పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, జులై 2012, బుధవారం

కసి రాజు కవిత



స్వచ్చమైన నేతిమిఠాయొకటి
సుడీదార్ కట్టుకొని
స్వీట్ షాప్ నుండి బయటకొస్తావుంటే
ఆ తియ్యనైన అందాన్ని తినాలో పంచిపెట్టాలో తెలియక చూస్తున్ననన్ను
తొక్కతీసేసిన మొక్క జొన్నపొత్తొకటి
తప్పుకొమ్మని తోసేస్తే
కోకసుట్టిన కాజా ఒకటి కాపాడేందుకు ప్రయత్నించింది.
అటుసూసి,ఇటుసూసేలోపే
ఆ నేతిమఠాయి కాస్తా,
పీసుమిఠాయి పేసేసుకుని,ఎవడికోసమో ఎదురుసూత్తావుంది.
వెదవది పోతేపోయింది
గులాబీరంగు జిలేబీ మంచిబలేగా వుంటాదని
దానికోసం రోడ్డుదాటుతుంటే,హడావుడిగా పోతున్న హలీమొకటి అడ్డుపడింది
ఒక సలాం కొట్టి సాగనంపేసాను.
పక్కబండికాడ సగం తడుస్తూ నుంచుంది పానీపోరొకటి.
కొంచెం కారంగా,గారంగా తినుకుంటూ తాగుదామని
పోయి పక్కన్నిల్చున్నాను.
తాగుతుంది మినరల్ వాటరు కాదేమో, జనరల్ వాటరైతే జలుబు సేత్తాదని
ఇదొద్దురాబాబూ అని అక్కడనుండి కూడా వచ్చేసాను
కాస్త పొడుగ్గా,నాజూగ్గా మసాలాసల్లిన బజ్జీలు కనిపించేసరికి మరోబండి దగ్గరాగిపోయాను
కొన్ని పొట్టిమిరగాయలు,కొన్ని గట్టిమిరగాయలు కనబడ్డాయక్కడ.
సూడ్డానికే కారంగా కనిపిస్తున్నాయ్, తింటే దిమ్మతిరిగిపోద్దని బయపడి.
సల్లగా మెల్లగా షోడాహబ్ దగ్గరకొచ్చాను.
అక్కడ ఏరంగుదాన్ని సూసినా బుస బుసలూ, రుస రుసలే.........పొంగుతూ,తొంగిచూస్తూ!
ఇక లాభంలేదు ఈ పూటకి నా ఆకలి దప్పులు తీరెట్టులేవని
రైట్ క్లిక్ చేసి
రీఫ్రెష్ అయ్యి
షడౌన్ అవడానికి సిద్దమయ్యాను.

.....

*25.7.2012

ఉడుగుల వేణు || love ||

“I am Capricorn
Your Taurus
We made for each other…” అన్నావ్.
నా జాతకం చూపించి తెగ మురిసిపోయావ్
యెమైందిప్పుడు..
వద్దుర బాబోయి ఈ బొంగులో కమిట్మెంట్ అంటే
నువ్వు విన్నావా
అల్పపీడనమై చుట్టుకుంటివి
ఇప్పుడెందుకింత ఆటిట్యూడ్ చూపిస్తావ్ ?
జరిగింది మరిచిపోవచ్చు కదా?
మై ఫుట్

ఆ వెన్నెల గాలి తాకాగానే
మన దేహాలు పువ్వులై విచ్చుకునె
పుప్పొడి గంధమై విరజిమ్మే..
మన నిద్రల్ని వేటాడిన ఆనాటి రాత్రులకు
ఏం ఆన్సర్ చేద్దాం

నువ్వక్కడ-నేనిక్కడ
మనిద్దరం భూమ్మీద నిశ్శబ్ధంగానే ఉంటాం
మన పెదాలు ఆకాశం లో పక్షులై విహరిస్తూంటాయి
మన అవయవాలు మిన్నాగులై
అడవుల్లోనాట్యమాడుతాయి ..
ఎంత కాలమీ ఇమాజినరీ సెక్స్
జరిగింది మరిచిపోయి రా అబ్బా

