పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Naresh kumar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Naresh kumar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జూన్ 2014, శుక్రవారం

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్//ఆకలి పాట // (ఒకటోది) ఏదో ఒకనాటికి మనం పుట్టినప్పుడు అమ్మ వెన్నునుండీ పొత్తికడుపువరకూ సాగిన అనివార్యపు ధుఖం లీలగా చెక్కిలిని తడుముతున్నట్టు ఆకలి స్పర్శ.... సన్నగా అర్తరాత్రి గిటారు తీగలని మీటినట్టుగా ప్రేవుల్ని తడిమినట్టు అనుభూతి చెందుతాన్నేను.... రామా పితికస్ వారసుడినే ఐనా అర్థం లేని విలువలని ధరించిన దేహం నన్ను పచ్చి నెత్తుటిని తాగనివ్వదు ఓ గుప్పెడు తృనధాన్యపు క్షేత్రాన్ని. ఊహిస్తూ జనారణ్యంలో తిరుగుతుంటాన్నేను... నా చుట్టూ చిరిగిగి వేళ్ళాడే ఆకాశపు ముక్కలని అతికించుకుంటూ పసితనాన్ని కొంగుచివరదాచి "బేటా ఒక్క ముద్ద" అన్న అమ్మ మాట వీపుపై తగిలి రెండు కన్నీటి బొట్లు రక్తవర్ణం లో రాలి నడకలాగిన వొంటరి దారిని చుంబిస్తాయ్ నగరపు నడి బొడ్డులో ఉన్న ద్వారాన్ని తెరిస్తే పిల్లి గడ్డం తో అమ్మ ఉళ్ళోంచి సరాసరి సూఫీ నిలయం లోకి నడుస్తూ వచ్చి అన్నం ముద్దని నోటికందించి వెన్నెల్లా నవ్వి జోలపాడుతూ జో కొడుతుంది.... 20/06/14 (oka రోజుna మా ఇన్టికొచ్చి కూడా తినకపోతే నాకు మళ్ళీ చిన్నప్పటి నా ఆకలి గుర్తొస్తది బేటా అన్న యాకూబ్ సార్ మాటలు విన్నాక)

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Un5m9X

Posted by Katta

18, జూన్ 2014, బుధవారం

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ //అనేకాంతం// ఎక్కడ బయల్దేరావో అక్కడికే చేరుకునే భూమ్మీద ఎంత దూరం వెల్లగలం నువ్వైనా,నేనైనా, మనం కనే ఒక కలైనా గరిమ నాభి చూట్టూ. వలయాలు గా చుట్టుకునే కాలమైనా... మనచేతినుంచి జారిపడిపోయిన ఒకానొక యవ్వనపు చిరునవ్వు ఏ పుస్తకపు పుటలమధ్యనో గులాబీ రేకలా దాచిపెట్టబడే ఉండవచ్చు వేరెవరో తమ మొహం పై అతికించుకొని నిన్నూ స్వప్నించవచ్చు అనుకుంటూ ఒక్కడిగా ఉంటూనే అనేకులు గా మారిపోతూంటాం మెల్ల మెల్లగా పక్కకు ప్రవహిస్తూ మనిషులనుంచి కాస్త దూరం జరుగుతానా పరుగెత్తుకు వచ్చి నాలోకి లోలోపలికి దూకి మునుగీత వేస్తాడొకడు అట్టడుగుకి జారిపోయిన గుండెని స్పృశించి కాస్త రక్తాన్ని నింపుతాడు నిశ్శబ్ద ఉద్యానవనపు బెంచీ లానో ఒంటరి రైల్వే ఫ్లాట్ఫారమ్మీది సిమెంటు చెప్టాలానో కూర్చున్న నన్ను అచ్చంగా నాలానేఉన్న మరొకడు నిలువెల్లా కావలించుకొని వాడి కళ్ళలోంచి వొలికే కాస్త నిద్రని నాకూ పంచుతాడు..... ఊక్కొక్క అడుగుగా ప్రయాణాలని పేర్చుకుంటూ సమూహాలుగా సాగుతూ వెలుతున్న వాళ్ళు తమ స్వరాల దీపాలని మార్మిక గీతాలుగా గాలితెమ్మెరలకు వేళ్ళాడదీసి నిన్నూ నన్నూ తమ సంతకాలుగా మరికొందరి హృదయాలపై ముద్రించి వెళ్ళిపొయారు... ఇంక ఒంటరిగా ఎలా ఉండగలం నువ్వైనా నేనైనా మనం ఉండగా ఆ మందిరపు మూడవ మెట్టు మీది బిచ్చగాడైనా.. 18/06/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pieTe2

Posted by Katta

4, జూన్ 2014, బుధవారం

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్//ఒక సాయిబు కోసం// మిత్రమా...! ఎదురు చూస్తూనే ఉండుంటావింకా ఇస్లాం పేట వీధుల్లో నన్ను వెంటేసుకొని తిరుగుతూండి ఉంటావ్ తననుండి తానే తెగిపడిన స్నేహితున్ని తలుస్తూనే ఉండి ఉండిఉంటావ్ గరుకుగా మనసుని వొరుసుకుంటూ ప్రవహించే నిమిషాల్లో ఒకనాటి మన నవ్వులని కాగితం పడవలుగా వదుల్తున్నావ్ కదూ..! కొన్ని రేఖలుగా మనలని మనమే విభజించుకొని నేను ఇస్లాం పేటలో నువ్వు వరంగల్లు బీటు బజార్లో ప్రజాశక్తి పత్రికా కాపీలుగా గాల్లో చక్కర్లు కొడుతూనే ఉంటాం ఇరుకు అరల్లో దాచుకున్న దేహాన్ని నడీ రోడ్డుపై వెచ్చని సూర్యుని సాక్షిగా ఆరబెట్టుకుంటూ ఎర్రని వెలుగులని గాల్లోకెగరెస్తూ నిన్ను స్వప్నిస్తూనే ఉన్నాను నేనూనూ.. ఇప్పుడు మనం రెండు రాష్ట్రాలం రెండు ప్రాంతాలం కానీ ఏక శరీరులం సాయిబూ ...! ఒక్కసారి నిన్ను నిలువెల్లా కౌగిలించుకోవాలనుంది నీతో కలిసి కొన్ని గీతాలని పాడుకోవాలనుంది మరిన్ని సుందర దృశ్యాలని జీవితానికతికించాలనుంది.. హ..! మెరే దోస్త్ చాహూంగ మై తుజే సాంజ్ సవేరే... రెండు గదుల నీ కార్ఖానాలో ప్రవహించే వెచ్చని చాయ్ లో మునకేస్తూ వేళ్ళ మద్య కొన్ని క్షణాలని వెలిగించి గాల్లో వలయాలు గా కమ్ముకోవాలనుంది.. నాకిప్పుడు నిలువెత్తు ఆకుపచ్చని విప్లవ కారున్ని చూడాలనుంది... 04/06/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kCgABD

Posted by Katta

Naresh Kumar కవిత

నరేష్కుమార్ //హా..!// ఔనులే...! కుర్రాల్లన్నాక తప్పులు చేస్తారు ఉరితీయ్యొద్దు దండించొద్దు కాలం పురుషాంగంలా స్తంబించి పోయాక ఎవడేం చేయ గలడిప్పుడు నీ తల్లి గర్బకుహరపు ద్వారంలో జొనిపిన బీరు సీసా ముక్కలా నీ మొహం మార్పుచెందాక నువ్వేం చేయగలవ్.... చట్టపు కళ్ళు రెండూ న్యాయ దేవత రొమ్ములనే ఆకలిగా చూస్తూంటే కళ్ళకు కాదురా గంతలు ఆమె నడుము చుట్టూ కట్టండొక నల్లని గుడ్డని రెండు కాళ్ళ మద్యనుండీ స్రవించి స్కలించిన ఆసిడ్ ద్రావణం నీ సోదరిపైనో తల్లి పైనో వీర్యపు వర్షంగా కురవలేదు కదా నీకెలా తెలుస్తుంది లే వెచ్చని రక్తపు స్పర్ష రేయ్...! మలాయం రాయిని ఆడది గా మార్చినావాడు తిరగడేమి రా ఇప్పుడీ దేశపు మట్టిపై..!? 04/06/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRRha4

Posted by Katta

19, మే 2014, సోమవారం

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ //నేనూ అలియాస్ మీరు ఉరఫ్ అందరూ// ఎప్పట్నుంచో... మనం ఒకలాగే ఉండిఉంటాం నమ్మకం లేని తనాన్ని నమ్మలేదనుకుంటూ.. ఇవాళ అనుమానమొచ్చిందంతే... నన్ను అతనుగా అనుకొని ఉండడు నాలానే ఉన్న నువ్వూ బహుశా.. అద్దానికెదురుగా నిలుచునొని ఉండవు నెనూ అతన్నీ, నిన్నూ నాలా చూసి ఉండను... . పాంజియా పగిలినప్పుడు శబ్దం విన్నదెవడూ..!! భళ్ళుమందా..!,ఫెటిళ్ళుమందా అనంతానంత విశ్వపు కపాల మోక్షం చితికిపోయి "చితి"కిపోయుంటుంది అచ్చంగా నాలో పేరుకున్న నమ్మకపు కుడ్యం కూలిన శబ్దంలా ఉండిఉంటుంది... వినిపించకుండిఉంటుంది వేళ కాని వేలలలో దారేలేని దారులలో క్యా.... మియా...! క్యా డూడ్రా ఇధర్...?? ఎక్కాడా వెతక్కు వెతక్కు ఇంకో మనిషికోసం శ్రీ శ్రీలూ, స్త్రీ స్త్రీలూ.. అందరూ నువ్వే.. ఇంకోలా ఎవరూ ఉండరూ కాస్త తేడాలతో అందరూ నువ్వై... బహుఏక వచనమై ఉంటావ్... లేరిచటా,అచ్చటా ఎచ్చ్చోటనూ వెరు వేరు మనుషులు అంతా నువ్వే అన్నీ నువ్వే మహోద్విగ్నతల మద్య నీ శిలా విగ్రహావిష్కరణ నాలుగు మనసుల చౌరస్తా మీద.. నువ్వేనా...! అది నేనేనా...!! అనుకున్నామో కనుగొన్నామో తెలిసేటప్పటికే భగవత్ గీత మీద చేతులు పెట్టబడ్డాయ్... "మై లార్డ్...! నేనూ అలియాస్ మీరు ఉరఫ్ అందరూ అనబడే నేను... నన్ను నేనుగా పోల్చుకొనుటలోనూ, ఇతరులందు నా లక్షణములను గుర్తించుటలోనూ... విఫలమై నన్ను నేనే మొసగించుకున్నానను నేరారోపన నిరూపింపబడి దోషిగా తేల్చబడినాను కావున ఈ దోషి దోసిట్లో కాస్త శిక్షని వెయ్యండి" "పాప పరిహారమునకు రక్తతర్పనమనివార్యము" అని పవిత్ర గ్రంథములందున చెప్పబడియే యున్నది.. 19/05/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vsfegR

Posted by Katta

29, ఏప్రిల్ 2014, మంగళవారం

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ //ఊరుపేరెంది మరి// ఉర్కుతనే ఉంటం అందరం ఇంట్లకేంచి ఆఫీస్కూ ఆఫీస్ల ఖుదాహఫీజుల్జెప్పి ఇంట్లకూ... "బైంగన్ కా జిందగీ" అనుకుంటనే బేషరం గాల్ల లెక్క బజార్లపొంట నడుస్తనే ఉంటం ఏదో పీకుదాం అని తెల్లవడ్డ సూర్యుడు పొద్దూకంగ సైబాత్ సమజైనట్టు మల్ల ఎర్రవడి వొర్రెల దుంకుతడు మనకతం గాదు గ్రాండ్గ బతుకుతున్నం అనుకుంటనే రావొత్తు ఏన్నో పారేస్కొని పల్లెం ల మారన్నం బెట్టుకునుడు మర్శిపోతం. ఎప్పుడన్న ఓసారి రేడియల కెల్లి గొరటెంకన్న వొర్లినప్పుడు యాదికచ్చిన ఊరు కండ్లల్లకెల్లి కార్కత్తది... ఊల్లెకు వొయ్ సిల్పర్లతోటి గల్లిలల్ల గాయి గాయి తిర్గబుద్దైతది సికింద్రవాద్ల తలుపుదీశి ఊర్కడుగువెడ్తే పల్లె పట్నపు మొకమేస్కొని గడంచెలగూసోని నవ్వుతాంటది... మాడుప్మొకమేస్కొని మంచాల గుసుంటే సర్వపిండి ని పిజ్జా లెక్క కొరుక్కుంట పక్కపొంటి కూసోని కడుపుల కత్తివెట్టినట్టు తమ్ముడచ్చి అడుగుతడు "అన్నా మనూరికి కొత్త పేరేం బెడ్దామే" అని ... 29/4/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nzt0Mm

