సొన్నాయిల నరేష్కుమార్//స్తబ్దం// ఇప్పుడు నాకొక మొహం కావాలి నవ్వుతూ ఉండే మొహం లేదూ.... నవ్వుతూ ఉన్నట్టుగా ఒక ముసుగైనా నిస్సహాయ,నిరాశా,నిస్పృహలని దాచి ఉంచే కోటగొడ కావాలి కొన్ని పువ్వులు లేని ఎడారిమొక్కలు కావాలి ఎవ్వరినీ దరిచేరనీయక తమకు తాముగా బతికే రక్కిసపొదల కంచె కావాలి ఎవరిస్తారు స్వచ్చమైన నా నవ్వుని నాకు వాడిపోని పచ్చి గాయం లాంటి నా జీవితాన్ని చీము,నెత్తురుతో నిండి పసి హృదయం లా సున్నితంగా ఉండే ఒక నవ్వుని ఎవరైనా ఉమ్మేయండి తడారి పోయి పగుళ్ళిచ్చిన గుండె మెత్తబడేలా... ఆకలినీ,అంతులేని ధుక్ఖాన్నీ దాచిన ఆ గది తలుపునీ తెరిచి నన్ను మళ్ళీ ఆ పురిటి రక్తం లోకి విసిరేయండి ప్లాస్టిక్ పువ్వుల ప్రపంచం నుండి అనంతానంత ఇసుక దారుల్లో పాదపు గుర్తుల్నిండిన ఎడారుల్లోకి నాకిప్పుడు ఒక వెచ్చని రక్తపు చారిక వంటి మెరుపు కలిగిన నవ్వు కావాలి లేదూ... విరిగి పడి ప్రవహించే మంచు గడ్డ లాంటి జీవితమైనా సరే నా దోసిట్లో వొంపండెవరైనా ఒక్క జిగురు నవ్వుని... లేదూ మనస్సు నిండా నిశ్శబ్ద శూన్యమైనా సరే... 29/03/2014
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jHBbp6
Posted by Katta
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jHBbp6
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి