పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Thilak Bommaraju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Thilak Bommaraju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, జూన్ 2014, గురువారం

Thilak Bommaraju కవిత

తిలక్‌/Thread Way మళ్ళీ ప్రయాణించడం పాతరోడ్డుపై నన్ను నడిపించుకుంటూ మట్టిలో మునిగిన నౌక ఒకటిప్పుడు గాయాల తెరలకు కొట్టుకుపోయిన జ్ఞాపకం దిశాబాణాలు ఓ చివరన తమ కళ్ళను పదును పెట్టుకుంటున్న శరాలు కూర్చున్నచోటే నీకు కొన్ని నిర్దేశాలు కళ్ళకు అడ్డుపడుతూ తలక్రిందులుగా చెట్టు భుజాలకు వ్రేలాడుతూ సన్నని ఆకుదేహాలు ఇంకో దారం నీ చిన్న చర్మానికి గతుకులు కుడుతున్న శబ్ధం ఆకరుకంటా రెండు రహదారులు నా ముందు ఖాళీ ముఖంతో ఇంకా తడారాలి పచ్చికపై ముద్రలు నా కళ్ళలో అతుక్కోవడానికి తిలక్‌ బొమ్మరాజు 12/06/14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lijzit

Posted by Katta

11, జూన్ 2014, బుధవారం

Thilak Bommaraju కవిత

తిలక్/సమాధి కింద :::::::::::::::::::::::::: వెన్నెలను మీద పోసుకున్న కెరటాలు నిత్యం తడుస్తూ కొన్నివేలమార్లు పుడుతూ నీటిలోకి దూకిన కాంతి బొంగరంలా ఎంతదూరం వెళ్ళిందో ఓ చూపు కొలుస్తూ బస్సు కిటికీలోంచి నా కనురెప్పలు విడివడి బయటెక్కడో పడతాయి కొబ్బరాకులపై కూర్చుంటూ తెగిపడిన నా ఆత్మలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి ఏరుకోలేనన్ని ఏమో ఎన్ని కొండగోతుల్లో డొక్కలు పగిలాయో నిత్యపు మైనం కాల్చిన రక్తం నా అస్థిపంజరం గుండా నన్ను తోస్తూ క్షమిస్తూ హింసిస్తూ నిరాశా విత్తనాలు ఎడారిపూల సమాధుల కింద కప్పబడ్డాయి తిలక్ బొమ్మరాజు 11.06.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Sx8i2h

Posted by Katta

8, జూన్ 2014, ఆదివారం

Thilak Bommaraju కవిత

తిలక్/సంపూర్ణం ........................... పచ్చని మొక్కలు కొన్ని నన్ను చూసి నవ్వినప్పుడు ఆకాశపు హృదయం మాట్లాడినప్పుడు ఇల్లంతా చెట్లై ఒంటినిండా కొన్ని పూలు పూస్తాయి అనుభవాల పొట్లం నా ముందు వడ్డించని విస్తరిగా గుల్మొహర్ గబ్బిలాలు కళ్ళు తెరచి ఇంటివెనుక కాపు కాస్తుంటే సముద్రపు నవ్వులు కురుస్తాయి వాటిని దోసిలి బొక్కెనలో మోసుకుంటూ తీసుకెళ్ళా స్వాతంత్రం పొందిన కుక్కలు నిన్ను ఆహ్వానిస్తుండగా ఇటుకల గూటిలో పిచ్చుక విడిచిన వస్త్రాలను రెటీనాపై కప్పుకున్నా ప్రకృతి చేతులు కెలికిన వర్ణచిత్రాలు జీవం పోసుకుంటాయి అమ్మానాన్నలుగా పసిపాదాలు జ్ఞాపకాలుగా మిగులుతాయి ఒకానొక కుండీలో రోజు గడిచింది సనాతనంగా ప్రక్షాళణ చెందిన ఆత్మను కలిసాక తిలక్ బొమ్మరాజు 08.06.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pSV9iG

