పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Jayashree Naidu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jayashree Naidu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మే 2014, శుక్రవారం

Jayashree Naidu కవిత

జయశ్రీనాయుడు ||కొన్ని అజ్ఞానాలు...||... గాయాలను పూడ్చుతూ పరుచుకునే చర్మంలా కొన్ని సమయాలు చారికలు కట్టిన జ్ఞాపకాలు రాల్చేసేందుకు మనసొప్పదు చీములా ఉబుకుతున్న ఓ సందిగ్ధం తీపి లోంచి వెగటెలా పుట్టిందో అతి...మధురమయ్యిందేమో అలవాటుకి... నునుపు చెదిరిన పల్లమెటో ఒరిగింది.. మరో హృదయాన్వేషణకి... భావబంధనపు ముగింపులివి... మార్పుకి మరుపుని చేర్చకపోతే జ్ఞాపకం ఓ అసుఖమే... 23-05-2014

by Jayashree Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t2I5EH

Posted by Katta

4, మే 2014, ఆదివారం

Jayashree Naidu కవిత

|| నిరంతర సేద్యం || ఏకాంతపు స్పంజి తోటి తలపుల ఫలకం తేటగీతం తరచి చూసుకునే మూడోకన్ను ఎండిన పైరుని పెరికే రైతు మొలకలయ్యే విత్తనాలని వెలుగు నీటిలో నిలవచేసి పచ్చని మనసు కోసం మరో సేద్యం సిద్ధమవుతోందిక్కడ... -- జయశ్రీనాయుడు 04-05-2014

by Jayashree Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hpBazC

Posted by Katta

30, ఏప్రిల్ 2014, బుధవారం

Jayashree Naidu కవిత

శ్రీ శ్రీ జయంతి-30-04-1910 సందర్భంగా... శ్రీ శ్రీ రచన... సిప్రాలి -- మే మే గేయాలనుంచి ఆ 'మహా కవి'తాత్మను గుర్తు చేసుకుంటూ... సిరి సిరి మువ్వలం చెరిగిన దవ్వులం మృత్యువు పెరట్లో మందార పువ్వులం భగవంతుని వితంతువులం కరుణకు మా బ్రతుకు కవనం మా మెతుకు సిరి సిరి గంటలం చీకటి పంటలం మృత్యువు గొంతున మొరసే మంటలం భగవంతుని మారని చెక్కులం భళ్ళున తెల్లారే ఋషి వాక్కులం కష్టాలు మా పదజాలం కవనం మా త్రిశూలం సిరి సిరి గజ్జెలం తెరమరుగుజ్జులం మృత్యువు కోరల్లో సర్పపు రజ్జులం భగవంతుని చిరునామాలం పగలు రేల పరిణామాలం ఆశ్చర్యాని కవధులం ఆవేశాల పరిథులం ** ** **

by Jayashree Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rEdjkL

Posted by Katta

26, ఏప్రిల్ 2014, శనివారం

Jayashree Naidu కవిత

జయశ్రీనాయుడు || అనామికలు 2 || భావానికి ఒక పేరు అదే దాని నామ రూపం మారకూడన్న కోరిక మారుతుందన్న భయం ఉనికిలోని అశాశ్వతత్వమే దాని కేంద్రకం.. హృదయమంతా అణువిస్ఫోటన అనుభవం.. భావం లోని రూపం కరిగి కేవల ప్రవాహ స్పందన నది అంతర్వాహిని భావం అంతర్లీన అవని ఒక ఆకాశాన్ని ఆద్యంతరహితంగా అనుభవిస్తుంది.. తారా తొరణ హీనతలోనూ నీలి నదిని స్ఫురిస్తుంది అణువూ ఆకాశం స్నేహించిన హృదయం

by Jayashree Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QOf3w3

Posted by Katta

24, ఏప్రిల్ 2014, గురువారం

Jayashree Naidu కవిత

జయశ్రీనాయుడు || అనామికలు 1 || తెలిసిన తనం వెనుకే తెలియని చీకటి వెలిగించే కొద్దీ కరిగిపోతుంది తెలిసేలోపునే మరో ఉదయం చీకట్లను తుడిచె తలపులకి మనసు స్పంజికి మెరుపు తళుకుల చెక్కిలి చెమ్మ సంధి కుదిరిందా సాయంత్రపు నీడల్లే ఆ శాంతి అశాశ్వతమే ధృవపు మంచల్లే చుట్టుకునే గుండె ఘోష మొలకెత్తే ఆశకి చీడలా అంటక ముందే కొన్ని వెలుగుల్ని దాచుకుంటాను 24-04-2014

