిలోని కాంతి నిర్మల సౌందర్యమై ఆకుపచ్చని అరచేతులు విప్పి హృదయ కమలమై అరవిచ్చి ఆకాశాన్ని ఆహ్వానించడం ఏ తీయదనపు మహాత్యం అన్నిటి కంటే తీయనిది కడుపు తీపి ఆ తీపి అమ్మచూపులో ప్రసరిస్తుంది ఆ తీపి అమ్మ స్పర్శలో ప్రసరిస్తుంది ఆ తీపే కమలాసనం మీద తేనె సరస్సులో రెక్కలల్లార్చుతూ వాలిన నక్షత్ర సంగీతం నుండి కూడా ప్రసరించేది ఎందుకో? ఎందుకో? ఎందుకో ? ఎవరి నిష్కారణ అవ్యాజ కరుణ వల్లనో!!! -----------వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m68KBl

Posted by Katta

Riyaaz Riyaz కవిత

Riya.. ||ది ఆర్టిఫిషియల్ ఫీల్|| కోడికూసింది తెల్లవారలేదు రింగ్ టోన్ ముగ్గురు మంచి మిత్రులు దిగులు చలీ చీకటి కల భ్రమ నిజం కాలేదు నిజం అబధ్ధమైంది జీవితంలా దూరం నుంచి నవ్వుతోంది నక్షత్రం ఆమె మౌనంలో దాక్కుంది చూశా! రాయి దేవతవడం దేవత రాయి అవడం =============== 15.03.14

by Riyaaz Riyaz



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oWe9I0

Posted by Katta

Sriramoju Haragopal కవిత

నువ్వే నా.......? ఇంత మనసైపోతావని అనుకోలేదు ఇంత మమతవై పేరుకుంటావనుకోలేదు ఇంత గుండె చిలికి వెన్నచేస్తావనుకోలేదు నన్ను ఇంత దయచూపి నా కన్నీళ్ళు అద్దుతావనుకోలేదు అసలు నువ్వెవరు? ఎప్పటి నావేదనలకవతల నీవా వుంది ఎప్పటి నాబాధలకంతం నీ తలపా మందు ఎప్పటి నా బతుకు నిండా నీదా కొంగుగొడుగు ఎప్పటి నా వెర్రిపాటల్లో నీదేనా నుడుగు అసలు నువ్వెవరు? నిన్ను చూడబోయే వెలుగుదే అందం నిన్ను ముడుపులుకట్టుకున్న కళ్ళదే వైభవం నిన్ను కలవరిస్తూ నిద్రబోయే రాత్రిదే ఆనందం నిన్ను పలవరించే గుండెదే సంతోషం అసలు నువ్వెవరు?

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oWebzT

Posted by Katta

Manjunadha Reddy కవిత

మా పల్లెటూరులో అమ్మ పెట్టె చెద్దిముద్దలతో పొద్దు పొడుస్తుంది పల్లె మడికట్టు నాటులతో పచ్చదనం చిగురిస్తుంది చెరువుకట్టు ఆటలలో ఆరోగ్యం ఉట్టిపడుతుంది మా పల్లెటూరులో నాన్న పట్టే నాగలితో నడక నడుస్తుంది పల్లె కడపకడపకు భందం లేదని అనుబంధం ఉంటుంది పల్లె పడుచులో అమాయకత్యం ఉట్టిపడుతుంది మా పల్లెటూరులో గోమాత మమ్ములను ఆదరిస్తుంది పచ్చని చెట్లు మమ్ములను హయీగ తన చెంత చేరుచుకుంటయీ @ 15/03/2014 time 12.30pm

by Manjunadha Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oWebzK

Posted by Katta

Maddali Srinivas కవిత

పిత్రు దేవో భవ//శ్రీనివాస్//15/03/2014 -------------------------------------------- ప్రాంతానికొక జాతి పిత? వీడిని ప్రాంత పిత అనాల్నేమో? తప్పైతే బాంచెన్ కాల్మొక్త దొరలు మన్నించాలె! ఆదికవి యెవరైతేనేం కానీ ఆడ యీడ నువ్వేలే గొప్ప కధకుడివి వుగ్గు కధలకు పితవు కాకూడదు? వూరికే అన్నాలే యేదో అజ్ఞానం కొద్దీ తప్పైతే............. "చల్ల" యెక్కడుంటుందో "మజ్జిగ ఎక్కడుంటుందో మాబాగా చెప్పినవ్ తీయ్ భాషా శాస్త్రానికి కూడా "పిత" కావాల్నే నువ్వైపోకూడదు? "భాషా శాస్త్ర పిత"! జబర్దస్తుందిలే టైటిల్ యేదో వాగేసాలే ..... తప్పైతే..............

