***Blog Admin లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
***Blog Admin లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
28, డిసెంబర్ 2012, శుక్రవారం
ఒక కొత్త ప్రయోగం
.........................
2013 సంవత్సరం నుండి ' కవిసంగమం ' ఒక కొత్త ప్రయోగం చేయడానికి
సంసిద్ధమవుతోంది.మిత్రులంతా పాల్గోవడం ద్వారా,విస్తృతంగా ప్రచారం చెయ్యడం
ద్వారా ఈ కవిత్వ ప్రయోగాన్ని విజయవంతం చెయ్యాలి.ఈ ప్రయోగం కవిత్వంలో
రాబోయే తరాలకు ఒక దారిని ఏర్పరిచినట్లు అవుతుందని నా గాఢమైన నమ్మకం!
~ ప్రతి నెల ఒక ఆదివారం సాయంత్రం 'లమకాన్'వేదికపై ఒక సీనియర్ కవి
(శివారెడ్డి వంటి వారు) + ముగ్గురు కవిసంగమం కవులు ఒక్కొక్కరు ఐదు కవితలు
చదువుతారు. వారి కవితల ఇంగ్లీషు అనువాదాలు తెరపైన ప్రొజెక్షన్ చేయడం ద్వారా
తెలుగేతర మిత్రులకు ఉపయోగంగా ఉంటుంది.
~ సంవత్సరాంతంలో ఆ కవితలను Bi Lingual Anthology గా ముద్రించడం జరుగుతుంది.
***
~ ఈ కవిత్వ సమ్మేళనంలో అవకాశాన్ని, కవిత్వం చదివే అర్హతను మీరు రాయబోయే
కవిత్వమే నిర్ణయిస్తుంది .ఆ వేదికపై చదివే కవులను ఎంపిక చెయ్యడానికి-
సీనియర్ కవులు,విమర్శకులు ముగ్గురితో - ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం.
~కవిత్వం కావాలి కవిత్వం!
ఇక కవిత్వ నిర్మాణం పట్ల శ్రద్ధ వహించండి.మంచి కవిత్వం రాయండి.
26, ఆగస్టు 2012, ఆదివారం
కాపీ ‘‘రైటు’’ కాదు : అది తప్పే
మిత్రులారా.. పారాహుషార్!!
కవిసంగమం నుండి కవితలు కాపీ చేసి వారి పేరుతో వారి వారి వాల్స్ పై పేస్ట్ చేసుకుంటున్నారు.
నిజంగా చాల బాధాకరం! చేతిలో పర్సూ, ఏటీఎం లో డబ్బూ..
ఒంటి పై బంగారం దొంగిలించేస్తే...బాధ పడి వారి పాపాన వారే పోతారని సరిపెట్టుకుంటున్నాం..!!
కానీ... హ్రుదయం స్పందనల్ని కలం జాలువార్చే అక్షర సుమాల్ని, మనసు పొరల్లోంచి పురుడు పోసుకున్న కవితల్ని కూడా దొంగిలించేంతటి..
దౌర్భాగ్యుల్ని యేమనాలి? యేమంటే బాగుంటుందో మీరే చెప్పండి..!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)