పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Kapila Ramkumar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kapila Ramkumar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2014, సోమవారం

Kapila Ramkumar కవిత

సాక్ష్యం Posted on: Mon 23 Jun 01:07:54.530786 2014 కురిసిన నెత్తురు కురిసినట్టే వుంది మేఘాల సాక్ష్యం ఏదని ఆకాశం కేసు కొట్టేసింది తెగిపడ్డ తలకాయలు కళ్ళముందు ఎగురుతూనే వున్నాయి మొండేల జాడ ఏదని గాలి కేసు కొట్టేసింది. వెన్నుపూసను వణికిస్తున్న జ్ఞాపకాల చెట్టుకు నరకబడ్డ కాళ్ళూ చేతులూ వేళ్ళాడుతూనే వున్నాయి కత్తుల మీద నెత్తుటి చుక్కలు లేవని కాలం కేసు కొట్టేసింది మృతదేహాల మూటలు తుంగభద్ర తరంగాల్లో కలిసి తలలెత్తి ఎగిసిపడుతూనే వున్నాయి నీరు నోరు మెదపలేని గట్టు కేసు కొట్టేసింది హతులున్నారు హంతకులే లేరు హంతకులున్నారు సాక్షులే లేరు సాక్షులున్నారు వినే చెవులు లేవు చూసే కళ్ళు లేవు ఇదేంటని ప్రశ్నించే నోళ్ళున్నా సాక్ష్యంగా జవాబులే వుండవని ఫౖౖెనల్‌గా మనువు కేసు మూసేశాడు సాక్ష్యం చెప్పవే చుండూరా చుండూరా చుండూరా దేశం దేహం మీద సలపరం పెడుతున్న మనుధర్మ రాచపుండూరా (చుండూరు మారణకాండలో బాధితులకు న్యాయం కోసం పోరాడుతున్న శక్తులకు మద్దతుగా) - ప్రసాదమూర్తి కవిసెల్‌: 8498004488 http://ift.tt/1inqyYv

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1inqyYv

Posted by Katta

Kapila Ramkumar కవిత

తెలంగాణ ప్రజా వ్యవహారం Posted on: Mon 23 Jun 01:12:02.070757 2014 - భాషలో విభక్తులు సాధారణంగా ప్రజావ్యవహారామే, సంప్రదాయ భాషకు భిన్నమైంది. ఒకటి రెండు వాక్యాల సామెతల్లో జీవితాన్ని చెప్పినట్టు భాషయొక్క ఔపయోగిక క్షేత్రం సూక్ష్మమైందైనా స్పష్టమైంది. తెలంగాణాలోని పది జిల్లాల్లో భాష వైవిధ్యమైందనే భావనలున్నాయి. భాషలోని అతి సూక్ష్మ ప్రయోగాలలో ఉండే పద్ధతులు వదిలేస్తే ఈ ప్రాంతం అంతటికి ప్రధానమైన మూలతత్వం ఉంది. ప్రతి భాషకి స్వాభావికంగా ఒక లక్షణం ఉంటుంది. భాషలోని అనేక అంశాలలోనూ ఒక అంతస్సూత్రత ఉంటుంది. ఇది వేర్వేరు విభాగాల సాంప్రదాయికతని, స్థాయిని చెబుతుంది. దీన్ని భాషాలక్షణం అన్నా, వ్యాకరణం అన్నా ఒకటిగానే కనిపిస్తుంది. భాషను వ్యాకరణం నిర్దిష్టం చేస్తుంది. కాని ప్రయోగాన్ని నిర్దేశించదు. ఎందుకంటే భాషలో అనేక మార్గాల్లో ప్రయోగాలుంటాయి. అందువలన వ్యాకరణ భాషలోని లక్ష్యాన్ని చర్చించాలి గాలి లక్షణం గాదు. బహుశ దశాబ్దాల క్రితమే, శతాబ్దాల క్రితమే భాషమీద వ్యాకరణం అజమాయిషి మొదలు పెట్టిందనటం. అతిశయోక్తి గాదు. ఒక భాషలోని మూల లక్షణం వేరయినప్పుడు దానిలోని వ్యవహారం వేరవుతుంది. ఆయా ప్రత్యేక లక్షణాల మేరకే ప్రయోగాలు, ఉపయోగాలుంటాయి. నన్నయకు ముందు తెలుగు వ్యాకరణాలు లేవనే మాట వినిపిస్తుంది కాని భాషా వ్యాకరణాలు లేక కాదు. శబ్దానుశాసనం లాంటివి కనిపిస్తాయి. ఇలా కొన్ని 'దేశీ' తెలుగును కొంతవరకు విశ్లేషించాయి. నన్నయ కాలానికి తత్సమీకరణ అధికమై, ప్రబంధయుగం దాకా పరిపుష్టమై వ్యాప్తమైంది. ఒక రకంగా తత్సమ ప్రభావం ప్రజావాఙ్మయాన్ని, భాషను సాహిత్యభాషగా తిరస్కరించి అణచి వేసిందనటం పొరపాటు గాదు. తెలంగాణ విలక్షణ భాషా వ్యవహారం గల ప్రాంతం. సూక్ష్మ వైరుధ్యాలున్నా తెలంగాణ వ్యవహారా నికి ఒక మూల లక్షణం ఉంది. తెలుగులో విభక్తులు సంబోధనతో కలిపి ఎనిమిది ఉన్నాయనేది వ్యాకర్తల అభిప్రాయం. తెలంగాణా ప్రాంతంలో స్థూలంగా ఏడు విభక్తులు వ్యవహారంలో ఉండవు. ఉన్నవి కూడా 'బాల వ్యాకరణం'లాంటి ప్రమాణ గ్రంథాల సూత్రతని తిరస్కరిస్తాయి. ప్రాథమికంగా ఈ వ్యవహారంలో నాలుగు విభక్తులు మాత్రమే కనిపిస్తాయి. అవి కూడా ఇతర ప్రాంతాలతో వ్యత్యాసం కలిగి వున్నాయి. సాధారణంగా ప్రథమ విభక్తిలో ప్రాతిపదికాలు సంబోధనలు ఉక్తాలినే మూడు పదాలుంటాయి. ''ప్రాతిపదిక సంబోధనాక్తార్ధంబులు ప్రథమంబగు'' అని చిన్నయసూరి డు,ము,వు,లు, ప్రథమా విభక్తి. సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన పదాలకు 'డు' ప్రథమా విభక్తిలో కనిపిస్తుంది. తెలంగాణలో తొంభైశాతం ప్రజా భాషలో 'అన్న', 'అమ్మ', 'అయ్య', 'అక్క' లాంటి పదాలు ప్రాతిపదికల్లో కనిపిస్తాయి. నిజానికి ఇది ఇద్దరం వ్యక్తుల మధ్య ఉండే సంబంధాన్ని చూపేవి. ఇవి సంబోధనలే అయినా ప్రాతిపదికల్లో కనిపిస్తాయి. ఉదా: రాజయ్య - మల్లయ్య, రాజన్న - మల్లన్న స్త్రీ పదాల్లో 'అమ్మ/అక్క'లు వినిపిస్తాయి. ఉదా: రాజక్క - మల్లక్క, రాజమ్మ - మల్లమ్మ తెలంగాణ ప్రాంతంలోని నామ్నీకరణాలు దైవికాంశ ని, జానపదాంశని కలిగి వుంటాయి (ఆధునికంగా వీటిలో మార్పులున్నాయి) కొన్నిసార్లు సంబోధనలతో ఉన్న పదాల్లా ఉచ్చారణలో వర్ణాలు లోపిస్తాయి. ఉదా: విజయమ్మ - విజ్జమ్మ ఆనంద్‌ - నందు 'డు'కు బదులుగా బహువచన ప్రత్యయమైన 'లు' ప్రాతిపదికాల్లో ఏకవచనంలోనే కనిపిస్తుంది. ఉదా: రాములు - వెంకటేశ్వర్లు 'డు' సందర్భాల్లో ఉక్తాల్లో కనిపిస్తాయి. ఉదా: బండోడు - నల్లమొకపోడు నిజానికి వాడు / అది అనే సర్వనామాలు ఇందులో నూ గౌరవ వాచకంగా 'ఆయన / ఆయినె' కనిపిస్తుంది గాని స్త్రీ వాచకంగా 'అది'కే వ్యాప్తి ఎక్కువ. ఉదా: ఇంటిది - ఇంటాయినె నపుంసకలింగాలు చెబుతున్నప్పుడు 'ము' తక్కువే. బదులుగా 'ం' సున్నాని ఉపయోగించడమే ఎక్కువ. ఉదా: కంబము - కంబం అన్నము - అన్నం అద్దము - అద్దం 'పు' ప్రత్యయం కలిగిన పదాలు తెలిసినా వ్యాప్తిలో ప్రత్యామ్నాయాలు ఎక్కువ. ఉదా: తరువు - చెట్టు కొన్ని పదాల్లో రూపాంతర వ్యాప్తి ఎక్కువ 'ఆయు:' అనే పదం 'వు' ప్రత్యయం చేరి 'ఆయువు' అవుతుంది. కాని - ఆయుష్షు - ఆయుస్సు - అవుసుగానే వ్యాప్తి ఎక్కువ. ఇలాంటివి ప్రజా భాషలో ముఖ వ్యాయమం వల్ల సంభవిస్తాయి. ప్రథమా విభక్తిలో సంబోధనల్లోనూ వైరుధ్యాలు న్నాయి. నామవాచకాల్లో అక్క, అమ్మలాంటి పద ప్రత్యయాలున్నా కొన్నిసార్లు అవి కనిపిస్తాయి. కొన్ని సార్లు కనిపించవు. ముఖ్యంగా స్త్రీలింగాల్లోనే ఇలా జరగటం గమనార్హం. రామక్క - ఓ రామీ మల్లక్క - ఓ మల్లీ ఆకారాంతాలైన పదాలూ సంబోధనల్లో 'ఇ' కారాం తాలు, 'ఉ' కారాంతాలవటం. గౌరమ్మ - గౌరూ లక్ష్మి - లచుమా మల్లమ్మ - మల్లీ కొన్ని సార్లు 'ఓ' చివర చేరుతుంది లచుమ - లచుమో మల్లిగా - మల్లిగో మల్లయ్య - మల్లన్నో శ్రోత, వ్యవహర్త మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పు డు పై రూపాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఉక్తార్థాల్లో ధ్వని వ్యత్యయాలున్నాయి. నిద్దుర - నిద్ర - నిర్ద 'లు' బహువచన ప్రత్యయంగా వాడుకలో ఉంది చెట్టు - చెట్లు పుట్ట - పుట్టలు - పుట్లు 'లు' ప్రత్యయం చివరి 'హల్లు'తో చేరి, చేరకుండా (సంయుక్తమయ్యి, కాకుండా) రెండు రకాలుగా వ్యాప్తి లో ఉన్నాయి. పండు - పండ్లు... 'పళ్లు' అనే మూర్దన్యం ఏ అర్థం లోనూ వాడుకలో లేదు. ద్వితీయా విభక్తిలో ని,ను,ల గూర్చి, గురించి... అనే ప్రత్యయాలున్నాయి. 'కర్త ప్రథమలో ఉన్నప్పుడు కర్మ ద్వితీయలో ఉంటుందన్నారు చిన్నయ సూరి. ఈ ప్రాంత వాడుకలోనూ కర్మ ద్వితీయకీ వస్తుంది. వాడి + ని = వాన్ని - ఆన్ని ని, ను లు 'అలుక్‌' (ప్రత్యయం కనిపించని) రూపాల్లోనే ఎక్కువ. (అ) వాడు చెట్టు కొడుతుండు. (ఆ) వీడు చెట్లు నరికిండు. (ఇ) ఆమె పాలు తెస్తుంది. ఇందులో కర్మయైన చెట్టు, పాల పక్కన విభక్తులు ప్రత్యక్షంగా లేవు. 'గూర్చి' గురించి'లలో 'గురించి' ఎక్కువ వాడుక. (అ) వాని గురించి తెలువది (ఆ) దాని గురించి అడుగకు కొన్నిసార్లు 'గురించి' ప్రత్యామ్నాయంగా 'విషయం' 'మాట' అనే ప్రాతిపదికలు వినిపిస్తాయి. (అ) వాని మాట తెలువది (ఆ) దాని విషయం అడుగకు. 'ల' అనేది ప్రాతిపదికలో సంయుక్తంగా ఉంది (అ) చెట్టు + ల + ను ట చెట్లను కొట్టిండు (ఆ) బుట్ట + ల + ను ట బుట్టల్ని అల్లింది తృతీయా విభక్తిలో చేత, చే, తోడ, తో అనే వాటిలో చివరి రెండూ ఉన్నాయి. కాని ప్రయోగాల్లో వైరుధ్యాలు న్నాయి. చిన్నయసూరి ''కర్మ ప్రథమంబగుచో కర్త తృతీయనగు'' అన్నాడు. ప్రధానంగా ఇక్కడి వ్యవహారంలో కర్మవాక్యాలు లేవు. (బహుశ: ఏ ప్రాంత వ్యవహారంలో కర్మ వాక్యాలు లేవనే అనాలి). ''రావణుడు రామునిచే చంపబడెను'' వంటి వాక్యాల్లో కనిపించే ''బడు'' ప్రత్యయం వ్యవహార శూన్యమే. కాబట్టి తృతీయలో చేత, చే, లు లేవు. తోడ, తో అనేవి బహుళంగా వ్యవహారంలో ఉన్నాయి. ఒక కర్తకో ఒక కర్మకో కాకుండా రెంటికీ, పరస్పరంగా కూడా వ్యవహా రం ఉంది. (అ) వాడితో కష్టమొచ్చింది. (ఆ) వానితోని ఎప్పుడు లాల్లే. వలన- అనే భావంలోనే ఇక్కడ 'తో' ఉపయోగపడు తుంది. ఏం చమిలో చెప్పే విభక్తికి ఇది ప్రత్యామ్నాయం. (అ) వానితో ఇబ్బందే కర్తృ స్థానంలో నాకు, నీకు, రామునికి వంటివి చేర్చవచ్చు. మరికొన్ని ఉదాహరణలు గమనిస్తే 'తో' ఎంత విస్తృతమైందో అర్థమౌతుంది. (అ) నాతోటి వాడు కూడా వచ్చిండు. (ఆ) నాకు వాని తోటే పని. (ఇ) మేము ఒకతోని బగలం మాట్లాడుత లేము. (ఈ) పాలతోటి కోవా చేసిండు. (ఉ) వాని తోటే పోయిండు. (ఊ) వాని తోటే దోస్తి. ప్రథమపురుషలో సంబంధాన్ని, పరిణామాన్ని చెబు తున్నప్పుడు 'తోడ' అనేది 'తోటి' అనే స్వర రూపం మారి కనిపిస్తుంది. కాని గుర్తించాల్సింది ఇది కర్తకు, కర్మ రూపంలో రావడం లేదని 'టి' అనేది జాప విభక్తుల్లో ఒకటని. సాధారణ వ్యవహారంలో లాగానే చతుర్ధీ విభక్తికి సంబంధించి 'కొఱకు' 'కై'లు వాడుకలో లేవు. సంప్రదానంబునకు చతుర్ధియగు' అని చిన్నయ సూరి అన్నా. ఈ ప్రాంతంలో సంప్రదానంలో (షష్టీ విభక్తి) 'కి' ఎక్కువ వాడబడుతుంది. (అ) రాముని కొరకు సీతనిచ్చెను (ఆ) రామునికి సీతనిచ్చిండు. చాలా వరకు 'కోసం' అనేది 'కొరకు'కు ప్రత్యామ్నా యంగా వాడబడుతుంది. కొన్ని సందర్భాలో ఆచ్చా దనా మాత్రంగా సంప్రదానం ఉంది. (అ) అతని కోసం పాలు తెచ్చిన (ఆ) ఎవరి కోసం కొట్లాడిండు (ఇ) నీ కోసం ఎంతసేపు చూస్తా (ఈ) నీ కోసం ఎవరో వచ్చిండ్రు పై వాక్యాల్లో మొదటి వాన్లోనే సంప్రదానం ఆచ్చా దనా మాత్రంగా ఉందిగాని మిగతా వాటిలో లేదు. కాబట్టి 'కోసం' అనేది చతుర్థికి సంబంధించిందిగా, దాని రూపాంతరంగా ఊహించలేం. పంచమీ విభక్తి కూడా తెలంగాణ వ్యవహారంలో లేదు. 'వలన', 'కంటె' 'పట్టి'లో వలనకు బదులుగా తృతీయా విభక్తి ప్రత్యయమైన 'తో'నే వాడుతారు. (అ) వాని వలన కొంప మునిగింది (ఆ) వాని తోటి కొంప మునిగింది (అ) ఉద్యోగం వలన కష్టాలు (ఆ) ఉద్యోగం తోటి కష్టాలు సంస్కృతంలో (తెలుగులోనూ) చెప్పుకునే ఉదాహర ణల్లో 'అశ్వపతిత:'లో 'వలన' కనిపించదు 'నుండి' 'మించి' అనేది కనిపిస్తుంది. (అ) గుర్రం మీంచి పడ్డవాడు (ఆ) గుర్రం నుండి పడ్డవాడు 'మీంచి' అనేది మీద నుండి (చి) అనే దానికి వ్యవహారంలో స్వర రూపాంతరాపత్తి వల్ల ఏర్పడ్డ రూపం. 'కంటే' అనే దానికి కొన్నిసార్లు 'కన్నా' అనేది బదులుగా వాడతారు. అయితే ఈ రెండూ ఒకే అర్థంలో ఉన్నాయి. రెండు వస్తువులను వ్యక్తులను పోల్చినప్పుడు ఈ పద్ధతి కనిపిస్తుంది. (అ) వాని కంటే వీడే నయం (ఆ) వాని కన్నా వీడే నయం (ఇ) ఈమె కన్నా ఆమే మంచిది (ఈ) దీని కన్నా అదే నయం (ఉ) ఇక్కడి కన్నా అక్కడే నయం (ఊ) దీనికన్నా అదే చక్కనిది 'పట్టి' అనేది కూడా కొంత వ్యవహారంలో ఉంది (అ) వీడు చెయవట్టి లొల్లయింది (ఆ) అది జెయవట్టే వచ్చుడైంది సంబంధాన్ని సూచించేది షష్ఠీ విభక్తి. కి, కు, యొక్క లో, లోపల - సుమారుగా ఇవన్నీ కూడా వాడుకలో ఉన్నాయి. 'కి' ఏకవచనంలోనే సంబంధాన్ని సూచి స్తుంది. (అ) ఈ లొల్లిల వానికి సంబంధం లేదు (ఆ) వానికి పెళ్లయింది (ఇ) ఆ పిలగానికి మా బిడ్డనిచ్చినం పై వాక్యాల్లో చివరిది 'కొరకు' బదులుగా వాడబడు తుంది. పైన చతుర్దిలోనూ దీని వివరణలున్నాయి. (అ) పుస్తకాలు వానికి తెచ్చిండు. వీనికిక కాదు. (ఆ) వానికి సైకిలు కొనిచ్చిండు. 'కి' సంప్రదానంలో ఎంత స్పష్టంగా కనిపిస్తుందో పై వాక్యాల్లో అర్థమవుతుంది. 'కం' బహువచనంలో వాడటం గమనార్హం. (అ) వాళ్లకు ఆకలలు (ఆ) ఏంది వాళ్లకు చెప్పేది (ఇ) ఆవులకు మేత వేసిండు (ఈ) గొడ్లకు వానికే సోపతి (ఉ) ఆ సదువులకు రోజులు గావు (ఊ) మాటలకు లొంగడు పద బంధాల్లో 'యొక్క' అంతర్గతంగా విభక్తిలోపం లో ఉంది వాక్యంలో బంధంలో ప్రత్యక్షంగా లేదు. అందువల్ల 'యొక్క' లేదనే వినిపిస్తుంధి. (అ) నా యిల్లు, (ఆ) వాని పొలం. 'లొ' 'లోపల' అనేవి రెండూ వాడుకలో ఉన్నా వీటి విషయంలో కొన్ని అంశాలు గమనించాల్సింది. (అ) 'లొ'కన్నా 'లోపల'నే ఎక్కువ వాడకం (ఆ) 'లోపల'కు ఔప విభక్తి 'టి' చేరుతుంది (ఇ) 'టి' చేరినప్పుడు 'లోపటి', 'లోపట' అనే వైరుధ్య రూపాలున్నాయి. 'అందు' 'న' అనే సప్తమికి కూడా 'ల' నే ప్రధాన ఉపయోగం కాని కొన్ని చోట్ల 'అందు' ప్రయోగం 'అండ్ల' 'ఇండ్ల' 'ఎండ్లె' వంటి రూపాల్లో ఉంది. (అ) వానికి మనసుల మనసు లేదు (ఆ) కోపంల ఉన్నప్పుడు మాట్లాడద్దు (ఇ) ఇంట్ల వాళ్లే నలుగురుంటరు (ఈ) పొలంల పనున్నది కొన్నిసార్లు 'ఎ' కారం చేరుతుంది 'ల'తో కలిసిన 'ఎ'కారాన్ని షష్టీ విభక్తిలో (జ) చూడవచ్చు. మరో రెండు ఉదాహరణలు గమనించండి. (అ) గుల్లె దేవుడున్నడు, (ఆ) బల్లె సారున్నడు. అందు అనేది కొన్ని చోట్ల ఉద్వేగాన్ని చెబుతున్న ప్పుడు కనిపిస్తుంది. (అ) మీకు తెలువదా? నా అందున తప్పులేదు (ఆ) నువ్వు పన్జేసేది ఇండ్లనేనా? (ఇ) అండ్ల పని చేస్తవా? ఎందున, అందున, తీందున లకుబదులుగా వాడబడిన రూపాలను గమనిస్తే ఈ భేదాలు సుస్పష్టంగా కనిపిస్తాయి. సాధారణంగా ప్రజావ్య వహారామే, సంప్రదాయ భాషకు భిన్నమైంది. ఒకటి రెండు వాక్యాల సామెతల్లో జీవితాన్ని చెప్పినట్టు భాషయొక్క ఔపయోగిక క్షేత్రం సూక్ష్మమైందైనా స్పష్టమైంది. తెలంగాణాలోని పది జిల్లాల్లో భాష వైవిధ్యమైందనే భావనలున్నాయి. భాషలోని అతి సూక్ష్మ ప్రయోగాలలో ఉండే పద్ధతులు వదిలేస్తే ఈ ప్రాంతం అంతటికి ప్రధానమైన మూలతత్వం ఉంది. ఇతర ప్రాంతాల ప్రభావాలు ఉచ్ఛారణ మొదలైన అంశాల్లో మార్పులు తెస్తాయి కాని మూలతత్వానికి కాదు. తెలంగాణ భాషా అస్తిత్వాన్ని గురించి మరింత చర్చ జరగాలి. - మ.నా.శర్మ సెల్‌: 9177260385 http://ift.tt/1inqwQl