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Of5BRt

Posted by Katta

Rvss Srinivas కవిత

|| జ్ఞాపకాల అడుగులు || నా తలపులలో నిలుస్తావు నీ జ్ఞాపకాలతో బాధిస్తావు నిన్ను నేను తలపుగా భావిస్తున్నా, జ్ఞాపకంగా మిగిల్చావు నన్ను జ్ఞాపకాల జ్వాలల్లో కాలిపోతున్నా చందనపు చల్లదనం మదిని తాకుతోంది హాయిగా వలపుశరాలతో నీవు చేసేవి తీయని గాయాలు మదిని ప్రేమగా పలకరించేవి నీవైన జ్ఞాపకాలు. మదిలోయల్లో నీకోసమే అన్వేషిస్తున్నా నీ జ్ఞాపకాలనే సోపానాలుగా చేసుకుంటూ నిన్ను అందుకోవాలనే ప్రయత్నంలో విఫలమైనా సాలెపురుగునే ఆదర్శంగా తీసుకుంటూ... మునుముందుకి సాగిపోతున్నా. నీ అడుగులో అడుగు కలపాలనే తపనలతో అనుక్షణం పరుగులే నా పాదాలకి అడుగులో అడుగు కలిపితే గమ్యం సుగమమౌతుందని నమ్మకంతో. ఎదసంద్రంలో నీ అడుగుల సవ్వడితో అలలను సృష్టిస్తున్నావు ధమనుల్లో తేనెవాగులా పరుగులిడుతున్నావు చేరాల్సిన గమ్యం దూరమైనా సమస్యలు విపత్కరమైనా నీ సహకారంతోనే నా ముందడుగు నీవే లేని నాకు అడుగు కూడా యోజనమే నీతో జత కడితే యోజనమైనా మారేది అడుగులలోకే...@శ్రీ 15/03/2014

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oW69qH

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || ఈ రాత్రి ఇకపై రాకుంటే బాగుండును || నల్లని దుప్పటి కప్పినట్లు రాత్రి దాని క్రింద వెన్నెలకు తడుస్తూ చుట్టూ పువ్వులు వికసిస్తున్న చోట చల్లగాలికి ఊగుతున్న జ్ఞాపకాలతో మంచు పడి రేగిన గాయాలకు ఎండిన కళ్ళ నుండి ఆమె బయటపడి ఒక మోడులా నిలబడి అంటుంది ******* సాయంత్రం అబద్దాలు అన్నీ అస్తమించగా రాత్రి నా ఎదుట ఉదయించే నిజం నువ్వు నీకు తెలియనిదా రాత్రిని నీకోసమే అలంకరించేదాన్ని నేను నీ గుండెలపై వెలుగుతుంటే నువ్వు చంద్రునిలా వికసించే వాడివి ******* దీని ప్రతీ క్షణంలో నీ సువాసన నా ఎండిన దేహాన్ని నీ చితి పై కాలుస్తుంది మన మద్య నలిగిన రాత్రులన్నీ ఈ రాత్రిని ఆవహించి కక్ష తీర్చుకుంటున్నాయి నువ్వెంత సర్దిచెప్పినా ఈ చీకటిని వెలుగనుకొని జీవించలేను ******* ఈ రాత్రి ఇకపై రాకుంటే బాగుండును మీ చాంద్ || 11.03.2014 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oW6865

Posted by Katta

Garige Rajesh కవిత

అర్థంలేని అక్షరం..... ప్రేమను పొందే అదృష్టం లేనప్పుడు కన్నీళ్ళను అనుభవించే వరమే అందుతుంది మేఘం వర్షించినంత సులభంగా నేను నీ ముందు నా భావాల్ని చెప్పలేకపోయా అందుకే రాత్రిలోని బాటలా మారిపోయా నిన్ను ఆకాశంలోని తారల ఊహించుకోలేదు నా గుండెలోని స్పందనగా నిలుపుకున్నాను నిన్ను స్వర్గంలోని దేవకన్యలా కలగనలేదు నన్ను నడిపే శక్తిగా మలుచుకున్నాను నవ్వులోని అందం అందరికి తెలుసు కాని ఆ నవ్వువెనక ఉన్న కారణం ఎందరికి తెలుసు రాత్రుళ్ళు నిన్ను తలుచుకొని విలపించాను కన్నీళ్ళను కవిత్వంగా మలిచి ఆలాపించాను ఎక్కడైన నిన్ను తలుచుకోవడమే ప్రేమనుకున్న ఎప్పుడైన నీతో ఉండడమే జీవించడమనుకున్న కాని ఇప్పుడు తెలిసింది ప్రేమంటే జ్ఞాపకమని జీవించడమంటే గాయంగా రగలడమని నీపేరు నాపేరు కలిపి రాసుకొని మురిసేవాన్ని నీ రూపాన్ని తలుచుకొని నవ్వేవాన్ని అక్షరాలు కలిసినంత సులువుగా మనుసులు కలవవు కదా ఆలోచనలు అందినంత వేగంగా ఆప్యాయతలు అందవు కదా అందుకే నేనిప్పుడు చెదిరిన కలల కారాగారాన్ని చెట్లు మాన్పుకున్నంత త్వరగా నా మనుసు గాయం మాన్పుకుంటుందా?? సంద్రం దాచుకున్నంతగా నా హృదయం బాధల్ని దాచుకుంటుందా?? వేకువనో, రాత్రో అయితే బాగుండేది నా కాలం సాయంత్రంలా మారింది ఎటు కాకుండా పగిలిన మది పెంకులు గుచ్చుకొని నా రక్తం స్రవిస్తున్న నీ ప్రేమ తరగడం లేదు నా ఒంటరి తనాన్ని తలుచుకొని కన్నులు ప్రవహిస్తున్న నీ రూపం తొలగడం లేదు నువ్వెలాగు లెవ్వు మరికెందుకు ఈ కన్నీరు, ఈ కవిత్వం నీతోనే వచ్చాయి కాని నీతోనే పోలేదే..?? నేనింక మనిషినని, వేదన నిండిన మనుసునని గుర్తుతెస్తున్నాయి నువ్వెళ్ళిపోయావు అయినా నీ అడుగుజాడలు నాగుండెల్లోనే నిలిచున్నాయి నువ్వు దూరమయ్యావు అయినా నీ జ్ఞాపకాలు నాలోనే కొలువున్నాయి వసంతంలేని ప్రకృతిలా నా జీవితమిప్పుడు అంద విహీనం దేవతలేని గుడిలా నా మానసం ఇప్పుడు శోకాయమానం అర్థంలేని అక్షరంలా నేనిప్పుడు శూన్యం

