పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, మే 2014, బుధవారం

Cv Suresh కవిత

సి.వి.సురేష్ || నాలో కనిపి౦చని నేను || 1) ఒక రోజు ఉదయాన్నే అ౦దమైన మొహాన్ని తగిలి౦చుకొని ప్రేమికుడిలా తయారై ఆమె దగ్గరకు వెళ్ళాను...! నీవెప్పుడైనా ప్రేమి౦చావా? అని ఆమె ప్రశ్ని౦చి౦ది చప్పుడు చేయకు౦డా భూమిని తాకే కా౦తి కిర‌ణ౦లా ఏ క్షణాన్నో మదిని తట్టి లేపే ప్రేమను స్వాగతి౦చావా? అని ఆమె అడిగి౦ది. మౌన౦గా కాసేపు ఆలోచి౦చాను వె౦టనే, తగిలి౦చుకొన్న అ౦దమైన మొహాన్ని తీసేశాను మనసును అ౦ద౦గా మలచడ౦ మొదలుపెట్టాను.! అప్పుడామె మొహ౦ అమితాన‍౦ద౦తో విప్పారడట౦ నేను కళ్ళారా చూశాను...! 2) ఒక మధ్యాహ్న వేళ‌ కొన్ని పుస్తకాలు.. మరికొన్ని కవితా స౦కలనాల్ని భుజాన వేలాడే స౦చిలో వేసుకొని కవిత రాయాలని బయలు దేరాను నీవెప్పుడైనా కవిత్వ౦ రాశావా? ఒక అదృశ్య రూప‌౦ ప్రశ్ని౦చి౦ది దట్టమైన చీకటిని తరిమేస్తూ భళ్ళున పరచుకొనే ఉదయ౦లా కిటికీలో౦చి శబ్ధ౦ చేయకు౦డా చొచ్చుకొచ్చే కా౦తి రేఖలా ఏ క్షణానో గు౦డెను ఆకస్మాత్తుగా తట్టి లేపే కవిత్వాన్ని స్వాగతి౦చావా? అని ఆ రూప౦ మళ్ళీ అడిగి౦ది మళ్ళీ కాసేపు మౌన౦గా ఆలోచి౦చాను. వె౦టనే భుజాన తగిలి౦చుకొన్న స౦చిని పక్కన పెట్టాను మనసులో కాసి౦త తడి, మానవత్వాన్ని ని౦పడ౦ మొదలుపెట్టాను వె౦టనే ఆ అదృశ్యరూప౦ కవితాకన్యగా మారి ఆన౦ద౦తో పొ౦గిపోయి౦ది. ...నా ము౦దు సాక్షాత్కరి౦చి౦ది!!! 3 పై రె౦డు స౦దర్భాలలో నా చుట్టూ ఉన్న ప్రప౦చ పయన౦ ఒక‌వైపు నేనో వైపు అనిపి౦చి౦ది ఇప్పుడు నాలో సగ౦ తెరచిన తలపులు లేవు ఓ ఏకా౦త౦లోకి మౌన౦గా జారిపోయాను అ౦దరూ నన్ను ఓ అద్భుతమైన కవిగా ...... అ౦దమైన ప్రేమికుడిగా అబివర్ణి౦చడ౦ నాకే ఆశ్చర్యమేసి౦ది @ సి.వి.సురెష్ 7.5.14