Posted by Katta

6, జూన్ 2014, శుక్రవారం

Thilak Bommaraju కవిత

తిలక్ /కళ్ళ నడక ___________________ ఒకానొక రాత్రిలో ఒంటరిగా నడుస్తూ నేను దారిలో పోసిన కంకర్రాళ్ళలో కొత్త సుగంధాన్ని ఆస్వాదిస్తూ పాక్షికంగా అగుపించే మిణుగురుల భుజాలపై చేతులేసుకుంటూ ఇంతలో అరికాల్లో ఏదో బాధ కళ్ళ తలుపులు తెరవగానే భళ్ళున ఒలికిన కొన్ని నీళ్ళూ ప్రతిరోజూ నిర్లిప్త వక్షాల మధ్యగా నా శరీరం వదిలిన భారాన్ని మొస్తున్న ఓ ఆత్మను పట్టించుకోని నిశ్చల పదార్థం కొన్ని సమయాలు అడుగంటిన బావుల్లో సగం కాలిన ఆశలను చేద వేస్తూ అలసిపోయాక అక్కడెక్కడో మళ్ళా విశ్రమిస్తూ ఇంకో కొత్త ప్రయాణానికి కసరత్తు గతాల ముందు నిబ్బరంగా మోకరిల్లాలని చాలాసార్లే అనుకుంటాను కాని నాలోకి నేను జారిపోయినప్పుడల్లా దివిటీ కరిగిన శబ్ధ నిర్మాణాలు ఒరుసుకుపోయే ఆలోచనలు శ్రామికులై కూలిపోని పునాదుల దాకలాలను కనిపెట్టే ప్రయత్నంలో మళ్ళీ నడక మొదలు ఇంకో దిశగా తిలక్ బొమ్మరాజు 06.06.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nWxXAr

Posted by Katta

4, జూన్ 2014, బుధవారం

Thilak Bommaraju కవిత

తిలక్ /ఖాళీ సముద్రం ____________________ సముద్రపు కళ్ళు మట్టిని నింపుకున్న తీరాలు అలలన్నీ అలసి ఒడ్డుకొచ్చి కూర్చుందామనుకున్నాయి కాని వేళయ్యిందంటూ ఇంట్లోకి లాక్కుపోయింది ఇసుక చీమల వరుస తీరం తెల్లవార్లు మట్టి కంపే డొక్కలెండిపోయిన శూన్యం చంద్రుడి భోజనం ఓ ప్రక్కగా వెళ్ళిపోతున్న సూరీడు రోజూ నీళ్ళోదులుతూనే తూరుపు రెక్కలు విరిగిపోయాక పడమర అస్తమయపు అతుకులు కొత్త నిశాచరాలు గుండెగతుకుల్లో సుడులదారాల్లా వేలాడుతూ నీరెండ పలకరింపు నిత్యం కళ్ళునులుముకున్నాక నిశ్చలమైన శరీరం ఉప్పుకణికలై తిలక్ బొమ్మరాజు 04.06.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1krUWkn

Posted by Katta

3, జూన్ 2014, మంగళవారం

Thilak Bommaraju కవిత

తిలక్/చరమాంకం రోడ్డును హత్తుకున్న నీరెండొకటి చీకటికి చుట్టమవుతూ మాయమవుతోంది వన్యపు స్తన్యాన్ని నరుకుతున్న చేతులు అప్పుడప్పుడు నీళ్ళొదులుతోంది కాటికి కట్టెలు కరువయ్యేదాకా రెండు కళ్ళలో ఇంత పచ్చదనాన్నీ పోసుకుంటావు చూడూ నువ్వు సంపాదించినట్టు తెల్లరక్తం ఆ పూలముఖాలపై ఎక్కువ కాలం వనాన్నీ తమలోకి తోడుకోలేక కొత్త వర్షం పలకరిద్దామన్నా పిలవలేని నిస్సహాయతలో ఓ సజీవ కళేభరం పరిది విస్తరించిందిగాని పరిమితిని కాపాడుకోలేక మట్టిగా మిగిలింది ఆనవాళ్ళను మిగుల్చుకోలేక ఆశలను వేర్లతుంగలో తొక్కి స్థాణువై నానుతూ తిలక్ బొమ్మరాజు 03.06.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n6IuFo

