పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, మార్చి 2014, బుధవారం

Venkat S Dhavala కవిత

నేను నీకై|||||| సమఙ (సోమయాజి) నేను నీకోసమే రాస్తున్నా ఓ కవితనే ఈ ప్రపంచం నా మదిలో జారగా ఆ ప్రకంపనలే మారేను సిరాగా నా యవ్వనం చూసిన వేల ఉషోదయాలే యెదుట నిలిచేను నిషా సరస్సులా నాలో యెన్నడు రేగని కోరికలే ఉదయించేను కొత్తగా నిన్ను చూడగా నువ్వూ నేనూ ఒక్కటి ఐతే అది కాదా అద్భుత కలయిక నీవు విహంగమైతే నేన్నీకై వేచే గగనాన్ని నీవు వెన్నెలవైతే నేన్నెకై చూసే సినీమాలిని ఓ చెలీ సఖీ నా ప్రియ నేస్తం అందుకోవాలి నేను నీ చల్లని హస్తం అదే నా అనందాలకి జీవాస్త్రం అప్పుడు దాసోహమే నాకు ఈ లోకం సమస్తం --సమఙ

by Venkat S Dhavala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NUKovg

Posted by Katta

Jwalitha Denchanala Jwalitha కవిత

జ్వలిత/ నిస్సందేహ పార్ధివ దేహాన్ని శతశతాబ్దాల చరిత్ర పునరావృతం బ్రమల భ్రమణాల వ్రణం కోటికోట్ల గొంతుకల గాయం(నం) నిర్నిర్మిత నిర్ణయాలు నిర్నిశ్చిత యుద్దాలు నిర్నిర్ణిత ఉద్యమాలు నిర్నిర్ద్వంద్వ హామీలు నిర్నిబద్ద ప్రయోగాలు నిర్నిస్సంగ విరోధాలు నిర్నిశీధి ప్రకాశాలు నిర్నిషిద్ద అత్యాచారాలు నిన్ర్నిసంఖ్యాక కాంక్షాశిఖరాలు నిర్నవ నిర్మాణ లంకాగృహాలు నిర్నిదగ్ధ భస్మసరస్సులు అనాయాచిత మధిరా ప్రవాహాలు అకాల మరణాధారిత అపత్నులు అసహాయ అలింగ ప్రసవాలు నిర్నిరోధ జాడ్య హేతువులౌ నేరస్వామ్య రాజ్యాన నిర్నిస్సంఘటిత సమూహాల వ్యూహాత్మక ద్రోహాల సమావేశాల్లో నేనొక నిర్నిస్సందేహ పార్ధివ దేహాని 'నోటా'ఓటు నాపాలిట అలౌకికానంద లౌకిక అస్త్రం/శస్త్రం ..... జ్వలిత 9989198943

by Jwalitha Denchanala Jwalitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NUKnYv

Posted by Katta

Patwardhan Mv కవిత

సందర్భం 02- ఎవరిది ఇది ?? (ఎపిసోడ్ సమయం 15 నిమిషాలు మాత్రమే) అందరికీ నమస్కారం.మీకందరికీ నచ్చిందనే నమ్మకంతోనే వచ్చింది సందర్భం-02 ఎపిసోడ్.ఇవాళ కూడా నిన్నటి లాగే ఓ కవిత్వ భాగం మీ ముందుంచుతున్నాను. అఫ్కోర్స్..మనకు అంత కష్టం ఏమీ కాదు.ఎవరిదో చెప్పండి. ఇలా పెట్టడం గూర్చి మీరేం అనుకుంటున్నారు? మీ స్పందనేంటి? ////.....ఎక్కడుంది నీ కప్పుడు కనిపించిన సత్యం? ఏనాటికి దొరుకుతుంది దేశంలో నాకు నచ్చిన సజ్జన సాంగత్యం? నీవానాడు చచ్చావు కనుక నిజంగా బతికి పోయావు ....,నువ్విప్పుడు బ్రతికే ఉంటే పిస్తోలుతో మరణం కాదు చిత్రవధ జరిగి వుండేది నీకు చావో బ్రతుకో తెలియని సందిగ్ధ జీవిత సంధ్యా సమయంలో ఊహలూ ఉద్భోధలూ మానేసి నీ అంతట నీవు ఉరి పోసుకుని వుండేవాడివి ....,నువ్విప్పుడు బ్రతికేవుంటే పచ్చి వెలక్కాయల్లాంటి ప్రశ్నల బాణాల్ని నీ గొంతుకు గురి చూసి కొట్టేవాణ్ణి..//// ఎవరివి ఈ తూటాల్లాంటి వాక్యాలు? నాకు తెలుసు .మీరు చెప్పగలరు.కొన్ని గొప్ప కవిత్వ చరణాలు స్మరణ చేసుకొనే ఈ పోస్ట్ మీద మీ స్పందన కోరుతున్నాను.మరి ఆలస్యం దేనికి?మీ సమయం ఇప్పుడు మొదలౌతున్నది. 26-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gCrjuO

Posted by Katta

Syam Prasad Bezawada కవిత

కవిత్వ మొక అవసరం ----------------------------శ్యాం ప్రసాద్ బెజవాడ కాదు నాకది అలంకారం కవిత్వం నాకొక అవసరం నన్ను నిలువరించే వివరం మీరు వినేలా తెల్పుకోనొక వరం! తల్లి వంట, చేసేదే పిల్లల కోసం వారు తినక, మరి దేని కోసం? వారు తినటమే, ఆమె అవసరం అందుకే అమె చేస్తుంది, మరో రసం! కవి కన్నబిడ్డలే కావ్యకన్యకలు వారి చిరంజీవమే, కవి కోరికలు అందుకు సాగే పాకాలే, ప్రాసలు విభిన్న నుడికారపు యాసలు! తెలియజెప్పాలి విషయమెలాగయినా కాదనుకుంటే, చేదాటిపోతుందాపైన జీవనయానం, అపరిమితం కాదు శవమైపోయాక వూరట అవసరం లేదు! ముసలితనంలో ముచ్చటగా కనలేరు గ్రీష్మమొచ్చాక ఆకు తొడగలేదు జీవన సత్యాలు విడచి నడువలేరు పథ్యానికీ, పంతానికీ కూడ సమయం అడుగలేరు! అందుకే అనుకున్నది సాధించటం అవసరం అసలు సమయాన్ని శాసించటం అవసరం తెలివి తప్పిపోయినట్టుండే ఒక్క క్షణం తెలిసి వేధించేస్తుంది జీవిత మనుక్షణం! స్పృహకయితే సమయం నిరంతరం మత్తుకు మాత్రం మాత్ర మితమే విశ్లేషణలు సాగాలి కాలానికి అనుగుణం అందు నిర్ధ్వంధ నివేద ననేదొక సుగుణం! అందుకే కావాలదొక అలంకారం కవిత్వం సమాజానికో అవసరం స్వర సంధానంలో నిలిపిన వివరం జనం వినేలా చెప్పుకోగల వరం!

by Syam Prasad Bezawada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P1surG

