పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
ఎం.నారాయణ శర్మ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఎం.నారాయణ శర్మ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జూన్ 2014, బుధవారం

ఎం.నారాయణ శర్మ కవిత

విరుపు __________________________ నీ కాళ్లక్కడే ఉంటాయి నువ్వుమాత్రం కళ్లతో సూర్యుని పైకి ఉమ్మేయి నువ్వేదో బురదలో పొర్లావని జనం వాళ్లను వాళ్లువిడిచిరారు నిద్రను నటించవచ్చు నిప్పులా మెరవనూ వచ్చు నిన్నునువ్వు దాటుకుని అలా నటించలేవు నాకు తెలుసే పంచుతున్నానని చెప్పే బూంది పొట్లంకోసం నువ్వెతుక్కో బతుక్కి అర్థంకోసం నేను నాలోకంలోంచి మాట్లాడతా

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lDKdOy

Posted by Katta

15, జూన్ 2014, ఆదివారం

ఎం.నారాయణ శర్మ కవిత

చివరాఖరి ప్రశ్న ____________________________ 1 నల్లని రాయిమించి కిందికి వాలుతున్నకొంగలా గుడ్డుమించి దు:ఖం పారుతుంటే నగరపు ఒంటరితనం నుంఛి తేరుకునేందుకు నేను వర్షంలో ముఖం దాచుకుంటా మూలం అందని చివుళ్లు గాలివాటుకు కొమ్మల సందున దూరి దాక్కున్నట్టు 2 వేళ్లు కంటిని పొడిచేసినట్టు నన్ను నేను పొడిచేసుకోడం కంటే లోకం మీద విజయమేముంటుంది వర్షం మురుకినీరవుతున్న ఆక్వా కాలంలో ఎండి చారికలవటం తప్ప నదులకు జీవితమెందుకో 3 వాడి మీసాలు మాత్రమే కుర్చీ మోస్తుంటే రాజ్యాన్నానందిస్తాయి చీమల్ని చంపేందుకు వాడు నదుల్ని చల్లుతాడు వెలుగుతున్న సిగరెట్ని చూసి గొంతెండిపోయిన నదుల్లా నువ్వు నేను వణికి పోతూ 4 కాస్త గుమ్మనికి పసుప్పూసేసి కాసిని పూలూ పళ్లూ కొమ్మనించి వేరుచేసి క్లిప్ పెట్టుకుని వెనకకి అలా వదిలేసి భారం భారంగా గడిపేద్దాం ఈ రోజూ అన్ని ఖాలీ దినాల్లాగే నిన్నటిలా మిగిలిపోతుంది.

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1loyGm2

Posted by Katta

ఎం.నారాయణ శర్మ కవిత

వర్చస్వికవిత-బియాస్ ___________________________________ అభ్యుదయవాదం కవిత్వానికి అందించిన పరిభాషలో"కాలిక స్పృహ "ఒకటి.ఒక సాధారణమైన సాహిత్యభాషలో చెబితే తక్షణ స్పందన(immidiate Responce).సమకాలీన సామాజిక పరిస్థితుల గురించిసమగ్రమైన అవగాహనతో,ప్రేరణతో కవిత్వం రాయటం.విమర్శకుల అభిప్రాయం ప్రకారం "దిగంబర కవిత్వం"కూడా ఈ స్పృహని కొనసాగించింది.కొయ్యగుర్రం అలాంటిదే.నిజానికి తక్షణ స్పందనకు,కాలిక స్పృహకు ఒక వెంట్రుకవాసి వైరుధ్యముంది.కాలిక స్పృహలో ఒక శాశ్వత ప్రాతిపదిక ఉంటుంది.తక్షణ స్పందనలో అది అన్ని అంశాలలో సాధ్యం కాక పోవచ్చు. మానవీయ సంస్పర్శలేని కవిత్వాన్ని సామాజిక దృష్టితో అనుభవించలేం. కవిసంగమంలో సమకాలీన జరిగిన అనేక సంఘటనలకు స్పందించి,బాధ్యతగా రాస్తున్న సందర్భాలు కనిపిస్తాయి..ఆ క్రమంలో ఈ మధ్యన హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ప్రమాదంపట్ల కొన్ని మానవీయ స్పందనలు కవితలుగా రూపుదిద్దుకున్నాయి. డా.ఎన్.వి.ఎన్.చారి.-"పాపం పసివారు",ప్రణయ్ -"దారుణం","ఎలా చెప్పనురా నువ్విక రావని " శారద శివపురపు,వర్చస్వి-"బియాస్"అరుణ నారదభట్ల "కాలం"-మొదలైనవన్నీ ఈ క్రమంలోనివే. సంజీవదేవ్"Transformation of impresion into expression is Art"అన్నారు.మనసులో ముద్రింపబడిన స్థాయి కవిత్వాన్ని పాఠకుడి హృదయానికి చేర్చుతుంది.వర్చస్వి "బియాస్" ఒక ప్రమాద వాతావరణం నుంచి గత,వర్తమాన ,భవిష్యకాలాలలోని యాంత్రిక స్పందనలను కవిత్వం చేసారు..ఒక నిశ్చేష్టమైన రస స్థితి ఇందులో కనిపిస్తుంది.అనేక వాక్యాలలో ఒక నిర్వేదం ధ్వనిస్తుంది.అచేతనమౌతున్న మానవీయతని పరోక్షంగ తిరస్కరిస్తున్న వాక్యాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ కవిత్వీకరణాంశాన్ని కూడా మాట్లాడుకోవాలి మొదటి రెండు యూనిట్లు మనకు విషయాన్నిపరిచయం చేసి,అందులో నిష్పన్నం చేస్తాయి. "అప్పుడప్పుడూ స్వప్నాల రెప్పల మధ్య ఓ హరివిల్లుని చూసొద్దామనుకునే ఉల్లాసపు వెల్లువకు ఏదో తెలీని తప్పిదపు ఆనకట్ట అడ్డుపడిపోతుంది! చూస్తుండగానే కంటిలో చలమలు చిన్నగా చిలవలు పలవలై విరుచుకు పడ్డ వరదై కనీళ్ళ చితిని పేరుస్తుంది." అంశాన్ని పరిచయమంచేయడం దగ్గరినించి వర్చస్వి సాధించిన భారత(baalence)గమనించ దగ్గది.రెండవ వాక్యంలో మనసు ధ్:ఖ భరిత మయ్యే భాగాన్ని అంచలంచలుగా చెప్పడం కనిపిస్తుంది.మూడవ వాక్యం నించి మనిషిలోని యాంత్రిక స్పందనలను కవిత్వం చేస్తారు. " కోల్పోయిన లేత కలల్ని వొత్తులేసుకుని వెతికీ వెతికీ వేసారిన కళ్ళు- నివాళిగా వెలిగే కొవ్వొత్తులవుతాయి ! రోజులు దొర్లాక దొర్లిపడ్డ కన్నీటి కెరటాలన్నీ చుక్కలు చుక్కలుగా కాసింత కుదుట పడిపోతుంటాయి. పగిలిపోగా మిగిలిన గుండెల్ని స్మృతులుగా శృతిచేసుకుని జాలిగా నేమరేసుకుంటాయి ! ఎప్పటిలా దీటైన యంత్రాంగం తనపని తాను చేసుకు పోతూ ఎక్కడో మేటవేసిన ఇసుకలో ఇంకి పోతుంది! కుర్రకారుతో పోటీపడి ‘అశ్రద్దా-అప్రమత్తతలు’ పొగరైన వైట్ కాలర్ల నేరాలుగా ఎగురుతాయి. ‘సౌందర్యాన్ని వీక్షించదలచిన కన్ను చిన్న నలుసైనా పడకుండా రక్షించుకోవడం నేర్వాలనే’ అంశం- రేపటి స్కూలు సిలబస్ లో ‘బియాస్’ పాఠంగా వెలిసి తప్పించుకుంటుంది! "నిజానికి ఇందులో చెప్పిన అంశాలన్నీ ఒక అంశాత్మక పరిశీలన(Case Study) గా కనిపిస్తాయి.సాధారణ జనం,సంబంధీకులు,రాజకీయనాయకులు,మేథో వర్గం వీరందరూ పరోక్షంగా వరుసగా ఈ వాక్యాలనుండి వ్యక్త మౌతారు. కాలికంగా అవసరమైన జగరుకతని ప్రదర్శించడమే కాకుండా,తగిన భారత కలిగిన హృదయ స్పందనని,సామాజిక దృష్టిని వర్చస్విగారి కవిత వ్యక్తం చేస్తుంది.సామాజిక స్థితిగతుల్ని సమకాలికంగా అంచనా వేయనప్పుడు స్పందించనప్పుడు కవిత్వ వస్తువులో,దృష్టిలో,కవిత్వీకరణలో మూస తొంగి చూస్తుంది.దీన్నించి మరల్చుకుని కవిఎలా ప్రవర్తించాలో ఈ కవిత గుర్తుకు చేస్తుంది.