Posted by Katta

26, ఏప్రిల్ 2014, శనివారం

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్//ఆకలి పాట // (ఒకటోది) ఏదో ఒకనాటికి మనం పుట్టినప్పుడు అమ్మ వెన్నునుండీ పొత్తికడుపువరకూ సాగిన అనివార్యపు ధుఖం లీలగా చెక్కిలిని తడుముతున్నట్టు ఆకలి స్పర్శ.... సన్నగా అర్తరాత్రి గిటారు తీగలని మీటినట్టుగా ప్రేవుల్ని తడిమినట్టు అనుభూతి చెందుతాన్నేను.... రామా పితికస్ వారసుడినే ఐనా అర్థం లేని విలువలని ధరించిన దేహం నన్ను పచ్చి నెత్తుటిని తాగనివ్వదు ఓ గుప్పెడు తృనధాన్యపు క్షేత్రాన్ని. ఊహిస్తూ జనారణ్యంలో తిరుగుతుంటాన్నేను... నా చుట్టూ చిరిగిగి వేళ్ళాడే ఆకాశపు ముక్కలని అతికించుకుంటూ పసితనాన్ని కొంగుచివరదాచి "బేటా ఒక్క ముద్ద" అన్న అమ్మ మాట వీపుపై తగిలి రెండు కన్నీటి బొట్లు రక్తవర్ణం లో రాలి నడకలాగిన వొంటరి దారిని చుంబిస్తాయ్ నగరపు నడి బొడ్డులో ఉన్న ద్వారాన్ని తెరిస్తే పిల్లి గడ్డం తో అమ్మ ఉళ్ళోంచి సరాసరి సూఫీ నిలయం లోకి నడుస్తూ వచ్చి అన్నం ముద్దని నోటికందించి వెన్నెల్లా నవ్వి జోలపాడుతూ జో కొడుతుంది.... (ఇంటికొచ్చి తినకపోతే నాకు మళ్ళీ చిన్నప్పటి నా ఆకలి గుర్తొస్తది బేటా అన్న యాకూబ్ సార్ మాటలు విన్నాక) 27/04/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1inHf3S