by Cv Suresh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jeQuDV

Posted by Katta

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా.........డిపాజిట్... ............................................................. ఇక్కడ ప్రతీది డిపాజిట్ల్ ద్వారే దొరుకుతు0ది లేదా సంపాదన ద్వార..... స్థాయి స్థానాలు లబిస్తాయి యజమాని దెగ్గర పనోడి భయం డిపాజిట్ భార్య భర్తకు వంట గది డిపాజిట్ భర్త భార్యకు చీర డిపాజిట్ ఇదంతా డిపాజిట్ల యుగం కుక్క విశ్వాసం డిపాజిట్ చేస్తే దానికి ఇ0టి ము0దు ఉ0డే అర్హత అది ఇఎ0ఐల రూపంల్లో సేవ చెల్లిస్తే దానికి క్రెడిట్ లిమిట్ రూపంల్లో బొచ్చ ని0పుతా0. నిజాయితిని శాశ్వత నిద్ర కమ్మేసి దుప్పట్ల కి0ద దాక్కు0ది. మానవత్వం శాడిస్ట్ మనుషుల కాటుకి చావు బ్రతుక్కుల్లో ఉ0ది. శరీరంలోని భాగాలన్ని వాటి ద్వార జరిగేవన్ని డిపాజిట్లేకే ..... రేపు నీ శవం ఎత్తాలన్నా ము0దుగా నీ అస్తులను నీ కుటు0బ సభ్యులకు డిపాజిట్ చేసి ఉ0డాలి. 07-05-2014

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1noF7to

Posted by Katta

Uday Dalith కవిత

ప్రేమికా ఓ ప్రేమ పాట పాడనీ నన్ను స్వరతంత్రులు ఆకాశపు విహంగమల్లే ఎగరనీ పూదోటలో కురిసిన తొలకరి తేనెజల్లు నీ హృదయనాళం లోకి ఇంకిపోనీ ఓ ప్రేమ పాట పాడనీ నన్ను విరహ జ్వాలల్లో తడిసి ముద్దైన గుండె పాట గొంతు నుండి పలికించనీ తోకచుక్కమల్లే ఆవేశమొచ్చి ప్రాణమంత ఒక్కటై నా పల్లవి వినిపించనీ వేయి కాంతిపుంజాలు వెల్లువెత్తి దేహానికి శక్తినిచ్చి ప్రపంచపుటంచుల నిశ్శబ్ధాలు ఛేదించనీ ఓ ప్రేమ పాట పాడనీ నన్ను ఉదయ్ 07.05.14

by Uday Dalith



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1slgoIu

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

అనవసర ఆవేశాలతో , అహంకారాలతో మీ స్వంత జీవితాలు కూలదోసుకోవద్దు పొరపాటులు మానవ సహజము సహనం తో వాటిని అర్ధం చేసుకోవాలి చదువు సంధ్య లేని మనుషులు కూడా ఎంతో సుఖం గా జీవించారు గతం లో మంచి చదువులు చదువుకుని కూడా భాగస్వామిని అర్ధం చేసుకోలేని జ్ఞానం ఎందుకు ?? గతం లో వివాహానికి అబ్బాయి ,అమ్మాయి జాతకాలు , అలవాట్లు తెలుసుకుని పెద్దల మధ్యవర్తిత్వం లో పెళ్ళిళ్ళు చేసే వారు నేడు చదువులు చూస్తున్నారు అర్హత సమానం గా వుండాలి ఉద్యోగానికి దరఖాస్తు లాగా ఇది వ్యాపార సంబంధం అయిపోతోంది . పెద్దల ఆలోచన మారాలి పిల్లల తెలియని సమాజ పోకడలకు సై అనకూడదు చాలా మంది చదువుకున్న అమ్మాయిలూ సర్దుబాటు చేసుకోలేక సతమత మౌతు చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు వివాహానికి కావలసినది మంచి మనసు అర్ధం చేసుకునే మంచి మనిషి పిల్లల్లు నూరేళ్ళు సంతోషం గా వుండాలి అంటే వివాహం ఉద్యోగ వేట లా ,వ్యాపార ఆట లా చూడవద్దు అన్నీ బాగుంటే అందరూ మేదావులే బాధ పడే తల్లితండ్రులను చూసి బాధ తో మీరు ఆ జాబితాలోకి రావద్దు పెద్దలారా ... ఆలోచించండి !!పార్ధ !!07/05/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1s3en1C