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pZ5asz

Posted by Katta

11, జూన్ 2014, బుధవారం

ఎం.నారాయణ శర్మ కవిత

నిశీధి -" కల "త ______________________________ స్వప్నాలకీ సాహిత్యానికి సంబంధం ఉందా..అంటే"త్రికరణాలలో స్వప్నం మనసుకి రూపమయితే,కవిత్వం వాచ్యభాగానిది"అన్నాడో పెద్దాయన.కలల్ని కవిత్వంగా, కావ్యంగాచెక్కడం అన్ని భాషల్లో కనిపించేదే.తెలుగులో కూడా..రాచమల్లు భైరవకొండారెడ్డి-"స్వప్న శీతాచలం",జాషువా-స్వప్న కథ,విశ్వనాథవారి-"సముద్రగుప్తునిస్వప్నం",సినారె-"స్వప్నభంగం"అజంతా "స్వప్నలిపి,"మలయశ్రీ"స్వప్నం",మిరియాల రామకృష్ణ"సువర్ణ స్వప్నం",సుమనశ్రీ "మహాస్వప్నం"-ఇలా లెక్కబెడితే అనేకంగా కనిపిస్తాయి.ఇక పురాణాల్లోని ఘట్టాలు,వచనకవిత్వంలోని ఖండికలు కూడా అనేకంగా కనిపిస్తాయి. ప్రాచీన కాలం నుంచే స్వప్నాలు కావ్యాలలో దర్శనమిస్తున్నా..వీటిచర్చ ఫ్రాయిడ్ కి ఈవలే ఎక్కువ.ఫ్రాయిడ్ మనోవైఙ్ఞానికశాస్త్రం ఆతరువాత అతనివిశ్లేషణలు.స్వప్నాలగురించి చాలకొత్త విషయాలను ఆవిష్కరించాయి.తానే స్వయంగా"స్వప్నార్థ వివరణ"(Interpretation to dreems)రాసాడు.ఇందులో అనేక స్థాయిల్లో విశ్లేషణలున్నాయి.అతని అనుయాయుల్లోకూడ కలలను విశ్లేషించిన వాళ్లున్నారు C.Hall-The Meaning Of Dreems అనే పుస్తకాన్ని రాసాడు..తెలుగు విషయానికొస్తే "అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి"-స్వప్న సందేశం ప్రసిద్ధ గ్రంథం. నీశీథి తానుకోరుకునే కోరికనే "కల"నిచేసి కవితనందించారు.కలలు కోరికలవల్ల వస్తాయని విఙ్ఞాన వేత్తల వివరణ.ఫ్రాయిడ్ కలని గురించి వివరిస్తూ దాన్ని"ఇష్టావాప్తి""ఈప్సితార్థసిద్ధి""వాంఛాపూరణం"అని అన్నాడు..ఈమూడింటిలోనూ కోరిక అనేఅంశం బలంగా కనిపిస్తుంది.అచేతనమయిన దాంత స్మృతులు,అణచివేయబడున ఙ్ఞాపకాలు పై కోరికని కలిగిస్తాయన్నది ఆయన వివరణ.చరకుడు కూడా తనగ్రంథంలో ఇలాంటి వివరణే ఇచ్చాడని పూర్వులభావన. ఈకవితలో ఇలాంటి బాధావిముక్తిని అన్వేషించే కల కనిపిస్తుంది.ఈ వాక్యాలన్నిటినీ గమనిస్తే మొదటిది తనకు తాను ఆశిస్తున్నట్టుగా వాంఛనిప్రకటిస్తుంది.రెండవ వాక్యం నించి సంభాషణలా ఉంటూ తన స్థితిని ఆశని చెబుతుంది. "ఎండి డస్సిపోయిన భూమి పై పొడి జల్లుల ఓదార్పులా అలసిన కళ్ళ ని కొన్ని మృదువయిన కలలు తడిమితే బాగుండు కలవరం లేని సవ్వడితో కల వరమై కళ్ళని జో కొడితే ఇంకా బాగుండు" ఇది కలనే వాంఛగా వ్యక్తం చేసిన వాక్యం..ఈ సందర్భంలోనే భౌతికంగా స్వప్నాలకు క్షేత్రావస్థగా ఉండే నిద్రని ఆహ్వానించడం కనిపిస్తుంది. "జీవితాంతం తోడు ఉండమన్నట్టు నిద్రకెందుకో అంత బెట్టు కొన్ని ..చాల కొన్ని క్షణాల ప్రేమను అలా ఒక్కసారి గుమ్మరించి పోవొచ్చుగా ప్రపంచాన్ని రాసియ్యమన్నానా ..ఏదో రెప్పల మీద మృదువుగా ఒక సంతకమేగా అడిగాను పెద్ద కోరికలేమి కోరాను ...మార్దవంగా చిన్నగా లాలిపాట తో జోకొట్టమనేగా" ఇలాంటి నాటకీయ శైలిగల వాక్యాల్లో కొన్నిసార్లు అణచివేయబడ్డ కోరికలు,దానికి కారణమైన పగలు వీటన్నిటిమాట్లాడటం కనిపిస్తుంది. ఉదయపు నిసృహ / జ్వరపు పగళ్ళ నుండి/జీవితపు ప్రవాహంలో తల్లడిల్లే మనసు పడవ...ఇవన్నీ దాంతభాగాన్ని స్పర్శిస్తాయి. ఇందులోని వాక్యాలని భాషాశాస్త్ర పద్ధతిలో చూసినప్పుడు కొన్ని మానసిక సంబంధమైన పదబంధాలు కనిపిస్తాయి..అనేక వాక్యాలలో ఒక శైశవ స్వభావం ఉంది."కలవరం-కల వరం"లాంటి సాహిత్య సంబంధమైన శబ్ద లౌల్యమూ కనిపిస్తుంది.చాలామంచికవిత అందించిన నిశీథిగారికి ధన్యవాదాలు.

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uYrYur

Posted by Katta

10, జూన్ 2014, మంగళవారం

ఎం.నారాయణ శర్మ కవిత

రేణుకా అయోల -నా నడకలో నగరం ______________________________________ యూంగ్ సాహిత్యానికి రెండు పార్శ్వాలుంటాయన్నాడు.ఒకటి మనస్తత్వాత్మక మైంది రెండు దర్శనాత్మకమైంది.(Psycologocal and Visionary)మనస్తత్వానికంటే మించిన సామూహిక చేతన ఒకటి మనిషిలో ఉంటుందని యూంగ్ నమ్మాడు. ఆధునిక కాలంలో ఫ్రాయిడ్ అతని అనుయాయులువేసిన మార్గాలు సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి కొత్తమార్గాలనన్వేషించాయి,ఆవిష్కరించాయి.రేణుకా అయోల కవితలో సాహిత్యతత్వమూ,మనస్తత్వమూ రెండూ ప్రత్యక్షంగా కనిపిస్తాయి.వేరొక ప్రదేశంలో ఉండి అక్కడి ప్రకృతిని చూసి తన దేశపు ,ప్రాంతపు ఉనికిని కవితలో రికార్డ్ చేయటం ఇందులో కనిపిస్తుంది. "ఏరుకోగలిగినంత ఏకాంతంలో ఎర్రగులాబీల గుత్తులు చూస్తు నడుస్తాను పల్చటిగాలి చుట్టుకుని అక్కడి మట్టిని గుర్తుకి తెస్తుంది ధూళి రేగుతున్న జ్జాపకం ఒకటి పక్కనుంచి వెళ్ళిపోతుంది " ఈవాక్యాన్ని చూస్తే ఇందులో ఙ్ఞాపకం రూపంలో తనను వెంటాడుతున్నదేదో అర్థమవుతుంది.ఫ్రాయిడ్ "ప్రాక్ చేతనా"న్ని గురించి చెబుతున్నప్పుడు ఙ్ఞాపకాలను గురించి చెప్పాడు.ప్రాక్చేతనలోని అంశాలు దమనానికి లోనుకావు కాబట్టి అవి గుర్తుకు వచ్చే అంశాలు సంఘటనలు తారస పడినప్పుడు అవి చుట్టుముడుతాయి.ఫ్రాయిడ్ దీన్ని సంసర్గ విధానం(Associative Process)అన్నాడు.సన్నిహితంగా ఉండే రెండు అంసాలలో ఒకటి కనిపిస్తే మరొకటి గుర్తుకు రావటం.దమన శక్తులుగనక ప్రభావం చూపిస్తే అంశాలు స్వప్నాలుగా ప్రవేశిస్తాయి. ఎర్రటి గులాబీలు,పల్చటిగాలి ,మట్టినిగుర్తుకు తేవడం ఇలాంటిదే.ఇలాంటి చేతన గురించి "మాండూక్యోపనిషత్తు" కొంత చెప్పింది. "జాగరితస్థానొ బహిష్ప్రఙ్ఞ:"-ఇది జాగరితమై బహి: అంటే దేశ కాలస్పృహతో ఉంటుంది..ఇందులో కనిపించేది ఇదే...ఈ అంసాన్ని ప్రత్యక్షంగా వ్యక్తం చేసే అంశాలు కవితలో ఉన్నాయి. "మనుషులు మనుషులు తగులుకుని వేడిగాలిలో మగ్గిపోయే ఒక వేడి జాపకం నాదేశంలోకి తీసుకు వెళుతుంది కూలిపోతున్న పచ్చదనం ఆకులు నామీద రాలుతాయి ద్వారాలు వేరవుతున్న చప్పుడు అమాయకంగా ప్రాణాలు తీసుకున్న చప్పుడు వాగ్దానాలు గుప్పిస్తున్న చప్పుడు ఆనందంలో ఎరుపెక్కిన కళ్ళు ఆశల పల్లకీలో ఊరేగుతున్న చప్పుడు" ఇవన్నీ ఈమధ్యకాలంలో రాష్ట్రంలో జరిగిన సంఘటనలని ప్రతీకాత్మకంగా చెబుతున్నాయి."ద్వారాలు వేరవటం""ప్రాణాలు తీసుకున్న చప్పుడు"-ఇలాంటివన్నీ ఆతరహా కాలిక స్పృహ కలిగిన అంశాలే. ప్రతీవారిలో ఒకస్థిరమైన మానసిక వాతావరణం ఉంటుంది.అయోలాగారిలోనూ ఉంది.ఇది కొన్ని పద బంధాలద్వారా వ్యక్తమౌతుంది. ఆకుపచ్చని గడ్డి అలలపై/ఆకుపచ్చని నిశ్బబ్ధం / ఆకుపచ్చని నీడ/ఆకుపచ్చని లోయ/ పచ్చదనం ఆకులు /ఈ పదాలు ఆ బౌద్ధిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.-ఒక శుభకరమైన ఆశంసని కోరుతూ ఈ కవిత ముగుస్తుంది. ఇవి కూడా ఫ్రాయిడ్ చెప్పిన మనోనూర్తిమత్వ నిర్మితి(Anotamy of mental Personality)సంబంధించినవే..మంచికవిత అందించినందుకు అయోలా గారికి ధన్యవాదాలు.