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1inqwQl

Posted by Katta

20, జూన్ 2014, శుక్రవారం

Kapila Ramkumar కవిత

. నాళేశ్వరం శంకరం|| గాయం కాని రోజు లేదు|| . గాయం కాని రోజు లేదు అంతిమ గాయాక్షరం రాసి మరీ గాయం చేయనూ లేను. గాయమే నా హృదయమైనప్పుడు పెదాలమీంచి జారే ప్రతి స్వరం గాయస్వరమై కూర్చుంటుంది. . వ్యర్థంగా ప్రాణం కదలాడటం అలవాటైపోయింది జీవనసాఫల్యంతో నన్ను మోసే చెప్పులూ వేసుకున్న చొక్కా తొడుక్కున్న ప్యాంటూ తినే తిండీ తాగే నీరూ పీల్చేగాలీ నాకోసం సహకరించే ఈ సమస్తం సజీవంగానే బతుకుతున్నాయి సాఫల్యంలేని నా యీ కాయానికి సహకరిస్తూనే ఉన్నాయి నేనుమాత్రం నిరుపయోగంగా పెరుగుతున్న నేల బరువుని. నేనో ఉద్యమ నెలబాలుడ్నైనా కాకపోతి దాని ధ్యాన ధారగా ప్రవహించకపోతి ఏమీకానినేను ఎంతకాలమిక్కడ పరుండేది ఈ నిర్వీర్యపు నిస్సత్తువతో నా యీ అవయవాల్ని నాకునేను కష్టాలపాలు చేయడం సహిం చలేను. . ఆనవాళ్ళు గుర్తుపట్టలేనంతగానైనా నాకో ఏక్సిడెంటయి తునాతునకలైపోతే బాగుండు నాకు నేను ఏమీకానివిధంగా ఎగిరిపోతే బాగుండు మేల్కోలేని నిదురలోకి ఒదిగిపోయి నా శరీరానికి ప్రణమిల్లితే బాగుండు ఆత్మతృప్తితో నా తనువు మట్టితో మమేకమైపోతే బాగుండు . ఆత్మాహుతిని ప్రేరేపించే ఈ వ్యవస్థ హననం కాకపోవడమే నేరం! ఏం చెయ్యనూ? నన్నేమీ కానీకుండా ఇలానే మ్యూజియంలోని బొమ్మలా ఈ వ్యవస్థకు వేళ్ళాడే రేపటి భవిష్యత్ పటానికి మల్లే రోజూ నాకు నేనే అగుపడి నన్నునేను చూసుకోవడమెందుకు? గాయాలతో తడిసిముద్దయిపోతున్న దగాపడినవారిలో ఐక్యంకాని యీ దేహమెందుకు? నన్ను నేను హింసించుకుంటూ ఈ బ్రతకమెందుకు? బాబ్బాబు! నన్ను బుజ్జగించే వ్యవస్థ ఒడిలే వదిలేకన్నా గాయమైన ఈ పిడికెడు ప్రాణాన్నీ కాలం కొయ్యమీదైనా వేళ్ళాడదీయవా! నీకూ కాలానికీ ఋణపడిఉంటాను నేను రాసే బానిసగాయాక్షరాల చరిత్రలో గాయంగానైనా మిగిలిపోతాను. గాయాల వాగ్గేయకారులకు గానంగానైనా మిగిలిపోతాను. . నాళేశ్వరం శంకరం. “దూదిమేడ” కవితా సంకలనం నుండి. :http://ift.tt/UlNoVr