Posted by Katta

1, జూన్ 2014, ఆదివారం

Thilak Bommaraju కవిత

తిలక్/కడలి చుక్క ................................ రెండోసారి జీవితం మొదలయినట్టుంది ఈరోజు బాల్యాన్ని వదిలేసాక మళ్ళీ పాత మట్టిలో నడిచి వచ్చాక నాలో కొన్ని జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి పుట్టుక మడుగులో పెరిగిన మహావృక్షంలా నేను కొన్నేళ్ళ తరువాత గతాన్ని కాలుస్తూ ప్రస్తుతానికి గుమ్మాలు కడుతూ సత్తు శరీరం మీద కుట్టుకున్న కొత్త చర్మం తిరిగి చిరుగులంటుతోంది నన్ను నేను మర్చిపోయాక అర్థం కాని అక్షరంలా బయట ప్రపంచానికి చూపెడుతూ ఇంకోసారి దిద్దుకున్న సముద్రపు చినుకులా వెన్నెలను కక్కుతున్న ఆకాశం అడవిని పదే పదే తడుపుతూ ఖాళీపాత్రలో నిండిన శూన్యాన్ని వడగొడుతున్న ఆకలి చేతులు నావి కొండచరియల నవ్వులు ఇన్ని వెతుకుతూ చరమాంకంలో సంపాదించిన గణాంకాలకు సూత్రాలను సాదిస్తూ సంకలనం ఇప్పుడు బాల్యానికి ఆనకట్ట తిలక్ బొమ్మరాజు 24.05.14 01.06.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kerjmo

Posted by Katta

29, మే 2014, గురువారం

Thilak Bommaraju కవిత

తిలక్/నీటి స్పటికం _______________________ చెమ్మ ఇంకిన కిరణాలు పొద్దూకులా ఇంటి ముందు పడుంటాయి వాటినెవరో ఇక్కడ పారబోసినట్టు పచ్చి గుర్తులు కిటికీలోంచి నా కళ్ళు వాటిని ప్రతిరోజూ కడుగుతుంటాయి మబ్బుపట్టకుండా అవి తడుస్తూనో నన్ను తడుపుతూనో ఉంటాయి రాత్రి మిగిలిన సగం విరిగిన కలలా నన్ను నడిపించే కాళ్ళలా నాతోనే ఇప్పుడు కొన్ని ఆకులు మళ్ళా రాలాలి వాటి కోసం పనిమాలా పిట్టగోడపై చెకోరపక్షిలా ఎటు ఎగరాలో తెలియని క్షణం కొంత ఎర్రమట్టిని అరచేతుల్లో పొదువుకొని ఆకాశపు మొదళ్ళలో అంటుకడుతుండే ఆనవాళ్ళు భూమిపై కూర్చున్న సముద్రమొకటి లేచి వెళ్ళినప్పుడు అవే చేతులు కొత్త ప్రతిబింబంలా హత్తుకుంటాను కనిపించని అస్పష్టతను వెంటతెచ్చుకొనే మొసళ్ళు ఈ బంధాలు గాలివేర్లలా తిలక్ బొమ్మరాజు ......29/05/14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ivFxty

Posted by Katta

27, మే 2014, మంగళవారం

Thilak Bommaraju కవిత

తిలక్/నల్ల అద్దం ___________ ఎక్కడికో విసిరివేయబడతాను కొన్నిసార్లు నాకు నేనె దూరంగా అప్పుడక్కడ విరిగిపడిన శిలాశఖలాలలు కళ్ళ అంచులతో ఏరుకుంటాను వాకిలి ముందు నేలపగుళ్ళపై జల్లిన కళ్ళాపి లేపనంలా మది గుహలన్నీ పచ్చిగానే నానుతూంటాయి అంతరంగ వైశాల్యాన్నీ కొలిచే కొత్త బావుటాలకు లోలోపలే చేదవేస్తూ పాకుడు గోడలపై గొంగళిపురుగులా మరో వేట నాలో రంగులద్దుకున్న ఎండు వారధులు వాటి పునాదుల మధ్యగా మళ్ళీ నేనె చిట్లిన ఉప్పు నీటికి అతుకులేస్తూ కలల సాంద్రతను వడగొడుతూ ఇంకో అన్వేషణ ఇనుప గడియారంలో నిర్లిప్త శత్రువులు నా ఆప్తులు మరికొన్ని అణువులు పేర్చుకోవాలి తెగిపడకుండా ఇక్కడి నేలంతా ఎన్నిసార్లు నన్ను రాసిందో విరిగిన ప్రతిసారీ కొంత సాంత్వన ముసురు దుప్పట్లన తడిసిన చంద్రుడి సాలేగూటిలా నన్నెవరో పోగేయ్యాలి మళ్ళా లోతునుండి బయటికొచ్చాక తిలక్ బొమ్మరాజు 09.05.14 27.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tI6Isu

Posted by Katta

25, మే 2014, ఆదివారం

Thilak Bommaraju కవిత

తిలక్/వాన దీపం ____________ గోడకు తగిలించిన దీపం రాత్రంతా వెలిగి వెలిగి ఇప్పుడే కొండెక్కింది ఒంటరిగా తనను తను కాల్చుకున్నాక ఒంటిపై మిగిలిన మసి ఇంటి చూరు కూడా చేతులు చాపి రేయంతా మెలకువగానే తోడుకుంది ఇంత చీకటిని ఎక్కడో దడాలున పగిలిన కీచురాళ్ళ శబ్ధానికి కొంచం జలదరిస్తూ ఒకింత అలజడి గాజు దేహం గుండా ముసలి వర్షమొకటి అప్పుడే అటుగా వెడుతూ తలతిప్పి చూసింది దహనమవుతున్న ఏకాంత ఒత్తిని/ఒక్కో చుక్కా రాలే కొద్ది నేలంతా తడిసిన వాసనతో నానుతోంది ఇక కొద్దిగానే నిండుకున్న చమురుతో నెట్టుకొస్తున్న ఆ పదార్థానికి శూన్యపు గాలికి కిర్రుమన్న చప్పుడు ఆకుల మధ్యగా కొన్ని పువ్వులు అప్పుడే రాలినట్టున్నాయి పసిరుచిగొడుతూ ఇంకెన్ని రాతులు దహనమవ్వాలో ఒంటరైనా ఆ గది కోసం తిలక్ బొమ్మరాజు 25.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TIMank

Posted by Katta

23, మే 2014, శుక్రవారం

Thilak Bommaraju కవిత

తిలక్/కలల కూడలి పదాల మధ్యన నేను నాలోకి కొన్ని వాక్యాలుగా ఇంకినపుడు మధ్యమంగా మరికొన్ని భావాల వెల్లువ నరాలు పగిలేలా రుధిరపు హోరు గుండె గతుకుల్లో అవి తట్టనపుడూనూ/­నావికానపుడూనూ మనసు సాంద్రత పెరిగి దళసరి ధూపమేదో నన్ను కాల్చుతుండగా కొత్త అర్థాలకు మూసపోస్తూ నా ఈదేహపు బట్టీ నా కళ్ళలో పగిలిన పాలసంద్రాలన్నీ నాకు నేనె వడగొట్టుకుంటూ ద్రవీకరిస్తున్నా ఇప్పుడే...ఇక్కడే అమరణపు అంపసయ్య ఆలోచనలను నేను మళ్ళా పుట్టడానికి ప్రయత్నిస్తుంటాను..ఆ పసితనపు పుప్పొడిని నా కాగితపు కూడలిలో కొద్ది కొద్దిగా అద్దేందుకు ఇంకా ఏదో నిర్లిప్తత రాసి జీవించినా రాయక మరణించినా తిలక్ బొమ్మరాజు 23/05/14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kvq0hs

Posted by Katta

19, మే 2014, సోమవారం

Thilak Bommaraju కవిత

తిలక్/కొత్త కాళ్ళు కొత్త కాళ్ళ పుట్టుక నాలో పాత దారులే నడకే నూతనం దారంతా ముళ్ళ ముచ్చట్లే రాళ్ళ గుసగుసలు రాత్రంతా ఖాళీ ఆకాశాన్ని నింపే ప్రయత్నంలో తారా కూటమి నీలపు రంగులో ఈదుతున్న ఓ జడపదార్థం నన్ను మోస్తున్న రెండు పునాదులు చెమ్మ ఇంకని ఆసరా వనం నా కళ్ళు మంచి నీళ్ళే...గొంతు గోడలకు కొత్త రుచిని పరిచయం చేస్తూ ఈ పూట అలసటకు ఆలంభనగా ఇంకాస్త దూరమే గమ్యం నా ముందు తిలక్ బొమ్మరాజు 19.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gGvSFK