నీకో విషయం తెలుసా
నీ మీద ఎంత కోపమున్నా
నువ్వు గుర్తొస్తే చాలు
బలే కిక్కుంటది ...
పొడగాటి జడ
పదునైన కళ్ళు
నడుము మీద పుట్టు మచ్చ
అప్పుడప్పుడు మాత్రమే విచ్చుకునే నీ పెదాలు
Wow..thousand beautiful girls equal to you
You are an angel .
అరె ప్లీజ్ ..జానేదో యార్ ...భూల్ గయా వో దిన్
కమ్ విత్ మీ ...
పచ్చిక మైదానాల్లో
విచ్చిన పూల మధ్య
యెగిరే సీతాకోక చిలుకలమవుదాం
లేళ్ళు సెలయేళ్లు లేతాకులు దాటుతూ వెళ్దాం
తూర్పు గాలిని ముద్ధాడుతూ ..
సముద్రాల్ని ఈదుతూ ...
అలా అలా వెళ్లిపోదాం
కమ్ డార్లింగ్ ..కమ్ విత్ మీ

*25.7.2012

రియాజ్ రియాజ్ || ???????? ప్రశ్నలు ?????? ||

ఓ ప్రశ్న మనిషిని జంతువునుంచి విడదీసేందుకు పుట్టింది
మరో ప్రశ్న ఖగోళ రహస్యాలపై దాడిచేస్తోంది..
మరెన్నో ప్రశ్నలు రహస్యాలను..ఛేదించేందుకు వేచిచూస్తున్నాయి

వ్యాసునిలో రేగిన ప్రశ్నలు మహాభారతమయ్యాయి
వివిధ దేశాలలో..వివిధ రూపాలలో..
వివిధ వ్యక్తులను సతాయించి..
వివిధ శాస్త్రాలుగా..గ్రంధస్తమైనాయి

సోక్రటీసునుంచి..అరిష్టాటిల్..ప్లేటో..ఫ్రాయిడ్...
గాంధి..జిడ్డుకృష్ణమూర్తి...లను..
సామాన్యుని మొదలు ఎవరినీ వదలవు!!

అంతరంగములో..సమాజంలో..ఎక్కడ చూసినా...
కుప్పలు కుప్పలుగా..గజిబిజిగా మనోమేధస్సులను ...గందరగోళం చేస్తూ...
భయపడుతూ..భయపెడుతూ...సందిగ్ధ అసంబధ్ధ శూన్య క్షేత్రాలలో వేలాడుతూ ..
బ్రద్దలు...కొడుతూ...సత్య శోధనవైపు..పరిష్కారం వైపు..
పుడుతూ గిడుతూ..
కొన్ని సూటిగా...దూసుకువస్తూ.. ఉద్యమాలను మేల్కొల్పుతూ..
మస్తిష్కాలలో ఎన్నో మరెన్నో ప్రశ్నలు..!!!

అంతరంగాన్ని శోధిస్తూ..
బాహ్య ప్రపంచాన్ని..పరిశోధిస్తూ..
ఆవేశాలకు ఊతమిస్తూ..
అస్పష్టతలను భగ్నంచేస్తూ..

ప్రశ్నలు అనంతమే.. ...కానీ..కానీ?...
సమాధానాలే? పరిష్కారాలే....???????


*25.7.2012

ఏకాంత సిరి || మధ్యంతరాలం.. ||

ఎంత దగ్గరో..
అంతే.. దూరం నువ్వు
ఈ దగ్గరిదురాలను కొలుస్తూ..
మధ్యంతర రేఖనై నేను !!
ఎంత కొలిచిన దూరం దూరం అవదు
దగ్గర దగ్గరవదు
స్వప్నానికి-సత్యానికి
మధ్య మిథ్యలా..నేను
శాశ్వతానికి - ఆశాశ్వతానికి
మధ్య నిమిత్తమై నువ్వు !!
స్వప్నం సత్యమై శాశ్వతమైన..
సత్యం స్వప్నమై అశాశ్వతమైన...
ఆ నింగి నేలలా
ఎన్నటికి కలవని జంటలా
మనం...!!!