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UlNoVr

Posted by Katta

18, జూన్ 2014, బుధవారం

Kapila Ramkumar కవిత

కీ||శే|| రావెళ్ళ వెంకటరామారావు || సుస్వాగతం || @@ నాలుగు శతాబ్దాలనుండి నవాబులు సైతానులు తెలంగాణ జనరక్తం - జలగలవలె పీల్చినారు పరదాస్యపు పంకిలాన వడి కుళ్ళిన నాలో గల శక్తులన్ని నశియింపగ - జడమతినై మిగిలినాను భారత స్వాతంత్ర్య సమర భానూదయ సుప్రభాత శంఖధ్వానం నాలో - చైతన్యం పూరించెను స్తంభించిన నా నాడుల జవసత్వం పొంగిపొరలి విశాలంధ్ర విజయోత్సవ - విమలగీతులాలపించె నిన్ను నన్ను వేరుచేసి నిలుచుండిన నిరంకుశులు ప్రజావిప్లవాగ్నిముందు - పరాజయం పొందినారు ఈ నాటికి మన కోరిక లీడేరెను రండు రండు ధరాధిపుల సమాధిపై జరామరణరహితమైన జనరాజ్యం స్థాపించే కృషిలో మీ చేయూతను అందించగవలెను లెండు అన్నా సుస్వాగ్తమిదె అందుకొండు అందుకొండు! ________________________________________________________________________ @@(తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట విజయ గీతం - జీవన రాగం సంకలనం 1960 శార్వరి- ఛైత్రమాసం '' నుండి సేకరించినది) _________________________________________________________________________ 18.6.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iFISqk

Posted by Katta

Kapila Ramkumar కవిత

** డా||కె.హరీష్‌ ||గుండె గూటి సొద || పాటంటే గుండెగూటిని సునితంగా తాకే నిశ్శబ్ద తరంగం కలల అలలన విరిసిన స్వర నిర్ఝరి మానస వీణన ఆర్ణవమైన అక్షరం పిరి విప్పి విరిసిన కాంతి పుంజం అనంతానంతరం నుంచి నేలన పడ్డ తొలకరి చినుకు మనిషి అంతరంగాన వెలసి మెరిసిన ఇంద్ర ధనుస్సు ఒక దరహాస వీచిక ఆరని ఆశ నింగిని చూపించే వెన్నుల సిరి సిరి వెన్నెల అందీఅందని జలపాతపు చిందు లయ కలమెలిగిన శృతి రేపటి లోకావలోకానికి రాచ బాట కల్లోల కడలిని మరిపించే ఘర్షణ నిండు హాలాహలాన లిప్తమాత్రపుటమృత ఝరి కారు చీకటిన వినిపించే వేదనాదం మనిషి గుండెన గలగలలాడె అగ్ని శిఖ ఆనందహేల మనిషికి ప్రకృతి ప్రసాదితమైన సుంద పరినిర్వాణం ఈ గుండె గూటి సొద ! ________________ కీ.శే.హరీష్‌ స్మృతి సంచిక నుండి వారి కవిత. ________________2007 సెప్టెంబర్ ** (18.6.2014)

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oDzonB

Posted by Katta

17, జూన్ 2014, మంగళవారం

Kapila Ramkumar కవిత

సాహిత్య ప్రయోజనం || కీ.శే.డా||కె.హరీష్ (సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షుడు)|| సామాజిక ఉత్పత్తిలో ఓకరినొకరు ఎరుకపరచుకోటానికి వాడేది భాష, మాట, పాటా మానవశ్రమ నుండి సమిష్టి తత్వం నుండి పుట్టాయనేది నిర్వివాదాంశం. సామాజిక పరిణామ క్రమంలో ఉత్పత్తి రూపాలూ, విధానాలు మారాయి. శ్రమ విభజన వర్గ విభజనగా మారింది. అది క్రమేణా సమిష్టీ తత్వం నుండి వ్యక్తి తత్వమయింది/ వ్యక్తులకు సొంత ఆస్తితోపాటు కవిత్వం కొద్దిమంది కవుల, ఛందస్సు గొలుసుల్లో చిక్కువడింది. క్రమేణా కవిత్వం ఆధిపత్య వర్గాల ఆనందం కోసం, ప్రజల్ని అంధవిశ్వాసాల్లో ముంచటం కోసం ఉపయోగపడింది. కవిత్వానికి, కళలకూ కూడ వర్గ స్వభావం వుంటుంది. అవి కూడ అంతస్థులూ, అంతరాలు, కులాలు పాటిస్తాయి. భాషయొక్క ఉపరితలమే ' కవిత్వం '. వర్గాధిపత్యాలతో పాటు కవితారూపాలలో కూడ మార్పు వచ్చాయి. మారుతున్న ఈ కళారుపాన్నే మనం పద్యం అన్నాం. గేయం అన్నాం. వచన కవిత అన్నాం. అభ్యుదయ సమాజానికి రూపాలను సమాంతరంగా కళలు, వాటి రుపాలు ( కాంటెంట్లు) మారుతూనే వుంటాయి. కళా రుఫాలు సామాజిక వృక్షంపై విరబూసి వికసించే పూలు. ఈ గుర్తింపు కలిగిన తరువాత కొన్నీ కళలు ప్రజల పక్షాన నిలబడతాయి. కొన్ని పాలకవర్గాలను అంటకాగి వాటి కొమ్ము కాస్తుంటాయి. ఈ చారిత్రక నేపథ్యం సాహితీ ప్రియులందరికి తెలుసు. కళకైనా, సాహిత్యానికైనా, మమతం సమత, శాంతి మానవాభ్యున్నతిని మించిన మరొక లక్ష్యం మరొకటి వుండదు, వుండకూడదు. అలాంటి ఉత్తమ సాహిత్యాన్ని, కళా సంస్కృతిని విస్తరింపచేయటమే సాహిత్యకారుల ముఖ్య లక్ష్యం, కర్తవ్యం. '' ప్రజల నుంచి ప్రజల కొరకు '' అనేది ఇక మన నినాదం, విధానం కావాలి. ఈనాడు మనం ఒకానొక సంక్లిష్టమైన మలుపులోవున్నాం. సాహిత్యాన్ని, మీడియాను, మోసపూరితం చేస్తున్న వ్యాపారపు విలువలు ఒకవపు, సామ్రాజ్యవాదుల ఆర్థిక సాంస్కృతిక దాడులు మరొక్ వైపు, మత ఛాందస ఆదిమ యుగాల దాడి మరొక వైపు నిత్యం మనం ఎదుర్కోటున్నాం. ప్రపంచీకరణ, ఉగ్రవాదం, మతోన్మాదం ముప్పేట దాడులు చేస్తూనే వున్నాయి. ఈ దాడినుంచి మనలను మనం మన సంస్కృతిని, సాహిత్యాన్ని మనమే కాపాడుకోవలసిన ఆవశ్యకత మరింత పెరిగింది. ఈ విషయాన్ని మానవాభ్యుదయాన్ని కోరే సాజితీ ప్రియులు గుర్తించాలని మరీమరీ కోరుతున్నాను. ఆ విలువలకు వ్యతిరేకంగా పోరాడవలసిన ఆగత్యాన్ని గుర్తుచేస్తూ సెలవు తీసుకుంటాను. _______________________________________________________ ( 2001 సాహితీ స్రవంతి వార్షికోత్సవ సభలో నాటి గౌరవాధ్యక్షులు డా||కె. హరీష్‌ గారి ప్రసంగం నుండి కొంత భాగం.....వారి స్వంత నోట్‌ పేడ్ నుండి ) _______________________________________________________ 17-6-2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qokYHr

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్|\ సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 15-6-2014 నివేదిక - శ్రీశ్రీ వర్థంతి) సమావేశం|| విప్లవాన్ని కవిత్వీకరించిన వాడు, కవిత్వాన్ని విప్లవీకరించనవాడు శ్రీశ్రీ అని నేటి యువకవులకు స్పూర్తిదాయకమైన ఆందించాడని, సముద్రమంత ముద్ర వేసిన కవి శ్రీశ్రీ అని, చరిత్రకు అర్థాన్ని '' ఏ దేశ చరిత్ర చూసిన యేమున్నది గర్వ కారణం ' అనే గేయం ద్వారా ఋజువు చేసాడు. చరిత్రకు నిజమైన అర్థాన్ని తన కవిత్వంలో తెలిపిన మార్గదర్శి. అని కొనియాడారు సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి. రౌతు రవి అధ్యక్షతన సాహితీ స్రవంతి ఆధయనవేదిక సమావేశం జూన్‌ నెల మూడవ ఆదివారం ప్రత్యేకంగా శ్రీశ్రీ వర్థంతి సమావేశంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి సభ్యులు ఉదయం 10గంటలకు ఖమ్మం బైపాస్‌ రోడ్‌లోని శ్రీశ్రీ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. పట్టణంలోని కవులు మొవ్వా శ్రీనివాసరావు, సంపటందుర్గా ప్రసాదరావు, కపిల రాంకుమార్, రౌతు రవి, కె. ఆనందాచారి, ప్రముఖ విద్యా సంస్థల అధిపతులు రమణారావు, వీరారెడ్డి, రాఘవరావు, ప్రముఖ వైద్యుడు డా. భారవి, ఇతర సాహితీ అభిమానులు, పాల్గొన్నారు. సాయంత్రం బోడేపూడి విజ్ఞాన కేంద్రం గ్రంథాలయంలో సాహితీ స్రవంతి అధ్యయన వేదికలో భాగంగా సామావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీశ్రీ గేయాలను ఎం.శేషగిరి, కన్నెగంటి వెంకటయ్య, సంపటందుర్గా ప్రసాదరావు ఆలపించారు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం, ఖడ్గసృష్టి సంకలనంలోని కవితలు సునంద, శైలజ, . సునంద, శైలజ, టి.లక్ష్మి, జయప్రద మున్నగువారు చదివారు. శ్రీశ్రీపై నాగభైరవకోటేశ్వరావు రాసిన గేయాన్ని కపిల రాంకుమార్ చదివారుశ్రీశ్రీ సాహిత్య ప్రక్రియల అన్నింటిలోను ఆల్‌రౌండర్‌ అంటూ విమర్శ, అనువాదం, కవిత్వ, చందోరచన, వ్యాసాలు, కథలు, నాటికలు, అంతేకా విదేశీ భాషాలలో పట్టు, శాసనమండలి సభ్యుడిగా తన పాత్రను నిర్వహించాడని అన్నారు. కె.ఎల్‌.యూనివర్సిటి అనువాద విభాగంకు చెందిన మోహనాచార్యులు మాట్లాడుతు నేటి పాఠశాలల మరియు కళాశాల విద్యార్థులకు శ్రీశ్రీ కవిత్వాన్ని పరిచయం చేయవలసివుందని తెలిపారు. నేటి సాంకేతిక విజ్ఞాన సంపాదన మాటున సాహిత్యం, చరిత్ర, రాజకీయం, ఆర్థిక శాస్త్రాల అధ్యయనం లోపించిందని, దానిని అధిగమించేలా ఎంతో కృషిచేయాలిసివుందని అన్నారు. డా. పి. సుబ్బారావు గారు మాట్లాడుతూ కవిత్వాన్ని విశ్వజనీనం చేయటంలో అతని కృషి అనితర సాధ్యం, దానిని ఎవరూ అధిగమించలేదు. విశ్వనాధను గౌరవించినట్లే, గురజాడను, తిక్కనను, వేమనూ గౌరవించాడు. పద్య చందస్సు, మాత్రాచందస్సు, గేయం, వచన కవిత,అంతే కాక కవిత్వంలో విభిన్న ధోరణులను సృజించినవాడు. అధివాస్తవికత, సర్రలియజం, లాంటి ప్రక్రియలు, లిమరిక్కులు, ప్రాసక్రీడలు ఇలా చెప్పుకుంటేపోతే సమయం చాలదు. మహా ప్రస్థానం ఒక భగవద్గీతలా కొత్తగా కవిత్వం రాసేవారు చదవాల్సివుందని నొక్కివక్కాణించారు. డా.||కవితాంజనేయులు శ్రీశ్రీ కవితలలోని కొన్ని సోదాహరణగా వివరించారు. ఎం.శేషగిరి '' ఏ దేశ చరిత్ర చూసినా ''గీతాన్ని ఆలపించి వందన సమర్పణ చేసారు. 17.6.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lL4J4z

