Aduri Inna Reddu || ఓడించావా ఓడిపోయానా కాస్త చెప్పవూ ..? || ------------------------------------------------------------------- కొన్ని పలకరింపులంతే వద్దన్నా పూల వాసనలు వెంటపడతాయ్. నిజమని బ్రమపడితే ఓటమిని జేబులో వెసుకున్నట్టే కొన్ని పలకరింపులు ఒకప్పుడు చిరుజల్లులై మనసు లోతుల్లో మదిని తాకి మరుపన్నది లేని మరో లోకానికి తీసుకేల్లి ఇప్పుడు ఎవ్వరని అడిగితే సమాదానం చెప్పుకోలేక నాలో నేను అగ్నిపర్వతంలా పేలుతూనె ఉన్నా లావాల నాలో భావాల్ని పోల్చుకోమని సవాళ్ళు విసురుతూ, పిట్టలు అవే పాటలు తిరిగి తిరిగి పాడుతూంటాయ్. ఆకాశంలోనుంచి ఊడిపడ్డ చినుకుల్లా అక్కడక్కడా పరిచయమయ్యే మంచు బిందువులు, లేత ఎండలో కరిగిపోతాయనుకుంటాం. కరిగిన బిందువులన్నీ మట్టిలో నిద్దురోతూనే కొన్ని రహస్యాల్ని పలవరిస్తాయ్. ఓడిపోయిన గతంలా మిగిపోయాను జాడలేని నీడనై తిరుగుతున్నాను .. గుండెలో ఏ మూలో ఓ చిన్న గుడిసేసుకుని కూచుంటావని తెలుసు నాకు. సెలయేటి పాటలైతే బావుంటాయి కానీ , సముద్రపు హోరెందుకు నీకు? అందుకే , ఆ సముద్రానికీ, ఆకాశానికీ ఓ పందెం పెట్టి వదిలేశాను. నీను నన్ను ప్రేమనే బ్రమలో పెట్టావు నేను వాడిపోయి ఓడిపోయిన సంద్రాన్ని ఇక నీ దాకా రాదు హోరు. ఎందుకంటే నీళ్ళూ లేని సముద్రాన్ని ఇప్పుడు నేను నేను నీవు నానుంచి దూరం అయినప్పుడే చచిపోయాను .. నీవులేక అనాద శవంలా పడున్నాను గుర్తుపట్టలేని అనాద శవంలా రోజు రోజుకీ కుళ్ళీపోతున్నా .. ఇప్పుడైతే గుర్తుపదతావు ఒక్కసారి వచ్చి చూసి పలుకరించి పోవా .. ఆతర్వత నీవచ్చినా నన్ను గుర్తుపట్టలేవేమో .. ఎందుకంటే అప్పటికి నేను బాగా కుళ్ళీపోయి ఉంటానేమో అందుకే ఒక్కసారి వచ్చి చూసిపోవాపోవా ప్రాణ సఖీ
by Aduri Inna Reddy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dQokc4
Posted by Katta
by Aduri Inna Reddy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dQokc4
Posted by Katta