పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

విష్వక్సేనుడు వినోద్ కవిత

ప్రాణం పోక... అన్నం మెతుకులు ఇకచాలని కొన ఊపిరితో భరించలేక చీకట్లో ఉన్నా ప్రభువా! నీదరి చేర తలుపులెందుకు మూసేవు? కట్టుబట్టలు దేహానికొదిలి చావు బ్రతుకుల వంతెనపై కొట్టుమిట్టాడుతున్నా దేవా! కనికరించక ద్వారంలో ఎందుకాపేవు? ధనధాన్యాలను మోసుకెళ్ళలేక బహు బంధాలను వదులుకొని నీ బంధీకై వస్తున్నా భగవాన్! వద్దనుకున్న ప్రాణానికెందుకు కాపుగాసేవు?

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lQGxMu

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||వర్ణవివక్ష|| ఎంత ప్రేమగా పట్టుకున్నాను దాన్ని. నా చేతులతో లాలనగా నిమురే లోపే విసురుగా ఎగురుతూ, నా నల్లటి చేతులపై తెల్లటి గీతలు రక్కుతూ, తెల్లటి రెట్టేసి ఆ తెల్ల పిట్ట ఎంత అహంకారంగా ఎగిరిందది. నా రంగుని అవమానిస్తు. ఒకే ఒక్కదెబ్బ, మెడవిరిగి, రెక్కలు తపతపమని కొట్టుకుంటూ చచ్చింది, ఆ తెల్లపిట్ట. --------------------------11/4/14

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oTUi1A

Posted by Katta

Aruna Naradabhatla కవిత

ఉత్తిమాట _________అరుణ నారదభట్ల రాలిపడుతున్న ఆకుల సవ్వడిలా సమానత్వం ...సందడి చేస్తూనే ఉంది! తర తరాలుగా పేరుకు పోయిన అణచివేత మళ్ళీ అన్ని తరాలు ముందుకు నడిచినా తేరుకోలేకపోతుంది... కలం పట్టి గళం ఎత్తగలం గానీ చుట్టుకున్న బంధంలో ఆ తాత్వికత చూపగలమా! ఇంటి గడపనుండే మొదలవుతుంది... నీ...నా అనే తత్వం! ఎందరో మేధావులు ఏళ్ళతరబడిగా పేజీలు నింపుతూ...ఆదర్శాలు వల్లెవేస్తున్నారుగానీ ఇంట్లోని మనుషులకు కూడా ఆ మాటలు వర్తింపజేస్తున్నారా! తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు అక్షర బాణాలూ..మాటలతూటాలూ పూల జల్లులా వెదజల్లి సమాజాన్ని ముందుకు నడిపే దిశలో పాత్ర పోషిస్తున్నట్టు జాగృతి ముసుగులో భ్రమింపజేస్తూనే ఉన్నారు! కాటికాపరిగా జీవితాలను ఆహుతి దిశలోకి నెమ్మదిగా తోసేయడం చూస్తుంటేనే కలం చెప్పే కహానీలు ఎన్ని కలలను కూల్చేస్తున్నాయో గురుతొచ్చేది! గురివిందగింజ సామెతలా వెన్నంటే ఉండే నీడలనూ తమలో తాము ముందు సంస్కరించుకోవడం నేర్చుకునేదెప్పుడో ! గుమ్మానికి వేలాడే మామిడి తోరణంలా మహిళ జీవితం...పేరెన్నిక గన్న పెద్దల చాటున గొంతు దాటలేని మనసుతో మౌనపోరాటం చేస్తూనే ఉంది! పచ్చదనం కోసం కొందరు మగువలు జీవం లేని ప్లాస్టిక్ తోరణంలా అన్ని సందర్భాలనూ ఆర్టిఫిషియల్ గా స్వాగతిస్తుంటేనే చూడలేని కాలం వేప పూతలా ముందే రాలిపోతుంది! 11-4-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBpKzG

Posted by Katta

Vijay Lenka కవిత

With due respect for the forum and the architect (Sateesh?) I have to say limiting it to one poem a day reminded me of a news where toilet tissue was rationed with whatever rationale. OK 'one a day' a one liner or 100 liner and I understand one shouldn't clog (obviously it stinks); but rules have to be there and the rulers ('ya all remember the old days) may have to change!

by Vijay Lenka



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBpJMk

Posted by Katta

Viswanath Goud కవిత

ఆలోచన బద్ధకాన్ని బ్రద్దలు కొట్టి ఒళ్ళు విరుచుకుంటుంది ఓ ఆలోచన భగీరథ ప్రయత్నానికి నడుం కట్టాలని ఆవేశంతో అనుసంధానించిన ఆలోచన ఎటైనా సాగొచ్చు...మంచికో చెడుకో....పతాకానికో అగాథానికో ఎటువైపో ఓ వైపు లాక్కెళుతుంది. ఆలోచనలన్నీ పొద్దు పోక చేస్తామనుకునేరు అందులోంచే ఓ పొద్దు పొడుస్తుంది నీ కళ్ళకు కమ్మిన చీకటి పొరను చీల్చుకొస్తుంది అందులోంచే పొడిబారని ఓ వెలుగు కిరణం అగ్నికెరటమై మస్తిష్కాన్ని తడుపుతూనే ఉంటుంది ఆ తడి తగిలి..మేల్కొన్న మనసు త్వరత్వరగా చచ్చుబడిన నీ అవయవాలను మర్దించి కార్యోన్ముఖం చేస్తుంటుంది ప్రస్తుతానికి ఆలోచనలన్నీ కట్టగట్టి కాళ్ళకింద తొక్కిపెట్టి ఒక్కో ప్రయత్నపు అడుగులో ఒక్కోటి చల్లుకుంటూ పోదాం ఏదో ఒక ఆలోచనైనా పచ్చగా మొలకెత్తకపోతుందా ఆ మొలకే మొదలు... తుది లేని ఇంకెన్నో ఆలోచనలను శాఖోపశాఖలుగా విస్తరింపజేయడానికి చిత్రం.... నా ఆలోచనలు ఆకాశంలో తారాల్లా మెరుస్తున్నాయి... చుక్కలు ఓ చెట్టు కొమ్మకు అతికించిన ఆకుల్లా వేళాడుతున్నాయిప్పుడు.! 11APR14

by Viswanath Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBpGQz

Posted by Katta

Nirmalarani Thota కవిత

ఇంటి నుండి బయలు దేరాను ఆనందాన్ని అన్వేషించుకుంటూ . . దారిలో ఎదురైంది విషాదం ! నేనూ వస్తానంది . . ఏ తోడూ లేని నేను సరే అన్నాను ఇక అదే నా శాశ్వత నేస్తమై నాతోనె ఉండిపోయింది నీడలా ! రాని వాళ్ళు ఎలాగూ రాలేదు రాక రాక వచ్చిన ఒక్క అతిథినీ ఎలా వెళ్ళిపొమ్మనగలను?