Posted by Katta

Arcube Kavi కవిత

కుళ్ళిన పళ్ళతోట (అఖరి భాగం ) ________________________ఆర్క్యూబ్ ఎక్కడన్నా-పిప్పి పట్టిన పన్ను ప్రశ్నిస్తదా తొర్రి పండ్ల తొండలు శంఖం పూరిస్తయా సిరామిక్ దంతాలకు జనగన మన రుచేదో తెలుస్తదా ఇప్పుడొక్కటని కాదు అన్ని పల్లూ యూరోలోయలో గెవేరాలై పోరాడుతున్న గెరిల్లాలే సిమెంటం చింతపండై ఆఖరి క్షణాన్ని జీవిస్తున్న భగత్ సింగులే సుస్తిర దోపిడితో పంటిని అస్థిరం చెస్తే అది బిర్సాముండై కలెబడుద్ది నొకచో జ్ఞాన దంతం అరాఫత్ ను కలవరిస్తది ఒడంటాలజి కల్వర్ట్ కింద ప్రచండంగా గర్జిస్తది నిలువెత్తు రాక్షస నిర్లక్ష్యంలో సూకీని ముద్రిస్తది తప్పక ఐరోం షర్మీల పంటి భిగియై సామూహికమైతది వద్దు మార్చి ఆరు ఒకరోజు దినోత్సవాలద్దు పంటి కింద రాళ్ళై తగిలే రాజకీయాలద్దు పంటికి సురుకు పెట్టే పాడు ప్రణాళికలద్దు చెవులల్ల మందుపోసి నొట్లెకెల్ల పురుగుల దీసే మ్యానిపేస్టోలద్దు ఎన్నో జమై పంటిని పట్టిచ్చుకోని శిఖరాగ్రాలద్దు అట్లాస్ నిండా డెంటల్ ప్లూలె వద్దు ఇక ఏ ముఖం పిప్పి పన్నుతో పొద్దున పొడవడం నేను చూడలేను _____________________________........____________________________

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fUqoXu

Posted by Katta

Arun Nallella కవిత

తెలుగు భష మాయమౌతుందెమొ తెలుగు కొన్నాల్లకి మరొ గ్రహం మీద వెతాకాల్సి వస్తుందెమో తెలుగును ఆదునిక అలవాట్లలొ పడీ అన్యాభాష పదాల వాడుకనే తెలుగనీ అనుసరిస్తామేమొ తెలుగును నవసమాజపు నడకలతో మరొరూపు సంతరించుకుంటుదెమో తెలుగు గొసపడుతుందెమో తెలుగు వెన్నెల్లొ ఆటల్లెవు ఉయ్యాల పటల్లెవు ఉరపిఛ్టుక పాలపిట్తల పాటలసలే కానరావు శ్రమజీవుల చెమట ఛుక్క జానపదాల జాలులేదు ఎలాగైతె మాయమౌతుందెమొ తెలుగు...... అరుణ్ 7/5/2014

by Arun Nallella



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1skGf3m

Posted by Katta

Bappi Guruvindapalli కవిత

జీవితం | బప్పి గురువిందపల్లి | 07-05-2014 కలలన్నీ హరించుకు పోయె, అరుణమే ఆకాశం ఎక్కగా, ఇల లోన ప్రతి అడుగు పోరాటమయ్యె, ప్రతి జీవి అవకాశం వెతకగా, ఒక క్షణం నీకు నీతోనే రణం, మరు క్షణం స్వాగతించే తొరణం, ఏది ఏమైనా లోకంలో ఉన్నవి రెండే తెగలు......, మంచి, చెడు .. నీ యొక్క ఎన్నికలొనే దాగుంది నీ బ్రతుకు మన్నిక.................... వంచించి,వేదించి పొందిన దానితో నిండేది కంచమే కాని కడుపు కాదు, మంచిచ్చి, మనసిచ్చి చేసిన దాన్లొనే ఉంది స్వఛ్ఛమైన సంత్రుప్తి తెల్ల కాగితం నీ జీవితం, నువ్వెంచుకున్న సిరాపై ఆధారం నీ గతం...