by Garige Rajesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Of5BB1

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ \\ మధుకలశము రాయప్రోలు సుబ్బారావు||నిన్నటి తరువాయి..... .Dreaming when Dawn’s Left Hand was in the Sky, I heard a Voice within the Tavern cry, "Awake, my Little Ones, and fill the Cup Before Life’s Liquor in its Cup be dry." చదల నుషఃకుమారి చెయిచాయలు తోపగ కల్వరించుచు\న్‌ మెదలక యాలకించితి సమీపసురాభవనమ్మునం దిటుల్‌, 'నిదురలు మాని మేలుకొని నింపుడు పాత్రను చిన్నలార! త త్సదమల జీవనార్ద్ర మధుధారలు ఎండకమున్నె బుంగలన్‌.' 2 And, as the Cock crew, those who stood before The Tavern shouted - "Open them the Door! You know how little while we have to stay, And once departed, may return no more." ఆమధుశాలముందట ప్రియాన నిలంబడి కోడి కూయగా నీమెయి చప్పటుల్‌ చఱచి 'రెందుల కూరక ఆలసింత్రు రా రేమి కవాటముల్‌ తెఱవ రేమి? ముహూర్తము మించిపోయిన\న్‌ రా మిక నెన్నియేండ్లకును, ప్రజ్వలితాసవ మెండు నింతలోన్‌.' 3