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gi2ZNj

Posted by Katta

Padma Arpita కవిత

నాకు తెలిసినదేదో!! ఈ లోకంలో నటించనివారు ఎవరు?? లేనిది చూపే ప్రయత్నమే నటించడం ప్రేమించలేనివాడు ప్రేమని నటిస్తే నిజం చెప్పలేనివాడు అబధ్ధమాడతాడు! ఆకర్షించలేనివాడు అందాన్ని అరువడితే నిజాయితీలేనోడు అన్యాయాన్ని ఆశ్రయిస్తాడు! ఈ రంగులుమార్చే లోకంలో ఎవరికెవరు?? ఒకరి కోసం ఒకరని మోసగించుకోవడం స్వార్థమెరిగినవాడు ఇతరులని మోసగిస్తే అసూయాపరుడు ఆదర్శాలని వదిలేస్తాడు! తనవద్ద లేనిది ఇతరుల్లో చూసి కొందరేడిస్తే తత్వమెరుగనోడు తర్కించి గెలవాలనుకుంటాడు! ఈ జీవన రణరంగంలో చివరికి మిగిలేదెవరు?? తెలుకోవాలన్న ప్రయాసతో తోలుబొమ్మలై ఆడడం విజయాన్ని కోరువాడు విశ్వప్రయత్నంతో గెలిస్తే దొంగలా దోచుకునేవాడు దొడ్డిదారిలో పరుగిడతాడు! కౄరత్వంతో కఠినంగా మసలువాడు మృగంలా జీవిస్తే మంచిమనుగడ కలవాడు అందరి మదిలో జీవిస్తాడు! 11th April 2014

by Padma Arpita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kd1Bgd

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/అంతా తెలుపే ::::::::::::::::::::­::::::::::::::: కొన్ని రోజులు నీకు తెలియకుండానే కరుగుతుంటాయి నీ ముందే/నిజంగా నువ్వు బ్రతికావో లేదో తెలీదు నటించినట్లుగా అ(గు)నిపించినా ఎండాకాలమేగా రోహిణి కార్తే అని పగిలిన రోళ్ళ వైపు నీ చూపులు కాసిని సంతోషాలు మిగిలాయిలే గతాలను నేరుగా నరుక్కునపుడు అని మనసు జోబులోకి తొంగి చూస్తే అంతా ఖాళీయే నేలపై మట్టి చినుకులు ఆవిరైనట్టు కొన్ని జ్ఞాపకాలను మూకుట్లో దాచుకున్నావుగదాని ఉపరితలమంతా సానబెట్టేశాక మిగిలిన నుసిని పొట్ట సంధుల్లో విరివిగా పారబోసి వెతుకుతావు/­అప్పుడక్కడ నిన్ను కంటూ మిగిలే ఓ శూన్యం వేర్ల పేగులన్ని బయటికొచ్చేశాక ఇక అడుగంటిన విత్తులను చేతివేళ్ళపై పండించుకుంటూ /కోతకు రాని హిమాలయాల గురించి మలయమారుతాలరో ఎదురుచూస్తుంటావు ఇక పాక్షికంగా కలగన్నాక తతిమా స్వప్నాలను పిండుకోగా రాలిన పుప్పొడి ప్రాణాలను పీల్చేస్తూ ఓ శ్వేత భైరవుడు/అదీ నువ్వే తిలక్ బొమ్మరాజు 10.04.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kd1z84

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

ఒంటరితనం రావెల పురుషోత్తమ రావు ------------------------------- వృద్ధాప్యంలో ఒంటరి తనం ఎంతగా వేధిస్తుందే కాలం గడుస్తున్నకొద్దీ అనుభవేకవేద్యమై అవగాహన ఔతున్నది. తీగెలు తెగి పడిన వీణలా తైలం తడికి నోచుకోని దీపంలా ఇంకిపోతున్న జలనిధులుగా ఇలా మిగిలిపోతుందని ఇప్పుడే అవగతమౌతున్నది. మనసంతా మరో మొహంజదారోకి సోదాహరణమై నిలుస్తుందనీ కలత సాకారమై వెన్నంటి వేధిస్తుందనీ క్రమేపీ తెలిసిపోతున్నది. ఆమె స్మృతికి ఏం చేసినా జ్ఞాపకాలన్నీ కుంపట్లో పడిన వంకాయలా మనసు మల మలా మాడుతూ కమురుకంపు క్తుందన్న భయం. చృద్ధాప్యం వరమా? శాపమా?? అన్నది ఒక ప్రశ్నయితే అందులో ఒంటరి తనాన్ని దేనితో పోల్చాలో ఆఅశోపహతులైన అదృష్ట హీనులకెలా తెలుస్తుందని నా విన్నపం నినయపూర్వకమైన సమాధానం. --------------------------------------------------11-4-14

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kd1AJg

Posted by Katta

Pulipati Guruswamy కవిత

కలవరింత కలవరింత కలవరింత // డా.పులిపాటి గురుస్వామి // ఎక్కడా దిక్కు తోచని సమయం లో నువ్వు గుర్తుకు వస్తావు. పరిమిత మైన జ్ఞానం నిన్ను పూర్తిగా చేరనివ్వదు. ఒక తడి గుడ్డ చుట్టిన తపన నోరు తెరుచు కుంటుంది చెప్పుకోవడానికి ఎవరున్నారు దుఃఖం తప్ప అదీ ఒక్కోసారి మాట వినక ప్రతి కంటి చివర వేలాడుతూ ...నా లోపలికే చేరుతుంది కలలు కూడా కనికరించని కాడ వల నిండా నేనే వుంటిని సమయానికి కూడా చిక్కనంత చిక్కుకుపోయాం అవునా? ఏ చిరుగు కాడ కప్పి కుట్టు కుందామన్నా సరిపోయేలా లేవు నువ్వు అప్పటికప్పుడు కొన్ని మాగిన వాక్యాల ఉద్రేకం మీద నీ చూపు వాలితే ఇంకేముంది ... అంతా శూన్యం అనిపించటం ఎంతసేపు. ..... 11-4-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kd1xx5

Posted by Katta

Venkat Jagadeesh కవిత

నాకు , నీ క్రీడలను అర్ధం చేసుకునే సమయం లేదు ..... నేను గర్వం తో తల ఎత్తి నడుస్తున్నా.... నా కాళ్ళ క్రింద నలుగుతూన్న ముళ్ళను స్రవిస్తున్న రక్తపు ధారలను, నా నరాలలో సుడులు తిరుగుతున్న నొప్పిని అర్ధం చేసుకునే సమయం లెదు.... నేను, నేను ప్రేమించిన అన్నిటిని వదిలి వేసాను. నా లక్ష్యం చాలా ఉన్నత మైనదని నాకు చాలా రూడిగా తెలుసు. నీ సందేశాలను క్రోడికరంచడానికి నా తెలివిని వ్యయం చెసుకోను. నా మార్గంలొ ఆనందపు రాశులను నేను కన్నెత్తి కుడా చూడను. నన్ను సృష్టించినంత మాత్రాన నా లక్ష్యపు విలువను నువ్వు అర్ధం చేసుకుంటావని నేను భావించను. ఈ సాధారణ జీవితం లో నాకు ఉన్నత మైనదేమి కనిపించలేదు. ఈ గడ్డి పూలల్లో , వెండి మేఘాల్లో, నువ్వు చెప్పే మార్మిక మైనదేమి కనిపించ లేదు ఋతువులు వెంబడి నడుస్తున్నా, కాలంతో మారిపోయే వర్ణాలను చూస్తున్నా, నన్ను ప్రభావితం చేసేది ఏది కన్పించలేదు. నిన్ను నమ్మి, ఒకోసారి నా హృదయాన్ని కొద్దిగా తెరుస్తాను. కాని అంతలోనే నేను పొందబోయే గొప్ప జీవితం యొక్క ఆలోచనతో దాన్నికుచించేస్తాను ఓ నాలుగు క్షణాల ఆనందపు ఛాయ .....బహుసా అది గొప్పదే కావచ్చు. కాని నేను ఆశిస్తున్న, ఎదురు చూస్తున్న, ఎడతెగక పయనిస్తున్న, దాని ముందు దీని విలువ ఎంత ? నన్ను పోల్చవద్దంటావా ? ఎందుకు ? నా జీవితం లో నేను ప్రతిదీ పోల్చిచుసే ముందుకు సాగాను ఇక నీవు చెప్పే ఈ క్షణపు ఆనందమంటావా? దాన్నిఈ వెన్నెల రాత్రి లోనే కరగిపొనీ...... రాత్రుళ్ళు, పగళ్ళు, ఏళ్ళు గడచిపొనీ..... ఈ శరీరం ఇలానే శిధిలమైపొనీ........ నేను ఇలానే ఈ వెన్నెల రాత్రులను దాటుకుని నీశీధిలొకి ముందుకు సాగుతాను ......