Posted by Katta

Naresh Kumar కవిత

నరేష్కుమార్ //రాలిపోయిన నమ్మకపు గీతం// 1) అది అచ్చంగా గర్వమేనా అంటే ఏమో మరి మనిషిగా నా చుట్టూ పేరుకున్న అసహనపు పొరలకింద ఉన్న భావాన్ని ఏమని చెప్పగలనూ... మర్రి ఊడల్లా పెనవేసిన కుహనా మర్యాదల మద్య అసలెక్కడుందో మొదలంటూ భుజాన భేతాలున్ని దించి నిజాన్ని వెతుక్కోలేని తనమే అయుండొచ్చు మరి 2) ఒక్క కాగితపు చుట్టలో దాగిన పొగాకుతునకల్లా కొన్ని క్షణాలు కీబోర్డు పైనున్న వేలి కొసలని కాల్చే వరకూ తెలియనే లేదు 3) ఓహ్....! ఎక్కడో కదిలే ఉంటుందా మనిషి పైనున్న నమ్మకం కుప్పలుగా పోగుపడ్డ ఆలోచనా శవాలకు దహన సంసంకారపు మంత్ర ఘోష కి ఎగిరిపడుతున్న కర్ణ భేరీ కంపనాల కొలతల్నిప్పుడు రిక్టర్ స్కేలుపై కొలుస్తూ... ఎలా ఉండను మరి..!? 4) గడియారపు ముళ్ళు గుచ్చుకొని గాయపడ్డ క్షమాపనా పత్రమొకటి ఉదయాన్నే వెలిగే సూర్యుడికీ నాకు అడ్డుగా చెట్టు కొమ్మ పై వేళ్ళాడుతూంటే భూమి నీడలో సేదతీరే చంద్రున్ని బయటికి లాక్కొచ్చి రెండు వెలుగు రేఖలు అతని తలపాగాలో అలంకరించకుండా ఎలాగ మరి.. 5) జిగటగా కారే చీకటిని తుడుచుకుంటూ నగరపు రోడ్లపై వొంటరి గీతపు సంచారం ఇది నేనే అనుకుంటూ.. ఏమొ నేను కాదేమో అనుకుంటూ గొంతుదాటే మన్నింపు గీతాన్ని దారిపక్కనే ఉన్న బిచ్చగాడి గొంతుతో పాడుకుంటూ ఉంటే మళ్ళీ అదే ప్రశ్న ఎదురుగా నడుచుకుంటూ వచ్చి నా ముందు కూలబడుతుంది "అది గర్వమేనా..?" అంటూ ఏమో మరి జవాబెప్పటికీ చెప్పలెనేమో మరి.... 26/4/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PCL0GJ

Posted by Katta

19, ఏప్రిల్ 2014, శనివారం

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేస్కుమార్ //5ఇంటూ సం వన్// ఏమైందంటావ్ హఠాత్తుగా వాడిప్పుడొచ్చాడు విరిగిన కాళ్ళనీ సంచీలో వేసుకొని ఎర్రని సూర్యున్ని నల్లని రంగుగా వొంటిపై అతికించుకొని తిరిగిన్నాడు ఎమయ్యాడు వాడు ఎప్పటికప్పుడు స్వీయప్రశ్నా పత్రమై నన్నునేనుగా గాల్లోకెగరేసుకున్న నాడు ఏమయ్యాడు వాడు చెట్లకువేళ్ళాడే హృదయాలు ఉదయాలనిండా పరుచుకున్న నాడు నిజాన్ని నినాదం చేసి ఓ పాతగోడపై నేను పరుచుకుంటే..... పాతబస్తీలో మొరిగే. అబద్దపు పోలీసు కుక్కై అరుస్తున్నాడు దేహాంతరపుటాలోచనలు దేశాల దూరంలో ఉండి విన్నాను విన్నానంటూ నోటి చివర కారే లాలాజలపాతమై వాడు నన్ను నిలువునా తడిపేయ జూస్తున్నాడు ఏమయ్యిందంటావ్ హఠాత్తుగా వాడికి నేనొకన్నీ నిలిచిపోతాను కొన్ని గుండెల మద్య సుదూరాలని ఓ సున్నపు గీతలా కలిపేసి శరీరాంతరాత్మల్లో విలీనమై ఒక నీలిరంగు మచ్చని ముద్రగా ఒకానొక నిరసనావాదపు పచ్చ బొట్టు గా చిత్రించి.. నేనూ అప్పుడు నిశ్క్రమిస్తాను బహుశా ఇప్పటిలానే నా వెనకే ఉంటాడు వాడు చీకటిదారుల్లో ఆరిపోయిన లాతరు బుడ్డీ చేతబట్టుకొని పాతబడ్డ చీపురు పైనెక్కి తిరిగి తిరిగీ చివరికి ఒక కరెంటు తీగపై గబ్బిలం లా తలకిందులుగా వేల్లాడుతూ నడుస్తున్న వారిని చూస్తూ...19/4/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qVztjP

