పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Srinivas Yellapragada లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Srinivas Yellapragada లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, మార్చి 2014, సోమవారం

Srinivas Yellapragada కవిత

యల్లాప్రగడ రాజా రవి శ్రీనివాస్ ||వెతుకులాట|| అతడు తప్పిపోయాడో ఏమో ఈ మధ్య కనిపించట్లేదు అతడొక్కడు చాలు అన్నింటికీ సమాధానం చెప్పగలవాడు ఇంద్రధనస్సు సప్తవర్ణాలూ కలిసిన చోట తెల్లని తెలుపులో కలిసిపోయుంటాడు విభేదాల కార్బన్ డయాక్సైడ్ ఎక్కువయ్యి చీకటి కప్పేసిన చోట ఆదరువు ఆక్సిజన్ తక్కువై మిణుకు మిణుకుమంటున్న విలక్షణత దీపంతోతిరుగాడుతుండుంటాడు కులమతప్రాంతజాతి సరిహద్దుల్ని చిర్నవ్వుతో చేరిపేయగల సామర్ధ్యమున్నవాడు అజ్ఞానాంధకారంలోతడుముకోకుండా ఆశయజ్ఞానదీపం వెలిగించగల చాతుర్యమున్నవాడు మనసు నగ్నత్వాన్ని నటన వలువలతో కప్పుకోకుండా లోకంలో తిరుగాడే దమ్మున్నవాడు ఫేస్ బుక్ లో ప్రకటించండి ఇంటర్నెట్ లో చాటింపు వేయించండి ఎక్కడున్నా పట్టి తెమ్మని ఇంతకీ అతడెవరంటే అతడి పేరేంటబ్బా... ఆ( ఆ( అతడే మనిషి అవునవును మనిషి ఇప్పటికే సమయం మించిపోయిందో ఏమో అయినా మన ప్రయత్నం మనం చేద్దాం ఈ ఒక్కసారికీ ఆఖరిసారని బతిమాలి ఎలాగైనా తెప్పిద్దాం ... 24MAR14

by Srinivas Yellapragada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jtAMCk

Posted by Katta

22, మార్చి 2014, శనివారం

Srinivas Yellapragada కవిత

యల్లాప్రగడ రాజా రవి శ్రీనివాస్ ||మార్పు|| ఎవరు మారతారు.. పెద్దవారిని ప్రాధేయ పదాలతో శరణు వేడినా చిన్నవారిని మందలింపు బెత్తంతో అదిలించినా స్నేహితులను ఆకర్షణ మాటలకు గురిచేసినా తెలిసినవారిని అప్పుడప్పుడూ వినమ్రంగా చెప్పిచూసినా ఎవరు మారతారు.. మాయ పొరల్లో దాక్కున్న వేల జన్మల ధోరణులవి నశించిపోయే అస్థికల అస్థిత్వాన్ని నమ్మి ముందుకు సాగే అడుగులవి ఒక వాక్యం సరిపోతుందా.. ఒక చిత్రం చూపిస్తుందా వారికి నిజం నిరూపించడానికి ఒక సత్యం చూపించడానికి స్వీయ అనుభవ కొరడాలు పేలాలి భావాల కొంపలు కుప్ప కూలాలి అంతవరకూ.. ఎవరు మారతారు.. 22MAY14 ...(సూరీడు)

by Srinivas Yellapragada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hRIuVy