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

దాము || వొత్తిడి || నువ్వు పాదం మోపిన చోటల్లా నీలిపడగ విన్యాసం బుసకొడుతుంది. మరీచక దూరానికి చేయి చాసేందుకోసం మళ్లీ ఒక ప్రయత్నం చేస్తావు. దట్టంగా కమ్ముకున్న జీవితంలోంచి వూపిరాడక గిలగిలలాడతావు. వినేందుకు హృదయం దొరకదు, పువ్వుకాదుకదా, తొడిమకూడా చిర్నవ్వదు. ప్రేమలాంటి నక్షత్రఖచిత ఆకాశమొకటి స్వప్నంలా బులిపిస్తుంది. ఎవరు తెరుస్తారు కిటికీలు? గుహతొలిచే పులికోసం అన్వేషిస్తావు. ఎప్పటికప్పుడు నీడను తరిమికొడతావు. కనిపించిన దారెంబడి నడుచుకుంటూ పోతావు. ఎవరొస్తారు తోడు? కత్తులులేని ఆకురాయి గరుకుతనం యవ్వనచర్మం పొడవునా వొరుసుకుంటూ వుంటుంది. భూమికన్నా శరీరం భారమవుతుంది. దేహం గుండా భూమధ్యరేఖ దూసుకుపోతున్న చప్పుడికి ఉలిక్కిపడతావు. పోటెత్తే రక్త సముద్రానికి హై బిపి అని పేరెడతాడు డాక్టరు. మెదడు నిండా క్షణాలు ఉబ్బిన శవాలవుతాయి. మృదువైన సంధిగ్థ సంధ్య కూడా ఈడిపస్ కాంప్లెక్స్ లా అనీజీగా కమ్ముకుంటుంది. వున్నట్టుండి కట్టలు తెంచుకున్న మురికినది వొక్కటి నీలోపలినుంచి లోపలికి వొరుసుకుని ప్రవహిస్తుంది. క్రమంలోంచి క్రమం పుట్టి క్రమంలోకి వెళ్లిపోతుంది. నువ్వొక ధీర్ఘ నిశ్వాసమవుతావు. 21/12/94,... ప్రవాహగానం నుంచి. 26/3/14

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P1ssQJ

Posted by Katta

Nirmalarani Thota కవిత

ఉన్నట్టుండి తెరుచుకున్న నయనాల్లోకి ఓ స్వప్నం దోబూచులాడుతుంది.. ఓ స్మృతి రేఖ పెదాలపై చిరునవ్వు తళుకవుతుంది ఉన్నట్టుండి ఓ లేలేత భావోద్వేగం మేని పులకింతవుతుంది ఓ ఆశా పవనం నుదుటిపై అమ్మ లాలింత స్పర్శవుతుంది ఉన్నట్టుండి ఓ పలకరింపు మూగబోయిన భావాలను నిదురలేపుతుంది ఓ అనుభూతి కెరటం తనువును నిలువునా తడిపేసి వెళుతుంది ఉన్నట్టుండి ఓ పిలుపు శూన్యాలను దాటి జీవితమంతా నినదిస్తుంది ఓ ఓపలేని ఆత్మీయత ఝుంఝుమ్మారుతంలా గుండెను కుదిపేస్తుంది కొన్ని పరిచయాలెందుకు వెంటాడుతాయో కొన్ని ఙ్ఞాపకాలెందుకు వేటాడుతాయో కొన్ని బంధాలెందుకు మనసును కట్టేస్తాయో కొన్ని వ్యక్తిత్వాలెందుకు అస్తిత్వాన్ని కూడా దోచేస్తాయో జీవితమంతా అలోచించినా అంతు చిక్కని ప్రవళిక.. విఙ్ఞానమెంత వృద్ది చెందినా శోధించినా మెదడుకందని ప్రహేళిక మనస్తత్వ శాస్త్ర గ్రంధాలెన్ని ఉద్భవించినా కొన్ని ఫీలింగ్స్ కి కారణాలు దొరకవు . . కదిలించే ఆర్ద్రత తప్ప..! !

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hs8B3X

Posted by Katta

Yasaswi Sateesh కవిత

యశస్వి*పొసగని కాలంలో..* సమాధానం చెబుతాను.. అడిగింది నువ్వే.. నమ్మడం మాట దేముడెరుగు వినిపించుకోవు.. మరి అడగడమెందుకో అర్థం కాదు.. రోదిస్తావ్!.. బాధిస్తావ్.. సాధిస్తావ్ నా మనోఆకాశాన్ని చిందరవందర జేస్తావ్ నే ధ్వని కాలుష్యాన్ని, పదకాలుష్యాన్ని ఆశ్రయిస్తాను. ఒకరికి పట్టిన దెయ్యాన్ని వేరొకరు వదిలించాలని చూస్తాం సమాధానపడడం సాధ్యం కాదు పరిస్థితి విషమిస్తుంది. కొన్ని క్షణాలు మరణిస్తాయి మన మధ్య చీకటి పరుచుకుంటుంది. నువ్వు అంతఃపురంలో విశ్రమిస్తావ్ నే సమాధిలోకి దారి వెతుకుతుంటాను. కీచురాళ్ళు రొదపెడుతూనే ఉంటాయి. కాలం అకాలంలో శమిస్తుంది మరోనిముషానికి శపిస్తుంది ఏదోశక్తి ఇద్దరినీ పరీక్షిస్తుందని ఎవరో ఒక్కరికే అనిపిస్తుంది ప్రాణం పాతరోజులకై పరితపిస్తుంది అందని ఏకాంతం పరిహసిస్తుంది దిండు తడుస్తుంది రాత్రి గడుస్తుంది.. పొద్దు పొడుస్తుంది నిట్టుర్పు విడుస్తుంది ఇద్దరి మధ్య ప్రేమ.. మౌనంలో పురుడుపోసుకుంటుంది అహంలో ఊపిరితీసుకుంటుంది ఇచ్చిపుచ్చుకోవడంలో తీరాలు దాటిస్తుంది అంతరాలు పాటిస్తుంది మాటల్లో ఉరితీసుకుంటుంది చేతల్లో కసిదీర్చుకుంటుంది రాతల్లో ఓదార్చుకుంటుంది ప్రేమ అమరం.. కదా! తను మాయమై..మనసుల్ని చంపేస్తుంది.. మనుషుల్ని మాత్రం కొన ప్రాణాలతో నిలిపే ఉంచుతుంది.. అదేమంటే.. కలసి జీవించడం కావాలి కదా అంటుంది. == 26.3.14==

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QfuPAC

Posted by Katta

Abd Wahed కవిత

సాంప్రదాయికంగా గజల్ కు ఉన్న ’’ప్రేయసితో సంభాషణ‘‘ అన్నఅర్ధానికి అనుగుణంగా ఒకే రదీఫ్ ఖాఫియాలతో వీలయినన్ని షేర్లను, ఒక సుదీర్ఘ గజల్ గా తెలుగులో రాస్తే... ఈ ప్రయోగం ఎలా ఉందో పాఠకులే చెప్పాలి. నాల్గవ విడత ఐదు షేర్లను ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. ఇప్పటికి పదిహేను షేర్లు అయ్యాయి. పదహారవ షేర్ మరో మత్లాగా రాశాను. మత్లాతో కలిపి చదివితేనే గజల్ అందం. గజల్లో ప్రతి షేర్ దానికదే స్వతంత్రంగా ఉంటుంది, కాబట్టి ఇలా ఒక యాభై లేదా వంద వరకు షేర్లు రాయాలన్నది ఆలోచన. ఈ ప్రయత్నం ఎలా ఉందో చెప్పడం మరిచిపోవద్దు.. ప్రతిమాట తేటతెనుగు తీయదనము లాగున్నది ప్రతి శ్వాస సన్నజాజి పూలవనము లాగున్నది వెలుగుతెరలు పిట్టల్లా గూడుకట్టి చెట్లపైన చూస్తున్నవి చంద్రముఖికి స్వాగతము లాగున్నది ముత్యాల్లా మిలమిలమని మెరుస్తున్న మాటలు దేవవీణ తీగల్లో సంగీతము లాగున్నది మంచుతెరలొ దాగిఉన్న మల్లెపూల దరహాసం కుచ్చీళ్ళలొ చిక్కుకున్న చక్కదనము లాగున్నది వినువీధిన తారకలే నేలవాలి పోయాయా నీ వాకిట ముగ్గులతో అద్భుతమూ లాగున్నది