by Venkat Jagadeesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kcPHmA

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nc12mV

Posted by Katta

Sasi Bala కవిత

మధుర క్షణాలు మళ్ళీ వస్తాయా ఆ మధుర క్షణాలు .......sasibala చేల గట్లపై పరుగులు తీస్తూ లేగ దూడతో పోటీ పడిన క్షణాలు .. కోడె దూడతో పోటీగా గోమాత పొదుగును చేరి తాగిన గుమ్మపాల కమ్మని రుచులు మళ్ళీ వస్తాయా ఆ మధుర క్షణాలు పండు వెన్నెల్లో ఒకే పళ్ళెం లో వెన్న ముద్దలూ ,పాల బువ్వలూతింటూ బామ్మ చెప్పేటి కమ్మని కథలను అన్నదమ్ములూ అక్క చెల్లెళ్ళు అందరు కలిసీ ఆస్వాదించిన ,ఆరగించిన ... ఆ మధుర క్షణాలు మళ్ళీ వస్తాయా పండుగంటే చవులు ఊరించు నవకాయ పిండి వంటలతో పంచ భక్ష్య పరమాన్న విందులు లొట్ట లేసుకుని లాగించిన ఆ మధుర క్షణాలు మళ్ళీ వస్తాయా వెన్న చిలికే మహారాణి.. అమ్మ కడకొంగున దూరి నేతి బూరేలకు,చిట్టి గారెలకు మారాం చేసిన .. మధుర క్షణాలు మళ్ళీ వస్తాయా ఆరు బైలలో ..పచ్చని చెట్ల నీడలో మదతమంచాల పాన్పులపై బడి , నింగి వీధిలో ఊరేగే తారా చంద్రుల ఊసులెన్నో మరి ఊహలెన్నో కథలు కథలుగా మననం చేసిన మధుర క్షణాలు మళ్ళీ వస్తాయా నడవను గూడా ఖాళీ లేని వింత జగతిలో పరుగుల బరిలో యంత్రాల లోకం లో ..డబ్బు మహా ప్రపంచంలో ప్రేమలు పోయి ..మమతలు పోయి ఆప్యాయతలకు సున్నం వేసి కనబడని మాయలో ..కొట్టుకుపోతూ ,కూరుకు పోతూ అమ్మనాన్న బంధాలన్నది లేక అన్నదమ్ములూ ,అక్క చెల్లెళ్ళ మమకారాలు కరువైన నరకం లో ఊపిరి(పోసే ???) తీసే విష వాయువులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే శ్వాస నిశ్వాసల నడుమ దైవ నిర్ణయాల కతీతంగా .. మనిషి సృష్టించు మారణకాండల నడుమ బ్రతుకుతున్నామో ...చస్తున్నామో అర్థం కాని త్రిశంకు స్వర్గంలో ఉంటున్న ..మనుగడ సాగిస్తున్న మనం వున్నట్లా ..లేనట్లా మీరే చెప్పండి ..తీర్పును మీరే ఇవ్వండి గడచిన కాలం తిరిగి రాదు .. ఇక మానవ జీవితాన రావేనాటికీ ఆ మధుర క్షణాలు (11 april 14 )

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gfxJer

Posted by Katta

Sriarunam Rao కవిత

ఎన్నికల జాగృతి వెధవల్ని తయారుచేస్తున్న అవినీతి... వరదలా పారుతున్న మద్యం... చెదల్లా పేరుకుంటున్న పొత్తులూ గేదెల్లా కొట్టుకుంటున్న నాయకులూ... పార్టీటికెట్ కోసమే పెద్దపెద్ద ఆర్భాటాలూ... నామినేషన్ ప్రదర్శనలకే రోడ్డెక్కుతున్న జాతరలూ ప్రచారానికే ప్రపంచమంతా ప్రాకేస్తున్న నోట్లకట్టలు... తిట్లూ కోట్లాటలూ హత్యలూ కిడ్నాపులూ... అసలివన్నీ కావాలా ప్రజాసేవకూ??? చూస్తున్నావా ఓ జాతిపితా? నువ్వెందుకు పైవన్నీ వాడలేదు? మేమంతా ఇంతే...మాకూ చరిత్ర తెలుసు వర్తమానమూ తెలుసు భవిష్యత్తూ తెలూస్తూనే వుంది అయినా ఎందుకో ఇలా అమ్ముడైపోతూనేవున్నాం నోట్లకు??? మాకు నీఅంత ఓపికలేదుమరి ఫాస్ట్ ఫుడ్స్ ఫాస్టెస్ట్ ఆలోచనలు సూపర్ ఫాస్ట్ అనుభవాలు బంపర్ ఫాస్ట్ అవసరరాలు మాకిప్పుడు కావాలి. అందుకే మమ్మల్ని మోసం చేయటం అందరికీ తేలికైపోయింది. ఓ మహాత్మా మళ్ళీ ఒక్కసారి మమ్మల్ని ఆవహించు ఈ ఎన్నికల జాగృతిలో మాలోకలగలసిపో నీ నడకే మా ఆశలు కావాలి నీ చేతికర్రే మాకు చేతలు నేర్పించాలి రాక్షసత్వం నిండిపోతున్న ఈ రాజకీయంపై తిరుగుబాటుచేయటానికి నీ పోరాటస్ఫుర్తిని మళ్ళీమాకు ఆవాహనం చేయించు. శ్రీఅరుణం 9885779207