by Bappi Guruvindapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jdrKw2

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అపసవ్యం ఓవక్త...మానవమేథస్సును,శక్తిని,మానవత్వాన్నిగూర్చిఅనర్గళంగా ఉపన్యసిస్తున్నాడు.... ఎవరెస్టుపై జండా పాతిన పర్వతారోహకుడు క్రమంగా దిగుతున్నాడు... తమబంధువు ఉసురు తీసిన కల్తీఔషధాలను ఓనిర్భాగ్యుడు శాపనార్థాలుపెడుతున్నాడు.... ఓకాకి మరణిస్తే తల్లడిల్లిన సహచరకాకులు భీభత్సాన్ని చేస్తున్నాయి. ఓతల్లిశునకం పిల్లిపిల్లకు ఆప్యాయంగా తనపాలనిస్తోంది డబ్బులివ్వలేని పేదరోగిని ఆసుపత్రిసిబ్బంది చెట్టుకిందికి ఈడ్చేస్తున్నారు నిర్ధాక్షిణ్యంగా... ఒంటరియువతిని తుంటరులు కొందరు నడివీథిలో వేధిస్తూ ఆనందిస్తున్నా న్నారు. క్రమక్రమంగా స్పృహను కోల్పోతున్నప్పటికీ వరాహం తన గుడిప్రదక్షిణ మానడంలేదు శిలామయ విగ్రహపు కనుకొలకులనుండి అభిశంసనాపూర్వక వేదనాభాష్పాలో అభినందనాపూర్వక ఆనందభాష్పాలో తెలియని కన్నీటిబిందువులు మాత్రం జాలువారుతున్నాయి.

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fTWdiY

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ir2RI9

Posted by Katta

Vani Koratamaddi కవిత

//పిచ్చుక// మరుగైపోతూ మా మంచి పిచ్చుక అరుదైన జాతిగా మిగిలి పోతావా సాంకేతికత నీ పాలిట శాపమయ్యిందా ఆధునికత పుణ్యమా అని అంతరించిపోతావా చిన్ననాటి మా ఆప్తనేస్తం నీ కిచ కిచలు మాకింక వినిపించలేవా అద్దంపై ముక్కుతో గుచ్చిన చుక్కలు చెరిగిపోనీ గుర్తులుగా మిగిలాయి నాడు పిచ్చుకపై బ్రహ్మస్త్రం అనేవారు నేడు నీపై మానవాస్త్రం సంధించినారు సెల్ టవర్లు నీపాలిట మ్రుత్యుకుహరాలు నీ జాతి అంతానికి అయినాయి మార్గాలు తల్లి బందం అంటె పిల్లలకే చూపినావు ఆహారం తినిపించిన చర్యలే సాక్ష్యంగా విశ్వాసానికి చిహ్నంమైన పిచ్చుక అమాయకత్వానికి నిదర్శనం శతాబ్దాలుగా చేసిన సహజీవనం మిగిలి పోనుందా మాకు జ్ఞాపకంగా అంతరించిపోకుండా కాపాడుకుందాం ప్రయత్నం చేద్దాం అందరం అవసరంగా (మేమూ పెంచుకుంటున్నాం మా బాల్కనీలో ఓ పిచ్చుకల జంటని) .....వాణి కొరటమద్ది , 7 may 2014

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o5L6Ga

Posted by Katta

Ramesh Ragula కవిత



by Ramesh Ragula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mBf8lx

Posted by Katta

Lingareddy Kasula కవిత

నేను మరణిస్తాను || డా// కాసుల లింగారెడ్డి || 06-05-2014 నేను మరణిస్తాను ఓ నా చిన్ని ఖగోళ శాస్త్రజ్ఞడా! నీకు తెలిసిన ఒక నక్షత్రాన్ని వెదికి దానికి నా పేరు పెట్టు నేను నీ జీవితాకాశం మీద వెలుగులు చిమ్ముతూవుంటాను నేను నిన్ను మరిచిపోనూ లేదు అట్లా అని అనాథను చేయనూ లేదు అసలు బాధ్యతను విస్మరించనూ లేదు ఉజ్వల భవిష్యత్‌ చిత్రపటము దగ్ధమైనందున బతుకు మసిని పోగుచేసుకుంటున్నా రసికారుతున్న రాచపుండు అనుబంధాలకు విస్త్రుత శస్త్రచికిత్స చేస్తున్నా నువ్వు నా జీవన ప్రత్యూష ప్రజ్వలానివి నేను నీ పుట్టుకతో,బాల్యంతో పెనవేసుకున్న పేగుబంధాన్ని నేను నిష్క్రమిస్తాను విశాల ఆకాశం మీద నువ్వొక నక్షత్రాన్ని ఎన్నుకో దానికి నా పేరు పెట్టు నీరవ నిశ్శబ్దంలోను నిబిడ గాఢాంధకారంలోను నేను నీ మీద వెలుగులు ప్రసరిస్తూవుంటాను నువ్వు నా కలల సాకార రూపమౌతావు. డా|| కాసుల లింగారెడ్డి 6 మే2014 సెల్‌: 8897811844

by Lingareddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qdevAf

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి అద్వైతం నా ఎదురుగా నేను నన్ను నేను తనివి తీరా చూసుకుంటూ నా కౌగిలిలో నేను నన్ను నేను నాలో కలుపుకుంటూ నా మస్తిష్కంలో నేను నన్ను నేను ఊహించుకుంటూ నా అంతరంగంలో నేను నన్ను నేను ప్రేమించుకుంటూ ఆ నేనే తను - ఆ తనే నేను తను లేకపోతే..... నాకు నేనేమీ కాను నేనున్నా కూడా నేను లేను! 07May2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qdaiwi

Posted by Katta

Bharathi Katragadda కవిత

సీ. మందార మకరంద మాధుర్య రుచులతో అలరారు కమ్మని అమ్మభాష నిండైన గమనంబు నిండైన తేజంబు కలుపుతూ తరలింది కడలి వోలె చల్లని గాలిలా చక్కని కవితలా మనసుని తడిమింది మంచువోలె కమనీయ రమణీయ గారాల నడకతో కనువిందు చేసింది ఘనముగాను. తే. పద్యపు సొగసుతో కూడి వన్నె తెచ్చె గద్యపు నడకతో కూడి ఘనము కూర్చె జాన పదములతో కూడి జలధియయ్యె అట్టి మన భాష పలుకంగ అవధులేల?

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1s1PH9O

Posted by Katta

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

Today 153rd Birthday of Rabindranath Tagore ----------------------------------------------------------- Happy Birthday "Rabindranath Tagore" jiii thanks for giving us "Jana Gana Mana".. (Y) http://ift.tt/1fT4x2I

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fT4x2I

Posted by Katta

Sriramoju Haragopal కవిత

వేయబోవని తలుపు తెరువేదిరా వేసిన తలపుల తలపులట్నే వున్నాయి కనురెప్పలవంతెన మీద ఎవరు నింగికి నేలకు మధ్య మసకచీకటి కప్పుకుని వొణుకుతున్న పెదవుల మీద పిలుపులెవ్వరికొరకు శ్వాసలో ఎవరి పాటలవీణాతంత్రుల మంద్రస్వరాలు ఊపిరి కొట్టుకుంటున్న పిల్లనగ్రోవి గాయాల పైన ఎవరివి వేళ్ళు నేనిక్కడే నాలోపలే టపటప రాలే కన్నీటిరాట్నమై కదలలేని బెంగ, కనపడవేమని వెతుకులాట మనసుపొరల్ని తరిగిపోసుకుంటూ నీ బొమ్మకై తండ్లాట నా చుట్టూరా నువ్వే కొండవాగువై గలగల నవ్వుతూ నన్ను చుట్టుకుని నీ వాసనలే పూలతోటలై కమ్ముకుని నాకేమీ తెలియనీయని నిశ్శబ్ద నిరీహలు పాటనై ఎగిరిపోయినంతదూరం ఎంత సంతోషం నీ రాగసూత్రాలు నన్ను తాకి వున్నంతకాలం దేహంలో దేహమై, మోహనాంతర స్నేహాంతరంగమై ఆత్మీయుడా, నన్ను ఎక్కడికీ కదలనీకు నీ ఒడిలోనికి తప్ప