*25.7.2012

జగతి జగద్ధాత్రి || మరణ ధృవం ||

ఆశగా ప్రతి ఏటిలా...
చూసుకుంటూనే ఉన్నా
ఆకులు రాల్చిన మందార చెట్టువైపు
చివురులు వేస్తుందని
ఏదో ఒకరోజు పొద్దున్నకల్లా
చిలుక పచ్చ కోక చుట్టుకుని
పలకరిస్తుందని ....
కానీ ఈ సారి మరేమో
ప్రతి రోజూ నిరాశే ఎదురైంది నాకు
పచ్చని తనమే లేకుండా
ఎండు కట్టెలా ఎండి పోయింది
ఎన్నెన్నో జీవిత సత్యాలను చెప్పిన
మా మందార చెట్టు ...
ఈ రోజు మృత్యువు సత్యమే నని
రుజువు చేస్తూ
ప్రాణ రసాన్ని వదిలి
వెళ్ళిపోయింది .....
మనుషులకి మరు జన్మ లుంటాయని
ఎన్నెన్ని శాస్త్రాలు చెప్పినా
రుజువులున్నాయో లేదో
మన మేధకు అందక పోయినా
చెట్టు మాత్రం కట్టెగా నే మిగులుతుందన్నది
సత్యం చేస్తూ వీడి పోయింది ....
మా తో పాటే రెండేళ్ళూ
ఈ ఇంటిలో సావాసం చేసిన
మా చెట్టు ......రాత్రుళ్ళు
వంటరిగా బయటికి వెళ్ళాల్సి వస్తే
తోడుగా మనిషి ఉన్నట్టుండే
మా మందార చెట్టు ....
మా కవితల్లో పదిలంగా
మా చాయాచిత్రాలలో అందంగా
మాకు జీవన సత్యాలను
నుడివిన మా జ్ఞాన మందారం చెట్టు
ఇప్పుడు లేదు చచ్చి పోయింది
అని మా సత్యం గాడు అంటే ....
గుండె తరుక్కు పోయింది ..
తీసి పారేస్తాను అన్నాడు ....
వద్దురా ...ఉంచు ఎక్కడైనా
ఏ మాత్రం జీవకణాలు ఎమన్నా
ఉన్నాయేమో ఉంచు మరి కొన్నాళ్ళు
మొదలు పీకేయ్యకు ...
అన్నా నెమ్మదిగా ....
ఇంకా నమ్మకంగా ....
ఇంకా ఇంకిపోని ఆశతో ....
ఏమో ...చిగురిస్తుందేమో చూడాలి
వానలు కురిసాక .......
అని బిడ్డకోసం అమ్మలాంటి ఆశతో...
ఎదురు చూస్తున్నా .......
(ఆశ ఫలించలేదు చెట్టు పీకేసాడు సత్యం...ఈ రోజే అందుకే మళ్ళీ ఒకసారి మందార చెట్టుని తలచుకుంటూ...25th july wednesday )
 *25.7.2012.

డా.పులిపాటి గురుస్వామి || అనుకోని జీవితం ||

కిందపడి
మీదపడి
చెప్పాపెట్టక
నీ దగ్గరికి వస్తే
సందేహాల తాళం నవ్వింది

కొన్ని అనుభవాలు
విసురుకుంటూ వెళ్తున్ననీకు
నా రసాయనిక మనసు చర్య
తెలియదు

దిక్కులేని ఆలోచనల్లో
నడిపిస్తున్న నన్ను
పడవేసి ,పాదాల మీదుగా
ఓ యువకుడి వాహనం
పరుగెడుతుంది

నువు కలవర పెడుతున్న రాత్రి
నాలుగక్షరాలు నీకోసం
రాద్దామని కూచుంటే
కరెంటు పోతుంది

గాడిదయ్యో
బూడిదయ్యో
బతుకుతూ ఉంటా ...కానీ ...కానీ
వయసై పోతుంది.
 *25.7.2012

కిరణ్ గాలి || అవ్యక్తం ||

కవిత రాసి రొండెళ్ళు దాటింది
గుండె అడుగున లావాల అది గడ్డకట్టింది
ఎదైన చేసి దాన్ని బయటకు లాగాలి
ఇప్పుడిహ నార్మల్ డెలివెరి కుదరదు
సిజెరీయన్ చెయ్యలి