by Jayashree Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QBvRGQ

Posted by Katta

29, మార్చి 2014, శనివారం

Jayashree Naidu కవిత

జయశ్రీ నాయుడు || ఓ వారాంతపు వేళ.. || అతీత అవ్యక్తాల్లో అస్పష్టమైనా అసంగతమైనా ఆ ప్రపంచపు రహదారులే ఓ ఆత్మావకాశ సంభాషణం స్పృశించే గమకాల లయబద్ధ హృదయ సంకోచ వ్యాకోచ స్పందనం ఆనంద విషాద స్పృశ్యాస్పృశ్య సదృశ చిత్రలేఖనం పౌర్ణమినీ నిశ్శబ్ద పోరాటాల నిశీధినీ ప్రకృతి వికృతుల వేర్పాటులో నలిగిన నా సైనిక శ్రేణి రగులున్న క్షణాల సాక్ష్యం చెప్పాలా.... సహనం శాంతి కోసమే... అశాంతి తప్పని సరైనపుడు సంధి అసహనం తోనే మరి! గరుడ గమనాలు హృదయం లో సంధించిన క్షణాలెప్పుడైనా ఎరుకేనా చిద్రమైన కోటలకు హరితవనాల చెంగు కప్పి అరువు చిరునవ్వులే పరిచిన దారులు చూస్తూ మురిసే వేళలొస్తున్నాయి!!!! 29-3-2014

by Jayashree Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QrFfNH

Posted by Katta

9, మార్చి 2014, ఆదివారం

Jayashree Naidu కవిత

అన్ని ట్రిక్కుల కన్నా మంచి ట్రిక్కు - సత్యం చెప్పడం నీటిలో ఈదే చేపపిల్ల తత్వం చందో రహిత కవిత్వం ఇవన్నీ కలగలిపిన మోహన్ ఋషి అక్షరాలు అవలీలగా జీరో డిగ్రీలో నిలుచోబెడతాయి. ఇవేళ ప్రొద్దున్న సింపుల్ గా హుందాగా జరిగిన జీరో డిగ్రీ పుస్తకావిష్కరణ కవి మిత్రులందరి కలయిక అదో పండగలా జరిగింది. The pace at which the poetic activity catching up is an encouraging mark.

by Jayashree Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h3mzur

Posted by Katta

22, ఫిబ్రవరి 2014, శనివారం

Jayashree Naidu కవిత

The Nightingale of India, Sarojini Naidu needs no introduction. She is the synonym for Indian poetry in English. The sweetest thoughts are embedded in the shortest possible words And a poet at heart and in her writings too! The songs of yester-years flow in the music of her poems. Here is one such poem - *Alabaster* Alabaster is a stone used to make decorative boxes and even statues. Perfumes and Spices are stored in these decorative boxes to reflect their worth. Sarojini Naidu gives a new comparative for heart that has "the spice and the scent" of life. Alabaster LIKE this alabaster box whose art Is frail as a cassia-flower, is my heart, Carven with delicate dreams and wrought With many a subtle and exquisite thought. Therein I treasure the spice and scent Of rich and passionate memories blent Like odours of cinnamon, sandal and clove, Of song and sorrow and life and love. Sarojini Naidu

by Jayashree Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nUEcPm

Posted by Katta

20, ఫిబ్రవరి 2014, గురువారం

Jayashree Naidu కవిత

జయశ్రీనాయుడు || కొన్ని మూగతనాలు || వస్తూ... పరచుకున్న పచ్చికనంతా మూటగట్టి గుండె కు గ్రీష్మాన్ని కానుకగా ఇచ్చి వెళతాయి కొన్ని ఆకాశాన్నీ టాస్ వేసి వెన్నెల్లనీ వేకువల్నీ దోచేస్తాయి కొన్ని తొలి చిగురు చూపై వేరువరకూ చేరని నీటి ప్రేమౌతాయి మామూలుతనమవ్వలేని అనుభవాలన్నీ ప్రశ్నార్థకాలవుతున్నపుడు భారాల్ని రాసే ఘడియల్లో ఎన్ని పదాల్ని వూరడిస్తే ఓ కన్నీటి చుక్క కు తులాభారమౌతుంది..??? 20-02-2014