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eCRvQa

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

నిన్నటి వెన్నెల ........................ వెన్నెల లో తడుస్తున్నప్పుడు తన్మయత్వమే తప్ప ధ్యాసేది? తలపులు జ్ఞాపకాల్ని తడిమినప్పుడు వెనుకటి రోజులన్నీ మళ్లీ తెరకెక్కుతాయి అప్పటి అంగి లాగులకు అమాయకత్వమే ఎక్కువ చెప్పులు లేని కాళ్లకు చెట్లూ గుట్టలంటేనే మక్కువ మోకాళ్లమంటి నాగులకుంట నీళ్లల్లో నీరుగట్టెల్ని నిర్లక్ష్యం చేసే తెంపరితనం వీరన్న గుట్ట సందమామ గుట్ట సొనికల్లో సీతాలప్పండ్లకోసంసొట్లు శోధించడం ఎండకాలం పెరండ్లల్ల దిరిగి రేగుచెట్టు దులిపి రేగువండ్లతోటే గూడరామయ్యయో బొమ్మెన కిట్టయ్యయో తిట్లుగూడాదినటం దాగుడుమూతలాడుకుంటూ ఎదురింట్లో పక్కింట్లో గుమ్ములు గరిశెలు ఖరాబుజేసి గడ్డివాములు ఖంగాలి జేసి వాళ్ళవి వీళ్లవి సొడ్లు దినటం గద్దె మీద కస్పనర్సిమ్లు తాత కతలు వినుకుంటు పోద్దుబొయ్యినాంక ఇంట్ల తిడ్తరని బయంబయంగ ఇంటికి జేరి అయినయా తిరుగుళ్ళు అని అక్షింతలు వేయించుకోవడం కంక బద్దల తోటి బాణాలు జేసి పజ్జొన్న బాణప్పుల్లల చివర్ల చింతపండు మైదంబెట్టి బట్టల దుకాన్ల అట్టలుదెచ్చి కత్తిరిచ్చి కిరీటాల్జేసి బొగ్గు మీసాలతో మక్కబూరు గడ్డాలతో రోకలిబబండ గదలతో సైకిలుట్యూబు తోకలతో అరుగులమీద నాటకాలాడిన ఆకతాయితనం రోకలిబండ నడుమ బట్టపేగులో కప్పనుబెట్టి కట్టి బుజంమీద మోసుకుంటూ ఇల్లిల్లూ దిరుక్కుంటూ కప్పతల్లి కప్పతల్లి కడుపు నిండవొయ్ అని పాడుకుంటూ ఇండ్ల ముందర నిలబెట్టి ఆడోళ్లు నెత్తిమీద గుమ్మరించిన నీళ్లకు పెయ్యిమీది బట్టలుదడిసి దగ్గువడిషాలు తెచ్చుకోవటం చిర్రగోనెలాడుకుంటు తుమ్మూరోళ్లింటినుంచి కాసర్ళోళ్లింటిదాకా బజార్లు కొలుచుకుంటూ బలాదూరుదిరగటం సిగిరెడ్డబ్బాలు జమ జేసి పత్తాలు తయారుజేసి పగటిపూట పసులకొట్టంల పత్తాలడటం ఎంగిలి పూలనాట్నుంచి సద్దులదాకా గుమ్మడి పూలకు గునుగు పూలకు తంగెడుపూలకు చెట్టపట్టాలతో చేన్లు చెల్కలు దిర్గటం వెన్నీల రోజులైతే బజారు ఉస్కెల వెన్నీల చన్నీల అనుకుంటూ వెలుగు నీడలతో దోబూచులాడుకోవటం వానకాలం వరదకుకొట్టుకొచ్చిన ఉస్కెల దాసన్నపుల్లలాడటం లేకపోతే బొమ్మరిళ్లుగట్టడం తుమ్మ బొంగరాలు పట్టుడు బొంగరాలు దెచ్చుకుని జాలలు పేనుకుని బొంగరాలాడేటప్పుడు గుండందాటి తిరిగిన బొంగరం మీద బొంగరం ములికితో పోట్లు పొడవటం గడ్డపోణి దుకాన్ల కొనుక్కొచ్చిన గోలీలతో జేబులు నింపుకుని బొటనవేలు నేలకానించి మధ్యవేలుతో గోలికి సూటివెట్టి గోలీతో కొట్టడం అప్పటి ఆటలే వేరు ఆ రోజులే వేరు అప్పటి దోస్తులందరూ ఇప్పుడు ఎక్కడ మనుమలతో మనుమరాళ్లతో ఆడుకుంటున్నరో అది కరువైనవాళ్లు జీవితాలు బరువైనవాళ్లు నిన్నటి వెన్నెల ఎక్కిళ్లతో ఎరుపెక్కిన చెక్కిళ్లతో కార్చలేని కన్నీళ్ళతో కడ వైపు చూస్తున్నరో.... వాధూలస 15/3/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m5SDUr