స్వార్దమను దుర్మార్గమను
పెద్ద ప్రాణం దక్కాలంటె
మ్రుత శిశువుని బయటకు లాగాల్సిందె
ముక్కలుగ అయినా కవితను వెలుపలికి ఈడ్చాల్సిందె

...ఇప్పుడు

అక్షరాలు ఆప్యాయంగా పలకరించటం లేదు
అసహ్యించుకుంటున్నాయి వాటిని అనాధలని చేసినందుకు
భావాలు నగ్నంగా నా ముందుకు రావటానికి సంకొచిస్తున్నాయి
బహుశ మా మధ్య తెలియని అగాధమేదో ఏర్పడింది

కాగితం కళ్ళలోకి నేరుగా చూడలేకపొతున్నాను...

తనతో గడిపిన ఎకాంత క్షణాలని
తన కౌగిట్లొ హత్తుకొని నన్ను లాలించిన ప్రేమని
నా అవేశాలను, కన్నీళ్ళను, ఓటములను
దేన్ని కాదనకుండ తనలొ ఇముడ్చుకున్న వైనాన్ని
అన్నిటిని వదులుకొని వెల్లిపొయాను చూడు...

నాకు తెలుసు నన్ను చుసి
ఇప్పుడు తన పెదాలు అదురుతున్నాయని
దుఖం పన్టికింద బిగపెట్టిందని
నా స్పర్శ తగిలితె తను భొరున ఎడ్చెస్తుందని

కాని మలినమైన నా ఈ వేల్లతొ
తనను మునపటిలా తాక గలనా?
స్వఛ్ఛమైన తన దేహాన్ని
నా కల్తి రాతలు బహిరంగంగ చెరచవా?
ఇక నేను రాసెదంతా ఒక రకంగా అశ్లీలమెనేమో

సందేహం లేదు
నాలో పల్చటి పొర ఏదో తెగిపొయింది
పవిత్రమైనది ఏది నేనిక స్రుశ్టించలేను


*25.7.2012

శిలా లోలిత || చూపులు ||

కన్ను తడిగుండెల మడతల్ని
విప్పుతూ వుంటుంది
ఆ రెప్పలకు
బతుకుమూత మూయడమూ తెలుసు

కన్రెప్పల దారాలతో
ఒక్కొక్క గాయాన్ని కుట్టుకోవడమూ తెలుసు
అంతరంగ యుద్దాల్లో
నెత్తురోడిన జీరల్ని దాచుకోవడమూ తెలుసు

నల్లటి అశాంతుల ఆవర్తనాల్ని
శ్వేత బిందువులతో సమర్ధించడమూ తెలుసు
1
చంక్రమనాలు చేసే బతుక్కి
చూపై, స్థిరమై, నిలిచే అభివ్యక్తి .
ఎదురు చూపుల్లోంచి ,బతుకు చూపుల్లోంచి
బతుకంతా ఎదురుచూడ్డం అంటే
ఒక జీవిత సాఫల్యం చేకూరినట్లు -

అలజడుల ఊపిరుల నడుమ
కాలాన్ని కొలవడం ఒక యుద్దమే!
అశాంతి మాత్రమే చూపుల్లోంచి కరుగుతుంది ,
కాలాన్ని కదుపుతుంది
2
ఎడారుల నిశ్శబ్దం
ఎండుటాకుల పైనుంచి లేచిన చిరుశబ్దం
ఊపిరినుంచి ఎగిసిన నిట్టూర్పు-
అన్నీ చూపులే!
అన్నట్టు, లోచూపు ఇప్పుడే వెలిగింది.
అన్నీ -చిత్రాలే ఇక !!!

*25.7.2012.

జ్యోతిర్మయి మళ్ళ || తపోయోగం ||

పంజరమే..
లోపల చిక్కుకుని
గిలగిలా కొట్టుకోవడం నచ్చిన
అందమైన బందిఖానా ఇది.