Posted by Katta

17, మార్చి 2014, సోమవారం

Srinivas Yellapragada కవిత

యల్లాప్రగడ రాజా రవి శ్రీనివాస్ ||ఉదయం|| నేను లేస్తాను ప్రతిరోజూ నిశ్శబ్దానికి తోడుగా కీచురాళ్ళ కిలకిలారావాల మధ్య పగటి బద్ధకాన్ని తరిమేస్తూ నిశోదయాన్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తూ... జనగళం సవ్వడులు సద్దుమణిగి శరీరాలను సేదతీర్చుకుంటున్న వేళ కనిపించే వాస్తవాలు చీకటి ముసుగేసుకుంటుండగా కనిపించని నిజాల తెరలు తొలగుతున్నవేళ భావాల అలజడులు సద్దుమణిగి మనోఫలకం పారదర్శకమవుతున్న వేళ బతుకు గదికి గడియపెట్టి జీవిత ద్వారం తాళం తీసి నాలోనున్న నా లోపలికి అడుగుపెడతాను సత్యం కాన్వాసు పరిచి నాలో నన్ను చిత్రీకరించేందుకు అప్పటివరకూ చేతనున్న అనుభవాల రంగుల్ని విసిరికొట్టి మెదడులోతుల వర్ణాలు అన్నీ కలిపి గీయడం మొదలెడతాను ఎప్పటినుంచో నేను గీస్తున్న ఆచిత్రం ఈనాటికీ అసంపూర్ణమే!!! 17MAR14

by Srinivas Yellapragada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p2hvcw

Posted by Katta

29, సెప్టెంబర్ 2012, శనివారం

యల్లాప్రగడ రాజా రవి శ్రీనివాస్ || ప్రేమవతారుడు

మొదటిసారి అతడి రక్తం చిందించబడింది
అతడికి ముళ్ళకిరీటం అలంకరించబడ్డప్పుడు

అతడు శిలువను మోసాడు
దానితోటే అందరి పాపాలను మోస్తున్నానని భావించాడు
ఆ బరువుతో శరీరమొంగినా..
తనలో కరుణ మాత్రం నిఠారుగా ఉందని చాటాడు

అతడి రక్తం స్రవించి ఇంకుతూనే ఉంది
వంటిపై కొరడా పేల్తున్నప్పుడూ
శిలువకు మేకులు మోదుతున్నప్పుడూ

రక్తమింకిన ప్రతిసారీ..
అతడి ప్రేమద్విగుణీకృతమయ్యిందనుకున్నాడు
అతడు నోరు తెరిచి అడగడడమే తరువాయి..
దైవం తరఫు లక్షల సైనికులు
అతడి పక్షాన నిలబడే అవకాశముండీ
ప్రేమించే బలహీనత వల్ల
అతడు మిన్నకున్నాడు

సరిగ్గా మూడ్రోజుల తర్వాత
అతడు పునరుజ్జీవితుడయ్యాడు
కానీ..
ఇంకా భూమిపై ఎన్నో
సంపూర్ణ ప్రేమోద్భవ హృదయగర్భాల ద్వారా
అతడు నిత్యం
పునరుజ్జీవితుడవుతూనే ఉన్నాడు!! 
25SEP12

27, సెప్టెంబర్ 2012, గురువారం

యల్లాప్రగడ రాజా రవి శ్రీనివాస్ || ఎక్సెంట్రిక్ ఫెలో


ఇతడు ఖచ్చితంగా..మూర్ఖుడో..పిచ్చివాడ
ఏదేమైతేనేం తప్పనిసరిగా
మట్టుబెట్టి సమాధి చెయ్యాల్సినోడు

లేకుంటే..
దేవుడికి ప్రతిరూపం మనిషంటాడు
దేవుడొక్కడేననీ..ఎక్కడోలేడనీ
సరిగ్గా వెతికితే నువ్వే దేవుడంటాడు
హుండీల ఆదాయం కొల్లగొట్ట చూస్తున్నాడు

ప్రతి బంధం వెనుక స్వార్థమే ఉందనీ
ప్రేమిస్తే అది మటూమాయమంటాడు
ఇచ్చిపుచ్చుకోవడాలొద్దంటాడు
ప్రేమ పేరిట వ్యాపారాలన్నీ మూతబడ చూస్తున్నాడు

పగ ప్రతీకార జ్వాలల్ని
క్షమా వర్షంతో ఆర్పొచ్చంటాడు
కోట్ల విలువైన ఆయుధ సంపత్తికి చెదపట్టించేట్టున్నాడు
మానవులంతా ఒకటయ్యే విపత్తు తెచ్చిపెట్టేట్టున్నాడు

ప్రపంచం అంతా వెతికితే లోనే ఉందంటాడు
విద్యకు మూలం స్వీయశోధనంటాడు
కళాశాల వ్యాపారాల్లో పెట్టుబడులన్నీ
మునిగిపో చూస్తున్నాడు