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QfuQVb

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hrpN9Q

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

మనం ఏ సమాజం లో వున్నాం మనుషుల మధ్య వున్నామా మృగాలతో కలసి జీవిస్తున్నామా ఏమిటి ఈ పైశాచికత్వం ఎందుకు ఈ విస్రుంఖలత్వమ్ ఈనర రూప రాక్షసులకు నీ నా భేదం లేదు పెద్ద చిన్నా వయో భేదం లేదు పసి పిల్లలనుంచి వయో వృద్దులకు లేదు కదా రక్షణ ఈ నీచజాతి మనుషులనుంచి గుడిసె లో రక్షణ లేదు భవంతులలో రక్షణ లేదు బీద పిల్లలకు లేదు రక్షణ బ్యాంకు అధికారి భార్యకు లేదు రక్షణ పట్టు మని పాతికేళ్ళు వుండవు అత్యాచారాలు ,హత్యలు ఎటు పోతోంది మన రాష్టం వీళ్ళను పట్టుకునే వ్యవస్థ ఏమి చేస్తోంది శవాన్ని అక్కడే వుంచి హంతకులు దారి తప్పిస్తే గుడ్డి అధికారులు అలాగే తిరిగి అధికారులు వెళ్ళిన తరువాత శవాన్ని నదిలో వేస్తె తరువాత పరిశీలనా ఎంత ఘోరం వాళ్ళు పట్టి బడితే జరిగిన అత్యాచారం ,హత్య రోజంతా ప్రచారం చేసి కుటుంబాన్ని మానసిక అత్యాచారం చేసే అధికారం మీడియాకు ఎవడు ఇచ్చాడు ?? హత్య జరిగినది ,హంతకులు దొరికారు చెప్పుకోవచ్చు అత్యాచారం చేసి అని పదే పదే ప్రచారం చేస్తే ఆ కుటుంబ ఏమి అవ్వాలి ఇది ఏమి నీతి ?? ఏమి సమాజం ?? !!పార్ధ !!26mar13

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gBqnXo

Posted by Katta

నవీన్ కుమార్ కొమ్మినేని కవిత

!!నవీన్ కుమార్!!03/26/2014 ఒక వేసవి వాగున నీరల్లే మెరిసినదే నీ రూపం వేకువజామున కిరణంలా తాకినదే నీస్నేహం మేఘమాలవై నామదిలో తాళమే నువై నాహృదిలో నిలిచినావే నిరతమై నా కళ్ళల్లో చిరుదివ్వెల్లే !చ! ఒక మేఘమై నువురావే నీ జడిలో తడపగా నన్నే నెమలిపింఛమౌ నువ్ నా ప్రియ స్వప్నమే నీ తీపితలపులే నిలిచెను నాలో తనువంబరమున తేలే... నీ పాదాలే స్పృశియించే పూమార్గం నేనే !చ! మది అలలనురగలుగ చేరే..అందాల తీరం పలుజన్మలందు నీతోడే ..కోరే క్షణం నీవలపు తలుపులే తెరిచెనునాకై మనమందలమున ఊగే నామదిలోన నిదురించే కలవైనావే (మలయాళం సినిమా "ప్రణయకాలం"లోని "ఒరు వేనల్ పుళ్రయిల్ తెలినీరిల్" అనే పాట స్పూర్తితో నేరాసిందిది. అంతా మేల్ వెర్షనే. కొంచెం సొంతపైత్యం, చాలావరకు అనువాదం.. ఇక్కడ ప్రచురణార్హం కానిచో తొలగించగలరు)

by నవీన్ కుమార్ కొమ్మినేని



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P06uh0

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gBqna6

Posted by Katta

Chakra Pani Yadav కవిత

ఆటవెలది పద్యం నన్నయింట పెరిగి నడక నేర్చిన భాష కృష్ణరాయ కొలువు కులుకు లీని నేటి కవుల చేత నానా రుచుల జూపె తేనె లొలుకు తెలుగు తీపి నెరుగు

by Chakra Pani Yadav



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P06tJV

Posted by Katta

Madhavi Annapragada కవిత

//మాధవి అన్నాప్రగడ//మది గాయం // అక్షరాలకందని శిక్షేదో వేసినా... మది మౌన పోరాటంలో నను బందీని చేసినా.... నీ పేరే లిఖిస్తున్నా ..ఆవిరైన నా ఆశలపైన...!! అడుగుల జాడవి నువ్వైనా ..... నా గమ్యానివి నువ్వని తెలిసినా ..... దిక్కు తోచక ... దిక్కులు చూస్తున్నా అదేం చిత్రమో..!! నీచూపుల తీరంలో కొట్టుమిట్టాడే కోటి కలలు నీ మౌనంలో మరణిస్తున్నాయి .... నీకలవరింతల్లో నాకన్నీళ్లు దాచేస్తూ ఎదచాటు వేదనని నొక్కేస్తున్నా. నీ జ్ఞాపకాల ఒంటరితనంలో పూర్తిగా ఓడిపోయి .. తప్పక చేస్తున్నా మదిని ముక్కలు... గాయం నాకే అని తెలిసినా... అందుకేనేమో......!! నిన్న నా కౌగిలిలో ఒదిగిన నువ్వు... నేడు నా అక్షరాల్లోనే మిగిలిపోయావు.....!!! 26/03/14

by Madhavi Annapragada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jHDC6H

Posted by Katta

Jwalitha Denchanala Jwalitha కవిత



by Jwalitha Denchanala Jwalitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dqngkA

Posted by Katta

Ramadasu Tanguturi కవిత

తెలుగు జాతి మనది..26-Mar-2014/Ramdas తెలుగు జాతి మనది..రెండుగ విడిన జాతి మనది.. జాతి గౌరవం మోకరిల్లగా..విశాలంధ్రకు వేరు శాసనం..! ||తెలుగు జాతి|| తెలంగాణం ఒక త్రికోణం.. ఆంధ్ర ప్రాంతమొక అగ్ని పర్వతం.. రెండిటి మధ్య ఆగాధం..పూడ్చడమే మన విధానం..! మూడు లింగముల పేరుతో..ముచ్చటగా వెలిగిన మన తెలుగు..! ముక్కల చెక్కల చిక్కులతో..ఉక్కిరి బిక్కిరిగ మిగులు..! ||తెలుగు జాతి|| గౌతమి క్రిష్ణలకేం తెలుసు..అంధ్ర గుండెలొ ప్రాకారం..! బంగళాఖాతం చేరిక ముందరే..బంధువులిద్దరి వివాదం..! ఆనకట్టల ఆయకట్టులతొ..ఆన్నపూర్ణకు ఆటపట్టుగా వెలిగిన భూమి..! అన్నదమ్ముల ఆవేశంతొ..మనకిపుడు తరతరాలకు తీరని లేమి..! ||తెలుగు జాతి|| రచన: టి.వి.రాందాస్ సెల్:+91 9010474244