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lVg6HT

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్|\ ఓటుబద్ధ హెచ్చరిక || పార్టీ మారిన నేతకెన్ని కష్టాలో దుమ్మెత్తిపోసేటప్పుడు జాగ్రతలెన్నో తీసుకోక పాత పాటే పాడితే ఓట్లు రాలకపోగా తాటతీసి తన్ని తగలేయగలరు యింటికి పంపుతారు జనాలు మారేటప్పుడు వళ్ళు దగ్గరపెట్టకున్నా ఇప్పుడుమాత్రం జర భద్రం! సీటు గెలవాలంటే! ** గుర్తు తప్పు చెప్పినా అధినాయకుడి పేరు మర్చిపోయినా ప్రస్తుతాన్ని స్తుతించిక పోయినా ఏ యెండకా గొడుగు పట్టకున్నా సమావేశాల్లో, ప్రెస్ మీట్లో నోరు పారేసుకున్నా జోరువాన పడ్డట్టు చెప్పులు పడొచ్చు కుర్చీలు మీద పడొచ్చు అలో లక్ష్మణా అని తప్పించుకోలేక యే సోదరి కోక కట్టుకోక తప్పదు! ఆకట్టుకోక తప్పదు! ** ఇన్నాళ్ళు నమ్మిన జనాన్ని మోసగించడానికి సిగ్గు తీసి ఇంట్లోపెట్టి మనస్సాక్షిని హత్యచేసిన రక్తపు చేతితో రెండు వేళ్ళూపుతూండాలి అవలక్షణాలన్నీ వంటబట్టకున్నా మనుగడకే తిప్పలొస్తాయి మళ్ళీ కొత్త గెంతు వేయాలి ! ** తెలివైన కుందేలు ముతరాసోని వలలో పడ్డట్టు మతతత్వమంటూ రంకెలేసి మఠాధిపతుల ఒళ్ళో వాలాలి కదా కాలు విరగ్గొడతానన్నవాడివి వాని కాళ్ళకాడికే చేరాలికదా యేమొ జనం తెలివితో ఓటిది కాని ఓటుతో బలంగా ఓ పోటు పొడిస్తే కాటుకు తట్టుకోలేకపోతే గోచి సర్దుకుని గోడ దూకటానికి సిద్ధపడాలి కదా! ** దాదాపు పార్టీలన్ని బారులు తెరిచి బార్లా తెరిచి అహ్వానిస్తాయని యెల్లపుడు కలగనకు! ఒక్కొక చోట గడీలమించిన అడ్డుగోడలు లోపలిలి రానీవు అప్పుడు నీగతి అధోగతి పేడకళ్ళు, చీపురు దెబ్బలు తప్పించుకోకలగాలి మద్దతిచ్చే పర్టీలు ముద్దకుడుములు పెడతాయనుకోకు బూడిదలో పన్నిన కుక్క వైరాగ్యంలా పాతవి గుర్తుకొస్తే మడత పేచీలు పెట్టి నీ బతుకు సంకరం చేసి శంకరగిరిమాన్యాలు పట్టిస్తాయి! ** పదవే పరమావధికాదు ప్రజలకొరకు పనిచేయ నియమబద్ధ, నిబద్ధత కలిగి నాయకత్వం వహిస్తే చాలు గౌరవాలు పొందటానికి అంతే కాని వంకలేనమ్మ డొంకట్టుకు యేడ్చినట్లు కబుర్లు చెప్పకు! అజెండాలకు నీళ్ళొదిలి జెండాలట్టుకు తిరుగకు! ఇది ఓటుబద్ధ హెచ్చరిక! ** 11.4.2014 సాయంత్రం 5.55

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OOIPzu

Posted by Katta

Vijay Lenka కవిత

ఒలమ్మొ నా కళ్ళు నాకే కనిపించటం లేదు బహుశా నెత్తికెక్కాయేమో మనసు తాటి చెట్టెక్కిందేమో ముంతను అక్కడే ఖాళీ చేసిందేమో

by Vijay Lenka



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kc8L4q

Posted by Katta

తెలుగు రచన కవిత

***** ఓటమి విజయం ***** స్పృహలో ఉండి,యుద్ధంచేసా ఫలితంగా నే అపజయమొందా . ఆచీ తూచీ అంచనవేస్తే కోల్పోయిందీ అర్థరాజ్యమే. గెలిచినవాటికి లెక్కలు వేస్తే ఒకటారెండా?వేలకువేలు నేలకు వరిగిన సిపాయిలాళ్ళు. గెలుపనుకుంటూ ఓడినప్రాణం వెలకట్టేందుకు వెయ్యఁలెక్కలు లేనేలేవే అంకెలు ఇంకేన్. స్పృహకోల్పోయి యుద్ధంచేసా. పోగులుపడ్డ శవాలపైన పోరుకుపోయీ జయించుకొచ్చా. పోయినప్రాణం ఖరీదు కడుతూ, లెక్కలు గట్టఁ అంకెల్లేక , స్పృహలోఉండే యుద్ధంచేసా. ఓడిందంతా జయించుకొచ్చా!! .......య.వెంకటరమణ

by తెలుగు రచన



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1evEN5Y

Posted by Katta

Amar Pasha కవిత

ఒంటరి దీపాలు..!! యెన్ని రోజులు ఈ కలహాలు ఈ విరహాలు.. యెన్ని రోజులు ఈ అలగడాలు ఈ బ్రతిమాలడాలు... బురదలో వాన జల్లు పడి పుట్టిన బుడగ లాంటి జీవితాలు ఈవాల్టికి ఉన్నా రేపటికి గ్యారంటి లేదు యే క్షణం యే ఆపద తరిమినా పుస్తకంలో పుటల్లా నిస్సాహయంగా చెదిరి పడల్సిందే తప్ప చేయుతనిచ్చేజాడలేని అధురే జీవితాలు... మనసార క్షణం ఆడుకొలేము మనసార క్షణం పాడుకొలేము మా గుట్టునంతా గుప్పిట్లొ దాచుకున్న ఓ విదాత నిజం చెప్పు నటనే కదా ఈజీవితాలు నటనే కదా ఈ దేహాలు నీ ప్రీ ప్లాన్ లెక్కలముదు మా కరెన్సి కట్టలు సైతం తలవంచుకుంటున్నాయి బ్రతుకులు ఒంటరి నావలై జీవిత చదరంగంలో జీవచ్చవాలై తేలుతున్నాయి పాపం కొందరు మనుష్యులు అసలు జీవన్మరణ సమస్యను ఒదిలిపెట్టి కస్టం సుఖం అంటు ఎండమావుల వెంట పరుగు తీస్తున్నారు.. నడి సంద్రంలో ఒంటరి దీపాలై కొట్టుమిట్టాడుతున్నారు....!!! M.D AMAR PASHA

by Amar Pasha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i7m6dy

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || పసి పాదాలు || తెల్లని పూలవంటి లేత పాదాలు ఇప్పటికీ గుండెలపై తిరుగాడుతూవుంటాయి దట్టమైన వేదన నిండిన నా లోపల గదిలో వాటి పసితనం నను వెలిగించే ఒక దీపం తిరిగి వస్తాయేమో అని అవి నడిచి వెళ్ళిన గుర్తులును చెరుపలేదు వాటి అడుగుల సవ్వడిని నా బ్రతుకంతా పాటలా పాడుకున్నాను ఆ పాదాలు కందకుండా నా రక్తాన్ని పూసి పంపించాను దూదివంటి పసి పాదాలు ఎగిరిపొయాక ఇప్పుడు నాకు నేనే బరువైపోయాను నాలో చావని ఆశ ఎదురుచూస్తుంది ఈ సమాధి వద్దకు ఆ అలసిన పాదాలు వస్తాయని మీ చాంద్ || 11.04.2014 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kz1luB