Posted by Katta

16, జూన్ 2014, సోమవారం

Kapila Ramkumar కవిత

www.suryaa.com బిందువులో సింధువును దాచుకున్న ‘గజల్‌’ ‘గజల్‌’ తెలుగు కవితాప్రక్రియల మధ్య తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్న ఒక మధుర కవితాప్రక్రియ. ‘తఘజ్జల్‌’ అనే అరబ్బీ పదమే ‘గజల్‌’ గా మారిందని చెప్తా రు. వేటగాని బాణపు గురిని తప్పిం చుకోడానికి పరుగుపెడుతున్న లేడిపిల్ల పొదలలో చిక్కుపడి ఇక తప్పించుకునే దారిలేక చివరిగా చేసే ఆర్తనాదమే ‘గజల్‌’ అని అంటారు. అరబ్బీ, పార్శీ దేశాల నుంచి ప్రవహించిన గజల్‌ నది మొఘలాయిల కవితా సౌందర్య పిపాసను తీర్చుతూ ఉర్దూ గులాబీ అత్తరును పులుముకొని సుగంధ కెరటమై తెలుగు తేనె వాకలో సమ్మిళితమౌతున్నది.‘గజల్‌’ పై మనసుపడి మన తెలుగుకు గజల్‌ని పరిచయం చేసిన ఘనత మహాకవి దాశరథిదే. 1966లో తెలుగులో దాశరథి రచించిన తొలి గజల్‌ మత్లా ఇది- ‘రమ్మంటె చాలుగాని రాజ్యాలు విడిచిరానా! నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచిరానా!!’ దాశరథి రాసినవి నిజానికి పదకొండు గజళ్ళే అయినా చక్కని గజళ్ళు! ఇక తెలుగులో గజల్‌ ప్రక్రియను సుసంపన్నం చేసిన ఘనత జ్ఞానపీఠాన్నధిరోహించిన డా సి.నారాయణ రెడ్డిది. ఉర్దూలో ఖసీదా, రుబాయత్‌ లాంటి కవితా ప్రక్రియలు ఉన్నా ‘గజల్‌’ ప్రక్రియ ఆకర్షించినంతగా, ఏ ప్రక్రియా సరసహృదయాలను ఉయ్యాలలూపలేకపోయిందనేది నిస్సంశయంగా చెప్పచ్చు! నిజానికి పన్నెండవ శతాబ్దిలో మొఘలారుూల పాలనా కాలంలో అమీర్‌ఖస్రూ భారతదేశంలో గజల్‌ రచన ఆరంభించాడు. fbookకవితా వస్తువు అనేక వైవిధ్యాలకు గురైనా ‘గజల్‌’ అనగానే ‘ప్రేమ’ అనే అర్థం స్థిరపడిపోయింది-అందునా భగ్న ప్రేమ! సామాజికమైన కట్టుబాట్లకు వ్యక్తి కట్టుబడినా, బంధనాలకతీతమైన మనసు ఎప్పుడు ఎవర్ని ఎందుకు ప్రేమిస్తుందో ?! ఆ భావన హృదయపు అరలో దాచుకున్న మొగలి రేకులా పరిమళిస్తూ అపుడపుడూ ముళ్ళను గుచ్చుతూ తీయని వ్యధను రగిలిస్తుంటుంది. ఇటువంటి భావనకి ఏ వ్యక్తీ అతీతం కాదు! సరిగ్గా అటువంటి భావనతో నిండి సుతారంగా హృదయాన్ని కలవరపెట్టే గజల్‌ మోహంలో పడని సాహిత్యకారుడు, రసహృదయుడు ఉండడు! ఇదీ గజల్‌ వస్తువు. గజల్‌ రూపురేఖల విషయానికోస్తే- ఇది మన ‘ద్విపద’ లాంటిదే! ముత్యాల సరంలా మాత్రాఛందస్సుతో కూడినది. రెండ్రెండు వరుసల ఈ కవితాప్రక్రియలో రెండువరసలను కలిపి ‘షేర్‌’ అంటారు. ఇంలాంటి షేర్లు అయిదుకు తక్కువగాకుండా ఎన్నయినా ఉండచ్చు! దాశరథి మరీ ఎక్కువగా 25 షేర్లు రాశారు. అయితే అసమ సంఖ్యలో షేర్లు ఉండాలన్నది ఓ మధురభావనతో పెట్టిన నియమం. అంటే ఐదు, ఏడు, తొమ్మిది లాంటి షేర్లన్నమాట! ఎందుకీ అసమసంఖ్య అంటే ప్రియురాలు అసమానసౌదర్యరాశి కాబట్టి! ఆమె కొరకు రాసే గజల్‌ అసమసంఖ్యలో ఉంచాలని ఉద్దేశం! ఇక్కడ మొదటి షేర్‌ని ‘మత్లా’ అని, చివరి షేర్‌ని ‘మక్తా’ అని అంటారు. మత్లాలోని రెండు పాదాల్లో చివర ఒకే పదం లేదా ఒకే రైమింగ్‌ ఉంటుంది. దానిని ‘రదీఫ్‌’ అంటారు. gbookఈ రదీఫ్‌ పందం మాత్లా కాకుండా మిగిలిన ‘షేర్‌’ లలో రెండవపాదం చివరి పందంగా ఉంటుంది. ప్రతి రదీఫ్‌కి ముందు పదం చివర అంత్యప్రాస ఉంటుంది. దాన్ని ఖాఫియా అంటారు. ‘రదీఫ్‌కి మద్దెల నాదమైతే ఖాఫియానూ పురఝంకారంలాంటిదని’ సదాశివం మాట! ఇక ‘తఖల్లూస్‌’ సాధారణంగా మక్తాలో ఉంటుంది. మాత్రలు ప్రతి షేర్‌లోను సమానంగా ఉండాలి! ఉదాహరణకు ఇరవై మాత్రలు ఒక పాదంలో వస్తే అన్ని పాదాలలోను ఆంతే రావాలి! పాదాలు మరీపొడవైన కొద్దీ ‘గజల్‌’ అందం పోతుంది. ఈ ఖాఫియా రదీఫ్‌ల వల్ల ‘గజల్‌’ శ్రవణపేయంగా గాన యోగ్యంగా అద్బుతంగా ఉంటుంది! ఇక గజల్‌ లోని భావుకత, ఆర్థ్రత, చమత్కారం గజల్‌ జీవనాడి! వీటిని సాధించడం సామాన్య అంశంకాదు! ఈ మధ్యనే రసరాజు ఒక గజల్‌లో ‘ఒక్క గజలు రాయాలని ఎంత చచ్చి బతికానో’ అని రాసుకున్నారు. ఆ మాట వాస్తవం! గజల్‌ ఒక జీవితానుభవం. ఒక మధుర విషాదపేటిక. ఒక అపూర్వాభివ్యక్తి. ఒక ప్రేమవేదం. తన తరుపున వాదించుకునే ప్రేమ వాదం. లేదా మరో కోణంలో ఒక సామాజిక చైతన్యదీపం, మానవతానినాదం. పతనమైపోతున్న సాంస్కృతిక పతాకని నిలబెట్టే ఓ జీవగర్ర! సమాజం అనేక సమస్యలతో సతమతమవుతున్న నేటి తరుణంలో‘ ప్రేమను ప్రస్తావించేవి గజళ్ళు’అని ఈసడించనక్కరలేదు! చిన్నచూపు చూడనక్కరలేదు! సామాజిక సమస్యాపరమైన అంశాలను కూడా బంగా గజల్స్‌లో చెబుతున్నారు... అయితే గుండె గాయం నుండి పుట్టని గజళ్ళు మనసును కదిలించలేవనేది ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన నిజం! ఆరంభంలో భగ్నప్రేమ మాత్రమే వస్తువైన గజళ్ళు అన్ని భాషలలోనూ క్రమక్రమంగా ఇతర అంశాలనూ వస్తువుగా చేసుకున్నాయి. దేశభక్తి, సామాజిక చైతన్యం, భక్తి ఆత్మావిష్కృతి మొదలైనవి, సూఫీభక్తి భావనలు పరోక్షంగా గజల్‌లోనిండి ఉండి ఒకో సందర్భంలో ప్రియుడు ప్రేయసి తోటి చెప్పుకునే వేదన- భక్తుడు భగవంతుడి తోటి చేసుకొనే నివేదనగా స్ఫురిస్తుంది. లౌకికమైన స్త్రీ పురుషుల ప్రేమను ‘మజాజీ’ అని, భగవద్భక్తి తో కూడినదానిని ‘హకీకి’ అని అంటారు. తెలుగులో సాధికారంగా గజల్‌ను గూర్చి మాట్లాడగలిగినవారు ఉర్దూ సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషలలో పండితుడు, ముఖ్యంగా ఉర్దూ గజల్‌ సౌందర్య దర్శనం చేసినవారు డా యస్‌. సదాశివ, అలాగే నోముల సత్యనారాయణ. సదాశివ ఉర్దూ కవితాసౌందర్యం గురించే వ్రాసిన అనేక వ్యాసాలు గజల్‌ ప్రేమికుల మార్గదర్శకాలు. ఉర్దూ భాషలోని మార్ధవం తెలిసిన డా సి. నారాయణరెడ్డి అనేక గజళ్ళను తెలుగులో వ్రాసి ఒక గొప్ప సాహితీ ప్రక్రియకు విస్త్రృత ప్రచారాన్ని కల్పించారు! గజల్‌ శ్రీనివాస్‌ తమ అమర గానంతో సాహితీవేత్తలకు మాత్రమే పరిమితమైన గజల్‌ను సామాన్యుల దాకా తీసుకెళ్ళగలిగినారు! వీరందరి కృషితో ఈ నాడు తెలుగులో గజల్‌ రచన యిప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఉర్దూ గజల్‌ లక్షణాలను, భగ్నప్రేమను కవితా వస్తువుగా తీసుకుని ప్రముఖకవి పెన్నా శివరామకృష్ణ వ్రాసిన ‘సల్లూపం’ గజల్‌ వ్రాయాలనుకునే కవులకు మార్గదర్శకమైన గ్రంథం! సామాజికమైన అంశాలను తీసుకొని గజల్‌ వ్రాస్తున్న కవులలో రెంటాల వెంకటేశ్వరరావు, గజల్‌ శ్రీనివాస్‌, సూరారం శంకర్‌, రసరాజు, తటపర్తి రాజగోపబాల, అద్దేపల్లి రామ్మోహనరావు ఉన్నారు. వీరిలో శంకర్‌ ‘సౌగంధిక’ అనే గజల్‌ కవితాసంపుటిని, తటపర్తి రాజగోపబాల ‘హృదయం చిరునామా’ అనే గజల్‌ కవితా సంపుటిని, అమన్‌ ‘మధుశాల’ను, వెంరాల సుబ్రహ్మణ్యం వెంపరాల గజల్స్‌ను, డా అద్దేపల్లి రామ్మోహనరావు ‘అద్దేపల్లి గజల్స్‌ను’, డా ఎం.బి.డి. శ్యామల ‘సుహృల్లేఖ’ గజల్‌ కవితా సంపుటిని తీసుకువచ్చారు. సరస్వతీమూర్తులు ఉండేల మాలకొండారెడ్డి, ముక్తేవిభారతి మొదలైన ప్రముఖులు ఈ సుకుమార ప్రక్రియపట్ల మక్కువ చూపడం ముదావహం! ఇంకా వర్ధమాన కవులు ద్యాపరి నరేందర్‌ రెడ్డి, ఇందిర, రాజేష్‌, పెద్దలు కాసోజు లక్ష్మీనారాయణ, పాలపర్తి శ్రీధర్‌, రేగులపాటి కిషన్‌రావు, మాధవరావు గజల్‌ ప్రక్రియను సుసంపన్నం చేస్తున్నారు. ఈ సందర్బంగా డా సదాశివ- పెన్నా ‘సల్లాపం’ గజల్‌ గ్రంథానికి రాసిన ముందు మాటను ఓసారి ప్రస్తావించుకొవాలి. ‘తెలుగు గజళ్ళు రాసే వాళ్ళకొక మనవి- ‘ఖాఫియారదీపులు కుదిరెనా మంచిదే! కుదరకపోతే తంటాలు పడనవసరంలేదు, మన సంప్రదాయం ప్రకారం అంత్యప్రాసలతో అలరించినా సరిపోతుంది. ఉర్దూ గజళ్ళు రాసే కొందరు మహాకవులకే ఖాఫియాలు దొరకవు. మాత్రల కూర్పు సరిగావుంటే చదివేవారికి సౌకర్యం... వినేవారికి ఆనందం’ అన్నారు! అంతమాత్రం చేత ఖాఫియా రదీపులు పాటించవద్దనికాదు! అవి పాటిస్తే వాటి అందమే వేరు! గజల్‌కు లయాత్మకత ముఖ్యం! తిస్రచతురస్ర ఖండగతులతో లయబద్ధంగా నడిచే తూగు గజల్‌లో ఉండాలి! అపడే గజల్‌ గానయోగ్యమవుతుంది!’ మాత్రలను మీటర్లను రదీఫ్‌ ఖాఫియాలను పేర్చి తయారు చేసినంత మాత్రాన అది ‘గజల్‌’ కాదు! నిజానికి గజల్‌ ఆంటే ఏంటో మనకు తెలియాలంటే మన ప్రసిద్ధ కవువులు ఎవరెవరు గజల్‌ని ఏమన్నారో తెలుసుకోవడం అవసరం. ‘గజల్‌ వ్రాయడమంటే రవ్వను చెక్కడం లాంటిది, బిందువులో సింధువుని కుదించడం లాంటిది’ అని దాశరథి, ‘సరసభావన, చమత్కార ఖేలన, ఇంపూ కుదింపు గజల్‌ జీవలక్షణాలు’ అని డా సి.నారాయణరెడ్డి అన్నారు! ‘ఉర్దూకవిత్వాన్ని ఇప్పటికి రసరమ్యంగా శృతిపేయంగా భావుక జనాహ్లాదకరంగా, సహృదయ హృదయరంజకంగా పఠితలను, శ్రోతలను భావాంబర వీధిలో విహరింపజేస్తూ పరవశింప జేసేది ఖసీదాకాదు, మస్నవీకాదు, ఖవ్వాలీ కాదు, నంజం కాదు మరేమిటి అంటే- ఖచ్చితంగా అది గజలే!’ అని సదాశివ, ‘గజల్‌ అంతగా సహృదయుల మనస్సులను సమ్మోహితం చేసిన కవితారూపం మరొకటి లేదు’ అని నోముల సత్యనారాయణ అన్నారు. గుంటూరు శేషేంద్ర శర్మ గజల్‌ గురించే చెప్పిన ప్రత్యక్షరసత్యం పరమ సుందరం! ‘గజల్‌ చేతిలోకి వచ్చివాలిన ఒక రంగుల పక్షి, రెండు రెక్కలు, ఒక గొంతు, ఇంతే దాని సంపదంతా కలిపి! ఎవరైనా ఒక పక్షిని చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది! దాని పిడికెడు శరీరమంతా ఒక గుండె అయి స్పందిస్తుంటుందని, దాని చంచల నేత్రాలు దిశలు చూస్తూ ఉంటాయి! పొదివి ముద్దు పెట్టుకుందామన్పిస్తుంది! ఆకాశంలో విడిచిపెదడామనిపిస్తుంది! గజల్‌ అంత నాజూకు జీవి! దానికన్నవాడు ఎంత దుఃఖం మోసి కన్నాడో- మనసున్నవాడికే తెలుస్తుంది’. ‘శరీరమంతా గుండై కొట్టుకునే వెచ్చని ఆ పక్షి గుండె స్పందనే గజల్‌’ అన్న ఈ భావన అద్భుతం! పెన్నా గజల్‌ ఆత్మను ఒకింత భావుకతతో అందంగా ఆవిష్కరించారు. గజల్‌ అంటే ‘ముల్లుకాటుకు వేలుమీద వికసించిన చిన్ని గులాబీని వాడకుండా కన్నీరు చిలకరిస్తూ కాపాడుకోవడం! బలవన్మరణం పాలౌతున్న జీవన లాలస కార్చిన చివరి కన్నీటి బిందువు, లౌకిక వ్యాపకాల వ్యామోహాల పరుగులో ఏదో గుర్తొచ్చినట్లు హఠాత్తుగా వెనుదిరిగి చూడడం, జ్ఞానాన్ని అజ్ఞానంగా, ఆజ్ఞానాన్ని జ్ఞానంగా భ్రమింపచేస్తున్న లోకాన్ని అందంగా వెక్కిరించడం!’. బహుశ గజల్‌ గురించీ ఇంతకన్నా ఎవరే చెప్పలేరనుకుంటాను. ఇదంతా ఎందుకంటే గజల్‌ వ్రాయాలనుకేవాళ్ళు దాని ఆత్మను పట్టుకోవాలి! పైపై భావాల డొల్లతనంతో తేలిపోయే పదాలను పేర్చడం గజల్‌ కాదు! అంశమేదైనా మనిషిని కదిలించే ఆర్థ్రత ముఖ్యం! ఉదాహరణకు పెన్నా గజల్‌ లోని ఒక మత్లా- ‘ఆవారా గాలి ఆటలాడుతూనే ఉన్నది/ ప్రతి వెదురూ గుండె పగిలి పాడుతూనే ఉన్నది’ ‘ఆవారా’ అనే ఉర్దూ పదం వల్ల ఇక్కడ మనం కోరుకున్న అర్థం బలియంగా వ్యక్తమవుతోంది! అల్లరి చిల్లరి గాలి ఆటలాడుతూనే ఉంది. దానికి ప్రతిగా ప్రతి వెదురూ గుండె పగిలి పాడుతూనే ఉన్నది- అనేది ఎంత గొప్ప భావన! ఈ అభివ్యక్తిని సమాజంలోని అనేకాంశాలకు అన్వయించుకోవచ్చు! ధనికుల ఆటకు బలైన నిరుపేదలు కావచ్చు, లేదా ఆకతాయి ఆటకు బలైన ఓ అబల కావచ్చు! ఇలా ఎన్నైనా ఊహించవచ్చు! బిందువులో సింధువుని ఇమడ్చడం అంటే ఇదే! అభివ్యక్తిలో బలం ఉండాలి. భావంలో ఔన్నత్యం ఉండాలి. పదాలలో లాలిత్యం ఉండాలి. సూరారం శంకర ‘సౌగంధిక’ లోని ‘మత్లా’ ఇది! ‘ఒకే చూపు! వేలపున్నములు... ఎలా నిన్ను చూసేది? ఒకే పాట ! వేల భావనలు... ఎలా నిన్ను పాడేది ?’పై మత్లాలో ప్రియుడు ప్రేయసితో అనడం ఒక లౌకిక భావన అయితే, భగవంతుని గూర్చిన భావన అంతర్లీనంగా దాగుంది. నిజానికి వేల పున్నముల కాంతి... వేవభావనల మూర్తి భగవంతునిదే కదా! నాకున్నది ఒకే దృష్టి! వేలపున్నమి వెన్నెలల కాంతిని చూడగలనా? నే పాడగలిగేదొకే పాట! వేల భావనల కలుగుపైన నిన్ను పాడగలనా?! అనేది బలమైన అభివ్యక్తి! చెప్పే అంశం ఏదన్నది కాదు ముఖ్యం, ఎంత అందంగా ఎంత సుతారంగా ఎంత హృదయావర్ణకంగా చెప్పగలిగామన్నదే ముఖ్యం! డా రెంటాల ఈ గజల్‌లో వస్తువు ప్రకృతి సౌందర్యంలో ఒక భాగమైన గోదావరి నదీ సౌందర్యం! కానీ ఆంత చిన్న గజల్‌లో ఎంత వెన్నెల ఒలికించారో చూడండి! ‘పాపికొండల నోట పలికిన పాట గోదావరి/ పారుతున్నది వెన్నెలై రుూపూట గోదారి/ రెప్పలను తెరచాపలెత్తి కంటి పడవను మెత్తగా/ నడుపుతున్నది వింతగా రుూ పూట గోదారి’ ఈ ఊహాశక్తి ఎంత బలీయంగా ఉందంటే- సాధారాణ పాఠకుడు సైతం కళ్ళముందు ఈ చిత్రాన్ని దృశ్యీకరించుకోగలడు! రెప్పలపు తెరచాపలుగా కంటిని పడవగా చెప్తూ- తన సౌదర్య కెరటాలపై ఆ కంటి పడవను నడిపే ఒయ్యారి ఎవరో కాదు గోదావరే అని చెప్పడం ఎంతో బాగుంది. అన్ని విధాల అంటే భౌతిక ఆత్మిక సౌందర్యాలతో, అన్ని షేర్లు సమ మాత్రాకంతో, కవినామ ముద్ర (తఖల్లూస్‌)తో కూడుకున్న మృదయాన్ని కదిలించే ఒక మంచి గజల్‌‌‌లో గజల్‌ లక్షణాలను చూద్దాం! మత్లా : దూరాలు పెంచె వెలుగు కంటే తిమిరమే ఎంతో నయం/ హృదయాన్ని కోసే మాట కంటే మౌనమే ఎంతో నయం/ షేర్‌: మమకారమును రుచి చూపి ప్రేయసి పయనమైనది ఎచటికో/ మోహాన్ని పెంచే ముద్దు కంటే గాయమే ఎంతో నయం మక్తా: ఏ మందు లేనిది ప్రేమ జబ్బని తెలిసే పెన్నా నేటికి/ లోలోన కాల్చే ప్రేమ కంటే మరణమే ఎంతో నయం. ఈ గజల్‌లో ఒక షేరే ఉదహరించడం జరిగింది. మత్లాకి మక్తాకి మధ్యలో అటువంటి షేర్లు నాలుగయిదు దాకా ఉంటాయి. రదీఫ్‌ పదం ‘ఎంతో నయం’ అనేది ‘మత్లా’ రెండు పాదాల్లోనూ మిగిలిన షేర్లలో రెండవ పాదం చివర వచ్చింది! ఇక ఖాఫియా ‘మే’ అనే అక్షరం. వీటిని ‘రవీ’ అంటారు. సహాంత్యప్రాస పదాలు తిమిరమే, మౌనమే గాయమే మరణమే అనేవి! ఈ గజల్‌లో ప్రతిపాదం ఇరవై ఎనిమిది మాత్రలతో ఉన్నది. ‘మక్తా’లో కవి నామముద్ర తఖల్లూస్‌ ‘పెన్నా’ అనేది ఉంది! ఇక భావం ఎంత హృదయంగమమో సహృదయ హృదయైక వేద్యం! పారశీ ఉర్దూ కవులు తమ గుండెను పిండి పెద్ద చేసిన ఈ గజల్‌ పూదోట తెలుగు కవుల ఆదరణతో మరింత సరస సుందరారామంగా మారాలని, అనేక మంది ప్రతిభావంతులైన తెలుగు కవులు మనసారా రుూ ప్రక్రియను చేపట్టాన్నదే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం! రాయప్రోలు, ఆదిభట్ల నారాయణదాసు, దువ్వూరి, బూర్గుల రామకృష్ణారావు వంటి అనేకమంది ప్రముఖ సాహితీవేత్తలు ఉర్దూ గజల్‌ పరిమళానికి సోలిపోయి, పారశీ ఉర్దూ గజళ్ళను, తేటగీతులుగా ద్విపదలుగా, ఆటవెలదులుగా, తెలుగులోకి ఆనువందించారు. సమాజం అనేక సమస్యలతో సతమతమవుతున్న నేటి తరుణంలో‘ ప్రేమను ప్రస్తావించేవి గజళ్ళు’అని ఈసడించనక్కరలేదు! చిన్నచూపు చూడనక్కరలేదు! సామాజిక సమస్యాపరమైన అంశాలను కూడా బంగా గజల్స్‌లో చెప్తున్నారు. arachaitha‘గజల్‌ ప్రేమ ప్రపంచంలోంచి ప్రపంచ ప్రేమలో పడింది’ అని సి.నా.రె. చెప్పడమే గాక తమ గజళ్ళను సామాజికాంశాలతో వ్రాశారు! అయితే గుండె గాయం నుండి పుట్టని గజళ్ళు మనసును కదిలించలేవనేది ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన నిజం! చివరిగా గణేశ్‌ బిహారీ తర్జ్‌ వ్రాసిన ఒక్క షేర్‌:‘దోహే రుబాయి నజ్మ్‌ కభీ తరథే మగర్‌/ అస్నాఫె షాయిరీ కా ఖుదా బన్‌ గరుూ గజల్‌’ (సాహితీ ప్రక్రియలెన్నో ఉన్నాయి. అయినా ‘గజల్‌’ ఆ ప్రక్రియలకన్నింటికీ ఈశ్వరుని స్థానం పొందింది).