ఙ్ఞానమైనా సత్యమైనా
నీలోనే కనుక్కునే ప్రయత్నం చెయ్యమంటాడు
గురువైనా స్వామైనా నువ్వేనంటాడు
భక్తజనకోటి ఆదర్శాలను కాలరాయ చూస్తున్నాడు

ఏమాత్రం మన్నించాల్సినోడు కాడు
ప్రపంచం చివరివరకూ తరిమి తరిమి కొట్టాల్సినోడు!! 
24SEP12

24, సెప్టెంబర్ 2012, సోమవారం

యల్లాప్రగడ రాజా రవి శ్రీనివాస్ || మతమా మార్గమా


వారెవ్వరూ లేరు
వారు వివరించిన ధర్మ మార్గాలు మిగిలున్నాయి
అదొక మార్గమేనని చెప్పిన వ్యాఖ్యలున్నాయి

అతడు లేడు
అతడు చెప్పిన ప్రేమ, పరిశుద్ధత దార్లున్నాయి
అవి దార్లేనని రాసుకున్న మాటలున్నాయి

అతడు లేడు
అతడు బోధించిన జ్ఞానం, బుద్ధం మిగిలున్నాయి
అవి కూడా అటే చేరుస్తాయని చెప్పిన మాటలున్నాయి

అతడు లేడు
అతడు నిరూపించిన కరుణ, శాంతి కూడా ఉన్నాయి
వాటితో నువ్వు చేరేదక్కడికేనని రాతలున్నాయి

అతడు లేడు
అతడు పాటించిన సత్యం, వైరాగ్యం త్రోవలున్నాయి
ఆ త్రోవల్లో నీ గమ్యం అదేనని బోధనలున్నాయి

మనిషి దేవుడి సృష్టి
మార్గాలు, త్రోవలు, దారులు వారి దృష్టి
మతం మాత్రం మన సృష్టి
మన మతమేదంటే మానవమతమని బల్లగుద్ది చెప్దాం
ప్రాంత దేశ పరిమితులు కూడా దాటి
ఏదైనా చేరేది ఒక్కటేనని నిరూపిద్దాం!

23 SEP 12

శ్రీనివాస్ ఎల్లాప్రగడ ॥ నువ్వెక్కడ ?


కుక్కపిల్లకి ముద్ద విసిరి చూడు
ఎప్పటికైనా అది నీపై చూపించే
విశ్వాస ప్రేమను చూడు

గుడిలో ఏనుగుకు అరటిపండిచ్చి చూడు
అది తొండమెత్తి నిన్ను దీవించే
వాత్సల్య ప్రేమను చూడు

పిల్లిపిల్లకి పాలు పోసి చూడు
అది జీవితాంతం నిన్ను రాసుకు పూసుకు తిరిగే
ఆప్యాయత ప్రేమను చూడు

పావురానికి గింజలు విసిరి చూడు
రోజూ క్రమం తప్పక నీ దగ్గరకొచ్చే
దాని అనుబంధ ప్రేమను చూడు

గోవుకు గడ్డి పెట్టి పాలు పితికి చూడు
నువ్వు తనని పిండుతున్నా
ఆ తల్లి కళ్ళలో నిర్మ ప్రేమను చూడు

తోటి ప్రాణివైన నీపై
కనీసం వాటి జాతైనా కాని నీపై
వాటి రకరకాల ప్రేమల్ని చూడు

మరి నువ్వు పేజీల కొద్దీ రాస్తుంటావు
గంటల తరబడి ప్రసంగిస్తుంటావు
ఇందులో ఏ ప్రేమో వెతికి చూడు!! 22SEP12

22, సెప్టెంబర్ 2012, శనివారం

Srinivas Yellapragada ‎"మనవాడే"