Posted by Katta

తెలుగు రచన కవిత

** ఓడిన విజయం ** స్పృహలో ఉండి,యుద్ధంచేసా ఫలితంగా నే అపజయమొందా . ఆచీ తూచీ అంచనవేస్తే, కోల్పోయింది అర్థరాజ్యమే. గెలిచినవాటికి లెక్కలు వేస్తే, ఒకటారెండా?వేలకువేలు- నేలకు వరిగిన సిపాయిలాళ్ళు. గెలుపనుకుంటూ ఓడినప్రాణం వెలకట్టేందుకు వెయ్యఁలెక్కలు లేనేలేవే అంకెలు ఇంకేన్. స్పృహకోల్పోయి యుద్ధంచేసా. పోగులుపడ్డ శవాలపైన పోరుకుపోయీ జయించుకొచ్చా. పోయినప్రాణం ఖరీదు కడుతూ, లెక్కలు గట్టఁ అంకెల్లేక , స్పృహలోఉండే యుద్ధంచేసా. ఓడిందంతా జయించుకొచ్చా!! .......య.వెంకటరమణ (౨౫/౦౨/౨౦౧౪)

by తెలుగు రచన



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1naOImI

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1naM7td

Posted by Katta

Krishna Mani కవిత

పిశాచి ****** ‘’నేనొక ప్రేమ పిశాచిని నేనొక మానవకాకిని నా హృదయం మండింది నేనిడివా ఎవ్వరిని ........నేనొక ప్రేమ పిశాచిని ‘’ అని గొంతెత్తి అరవాలని ఉంది మా నాన్న ఎక్కడ వింటాడోనని చెయ్యడ్డం పెట్టుకొని కసితీరా అరిచా బాత్రూం మూసి ఇంకో చోటులేక మిడిల్ క్లాస్ కుటుంబం కదామరి నాన్న టైలర్ అమ్మ కుక్కర్ తమ్ముడు ఇంటర్ చెల్లి పది మరి నేను డిగ్రీ డిస్కంటిన్యూ బైక్ మెకానిక్ లో మెగాస్టార్ ని ! ఇంటర్ పిల్ల కైనటిక్ హోండా చెలిమి కోసం తంటాలు పడి బైకు ముందు కటింగులు కష్టానికి మెచ్చి ఇచ్చింది మనసు కాదు కాదు లాకున్న ఎంటపడి సినిమాలు షికార్లు అంతా మామూలే ! పెళ్లి చేసుకుందామని అడిగా యాదగిరి గుట్టపై ఎలా పోషిస్తావు సినిమాలకే అప్పు చేసేవాడివి అని ఫారన్ మొగుడికి ఆశపడి అడ్రసు అమెరిక అయ్యింది ఇంకేముంది మిత్రులే శత్రువులై అప్పుల గొడవలు ఇంటిదాకా వ్యవహారం అమ్మనాన్నల అసహ్యపు మాటలు తమ్ముడు చెల్లి వెకిలి చూపులు ! యవ్వనానికి అర్హతలు ఉండాలా స్నేహానికి హద్దులు ఉండాలా అర్ధం కాని అవమానంతో రగులుతున్న మనసుకి ప్రశాంతత ఎక్కడ ఆదరించే ఆత్మలు అంతమైతే మనషిగా నిలువలేని నేను పిశాచినే అవును నేను పిశాచినే నేను పిశాచినే హ హా హ హా ........... కృష్ణ మణి I 11-04-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1evmq12

Posted by Katta

Sri Modugu కవిత

శ్రీ మోదుగు //ఒక ప్రశ్న? // ఎక్కడో ఆగి పోయాం కొన్ని విదిలించబడ్డ వాడి ప్రశ్నల్లో రోజుల జ్ఞాపకాల చిహ్నాల్లో ప్రత్యేకమంటూ లేని సమయాల్లో పట్టు చిక్కని మునకల్లో ఎదురైన పరీక్షల్లో ప్రతికూల ఫలితాల్లో ప్రయత్నాల్లేని ప్రపంచాల్లో పచ్చిక లేని ప్రకృతిలో మరిచి పోయామనో ,మారిపోయామనో కాదు వ్యధలో మనోవ్యధలో వరాలై నేను అనే ప్రపంచం విశాలమై అహమో అహంకారమో సంకెళ్లైనప్పుడు ఇక మిగిలింది ఒకే ఒక ప్రశ్న ఒకరికోసం ఒకరం సాగేదెలా అని...? Date:10/04/2014

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nas6TE

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి కౌగిలి ఛ బాధపడకు మనుషులే ఉండాలా హత్తుకోవడానికి అయినా నీ పిచ్చి గానీ ప్రేమ లేని శరీరాలు హత్తుకుంటే మాత్రం నీలోకి ప్రాణం ప్రవహిస్తుందా ఏమిటి చూడు అలా తోటలోకి వెళ్ళు గాలి ఆలింగనంలో మధురిమ చూడు వెన్నెల కౌగిలిలో చల్లదనం చూడు చెట్టు పరిష్వంగంలో ఆప్యాయత చూడు సరస్సు స్వంగంలో ఆనందం చూడు అక్కడ నిశ్శబ్దపు క్రోడంలో ప్రశాంతత చూడు అంతెందుకు నీలోనే ఉన్న నీ గుండె నిషంగధిలో ఉన్న ప్రమదం చూడు ఇన్ని కౌగిలింతల జీవితం పెట్టుకుని మనసు లేని మనుషుల వ్యర్ధహేలి కోసం ఎందుకు నీకీ వ్యధ అదిగో పద ఏకాంతంలోని మనోహరకాంతల మనోజ్ఞతలోకి పద మనుషుల మధ్య దొరకని నీ చుట్టూ ఉండే సంవృత్తి లో సేద తీర్చుకో పద నిన్ను నీవు పరిపుష్టం చేసుకో పద 11Apr2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lOBU5z

Posted by Katta

Panasakarla Prakash కవిత

అతనో.... కుక్కలతో పాటూ... వాడి పేరుకూడా రాసే ఉ౦టు౦ది చెత్తకుప్పలోని ఎ౦గిలి మెతుకుల మీద.... ఈగల గు౦పుతో పాటూ అతని చేతులూ తిరుగుతున్నాయ్ ఉ౦డ చుట్టి పడేసిన అన్న౦ పొట్ల౦లో... ఆకలి తీర్చే ఆయుధాలను వెతుక్కు౦టూ తనతో పోటీ పడుతున్న దోమలు సూది ముక్కులతో పొడుస్తున్నా చలి౦చని అతని ఆకలి బాధ‌ పొట్ల౦తో పాటూ నోరై తెరుచుకు౦టు౦ది.. పాల పొ౦గుమీద నాలుగు నీటి చుక్కలు జల్లినట్టు వాడి ఆకలి పొ౦గుపై ఆ నాలుగు మెతుకులూ చాలు..! వాడికి అన్నీ ఆ....చెత్తకుప్పే...... ఐనా వాడికేరోగమూ రాదు ఇ౦త శుభ్ర౦గా ఉ౦డే మనలో మాత్ర౦ ఎన్ని రోగాలు.........! అ౦తేలే.... అన్నాన్ని చెత్తలో పడేసే మన ఆలోచనల ని౦డా చెత్త ని౦డి ఒ౦టి ని౦డా అనారోగ్య౦ చెత్తకలిసిన అన్నాన్ని కూడా పవిత్ర౦గా ఆరగి౦చే వాడిలో వెలకట్టలేని ఆరోగ్య‍‍౦...! ఇ౦కా గుర్తి౦చారో లేదో ఆలోచనల శుభ్రతమీదే ఆరోగ్య౦ యొక్క భద్రత ఆధారపడి ఉ౦టు౦దనడానికి... అతనో.. అద్భుతమైన ఉదాహరణ...! పనసకర్ల‌ 11/04/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sJu7tU