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://www.suryaa.com/

Posted by Katta

Kapila Ramkumar కవిత

ఆళ్వారుస్వామి అభిమానులకు విన్నపం Posted on: Mon 16 Jun 01:38:09.99196 2014 తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో శతజయంతి సందర్భంగా సాహిత్య సమాలోచన - జాతీయ సదస్సు 1 నవంబర్‌ 2014 నాడు ప్రముఖ రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి గారి శతజయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆ సందర్భంగా ఆళ్వారుస్వామి గారి సాహిత్యం గూర్చి, వ్యక్తిత్వం గూర్చి వివిధ రచయితలు ఇదివరకే రాసి వివిధ పత్రికలలో ప్రచురింపజేసిన అన్ని రకాల రచనలను సేకరించి పుస్తక రూపంలో ప్రచురించదలచుకున్నాం. అంతేకాకుండా, ఆళ్వారుస్వామిగారు తమ మిత్రులకు రాసిన లేఖలతోపాటు వారి ఇతర రచనలు - కథానికలు, వ్యాసాలు, గల్పికలు, సంపాదక లేఖలు మొదలైన వాటిని కూడా ఈ సంపుటిలో చేర్చదలచుకున్నాం. ఆళ్వారుస్వామిగారి ఫొటోలను కూడా పంపవచ్చు. సాహతీ మిత్రులు, ఆళ్వారుస్వామిగారి అభిమానులు సహకరించి ఆయా రచనల జిరాక్స్‌ ప్రతులను ఈ క్రింది చిరునామాకు నెలరోజులలోగా పంపవలసిందిగా మనవి. తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి అధ్యక్షులు,- డా. గంటా జలంధర్‌రెడ్డి 11-9-130 3, లక్ష్మీనగర్‌, కొత్తపేట, పోస్టు : సరూర్‌నగర్‌, హైదరాబాద్‌ 50035. సెల్‌ 9848292715 ఈ మెయిల్‌ : jalanderreddy65@gmail.com