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uSwSJz

Posted by Katta

8, జూన్ 2014, ఆదివారం

ఎం.నారాయణ శర్మ కవిత

శ్రీనివాస్ వాసుదేవ్ కవిత-కొత్తగొంతుకలో ____________________________________ అస్తిత్వ వాదంలో "స్వేచ్చను"మానవ వాస్తవికత గా చెప్పారు.ఇది దాని చుట్టూఉండే పదార్థాలు,వర్గాలు,మూసలను చేదించుకుని వస్తుంది.మనుషుల్లో అభ్యుదయ వాదులు,విప్లవ వాదులు బయట పడటానికి కారణం ఇదే.స్వేచ్చ అనేది నిర్వచనానికి చిక్కని అంశం.అది వాస్తవము,యథార్థత కాదు.కాని అలా నిర్వచించుకోక పోతే ఆలోచించటం,తెలుసుకోవటం కష్టం. వ్యాకూలతని అనుభవిస్తున్నప్పుడుస్వేచ్చయొక్క ప్రాక్తన,అగాధ శీలం ముందు నిలబడి వ్యాకూలత పొందినప్పుడు ఈషన్మాత్రంగా దర్శనమిస్తుంది.మాటలనే మూసలలోనికి స్వేచ్చ చిక్కదు..ఏదైనా ఒక విషయం ద్వారానే స్వేచ్చను మనిషి గుర్తించ గలుగుతాడు,ఈ దృష్టిలో చుట్టూ ఆవరించిఉన్న అణుమాత్రపు భాగమంతా స్వేచ్చచుట్టుపేనవేసుకొని ఉన్నదే.శ్రీనివాస్ వాసుదేవ్"కొత్త గొంతుకలో"-ప్రాక్తన జీవితం చిద్రపడ్డస్పృహనుంచి వ్యాకూలత చెందుతున్న స్వరం ఉంది.ఒక సంఘటన జరిగిన తరువాత ఆరాజకీయాంశం గురించి స్పందించిన కవిత,ధ్వనిమయంగా ఒక స్థాయి వినిర్మాణంలో ఈ కవిత కనిపిస్తుంది. జరుగవలసింది జరిగాక మళ్లీ ఎప్పటి జీవితాన్ని పొందేందుకు గతాన్ని,గమనాన్ని కలిపి భవిష్యత్తుని ఆశించటం ఇందులో ఉంది. "వికసించిన చీకట్లలో వెలుగుని ముద్దాడాను వికటించినవాటిల్లో ఫీనిక్స్ అస్థికలకోసం వెతికాను రెండూ దొరికాయి..... మరో కొత్త గొంతు మొహమ్మీదకొచ్చింది అదే గళం, అదే స్వరం కానీ మాటమార్చాల్సొచ్చింది గ్రాఫీటీ పైనో, గ్రాఫుల్లేని వ్యవస్థపైనో ఇక రాయాలి ఇక హోలోకాస్ట్ కథలొద్దు, జాతివైరపు రంపపుకోతలూ వద్దు మాటని పంచుకుందాం, మనసుతో మాట్లాడుకుందాం! ఓ కొత్తగొంతుకలో...." అస్తిత్వ దృక్పథం నుంచి స్వేచ్చ పెనుగులాడేదీ ఇందుకే..బేర్డియేవ్ రెండురకాల స్వేచ్చగురించి చెప్పాడు. ఒకటి ప్రాక్తన,అహేతుక స్వేచ్చ.ఇది మంచీ చెడులకు ముందు ఉండేది(జరగక ముందే భయపెట్టి సంఘర్షణకు గురిచేసేది,లేదా హెచ్చరించేది.)రెండోది చర్యను అనుసరించేది.అంతిమ హేతుబద్ధ స్వేచ్చ.(జరిగిన దానిని తార్కికంగా అర్థం చేసుకుని సంఘర్షణను అనుభవించేది)అందువల్ల ప్రతీ విషయంలో స్వేచ్చ ఆరంభబిందువు,మార్గము,లక్ష్యం కూడా. వాసుదేవ్ కవిత రెండవ జాడలనుండే వచ్చిందని తేలికగార్థమయ్యే విషయం.ఈ కవితలో రాకీయాంశని పట్టిచ్చే అంశాలుకొన్ని ఉన్నాయి. "గుమ్మానిక్కట్టిన చామంతులన్నీ ఒకే పాటందుకున్నాయి.... మా కంట్లోంచి జారిన కన్నీళ్ళని పట్టే కెమేరా ఉందా అని!" "రెండు పూలమధ్యైనా రెండు తొడల మధ్యైనా అదే వాసన కోర్కె వాసన....స్వార్ధపూరిత కోర్కె వాసన జీసస్‌ని శిలువేసిన ఆ జెస్టింగ్ పైలేట్ కీ అదే సమస్యనుకుంటా నిజాన్ని చెప్పనివ్వకుండానే వెనుతిరిగాడు" "గ్రాఫీటీ పైనో, గ్రాఫుల్లేని వ్యవస్థపైనో ఇక రాయాలి ఇక హోలోకాస్ట్ కథలొద్దు, జాతివైరపు రంపపుకోతలూ వద్దు మాటని పంచుకుందాం, మనసుతో మాట్లాడుకుందాం!" రెండుపూలు/జాతిరంపపు కోతలు/మా కంట్లోంచి జారిన కన్నీళ్లని పట్టే కెమేరా ఉందా...ఇవన్నీ రాజకీయాంశని పట్టిస్తాయి... ఈకవితని అర్థం చేసుకోడానికి ఇందులో అనుసరించిన నిర్మాణం ఒకటి కొంత అడ్డుపడుతుంది. వస్తువు+సంఘర్షణ+ శాస్త్రీయవచనం..అనే సూత్రం ఒకతి కనిపిస్తుంది..సాధారణంగాప్రతీకలు,అంతర్గతవచనం లాంటివి ఇలాంటి నిర్మాణంలో కనిపిస్తాయి..ఇందులో శాస్త్రీయమైన వైఙ్ఞానికాంశాలున్నాయి.గ్రాఫిటీ,ఫీనిక్స్,ఐన్ స్టీన్ సాపేక్షసిద్ధాంతం..ఇవన్నీ అలాంటివే...నిజానికి ఇందులో అస్తిత్వ వాద సంఘర్షణని ప్రస్తావించేది ఇదే. "రాత్రిలాంటి నల్లచీరకట్టుకున్న నింగీ, ఒళ్ళారబెట్టుకుంటున్న నేలా రెండూ సాపేక్షసిధ్ధాంతాలకతీతమే ఐన్‌‌స్టీన్ మళ్ళీ వెనక్కెళ్లాల్సిందే...మనిషి మనుగడలోకి!" సాపేక్ష సిద్ధాంతంలో ఒకటి విశ్రాంతిలో ఉంటే మరొకటి చలనంలో ఉండటం అన్న సూత్రాన్ని..కాదని రెండూ ఉంటాయని నిరూపించాడు..సుమారుగా అస్తిత్వమూ ఇదే మార్గంలో వెళ్లింది. ఈ తరహా కవితా నిర్మాణాలు పాశ్చాత్యసాహిత్యంలో ప్రయోగాత్మకంగాకనిపిస్తాయి.ఎక్కువ ఙ్ఞానాన్ని అపేక్షించినట్టుగా కనిపించే ఈకవిత వర్తమానాన్ని గురించిన భారమైన అంశాన్నిప్రస్తావించింది..నిజానికి హృదయభారాన్ని చెప్పడానికి ఇలాంటినిర్మాణమూ అవసరమేనని పిస్తుంది.

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1prkeik

Posted by Katta

3, జూన్ 2014, మంగళవారం

ఎం.నారాయణ శర్మ కవిత

అఫ్సర్ కవిత- ఓ పొద్దుటి రైలు _____________________________________ సాధారణంగా చూస్తేసాహిత్యంలో మూడు అంశాలని గమనించవచ్చు.అవి భౌతికము,మానసికము,ఆత్మికమూ..పరిణతి చెందిన కవిలో ఈ మూడులక్షణాలూ ఉమ్మడిగా కనిపిస్తాయి.భౌతికతాత్వికాంశలని వ్యక్తపరిచే సంధాయక శక్తిలా ఆత్మకాంతి(Light of soul)పనిచేస్తుంది.అరవిందులు కవి ఆత్మనుండి సరాసరి వ్యక్తమయ్యేదే అసలైన కవిత్వం అన్నారు."The true creator of poetry,the true hearer of the soul" కవిత్వాన్ని నిజంగా సృష్టించేదీ,వినేదీ,ఆస్వాదించేదీ ఆత్మయే-అనేది ఆయన అభిమతం.ఎడ్వర్డ్ బుల్లో చెప్పిన భౌతికాంతరత(Physical Distence)సూఫీ తత్వ వేత్తల దర్శనం,ఛాసర్ తన కవితలోప్రదర్శించిన "సూక్ష్మ భౌతిక స్పృహ" మొదలైనవి దీనికి దగ్గరవే. ఆత్మనే వ్యక్తీకరించి,వ్యక్తీకరింపబడుతున్నప్పుడు దానికొక సిద్ధవాతావరణం,స్వభావం ఉంటుంది.యూంగ్ మనస్తత్వ విశ్లేషణలో ప్రాక్తన ప్రతిమల(Premordial imeges) గురించి చెప్పాడు.మన ఆలోచనలను తెలియకుందడా ప్రభావితం చేసే అంశాలే ప్రాక్తన భావనలు.అథర్వణ వేదం వీటిని "అమృత గర్భ వాసనలు"అంది.ఒక అవ్వను చూసినప్పుడు ఇంట్లో అమ్మ గుర్తుకురావడం,చెట్టును చూసినప్పుడు ఇంట్లో/ఊర్లో చెట్టు గుర్తుకు రావడం ఇలాంటిదే. అఫ్సర్ కవిత "ఓ పొద్దుటి రైలు "లో ఈ స్పృహ కనిపిస్తుంది.ఈ కవితకు మరోదేశంలో ఉన్న రైలు ప్రయాణం ప్రేరణ.కాని ఇది అన్నిప్రయాణాలను,ఊళ్లనూ సారూప్యంగా వ్యక్తం చేస్తుంది.దీనికి కారణం నాలుగు వాక్యాల్లో ఎక్కదా నిర్దిష్ట స్థల ,కాలాలు లేక పోవటం. 1 వూరు మసక చీకటిలోకి సగం కన్ను తెరచి మూత పెట్టుకుంది ఇంకోసారి. దూరంగా రైలు కూత నిశ్శబ్దంలోకి గిరికీలు కొట్టింది. 2 పట్టాల పక్కన వూరు ఎక్కడయినా ఎప్పుడయినా వొక్కటే. దాని ప్రతి మాటా రైలు కూతల్లో వొదిగొదిగి పోతుంది. 3 వూరు వెనక్కో ముందుకో ముందుకో వెనక్కో వొక పరుగులాంటి నడకతో- ఎవరంటారులే , వూరిది నత్త నడక అని! అది ఎప్పుడూ ఉరుకుల పరుగుల సెలయేరే నాకు. 4 అన్నీ దాటి వచ్చామనుకున్నప్పుడు అసలేదీ ఎప్పటికీ దాటి వెళ్లలేమని రైలు పాడుకుంటూ వెళ్లిపోయింది కూతవేటు దూరంలో. వాక్యాల వారీగా విభజించుకుంటే ఈకవిత మొదటిభాగం వాతావరణాన్ని పరిచయం చేస్తుంది."వూరు మసక చీకటిలోకి /సగం కన్ను తెరచి /మూత పెట్టుకుంది"అనటంలో ఊరు గమనించటంలేదని అర్థం.రైలుకూత నిశ్శబ్దంగా గిరికీలు కొట్టడంలో గాలిలో వినిపించే కంపన స్థితిని అనుభవాత్మకంగాచెప్పటం ఉంది. రెండవభాగంలో బౌద్ధిక ప్రయాణం కనిపిస్తుంది.రైలు కూతనుంచి ఊరిమాటవినటం అలాంటిదే.మూడు నాల్గులు జీవితాన్ని అర్థంచేసుకునేవి.భౌతికంగా భావించే అంశాలన్నిటినీ ఆత్మకాంతితో కవితామయం చేసాయి.నాలుగులోని "అన్నీ దాటి వచ్చామనుకున్నప్పుడు అసలేదీ ఎప్పటికీ దాటి వెళ్లలేమని "అనటంలోనూ ఈ స్పృహ దాగుంది. కవిత్వంలోనీ ఒక గొప్ప స్పృహనిండిన పరిపూర్ణ కవిత ఇది.ఇన్ని తాత్విక సాహితీ విలువలతో,సూక్ష్మీకరించి కేవలం నాలుగు వాక్యాలలో రాయటం సులభమైన సాధన వల్ల సాధ్యపడదు.చాల సార్లు విదేశాలలో ఉండి అఫ్సర్"ఊరి చివర"లాంటి కవితలని ఎలా రాస్తారా అని సందేహం ఉండేది.అఫ్సర్ గారి ఆత్మిక జీవిత వాతావరణాన్ని ఈ కవిత పట్టిస్తుంది