by Ramadasu Tanguturi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jHDzrD

Posted by Katta

Chi Chi కవిత

_రెండు రాళ్ళు _ జ్ఞాపకమే జ్ఞానమంతా!! చొరవ చేసే మర్మమేదో చెరిగిపోదని జన్మలో వెలుగు తానని తెలిసి కలిగిన చీకటెoతో చేటని నివురులూదిన నోటి మాటకు ఎదురుతిరిగిన కాంతికి జారవిడచిన దారులన్నీ ఒక్కదారై ఎదురుపడితే!! మరలిపోదది మాటచాటున మర్మమో అది మంత్రమో మనది కాదది మనసు చాటున మౌనమో అది మాయమో వినదు చెప్పదు వింత కాదు , వదిలిపోదూ తిరిగిరాదు సాకుతానని సామెతంటే , సాగమనటం పాటి కాదు!! మూలమేదని మాటలంటే , మాటలేదని మూలమన్నా మూల మాటల మూలమేదో మరిచిపొమ్మని మౌనమన్నా ప్రాణమిక్కడ పాతుకుందని పాత కాదని కొత్తదన్నా కొత్తదేదని కొమ్ములొచ్చిన కోరికేదో కోరనన్నా అయినదంతా మరచిపోయినా అయిన వారం కాకపోము జ్ఞానమైనా మరిచిపోయే జ్ఞాపకాలం కాదు మనము రెండు రాళ్ళకు ఊపిరొస్తే రాళ్ళు రాళ్ళే కాళ్ళు రావు కాంతి కల్పిన కార్యమేదో కాకపోదది కాస్త మేలు!!___(26/3/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jHDzaY

Posted by Katta

Sana Chittaluri కవిత

'చిత్తలూరీలూ మనసులో వుంటరు, మాటల్లోకి రారు. చూపుల్లో వుంటరు, కల్లల్లో ప్రతిబింబమై మెరవరు. ఊపిరిలో వుంటరు, చిరుగాలై తాకరు. మన గుండె గదుల్లో మౌనంగా తిరిగే సీతాకోక చిలుకలు కొందరు...! చిత్తలూరి 9603254546

by Sana Chittaluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jHjkKH

Posted by Katta

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి || దగ్ధ మోహన గీతం !! || కరకు శిలా పుష్ప పత్ర ఆకు రాగపు శిలాజం జ్వలిత నేత్ర పర్వత నయనం అరణ్య వీణ కొ౦డ గుహలో నాదం ! ఇసుకరేణువుల కేంద్రకాల్లో ప్రకంపన కడలి అడుగున తడబడ్డ కెరటం గుడ్లగూబ నేత్రపు చూపుల్లో అంగారక సౌందర్యం !! గబ్బిలాలబిలాల్లో చలరేగిన ఆర్త నాదం తాజ్మహల్ పునాదుల్లో పావు ‘రాళ్ళు’!! ఎండమావుల్లో చంద్రవదన మాయా మొహం దాహం తీరదు ! అగ్నిశిఖల్లో ఆవిరి చినుకు కునుకు తీస్తూ ... శిథిల ఆలయాల్లో సమాధైన ఓంకారం! పూల పెదాల సుధల్లోకి జాలువారిన అక్షరం పొన్న చెట్టు వేళ్ళ అడుగున సన్నాయి పాట వింటూ సమాధి ఆత్మల తన్మయం ! నెత్తుటి ద్వారాల్లోనుండి జాలువారిన వెన్నెలని కాల్చిన లావా ! బిచ్చగాడి పళ్ళెం లో పరవశిస్తున్న oనాణెం, ఖణ్ ఖణ్ మంటూ ...! చర్చి గంటలు ఆకలి మంటలకు తోడయి జ్వలిస్తూ ...! నక్క స్వప్నంలో నగ్నమైన యువరాణి పరాభవానికి తోడేళ్ళ దండోరా ! నీరెండిన భావిలోని కప్ప కన్నీటి కొలనులో విచ్చుకున్న కలువ ఆరే ఆఖరిదీపం ! రాలు పూల పాటల్లో రెల్లుగడ్డి పూల గర్జన! గడియారపు ‘ముళ్ళు’ దిగి ఉబికిన రుధిర వరదల్లో చేపల హంగామా !! వడ్రంగి పిట్ట చెక్కిన బొరియల్లో ని వజ్రాల మూటల రాశులకి కాపలా వున్నా కాల నాగులు ! కోన ఊపిరిని కొవ్వత్తిని చేసి ప్రాణ దీపాన్నాపే శ్రామికుని గొంతు పై వేలాడుతున్న ఖడ్గం ! కుత్తుకల్ని కోసే కసాయి స్వప్నాకాశాన కారుణ్య జాబిలి ! మన్మధున్ని కాల్చేసిన విభూధి నుండి ఉన్మాది ఆధ్యాత్మికం ! చీమలు వెంటే గొర్రెలు మేకలు ... చిలుక పలుకుల సారంగి ! నెమలి మా౦సం తింటూ జాతీయ గీతం పాడే ‘మార్లు మాతంగి’ సవా లక్ష భిన్న పూల విలక్షణ కాందీశీక కవి సంచి నిండా కమిలిన, అమలిన అక్షర పుష్ప భాష్పాలు !! -----------------26 -03 - 2014

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h8VpES

Posted by Katta

Ramadasu Tanguturi కవిత

---Notuku votu...25-mar-2014----

by Ramadasu Tanguturi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jHjhhX

Posted by Katta

Sri Venkatesh కవిత

కవిత : ఓడిన జీవితాలు గెలిచిన బ్రతుకులు ప్రస్తావన : నచ్చిన పని చెయ్యలేక తన దగ్గరకొచ్చిన పని చేస్తూ, చస్తూ బ్రతికే మనుషుల గురించి!!! మిత్రమా!!! ఇక బ్రతుకుదామా ప్రస్తుతానికి బ్రతుకుతూ చస్తున్నాంగా ఇకనైనా బ్రతుకుదామా??? చస్తూ కాదు బ్రతుకుతూ!!! బహుశా మనమేనేమో నడుస్తున్న శెవాలం, మనమేనేమో స్నానం చేసే సమాధులం, మనమేనేమో అత్తరు జల్లుకునే ఆత్మలం, ఎందుకు మిత్రమా మన నవ్వులోనే జీవముండదు, మన కళ్ళల్లోనే కలుండదు, ఈ సూచనలు నువ్వు నేను ఎదురైనప్పుడు నీ కళ్ళల్లో నాకు నా కళ్ళల్లో నీకు మాత్రమే కనిపిస్తాయ్!!! హ హ హ: ఏమోలే మన చుట్టూ ఇంకెన్ని శెవలున్నాయో ఎవరికి ఎరుక!!! ఆకలేస్తుంది తినేస్తాం, దాహమేస్తుంది తాగేస్తాం, నిద్రొస్తుంది పడుకుంటాం, ఇవన్నీ చస్తూనే చేస్తున్నాం!!! కాని బ్రతకాలనుకున్నప్పుడే నిద్ర కి చోటు, ఆకలికి మేత, దాహానికి నీరు, ఉండవనే భయంతో ఆ స్మశానం నుండి బయట పడలేకపోతున్నాం బ్రతకలేకపోతున్నాం!!!! బ్రతకాలనుంది మిత్రమా చస్తూ కాదు బ్రతుకుతూ, నచ్చిన పని చేస్తూ ఇష్టమైన కష్టంలోనే బ్రతకాలనుంది మిత్రమా!! ఊపిరి పీల్చుకునే పీనుగుల్లా వద్దు ఊపిరి ఆగినా పర్లేదు చచ్చి బ్రతుకుదాం, ఏమంటావ్!!!! Date : 26/03/2014