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lrm2T8

Posted by Katta

Kapila Ramkumar కవిత

కళాతాత్విక మార్గంలో తెలంగాణా నుడికారపు కవిత్వం Posted on: Mon 16 Jun 01:35:11.096163 2014 భావచిత్రాల వైవిధ్యం మాత్రమే కాదు. ప్రతీకలు, మనోవైజ్ఞానిక ప్రభావం, తాత్వికోద్దీపన ఇలాంటివి తెలంగాణా నుడికారంలోనే తెలంగాణా కవులు సాధిస్తున్నారు. ఇలాంటి చర్చల వలన ఈ కవిత్వంలోని మరో అంశం చర్చకు వస్తుంది. తెలుగు ప్రాంతీయ ఉద్యమం బలపడిన తరువాత తెలంగాణా నుడికారానికి కవిత్వముఖంగా ప్రధాన పరికరంగా ఉనికి ఏర్పడింది. ఇది ఉద్యమంలోని ఉద్వేగాన్ని సారవంతంగా, సహజాతి సహజంగా అందించింది. ఈ సందర్భంలోనే ఈ నుడికారంలో అభివ్యక్తి సంబంధమైన కవిత రాయవచ్చా లేదా అనే చర్చలు జరిగాయి. కొన్ని సార్లు ఈ దృష్టితో పరిశీలిస్తే వచ్చిన కవిత్వం అందుకు సమాధానం చెబుతుంది. ప్రతీభాషకు ఒక ప్రాతిపదిక స్వభావం ఉంటుంది. తెలంగాణా నుడికారంలో ఔద్వేగికత, మమకారంలాంటి భిన్న మాధ్యమాలుంటాయి. ఈ నుడికారంలో ఏ అర్థాన్నిచ్చే వాక్యానికైనా ఈ స్వభావం కనిపిస్తుంది. గతంలో తెలంగాణా ఉద్యమం, నక్జల్చరీ పోరాటాలు అనే వైప్లవిక పోరాటాల వలన, వర్తమానంలోని కవిత్వం వలన తెలంగాణా కవిత్వం. పాటలో ఉద్యమం ధ్వనించింది. ప్రధాన ఉద్వేగ సందర్భాలు నడిపించటం, కవిత్వాన్ని ఉద్యమం ప్రభావితం చేయడం, ఇక్కడి కవిత్వంలో ఎక్కువే. ఉద్యమంవల్లే కవిత్వం రాసిన కొత్తగొంతుకలూ ఈ ప్రాంతంలో అధికమే. అదే సందర్భంలో ప్రాంతాన్ని అక్కడి ఆహ్లాదవాతావరణాలను, వ్యక్తులను ఉద్దేశించి రాసిన అనేక కవితలు తెలంగాణా కవిత్వంలో మరో భావ, తాత్విక కవితా యుగాలను స్వప్నిస్తాయి. ఈ కళాత్మక ఉద్దీపనకూ నుడికారం ప్రత్యేక అలంకారమయింది. వెన్నెలని ఆధారం చేసుకొని చాలా గొప్ప భావచిత్రాలతో ఒక కవితని నిర్మించారు బూర్ల వెంకటేష్‌. బూర్ల దర్శనంలో తన్మయీ భావం కనిపిస్తుంది. వెన్నెలని చాలా భిన్నంగా తెల్లటి దుప్పటిలా, పాలలా, వరిగొలుకల్లా, వెండిలా, తెల్ల కాయితంలా అనేకరూపాల్లో చూస్తున్నాడు. బూర్ల దర్శనంపై వర్ణ (షశీశ్రీశీబతీ ) ప్రభావం కనిపిస్తుంది. నిజానికి వెన్నెలని చల్లనిదనే దృష్టితో చూస్తారు. ''ఎన్నీల ముచ్చట్లు ఎన్నని చెప్పాలె నేను ఇంట్ల ఉంటే/ కిటికిలకెల్లి తొంగి చూస్తది బైటికివోతె/ ఆగమేఘాలమీద ఎంటవడి అస్తది'' ''రాత్రిరాత్రంతా/తెల్లటి దుప్పటిగప్పి నా ఇంటిమీద కావలిగాస్తది/కండ్లు మూసుకుంటే మనసుల కూసోని/తెరచాటు ముచ్చటవెడ్తది '' ''పొద్దుగాల పాలువిండేటప్పుడు సర్వలదునికి జాక్కుంటది'' ''ఆకాశంల నిలవడి నా కోసం తపస్సు జేసి వరిగొలుకల అవతారమెత్తి నా గుండిగెల నిండుతది సముద్రం గుండెమీద తన బొమ్మచూయించి రమ్మని చేతులు చాపుతె తనవెండినంత వాని మొకమ్మీద కుమ్మరిచ్చి తన మనుసు తెల్లకాయిదం జేసి నాకు ప్రేమలేఖ పంపిస్తది'' (ఎన్నీల ముచ్చట్లు-బూర్ల వెంకటేష్‌) వెన్నెలని తాను ఎంతగా అనుభవించాడో అంతగా అభివ్యక్తం చేసారు. కోట్‌ చేయగలిగితే అన్ని వాక్యాలు అంతే బలమైనవి తెలంగాణా ప్రజా వ్యవహారంలోని భాషలో ఉన్న మార్దవాన్ని , మాధుర్యాన్ని చక్కగా ఉపయోగించుకున్న కవిత ఇది. సాధారణంగా తెలంగాణా భాషను ఉపయోగిస్తున్న సందర్భంలో నామవాచకాలు ఉపయోగించడం ఎక్కువ కనిపిస్తుంది. వెంకటేష్‌ క్రియలని కూడ సమర్థవంతంగా ఉపయోగించాడు. ''తొంగిచూసు/ ఎంటవడు/ ముచ్చటవెట్టు/ దునుకు/ జాక్కొను/ కుమ్మరిచ్చు/ఇనుకుంట'' ఇలాంటివి కనిపిస్తాయి. ''చెప్పాలే/ ఉంటే /వోతే'' లాంటి క్రియలు కూడా సహజ త్వాన్ని ప్రదర్శిస్తాయి. వెన్నెల గురించి గోరటి ఎంకన్న కూడా ఒక పాట రాసారు. తెలుపు అనే వర్ణాన్ని పట్టుకుని దాన్ని ఆధారంగా చేసుకుని అనేక పంక్తులని రాయటం ఇందులో కనిపిస్తుంది. ఒక భావ చిత్రాన్ని నిర్మించడంలో స్వరం, వర్ణం, దృశ్యం , భావన వంటి అనేక పరికరాలు ఉంటాయి, బూర్లలో ఈ అంశాలన్నీ కనిపిస్తాయి. వెన్నెలతో ఉండే సంబంధాన్ని వ్యక్తం చేసిన వాక్యాలతో పాటు వెన్నెలలోని వర్ణాన్ని కూడా భావచిత్రమయం చేయడం కనిపిస్తుంది. ''సౌందర్యాన్ని కనిపెట్టే కన్ను ప్రకృతికి ఎదురు పడినపుడు దాని సౌందర్యం ద్విగుణీకృతం అవుతుందని'' కళావాదుల అభిప్రాయం. ఇది వెన్నెలతో ఉండే సంబంధాన్ని వ్యక్తం చేసిన వాక్యాలలో కనిపిస్తుంది. ''తెల్లటి దుప్పటి, వెండి'' లాంటి పదాలని, పదబంధాలని గమనిస్తే ఇందులోని వర్ణాన్ని కవిత్వం చేయడం చూడవచ్చు. మైకేల్‌ సూపర్‌ అనే కళా సమీక్షకుడు రంగుల గురించి మాట్లాడుతూ '' దీవyశీఅస aఅy సశీబb్‌. ఖీశీతీ ్‌ష్ట్రవ ళతీర్‌ ్‌ఱఎవ ఱఅ ్‌ష్ట్రవ ష్ట్రఱర్‌శీతీy శీట aత్‌ీ, షశీశ్రీశీబతీ ఱర సఱరజూశ్రీyవస టశీతీ ఱ్‌ర శీషఅ ఝసవ. ×్‌ రఱఅస్త్రఱఅస్త్ర టశీతీ ్‌ష్ట్రవ ఝసవ శీట రఱఅస్త్రఱఅస్త్ర , aఅస ఙఱbతీa్‌వర టశీతీ ్‌ష్ట్రవ ఝసవ శీట ఙఱbతీa్‌ఱఅస్త్ర. ఔఱ్‌ష్ట్రశీబ్‌ ్‌ష్ట్రవ రశ్రీఱస్త్రష్ట్ర్‌వర్‌ అవ్‌బతీaశ్రీఱర్‌ఱష షశీఅ్‌వఞ్‌'' అన్నాడు. కళాకారుని దృష్టిలో రంగు కేవలం భౌతికం కాదు. అది పాడటం, చలించటం మొదలైన అన్ని గుణాలని కలిగి ఉంటుంది, పై వాక్యంలో తెల్లటి దుప్పటి, వెండిలో ప్రతిబింబించటం ఇలాంటిదే. వస్తువునించి రూపాన్ని అందులోని విలువలను వేరుగా గమనించడం వల్ల ఇది సాధ్యమయింది. కళాత్మకంగా రాస్తున్నప్పుడు కవిలో అతని ఆత్మ వస్తువు యొక్క ఆత్మని దర్శిస్తుంది. ఈ క్రమంలో వస్తువులోని అంతర్గత శక్తులన్నీ ఆ దర్శనంలో పెనవేసుకుంటాయి. తైదల అంజయ్య, సిరిరామోజు హరగోపాల్‌, వేముగంటి మురళీ, బూర్ల వెంకటేశ్వర్లు మొదలైన కవులు రాసిన కవిత్వంలో ఈ మార్గం కనిపిస్తుంది. తాత్విక ఉద్దీపన దాక వెళ్లడానికి దర్శనం దాని నుండి కళాత్మక రూపం ఇందులోనూ మొదటి దశ భావచిత్రాలు గీయటం, రెండువదశలో ప్రతీకల ఆచ్చాదన ఎక్కువ చేసి రాయటం. ఈ దశకు అతీత స్థాయి దానిలో జీవితాన్ని సంలీనం చేసి తాత్విక మార్గంలో వ్యక్తం చేయటం ఇవన్నీ తెలంగాణా కవిత్వంలో కనిపిస్తాయి. ''నా చిన్న నాటి కలువపువ్వు కుంట మా పల్లె తలాపున తరగని ఆస్తి చెట్టుమీది పాలపిట్టకు నీటి ప్రేము కట్టే చిత్రం ఇక్కడమునిగి అక్కడ తేలే బుడుబుంగల ధర్మసత్రం'' (కుంట- బూర్ల వెంకటేశ్వర్లు) ''మొగిలీరేకుల్లెక్క పిల్లలొస్తున్నారె నవ్వుకుంట తుళ్ళుకుంట బడికొస్తున్నారె లేత లేత ఆకులోలె పూత పూత పిందెలోలె దువ్వెన్ల గుంపు లెక్క పావురాల దండు లెక్క లేత పెదవుల మీద నవ్వులూ రువ్వుకుంట ముద్దు ముద్దూగ నడిచె బొమ్మాల దండు'' (బడిబాటల్లో -సిరిరామొజు హరగోపాల్‌) మొదటిదానిలో కుంట అనే ప్రదేశాన్ని అనేక భావ చిత్రాలుగా గీయటం కనిపిస్తుంది. రెండవ భాగంలో బడి పిల్లలు బడికి వెళ్ళటాన్ని రకరకాల ప్రతీకలతో చిత్రించారు. ఈ పద్ధతిలో ఒకటి రెండు వైరుధ్యాలను గుర్తించవచ్చు. ప్రకృతిని భావచిత్రాలుగా గీస్తున్నప్పుడు ఊహా, సాంస్కృతికత ఎక్కువ ప్రభావం చూపుతుంది. అదే వ్యక్తులు చలనదృశ్యాలు గీసినప్పుడు ప్రతీకల వాడకం ఎక్కువ కనిపిస్తుంది. ''కళ ఒక విషయం కాదు అనుభవం'' అన్నాడు జోసెఫ్‌ అల్బర్ట్‌ ఈ అనుభవం ఈ వాక్య భాగాల్లో కనిపిస్తుంది. ''మా గూనపెంకల ఇంట్లోకి మల్లె తీగ జారి వుండె వేపపూల జడేసుకుని గచ్చు మురిసిపోయేది ఎత్తయిన అరుగులమీద గుమ్మడి ఆకులతోని దొండ పిందెలు ముచ్చట పెట్టుకుంటుంటె కట్టెలపొయ్యిలనుంచి లేసినపొగ అమ్మ దు:ఖంలో కలిసి జమిలిగ చూరు కింద దూరేది ఆవుల గిట్టలనుంచి రాలిన వడ్ల గింజలను ఏరుకుంట కోళ్ళమంద గుంపుగ కదిలేవి'' (వేముగంటి మురళి) ఒక ఊరులోని సజీవదృశ్యాన్ని కవిత్వం చేసిన వాక్యాలివి. ఒక దృశ్యం లోని అనే అంశాలు పేర్చినట్లుగా కనిపిస్తాయి ఇందులో కళాకారుడు వస్తువునుంచి రూపాన్ని వేరుచేసి చూస్తాడని అంటాడు సంజీవదేవ్‌. ప్రకృతి అంతా రూప భేదాలమయం దీన్నంతా ఒక్కటిగా చూడ్డనికి ఒక విశిష్ట దృష్టి కావాలి. ఆ దృష్టి కవిలోని సాంస్కృతికాత్మ ఇస్తుంది. అందుకే అరవిందులూ కవి ఆత్మ పలికిందే అసలైన కవిత్వం అన్నారు. మల్లె తీగ, వేప పూవు, పుంజీతం ఆట, ఆవుటగిట్టలు, కోళ్ల మంద'' ఇవన్నీ నిజానికి వ్యష్టి చిత్రాలు. వీటన్నిటిని ఒకటిగా చేసి ఒక పల్లె సంస్కృతిని ప్రతిబింబించేలా చేయటం ఇందులో కనిపిస్తుంది. భావచిత్రాల వైవిధ్యం మాత్రమే కాదు. ప్రతీకలు, మనోవైజ్ఞానిక ప్రభావం, తాత్వికోద్దీపన ఇలాంటివి తెలంగాణా నుడికారంలోనే తెలంగాణా కవులు సాధిస్తున్నారు. ఇలాంటి చర్చల వలన ఈ కవిత్వంలోని మరో అంశం చర్చకు వస్తుంది. అది తెలంగాణా కవిత్వాన్ని, తెలుగు కవిత్వాన్ని ప్రదీప్తం చేస్తుంది. - ఎం. నారాయణ శర్మ, 9848348502కళాతాత్విక మార్గంలో తెలంగాణా నుడికారపు కవిత్వంhttp://ift.tt/UFo7Ge 4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UFo7Ge