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p52Ak0

Posted by Katta

2, జూన్ 2014, సోమవారం

ఎం.నారాయణ శర్మ కవిత

పరావర్తనం ___________________________ అదొక్కటన్నా ఇక నిలుస్తుందని భ్రమపడ్డ ఏ నిముషం ప్రాణంతోలేదు. లేనప్పుడు చీకటనుకుంటాం కాని భళ్లున తెల్లవారినప్పుడు వెళ్లిపోయిన వెన్నెల్లా అదొక్కటి. కనీసం ఒదార్పుకైనా నేనుంటే బాగుండు నిలువునా ఒకరికోసం ఒకరు దోపిడవుతారుకానీ ఎక్కడో ఒకచిన్ననటన ఎవరిలోనొ చంపేస్తుంది ఆశగా బతికేస్తుంటాం గానీ కొలతపెట్టి గీసినట్టు నడకనిండా పేరాగ్రాఫుల్లా తెగిపడ్ద జీవితం ఆనిముషనికన్నా నేను మిగులుంటే బాగుండు నిలువుగా దహించడానికి నాకు నేను తప్పెవరుంటారు అప్పుడప్పుడు పచ్చదనంతోపాటు పశువులూ మరణిస్తాయి ఒకడికోసం ఆఒకడే కన్నీటి చుక్కైతేబాగుండు ఎదవనాటకం ఎన్నాళ్లుంటుందనీ నదులన్నీ మొత్తుకొనీ మొత్తుకొని ఎప్పుడో నోరుమూసుకుని పడిపోతాయి అప్పుడు కవిత్వమయ్యేందుకు కాఫీ తాగుతూ ఓ పేపర్ వార్త నిజంగా మనిషని చెప్పడానికి మ్యూజియంలోనన్నా ఒకడుంటే బాగుండు

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hsc4Gt

Posted by Katta

30, మే 2014, శుక్రవారం

ఎం.నారాయణ శర్మ కవిత

దడి _______________________ అసంతృప్తికో దు:ఖానికో మౌనాన్నిమించిన మంచి వ్యక్తీకరణ లేదు కళ్లని వేలితో పొడుచుకోడం కన్నా రెప్పలకింద చూపుల్ని ఎదురుచూపుల్ని అదిమేయటం చాలు వానెప్పుడూ స్పష్టంగా కురవదు ఎక్కడో వెదుకులాటలో ఇరుక్కుపోయిన జీవితంలా చుట్టూ ఏవో నాటుకుని ఉన్నాయనుకుంటాం కానీ పరిసరాల్నించి నీడల్లా తుపుక్కున జారిపోయిన అడుగులు ఇంక నవ్వటం తెలియని పళ్లవరస అచ్చంగా ఎదురుచూడని కళ్లజంట అలా హృదయాన్ని నటిస్తాయి గాని తూరుపునిండా కందెనపూసి ఎంతకాలమైందో చుట్టూ ఉన్నాయనుకుంటాం గాని ఇప్పుడు మధ్యలోనే. .. ...

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jAOOQL

Posted by Katta

1, మే 2014, గురువారం

ఎం.నారాయణ శర్మ కవిత

జరా... _________________________ సారవంతమైన దుఃఖాన్ని నిర్మించాక పడకగదినీ ,మంచాన్ని వదిలి వర్షం ఒంటరిగా వెళ్లిపోతుంది ఏవో కొన్ని క్షణాలు వర్తమానాన్ని భరించలేక కళ్ళుమూసుకున్నట్టు నటిస్తూ ఎవరికీ తెలియకుండా అలామిగిలిపోతాయి మరణించడానికి తుఫానెందుకు..? నిన్ను నికు దూరం చేసే కొన ఊపిరి చాలదూ..? మూర్ఖంగా పొద్దున్నే రాత్రిని కడిగేసుకుంటాం గానీ వెంటనీడలా రాకుండా ఒక్కడుగన్నా వేయగలమా..? మిడిల్ పిన్నులో ఎంతకాలం దాక్కుంటావ్ నిన్నెప్పుడో కొసలు జార్చిపడేసాయి చూసీ చూసీ కళ్ళులోపటికెళ్ళిపోయి చూపుచుట్టూ గడ్డం పెరిగినట్టు చీకట్లు ఆకాశానికీ నాకూ దూరం పెరిగి పోయింది తుదిశ్వాసను సాధన చేస్తూ ఇప్పుడు ఆసుపత్రిలో వెలుగుతో ఆత్మహత్య చేసుకున్నమంచం ..

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i0ggGJ

Posted by Katta

28, ఏప్రిల్ 2014, సోమవారం

ఎం.నారాయణ శర్మ కవిత

మళ్లీ... ____________________________ ఒకానొక మహాయుద్ధం తరువాత నేల కళ్లకు వెలుగుపూయడానికి రంగురంగుల సూర్యుళ్లు ఉదయిస్తారు అప్పటిదాకా పాటలోలేని చరణాలన్నీ వేదనని మూసీనదిలా మారుస్తాయి యుద్ధపు నొప్పులువడ్డతల్లి దిగ్భ్రాంతికిలోనవుతుంది ఒకటికిరెండుఖండువలు కప్పుకుని కవచాలను వెంటేసుకుని పురుగులకొత్తపాట లోకంనుంచేతరిమేస్తానన్న కత్తి చిటికెనవేలితో నాలుకని తడుపుకుంటుంది ప్రాణాలు తీసుకున్న మొక్కలు ప్రాణాలుపోసిన పల్లెలు ప్రాణాచారం పడుకున్న గుండెలు ఆక్రందనెక్కడో పగుళ్లువారుతుంది రాత్రికిరాత్రే అమృతాన్నెత్తుకుపోయెందుకు పురుగుల తండ్లాట యుద్దం పూర్తికాలేదు బహుశః ఇక మొదలవుతుంది

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kaJLZ8

Posted by Katta

24, ఏప్రిల్ 2014, గురువారం

ఎం.నారాయణ శర్మ కవిత

కొస ________________ ఒకానొక మహాస్వప్నం సాకారమౌతున్న ఘడియన వంచనలో ఇరుక్కున్న తల్లిగొంతుక పెనుగులాడుతున్న క్షణాన దిగులుని ఊపిరిగామింగి నిలబడ్డ నిమిషాన మీనీడల దాగుడుమూతల్ని అలసిన దేహాలింకా మరచిపోలేదు పేగులు నిప్పులైకాలుతున్నప్పుడు మట్టికీ ఆకాశానికీమధ్య రేపటిరోజు కొమ్మలకు వేళాడుతున్నప్పుడు పిడికిళ్ల కళ్లలో కన్నీటిగాలుల్ని చిమ్మి నవ్వినప్పుడు మీ మౌనం అర్థాంగీకారంలా కూడా అనిపించలేదు స్వచ్చమైన గుండెకోతని ఎరుకజేయని చెవులు దుఃఖమైన పిడికిలిని అణగదొక్కినకాళ్లు ఇపుడు ప్రాణం పోసింది మేమేనంటే బతికిన ప్రాణన్ని కూడా మళ్లీ మట్టి పాల్జేయాలనిపిస్తుంది.