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ ||సాహితి రాశీభూతమైన రసానుభూతి (30న రాయప్రోలు సుబ్బారావు వర్ధంతి) - - మంగు శివరామ ప్రసాద్ కచకుచాది స్ర్తి అంగాంగ వర్ణనలతో సంభోగ శృంగారానికి పట్ట్భాషేకం చేసిన ప్రబంధ కవుల కబంధ హస్తాలనుంచి సాహిత్య సరస్వతికి విముక్తి కలిగించి శారీరక సంపర్కం లేని వియోగ శృంగారాన్ని శారదా పీఠంపై అధివసింపచేసిన మహోన్నత సాహితీవేత్త రాయప్రోలు సుబ్బారావు. అమలిన శృంగార సమారాధమే తన సాహిత్య సాధనగా పేర్కొన్నారు రాయప్రోలువారు. ‘‘శృంగారః శుచిరుజ్జలః‘‘ అన్న ఆర్యోక్తి వీరి అమలిన శృంగార సిద్ధాంతానికి మూలాధారము. ‘మేఘ సందేశం’ రెండవ సర్గ 52వ శ్లోకంలో వియోగంలోనే ప్రేమ విలసితమని కాళిదాసు ఇలా చెప్పాడు: ‘‘స్నేహనాహుః కిమపి విరహే ద్వంసినస్తే త్వభోగా దిష్టే వస్తు న్యుపచితరసాః ప్రేమ రాశీభవంతి’’ విరహంలో ప్రేమ నశిస్తుందంటారు. కాని వియోగంలోనే ఇష్టమైన వస్తువుపై ప్రేమ రసానుభూతిని చెంది రాశీభూతమవుతుందని మహాకవి కాళిదాసు భావన. కాళిదాసు ప్రవచించిన వియోగము చివరికి సంయోగానికే దారి తీయడం ప్రాచీన కవులు నిర్వచించిన శృంగార లక్షణం. రాయప్రోలువారు విఫ్రలంబ శృంగారానికే చరమస్థాయిలో ప్రాధాన్యాన్ని కల్పించారు. ‘‘కాలేనా వరణాత్యయాత్ పరిణతే యత్ స్నేహసారే స్థితం భద్రం తస్య సుమానుషస్య కథమప్యేకంహి తత్ ప్రాప్యతే’’ కాలం గడిచేకొద్దీ భార్యా భర్తల మధ్య సంబంధము స్నేహంగా మార్పు చెందుతుందని భవభూతి ఉత్తర రామ చరితలో ఈ అంశానే్న చెప్పాడు. భవభూతి ఈ భావానే్న రాయప్రోలు తన అమలిన శృంగార తత్వానికి పరమావధిగా పరిగ్రహించారు. ఆయన రచనల్లో మకుటాయమైన ‘‘తృణ కంకణము’’ ఖండ కావ్యంలో ఈ అభిప్రాయానే్న కావ్యనాయికచేత ఇలా పలికించారు. ‘‘సరససాంగత్య సుఖ వికాసముల కన్న దుస్సహవియోగ భరమై మధురము సకియ... కనుల నొండొరులను జూచుకొనుటకన్న మనసు లన్యోన్య రంజనల్ గొనుటకన్న కొసరి ‘యేమోయి’యని పిల్చుకొనుటకన్న చెలుల కిలమీదనేమి కావలయా సఖుడు’’ ఉదాత్త ప్రణయ భావనకు అపురూపమైన రూపకల్పన. పూవుకు తావి అబ్బినట్టు ఈ భావనకు రమ్యతను ప్రసాదించింది స్నేహ మాధుర్యము. చిన్నప్పటినుండి ప్రేమించుకున్న యువతీ యువకులకు విధి వశాన వివాహం కాలేదు. ఆమెకు వేరొకరితో వివాహమవడంతో అతడు భగ్నప్రేమికుడై, ఆమెనే తలుస్తూ కాలం గడుపుతూ వుంటాడు. చాలా కాలం తర్వాత వారిద్దరు కలుసుకున్నప్పుడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా నవకమోడని తృణకంకణాన్ని అతడు ఆమెకు కడ్తాడు. ఎటువంటి మనో వికారానికి లోను కాకుండా వియోగం లోనే స్నేహ మాధుర్యం వుందని భావిస్తూ దానినే జీవితమంతా అనుభవించాలనుకోవడమే ఈ ఖండ కావ్యంలోని ప్రధానాంశం. ‘తృణకంకణము’ కావ్యంలో శృంగారాన్ని సంభోగాభిముఖంగా కాక స్నేహ ఉద్దీపనగా ప్రయోగించారు రాయప్రోలువారు. ‘‘పూజా శాలకు శయ్యా గృహమునకు అంతరముండదా! శృంగారమునకు శుచి, రుచి రెండు అంశాలు ఏర్పరుచుకున్నాను. అందువలన ఇందలి శృంగారముని విలక్షించి, అమలిన శృంగారమని,’’ ఆయన అన్నారు. కామం, ప్రేమ రెండూ ఆయన భావనలో శృంగారంగా భాసించాయి. కొమర్రాజు లక్ష్మణరావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగార్ల సానిచర్యం, స్నేహంతో రాయప్రోలువారు నవ్యకవిత్వానికి