Posted by Katta

15, జూన్ 2014, ఆదివారం

Kapila Ramkumar కవిత

ఈ రోజు ఉదయం 10 గంటలకు ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్‌ లో నివాళులర్పించిన ఖమ్మం సాహితీ మిత్రులు

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TXXoEe

Posted by Katta

14, జూన్ 2014, శనివారం

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ || చమక్‌|| గరుకు కాగితం చిట్లిన పాళీ చిద్రమైన బతుకు! 14.6.2014 ఉదయం 5.51

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ptovEr

Posted by Katta

Kapila Ramkumar కవిత

Srinivas Vasudev 6 hours ago "మీరెప్పుడైనా మీ మనసుకి నచ్చినట్టుగా బతికారా?" ---------------------------------------------------- ఈ వారం మన విశిష్ట అతిథి దీప్తి నావల్-- Deepti Naval "మీరెప్పుడైనా మీ మనసుకి నచ్చినట్టుగా బతికారా?" ఔను మన జీవితంలో ఎంతవరకూ మనం మనకి నచ్చినట్టుగా ఓ పక్షిలాగనో ఓ చేపలాగనో బతగ్గలిగాం? మనకి నచ్చిన పనిని నచ్చిన టైమ్ లో చెయ్యగలిగాం? కానీ దీప్తినావల్ చెయ్యగలిగింది, చేసింది, చేస్తున్నది కూడా. Deepti Naval-actress, poetess, writer, director, photographer, painter and above all an artist to the core. ఓ మామూలు అమ్మాయి కొండలంచునో, లోయలగాధంలోనో దేన్నో వెతుకుతోనో లేదంటే ఏదో కోల్పోయినదాన్ని పట్టుకుంటున్నటోనో అనిపిస్తె ఆమె మరెవ్వరో కాదు--ఆమె మన దీప్తి నావల్. హు...దీప్తినావల్! తన జీవితంలో తానెలా ఉండాలనుకుందో అలానే బతికింది, అలానే ఉంది కూడా ఇప్పటికీ! ఎప్పుడూ చేతిలో ఓ కెమెరా, భుజానికో సంచీ అందులో ఓ పుస్తకం, పెన్నూ! వీటితో ఏ కొండల్లోనో లోయల్లోనో తిరుగుతూ తనకి నచ్చిన దృశ్యాన్ని కెమెరాలో బంధించటమో, ఇంకా నచ్చితే ఓ కవిత రాసుకోవటమో ఈమె దినచర్య. వీటికోసం దేన్ని త్యాగం చెయ్యమన్నా సిధ్ధమె. 1957, ఫిబ్రవరి 3 న ఓ పంజాబీలో కుటుంబంలో జన్మించిన దీప్తి తన గురించి తానిలా అంటుందీ---సీరియస్ గానే: ‘There is a mountain person in me: I feel I am less of a Punjabi and more of a Pahadi,’ says Deepti, who is part Dogri on her mother’s side. ఎనభైల్లో రిలీజయిన చాలా సిన్మాల్లో 'పక్కింటమ్మాయి' తరహాలో అందంగా ముద్దుగా చలాకీగా ఉంటూనే సీరియస్ నటనని ప్రదర్శించే దీప్తినావల్ ని మనం మర్చిపోలేం. 1978 లోనే శామ్ బెనెగళ్ సిన్మా "జునూన్" ద్వారా తెరకి పరిచయమైన దీప్తి తరువాత "చష్మే బద్దూర్", "కథ", "సాత్ సాత్", "మిర్చి మసాలా", "అంగూర్", "రంగ్ బిరంగీ" లాంటి ఆణిముత్యాల్లాంటి చిత్రాలలో నటించింది. ఆమె గురించి ఆమెని దగ్గరగా చదివిన వారేమంటారో చూద్దాం : Deepti has always followed her heart, often at the cost of fame and moneys: she is poet, painter, photographer, traveler and mother…A many-layered personality of mercurial moods, Deepti follows her heart wherever it leads her, even if that be beyond fame and riches. దానికి ఆమె ఇలా అంటుంది "And I live for the moment: ‘Tomorrow I will be elsewhere – I will live those moments fully. But the now and here is what matters.’ నిజం కదా? కానీ మనసు చెప్పే మాటల్ని వింటూ మనసు చెప్పే మార్గంలో ప్రయాణించటం మనలో ఎంతమంది చెయ్య గలుగుతున్నాం? షబ్నా ఆజ్మీ, స్మితా పాటిల్ లాంటి మేటి నటీమణుల సరసన నిలబడగలిగే సత్తా ఉన్న నటి అని పొగిడినా ఆమెకి రావల్సిన బిరుదులూ పొందాల్సిన సత్కారాలూ ఏమీ రాలేదు. మనస్థాపంతో ఆమె కొన్నాళ్ళపాటు విరామం తీసుకుని తనకి నచ్చిన హాబీస్ వెంట పరుగెత్తి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మంచి సిన్మాలె చేసింది. సరదా సిన్మా "హిప్ హిప్ హుర్రే' సెట్స్ లో ఆ చిత్ర దర్శకుడూ ప్రకాష్ ఝా తో ప్రేమలోపడి అతన్నే పెళ్లాడి ఇద్దరూ కల్సి ఓ పాపని దత్తత తీసుకున్నారు. సిన్మా సరదాకీ 'ఝీ'విత సరదాకి ఎంత తేడా! కానీ ఆమెకి మాత్రం రెండూ ఒకటే! కొన్నాళ్ల పాటు ఆమె ఝాతో సంసారం 'సాగించి' నచ్చని మరుక్షణమే ఆమె అతన్నుంచి దూరం జరిగింది--విడాకుల్లాంటి హడావుళ్ళేమీ లేకుండానె. అప్పుడే మరో సెలబ్రీటీ వినోద్ పండిట్ తో పీకల్లోతు ప్రేమలో పడిన దీప్తి అతను కాన్సర్ వ్యాధితో మరణించే వరకూ అతనితో సహజీవనం సాగించింది. కానీ ఆమె నిజంగానే వినోద్ ని ప్రేమించింది. ఎంతవరకు అంటే అతనితోనే ఉంటూ అతనికి సపర్యలు చేస్తూ తన సిన్మా చాన్సులు కూడా వద్దనుకుంది. ఆ సమయంలోనే వినోద్ ఆమెకి ఫోటోగ్రప్ఫీలో మెలకువలు నేర్పుతూ ఆమెని మళ్ళీ నటనవైపు మరల్చాడు. జీవితం సార్/మేడం....ఇది జీవితం! ఎన్ని బయోగ్రఫీలు చదివినా ఇంకా చదవాల్సిందీ, వినాల్సిందీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వినోద్ మరణం ఆమెని తీవ్ర మనస్థాపానికి గురి చేసింది......బహుశా జీవితంలో మొదటిసారి దీప్తి జీవితాన్ని అనుభూతించటమంటే ఏంటో చవిచూసింది. కొన్ని నెలలపాటు ఇద్దరూ ఓ కార్లో తమకి నచ్చిన ప్రదేశాలు తిరుగుతూ నచ్చినవన్నీ చేసుకుంటూ గడిపారు. మనలొ ఇలా చెయ్యగలిగిన వారెంతమంది? అన్నీ ఉన్నాకానీ! అదీ కొంత వరకూ ఆమె జీవితం. తన భర్త (ప్రకాష్ ఝా) ఆమె మాటల్లో -- "I enjoy a much more valuable equation with him now. ‘When you eliminate role-playing, remove the quotation marks from both ends of a relationship, you are able to really appreciate the person for who he is.’ Wow very well said కదా? ఔను ఓ వ్యక్తితో మనకున్న సంబంధాన్ని ఏ కొలమానాలు లేకుండా చూడండీ అతనెంత / ఆమెంత గొప్ప గా కన్పడతారో. హ్మ్! ఆమె ఇప్పటివరకూ ప్రచురించినవి రెండంటే రెండే సంపుటాలు కవిత్వంలో "‘Lamha Lamha’ in Hindi and “ Black Wind” in English, which was released in 2004 by Oxford Bookstore." ఆమె కవితల గురించి ఇది చదవండి- Deepti is a seeker of beauty: an explorer of wilderness. Her poems spring from anguish both within and without. And the visual intoxication of nature. And the burnished loveliness of living. There is a innocence in her writings – 'I stop the car and watch in disbelief- with what élan, the peacocks cross the street…' “Black Wind” contains a collection called ‘The Silent Scream’: poems of pain at observing women at a mental institution. ఆమె రాసిన సంపుటిలోని ఓ కవితని మీకిక్కడ ఇస్తున్నాను. చూడండి THE STENCH OF SANITY There is something rotten - inside of You, in your flesh, the stench of Sanity. It breathes in your Eyes, this thing… Something decadent, in your Flesh, decaying… It will be too late – you will Die of it! This thing that sleeps with you Night after night, like An aging wanton woman, Spent, but not quite spent – And she waits for you to Dump her, in some dark street Corner… yet follows you, Drunken whore! There’s no getting away for you You will die of it, this thing That breathes… Inside of you, in your flesh The stench of sanity ఇది కేవలం ఆమె కవిత్వపు అలల్లోంచి ఎన్నుకున్న ఓ అల. ఇక మీరే ఆమె కవిత్వ మొత్తాన్ని కనుక్కుని ఆస్వాదించండి--తర్వాత తీరిగ్గా! ఇక చివరిగా ఆమె కవిత్వం గురించి మరో మాట: ఆమె తనలోకి తనే జారి మనకో మాట చెప్పిన సంఘటన Delving within--- ‘I simply cannot be bound to a place. In Mumbai, my closest “out” is the Erengal Church on Madh Island. There were years when the church was not even functional. I would park quietly, go in and sit by the wall, spend time listening to the sea, watch the rain pouring down… Basically, I ma a loner – I love being with myself.’ Coming up is a collection of poetry from wanderings in Ladakh. Deepti’s poetic journey has just begun. http://ift.tt/1qcSArO

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qIXOcj

Posted by Katta

13, జూన్ 2014, శుక్రవారం

Kapila Ramkumar కవిత

మాటల మడుగు ||- మెర్సీ మార్గరెట్‌ || 9052809952 ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి మాటలకు మొలకల వేళ్ళుండేవి పచ్చగా మొలకెత్తేందుకు అవి సారవంతమైన నేలలు వెతికేవి ఒకప్పుడు నోటినిండా మాటలుండేవి మాటలన్నీ శిల్పాలుగా మారేందుకు ఒకదాన్నొకటి పెనవేసుకుని, అంటిపెట్టుకుని ఉలి మొన స్పర్శ కోసం సిద్ధమై శిల్పాలవడానికి ఆత్రంగా ఉవ్విల్లూరేవి ఒకప్పుడు నోటినిండా మాటలుండేవి మాటలన్నిటి కాళ్ళకి ఘల్లున మ్రోగే మువ్వలుండేవి మువ్వలన్నీ సంతోషంగా నృత్యం చేస్తూ మాటలకు విలువ పెంచేవి అవును ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి మాటలకు రుచుండేది మసక కన్నుల్ని వెలిగించే నిప్పు రవ్వలుండేవి చెమట చుక్కల్ని కౌగలించుకునే చేతులుండేవి కడుపు నింపే ధాన్యపు గింజల్లా ఉండేవి కాని ఇప్పుడేమయ్యిందో నోటినిండా మాటలున్నాయి మాటలన్నీ గాలికి తేలిపోయే తాలులా వరిపొట్టులా ఉన్నాయి మాటల్ని తోడుకునే నాలుక చివరనుండి గొంతుకపై కొన్ని చేతుల ఉరి కాపలాకాస్తుంది మాటలన్నీ గవ్వలై మట్టి పెళ్లలై కాళ్ళు చేతులు విరిగిన బొమ్మలై నిస్తేజంగా ఉన్నాయి ఇప్పుడూ నోటినిండా మాటలున్నాయి మాటలన్నీ ఆ పహారాకి ఘనీభవించి గడ్డకట్టి మంచు శిలలై , మౌన తపస్సు చేస్తున్నాయి ఎవరైనా సహాయానికి రండి నాతోపాటు ఆ చేతుల్ని నరికి మంటజేసి మాటల్ని కరిగించడానికి మళ్ళీ ఆ మాటల్ని ప్రాణమూర్తుల్ని చేయడానికి http://ift.tt/1hPLtTt