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iOoZQR

Posted by Katta

15, ఏప్రిల్ 2014, మంగళవారం

ఎం.నారాయణ శర్మ కవిత

పురా.. .. _________________________ 1 ఆకాశాన్ని మోస్తున్నట్టు రెండుచేతులెత్తినిల్చున్న వెన్నలపులుముకున్న సున్నపుచెట్టు మా పెద్ద మసీదు మాఊరు చెవులు రిక్కరించివినే ప్రభాతప్రదోషకాలల అజా సంగీతం వీథివీథినా శుక్రవారం నాడు ఓ పవిత్ర సందర్భాన్ని మోసుకొచ్చె పూలపల్లకి పుట్టుకనించీ మాఊరు ఎదుగుదలను కండ్లల్లవెట్టి చూసుకున్న కన్నతల్లి 2 ఇప్పుడు ఆకాశం కప్పుకున్న వెన్నెలచుట్టూ మూడురూపాల్లో నేను ఆక్రమించిన వెలుగునించి పెనుగులాడుతున్న చీకటిలా పోతపోసుకుని రంగులద్దుకున్న మూడుతరాలు బ్యూటీపార్లలయిన మంగలిషాపులు డ్రైక్లీనర్లైన ఇస్త్రీ దుకాన్లు ముత్తూట్ ఫైనాన్సుల్లో కుదువవడ్డ బంగారం దుకాన్లు చెదిరిపోయిన ఊరిపాటకు దహనంలో మిగిలిన ఆనవాళ్లలా 3 తోటచుట్టూపరుగెత్తిన చిట్టిపాదాలు ఏ పందెంలోనొ శిథిలమైనడుస్తున్నాయి చెర్వుని కళ్ళల్ల నింపుకున్నట్టు బిడ్డకోసం చేతులెత్తి నమాజ్ చేస్తున్న అమ్మీజాన్ లా ఇప్పుడు పెద్ద మసీదు..

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qCOO8P

Posted by Katta

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

కవిత్వ విశ్లేషణ

కవి యాకూబ్-చినుకు భాష






ఆత్మకళా,ఆత్మ కళాభ్యాసం,ఆత్మకళాసిద్ది అనే పదాలు ప్రాచీనకాలం నుంచి విరివిగా కావ్యమీమాంసలో కనిపిస్తాయి.ష్చెర్బీనా ఆత్మ కళాభ్యాసాన్ని గురించి మాట్లాడిందని,ఇది ప్రాచ్య,పాశ్చాత్య కళాతత్వ వేత్తలందరూ ఆదరించినదేనని శేషేంద్ర శర్మ గారి అభిప్రాయం.

జగన్నాథుడు "భగ్నావరణ చిద్విశిష్ట స్థితి"గురించి చెప్పాడు.ఆవరణలో ఉన్న జగత్తుపోయి ఇదివరకే ఉన్న ఆత్మీకృతమైన సంస్కారం ప్రకాశిస్తుంది.బాహ్య జగత్తుకు,ఆత్మావరణానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తనలో జాగృతం చేసుకోవడమే ఆత్మకళాభ్యాసం.

ఈక్రమంలో దర్శన స్థితి చాలావిలువైనది"తతఃపశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః పురా యత్తత్ర నిర్వృత్తం ప్రాణవామలకం యథా తత్సర్వంతత్వతో దృష్ట్వా" ఈతత్వదృష్టి,యోగస్థితి దర్శనాన్ని పదునుపెడతాయి.

దర్శనంలో స్పృహ అనేది ఒకటుంటుంది.దీనికి స్పర్శ మూలం.స్పర్శ నుంచి కవి ఆత్మీకరణ సంస్కారమైన స్పృహ లోనికి వెళుతాడు.తాను ఎటు ప్రయనిస్తాడనేది ఆత్మచైతన్యం,సంస్కార దృష్టిని బట్టి ఉంటుంది.ఇదంతా భౌతికం నుండి ప్రేరణ పొందిన కవి ఆత్మదృష్టివైపు వెళ్లటం.ఈ మార్గంలో కొన్ని సార్లు స్పర్శకూడా ప్రత్యక్ష భాగస్వామి అవుతుంది.కాని పరోక్షంగా స్పృహ అణువణువునా ప్రవహిస్తుంది.యకూబ్ చినుకుభాషలోఇలాంటిదృష్టిఒకటికనిపిస్తుంది.సాధారణదృష్టి,కళావిష్కారం,ఆత్మచైతన్యం,ఆత్మకళాసాధన ఇవన్నీ దార్శనిక పరిణతదశలు.


నిర్మాణపరంగా చూస్తేస్పర్సలోని చూస్తున్నవస్తువు,స్పృహలోని చెప్పబడుతున్న వస్తువు మధ్య సారూప్యతలుంటాయి.ఇలాంటి వాటిలో విలువలు ఒకదానికి ప్రత్యక్షంగా ఉంటే,మరోదానికి ఆపాదించబడుతాయి.

ఆమూర్తసంభాషణ, మూర్త సంభాషణ
అని రెండు ఉంటాయి.ఒక అంశాన్ని గురించి మాట్లాడుతున్నట్టుగా అనిపించినా ధ్వనిగతంగామరొకటి స్ఫురిస్తుంది.స్పర్స భౌతిక మైంది,స్పృహ ఆత్మికమైంది."కవిత్వాన్ని ఆత్మే స్వీకరిస్తుంది కాబట్టి చెప్పేదికూడా ఆత్మే అవుతుంది"అని అరవిందులన్నారు.

ఉద్వేగంతరువాత ఉపశమనం నుంచి కవిత ప్రారంభమౌతుంది.
"ఇంక కొంత సమయం, పడుతుంది/ఈ
ముసురు ఆగిపోవడానికి"

మనసునిఏదో ఉద్వేగంచుట్టుముట్టి ఉండడం,ఆ ఉద్వేగపు సమాప్తి గురించి ఆలోచించడం."మరీ చిన్నిచిన్ని చినుకులు/వాటికోవ్యాకరణ సూత్రమేదో ఉన్నట్టు/ఒకటి వెంట ఒకటి కుదురుగా." ఆత్మీ కరింపబడున అంశాలు కాలగతంగా చేరినవైఉంటాయి. అందువల్ల ఒక్కటొక్కటిగానే అందుతాయి.ఆవరించి ఉన్న అంశాన్ని తప్ప
మరోదాన్ని,భౌతిక జరిగే పరిణామాలని ఆత్మ పట్టించుకోదు.
"నిన్నటి సాయంత్రం నుండి ఇవాళ్టి ఉదయం లోపల/ఎన్నిపరిణామలు జరిగిపోలేదు/అవేమి పట్టనట్లు ప్రవర్తిస్తుందీ ముసురు"-దానినుంచి ప్రేరణపొంది ముగించుకోడం తప్పా ఆవరించి ఉన్నదాని అంతుచిక్కదు

"ఈ ముసురు చేసే సంభాషణలో/ ఒక్క ముక్క అర్థంగాదు"

దృశ్యాన్ని వర్ణిస్తున్నట్టుగా ఉన్నా..చిత్రించడం,ఆపాదించడం లాంటివి ఇందులో బలంగాకని పిస్తాయి.ఆవరించి ఉన్న ఓ ఉద్వేగపు క్రమాన్ని యకూబ్ గారు ఈ కవితలో చిత్రించినట్టు కనిపిస్తుంది. ఈ మూర్త సంభాషణలోనించి ఆమూర్తంగా మరోగొంతు ధ్వనిస్తుంది.

         

                                                                                                                                        ________________ఎం.నారాయణ శర్మ-1.8.2013

కవిత్వ విశ్లేషణ

Mehdi Ali: నీ విఙ్ఞత





 


మెహది అలిగారి కవితగురించి మాట్లాడుకున్నప్పుడు రెండువిషయాలను గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.1.అలీగారు వ్యక్తం చేసిన అంశం2.వ్యక్తం చేసిన తీరు. చాలాకాలం క్రితం బౌద్దానికి సంబంధించి"అశ్వ ఘోషుడు"మనుషుల ప్రవర్తనకు సంబంధించి "సౌందరనందం"లో ఒక వ్యాఖ్య చేసాడు.

"దృష్ట్వైకం రూపమన్యోహి రజ్యతేsన్యఃప్రదుష్యతి
కశ్చిద్భవతి మధ్యస్థఃతత్రైవాన్యో ఘృణాయతే"

ఒక రూపాన్ని చూసి ఒకడు సంతోషపడితే ఒకడు దూషిస్తాడు,ఇంకొకడు మధ్యస్థుడైతే
,వేరొకడు జాలిచూపిస్తాడు.మనుషులస్వభావన్ననుసరించి వారివారి విఙ్ఞతలననుసరించి వారి ప్రవర్తన ఉంటుంది.ఇలా వేరువేరు అభిప్రాయాలు కలగటం వారి మానసిక సంస్కారాలను బట్టే ఉంటుంది.

అలీగారు ఇలాంటి తత్వంలోనే నీవిఙ్ఞత అనివదిలేసారు.ఇందులో అనేకాంశాలని స్పర్శించడం కవికుండే సార్వత్రిక దృష్టికి నిదర్శనం.విమర్శలో సభ్యొక్తి (euphemisam)అనే పదాన్నొకదాన్ని వాడతారు.ఇది వాక్యాన్ని చెప్పే పద్దతికి సంబంధించింది.ఎదుటి వారి ప్రవర్తన గురించి మాట్లాడుతున్నప్పుడు దురుసుగా,కటువుగా కాకుండా పరోక్షంగా చెప్పడం.

వ్యక్తం చేసిన తీరు గురించి మాట్లాడుకుంటే కొన్ని విషయాలు ప్రధానంగా గమనించాలి.కొత్తగా కవిత్వం రాస్తున్నవాళ్లకు ఏవిషయం రాయాలన్న దాంట్లో అనుమానం లేకున్నా.. ఎలారాయాలనేది,ఎదుటి వారికి ఎలాచేరవేయాలనేది మొదటి ఇబ్బంది.అలాంటి వారికి ఈకవితనుండి ఒక మార్గం దొరుకుతుంది.మొదట్లో చాలావరకు అందరూ పంక్తులలో పదాలనుపేరుస్తూ వెళతారు.అంటే ఒకే వాక్యాన్ని సుమారు మూడు నాలుగు పంక్తులల్లో రాయటం.ఇంకొందరు కుప్పగా ఒకేచోట రాసేస్తారు.ఇది ఒకరకంగా కవిత్వం రాసే వారిలో ప్రాథమిక దశ.ఎంత గొప్ప స్ఫూర్తి కలిగించే విషయం చెప్పినా నిర్మాణ క్రమం తెలిసి రాసే వారి వాక్యంలా చేరదు.