అలా అనకండి..అతడూ మనవాడే
సరిగ్గా చూడండి..మనలోని వాడే

కాకుంటే..
మనం ఏడిస్తే అతడు నవ్వడు
మన ఏడుపు మానిపే ప్రయత్నం చేస్తాడు
అతడూ మనవాడే

కాకుంటే..
మనం నవ్వినపుడు అతడు ఏడ్వడు
మన నవ్వులో నవ్వవుతాడు
అతడూ మన వాడే

కాకుంటే..
మనం పడితే అతడు మాటల కారం జల్లడు
అతడి చేతితో ఉపశమన లేపనం పూస్తాడు
అతడూ మనవాడే

కాకుంటే
అతడు ప్రేమించమనడు
అడక్కుండానే అందరినీ ప్రేమిస్తాడు
అతడూ మనవాడే

కాకుంటే..
మనలోనే కలిసి తిరుగుతున్నాడు
అయిన విడిగా గుర్తించబడే వ్యక్తిత్వం కలవాడు
అతడూ మనవాడే

కాకుంటే..
అతడిలోనూ అతడున్నాడు
అందర్లో కూడా అతడున్నాడు
అతడూ మనవాడే

కాకుంటే..
బతకడం కోసం జీవించడు
జీవించడం కోసం బతుకుతాడు
అతడూ మనవాడే

కాకుంటే
అతడు మనిషి అంతే
అతడు మనీషి అంతే !! 20SEP12

12, సెప్టెంబర్ 2012, బుధవారం

శ్రీనివాస్ ఎల్లాప్రగడ "కలాంతం"


కలగను..కలగను
ఇంకెన్నాళ్ళులే..
మెలకువకు వేళయ్యింది
చైతన్య కిరణాలకు
భూమంతా ప్రకాశించే
వేళ దగ్గరకొచ్చిందిలే..

కలగను..కలగను
ఇంకెన్నాళ్ళులే..
ఙ్ఞాన వర్ష తాకిడికి
అరిష్డ్వర్గ పొరలు చీల్చుకుని
సత్యం చిగురించే రోజెంతో దూరం లేదులే..

కలగను..కలగను
ఇంకెన్నాళ్ళులే..
బ్రహ్మానంద పవనాల తాకిడికి
మనసు దుప్పటి ఎగిరి పడి
జన్మజన్మల వాసన బధ్ధాకాల్ని
విదిలించి పారేసి
ఉషస్సు వైపు పరుగులెత్తే
సమయం ఆసన్నమయ్యందిలే

ఇంకెన్నాళ్ళు?
ఇదే సరి అనుకుని
ముందుకెళ్ళడం మరచి
ఉన్నచోటే పాతుకు పోయి
నీకు కదిలే శక్తిచ్చాడని మరిచి
నువ్వు కంటున్న కలలు..
కలగను..కలగను
ఇంకెన్నాళ్ళులే.. 10SEP12

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

Srinivas Yellapragada ‎ // "కలం ఏడ్చింది" //


నన్ను నింపావు నీలంగా
నాతో నిన్ను రాసేందుకు..
మదిలో పొంగిన భావాన్ని
మెదడు నరాల్లోకి లాగి
మనసు భావాన్ని
మనుషభాషకు తర్జుమా చేసి
చెయ్యి కదిపావనుకున్నా
నా నాల్క తెల్లటి నేలపై
నీలం ముత్యాలు రాల్చింది
నీకు ఆనందం..నాకు పరమానందం
నీకు నేనుపయోగపడుతున్న విధం

నీలో ఆశచావలేదనుకున్నా
నీ తీరు మారలేదనుకున్నా
ఇంకొన్ని పొంగిన భావాలు
నానుండి జాలువారిన ముత్యాలు

నీవు నింపుతున్నావు
నేను కక్కుతున్నాను
అదే పనిగా..అదే తీరుగా
నువ్వు ఙ్ఞానివనుకున్నా
మనసులో నీకు కోటి దండాలన్నా

కాలం కదిలింది వేగంగా
నీ చెయ్యి కన్నా కొంచెం వడిగా
నాకు వీలు దొరికింది
నీ లోకం పోకడ చూసే విధంగా

నీకు తెలియలేదు కానీ
నా ఆనందం ఆవిరయ్యింది
నా మనసు బడబాగ్ని మధ్య
నేరాల్చిన అక్షరాలు నవ్వాయి
నా కన్నీళ్ళ మధ్య

నీ ప్రపంచం ఇదా?
నీ అసలు తీరిదా?