Posted by Katta

17, ఏప్రిల్ 2014, గురువారం

Naresh Kumar కవిత

నరేష్కుమార్ //ప్రేలాపన// ఎలా చెప్పమంటావ్ నేనిపుడు అనంత కృష్ణానంత శర్వనినని స్నేహితా...! నిజమే పగిలిన కాలంలోంచి జారిపడ్డ క్షణాలని మళ్ళీ కోశాగారానికెత్తలేను కాలి రాలిన ధూపపు ధూమాన్ని మళ్ళీ మునుపటిలా మూటకట్టలేనుకదా అందుకే రాలిపడని మాటలనీ కూలిపడ్డ కోటగోడలనీ మళ్ళీ నిర్మించలేను నేను వెలివేసిన వెలుగును దాటి ఈ శాశ్వత చీకటి నుండి బయల్వెడలని తామసి తనయున్నయాక ఇంకెందుకు..!? నీ అశాశ్వత వెలుగు కిరణాల మూటలు నాకు నేనిపుడో కాలిపోయిన దేహాన్ని కావొచ్చు వెలుగుని భహిష్కరించిన దేశాన్ని కావొచ్చు కానీ....... ఇప్పుడు నేనో నిజాన్ని అబద్దపు వెలుగు రేకలకావలి నిశ్శబ్దపు కృష్ణ వర్ణపు రాతిరిని ఊహించకెపుడూ ఇకనా జ్వాజ్వల మానపు రక్త జ్వలనా కాంతులని కుహూరుత శీకరాల రవాలని వెలిగి వెలిగీ ఆరిపోయిన చితిని. 17/4/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eShnbp

Posted by Katta

13, ఏప్రిల్ 2014, ఆదివారం

Naresh Kumar కవిత

నరేష్కుమార్//అమ్మ అనసూయకోసం// ఇపుడేం రాసినా ఇదివరకు రాసింట్టే ఉంటోంది చెరిపేయబడ్డ అక్షరం మళ్ళీ చర్మం పై కాలిన మచ్చలా నన్నటిపెట్టుకున్నట్టే ఉంటోంది అమ్మ గురించి రాసిన ప్రతిసారీ నన్నునేను కాన్వాసుపై చిత్రించుకున్నట్టే ఉంటుంది ఒకానొక ప్రాచీన గీతాన్ని మళ్ళీ పాడినట్టే అనిపిస్తోంది ఇపుడెందుకో నేను వొంటరి గదిలో వంట చేసినపుడల్లా ఉప్పెక్కువైందంటూ ఆనాడు అమ్మ ముందు విసిరేసిన కంచం నా మొహాన్నే పడ్డట్టనిపిస్తుంది... "అన్నం తిన్నవా బేటా" అని ఫోన్లోంచి అమ్మచెయ్యి పొట్టనిమిరినప్పుడు కంట్లో కాలుజారిపడ్డ నీటిచుక్క నా మొహాన పడ్డ నిన్నటి సూర్యుడి ఉమ్మిలా అనిపిస్తోంది ఏం రాయనూ అమ్మకి ఏమివ్వనూ? అమ్మకిప్పుడు నేను నాన్ననవటం తప్ప ఇంకేం చేయను..... 13/4/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hw3YKC

Posted by Katta

Naresh Kumar కవిత

నరేష్కుమార్//అమ్మ అనసూయకోసం// ఇపుడేం రాసినా ఇదివరకు రాసింట్టే ఉంటోంది చెరిపేయబడ్డ అక్షరం మళ్ళీ చర్మం పై కాలిన మచ్చలా నన్నటిపెట్టుకున్నట్టే ఉంటోంది అమ్మ గురించి రాసిన ప్రతిసారీ నన్నునేను కాన్వాసుపై చిత్రించుకున్నట్టే ఉంటుంది ఒకానొక ప్రాచీన గీతాన్ని మళ్ళీ పాడినట్టే అనిపిస్తోంది ఇపుడెందుకో నేను వొంటరి గదిలో వంట చేసినపుడల్లా ఉప్పెక్కువైందంటూ ఆనాడు అమ్మ ముందు విసిరేసిన కంచం నా మొహాన్నే పడ్డట్టనిపిస్తుంది... "అన్నం తిన్నవా బేటా" అని ఫోన్లోంచి అమ్మచెయ్యి పొట్టనిమిరినప్పుడు కంట్లో కాలుజారిపడ్డ నీటిచుక్క నా మొహాన పడ్డ నిన్నటి సూర్యుడి ఉమ్మిలా అనిపిస్తోంది ఏం రాయనూ అమ్మకి ఏమివ్వనూ? అమ్మకిప్పుడు నేను నాన్ననవటం తప్ప ఇంకేం చేయను..... 13/04/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nhOURl