by Sri Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h8Vngg

Posted by Katta

Vijaya Bhandaru కవిత

Nenu rathri niddura poyanani anukunnanu, kaani nee jadale nannu melakuvalone unchayani thelisi bhayamtho lechi chuaste kala karigi nannu thatti lepayee ninna vellipoyindi nedu melkonamani

by Vijaya Bhandaru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gABBLY

Posted by Katta

Srinivas Vasudev కవిత

వాసుదేవ్ //యుటోపియా// -------------------------- ఇంకా అంతా అయిపోలేదేమొ ముగింపు వెతుక్కునే ఆరంభం మొదలిప్పుడె * * * ఓ హక్స్లి మళ్ళీ రాస్తాడు బాధల్లేని 'కొత్త ప్రపంచం' రక్తచారికల్లేని చరిత్రా, మానభంగాల్లేని మరో చరిత్రా మరో ఇలియెట్ ఓం శాంతి, శాంతి, శాంతిహి జపం చేస్తుంటాడు……. మరణం తన మారణాయుధాన్ని వెనక్కి తీసుకుంటుంది కాలానికి ఇక కాలం చెల్లినట్లే అని జీవితం ప్రకటిస్తుంది ఈ సారి సోక్రటీస్‌‌ని బతికించుకుందాం ప్రవక్తని మాట్లాడనిద్దాం, శిలువని దాచేద్దాం సత్యమేంటో చెప్పనిద్దాం, కనీసం ఈ సారైనా! జెస్టింగ్ పైలేట్‌‌ వ్యాసుడి అవతారమెత్తుతాడు * * * ఈ సారి ఇలా పాడుకోవచ్చు మనందరం కోరస్ గా.... గతాన్ని చెరిపేయ్, చరిత్ర రక్తచారికల్నీ తుడిచేయ్ కాలాన్ని నాశనం చేసేయ్, వయసునీ తరిమేసేయ్ జీవితమెప్పుడూ దానిపాటదే పాడుకుంటాది దాని చరణాలవే రాసుకుంటూ....దాని పల్లవుల్ని అదే కీర్తిస్తూ * * * దేవుణ్ణి శాసించే మనిషి పుడతాడు మనిషికి గుడికట్టె దేవుడూ అవతరిస్తాడు వాల్టర్ మిల్లర్ వేదవాక్యం అప్పుడైనా అర్ధమవ్వాలి 'నీకంటూ ఆత్మలేదు, నువ్వే ఓ ఆత్మ--నీకున్నదో దేహం' * * * ఇంకా ఏమీ అయిపోలేదు ఇప్పుడె మొదలు.... బ్రహ్మాండమైన మొదలిదే అసలుసిసలు యుటోపియా మొదలిదే 26.మార్చి.2014

by Srinivas Vasudev



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fZVG8u

Posted by Katta

వెంకట చలపతి బాబు కూరాకుల కవిత

కూరాకుల వెంకట చలపతి బాబు|| మరోసారి ౠజువైంది || చూశారా! ఈ ఘోరం!! ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ గుండెలు రగిలే అగ్నికణాలైనాయి.. నవమాసాలు మోసిన మాతృపేమ ఒక్కక్షణం లాలిపాటను మరచి మృత్యుఘోషను ఆలపించింది.. గుండెలపైన ఆడించిన ఆ చేతులు గొంతు నులిమేశాయి తడబాట్లను సర్దిచెప్పిన ఆ మనస్సు ఎందుకో మరి పాషాణంగా మారింది.. కూడు పెట్టని కులం కన్నవాళ్ళ మదిలో రెప్పపాటు కారుమేఘమై కమ్ముకుంది పేగు బంధం యమపాశమై కన్నకూతురిని బలి తీసుకుంది.. మతం అనే మూర్ఖత్వం కులం అనే వ్యసనం మరో జీవితాన్ని బలి తీసుకున్నాయి.. మనిషి మనిషిని మనిషిగా చూడలేడని మరోసారి ౠజువైంది 26-03-2014

by వెంకట చలపతి బాబు కూరాకుల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fZVFS6

Posted by Katta

Chennapragada Vns Sarma కవిత

నా గుండెలాకర్ నిండా నువ్వే.. ప్రేమతాళంచెవితో తెరిచిచూడు ..@శర్మ \26.3.14\

by Chennapragada Vns Sarma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jGshnD

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ఇప్పుడేం కులం మీది? ఇప్పుడేం కులం మీది? రక్తం నిండా కులకాలుష్యం నిండి కులపిచ్చితో మిమ్మల్ని మీరే కోల్పోయారే ప్రేమించి పెళ్ళి చేసుకుందన్న నేరానికి మీ కన్నబిడ్డని మీరే అత్యంత పాశవికంగా కడతేర్చారే మానవత్వానికే మాయని మచ్చ తెచ్చారే భగవంతుండే కన్నీరు పెట్టుకునేలా చేశారే ఇప్పుడేం కులం మీది? అందుకే; ప్రకృతి మిమ్మల్ని వెలివేసింది ఆకాశం మిమ్మల్ని వెలివేసింది మీ మనసూ మిమ్మల్ని వెలివేసింది మీరు ఇప్పుడే ఎక్కడున్నారో చూసుకోండి సమాజం మిమ్మల్ని వెలివేసిందో లేదో తెలియదు చట్టం మిమ్మల్ని శిక్షిస్తుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మీరు బ్రతికే ఉన్నా చచ్చిన దెయ్యాలే మీరు అంతం చేసిన ఆ ప్రేమ కుసుమం మాత్రం ఆకాశంలో నక్షత్రంలా ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది! 26Mar2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OYBZYF

Posted by Katta

Krishna Mani కవిత

చెత్త బతుకు *********** చేతిలో మొల గుచ్చిన కట్టే సంకకు సంచి తెగిన చెప్పులు సుడ సక్కని పకీరులం మాలెసపోద్దుకు మునుపే లోకానికి బరువైన సొత్తుకై ఉరుకులాట ఎక్కువ బతుకులను నింపడానికి ! కుక్కల పందుల సహచర్యం ఆకలిడోక్కల ఆరాటం పాషిన వంటలు మురిగిన పళ్ళు పారేశిన కుప్పల అధికారులం ! ఇనుము ప్లాస్టీకు కాగితాలు ఇవే కదా ఆధారం ఇదే మా జీవితం విసిరిన వస్తువు కంటికి ఇంపు మంచివి చెడ్డవి అన్నీ మావే బరువును పెంచుతూ ఆశలు అల్లుతూ రేపటి రోజుకు చెదరని చూపు ! తక్కువగాని చెత్త నోయ్యని కాలు పగలు దాటితే సాగని నడకలు చేరని తీరం దించిన మూటలు అమ్మిన కష్టం అందిన సొమ్ముతో మొఖాన ఆరని వెలుగు మురిపెం ! లోకం మురికిలో మసలే ముల్లుజల్లలం బతుకు అడవిలో నిత్య వేటగాల్లం ! కృష్ణ మణి I 26-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rxUAdm