Posted by Katta

17, మే 2014, శనివారం

Thilak Bommaraju కవిత

తిలక్/వెండి పురుగులు రాత్రిని వెలుగులతో పూడ్చడానికి కొన్ని మిణుగురులు స్వేచ్ఛా ప్రతీకలుగా నీటిపై తేలియాడే గాలి బుడగలు కొత్తదనానికి ఊతమిస్తూ సహజంలో అసహజంగా కూరుకుపోయే కృత్రిమ నవ్వులు కొన్ని క్షణాలు నీవనుకొని బ్రతికేయచ్చు నరాల్లో ఎండిన నెత్తురు కరుగుతున్నపుడు నీ జ్ఞాపకాలు నీకు తోడుగా మిగిలినవి కాసిని వాన చినుకులుగా తోడుకుంటూ పశ్చిమాన అస్తమించే స్వర్ణకమలంలా ఆలోచనలు మాటి మాటికి తొలుస్తూంటే కంట బూజు చెలమలు తెరలు తెరలుగా అల్లిన కన్నీటి కళేభరాలు తిలక్ బొమ్మరాజు 16.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jE3Yob

Posted by Katta

16, మే 2014, శుక్రవారం

Thilak Bommaraju కవిత

తిలక్/వెండి పురుగులు రాత్రిని వెలుగులతో పూడ్చడానికి కొన్ని మిణుగురులు స్వేచ్ఛా ప్రతీకలుగా నీటిపై తేలియాడే గాలి బుడగలు కొత్తదనానికి ఊతమిస్తూ సహజంలో అసహజంగా కూరుకుపోయే కృత్రిమ నవ్వులు కొన్ని క్షణాలు నీవనుకొని బ్రతికేయచ్చు నరాల్లో ఎండిన నెత్తురు కరుగుతున్నపుడు నీ జ్ఞాపకాలు నీకు తోడుగా మిగిలినవి కాసిని వాన చినుకులుగా తోడుకుంటూ పశ్చిమాన అస్తమించే స్వర్ణకమలంలా ఆలోచనలు మాటి మాటికి తొలుస్తూంటే కంట బూజు చెలమలు తెరలు తెరలుగా అల్లిన కన్నీటి కళేభరాలు తిలక్ బొమ్మరాజు 16.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j38hh2

Posted by Katta

13, మే 2014, మంగళవారం

Thilak Bommaraju కవిత

తిలక్/చీకటి వాసన ఇంకొన్నాళ్ళు ఆగాలేమో కొత్త రెక్కలు విచ్చుకోవడానికి అన్నం మెతుకులు చేతులకంటనే లేదు అప్పుడే ఆకలిసముద్రాన్ని దాటేస్తే ఎలా చీకటి తైలం ఇంకిపోయిన నేలంతా రాత్రి వాసనను కప్పుకొని బయటకొచ్చింది చేతుల్లోకి కాసింత శూన్యాన్ని తోడుకుని ముఖాన్ని చదును చేసుకుంటూ ఇంకో క్షణం మట్టి గొంతులో కుక్కబడిన వేర్ల చిరునామాలన్నీ ఆకులతో కుప్పపోసాక లోన మిగిలిన ఓకింత ఖాళీ నవ సమాధుల నిర్మాణం జరుగుతూనే ఉంది ఎక్కడోచోట ప్రతి రోజు పాత శాసనాలను కొత్తగా లిఖిస్తూనే ఉన్నా మరో రెండు శరీరాలు కోరికల ముసుగులో మరణించాక ఇంకో ఆకలి పుడుతూ వెంట తేలేని లిప్తపాటు కాలాన్ని నీతిప్రమణాలతో కొలుస్తూ డోలాయనం ఇప్పుడిక ఎగరొచ్చు సరిహద్దులు దాటి తిలక్ బొమ్మరాజు 12.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nCxbqU