రాల్చేందుకే కానీ
అవి నీ మదినుండి కాదని
నీ చెయ్యి రాసేందుకే కానీ
చేసేందుకు కాదనీ

తనివితీరా ఏడ్వాలనుంది
మళ్ళీ కలాన్నై పుట్టరాదని
ఉరేసుకోవాలనుంది
నాతో ఓ సూడో ప్రపంచాన్ని సృష్టిస్తున్నానని!! 08SEP12

8, సెప్టెంబర్ 2012, శనివారం

యల్లాప్రగడ రాజా రవి శ్రీనివాస్ - "పరుగు"


అతడు పరిగెడుతున్నాడు
కాళ్ళు సాగదీసి.. శక్తినంతా కూడదీసి
అదే పనిగా..ఎక్కడికో తెలుసో లేదో
...
అతడు పరిగెడుతున్నాడు
అనుభవాల్ని లెక్కించుకుంటూ
భావాల్ని ఆరబోసుకుంటూ
అంధకారమైనా తడుముకుంటూ

అతడు పరిగెడుతున్నాడు
అప్పుడప్పుడూ ఆవేశాన్ని
అక్షరాలుగా మారుస్తూ
అదే పరుగని తలుస్తూ
వళ్ళు మరచి కళ్ళు మూసి

అతడు పరిగెడుతున్నాడు
సుఖంచుక్కను చూసి
అటువైపే వెలుగనుకుంటూ
పక్కవాడు పడుతుంటే
తానుముందుకెళ్తానని ఊహిస్తూ

అతడు పరిగెడుతున్నాడు
కష్టం గోడోస్తే దూకడం మాని
తన దారిని మళ్ళిస్తూ
బతకితే ఇలాగే బతకాలని
పక్కవారికి స్ఫూర్తితో నేర్పిస్తూ

అతడు పరిగెడుతున్నాడు
జీవితం ఆఖరయ్యే సమయానికి
లెక్కేసుకున్నాడు పయనమెంతని
తెలుసుకున్నాడు ఉన్నదక్కడేనని

అతడు పరిగెడుతున్నాడు
మళ్ళీ పుట్టి..ఈసారి కొంచెం వేగంతో
కాళ్ళు సాగదీసి.. శక్తినంతా కూడదీసి
అదే పనిగా..ఎక్కడికో తెలుసో లేదో
అతడు పరిగెడుతున్నాడు 06SEP12

21, ఆగస్టు 2012, మంగళవారం

శ్రీనివాస్ ఎల్లాప్రగడ కవిత


తవ్వుతున్నా..ఏదంటే అదే
వస్తున్న అయాసాన్ని
ఓర్పు వెనక్కినెట్టుతూ
కారుతున్న అనుభవాలస్వేదాన్ని
సంకల్పహస్తంతో తుడుస్తూ
...ఙ్ఞాపకాల అంధకారంలో
పరమావధి లోచనావెలుగు తోడుగా

తవ్వుతున్నా..ఏదంటే అదే
ఎటుచూసినా కూలుతున్న
కుళ్ళు..కుతంత్రాల పెళ్ళలే
చిర్నవులపారతో పక్కకి తోస్తూ
నేనూనాదనే అహాల బండలే
లక్ష్యశోధన ఉలితో
కాలం సుత్తితో ముక్కలు చేస్తూ

తవ్వుతున్నా..ఏదంటే అదే
బొట్టుబొట్టుగా అప్పుడప్పుడూ
అంతర్చక్షువుకి కనిపిస్తుంటే
ముముక్షత్వ దాహాన్నవి తేర్చలేకుంటే
పిడచకడుతున్న మది నాలుకను
తత్త్వ నెమరువేతతో ఆపుకుంటూ

తవ్వుతున్నా..ఏదంటే అదే
ఙ్ఞానఊట ఎప్పటికైనా ఊరుతుందని.

*20-08-2012