by Jayashree Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eXiJ2T

Posted by Katta

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

Jayashree Naidu కవిత

జయశ్రీనాయుడు ||కలవరపుక్షణాలు|| గాలీ నీరూ నేనూ ఒకటే నీకు నువ్వంటే... అర్థం కానివ్వని జవాబుల పర్వం జవాబులతో నాకెందుకులే.. అయినా మదిని అవ్యక్తపు అలలు కుదిపేస్తాయి సముద్రమై ఆవరించే ఆలోచనలను మోసేందుకు భూమినవుతా అంతలోనే ఆకాశమూ నేనే ఇంతలో మెలిపెట్టే కుదుపొకటి ఆవరించి అగ్నిసెగవుతుంది పంచభూతాలూ ప్రేమలో వున్నాయన్నది అవగతమౌతుంది 16-02-2014

by Jayashree Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bBkfx6

Posted by Katta

15, ఫిబ్రవరి 2014, శనివారం

Jayashree Naidu కవిత

A poem records history too A poem compares many things at once As the political upheavals are witness by us, this poem written by Sri Sri - Translated into English by Velcheru Narayana Rao - seems a timeless inscription depicting how the wordless four-legged are better than this talking two legged master creation of Nature - man Bull is culturally intertwined with lives of village folk. In Hyderabad, in the early seventies bulls and donkeys were a common occurrence - with bulls - standing in the the middle of the road - as a monarch. And we consider bull to be senseless for this one aspect. We hate it for its laziness and we have many adages to equate a person with bull. In the last two lines the poet equates the blame on the bull with the self-centered humans. Bull In The City On the city's main street The bull stood quietly Chewing its cud Of memories of past births, Eyes half-closed, Motionless. The bull in the heart of the city, Not heeding time, The very owner of the street Laughing at the pace of progress, Stood like a king. Who can ask this bull to move ? See what it looks like ! Stop the car ! What's the rush ? Brother, you on the bicycle, Watch out ! The bull doesn't move. Anti-industrial, Pacifist, vegetarian, Staunch prohibitionist On the city's main street. The bull can stand like this Forever. A bull has no sense. What about man ?

by Jayashree Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dv6Y8i

Posted by Katta

29, సెప్టెంబర్ 2012, శనివారం

Jayashree Naidu || I AM

Since the day I became conscious about my existence..

the journey is unpredictable
colors of emotions on my canvass

tHeN
others dipped my brush in theirs
insisted this is your color..

some even painted the canvass
and said you follow me...

torn in the colors that I don't identify
confusion in the unknown meanings

unheard canvass
unsung colors..

NoW
the brush searched my hand
colors colored the palette
spread the horizon into my canvass
the others flew like feathers
the dreams dipped the stars
the sparkles are the EYES!

AND there emerged the soul of my painting.. I AM!

6, సెప్టెంబర్ 2012, గురువారం

జయశ్రీ నాయుడు||మనిషి పేజీ||



మనిషి తనను తానుగ ఎప్పుడూ చదువుకునే పేజీ. అర్థమయ్యిందా సరే లేకపోతే అశాంతే.. లోపలా బయటా కూడా.

తన చుట్టూ పోగేసుకున్న పేజిల్లోంచి తలా కాసిన్ని అక్షరాలు కలుపుకుంటాడు

తన ఆలోచనలతో కలిసిన అక్షరాల్లో కి తొంగి చూసి ఆప్తులంటాడు
ఆ మురిపెము కాస్సేపే

అవే అక్షరాలు అకస్మాత్తుగా యే ఉత్తర ధృవం మీదనో ప్రత్యక్షం అవుతాయి
నీ మీదే తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తాయి
అప్పుడేం చేస్తావొయ్ మనిషీ

పేజీ శుభ్రం చేద్దామని
కొత్త అక్షరాలు పోగేస్తావు
ఉదయాన్నే కరచాలనం చేస్తావు
గర్వంగా మరో పేజీ తిప్పుతావు

నిజలెప్పుడూ ముందు పేజీల్లోనే వుండవు
మూలల్లో దాక్కుని నీ నిజాయితీ సిరా కోసం చూస్తుంటాయి

వంచన స్కెచ్చి వేసి మూలల్ని మూసినా
మనసు వాస్తు దాగదు
ఆకాశం లాంటి ఆత్మ ని
యే తాటాకు పందిరితోటి కప్పుతావు
కుందేళ్ళలంటి అబద్ధాల చప్పుళ్ళ హోరు
నిజాయితీ సముద్రపు ఘొష ముందు బలాదూర్