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fSNRrY

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/అక్షరం ఈరోజు అక్షరాలన్నీ చిన్నబోయాయి స్వచ్చమైన పదాల అల్లికలో విఫలమై అనేక కలాలు పదే పదే కాగితం పొలంలో శ్రమిస్తున్నా దాహం తీరక నిర్లిప్తమయినాయి ఎందరి జీవితాల్లో హస్తవాచికలయ్యాయో తమ రూపాన్నీ చాటడం కోసం పేర్చిన పదాలలో ఒద్దిక కరువైనప్పుడల్లా నిశ్శబ్దంగానే రోదిస్తూ వెన్నెల వాకిళ్ళలో తేలినప్పుడల్లా వేదనసంద్రంలో మునకలు వేసినా తోడొస్తూనే ఉన్నాయి నిష్కల్మషమైన చేతిచూరులో ఎప్పుడూ అద్దుకునే ఉంటాయి అర్థాలహాయిని మోస్తూ కొన్నిసార్లు ప్రేమగా మరికొన్నిసార్లు దుఖంగా ఆర్ద్రథగా ఆవేదనగా ఆవేశంగా పరివర్తించుకుంటూనే ఉన్నాయి కొత్త పదాలను జనియిస్తూనే కలివిడివేళ్ళు దొరికినప్పుడల్లా కాదీ అక్షరం అంతం మళ్ళీ రూపాంతరం మాత్రమే తిలక్ బొమ్మరాజు 01.05.14 07.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1oDlw

Posted by Katta

Madishetty Gopal కవిత

@@ ENTRIES ARE INVITED TO CINARE PURASKAR-2014@@@

by Madishetty Gopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1bzwH

Posted by Katta

సత్యవతి కొండవీటి కవిత

ఫ్రేముల్లో బిగించిన ముఖాలకి ఎన్ని టచప్ లిచ్చినా ఏం లాభం లేదు గుండెల్లో ప్రేమను వెలిగించి చూడు నీ ముఖమే కాంతి మండలమౌతుంది పై పైన పూసే ఫేషియల్ క్రీములు లోలోపలి చీకటి కోణాలను క్లీన్ చెయ్యలేవు ఎన్ని నగల్ని దిగేసుకునీ ఏంటి లాభం ముఖాన వెలగాల్సిన నవ్వు నగ లేకపోయినప్పుడు..

by సత్యవతి కొండవీటి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fSlxpD

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

ఈ నెల "వాకిలి" లో వచ్చిన నా అనువాద కవితలు : 1. ....|| నేను ఒంటరిని కాను ॥.... (I am not alone) ఈ రాత్రి నిర్జన రాత్రి సానువులనుండి సముద్రం దాకా. కాని, నిన్ను ఊయలలూపుతున్న నేను ఒంటరిని కాను! ఈ నింగి ఒంటరి ఎడారి I శశి సంద్రంలో పడిపోయింది కాని, నిన్ను పొదివి పట్టుకున్న నేను ఒంటరిని కాను! ఈ భువి ఒంటరి ఊషర క్షేత్రం ఉసూరు మంటున్నది దేహం కాని, నిన్ను హత్తుకున్న నేను ఒంటరిని కాను! 2. ....॥ అపరిచిత ॥.... (stranger) ఆమె ఒక విచిత్ర వృద్ధవర్షీయసి ! సముద్ర ఘోష ఆమె భాష ఆమె మాట్లాడుతుంది తనదైన వింత పంథాలో ఆల్గే లాంటి అజ్ఞ్యాత అల్ప జీవాలతో, అపరిచయ సైకతాలతో . అవసాన దశ ఆసన్నమైనట్టుండే ఆమె ఆరాధిస్తుంది బరువు లేని ఆకారం లేని దేవున్ని! ఆమె వచ్చాక మా తోట ఒక విచిత్ర వనం! కాక్టస్, అలీన వన తృణాల మయం, ఆమెలో నిండి వుంది ఎడారి గాలి శ్వాస. ఆమెది అచ్చమైన స్వచ్ఛమైన గాఢ మమత , ఆమె మౌనాన్నే ఆశ్రయిస్తుంటుంది ; చెప్పాల్సి వస్తే అజ్ఞ్యాత నక్షత్రాల వర్చస్సులను వర్ణించాలి గా మరి ! చిరు వన ప్రాణులకు మాత్రమే అర్థమయ్యే తరుగుల్మాల వాక్కు ఆమెది . నిన్ననే కొత్తగా వచ్చినట్టుంటుంది; బతికితే బతకొచ్చు ఓ ఎనభై దాకా. ఏదో ఒక బాధామయ భయద రాత్రి ఆమె మామధ్యే మరణిస్తుంది ; విధి తలగడ గా, నిశ్శబ్దంగా ,హఠాత్తుగా. మూలం : గాబ్రియేల్ మిస్త్రాల్, చిలీ దేశ నోబెల్ లారియేట్. తెలుగు సేత : నాగరాజు రామస్వామి . Dt: 07.05.2014. ' Sent from my iPad