Posted by Katta

2, ఏప్రిల్ 2014, బుధవారం

Naresh Kumar కవిత

నరేష్కుమార్ //కాళ్ళిరిగిన ప్రస్తానం లో// కదిలీ కదలని దారొకటి కొండ చిలువలా కాళ్ళని చుట్టుకుని పడుకుంటే.. తాబేటి చిప్పల్లో తమశరీరాలని దాచుకొని పయనిస్తూన్నామనే అనుకుంటాం అతనూ,నేనూ... చిరిగిపోయిన భూమి పొరలని చూసి జాలిపడకుండా పగలబడి నవ్వుతూ భుజాల మీది శిలువలని సర్దుకుంటూ నిలబడి పోయిన మనుషుల రహస్య జేబులని కత్తిరించి దొంగిలించిన ఉరి తాళ్ళని మెడచుట్టూ అల్లేసుకొని కాళ్ళని చుట్టిన కొండచిలువ ఎప్పుడు వదిలేస్తుందా అని ఎదురుచూస్తూ పగిలిన ఎముకల మోకాళ్ళ మీద నిలబడి చూస్తూంటాం ... నెనూ,అతనూ మాతో పాటుగా ఓ పాఠకుడా ఇప్పుడు నువ్వూనూ...... 02/04/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAtAFy

Posted by Katta

29, మార్చి 2014, శనివారం

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్//స్తబ్దం// ఇప్పుడు నాకొక మొహం కావాలి నవ్వుతూ ఉండే మొహం లేదూ.... నవ్వుతూ ఉన్నట్టుగా ఒక ముసుగైనా నిస్సహాయ,నిరాశా,నిస్పృహలని దాచి ఉంచే కోటగొడ కావాలి కొన్ని పువ్వులు లేని ఎడారిమొక్కలు కావాలి ఎవ్వరినీ దరిచేరనీయక తమకు తాముగా బతికే రక్కిసపొదల కంచె కావాలి ఎవరిస్తారు స్వచ్చమైన నా నవ్వుని నాకు వాడిపోని పచ్చి గాయం లాంటి నా జీవితాన్ని చీము,నెత్తురుతో నిండి పసి హృదయం లా సున్నితంగా ఉండే ఒక నవ్వుని ఎవరైనా ఉమ్మేయండి తడారి పోయి పగుళ్ళిచ్చిన గుండె మెత్తబడేలా... ఆకలినీ,అంతులేని ధుక్ఖాన్నీ దాచిన ఆ గది తలుపునీ తెరిచి నన్ను మళ్ళీ ఆ పురిటి రక్తం లోకి విసిరేయండి ప్లాస్టిక్ పువ్వుల ప్రపంచం నుండి అనంతానంత ఇసుక దారుల్లో పాదపు గుర్తుల్నిండిన ఎడారుల్లోకి నాకిప్పుడు ఒక వెచ్చని రక్తపు చారిక వంటి మెరుపు కలిగిన నవ్వు కావాలి లేదూ... విరిగి పడి ప్రవహించే మంచు గడ్డ లాంటి జీవితమైనా సరే నా దోసిట్లో వొంపండెవరైనా ఒక్క జిగురు నవ్వుని... లేదూ మనస్సు నిండా నిశ్శబ్ద శూన్యమైనా సరే... 29/03/2014