Posted by Katta

Sasi Bala కవిత

యామినీ పూర్ణ తిలక సౌందర్య గరిమ ..............శశిబాల (11 ఏప్రిల్ 14 ) ------------------------------------------------------- ( మా నాన్నగారు శ్రీ మానారావు విరచిత '' యామిని '' లోని ఒక మహత్తరమైన పద్యం ఇది .ఇది గేయ గీతం గా కూడా మీ ముందు ఉంచుతున్నా ) శరదిందు బింబమో ! పరిఫుల్ల పద్మమో ! ముకురంపు బిళ్ళయో ! ముద్దు మొగమో ! కంజదళంబులో ! గండు మీనంబులో ! సూనాస్త్రు శరములో ! సోగకనులో ! చక్రవాకంబులో ! స్వర్ణ కుంభంబులో ! కుసుమ గుచ్చంబులో ! కుచయుగంబొ ! క్రొమ్మించు రేకయో ! కొనబు మేల్తీవయో ! తరళ నక్షత్రమో ! తరుణి రతియొ ! విశ్వవిభ్రమ మొనరింప వేడ్క గలిగి తనదు సృష్టి నైపుణ్యంబు ఘనత దెలియ బ్రహ్మ రచియించెనేమొ యీ వర శుభాంగి గాక యే రీతి గలిగే నీ కలికి జగతి http://ift.tt/1kaZae2

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kaZae2

Posted by Katta

Vijay Lenka కవిత

ఇనుప జన్జీరాలైన సువర్ణ శృంఖలాలైన ఒక్కటే కర్మఫలాన్ని కడిగే సెయ్ కృష్ణుని ఒడిలో వదిలెసై

by Vijay Lenka



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qBjVzH

Posted by Katta

Vijay Lenka కవిత

మరణం ఓ కామా కామముంటే మళ్లీ కాయం ఖాయం అది ఓ నిరంతర గేయం

by Vijay Lenka



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hngThZ

Posted by Katta

Kapila Ramkumar కవిత

"I Am Not Yours" I am not yours, not lost in you, Not lost, although I long to be Lost as a candle lit at noon, Lost as a snowflake in the sea. You love me, and I find you still A spirit beautiful and bright, Yet I am I, who long to be Lost as a light is lost in light. Oh plunge me deep in love -- put out My senses, leave me deaf and blind, Swept by the tempest of your love, A taper in a rushing wind. Sara Teasdale

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sIG3vV

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును పురస్కరించుకొని నేను రచించిన “తెలంగాణ మహోదయం” పద్యకవిత ఈ నెల ‘మూసీ’ మాసపత్రికలో ప్రచురితమయింది. ఆ ముద్రత కవిత ఇదిగొ.. ఇక్కడ… మీ కోసం….. - డా. ఆచార్య ఫణీంద్ర

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kwy43N

Posted by Katta

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || వృధా ప్రవాహం || మంటలు మంటలు మంటలు మంటలు దేశాన్నంతా కాల్చే మంటలు దేహాన్నంతా చీల్చే మంటలు నల్లని రంగువి, తెల్లని హంగువి గాంధిబొమ్మల రంగుకాగితం ఎర్రని నాల్కల నిండు జీవితపు మంటలు మంటలు నిండా మంటలు పక్కన మూగిన నక్కల వోలే నలగని చేతుల చలువ చొక్కాల్, గొట్టాలతో తెగ ఎగదోస్తున్నాయ్. వరదలు వరదలు వరదలు వరదలు కురవని ప్రేమల కుదరని ప్రేముల లొడలొడలాడే కదలికలతో రాత్రికి రాత్రే తెగిన ప్రవాహం కుర్చివైపుగ పరిగెడుతూనే పీకల్దాకా వాగ్ధానాలు పిపీలికాలకు వాగ్భాణాలు పిలుపుల పలుకుల పూనకాలతో ప్రజలమీదుగా ప్రవహిస్తున్నాయ్ వరదలు వరదలు. వరదలు వరదలు కుర్చీ వైపే కదిలే వరదలు. జండాకర్రలు, నిండా దిమ్మెలు కార్లూ బీర్లూ భజంత్రీలు ప్లాస్టీక్ రంగులు, వేస్టేజ్ జంకులు కోడ్ళూ గీళ్ళూ జాన్తానై అని కళ్ళూ చెవులను కూరేసేలా కుళ్ళు కాగితం కూరేస్కుంటూ తళతళ పెళపెళ విరుచుకు పడ్డాయ్ చెమటచుక్కనే పీల్చేసేందుకు పంచవర్షాల గాలం చేసి పిచ్చిచేపలకు వలవేసేందుకు ఉరుములు మెరుపులు ఊకదంపుడులు, మైకుల నిండా చిందే సొల్లు మాటల నిండా దొర్లే పొల్లు ఒకరిపై ఒకరిది పేడ కళ్ళపీ దేశం మొత్తం దుర్వాసనలే, ఎవరికి వారే నీతివంతులు నలుపే ఎరుగని గురుతుల గింజలు పులుపే వుండని ద్రాక్షతీగకై అలుపే ఎరుగని నక్కల గెంతులు విసుగు నిండిన ఓట్లతుంపరకి తెగ ఉరికొచ్చే పుట్టగొడుగులు శకుని చేతిలో పాచికలాట కుర్చిలాటలో తెగ కాట్లాట జేబులు నిండే మార్గం మీదుగ దర్భం పండే పొలాల గాటన నేతలమేనని వస్తున్నారు. మన తలరాతను గీస్తారంట. ► 11-04-2014 ► http://ift.tt/1k9RHvN