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

!! నీవు ఎవరో తెలుసుకో !! ప్రపంచానికి పగలు సంతోషం రాత్రి దుఖం ఎక్కడ పగలు వుండదు రాత్రి వుండదు ఇది ఒక కాలచక్రం కష్ట సుఖాల సమ్మేళనమే జీవితం వాటితో కలసి వున్నా సంబంధం లేకుండా వుంటుంది కళ్యాణ మంటపం నిండా బంధువులు ఆనందం కేరింతలు పెళ్లి అయిన తరువాత అంతా వెళ్లి పొతే కళ్యాణ మంటపం నిస్తేజం గా నిర్మానుష్యం గా మిగిలిపోతుంది నిన్న వున్నా ఆనందం తనది కాదు అన్నట్లు మహాప్రస్తానమ్ నిండా బంధువులు బాధ , నైరాశ్యం చితి అయిపోయిన తరువాత ఎవరు వుండరు మహాప్రస్తానం కుడా నిస్తేజం గా చూస్తూనే వుంటుంది నిన్నటి బాధ వైరాగ్యం నాది కాదు అన్నట్లు ప్రకృతిలో ఇవన్నీ మనకు సాక్ష్యాలే పెళ్ళిలో మహా ఆనందం అక్కడ శాశ్వతం కాదు మహాప్రస్తానం లో వైరాగ్యం ఎప్పుడు శాశ్వతం కాదు నీవు శాశ్వతం నీ ఆలోచన శాశ్వతం నీవెవరో తెలుస్కో నీ అసలైన ఆనందం ఏమిటో తెలుస్తుంది దీనికోసమే ముముక్షువులు , యోగులు ,చేసే సాధన నీవు ఎవరో నీకు తెలిస్తే నీకు ఆనందం లేదు , బాధ అసలే లేదు !!పార్ధ !!26mar 14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OYBZI4

Posted by Katta

Sriramoju Haragopal కవిత

వుయ్యాల జీవితం గాలిపొరల్లో నా మాటలు, పాటలు, నా దుక్కాలు నా వాగ్దానాలు వుండే వుంటాయి వెలుగుల్లో వుండేవుంటాయి నా కంట్లోని చిత్రాలు, మెరుపులు మరకలు, వానతడి సింగిడీలు మొగులు మీది జారేటి మబ్బులు నేలమీద రాసిన మెరుపుల రాతల్లో నా రుతువులుండే వుంటాయి పారేటి కాలువల్లో పారబోసుకున్న పచ్చివిత్తనాల మొలకనవ్వులు దాచుకునేవుంటాను దున్నిన పొలాల్లో నాగేటిసాల్లళ్ళో నా బతుకమ్మ నన్నెత్తుకుని పాలిచ్చి పాలించే వుంటది ఎన్ని కన్నీళ్ళు గుండెమత్తళ్ళు దుంకినా భరోసా యిచ్చిన మనుషుల మనసుల వేల చేతిస్పర్శలుండే వుంటాయి లేకపోతే... నేనె్ట్లా జీవించివుందును ఎవరో నన్ను ఆత్మీయంగా మోహనం చేయకపోతే ఎవరో నన్ను నా సమస్తదోషాలను ఇగిరించి మిగిలించకపోతే ఎవరో నన్ను నా చిన్ని చిన్ని ఈస్థటిక్స్ ని ఒప్పుకోకపోతే ఎవరో నన్ను నన్నుగానే ప్రేమిస్తూ వుండకపోతే నేనెట్లా సాగుతున్నయాత్ర నయ్యేవాడిని మరుపురాని బాటలెన్ని తిరిగినానో మనసునింపిన తోటలెన్ని గడిపినానో ఆకాశమార్గాన పాఁవురమున్ననా కలలెగిరిపోతున్నా నా ఆకలి తీర్చింది నా మట్టితల్లే

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gA3uUs

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | బ్రతుకాటలు --------------------------- అమ్మతో దోబూచులు, ఆపై దొంగాటలు, ఇంకెన్ని వినోదాలో, వింత వింతలుగా విరామం లేకుండా అపుడాడింది, ఇపుడు ఆడించబడుతుంది నేనే. ఆటలే బ్రతుకున కలిగిన ఆకళింపు, ఇకిప్పుడు అలుపెరుగని ఆటగత్తెను. ఎన్నెన్ని ఇసుకగూళ్ళు పొందిగ్గా తీర్చిదిద్దానో: అల్లుతున్న ఈ ఒక్క పొదరింట ఇంకేదో మిగిలేవుంది, గూడు పేర్చుకుంటూ ఆట కాని ఆట నడుస్తూనే వుంది. పేక మేడలు, పడినవెన్నో, పేర్చినవన్ని. అడియాసల పునాదుల సాటిగా నిత్యం ఆశల సౌధాల కట్టుబడి- ఇపుడూ వూహల్లో రధం ముగ్గు- పుష్పకమంత, పూలతేరుకెంత అందమే! రాణి నేనే, రారాజ్ఞి నేనే, సారధీ నేనే, సమాయత్తమూ నాదే. వినువీధుల విహరించినా, ఏ వూరు వాడల వెళ్ళివచ్చినా, ఆగని ఆ పయనాలే నా వాస్తవ వాహనానికి ఇంధనాలు. స్తంభాలాటలో ఓడిందెన్నడటా! విజేతననా, విధి చేత చిక్కాననా ఇంకా సాగుతుందది? కాలాతీతమైతే, కాలం కలిసిరాకపోతే నిట్టూర్పు వేదం. విధి అనుకూలిస్తే, ఘటన కలిసివస్తే ఆనంద సంభ్రమం. ముగింపు లేనివన్నీ, నిర్ణేతలే లేని నా బ్రతుకాటలు. 25/03/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gA3tjd

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy || నీ "జ్ఞాపకం" నా మనసుపై దాడి చేస్తుంది || ------------------------------------------------------------------------ పగలంతా ఒద్దికగా కూర్చున్న జ్ఞాపకం ఉండుండి వీచేగాలిలా వళ్ళు విరుచుకుని రాత్రి నా మనసుపై దాడి చేస్తుంది మనసు వాకిలి పొడవునా రాలిన పారిజాతాలతో కాసేపు గతి తప్పిన అక్షరాలతో అక్షరాభ్యాసం చేసుకోవాలి! మనస్థాపాల మసకతెరలను దాటుకోవాఅని నన్ను నేను దాచుకొని పరిగెత్తుతున్నా నేను నానీడ తొ గొడవపడాల్సి వస్తుంది అందుకే ఈ నిశిరాత్రిని ఈ నింపాది రాత్రిని నీకు పరిచయం చేయాలి అందుకే నీకోసం వెతుకుతున్నా కాస్త కనిపించవూ .. కటిక చీకటిలో మనసుపై మిగిలిపోయిన ఆఖరి కన్నీటి చారికను అదృశ్యం చేస్తూ చీకటి చిక్కపడుతుంది.. ఆకాశమల్లెలు ఒక్కొక్కటిగా విరబూస్తాయి నాలుగు మాటలు చెప్పుకోడానికో లేక తప్పిపోయిన కలల్ని వెదుక్కోడానికో ఓంటరిగా ఆకాశంవైపు చూస్తు ఆక్షనంలో ఏం చేస్తున్నావంటూ నీజ్ఞాపకం నన్ను ఆడిగితే ఏమని చెప్పను ఎందుకో అనిపిస్తుంది జ్ఞాపకాల శకలాలనీ.. సుదూర స్వప్నాలనీ పగటి పాట్లనీ వాటంతట వాటికి వదిలేసి ఈ రాత్రిని జీవించాలని ఉంది నాలోకి నేను కాకుండా నా నించి నేను దూరంగా.. నన్ను నేను గా ముక్కలుగా వేరుచేసి విసిరేస్తూ తేలికై పోవాలి.. నాలో నేను ఏకమై పోవాలి జాబిల్లి ఆకాశంలో ముసిముసి నవ్వులు నవ్వుతోంది అది జరిగదులే అని వృదారయాస అని నిజమే కదూ