04-09-2012

29, ఆగస్టు 2012, బుధవారం

జయశ్రీ నాయుడు //నిరంతర చెలిమి//


డైరీ లో పేజీలు తిప్పి చూసుకుంటే
నాలో నడిచి వచ్చిన అనుభవాలు
ఎన్నో మనసుల పాత్ర వుంది
అనుభవాల ఉలి దెబ్బలున్నాయి..
ఎన్నొ హృదయాల ఓదార్పు వుంది!
ఈత నేర్పిన కాల ప్రవాహం వుంది

నమ్మకం అపనమ్మకాల పగుళ్ళలొ
ఇరుక్కున్న విశ్వాసపు పందిరికి
ఆత్మని పూయించాలని ఒక్కో
కొమ్మకూ కాలపు చిగురు అతికిస్తూ
ఆలోచనల వర్షం కురిపిస్తూ
ఆకాశంలా సాక్షీ భూత స్థితికి
ఒక్కో మెట్టూ లెక్కిస్తూ నేను

అంతరంగం అన్నిటికన్నా లోతైన పసిఫిక్
ముందువెనుక వూగిసలాటల చేపలు
తలపులై మింగేసే అజ్ఞాన తిమింగలాలు
గమ్యాలుగా బయలుదేరిన చిట్టి పడవలూ
ఎంత కొలాహల హాలాహల సముద్రమిది

లయం కావాలి
ఆలయం కావాలి
భావనలన్నీ లయించే తీరం లో
ఇసుకరేణువులూ కానని సముద్రం అవ్వాలి

చుక్కల వెలుగు పోగు చేసి
పాలపుంతే కళ్ళు చేసుకుని
విప్పార్చి చూస్తున్నా
అఖండంగా వెలుగుతున్నావు
నావెలుగూ నీ పులుగే కదా

ప్రయాణం ఆగదు జీవన వినోదం మారదు
మోద ఖేదాలు గుండె చప్పుళ్ళే
ఆశల అలలు దాటిన సముద్రం
కన్నీళ్ళు లేని కళ్ళు మెరిసే ప్రయాణం
నేనే నా నౌక - విశ్వాసమే నా తెరచాప
నన్ను నేను సిద్ధపరుచుకుంటున్నా
నీతో నిరంతర చెలిమికి అవకాశంగా మలుచుకుంటున్నా!

28-08-2012

25, ఆగస్టు 2012, శనివారం

జయశ్రీ నాయుడు ||నా అనంతం||

మొదలెప్పుడు.. అక్కడే ఆగిపోతుంది..
సాగుతున్న కాలం కొత్త రంగులు ఇస్తుంది

అక్కడిలా ఇక్కడుండదు
ఇక్కడున్నది అప్పుడు అక్కడ లేదు..

యేది నిజం
యేది మర్మం

గుండె సడిలో తెలియని గాయం
యే ద్రవంలో కరిగించను
నన్ను నేను తేలిక పరచను

నువ్వు చూపిన నక్షత్రాల్లోనే చూపులు చిక్కుకుపోయాయి
మరో గెలాక్సీకి వలస వెళ్ళిపోయావు
ఈ కాంతి వలయాల్లో ఈదుతున్నా

చిక్కని కాలానికి గేలం వేస్తూ
నా అనంతం సృష్టిస్తున్నా

*23-08-2012

21, ఆగస్టు 2012, మంగళవారం

జయశ్రీ నాయుడు || నన్ను నేను వెతుకుతున్నా ||



నన్ను నేను వెతుకుతున్నా
ఎన్నో నువ్వులు దొరికాయి

నవ్వులు కొన్నీ
కన్నీళ్ళు కొన్ని..

కలతలకు కొన్నీ
కలలూ కొన్నీ

కరచాలనం తో కత్తిపోట్లు
ప్రేమగా బహుమతిచ్చిన గుండెగాట్లు

ముళ్ళనిపించీ ముద్ద మందారమైనట్టు
గులాబీ సొగసు ఆశకద్దినట్టు

ఇదో వలయం కలల నిలయం
ప్రశ్నకో రోజులేదు
ప్రేమకో క్షణమూ ప్రత్యేకం కాదు

ప్రేమగా ప్రశ్నని స్పృశిస్తే
సమాధానం మరో ప్రశ్నవైపు చూపి
తీయగా నవ్వుతుంది

కాలానికీ కొంటెతనమూ ఎక్కువే
నావాళ్ళనుకునేలోగా నిలువుటద్దంలా హృదయం భళ్ళుమంటుంది
చిరునవ్వులు అపరిచితమై దిగులు మేఘాలే అంతా
ఇంతలోనే చినుకులా రాలి దేవతల్లే హత్తుకుంటాయి
ఎన్నడూ చూడని చిరునవ్వులు కొత్త రూపాలుగా మారి...