Posted by Katta

10, మే 2014, శనివారం

Thilak Bommaraju కవిత

తిలక్/కొత్తపదార్థం ఎక్కడో దూరంగా నిలబడి నాపైన పరచుకున్న ఆకాశాన్ని చూస్తుంటాను నా చేతులు బారగా చాపి దాన్ని కొలవడానికి ప్రయత్నిస్తుంటాను కాని అక్కడెవరో కొన్ని రంగురాళ్ళను అతికించినట్లుగా కొన్నినక్షత్రాలు అప్పుడు నా కాళ్ళ కింద నన్ను పడిపోకుండా మోస్తూ ఒక భారి పదార్థం చుట్టూతా కొంత గాలి నా ముక్కుల్లోంచి,చెవుల్­లోచి ఏకదాటిగా నన్ను దాటుకుంటూ ఇక అప్పుడక్కడ నాలాగే నిలబడ్డ ఓ శరీరానికి నా వీపును ఆనుస్తూ రాళ్ళపరుపైన నా కళేభరం మిట్టమధ్యాహ్నపు ఎండలో నీటి వాసనలా ఒక అనుభూతి నాలోకి నన్ను లాగేస్తూ అప్పుడనుకుంటాను కాసేపు ఎక్కడోచోట మత్తుగా పడుకుందామని కాని నడిచి నడిచి రక్తం కక్కుతున్న పాదాలను చూసి ముఖానికి అద్దుకుంటాను ఉపశమనం ఇద్దామని సరే ఇక వెళ్ళు నేనిక్కడే ఉంటాను ఈపూట అని చెప్పినా కదలకుండా కొన్ని వస్తువులు నన్నంటుకొని గట్టిగా బిగించిన ఆ కౌగిలిలో రెక్కలు తేలికైన శబ్ధం నాకుమాత్రమే వినిపిస్తూ మళ్ళా వెనక్కి వచ్చి గదిలో కూర్చున్నాక పైకప్పు మధ్య ఓ సాలీడు వ్యవసాయం చేస్తూ చదునుగా అల్లిన ఓ చిన్న బంగ్లా విశాలంగా ఇంకో హృదయం మొలకెత్తాలి కొత్తగా జీవించడానికి తిలక్ బొమ్మరాజు 04.05.14 10.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l1k9gA

Posted by Katta

8, మే 2014, గురువారం

Thilak Bommaraju కవిత

ఈ రోజు సారంగలో నా అక్షరాలు...... తిలక్ /అవ్వ ::::::::::::::::::::­:: యాడున్నడో కొడ్కు ఈది బళ్ళ సదివిండు ఇదేశాలకు పోయిండు నా కండ్లల పానాలు పెట్కొనున్నా వాడొస్తడని సత్తు గిన్నెలల బువ్వ పెట్టిన ఈయవ్వ యాదున్నదో లేదో గంజితాపించినగాని గరీబుగా పెంచలే కూలిజేసి కాలేజిల చేర్సినా కువైట్లా ఉజ్జోగమన్నడు గల్లీలల్ల గోలీలాడేటోడు డాలర్లులెక్కేస్తున్నడు గుడ్సెల సల్ల తాగినోడు నా కుతికల సుక్క పోస్తడో లేదో అప్పుడపుడు పైసలైతే పంపిస్తడు ఎప్పుడూ నన్ను సూడనికి రాలే పదేండ్ల క్రితం వానయ్య పీనుగయ్యిండు గియ్యలా నాకు తోడులేకపాయే వాడునన్ను సూస్తడని ఒక ముద్ద పెడ్తడనుకున్న నన్నిట్ల ఒదిలిపోయిండు అయినా ఆశ సావలే నేను మాత్రం దినం దినం సస్తున్న తిలక్ బొమ్మరాజు 25.04.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o8Qlox

Posted by Katta

7, మే 2014, బుధవారం

Thilak Bommaraju కవిత

తిలక్/అక్షరం ఈరోజు అక్షరాలన్నీ చిన్నబోయాయి స్వచ్చమైన పదాల అల్లికలో విఫలమై అనేక కలాలు పదే పదే కాగితం పొలంలో శ్రమిస్తున్నా దాహం తీరక నిర్లిప్తమయినాయి ఎందరి జీవితాల్లో హస్తవాచికలయ్యాయో తమ రూపాన్నీ చాటడం కోసం పేర్చిన పదాలలో ఒద్దిక కరువైనప్పుడల్లా నిశ్శబ్దంగానే రోదిస్తూ వెన్నెల వాకిళ్ళలో తేలినప్పుడల్లా వేదనసంద్రంలో మునకలు వేసినా తోడొస్తూనే ఉన్నాయి నిష్కల్మషమైన చేతిచూరులో ఎప్పుడూ అద్దుకునే ఉంటాయి అర్థాలహాయిని మోస్తూ కొన్నిసార్లు ప్రేమగా మరికొన్నిసార్లు దుఖంగా ఆర్ద్రథగా ఆవేదనగా ఆవేశంగా పరివర్తించుకుంటూనే ఉన్నాయి కొత్త పదాలను జనియిస్తూనే కలివిడివేళ్ళు దొరికినప్పుడల్లా కాదీ అక్షరం అంతం మళ్ళీ రూపాంతరం మాత్రమే తిలక్ బొమ్మరాజు 01.05.14 07.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1oDlw