by Aduri Inna Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gA3uDU

Posted by Katta

Kodanda Rao కవిత

కె.కె.//గుప్పెడు మల్లెలు-70// ************************** 1. కారణాలు వెదక్కు, కాలేదని చెప్పడానికి, ఫలితాలు దొరకవ్ ఎప్పటికీ 2. దుఃఖాన్ని పంచెయ్, సంతోషం పెంచేయ్, నలుగురూ ఉంటే సుఖమదేనోయ్. 3. భయమెందుకోయ్ నీకు, వాడెవడో కిందకి లాగుతాడని, వాడున్నది నీ కిందనేగా 4. టైములేదెవ్వడికీ ఇక్కడ, నిన్ను ముందుకి తోసేందుకు, ముందడుగెయ్యాల్సింది నువ్వే...మార్పుకి 5. ఓడానని అనుకోకు, మరు ప్రయత్నం చేస్తున్నంతవరకు, ఆడుతున్నావనే అర్ధం. 6. ఎం సీలో,ఫెవికోలో ప్రతి పగులుకి ఒక మందుంటుంది, విరిగినట్టేడుస్తావేరా వెర్రోడా 7. కాళ్లు తడిపిందని కాస్త ముందుకెళితే, కాటికంపదా సముద్రం, తెగేదాక లాగొద్దు... నీలో శత్రువే అహం. 8. వాదిస్తేనో, వేదిస్తేనో నమ్మకాలు మారవ్, నిజం నిరూపించాలంతే 9. తెల్లగోడకే పంది వీపురుద్దేది, అతిజాగ్రత్తకి పోతేనే, అపాయం ఎదురయ్యేది... కదూ! 10. సామాన్యుడికి, అసమాన్యుడికి తేడా... ఆడుపడే కష్టం. =================== Date:26.03.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Qd2xXe

Posted by Katta

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || ప్లాస్టిక్ అల్లికల ప్రజాసేవ ఊరించేవాడు చేతులెత్తేస్తే ఊటలింకిపోతున్నాయి. ఆశలెగిరిపోతున్నాయి. ప్లాస్టిక్ ఎమోషన్లు ఎప్పటికీ ఇంకిపోక ఎడద కంతా కీడుచేస్తున్నాయి. విలన్ లానే కనిపించే విలన్ కంటే హీరో ముసుగుల వలకే ప్రమాదమెక్కువ. జీవితంలో ఖాళీలనో జేబుల్లో ఖాళీలనో కుర్చిలో దర్భాల వెలితినో నింపేందుకు ఒంపుకునే పేరేనా ప్రజాసేవంటే? జాలంటే ఒక బలిసిన స్వార్ధం అయినపుడు సమానత్వం కావలసింది నీ వాటా పంపకాలకేనా కులాల గుర్తొచ్చేది కట్టగా నీ జేబులో మడిచి పెట్టుకునేందుకా? సేవంటే ప్రచార ఆర్భాటానికో చక్కటి ఎర అయినపుడు దేవుడా దేశపు దేహా్న్ని నువ్వైనా రక్షించ గలవా ? నాకిప్పటికీ అర్ధంకాదు కుర్చీలో కూర్చుంటేనే సేవకు చేతులొస్తాయా? కిరీటం పెట్టుకుంటేనే పరిష్కారాలు కనిపిస్తానంటాయా? నోటూ, నాటు లాగానే మాసు హిస్టీరియా ఘాటెక్కించినపుడు? ఫేసు హిస్టరీలు పోటెత్తినపుడు మేఘమా నీవైనా మడతల మత్తుదించగలవా? నోటు ఊపినా జనం నోటా బాట పడతారేమోనని నీటుగా దిగిన పోటుగాళ్ళెందరో పుట్టగొడుగుల నీడలోకి పీలుస్తున్నారు. నిభందనల రూళ్ళకర్ర నీడలో, కట్టలపాములు జరజరా పాకుతూ విషాన్ని వదిలే మార్గాల్ని వెతుక్కుంటున్నాయి. కాయ్ రాజా కాయ్ ఒకటికి ఐదు, ఐదుకి వంద ఈ చక్రంలో నోట్లు పోస్తే నువు మోయగలిగినంతై తిరిగొస్తాయ్ ఓసినా సిరా రాసిన వేలా చీకట్లు విస్తరించకుండా జరాసంథులని పురిట్లోనే నొక్కేయగలవా? ఇవ్వాళ వలలో గాలాలో గాలిలో ఊపేవాళ్ళందరూ చేపల సాగుదార్లు కాదు ఐదేళ్ళకు సరిపడా మసాలా నూరుకొచ్చారు. కుదరితే కొడుకులకూ మనవళ్ళకూ శీతలగిడ్డంగుల్లో దాచే మార్గం చూసుకునే దూకుతారు. ఓ ఎరా, పిచ్చిచేప నోట్లో నీళ్ళూరకుండా నీవొక ఉపాయం గానీ చెప్తావా ఏంటి? తర్వాతైనా చేపలు పట్టడం నేర్చుకునే తీరిక మాకేం లేదు కానీ ఓ దొరా, కూసింత పులుసుంటే నా సట్టెలో పోసెళ్ళు పెబువా. ►26-03-2014 http://ift.tt/1gyvN5A

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gyvN5A

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

....॥అల్లరి ఆలోచన ॥..... ఒక ఆలోచన పిల్లిలా దూరుతుంది సడీ చప్పుడు లేకుండా మనసులోకి కాళ్ళకు వెల్వెట్ చెప్పులు తొడుక్కొని. ఒక సారి వేణువును ఊదు తున్న పిల్లగాలై ఎద తలుపు సందులోంచి తోసుకొస్తుంది. మరోసారి ఝంజామారుతమై నా కిటికీని బద్దలు కొడుతుంది. ఒక్కోసారి కాళ్ళకు గుదిబండలు కట్టి నన్ను ఊబి లోకి తోసేస్తుంది. కొన్ని సార్లు నా ఎడదకు రెక్కలు కట్టి ఆకాశంలోకి ఎగిరేస్తుంటుంది. ఈ తుంటరి ఆలోచనతో చావుకే వచ్చింది పిల్లనగ్రోవిని నా చేతిలో కుక్కేసి నన్ను కవిత్వం చేసే దాకా నిన్ను వదలనంటుంది.