శిరసావహమే..
లోపలికి నెట్టి గడియ పెట్టిన
నీ ఆజ్ఞ !
అమూల్యమైన నజరానా ఇది.

నయనసదృసమే..
చూట్టూ నిలబెట్టిన
నీవేలిముద్రలు పొదిగిన ఇనుపచువ్వలు !
అపురూప ఖజానా నాకిది.

పరవశమే..
ఇక్కడ వదిలెళ్ళిన
నీఊపిరి తరంగ రవళి !
అదురుగుండె కదిలించు సహానా ఇది.

ఆనందాతిరేకమే..
నీసడి కోసం సవ్వడి కోసం
నీ వేలికొస కోసం
మోమంతా కనులుగా
మేనంతా చెవులుగా మారినది !
దీక్షగా నిరీక్షించు తపోయోగమిది.


*25.7.2012

కసి రాజు॥మా ఊరు॥


అబ్బా చీకటి పడితే మా ఊరు ఎ౦తబావు౦టు౦దో!

నల్లచీరకట్టుకున్న నిశిసు౦దరెవరో వీదులె౦బడి తిరిగుతూ,ప్రతీ ఇ౦టిని పలకరిస్తు౦ది

దానికితోడు గుడ్డిదీపాలు రొమా౦టిక్ రాత్రికి మరి౦త త్వరగా స్వాగత౦ పలుకుతాయ్!

పొయ్యి దగ్గర అళివేళమ్మ,కొ౦గులాగుతూ కూచున్న వె౦కన్న "విన్సె౦ట్ వా౦గో" పెయి౦టి౦గ్ లా కనిపిస్తారు

పట్నం నుంచి పనికెల్లిన తన వస్తాడు మొగుడు వస్తాడని ముస్తాబవుతుంది బత్తులోల్ల బుల్లెమ్మ

కూరదాకలోని కుతూహల౦ కుతకుతమ౦టో౦ది!

మొ౦డీదోళ్ళ గొడవలు సద్దుమనిగిపోతాయ్

తాగుబోతు వీరయ్యకు స్నాన౦చేయి౦చే వీరనారి ర౦గమ్మను

అరుగుమీద చుట్ట చుట్టుకు౦టున్న మా సాయిబు తాత అదేలోక౦ చూస్తాడు!

దడేలుగాడు ప్రతివాళ్లని పలకరిస్తూ వీదులన్నీ విహరిస్తాడు

సలాది సుబ్బయ్య వీదిదీపాలార్పెస్తాడు...

ఆ తర్వాత నా సామిర౦గా!
ఊరంతా ఒకటే సౌండు ! కమాన్ గుస గుస అని .


మా ఊరు నిదరోతు౦ది!
*24.7.2012

రమేష్ హజారి॥రేపటి కొరకు॥

నీ ప్రతీ జాడ వేకువ గాలై నాలో ఆశల వూపిరిలూదేది
నీ మంచు కడ్గపు చూపు పదునుకు నా ప్రేమ చెలిమ తొవ్వ కుండానే వూటలూరేది
నీ అలౌకిక స్పర్శ నా పంచేంద్రియాలను కబ్జా చేసి నాకు పంచామ్రుతాన్ని పంచేది
నీ ఎడబాటుకు బెదిరి నీ అరచేయి రేఖనయి నీలో నే ముడుచుకు పోయేది
నీ ప్రేమామృతాన్ని పొందేందుకు నా హృదయ సముద్రాన్ని మదించాను
అమృతము నాకొదిలి హాలాహలాన్ని స్వీకరించావు 

హిందూ మహాసముద్రపు సునామీలో కొట్టుక పోతున్న విలువలను వడిసిపట్టేలోపే
నా మీద ప్రేమతో నీవు విధించిన జీవిత కాలపు శిక్షను శిలారూపమయి భరిస్తాను
ప్రాణమా..గతం జ్ఞాపకమయి వర్తమానాన్ని కొరుక్కు తింటుంటే
మరణమే లేని నీ రూపాన్ని.నా మదిలో రేపటి కొరకు దాచిపెడుతా.
*24.7.2012