Posted by Katta

3, మే 2014, శనివారం

Thilak Bommaraju కవిత

తిలక్/ఖాళీ ---------------------------- నాలోకి తొంగి చూసాను లోపలంతా శూన్యమే తెలియని డొల్లతనాన్ని పూడ్చడానికి ప్రయత్నించాను నా ఆలోచనలన్నీ నన్ను వీడి సుదూరంగా ఎక్కడికో వలసపోయాయి నన్ను కాదని బహుశా వాటికి కూడా మనసు సాంద్రత తెలిసినట్టు లేదు కటిక కిరణాల కింద తడుస్తున్న దర్పణంలా నేను/ఎంతకీ వక్రీభవించని కొన్ని ఎడారి పూలు మండుతున్న చితిలో నిశ్చలంగా ఒళ్ళు కాల్చుకుంటున్న ఓ శరీరం/ పాకుడురాళ్ళపై నిశ్శబ్దంగా కొన్ని నీటివిత్తనాలు ప్రతి క్షణాన్ని పారేసుకున్న ఒంటి గడియారంలా కొన్ని ప్రవాసాలు నా చుట్టూ తిలక్ బొమ్మరాజు 28.04.14 03.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rOzZPd

Posted by Katta

1, మే 2014, గురువారం

Thilak Bommaraju కవిత

తిలక్/అర్థాల వసారా ::::::::::::::::::::­:::::::::::::::::: పదాల మేడల్లో నేను ముడుచుకొని కూర్చున్నపుడు వాక్యాలు నీ చుట్టూ లతలా అల్లుకుంటాయి అర్థాల సమాధులపై దులిపిన భావాల దుమ్ములా నేను నేల పగుళ్ళలో గాలిని నింపి కొత్తపూడికలకు శాంతి స్థాపన చేస్తూ నువ్వు నీళ్ళను మళ్ళీ మళ్ళీ కడుగుతూ ఒడిలిన రెండు చేతులు రంగుల కొవ్వుత్తులను కొత్తగా వెలిగించడం కోసం ఆశల బావుల్లో ఎన్నిసార్లు తొంగిచూసినా కొత్తగా కనబడదే ఎప్పుడూ పాత నీడలే మునుపెన్నడో నేశాను అంతరంగ పరికిణీని ఇంకా ఏ కలలు తొడుక్కోలేదు ఎండిపోయిన పూల సుగంధంలా నా కళ్ళు తడారుతుంటాయి ప్రతిరోజూ నా గదిలో శూన్యం కనిపించిన ప్రతిసారి చెబుతుంటాను కాస్తంత ఖాళీ ఉంచమని నేనొచ్చేదాకా మనసు గుహల్లో ఎన్ని శవాలో ప్రతి నిత్యం కాలుతుంటాయి నిర్వేదానికి ఒత్తాసులా చెక్క తలుపుల మధ్యన ఓ నిండు సువాసన తెరచిమూసినప్పుడల్లా వసారాలో ఒంటరి ధూలాలు చెదలతో రమిస్తూ వర్షం పలకరించినపుడల్లా ఒళ్ళుతడుపుకుంటూ కొంత మట్టివాసనను లోలోపలకు తోడుకుంటూ మరికొన్ని అక్షరాలు నగ్నంగా నానాలి కొత్త అణువుల శోధనలో తిలక్ బొమ్మరాజు 05.04.14 20.04.14 వాకిలిలో ప్రచురినుయిన నా కవిత http://ift.tt/1hUwxBk

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hUwxBk

Posted by Katta