కవాటాలు తెరిచారు. శబ్ద మాధుర్యము, అర్ధ ప్రసన్నత, సంప్రదాయ అభిమానము, దేశభక్తి, ఆత్మసౌందర్యము, తెలుగు సంస్కృతిపై ప్రేమ, ఆధ్యాత్మిక చింతనల సమాహారము వీరి వాజ్ఞయము. కథా కథనంలో వర్ణనలో, భావ ప్రకటనలో కొత్త బాటలు వేసారు. భావ గాంభీర్యము, భాషా సౌకుమార్యము, శైలివిన్యాసము సరస సమ్మేళనము వీరి కవిత్వము. మేఘదూతం, మృచ్ఛకటికం, స్వప్న వాసవదత్త వంటి ప్రాచీన సంస్కృత కావ్యాలు వీరిని బాగా ఆకర్షించాయనడానికి నిదర్శనం వాటి ప్రభావం ఈయన రచనల్లో ప్రతిబింబించడమే. అల్లసానిపెద్దన, శతావధాని తిరుపతి శాస్ర్తీని అనుకరించానని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. భవభూతి కాళిదాసాది ప్రాచీన సంస్కృత కవులు వీరికి ఆరాధ్య దేవతలు. శంకరాచార్యులు సౌందర్య లహరిలో చెప్పిన విషయాన్ని, ఉపనిషత్తుల సారాంశాన్ని, పాశ్చాత్యతత్వాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని ఆకళింపు చేసుకుని తన అమలిన శృంగార సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మహాకవి కాళిదాసు రచించిన ‘మేఘ సందేశం’ కావ్యాన్ని ‘దూత మత్త్భు’ పేరుతో తెనిగించారు. ‘శకుంతల’, ‘ఉత్తర రామచరిత్ర’ రాసారు. ‘ఉమర్ ఖయ్యామ్’ను ‘మధుకలశం’ పేరుతో అనువదించారు. రవీంద్రుని వ్యాసాలను తెనిగించారు. తెలుగు వాజ్ఞయాన్ని ఆంగ్లంలోకి అనువదించి ‘త్రివేణి’ పత్రికలో ప్రకటించారు. ‘సాహిత్య సౌందర్య దర్శనం’ అనే వ్యాస సంపుటిలో రాయప్రోలువారు తన జీవిత విశేషాలను, శాంతినికేతన్‌లో ఆయన అనుభవాలను ప్రస్తావించారు. వీరి సాహిత్య విమర్శ, సౌందర్య దృష్టిని వివరించే గ్రంథం ‘రమ్యాలోకం’పై సాగిన చర్చల నేపథ్యంలో ‘మాధురి దర్శనం’, ఈ రెండింటికి వ్యాఖ్యాన రూపంగా వచ్చింది ‘రూప నవనీతం’. దీనిలో స్ర్తి మనస్తత్వ పరిశీలన వుంది. ‘మిశ్రమంజరి‘ అనే రచనా సంపుటికి రాయప్రోలువారి 1962లో కేంద్రసాహితి అకాడమీ అవార్డు లభించింది. ‘స్నేహలత’ కావ్య ఖండికలో వరశుల్క నిరసనగా పితృగృహరక్షణకు ఆత్మార్పణ చేసుకున్న పధ్నాలుగు వసంతాల కన్యక కరుణామయ గాథ సాంప్రదాయ ఆర్ష వాతావరణంలో ప్రతిబింబించింది. ‘అనుమతి’లోని నాయిక తను వివాహమాడదలచిన వ్యక్తి వేరొక స్ర్తికి భర్త అయినా, అతని మరణానంతరం అతని భార్యాబిడ్డలకోసం త్యాగం చేసి పెద్ద మనసు కలిగిన దయాశీలి. ‘‘నాకు ఆంధ్రాభిమానం జన్మాంతర వాసనగా వచ్చినట్లున్నది’’ అంటూ ఆ అభిమానంతో దేశభక్తి గేయాలు, ఆంధ్రాభిమాన కవిత్వం చాలా వ్రాసారు. బంకిం చంద్రుని వందేమాతర గీతం రాయప్రోలు వారి దేశాభిమాన కవిత్వానికి ఓంకార నాదమయింది. అలనాటి ఆంధ్రౌన్యత్యాన్ని అపురూపమైన కవితా దృష్టితో చూడగల సాహితీ స్రష్ట, దార్శనికుడు రాయప్రోలు. ‘‘పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము’’ అనే ఆయన ఏ దేశమేగినా ఎందుకాలిడినా అనే దేశభక్తి గేయం తెలుగు లోకోక్తిగా ప్రజల నాల్కులపై నిలిచిపోయింది. ‘‘ఆంధ్రావళి’’, ‘‘తెనుగుతోట’’ వంటి రచనలు ఆయన ఆంధ్రాభిమానానికి ఉదాహరణలు. ‘తెనుగు తల్లి’ అనే గేయంలో ‘నందనోద్యాన సౌందర్యము నెగబోయి’ అంటూ అని ఆంధ్రదేశంలోని పలు ప్రాంతాల వైభవాన్ని స్తుతించారు. - మంగు శివరామ ప్రసాద్ 15-3-2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m5SG2k