కొంత అధ్యయనం తరువాత ఇలాంటివారిలో పరిణత దశ కనిపిస్తుంది.అంశాలని యూనిట్లు గా రాయడం.ఈసమయంలో రెండు వాక్యాలుగా ,మూడువాక్యాలుగా రాయడం కనిపిస్తుంది.నిజాని ఈదశకి చేరడానికి కొంత కాలం పడుతుంది.ఇలాంటి కవితలు చదివి నిర్మాణాన్ని అర్థంచేసుకున్న వారికి ఆకాలం కొంత తగ్గొచ్చు.

అలీ కవితలో ప్రతి యూనిట్లోనూ వరుసగా నిర్మాణ సారూప్యత సాధించారు .

"నేనొక సముద్రాన్ని గంభీరంగా కనిపించడం నానైజం
భయపెడుటున్నానా కెరటాలతో ఆడమంటున్నానా
అర్థమెలాచేసుకుంటావో నీ విఙ్ఞత అది"

మొదటి దాంట్లో ప్రతిపాదక వాక్యం-సృజనధర్మ వర్ణన.రెండవదాంట్లో రెండు వైవిధ్యాంశాలు.మూడవది సూచన .నిర్మాణగతంగా ఇది శతకాలలో కనిపించే మకుటం లాంటిది.విమర్శ దీన్ని వాక్య నిర్మాణ పునరుక్తి(parallelism)అంది.సరళ వచనం (plain prose)లా కనిపించే కఠిన పదాల్లేని వచనం ఇందులో మరో ఆకర్షణ.అర్థ సంబంధంగా ప్రతీ పదంలోనూ కవికున్న అవగాహన కనిపిస్తుంది.ఒక అంశానికి సంబంధించి అనేక పదాలను నిర్మిస్తే అర్థ క్షేత్రం అంటాం.రెండు పదాలు ఉంటే సజాతీయాలు అంటాం.

శశి-వెన్నెల,సమీరం-చలి,సాగరం-కెరటం,రాగం-ఆహ్లాదం ఇలాంటి వన్ని అలాంటి పదాలే.ఇన్ని పంక్తుల్లోనూ మనిషి స్వభావాన్ని అంచనా వేస్తారు.రసానుభవానికి అనుకూలంగా ఏర్పడేవాటిని విభావాలు(objective correlative)అంటారు.ఇందులో ఆలంబన విభావం కారకం లాంటిది.సముద్రం,గ్రంథం,అనుభవం ఇలాంటివి ఆతాలూకే.మరోటి ఉద్దీపన విభావం ఆవేశవాతావరణాన్ని ప్రదర్శించేది.వాక్యాల్లో క్రియాగతంగా చెప్పిన వాక్యాలన్ని అలాంటివే.
ప్రకృతి గతంగా 3,భావన అనుభవాలకు సంబంధించి2,సాహిత్య సంబంధంగా3 అంశాలు కనిపిస్తాయి ఇందులో.
వ్యక్తిత్వాన్ని ప్రతీకాత్మకంగా చెప్పి సారూప్యతని ఆపాదిస్తారు.

"నేనొక అనుభవాన్ని పాఠం నేర్పడం నానైజం
అప్రమత్తత నేర్చుకోవాలా నిర్లక్షంగా వుండాలా
అర్థమెలా చేసుకుంటావో నీ విఙ్ఞత అది"

"నేనొక కవితని జాగృతం చేయడం నానైజం
కవితలో నిన్ను వెదుక్కుంటావో ఇతరులగురించి అనుకుంటావో
అర్థమెలా చేసుకుంటావో నీ విఙ్ఞత అది"

వాక్యనిర్మాణానికి సంబందించి ఆకాలనికి తగిన రచనకు దగ్గరగా ఉండే క్రమాన్ని అర్థం చేసుకోడం అవసరం.అలీగారి కవిత ఆపనిచేసింది.జయహో అలీగారు.


2.8.2013



                                                                                                                                            _____________________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

వంశీధర్ రెడ్డి కవిత-ఓ రోజెందుకో,

         
                 




చాలానాళ్లక్రితం"చితి చింత"లో"మో" నరాల సంగీతం అంటూ ఓ కవిత రాసారు.అది దుఃఖానికి సంబందించిన బాహ్య స్థితిని ప్రతీకలనుపయోగించి చెప్పిన కవిత.వంశీధర్ కవిత(ఓ రోజెందుకో)లోనూ వస్తు గతంగా ఆకవితకి సారూప్యతలున్నాయి.

1966 తరువాత తెలుగులోనేకాక,మొత్తం సాహిత్యంలోనే ఒక కొత్త ఉనికిని,అభివ్యక్తిని మోస్తూ వచ్చింది వినిర్మాణం.ఈ వాదంలోని కొన్ని అంశాలని విమర్శ అర్థం చేసుకొనే ప్రయత్నం చేసింది.

1.భాషకి,పదానికి నియతమైన ఉనికి ,మూలాలు ఉండవని నమ్మటం.
2.విమర్శకులు (నిర్మాణవాదులు)కవితా వివేచనలో చెప్పే కేంద్రం(center)అంచులు(feriferi)వంటివి లేవని విశ్వసించింది.
3.అనుభూతిని వ్యక్తం చేయడానికి అగాథం ఉంటుందని నమ్మింది.
4.సంపూర్ణత్వం అనేది భ్రమ అని అన్నీ అసంపూర్ణాలేనని నమ్మటం.
5.ఏ అంశంపై మరే అంశపు ఆధిపత్యం ఉందకూడదని ఆలోచించింది.
6.రచనలోని ఖాళీలగురించి,అనేకమైన అప్రధాన మైన విషయాలని కూడా పట్టించుకుంది.
6.ఇది స్వీయ మానసిక వాదంపై ఆధార పడుతుందని విమర్శకులు అభిప్రాయ పడ్దారు.
వంశీలో ఈ రకమైన మానసిక సంస్కారం కనిపిస్తుంది.
7.నిహిలిజం లాంటిపిడివాదాన్ని మోసిందని,ఉద్దేశ్యపూర్వకంగా అస్పష్టతను సృష్టించిదని నిందలుకూడాపడింది.

తెలుగులో కొందరు ఈ తరహాకవితలు రాసినా మో ఒకరే వినిర్మాణ కవిగా కనిపిస్తారు.వంశీధర్ ని ఒక కవిత తో నిర్ణయించేయలేం కాని గతంలోని కవితలని చూసాక ఇందుకు కొంత అవకాశమూ లేక పోలేదు.

మో కవిత్వంలో ప్రతీకలని ఎక్కువగా వాడుకునేవారు.వాటి ఉనికిని వాటికి ఆపాదించే స్వభావాలని సాధారణం కంటే భిన్నంగాఉపయోగించేవారు.శ్రీరామ్మూర్తి లాంటివాళ్లు సంస్కృతం,లాటిన్,లాంటి భాషలతో పాటు మెడిసిన్లోని పరిభాషని వాడారు.వాక్యాలక్రమాన్ని మార్చిరాయటంకూడ కొందరిలో కనిపిస్తుంది.

వంశీధర్ లో స్వీయమానసిక వాదం కనిపిస్తుంది.సహజంతో వైవిధ్యమైన ,వైరుధ్యమైన భాషని,వాక్యాన్ని ప్రేరేపించేదిదే.

వంశీవాక్యరచనకి అసంబంధస్వభావాలని,ఉపయోగాలని చేర్చడం ద్వారా అవగాహనకు సంబంధించి ఒక అగాధాన్ని సృష్టిస్తారు.సూత్రప్రాయంగా ఇందులో ఒక అర్థవాహిక పని చేస్తుంది.

"ఏడుపునీళ్లనిగాలిలో విత్తడం"
"వెంట్రుకనై కురవాలనిపించడం"
సీతాకోకని చుట్టడం" ఇవి అవగాహనకు దూరంగా కనిపించినా ఒక అర్థ వాహకం ఉంది-విషాదంలో వెంట్రుకలస్థితి,కోక అనేపదానికి సంబందించిన ఉనికి ఈ వాహకాన్ని సృష్టిస్తుంది.చాలవరకు ఇందులో కొన్ని స్థితి సమీకరణాలని ఉపయోగించారు.

మరో వాక్యంలో-దేవుడి మునిమనవలు పలకలు తీసి పాడు బొమ్మలు గీసేదాక-అంటూ రాస్తారు ఇందులోనూ మోకాళ్ల నడుమగడ్డం పెరగటం..మునిమనవలు,కాల సమీకరణాన్ని
చూపుతాయి.

ఎవరో దేవతట-అనే వాక్యంలోమేల్కోవడం అనే స్థితి ఉంది..స్వభావ గతంగా ఇదికొంత వేదాంతాన్ని ధ్వనిస్తుంది.కలలు మారటం పర్యవసానం.చివర్లో ఆక్రొశాన్ని ద్వనించే స్థితి ఒకటి ఉంది-దేవుడు చనిపోయాట్ట అనేవాక్యంలో..

స్వీయ మానసికవాదమొకటిఉందని తెలిసిందే..ఇది సహజానికి విరుద్దమైన భాషని,వాక్య రచనని ,నిర్మాణాన్ని,ప్రతీకల్ని ప్రేరేపిస్తుంది.ఇలాంటి కవితా మార్గాలని అర్థం చేసుకోడానికి కావల్సిన దర్శన గ్రంధాలుతెలుగులో ఎక్కువగా అందుబాటులోలేవు.బి.తిరుపతి రావుగారు రాసిన"పోస్టు మోడర్నిజం"-ఆయనే మో కవిత్వానికి రాసిన 1,2 పీఠికలు,సమీక్షలు."మిసిమి"పత్రిక వేసిన ప్రత్యేక సంచిక.మినహా కనిపించవు.కళతత్వశాస్త్రం -మౌలికాంశవివేచన అనేగ్రంధంలో డా.ముదిగొండ వీరభద్రయ్య కొంతచర్చించారు.

వంశీధర్ లో తనదైన మార్గం ఒకటి ఉంది.ఇది పైన చెప్పుకున్న భాషా,మనసిక సంస్కారాలకు దగ్గరిది.ఈ మార్గంలోవంశీసాధన గమనించదగింది.