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k9RHvN

Posted by Katta

Abd Wahed కవిత

ఈ రోజు గాలిబ్ కవిత్వంలో మొదటి కవిత గాలిబ్ దీవాన్ లోని 14వ షేర్లో 6వ షేర్ ముం నా ఖుల్ నే పర్, హై వో ఆలమ్ కే, దేఖా హీ నహీం జుల్ఫ్ సే బఢ్ కర్ నఖాబ్ ఉస్ షౌఖ్ కే ముం పర్ ఖులా ముఖం కనబడకున్నా, ఎన్నడూ చూడని దృశ్యం బాగుంది నీలికురుల కన్నా వదనంపై మేలిముసుగు అందంగా ఉంది ఈ కవితలో ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. ముం అంటే ముఖం, వదనం. ఆలమ్ అంటే పరిస్థితి, దృశ్యం వగైరా అర్ధాలున్నాయి. దేఖా హీ నహీం అంటే ఎన్నడూ చూడలేదని అర్ధం. జుల్ఫ్ అంటే శిరోజాలు. నఖాబ్ అంటే మేలి ముసుగు లేదా ముస్లిం స్త్రీలు తలపై శిరోజాలు కనబడకుండా కట్టుకునే స్కార్ఫ్. షౌఖ్ అంటే అల్లరి, ఎడ్వంచరస్. ముం పర్ ఖులా అంటే ముఖానికి చాలా అందంగా, నప్పినట్లు ఉందని అర్ధం. ఈ కవితలో గాలిబ్ తన ప్రేయసి అందాన్ని పొగుడుతున్నాడు. ఆమె ఎలా కనబడినా ఆయనకు అందంగానే కనబడుతుంది. సాధారణంగా కవులు ప్రేయసి నీలికురుల సౌందర్యాన్ని వర్ణిస్తారు. శిరోజాల అందాన్ని చెబుతారు. అందమైన ముఖంపై నల్లని కురులు జాలువారుతున్న దృశ్యాన్ని వర్ణిస్తారు. కాని ఇక్కడ గాలిబ్ ప్రేయసి మేలిముసుగులో ఉంది. నకాబ్ అన్న పదాన్ని గాలిబ్ ఉపయోగించాడు. నకాబ్ అంటే ముస్లిమ్ స్త్రీలు తలపై ధరించే స్కార్ఫ్. దీనివల్ల శిరోజాలు కనబడవు. కొందరు ముఖం కూడా కనబడకుండా నకాబ్ ధరిస్తారు. అంటే గాలిబ్ కు ఆమె అందమైన ముఖం చూసే అవకాశమే లేదు. అయినా గాలిబ్ నిరాశ చెందలేదు. నల్లని కురులు ముఖంపై కదలాడుతున్న సుందర వదనం కనబడకపోయినా, ఆమె సుందరవదనానికి ఆ మేలిముసుగు చాలా నప్పుతుందని, అందులో ఆమె చాలా అందంగా ఉందని అంటున్నాడు. అంటే సౌందర్యమన్నది ఆకారంలో లేదు ప్రేమలో ఉందన్న అంతరార్థం ఈ కవిత చాటి చెబుతోంది. ముఖాన్ని ఆచ్ఛాదనలు కప్పేసినా ప్రేయసి అందంగానే కనబడుతుంది. ఈ గజల్లోని ప్రతి కవితలోను గాలిబ్ సూఫీతత్వాన్ని అంతర్లీనంగా ప్రకటించాడు. ఈ కవితలోను మనకు సూఫీతత్వం కనబడుతుంది. అల్లాహ్ అన్న పదానికి తెలుగులో అర్ధం చెప్పాలంటే దేవుడు, ఇంగ్లీషులో గాడ్. అల్లాహ్ ను ఎవరు చూడలేదు, ఆయన రూపం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంతల పరదాల వెనుక ఆయన రూపం దాగుందని కవులు వర్ణిస్తారు. ఈ నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంతలు ఆయన ముఖారవిందానికి ఎంతో అందంగా ఉన్నాయని కవితల్లో రాస్తారు. చీకటి రాత్రిలో నల్లని మబ్బుల మాటున నక్షత్రాలు కనబడకపోయినా ఆ దృశ్యం కూడా దేవుని సౌందర్యంగానే వర్ణిస్తారు. దేవుని రూపం మనిషి చూడలేకపోయినా, ఆయన సౌందర్యాన్ని మనిషి చూపులు అందుకోలేకపోయినా, ఆయన సృష్టిలోని చీకటిలో కూడా ఆయన సౌందర్యం దాగుందన్న భావం ఈ పంక్తుల్లో ఉంది. ఈ కవితలో ముం అన్న పదాన్ని గాలిబ్ రెండుసార్లు ఉపయోగించాడు. సాధారణంగా గాలిబ్, చాలా మంది ఉర్దూ పదాలు ఒకే కవితలో వాడిన పదాన్ని మరోసారి వాడడం జరగదు. కాని ఇందులో ముం నా ఖుల్నా, ముం పర్ ఖుల్నా అనే పదబంధాలు ఉర్దూ పలుకుబళ్లు. రెండింటిలోను అర్ధభేదాలున్నాయి. ముం నా ఖుల్నా అంటే ముఖం కనబడడం లేదని అర్ధం. ముం పర్ ఖుల్నా అంటే ముఖానికి నప్పేలా ఉందని, ముఖానికి చాలా అందంగా ఉందని అర్ధం. ఈ రోజు రెండవ కవిత గాలిబ్ సంకలనంలోని 14వ షేర్ 7వ షేర్ దర్ పే రహ్నే కో కహా, ఔర్ కహ్ కే కైసా ఫిర్ గయా జిత్ నే అర్సే మేం మేరా లిపటా హువా బిస్తర్ ఖులా గుమ్మం వద్ద ఉండవచ్చని చెప్పి మాట తప్పింది మడతపెట్టిన నా పడకదుప్పటి పరిచే లోపే మాట మారింది ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. దర్ అంటే గుమ్మం. ఫిర్ గయా అంటే మాట తప్పడం. అర్సా అంటే వ్యవధి. బిస్తర్ అంటే పడక ఈ కవితలో గాలిబ్ ఒక చంచల మనస్తత్వాన్ని వర్ణించాడు. కేవలం రెండు పంక్తుల్లో ఒక దృశ్యాన్ని వర్ణించాడు. ఆయన ఇల్లు వాకిలి లేని స్థితిలో ప్రేయసి వద్దకు వచ్చాడు. ఆమె సరే గుమ్మం దగ్గర ఉండొచ్చని చెప్పింది. ఆయన తన చంకలో ఉన్న మడతపెట్టిన దుప్పటి కింద పరచుకునే లోపే మాట తప్పింది. ఈ దృశ్యం ఊహిస్తే ఒకవైపు నవ్వు వస్తుంది. ప్రేమికుల మధ్య జరిగే ఇలాంటి టీజింగ్ సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. చాలా సరళమైన పదాలతో చెప్పిన కవిత ఇది. కాని ఈ కవితలో ఎక్కడా గాలిబ్ తన ప్రేయసి ఇలా చేసిందని చెప్పలేదు. ఇలా ఎవరైనా చేయవచ్చన్న భావం కూడా ఉంది. ప్రపంచంలో మాట తప్పడం అనేది చాలా మంది చేస్తారు. మనం ఊహించలేనంత తక్కువ వ్యవధిలో ఇచ్చిన మాటను మర్చిపోతారన్న భావం కూడా ఇందులో ఉంది. ఇలాంటి సందర్భాలు చాలా మందికి ఎదురవుతాయి. ప్రతి సందర్భంలోను కోట్ చేయడానికి అవకాశం ఉన్న కవిత ఇది. దీని తర్వాత ఈ గజల్లో ఉన్న మిగిలిన కవితలు కూడా ఇదేవిధంగా కష్ట సమయాల్లోను, అలాంటి ఇతర సందర్భాల్లోను వెంటనే స్ఫురణకు