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gyvMyB

Posted by Katta

Santosh Kumar K కవిత

|| కాశ్మీర దర్శనం || శీర్షిక : గత వారంలో నేను చేసిన వినోద యాత్ర లో ఆ ప్రకృతి మాత నాతో రాయించిన కవితాక్షరాలివి!!! తరగని అందానికి తను నిలయం అలుపెరుగని ఆహ్లాదం తన సొంతం విసుగనిపించని విస్మయాల విశ్వం అంబరాన్నంటే ఆనందానికి ఆలయం వీటన్నింటికి ఒకటే గమ్యస్థానం భూలోకస్వర్గమైన కాశ్మీరం... దూరాన తెల్లటి పరదాల వెనుక ఎత్తైన శిఖరాలను చూస్తుంటే మనిషి కోరికలను పోలినట్టు అనిపిస్తూ కోరికల వేటలో భయం ఆశలను కప్పి ఆశయాలపై అసహ్యాన్ని కలిగిస్తుంటే ఆ దేవుని అక్షింతల రూపంలో కురిసే మంచు వర్షాలు నింపే స్పూర్తికి భయం భస్మమై హిమములా మారినట్టనిపిస్తుంది.. అంతేకాక వణుకెరుగని ఆ హిమ నందనాన్ని గమనిస్తే కార్యసాధనలో పట్టువీడని మానవ ప్రయత్నాన్ని గుర్తుచేస్తూ.. కాల గమనంలో అనుక్షణం ప్రకృతి, మనిషి రెండూ సమానమని తెలుస్తుంది... అనుక్షణం అబ్బురపరిచే అద్బుతాల సమాహారంతో ఎన్నో కోణాలను పరిచయంచేసే జీవిత ప్రతిబింబం వాల్మీకి ఎరుగని మనోహరమైన సుందర కాండం తప్పకుండా చెయ్యవలసినది ఈ కాశ్మీర దర్శనం... #సంతోషహేలి 25MAR14

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gyvNTa

Posted by Katta

Pusyami Sagar కవిత

సాహిర్ భారతి రాసిన కవిత !!ఒక ప్రయాణం!! కవిత్వ విశ్లేషణ జీవితం ఓ ప్రయాణం లాంటిది, బాల్యం నుంచి వృధ్యాప్యం వరకు ఎన్నో అనుభవాలు మనల్ని దాటుకుంటూ వెళ్తాయి...కొన్ని తీపి అనుభవాలు అయితే మరికొన్ని విషాద భరితాలు కావొచ్చు ....ఒక మజిలి లో కలిసి విడిపోయిన నేస్తాన్ని గుర్తు చేసుకుంటూ గుండె ను స్వాంతన పర్చుకుంటాడు కవి తన కవితలో ...ఆద్యంతం గుండె ను తాకి కన్నీరు పెట్టిస్తుంది స్నేహితురాలిగా దగ్గరయ్యావు//నాకు తెలియని ప్రపంచం ఉందని నీ అడుగులతో దాన్ని పరిచయం చేసావు పై పంక్తులలో రెండు దశలు , స్నేహానికి ముందు ...తరువాత కలిగిన మార్పులను అవగాహన చేస్తూ ...ముందుకు వెళ్తున్తున్నాను అని తనలో తానూ మననం చేసుకుంటూ అంతరాత్మ తో జరిపే సంభాషణ వ్యక్తి యొక్క సున్నితత్వాన్ని తెలుపుతుంది ..అలాగే..ప్రేమ ఎప్పుడు పరిచయం తో మొదలు అయ్యి , స్నేహం గా మార్పు చెందుతూ చివరకు ప్రేమ గ స్థిరపడి పోతుంది ఒక పశ్యతాపం, వేదన అంతరంగం లో కన్పించిది ...తను ఎంతగానో ఇష్టపడి వలచినపుడు , దూరం గా వేల్లిపోతున్నప్పుడు మనసు పడే వేదన చెప్పనలవి కాదు ....ప్రాణం గా ప్రేమించిన వ్యక్తులు దూరం అయితే అది దేవుడు కూడా బాధ ని తీర్చలేదు ఏమో ...తను వేరొకరి తో ముడిపడి సాగిపోతే...అ విడిపొఇన సందర్బాన్ని గుండెలో దచేసుకునంది నేస్తం నేను ఇంకో ఆత్మకు దగ్గరైనా//ఆకాశమంత బాధని నీ గుండెలో కప్పేశావు కులమతాలు ప్రేమ కి అడ్డు వచ్చినా అక్కున చేర్చుకొని, అమ్మ ప్రేమ ని కూడా మరిపించేలా చేసిన స్నేహితురాలి కి కన్నీటి తో దారులు పరుస్తాడు కులమతాలు వేరైనా ,సరిహద్దులు మింగి//నన్ను నీవాడిలా చూసావు//అమ్మచేతి వంటనే మధురమనుకున్న నాకు //నీ చేతితో ఆకలిని తీర్చావు ఆకర్షణ కి ....నిజమైన ప్రేమ ని తేడ చూపించి జీవితం లో ముందుకు సాగేల చేసింది స్నేహితురాలే కదా..అడుగు లో అడుగు వేస్తూ భూమి పై నే కాదు జీవితం లో కూడా చేయి పట్టుకు నడిపించి ఆమె కాదా... నీ అడుగులలో అడుగులువేసి// భూమిపైనే కాదు,జీవితంలో నడిచేలా చేసావు///ఆకర్షణకి నా ఆలోచనలకి విభిన్నంగా// నా ఆలోచన నే నీ ఊపిరి గా తీసుకొని గమనం సాగితున్న, నేను నీ దారి విడిచి, మరొకరి చేయి పట్టుకొని వెళ్ళినప్పుడు, నీ గుర్తులను వెతుకుతూ వెనక్కి తిరిగి చూసినపుడు నువ్వు లేవు ....నా అడుగులకి ఇక సెలవు అంటూ ఎగిరిపోయవు అంటూ కన్నీళ్ళు కురిపించాయి //నా ప్రతి శ్వాసకీ నువ్వు ఊపిరి తీసుకున్నావు//ఇక,నీ బాటలో నా అడుగులకి స్థానం లేదని ఎగిరిపోయావు// ఇంత దాక నిరాశ ని నింపుకొని నిస్సారం గా కొనసాగుతునప్పుడు కళ్ళలో ఏదో ఆశ మల్లి ఎప్పుడైనా కనిపించి తిరిగి తన అడుగు లతో పయనం సాగిస్తుంద అని ... జీవితంలో ఏదో ఒక బాటలో మరల//మన అడుగులు కలిసి//ప్రయాణం చేస్తాయని ఎదురుచూస్తు…// సాహిర్ భారతి గారి కవిత లో ఆర్దత వుంది ....మనసు ఎంత గా విచలితం అయ్యిందో, స్నేహితురాలు దూరం అయినపుడు తను పడే బాధ ని మనము అనుభవించేలా చేసారు ...హృదయానికి హత్తుకునేల రాసిన సాహిర్ గారికి అబినందనలు ..మరిన్ని మంచి కవితలు రాసి అలరించాలని ఆసిస్తూ ... సెలవు .. పుష్యమి సాగర్. ఒక ప్రయాణం ........................................ స్నేహితురాలిగా దగ్గరయ్యావు నాకు తెలియని ప్రపంచం ఉందని నీ అడుగులతో దాన్ని పరిచయం చేసావు నేను ఇంకో ఆత్మకు దగ్గరైనా ఆకాశమంత బాధని నీ గుండెలో కప్పేశావు ఒకరోజున నీ అడుగులలో అడుగులువేసి భూమిపైనే కాదు,జీవితంలో నడిచేలా చేసావు ఆకర్షణకి నా ఆలోచనలకి విభిన్నంగా ప్రేమ ఉంటుందని తెలియజేశావు అమ్మచేతి వంటనే మధురమనుకున్న నాకు నీ చేతితో ఆకలిని తీర్చావు కులమతాలు వేరైనా ,సరిహద్దులు మింగి నన్ను నీవాడిలా చూసావు నా ప్రతి శ్వాసకీ నువ్వు ఊపిరి తీసుకున్నావు ఇక,నీ బాటలో నా అడుగులకి స్థానం లేదని ఎగిరిపోయావు జీవితంలో ఏదో ఒక బాటలో మరల మన అడుగులు కలిసి ప్రయాణం చేస్తాయని ఎదురుచూస్తు

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gWoy1q

Posted by Katta