4.8.2013





                                                                                                                _____________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

బి.వి.వి.ప్రసాద్ కవిత-పావురాలు

 





తెలుగులో వచనకవిత వచ్చాక ఆ పరిధిలోనే మరికొన్నిమార్గాలు కనిపిస్తాయి.అనుభూతి కవిత్వం ,అంతర్ముఖీనకవిత్వం ఈదశలో కనిపించేవే.బివివి ప్రసాద్ కవిత సుమారుగా ఆకోవకు చెందిందే.నిజానికి "హైకూ"పరిచయం ఒకటి కలిగాక తెలుగులో పైన చెప్పుకున్న రెండుమార్గాలు పరవళ్లు తొక్కాయి.ధ్యానం,సమాధి లాంటివి పూర్వమే కనిపించినా వాటిని గురించి ఈ 1,2 దశాబ్దాలు మాట్లాడటం అలా ప్రారంభమయిందే.

భౌతిక ప్రపంచాన్ని విడచి అహంకారాలులేని శాంతినపేక్షించే మానసిక ప్రపంచంలోనికి అక్కడినించి సౌందర్యమైన ప్రాకృతికప్రపంచంలోనీ దాన్నించి దృశ్యమూ,శబ్దమూ,రూపమూ లేని పూర్ణ ప్రపంచంలోనికి వెళ్లడం అంతర్ముఖీనత(introspection).అలావెళ్లేకవి అంతర్ముఖీనుడు(invertor).

యోగదర్శనం పేరుతో సౌందర్యారాధకులుచెప్పినది.సమాధి అభ్యాసాలను ప్రతిభా కారకాలుగా అలంకారికులు చెప్పినది ఈ లక్షణాలకు కాస్త దగ్గరగా కనిపిస్తుంది.

రుద్రటుడు(వచనాను స్మృతి)లో-
"మనసి సదా సమాధినీ"(సమాధి సిద్దమైందే ప్రతిభ)అని వ్యాఖ్యానించాడు.సమాధికి అలాంకారికులు చెప్పిన నిర్వచనాలూగమనించదగ్గవి."సమాధిరాంతరా"అనేది ఈ అంతర్ముఖీనత్వాన్నే చెబుతుంది.తౌత భట్టు కావ్య కౌతుకం లో శాస్త్రాధ్యయనం చేత ఙ్ఞానం లభిస్తుందని అక్కడినుండి దర్శనం కలుగుతుందని ఆదర్శనం వల్ల చేసే వర్ణన కవిగాచేస్తుందని అన్నాడు.

"సతత్త్వ దర్శనాదేవ శాస్త్రేషు పఠితఃకవిః
దర్శనాద్వర్ణనాచ్చాధ రూఢాలోకే కవి శృతిః"

బివివి ప్రసాద్ సృజనని ఇలాంటి దర్శనంతో దర్శించి చిత్రించారు.మనసులోకి ఊహలు రావడాన్ని,అందులోంచి సృజనరావడాన్ని స్పందనలుగా ,పావురాళ్లుగా చిత్రిస్తున్నారు.ప్రశాంతత అనే అంశమే "పావు రాళ్ల"నితెచ్చింది.శబ్దాన్నే కొరుకుంటే బహుశః చిలుకనో,మరోదాన్నో తీసుకునే వారేమో.అంతర్ముఖీనత అనిచెప్పడానికి ఈ ప్రశాంతతని అపేక్షించడమే ఆధారం.

ప్రసాద్ గారిలో విస్త్ర్తమైన నిర్మాణ ధార ఉంది.ఇది అనేక చోట్ల కనిపిస్తుంది.ప్రేరణ కలగడాన్ని చిత్రించే ఈ భావ చిత్రం అందుకు నిదర్శనం

"పిల్లలెవరో కాగితంపై రంగులు చల్లుతున్నట్టు
ఆటలో విరామం నిండిన ప్రశాంతతలోకి
ఏవో మృదువైన స్పందనలు వచ్చిచేరుతాయి"

భావచిత్రాలను1.అలంకారాలు2.పాశ్చాత్య కళాపద్దతులు3.మనోవైఙ్ఞానిక భూమిక ద్వారా మూడురకాలుగా చిత్రిస్తారు."చల్లుతున్నట్టు"అన్నక్రియా సంబంధం లోంచి ఉపమావాచకం ద్వారా ఇది అలంకారపద్దతిలో జరిగిందని చెప్పవచ్చు.చివరి వాక్యంలోంచిచూచినా "శాంతి వృత్తంలా/నీడరూపం వచ్చినట్టు"ఇలాంటివే.

మొదటి వాక్యంలోని"వాలటం"2 లోని"క్షణాలు
నోట కరవటం"ఇలాంటివన్ని స్థితులలోని క్రమాన్ని చూపుతాయి."ఈ పావురాలు ఎగిరేందుకు వచ్చినవికావు/వాలెందుకు వచ్చినవి"అనటం.చివరి వాక్యం కవిత ప్రయోజనాన్ని,అంతర్ముఖీనతని ప్రదర్శిస్తాయి.

"ఈ పావురాలు అందుకే వస్తాయి.
ఇవి నిశ్శబ్దం పొట్లాన్ని విప్పి శబ్దాన్ని వెదజల్లవు.
శబ్దం పొట్లాన్ని విప్పి నిశ్సబ్దాన్ని పంచి పెడతాయి"

ప్రతీక,దాన్ని నిర్వచించేతీరు,అందులో చిత్రించిన భావ చిత్రాలు..అందులోని దర్శనం బివివిని ప్రత్యేకంగాచూపుతాయి.తెలుగుకవితలోని ఒక ప్రధాన మార్గాన్ని ఆవిష్కరిస్తాయి.

5.8.2013
                                                                                                          _____________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

పెన్నా శివరామకృష్ణ-పోలిక ఒక మాధ్యమం






ఋగ్వేదంలో దశమ మండలంలో ఒక ఋచ ఉన్నది."చత్వారి వాక్ పరిమితా పదాని.తానిత్రీణి గుహితానేంగయంతి.తురీయం వాచో మనుష్యావదంతి"ఇందులో చత్వారి వాక్ అనేది గమనించదగ్గది.-వాక్కు యొక్క నాలుగు దశల్నిఈ ఋచ చూపింది."పశ్యంతి,మధ్యమ,వైఖారి నాలుగవది పరా".పశ్యంతి-చూచుచున్నది,మధ్యమ-అభివ్యక్తికి కావాల్సిన ఙ్ఞాన ,సౌందర్య,కళా,శాస్త్ర పరిఙ్ఞానాన్ని కూర్చుకునే దశ.మూడవది బయటికి చెప్పే అంశం.నాలుగవది వీటికి అతీతమైంది.

మిత్రులు పెన్నా శివరామ కృష్ణ కవిత "పోలిక ఒక మాధ్యమం"లో ఈఅంశాల్లోని మధ్యమ దశని స్పర్శించారు.సాధారణ,చర్వణ,ధారణ,మనన,సృజన అనేవి అలౌకిక వ్యాపారాలు.చూడటం,చూసినదాన్ని నెమరువేసుకోటం,దాన్ని ఙ్ఞానంలో పాదుకోటం,దాన్ని సమన్వయం చేసుకోటం,-సృజంచడం ఇవి.బుద్ది దేన్ని అనుసరిస్తుందనేది ఒక ప్రశ్న?శాకుంతలం "బుద్దిఃకర్మానుసారిని"అన్నది.బుద్దికి చేసే పనులే కారణం.

కవిత్వంలో గాని సాధారణ వ్యవహారంలో గాని పోలికలు కనిపిస్తాయి.ఈపోలికలే ఏరకమైన సంభాషణకైనా మాధ్యమం అంటున్నారు కవి.ప్రతిపదానికి యోగ,ఆయోగ,ఔపయోగిక,సమన్వయ ,ఆవృత్తమనే దశలు ఉంటాయి. ఈ కవితలో ఇలాంటివి కనిపిస్తాయి.

శివరామకృష్ణ గారి వచనంలో వేగం(swift)ఉంది.దేన్నయినా మరింత భారంగా చెప్పడానికి పోలిక ఒక మాధ్యమం.దీని ఉపయోగాన్ని.ఉనికిని,రూపాలని కవితలో వ్యక్తం చేస్తారు.

"పోలిక ఒక ఉపగ్రహం/ఆత్మ ప్రదక్షణం చేస్తూ/భూగోళం చుట్టూ తిరుగుతుంది"ఇది ఉనికిని చెప్పే వాక్యం.పోలికలకు ఎక్కడో వెతకాల్సిందిలేదు.ఈ భూమిపైనే ఉన్నది.

"సకాలానికి అస్తమించే సూర్యుడిని గుర్తుచేసుకోకపోతే/చీకటి బాహువుల్లో క్షణ క్షణం/వెలుగులజల పొంగేదెట్లా?"పోలిక యొక్క విస్తృత రూపాన్ని అనేకకోణాల్లో పరిచయంచేస్తారు.అనేకాంశాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి.

"పోలిక ఓ విశ్వజనీన మాధ్యమం/
పోలిక దృశ్యా దృశ్యాల మధ్య పూల వారధి/
పోలిక వేదిక కొక ఆహార్యం మార్చుకునే నర్తకి/
రుతువుకొక రాగం పలికించే విచిత్ర పల్లవి"

లెనిన్ ప్రతిఫలన సిద్దాంతాన్ని (reflection theory)ప్రతిపాదించాడు.ఒక అంశంపై అనేక అంశాల ప్రతిఫలనం ఉంటుంది.నిర్మాణంలో వస్తువు ఉనికిని,అది విస్తృతమైన రీతిని అందులోని వాక్యాలే చెబుతాయి.శైలిలో వేగంతోపాటు సరళంగా కనిపించే వాక్యాల మధ్యన పేర్చిన సమాస బంధాలు కూడా ఈవేగాన్ని పెంచాయి.

"అశ్రు దరహాస తటిల్లత"
"నిక్షిప్త దరహాస మధురిమ"
"అనంత నీరవ నీరధి"-అలాంటివే..