Posted by Katta

సత్యవతి కొండవీటి కవిత

మనలో ఉప్పొంగే ప్రేమనంతా ఒక్కరి మీదే కుప్పపోస్తే... మహా ముప్పు.... ప్రపంచమంతా వెదజల్లితే... చుట్టూ పచ్చటి ప్రేమ వనాలే...పరిమళించే ప్రేమ పుష్పాలే.

by సత్యవతి కొండవీటి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eCRtI3

Posted by Katta

Chennapragada Vns Sarma కవిత

ఎన్నికల ప్రస్థానం-5 పుట్టగొడుగుల్లా వస్తున్నాయ్ కొత్త కొత్త పార్టీలు.. పడక తప్పవేమోలే ఎన్నికల్లో పల్టీలు.. పార్టీ అంటె కాదు మరి అంగట్లో దొరికే కర్రీ.. హడావుడెంత చేసినా చివరికి మిగిలేది వర్రీ.. \15.3.14\

by Chennapragada Vns Sarma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eCRvzD

Posted by Katta

Sriarunam Rao కవిత

సామాన్యుని మనసే...పవనిజం. ఆశలవిత్తనాలు మొలకెత్తించిన ఆశయాలమొక్కలు నిరంతరంగా పుడుతూనేవుంటాయి, కొందరు...వాటిని పిచ్చిమొక్కలనుకుంటారు,కానీ... చెదిరిన నమ్మకాలూ... నాశనమవుతున్న నిజాలూ... వంచిస్తున్న నాయకత్వాలబారినపడిన హృదయాలుకొన్ని... ఆ మొక్కలచిగుళ్ళతో కలిసిపోతూ తమ జీవితాలకు నీడనిచ్చే మహావృక్షాన్ని నిలబెట్టుకుంటాయి. జాతుల గొంతుకలు కోస్తున్న ఘాతుకాలన్నిటినీ ఇన్నాళ్ళూ మౌనంగాభరించిన మేఘాలు...చేరి పిడుగులశబ్దాన్ని సృష్టించే శంఖాన్ని సిద్దంచేస్తున్నాయి ఒంటరితనంలో ఉదయించే ఆక్రోశమే... ఓర్పుకీ ఆవేశానికీ అర్ధవంతమైన సంబంధాన్ని నిర్వచిస్తుంది సామాన్యుని గుండెకోత తెలుగువాడి హృదయపు వ్యధ వంచించిన మానవత్వం భారతీయిని భవిష్యత్ కోణం ఇవన్నీ కలగలిసినదే పవనిజం, అది "హీరోయిజంకాదు...కామన్ మాన్ నైజం" అంటున్న జనసేన నిజమైన నవ్యప్రపంచానికి ప్లాట్ ఫాం ఇక బయలుదేరండి... మార్పుకోసం మనందరికోసం మనిషి మనిషికాబ్రతకాల్సిన తీరంవైపుకి. శ్రీఅరుణం విశాఖపట్నం

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fHE1XA

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి కుసుమంతో అలా ఓరగా చూడకు గుండె పొంగుతోంది అలా కొంటెగా నవ్వకు మనసు మళ్లుతోంది అలా చల్లగా పాడకు హృదయం తుళ్లుతోంది అలా మెల్లగా మెదలకు వయసు గెంతుతోంది కానీ నన్ను వదలకు జీవితం ఏడుస్తుంది 09MAR2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fHE2uK

Posted by Katta

R K Chowdary Jasti కవిత

In the Depth of Love She eliminated those dreams From my eyes of hallucination And captured me into her reality Releasing me from pain so chronic And that’s how she fixed my life With her lovely touch, so tender. She held me in her classified niche That I can’t regress into that life That’s so smarting to my heart That I can’t make any egress From her unique love, so deep Of her divine heart, so affable. Even if, I’m there at the edge Of death, from there, she will Draw me into her world, that’s Quite safe and pleasant for my Soul, which’s craving for such A rapture, where I never die but Live in peace in her lap of love. © R K Chowdary 15MAR2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NfRbQ0

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || మనస్సాక్షి|| +++++++++++++++++++++ నా అచేతన స్థితిని మేల్కొల్పితే ఎన్ని నిజాలు బయటకోస్తాయో అందుకే నిజాలుకు నివురు గప్పి చేతనంలోనే ఉండిపోతున్నాను చూసిన సాక్ష్యాలన్నీ రెటీనా లోనే దాచేస్తున్నా ఏదో రోజు కనుపాపలో నిన్ను చూడాలని నా కళ్ళల్లో దాచేసుకోవాలని రెప్పలు తెరిచే ఉంచా చిన్నమెదడులో సగ భాగం నిద్రపుచ్చా గాయాలన్నీ దాచేసుకోవాలని దాగని గాయాలు మాత్రం పెద్ద మెదడును గెలికేస్తున్నాయి అందుకే నిద్రాణ స్థితిలో ఉండిపోతున్నా చేతన అచేతన స్థితుల మధ్య కొట్టు మిట్టాడుతున్నా అర్ధం కాని లాజికల్ సైకాలజీ మనసును తొలిచేస్తుంది నివురు పోతుంది నిజం నిప్పై కనపడుతుంది గుండె గాయాలు గుచ్చుకుంటున్నాయి మనసు మాత్రం నిదుర పోతుంది ఎప్పటికి లేవకుండా సాక్ష్యాలును సజీవ సమాధి చేస్తూ నేను చేతనం గా ఉండిపోతున్నా =================== మార్చి 15/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fHE2em

Posted by Katta

Usha Rani K కవిత

Life -- and how wonderful it is -- follows our tracks and slowly disappears in the depth of our dreams. Of our dreams. There's always a way to talk of these as if their secret meaning had been revealed only to you, though that only expresses quite succinctly just how little it has. At first everything seems easy -- almost unavoidable. On a beach, say, holding Thomas Hardy's poems whispering meaningfully in her ear: "I have lived with Shades so long," and later in the hotel room after the last embarrassing assurances: "How gentle that candle . . . It bids farewell to night wiping away its tears." Is there any point now in admitting the compact? In saying or writing "a love is perhaps but an exchange of vocabulary," when the void that is our due is already mirrored in the splintered light of our eyes? The turning of the page. The starry darkness of the book and the agony of the transparent man in a translated world. "Words do not fear words; they fear the poem." The end is always the beginning of a new magnificent denial. -- Haris Vlavianos (translated from the Greek by David Connolly) From 'New European Poets' [A major anthology spanning the diversity of the latest poetry to come out of Europe, New European Poets presents the works of poets from across Europe. In compiling this landmark anthology, Wayne Miller and Kevin Prufer enlisted twenty-four regional editors to select 270 poets whose writing was first published after 1970. These poets represent every country in Europe...]