ఇదో వలయం కలల నిలయం.
*20-08-2012

17, ఆగస్టు 2012, శుక్రవారం

అన్నీ చిరునవ్వులే.. అక్షరాల ఆత్మీయతలే - Jayashree Naidu


కవి సంగమం పొయెట్ మీట్ గురించి రాద్దామని మొదలు పెడదామంతే.. అన్నీ చిరునవ్వులే.. అక్షరాల ఆత్మీయతలే..

ఒక్కొక్కరి ఉపన్యాసం ఒక్కో మేధో సంపద..
మది నింపుకుని వెళ్ళినవారి అదృష్టం..
యాకుబ్ జీ ఆత్మీయ వచనాలతో పాటు కవిసంగమం లో.. లైకుల గిమ్మిక్కుల నుండి దూరం వుంచాలన్న ఆత్మీయ ఆందోళన ఒక పసి పిల్లవాడు వందకి వంద మార్కులు తెచ్చుకున్నప్పటి మురిపెం తో పాటూ.. వాడు దారి తప్పకూడదనే మమకారపు హెచ్చరిక.

ముఖ్య అతిధి శుబొధ్ శర్కార్ అద్భుతమైన ఆంగ్ల ప్రసంగం.. యూనివర్సిటీ రోజుల్ని గుర్తు తెచ్చింది.
సాహిత్యం ఎంత జీవ వంతం.. ఆత్మవంతం..

(ఇప్పటికే పన్నెండు అయ్యింది.. సమీక్ష మిగితాది.. రేపు రాస్తాను)

14, ఆగస్టు 2012, మంగళవారం

జయశ్రీ నాయుడు || మహరాజా బహుపరాకు ||


ఉదయం నుండి నడక మొదలు
పాదం అడుగు వేయనిదే మొదలెక్కడ
అయినా పాదాన్ని తలకెత్తుకోలేను కదా

తల కు తెగువెక్కువ
తనదే ఆలోచనన అనేమో
కూర్చుని ఆలోచిస్తే కుంపటిరాజేసేదెవరోయ్

చేతులొచ్చి మధ్యలో హాస్యం వడ్డించాయి
వాటికీ చేతలెక్కువ కదా..

ఈ వినోదమంతా చూస్తూ
రాణీలా నవ్వే హృదయం
ప్రక్కనే కాపలాదారు మనసు
కర్రపెత్తనమంతా దానిదే

కనిపించకుండా చూస్తూ
కదలకుండా అదిలిస్తూ
మెదిలే క్షణాన్ని సృష్టిస్తూ
జ్ఞాపకాలుగా అచ్చేస్తూ
మరపుగా తెగ్గొడుతూ
ఆత్మతో అతికిస్తూ

ఓ మనసు మహారాజా
వేల వేల బహుపరాకులు!

*13-08-2012

11, ఆగస్టు 2012, శనివారం

జయశ్రీ నాయుడు || నిలవని నీడలే..||

నా కలనుంచి నిన్ను వెలి వేస్తున్నా
వెలుగును చీకటికి అంకితమిస్తున్నా

ఉలకని పలకని వూరింపుల మధ్య
గడవని రోజులెన్నని గుర్తు పెట్టుకోనూ...

ఆశ నిరాశ ల కత్తిపోట్లకు
ఎన్ని గులాబీ రెక్కలు రాలాయని లెక్కించను..

నిద్రలేని రాత్రుల నిముషాల మధ్యన
గంటల్ని లెక్కించింది ఎన్నని చెప్పను..

నిట్టూర్పుల ఉలి చెలిగా కన్నీటి శిల్పాల
ఆరామం లో ఇంక సేద తీరలేను

కలవని ఘడియల్లొ కలవేమో
కలిసిన వేళల్లొ కధవేగా..

కధైనా కలైనా
కరిగే క్షణాల్లా
నిలవని నీడలే..


*10-08-2012