బుద్ది అనేదానికి ఙ్ఞానం ప్రధాన ఆకరం.ఈ ఙ్ఞానంలో ప్రతిఫలనాలు అనేకం .బుద్దిజీవులు సూక్ష్మం నుంచి అనంతం లోనికి ప్రయాణం చేస్తారు.ఈ కవిత అలాంటిదే.
మంచికవితని అందించినందుకు పెన్నాశివరామ కృష్ణ గారికి,మనకు పునః పరిచయం చేసినందుకు యాకూబ్ గారికి ధన్యవాదాలు.

6.8.2013


                                                                                                         _______________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

శివసాగర్ కవిత-నడుస్తున్న చరిత్ర


       
తెలుగు నేలమీద సోషలిస్టుపార్టీల ఆవిర్భావం తరువాత ఆ తాలూకు తాత్వికతలు,దృక్పథాలు అనేక అంశాలపై ప్రతిఫలించాయి.ఆ మార్గంలో ప్రత్యేక సాహిత్య మార్గాలు కూడావచ్చాయి.మార్క్సిస్ట్ సాహిత్య విమర్శనాపద్దతులు పాదుకొనడానికీ ఊతమిచ్చాయనటం కూడా అతిశయోక్తికాదేమో..బహుశఃఅభ్యుదయవాదం నుంచి అనంతర ప్రజా ఉద్యమ ధోరణులలో కూడా ఈ వాస్తవికత ప్రభావాన్ని కాదనలేం.

విమర్శలోనూ ఈమార్గంలో సవిమర్శక వాస్తవికత(Critical Realism)సామ్యవాద వాస్తవికత(Socialist Realism)అనే రెండు పదాలు కనిపిస్తాయి.మొదటిది-సమాజంలోని వ్యత్యాసాలను,వైరుధ్యాలను గుర్తించి,చిత్రించే ప్రయత్నం చేసింది.రెండవది సవిమర్శకవాస్తవికత కన్న ముందడుగు వేసి మార్క్సిస్ట్,లెనినిస్ట్ సిద్ధాంతాల ద్వారా-విప్లవం ద్వారానే ఉన్నతమైన సమాజం ఏర్పడుతుందని నమ్మింది.

ఇందుకోసం సోషలిస్టు వాస్తవికత ఓ తాత్విక ధారని సృష్టించింది.ఇందులో కొన్ని ప్రధాన అంశాలని గుర్తించవచ్చు.
1.విషయాలను పైపైన చూడటంగాక వాటికారణాలనూ అర్థంచేసుకోవడం మొదలుపెట్టింది.
2.ప్రతి అంశాలూ సహ సంబంధాన్ని కలిగి ఉంటాయని అభివృద్ధికి వర్గాలమధ్య సంఘర్షణ తప్పదని నమ్మింది.
3. పీడిత ప్రజల పక్షపాతంతో వారిలో చైతన్య సాధన ,నూతన సమ సమాజ స్థాపనకోసం ప్రయత్నించింది.

శివసాగర్ కవిత్వంలో రెండు తాత్విక ధారలు ప్రధానంగా కనిపిస్తాయి.అవి వైప్లవిక ,దళిత ఉద్యమాలు.ఈ రెంటికీ దగ్గరగా ఉన్నదే సోషలిస్టు వాస్తవికత.నిజానికి దళిత సాహిత్యానికి ఓ మేనిఫెస్టో లాంటి నిర్మాణ దార్శనికతనిచ్చిన కవిత శివసాగర్ ది.శంబూకుడు,ఏకలవ్యుడు మొదలైన పాత్రలని దళిత ప్రతీకలుగా అందించిన కవిత"నడుస్తున్న చరిత్ర". ఇప్పటికీ దళిత సాహిత్యాన్ని అంచనా కట్టడానికి శివసాగర్ కవిత సాహిత్య ప్రమాణం(Litarary Criterion).

"శంబూకుడు పెదాలమీద చిరునవ్వుతో/
రాముణ్ణి వధిస్తున్నాడు
ఏకలవ్యుడు ద్రోణుని బొటన వేలును
గొడ్దలితో నరుకుతున్నాడు"

"మనువు కళ్లలో సూదులు గుచ్చుకుని
నాలుక తెగ్గోసుకుని/చెవిలో సీసంపోసుకుని/
స్మశానంలో దొర్లుతున్నాడు"

వాద నిర్మాణంలోప్రాతిపదికగా మూడు సమీకరణలున్నాయి.ఇవి వాటి గమనాన్ని నిర్దేశిస్తాయి.1.స్వీయ అస్తిత్వోద్దీపన 2.తిరస్కారం 3.ధిక్కారం.ధిక్కార దశలోనే వాక్యాల్లో ప్రతీకార స్వరం వినిపిస్తుంది.ప్రతీకార,సంఘర్షణల్లోనే చరిత్ర పునర్నిర్మాణమౌతుంది.ఈ స్వరం ఈ కవితలోని అన్ని వాక్యాల్లో కనిపిస్తుంది.

శివసాగర్ తరువాతి కాలం శంబూకున్ని,ఏకలవ్యున్ని దళితప్రతీకలుగా అనేకసార్లు చిత్రించింది.బలిని తక్కువే.శివసాగర్ తరువాత కవిత్వం కర్ణుడిని కూడ ప్రతీకగా పరిచయం చేసింది కానీ ఈప్రతీకను కూడ తరువాతి కాలాల్లో కొనసాగించినట్లు కనిపించదు.ఈ మార్గంలోనే ఎండ్లూరి సుధాకర్"గోసంగిని"పరిచయంచేసారు.

జాషువా గబ్బిలం దళిత వాదానికి ఒక స్పృహని ఇచ్చివెళితే శివసాగర్ దానికి ఒక చైతన్యాన్ని దార్శనిక అస్తిత్వాన్ని చారిత్రక దృష్టిని ఇచ్చారు.

సాహిత్య చరిత్రకు ప్రధాన ఆకరమైన ఈకవితను పునఃపరిచయం చేసినందుకు కపిల రాంకుమార్ గారికి ధన్యవాదాలు.

7.8.2013







                                                                                                            _______________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ



 





తెలుగులో1980 కి ఈవలిదశనుంచి సాహిత్యంలో స్త్రీవాదం ఒకటి కనిపిస్తుంది.60 కాలాలల్లోనే అమెరికా,బ్రిటన్,ఫ్రాన్స్ వంటి దేశాలలో వీటి జాడలున్నాయని విశ్లేషకుల మాట.దీనిని ఆనుకొని ఒకవిమర్శాపద్దతికూడా ఉన్నప్పటికి దీని క్రమ వికాసాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముంది.

తొలి దశల్లో ఆర్థిక ,సామాజిక,సాంస్కృతిక అసమానతలపై దృష్టి పెట్టిన స్త్రీవాదం ఇప్పుడు మానవీయ విలువలతో జీవితాన్ని చిత్రిస్తూ కొత్త కోణాలని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తొంది.


సంస్కృతంలో శ్రీనివాస రథ్ అనే పండితుడు "తదేవ గగనం సైవ ధరా"అనే సంపుటిని ప్రచురించారు.అందులో ఓ చోట"శాస్త్రగతా పరిభాషాధీతా గీతామృతకణికాపి నిపీతా,కో జానీతే తథాపి భీతా కేన హేతునా విలపతి సీతా"(విఙ్ఞాన శాస్త్రాలలో వృద్దిని సాదించాం,భగవద్గీతను కొత్తగా అర్థం చేసుకో గలిగాంగాని ఇప్పటికీ సీత(స్త్రీ)ఎందుకు దుఃఖిస్తుందో ఎవరికి తెలుసు)అన్నాడు.

సాంకేతిక పురోగతిని అభివృద్దిగా చెప్పుకుంటున్న సందర్భంలో నైతికంగా ఎలా మానవీయ విలువలని కోల్పోయామో ఈ వాక్యాలు చెబుతాయి.

జ్యోతిర్మయి మళ్ల గారికవిత కూడాఇలాంటిదే..ఆధునిక దశలో సాహిత్యం మనోవైఙ్ఞానికాంశాలమీద దృష్టిపెట్టింది.ఈక్రమంలో జ్యోతిర్మయిగారు రెండు పాత్రల మనస్సులను,అందులో ఒకేపదంపై స్వభావగతంగా ఉండే భావనలనుదర్శించి కవిత్వీకరంచడం కనిపిస్తుంది.కవిత్వంలో పెద్దగా కళ.దర్శనం,వర్ణనలాంటివి లేక పోయినా ఈ కవిత సిద్దాంత ధర్మాన్ని మోసింది.

స్వభావగతంగా వ్యక్తులు,వర్గాల మధ్య వచ్చే అర్థ వైరుధ్యాలను"విపరిణామం"గాచెబుతారు.ఈస్పృహతో స్వభావాలని,దాన్నించి జెండర్ వర్గాన్ని నిర్వచించే ప్రయత్నం చేసారిందులో.

"కొంటె కళ్లతో ఆమె
చంపేయ్ నీచేతుల్లో చచ్చి పోవటం నాభాగ్యం
అతని గుండెలపై వాలి పోయింది"

"ఏమన్నా చేసుకో/నా అణువణువూ నీదేగా/
కళ్లు మూసుకుంది/-/ఆ కళ్లు అప్పుడే మూసుకు పోయాయి శాశ్వతంగా/"-చంపటం అనేపదం చుట్టూ రెండు దృశ్యాలను చిత్రించి ఈకవితను సాధించారు.

జెండర్ వైరుధ్యాలను ప్రాతిపదిక స్థాయినుండి కొన సాగించినట్టుగాకాక ఓకొత్తచూపు,ఆవిష్కరణ కనిపిస్తాయి.ఇందులోని స్త్రీ గొంతుక వాదతాత్వికతని కూర్చుకున్నా మానవీయ అన్వేషణ కనిపిస్తుంది.

నిర్మాణం,వాక్య రచన,అభివ్యక్తి విషయంలో ఈకవిత సౌష్టవంగాఉంది.మంచికవిత అందించినందుకు జ్యోతిర్మయి గారికి అభినందనలు.మరింత మంచి రచనలతో ముందుకువెళ్లాలని ఆశిద్దాం.

8.8.2013


                                                                                                         _______________ఎం.నారాయణ శర్మ