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hkR3bg

Posted by Katta

Nvn Chary కవిత

ఆ పవనం ఏ తీరాన్ని తాకుతుందో అర్థమైంది ఏ వనం పుష్పమో తేటతెల్లమైంది సీమంద్ర (కా)గాయం తెలంగాణా లేపనం (రంగుల్ని) పూసుకుంటున్నది అభిమానపు పునాదులపై తన ఆనవాళ్ళను పేర్చుకుంటున్నది

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kswJrl

Posted by Katta

Kapila Ramkumar కవిత

A Very Short Song Once, when I was young and true, Someone left me sad- Broke my brittle heart in two; And that is very bad. Love is for unlucky folk, Love is but a curse. Once there was a heart I broke; And that, I think, is worse. Dorothy Parker 15.3.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kswJaP

Posted by Katta

Shamshad Mohammed కవిత

లేక్ టాహొ చిరుగాలికి రాలే బొడ్డుమల్లెల్లా లేలేత కిరణాల తాకిడికి రాలుతున్న మంచు ముత్యాలు ఎడారిలో ఇసుకలా పరుచుకున్న మంచులో మనసు గిరికీలు కోట్టే యవ్వనమై ప్రేమ బంతులు విసురుకుంటున్నాయి వయసు కేరింతలు కొట్టే పసిదై స్కీయింగ్ బొర్ద్ పై జారుతున్న జంటలు పడవలో లహిరి లహిరి లహిరిలా ట్యూబింగ్ లో షికార్లు సాగుతున్నాయి హుషారుగా శరీరానికెన్ని ముసుగులేసినా కుక్కిమంచంలో ముసలమ్మలా వణుకుతుతోంది చెరువులో మంచుతెప్పల్ని కుప్పలుగా పోసినట్టుంది ఆకాశం మసక చీకట్లో మంచు చీర చుట్టిన కొండమల్లివైపు వోరగా తొంగి చూస్తున్న సందమామ షంషాద్ 3/14/2014

by Shamshad Mohammed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLgzMh

Posted by Katta

Sree Kavitha కవిత

ముసురుకున్న వలపు వానలొ హర్షంతొ తడుస్తూ నువ్వు నేను కలిసి ఒకటై ఆనంధించె మధురిమలు ఈ నీటి భిందువులు భంధువులై మనతొ చెసెను సరసాలు వలసిన నేను తలసిన నువ్వు తమకంతొ కలిసిన వలయమును చూసి మురిచిపొయిన ఆకాసం గగనపు వీది విడిసి తరలింది మనకొసం ద్రవించి కురిపించేను తడుపుతున్న జోరు వర్షం ముసిరిన వలపు వానలొ మొత్తం ఆమాంతం తడిసిపొదాం విసిగి వేసారి కసురుకున్న కాలాన్ని కలగా మరిచిపొయి క్రొత్త ఆద్యానికి పునాధి వేద్దాం మన ఆశయాల ఆశలను చిగురింప సెద్దాం మనస్పర్దలు వాన నీటి ముత్యాలతొ కడిగెద్దాం నాఆలొచన నీవై నీ కనుపాప మీద నేనై ఒకె బాటగ ఒకె ఆటగా ఒకె పాటగా శ్రుతిలయలతొ సప్త స్వరాలు పలికిద్దాం రాగాలు ఆలపిద్దాం కలకాలం కలసి సాగుదాం కాలనికి నిదర్శనమౌదాం ....@ "శ్రీ" శుభరాత్రి నేస్తాలు!!

by Sree Kavitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gk0bdX

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ అమ్మ మీద ప్రేమ కవిత్వం @ ప్రేమ కవిత్వం రాయడానికి ప్రేమగా నా కలాన్ని కదిలిస్తే ఇంకా నాలో నుండి దూరం కాని ఆ ఉద్యమ భావావేశం ఇప్పుడెం ప్రేమ కవిత్వం రాస్తావు అని అడిగింది. అరుణజ్వాలా కెరటాలతో ఎద సముద్రం నిన్నటి దాక ఎగిసి పడి ఇప్పుడిప్పుడే కదా నెమ్మదిస్తుంది. అని నా కలం నన్ను ఒధార్చినపుడు శాంతించిన హృదయమే రాయాలి ప్రేమ కవిత్వం ., అన్నాను రాశాను అమ్మ మీద ప్రేమ కవిత్వం అది తెలంగాణా అమరుని మాతృమూర్తికి అంకితమిచ్చాను . నా కన్నీళ్ళ సాక్షిగా... _ కొత్త అనిల్ కుమార్ 15/3/2014

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NeAGDM

Posted by Katta