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j11KP6

Posted by Katta

Kapila Ramkumar కవిత

|| అడిగోపుల వెంకటరత్నమ్‌, (తిరుపతి) ||అందిన ఆయుధం|| Posted on: Wed 07 May 00:02:08.082753 2014 సొంత సంతకం కోసం స్వాభిమానం కోసం సమాజ సంక్షేమం కోసం అహర్నిశలు పోరాటం తామరాకుపై కదలాడుతూ ఉంది నీతి నీటి బిందువులా - మాట మాట్లాడుతూ ఉంది హింస విధ్వంస గానం మనిషి పాత్రలు నవరాత్రులు! చూపు చూస్తూ ఉంది కామం క్రోధం కవలలయ్యాయి మనిషి నటిస్తున్నాడు! నడక సాగుతూంది స్వార్థం కపటం సంగమించాయి మనిషి దారి తప్పాడు! కత్తికి ఖండించటమే తెలుసు ధరించిన వాడి నైపుణ్యమే న్యాయం ధర్మాధర్మాలు తెలియవు! నన్ను నేను ప్రదర్శిస్తే నా చిరునామా చెదిరిపోతుంది నన్ను నేను దాచుకుంటే నా చిరునామా దుఃఖిస్తుంది! దేశం ప్రవాసమైంది బతుకు అగాథమైంది ఒకడు నొసట రాతలు రాస్తుంటాడు ఒకడు అమలు జరుపుతుంటాడు! ఓటు వజ్రాయుధం ఎక్కడ శచీపతులు ఓటు యమపాశం ఎక్కడ దండధరులు ఓటు పాశుపతాస్త్రం ఎక్కడ సవ్యసాచీలు ఓటు రామబాణం ఎక్కడ శ్రీరామ చంద్రులు? ఎన్నుకోండి ధర్మాన్ని మూర్తీభవించిన మానవత ప్రత్యక్షం ఎన్నుకోండి న్యాయాన్ని జాతికి దక్కుతుంది నీతి సాన్నిధ్యం!

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jaMAvL

Posted by Katta

Padma Rani కవిత

!!ఓడిపోతున్నా!! ఆశయసాధనకి ప్రణాలికలే ప్రాణమని.. నమ్మిన ప్రతిసారీ నేను ఓడిపోతున్నా! అసంతృప్తిని మించిన పేదరికంలేదని.. సంతృప్తియే సిరులనుకుని సర్దుకున్నా! ఆశను మించిన ఔషధం ఎక్కడుందని.. నిరాశల్ని నవ్వుతో చికిత్స చేసుకున్నా! సరికాని సమస్యలని సమర్ధించలేనని.. సర్దుబాటంటూ కోరికల్ని అణుచుకున్నా! పెంపకంతో ప్రేమపాశం పెనవేయలేనని.. ఊపిరైన బంధాలనే వదిలేసి జీవిస్తున్నా! నమ్మకం ఆత్మస్థైర్యాలనే ఆయుధాలని.. ఎక్కుపెట్టి మరో జీవనసమరం చేస్తున్నా! 07-5-2014

by Padma Rani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fQYo78

Posted by Katta