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hPLtTt

Posted by Katta

Kapila Ramkumar కవిత

ఆకలి సెగలో|| - కాశిరాజు|| 9701075118 ఇల్లుమొత్తం నిండుకున్నా లేనితనం ఎప్పుడూ లేదు మాటో, పిలుపో, సర్దుబాటో చేసిపోతావ్‌ అమ్మేమో అప్పైనా తెచ్చివండేస్తది బదులివ్వడం తెలిసిన బతుకుల్లో లేదన్న బాధ తెలీదని అమ్మ కొసరి వడ్డిస్తున్నపుడే తెలుస్తాది. ఆకలిగా ఆవురావురంటూ తిని, కాస్త నిండాక కాళ్ళుసాపుకు తిని అమ్మా నువ్వుకూడా తిను అన్నప్పుడు నాకు నిండిందని నిర్దారించుకున్న మీరిద్దరూ మాకు ఆకలైనపుడు మెతుకుల్లాగా మారిపోయారు బడికెళ్ళలేదేరా అని అడుగుతుంటే బియ్యం లేవన్న సమాధానం అమ్మ సెప్పిందో, నా ఆకలే సెప్పిందో తేలీలేదు ఆ పూట మనం కాలుచుకుతిన్న పచ్చి చిక్కుడుకాయల ముదురు గింజలన్నీ కమ్మదనాన్ని కాదు గాని, అమ్మదనాన్నే తెలిపాయి. ఆ పొయ్యి సెగకి నువ్వు కాస్త నా పక్కకు జరిగాక. నాన్నా! ఆకలితో కాదు మనం, అమ్మతో నిద్దరోయాం. http://ift.tt/1hPIuuk

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hPIuuk

Posted by Katta

9, జూన్ 2014, సోమవారం

Kapila Ramkumar కవిత

సాహిత్యంపై జరిగిన వివిధ కార్యక్రమాలు... 14:11 - June 8, 2014 00:13 సాహితీ వేదికలు, సాహిత్య కార్యక్రమాలు పెద్దలకు, పెద్దలుగా ముద్రపడ్డ సాహితీవేత్తలకు, మరికొందరు స్వయంప్రకటిత మేధావులకు ప్రాధాన్యత ఇవ్వటం చాలా సాధారణంగా మారింది. కానీ, అక్షరం కార్యక్రమానికి కిరీటాల మీద, బిరుదుల మీదా అదనపు గౌరవం ఎప్పుడూ లేదు. గుండెలోతుల్లోంచి వెల్లువలా పొంగుకొచ్చే భావాన్ని, నిజాయితీగా, బాధ్యతతో అక్షరీకరించే కలంకారులకే పట్టంగడుతూ వచ్చింది. ఈవారం నుంచి కొత్త కెరటాలు విభాగంలో ఈ మధ్య కాలంలో ఉధృతంగా రాస్తూ, తెలుగు సాహిత్యానికి కొత్త వెలుగులు అందిస్తున్న కవులు, కథకుల పరిచయాలు అందించబోతున్నాం. ఇంకా మాయా ఏంజెల్ లెటర్ టు మై డాటర్ పుస్తక విశ్లేషణ, ఆచార్య బేతవోలు పద్య పరిచయం చూద్దాంhttp://ift.tt/1ptSA44

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ptSA44

Posted by Katta

Kapila Ramkumar కవిత

తెలుగు సాహిత్యంలో కొత్త కెరటాలు 14:09 - June 8, 2014 05:45 సాహితీ వేదికలు, సాహిత్య కార్యక్రమాలు పెద్దలకు, పెద్దలుగా ముద్రపడ్డ సాహితీవేత్తలకు, మరికొందరు స్వయంప్రకటిత మేధావులకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా సాధారణంగా మారింది. కానీ, అక్షరం కార్యక్రమానికి కిరీటాల మీద, బిరుదుల మీదా అదనపు గౌరవం ఎప్పుడూ లేదు. గుండెలోతుల్లోంచి వెల్లువలా పొంగుకొచ్చే భావాన్ని, నిజాయితీగా, బాధ్యతతో అక్షరీకరించే కలంకారులకు పట్టంగడుతూ వచ్చింది. ఈ వారం నుంచి కొత్త కెరటాలు విభాగంలో ఈ మధ్య కాలంలో ఉధృతంగా రాస్తూ, తెలుగు సాహిత్యానికి కొత్త వెలుగులు అందిస్తున్న కవులు, కథకుల పరిచయాలు అందించబోతున్నాం. ఈ వారం జీరో డిగ్రీ కవితా సంకలనంతో గుర్తింపు తెచ్చుకున్న మోహన్ రుషి పరిచయాన్ని చూద్దాం.. నిత్యనూతనం.. మోహన్ రుషి కలం.. గత కొన్నేళ్లుగా ఎన్నో తాజా కలాలు తెలుగు సాహిత్యానికి కొత్త ఊపిరులందిస్తున్నాయి. అటు కవిత్వం, ఇటు కథల్లో తమ ప్రతిభను చాటుతూ తెలుగు సాహిత్యానికి నిత్య యవ్వనాన్ని ప్రసాదిస్తున్నారు. అలాంటి నిత్యనూతన కలాల్లో ఒకరు మోహన్ రుషి. కొన్నేళ్లుగా బలమైన కవిత్వాన్ని రాస్తున్న కవి. అంతర్ బహిర్ యుద్ధారావంలో అంతర్లోకాలకు ప్రాధాన్యత ఇచ్చి రాస్తున్న కవి. ఈ మధ్యే తన తొలి కవితా సంకలనం జీరో డిగ్రీ వెలువరించారు. ఇరవై ఏళ్ల క్రితమే రాయటం మెదలు పెట్టినా, ఈ మధ్య కాలంలో సీరియస్ గా రాస్తున్నారు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మోహన్ రుషి, హైదరాబాద్ లో కంటెంట్ రైటర్ గా ఓ ఎడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. నగర జీవితంలోని డొల్లతనాన్ని, బిజీలైఫ్ పరుగుల వెనుక ఉన్న నిశ్శబ్దపు దు:ఖాన్ని, మనిషిజీవితంలోని, సమాజపు విలువల్లోని, అనుబంధాల పైమెరుగుల్లోని డొల్లతనాన్ని తన కవితల్లో సూటిగా ప్రకటించారు, ప్రశ్నించారు... మోహన్ రుషి. ''వొదిలేసేవాళ్లు చేసిన మేలు మనతో ఉన్న వాళ్లూ చేయరు; ధన్యవాదాలు. దృష్టిని విశాలమూ, నిశితమూ చేసినందుకు. జీవనయానంలో మరో మార్గదర్శనానికి కారణమైనందుకు. ఇంకోసారి పుట్టించినందుకూ.. ఇక నగ్నంగా నడక మొదలు. మరొకరువొదిలేసేవాళ్లు మనల్ని వొదలకుండా పట్టుకునేంత వరకూ, లేదా మనల్ని మనమే వొదిలేసి కదిలిపోయేవరకూ!'' శూన్యం తప్ప... అంటూ నగర జీవితాన్ని నిక్కచ్చి వ్యాఖ్యానం.. ఇలాంటి మరెన్నో వ్యక్తీకరణలు మోహన్ రుషి జీరోడిగ్రీలో చూడొచ్చు. గుండెలోతుల్లోంచి తెరలు తెరలుగా పొంగుకొచ్చే దు:ఖాన్ని, సునామీలా ముంచెత్తే విషాద సంద్రాన్ని మోహన్ రుషి కవిత్వంలో చూడొచ్చు. జీరోడిగ్రీలో కవి దు:ఖం వ్యక్తిగతం కాదు. అది సామాజికం, సాంస్కృతికం కూడా. అయితే, పబ్లిక్, ప్రైవేట్ ప్రపంచాల మధ్య అడ్డుతెర చిరిగిపోయిన సందర్భాన్ని పసిగట్టగలగడమే ముందుతరం కవులకు, మోహన్ రుషి కవిత్వానికి ఉన్న తేడా. మోహన్ రుషి కలం నుంచి మరింత చిక్కటి కవిత్వం రావాలని ఆశిద్దాం... సాహితీ సృజనలో ఎంత ప్రతిభ చూపినా గుర్తింపు రాని వారెంతమందో ఉంటున్నారు. అనామకంగా మిగిలిపోతున్నారు. ఇప్పుడు కొత్తగా రాస్తున్న రచయితలెందరో ప్రోత్సాహం లేక, ఫేస్ బుక్ లాంటి సోషల్ సైట్స్ కో, లేక, బ్లాగ్ లకో పరిమితమవుతున్నారు. అలాంటి వారిలో ప్రతిభావంతంగా, ప్రభావాత్మకంగా రాస్తున్న వారిని టెన్ టివి పరిచయం చేయబోతోంది. ఈ వారం జీరో డిగ్రీ కవితా సంకలతనంతో గుర్తింపు తెచ్చుకున్న మోహన్ రుషి పరిచయాన్ని చూద్దాం. http://ift.tt/1oBQgIS

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oBQgIS

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ || **ఆంగ్ల కవితకు స్వేచ్చానుసరణ || While wandering in terrace A wonder ring on trees made me surprise along with sunshine Bird flow over head stone fall on my shoulder wounded me with shock appeared an angel from heaven recognised her to be my old friend bend downwith love __________________________________ **1604-1780 మధ్య ఓ కవి రాసిన పోయెం కు నా స్వేచ్చానుసరణ కవి పేరు మరిచిపోయాను. ___________________________________ ఒక శుభోదయాన అంతస్తులో సంచారం చేస్తూంటే, చెట్లపై ఒక అద్భుతం వలయం మెరుపులా కనపడింది సూర్యరశ్మి పాటు ఆశ్చర్యచకితుడయ్యాను నా తలపై ఓ పక్షి ఎగిరినట్లైంది ఇంతలో నా భుజం మీద రాతిముక్క బలంగా తాకినట్టుంది దిగ్భ్రాంతి తో నేను గాయపడ్డాను తేరుకుని చూస్తే స్వర్గం నుండి దిగివస్తున్న ఒక దేవదూత కనిపించింది ఆమె నా పాత స్నేహితురాలై ఉందని గుర్తించా! నా తనువు ఒంగిపోయిది ప్రేమతో! ________________________ 9 జూన్‌ 2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rZyumM

Posted by Katta

Kapila Ramkumar కవిత

14న 'కవిసంగమం' సభ - ప్రజాశక్తి - నేటి వారథి లో... Posted on: Mon 09 Jun 04:48:00.090766 2014 కవిసంగమం పదహారవ సభ ఈ నెల 14వ తేదీ రెండో శనివారం సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌ అబిడ్స్‌లోని గోల్డెన్‌ త్రెషోల్డ్‌లో జరుగుతుంది. ఈ కవితోత్సవంలో రామా చంద్రమౌళి, స్కైబాబా, వాహెద్‌, అరుణ నారదభట్ల, పనసకర్ల ప్రకాష్‌ కవిత్వం చదువుతారు. విభిన్నతరాల కవులకు వేదికగా నిలిచిన ఈ ఉత్సవానికి నవ యువ కవి సమూహాలను, కవిత్వ పాఠకులను 'కవి సంగమం' ఆహ్వానిస్తుంది.

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tWLKnJ

Posted by Katta

Kapila Ramkumar కవిత

1) ..త్రిపురనేని శ్రీనివాస్ ॥ కవిత్వం కావాలి కవిత్వం ! .......................................................... కవిత్వం కావాలి కవిత్వం అక్షరం నిండా జలజలలాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం ............. కవిత్వం వేరు వచనం వేరు సాదాసీదా డీలా వాక్యం రాసి కవిత్వమని బుకాయించకు కవిత్వాన్ని వంచించకు వచనమై తేలిపోతావ్- కవిత్వం కావాలి కవిత్వం అక్షరం నిండా కువకువలాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం 2)... 1. కవితలకు ఫోటోలు పెట్టవద్దు.[సీనరీలు గట్రా] 2. ఒకరోజులో ఒక కవిత మాత్రమే పోస్ట్ చెయ్యాలి. 3. ఇతర పత్రికలలో, అంతర్జాల పత్రికలలో ప్రచురితమైన మీ కవితల,కవితావ్యాసాల 'లింక్స్'ను సరాసరి ఇక్కడ పోస్ట్ చెయ్యవద్దు. ఆ రచనను టైపు చేసి కానీ ,కాపీ,పేస్ట్ చెయ్యడం ద్వారాగానీ పోస్ట్ చేస్తూ క్రింద బ్రాకెట్ లో సదరు పత్రిక యొక్క పేరును రాయండి.[అలా లేని పక్షంలో అటువంటి పోస్టింగును పోస్ట్తె చేసినవారికి తెలుపకుండానే తొలగించడం జరుగుతుంది] 4. కవిత్వానికి సంబంధించని పోస్టింగులు వెంటనే తొలగించబడతాయి. *సాధ్యమైనంతవరకూ సభ్యులు తెలుగులిపిలో చర్చలు సాగించవలసిందిగా మనవి. తెలుగులిపిలో టైపు ఎలా చెయ్యాలో తెలీని వాళ్ళు http://lekhini.org కాని . 3)>>>> ..... Note 1 ~ ఒకరోజులో ఒక కవిత మాత్రమే పోస్ట్ చెయ్యండి. ఒకటికన్నా ఎక్కువ కవితలు పోస్ట్ చేసినచో ఆ పోస్ట్ తొలగించడం జరుగుతుంది. NOTE : 2 ~ కవిత పోస్ట్ చేసేటప్పుడు-కవితా శీర్శిక తప్పక పెట్టండి. [*ఉదా: కవి పేరు | కవితా శీర్షిక ] అలాగే కవిత క్రింద తేదీ తప్పక వెయ్యండి.[*ఉదా: తేది - నెల - సంవత్సరం)**......................................................... కవితలని పోస్ట్ చేసే ముందు ఓకసారి ఈ నియమాలని పాటించండి. ]జయహో కవిత్వం!

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://lekhini.org/

Posted by Katta