వచ్చే కవితలే. గాలిబ్ సంకలనంలోని 14వ గజల్లో చివరి మూడు కవితలు ఇప్పుడు చూద్దాం క్యోం అంధేరీ హై షబె గమ్, హై బలావోంకా నుజూల్ ఆజ్ ఉధర్ కో హీ రహే గా దీదా ఏ అక్తర్ ఖులా విషాదాల రాత్రి ఎంత చీకటి. విపత్తులు వర్షిస్తున్నాయి నక్షత్రాల చూపులన్నీ ఈ రోజు పైకే చూస్తున్నాయి ఉర్దూ పదాలకు అర్ధాలు : షబ్ అంటే రాత్రి. గమ్ అంటే విషాదం లేదా దుఃఖం. బలా అంటే విపత్తు లేదా ఆపద. నుజూల్ అంటే అవతరించడం. దీదా అంటే కన్ను, అక్తర్ అంటే నక్షత్రం. గాలిబ్ తనపై వచ్చిన ఆపదలను వర్ణించిన తీరు గమనించండి. విషాదాల రాత్రి చాలా చీకటిగా ఉంది. ఎందుకంటే ఆకాశంలో నక్షత్రాలు కనబడడం లేదు. పై నుంచి దేవుడు గాలిబ్ పై కురిపిస్తున్న ఆపదలను చూడడానికి నక్షత్రాలన్నీ తమ కళ్ళను పైకెత్తి చూస్తుండడం వల్ల నేలపై నక్షత్రాల చూపులు కూడా పడడం లేదని అందువల్లనే ఈ రాత్రి చాలా చీకటిగా మారిందని అంటున్నాడు. తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రతి మనిషి ఇలాగే ఆలోచిస్తాడు. దేవుడు తనపైనే మొత్తం ఆపదలన్నీ పడేస్తున్నాడనే అనుకుంటాడు. క్యా రహూం గుర్బత్ మేం ఖుష్, జబ్ హవాదిస్కా యే హాల్ నామా లాతా హై వతన్ సే నామాబర్, అక్సర్ ఖులా పేదరికంలో సంతోషం ఎలా, ఆపదలు వస్తుంటే ఇలా వార్తాహరుడు తెచ్చే ప్రతి లేఖ తెరుచుకునే ఉంది కదా ఉర్దూ పదాలకు అర్ధాలు : గుర్బత్ అంటే పేదరికం. హవాదిస్ అంటే దైవికమైన ఆపదలు. నామా అంటే లేఖ. హాల్ అంటే పరిస్థితి. వతన్ అంటే స్వస్ధలం. నామాబర్ అంటే వార్తాహరుడు. అక్సర్ అంటే తరచుగా అని అర్ధం. నామా ఖులా అన్న పదాన్ని కాస్త వివరించవలసిన అవసరం ఉంది. ఒకప్పుడు ఎవరిదైనా మరణవార్త లేఖ ద్వరా తెలియజేస్తున్నప్పుడు ఆ ఉత్తరాన్ని తెరిచి పంపేవారు. అంటే ఉత్తరం కవరులో పెట్టడం జరిగేది కాదు. తెరిచి ఉన్న ఉత్తరం వస్తే విషాదవార్త ఉందని అర్ధం. నామా ఖులా అంటే తెరిచి ఉన్న లేఖ అని అర్ధం. ఈ కవితలోకూడా గాలిబ్ తనపై వచ్చిన కష్టాలనే చెప్పుకున్నాడు. పేదరికంలో అయినా గాని సంతోషంగా సంతృప్తిగా ఉండడం ఎలా సాధ్యం అంటూ, తనకు వచ్చిన ప్రతి లేఖ తెరిచే ఉంటుందని, అంటే విషాదాలనే మోసుకు వస్తుందని వాపోతున్నాడు. ఉస్కీ ఉమ్మత్ హూం మైం, మేరే రహే క్యోం కామ్ బంద్ వాస్తే జిస్ షై కే గాలిబ్, గుంబద్ యే బే దర్ ఖులా ఆయన అనుచరుడినే కదా అయినా నా కెందుకీ కష్టాలు ఆయన కోసం తలుపుల్లేని ఆకాశం తెరుచుకోలేదా? ఉర్దూ పదాలకు అర్ధాలు : ఉమ్మత్ అంటే సముదాయం, సమాజం అని అర్ధం. ముస్లిమ్ ఉమ్మత్ అంటే ముస్లిమ్ సమాజం అని అర్ధం. కామ్ బంద్ అంటే పనేది జరక్కపోవడం లేదా కష్టాలు ఎదురవ్వడం. షై అంటే వస్తువు అని అర్ధం. ఇక్కడ వ్యక్తిని సూచిస్తూ ఉపయోగించాడు. గుంబద్ అంటే మస్జిదులకు నిర్మించే గుమ్మటం. గుంబద్ యే బే దర్ అంటే తలుపుల్లేని గుమ్మటం అంటే ఆకాశాన్ని సూచిస్తూ వాడాడు. గుంబద్ యే బే దర్ ఖులా అన్న ప్రయోగాన్ని కాస్త వివరించాలి. ప్రవక్త ముహమ్మద్ ను దైవదూత జిబ్రయీల్ ఒక గుర్రం లాంటి వాహనంపై (బుర్రాక్ అన్నది దాని పేరు) మొదట మక్కా నుంచి జెరుసలేమ్ కు ఆ తర్వాత అక్కడి నుంచి ఆకాశాలపైకి తీసుకువెళ్ళారు. ఈ సంఘటనను మేరాజ్ అంటారు. మేరాజ్ యాత్ర జరిగిన ఆ రాత్రిని షబె మేరాజ్ అంటారు. చాలా మంది ముస్లిములు షబె మేరాజ్ రాత్రి ప్రత్యేక నమాజులు చదవడం జరుగుతుంది. తలుపుల్లేని ఆకాశాన్ని ప్రవక్త ముహమ్మద్ కోసం దేవుడు తెరిచేశాడన్న భావంతో గుంబద్ యే బే దర్ ఖులా అన్న పదాలను గాలిబ్ ఉపయోగించాడు. ఈ కవితలో భావాన్ని గమనిస్తే, గాలిబ్ తాను ప్రవక్త ముహమ్మద్ అనుచర సమాజానికి చెందినవాడినే కదా అని అడుగుతున్నాడు. ప్రవక్త ముహమ్మద్ కోసం ఆకాశం తలుపులు తెరిచేశాడు దేవుడు. అలాంటి ప్రవక్త సమాజానికి చెందిన తనపై ఈ కష్టాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇది గజల్లో చివరి కవిత. ఈ మొత్తం గజల్లో ఆధ్యాత్మికతను అంతర్లీనంగా ప్రస్తావించాడు. మధ్యలో ఒక కవితలో మోసకారుల ప్రస్తావన వచ్చింది. ఆ తర్వాత వరుసగా రెండు కవితల్లో తనపై వచ్చిన కష్టాల గురించి చెప్పాడు. చివరి కవితలో ఫిర్యాదు ఉంది. మోసపోవడం అనేది ఆయనకు తప్పలేదు. మోసం చేసింది తోటివారే. నమ్మినవారే. అలాంటి మోసాలకు గురై, కష్టాలపాలయిన మనిషి చివరకు దేవునితో ఫిర్యాదు చేసుకోవడం తప్ప మరేమీ చేయలేని స్థితి. ప్రవక్త కోసం తలుపుల్లేని ఆకాశాన్ని తెరిచేశావు. ఆయన సమాజానికి చెందిన నా కోసం సంతోష ద్వారాలు ఎందుకు మూసేశావంటూ నిలదీస్తున్నాడు. ఈ చివరి కవితలో ఒకవిధమైన తిరుగుబాటు ఉంది. ఎవరికైనా కష్టాలు, ఆపదలు తప్పవన్న భావం ఉంది. ఏ మతానికి చెందినవారైనా మనిషికి పరీక్షలు తప్పవు. ప్రపంచంలో కష్టనష్టాలు తప్పవు. కేవలం ఒక మతానికి చెందినవాడైనంత మాత్రాన ప్రపంచంలో సంతోషాలన్నీ సొంతమైపోతాయనుకుంటే అది పెద్ద భ్రమ.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n8U6qA

Posted by Katta