కొండవీటి సత్యవతి గారు రాసిన కవిత //తల్లుల రోజట....అహా ఆహా హా//కవిత్వ విశ్లేషణ _______పుష్యమి సాగర్... తర తరాల పోరాట ఫలితం గా స్వాతంత్ర్యం తెచ్చుకొని స్వేచ్చ ని అనుభవిస్తున్న కూడా ఇంకా మన మనసు బానిస భావజాలాన్ని వదిలించు కోలేక పోతుంది, మనది కాని నాగరికత ని, అలవాటు లేని దినాలని నెత్తి కి ఎక్కించుకొని చిందులు వేస్తున్నాము ....ప్రపంచం కుగ్రామం గా మారినపుడు అందులో ప్రతి దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాం బాగానే ఉంది , కాని ఒక జన్మనిచ్చిన మాత కి ప్రత్యెక రోజు అని పెట్టి పూజించడం, ఎంత వరకు సబబు ...పురాతన కాలం నుంచి అమ్మ ను కోలుస్తునే ఉన్నాం మరి ఇవ్వాళ ప్రత్యేకం గా ఒక రోజు పెట్టాల్సిన అవసరం ఏమిటి ...?...ఇదే విషయాన్ని సత్యవతి గారు తమ రచన లో నిరసిస్తూనే సగటు గృహిణి గా ఎన్ని విధులను ఎన్ని రకాలు గా నిర్వహిస్తున్నదో చెప్పే ప్రయత్నం చేసారు .. ఎంచుకున్న కవితా వస్తువు సమకాలపు అసమానత కు , దోచుకోబడుతున్న శ్రమ విలువ ని ఎండ గడుతున్నారు. మొత్తం కవిత లో మూడు అంశాలను వెలికి తీస్తాను ....ముందు గా అమ్మ ని ఎలా చూస్తున్నాము, మనకు తెలిసిన అర్థం లో , కాని వాస్తవం గా అమ్మ స్థానం ఏమిటి, ....రెండవది శ్రమ దోపిడీ ...గృహస్తాశ్రమం లో భార్య ..మాత పాత్ర ఎనలేనిది, అలాంటి అమ్మ ను నేడు మనం వస్తువు గా యంత్రం గా మార్చేసాము ..మూడవది ...అందరికి అన్ని ఇచ్చి తానూ మాత్రం ఏమి ఆశించకుండా విశ్వజనీనమైన ప్రేమ ని పంచె అమృతం లాంటిది .. అమ్మ ఒక నిశ్శబ్ద గీతమని //పగలు రేయి తేడా తెలియని//పనుల వలయంలో //అమ్మొక తిరగలి, అమ్మొక చీపురు అమ్మొక చేట, అమ్మొక గాస్ స్టవ్ ... పై వాక్యాలలో ఒక బానిస భావజాలానికి ప్రతిక లా గా నే కనిపిస్తుంది ...కాని అమ్మ ప్రేమ .వాటిని అధిగమించి తన వాళ్ళ కోసం కరిగి పోతుంది మరి .. లోక సహజం అయిన ఒక వాస్తవం ఏంటి అంటే...ముందు తన గురించి కాకుండా బిడ్డ ల ఆకలి ని తీర్చాలని చూస్తుంది ఏ ప్రాణి అయిన సరే , అమ్మ ప్రేమ కి నిదర్శనం అందరి కడుపులూ నింపే అక్షయ పాత్ర //తన కడుపు వేపు కన్నెత్తి కూడా చూసుకోదు కొడుకులకు కూతుళ్ళ కు ఆత్మీయత ని కలిపి తినిపిస్తుంది తన కడుపు కట్టుకొని మరి పిల్ల ల లకి లోటు రానీయకుండా చేస్తుంది ... అమ్మతనపు ఆత్మీయతని//అన్నంలో కలిపి తినిపిస్తుంది... బార్య లని హింస పెట్టె భర్తల ఆగడాలను మౌనం గా భరిస్తూ , పంటి బిగువున అన్ని భరిస్తూ ...సహనానికి నిలువెత్తు రూపం లా నిలుస్తుంది ...తమ బిడ్డలకు ఎలాంటి కీడు జరగకుండా పొదివి పట్టుకొని జాగ్రత్త గా కాపు కాస్తుంది .. కట్టుకున్న వాడు అహరహం//నరనరాన్ని నలుచుకుతింటున్నా//చిరు నవ్వుని పెదాలకి అతికించుకుంటుంది తన గుండెల్లో గునపాలు దిగుతున్నా //పంటి బిగువున బాధని ఓర్చుకుంటుంది పిల్లల కోడిలా బిడ్డల్ని గుండెల్లో దాచుకుంటుంది/// దుఖపడాలి మనం నగ్న సత్యాలు చూసి/అమ్మని దేవతని చేసిన చోటనే అడుక్కుంటున్న ఈ అమ్మలెవరో మరి సూటిగా సమాజానికి ప్రశ్న నాగరికత ని నెత్తికి ఎక్కించుకున్న ఆధునికత, అడుక్కుంటున్న అమ్మలను దేవత అనరు ఎందుకు మరి ....? వృద్ధాప్య కేంద్రాల్లో శూన్యంలోకి చూస్తూ కుమిలిపోయే అమ్మలందరూ దేవతలు కాదా!!! ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర... రోడ్ల కూడళ్ళ దగ్గర అత్యంత దీనంగా అడుక్కుంటున్న ఈ గాజు కళ్ళ అమ్మలందరూ దేవతలేనంటారా??? ఇప్పటివరకు అమ్మ గొప్పతనాన్ని వివరించి దేవత అంటున్నారు ...అమ్మ లు కేవలం సోకాల్డ్ లేదు ధనిక స్వామ్యం లో ఉన్న స్త్రీలే నా ...., మరి జీవితాన్ని దార పోసి మలి దశ లో కొడుకల చేత గెంటి వెయ్యబడ్డ ముసలి తల్లి దేవత కాదా....అలాగే ప్రతి రోజు కనిపించే ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర దీనం గా అడుక్కునే తల్లులు కూడా దేవత నే ..నా ...కొన్ని సమాధానం దొరకని ప్రశ్నలకు మనం జవాబు చెప్పాలి ...అమ్మ పేరు న ఒక రోజు ని జరిపి అన్నం పెట్టడం కాదు ...మన ఉన్నతి కి తను కరిగి పోయే అమ్మ కి గుప్పెడు అన్నం ప్రతి రోజు పెట్టండి అంటూ మనసు ద్రవించేలా రాసారు సత్యవతి గారు ... మంచి వస్తువు ని ఎంచుకొని సరళం గా రాసి సమాజపు పోకడల ను మార్చాల్సిన అవసరం ఉంది అని నమ్మి చక్కని రచన ను మనకు అందించారు ..వారు మరిన్ని మంచి రచనలు చెయ్యాలని ఆసిస్తూ ... పుష్యమి సాగర్... (తల్లుల రోజట....అహా ఆహా హా...) .=== అమ్మంటే దేవతని అమ్మంటే అనురాగ మూర్తని అమ్మంటే ఆది శక్తని ఇంకా ఇంకా ఎన్నో బిరుదులు అమ్మ గోరు ముద్దలు తినకుండా అమ్మ లాలి పాట వినకుండా ఎవరైనా పెరుగుతారా అమ్మ గుర్తొస్తే..... గోరు ముద్దలేనా గుర్తొచ్చేది లాలి పాటలేనా గుర్తొచ్చేది అమ్మ ఒక చాకిరీ యంత్రమని అమ్మ ఒక నిశ్శబ్ద గీతమని అమ్మ ఒక సంక్షుభిత రూపమని పగలు రేయి తేడా తెలియని పనుల వలయంలో అమ్మొక తిరగలి, అమ్మొక చీపురు అమ్మొక చేట, అమ్మొక గాస్ స్టవ్ అందరి కడుపులూ నింపే అక్షయ పాత్ర తన కడుపు వేపు కన్నెత్తి కూడా చూసుకోదు కలో గంజో ఆమె కడుపు లోకి కన్న వాళ్ళ కట్టు కున్నవాళ్ళ కలల సాకారమే ఆమె నిరంతర కృషి అమ్మతనపు ఆత్మీయతని అన్నంలో కలిపి తినిపిస్తుంది కట్టుకున్న వాడు అహరహం నరనరాన్ని నలుచుకుతింటున్నా చిరు నవ్వుని పెదాలకి అతికించుకుంటుంది తన గుండెల్లో గునపాలు దిగుతున్నా పంటి బిగువున బాధని ఓర్చుకుంటుంది పిల్లల కోడిలా బిడ్డల్ని గుండెల్లో దాచుకుంటుంది ఇంత చేసి............... రెక్కలొచ్చిన పిల్లలు తలో దిక్కూ ఎగిరిపోతే గుండె చెరువై కూలబడుతుంది అమ్మంటే దేవతని అన్నదెవరురా/సిగ్గుపడాలి మనం ఆ మాట అన్నందుకు దుఖపడాలి మనం నగ్న సత్యాలు చూసి/అమ్మని దేవతని చేసిన చోటనే అడుక్కుంటున్న ఈ అమ్మలెవరో మరి వృద్ధాప్య కేంద్రాల్లో శూన్యంలోకి చూస్తూ కుమిలిపోయే అమ్మలందరూ దేవతలు కాదా!!! అమ్మ మనిషి, అమ్మకి అన్నం కావాలి అమ్మకి ప్రేమ కావాలి అమ్మకి మందులు కావాలి అమ్మకి బట్టలు కావాలి అమ్మకి అన్నీ కావాలి అమ్మంటే దేవతని ఒట్టి మాటలొద్దు గోరు ముద్దలు తినిపించిన అమ్మకి గుప్పెడు అన్నం పెట్టండి చాలు
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1joRh0d
Posted by Katta
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1joRh0d
Posted by Katta