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jHBbp6

Posted by Katta

24, మార్చి 2014, సోమవారం

Naresh Kumar కవిత

నరేష్కుమార్ //మో(డీ)డు వారిన చిత్రం// అతనొకరోజు ఉదయాన్నే "రా నేను దేవుడి బొమ్మ గీస్తున్నా చూడు" ఓ పాత్రనిండా కాషాయ రంగు చిక్కటి తేనీరందిస్తూ అన్నాడు భయంగానే కప్పు చేతిలో పట్టుకొని గదిలొకి నడిచాన్నేను... అప్పటికే కొందరున్నారక్కడ ఎవరి తలని వారు చేతుల్లో పట్టుకొని నా మెడలో వేళ్ళాడే మెదడుని భయంగా చూశారు ఓ పిడి బాకుని తీస్కొని గెడ్డం గాడి గుండెలో ముంచి కాన్వాసెదురుగా నించొని తెల్లని జుత్తూ బట్టతలతో దేవుడి తలని చిత్రించి అన్నాడు "చూడూ ఎంత మా దేవుడికి ఆర్భాటాలు నచ్చవు అందుకే కిరీటం పెట్టుకోలేదు" అన్నాడు తలూపాను మెడలో మెదడు భయంగా గది పైకప్పుని చూస్తోంది.. "మా దేవుడు కరుణకి ప్రతి రూపం శాంతి స్తాపన కోసం ఎన్నో తలలని నరికాడు గోవులని చంపుకు తినే వాళ్ళనైతే లెక్కేలేదు గొప్ప వీరుడు" అంటూ బాకుతో ఆ దేవుడి చేతుల్లో గదనీ,శూలాన్నీ చిత్రించాడతను పక్కనే ఒక మొండెం లేని తల అరిచింది "వాడు నా మొండాన్ని తినేసాడు" అని వెంటనే ఆ చిత్ర కారుడు ఏయ్ నువ్వెప్పుడూ ఇంతే నీ తక్కువ తనాన్ని చూపించి మా అవకాశాన్ని లాక్కుంటావు" అంటూ చిత్రం లోని గద తో ఆ తలని చితక్కొట్టాడు మొకమ్మీద చిమ్మిన రక్తాన్ని తుడుచుకున్న నాతో "పేపర్లో ఇవన్నీ రాయలేవు" అంటూ నా కలాన్ని లాక్కుని చిత్రాన్ని గీస్తున్నాడు అప్రయత్నంగా వెనక్కి జరిగి గోడనానుకున్నాన్నేను అక్కడ వేళ్ళాడే దేశ పటం వణుకు స్పష్టంగా తెలుస్తోంది నాకు.. ఆ రాత్రంతా అతనా చిత్రాన్ని గీస్తూనే ఉన్నాడతను... చివరిగా "చూడు దేవుడి చిత్రం" అంటూ నా వైపు చూసాడు "అది అది మోడీ...! కాదు కాదు అదీ నువ్వే" అరిచాన్నేను వెంటనే అక్కడున్న వాళ్ళంతా చేతుల్లోని తమ తలల్ని ఓ మూలకు విసిరేసి నా వెంట పడ్డారు "ఏయ్ మా **మున్ని వ్యతిరేకిస్తావా" అరిచాడొకడు తన తోకని సవరించుకుంటూ భయంగా గది భయటికి పరుగు తీసాన్నేను అక్కడ వేలాది మందిని. నరికేస్తూ,యోనుల్లో త్రిశూలాలని దిపుతూ నవ్వుతున్నాడు వాడు వాడు...వాడు వాడే... *డీ...!? నిస్సహాయంగా నిలబడ్డానేను "మా ఇల్లు దర్మసత్రం కాదు" మెమంతా గంగా సింధూ బిందువులం" అరుచుకుంటూ పరుగు తీస్తున్నారు వాళ్ళు కుప్పలుగా పోగుపడ్డ మానవ మాంస ఖండాల మద్య భయంగా నిల్చుని ఉందో స్త్రీ మూర్తి ఆమేనే ఆకలిగా చూస్తూ కదిలాడు వాడు.. లేదు లేదూ... వద్దూ వాద్దూ... "జై భారత్ మాతా" అరుస్తూనే చేతికందిన బాలెట్ బాక్సు తో వాడి బట్ట తలపై కొట్టాన్నేను చచ్చాడు దేవుడు గాడు... 24/03/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oQeT3v

Posted by Katta

16, మార్చి 2014, ఆదివారం

Naresh Kumar కవిత

నరేష్కుమార్//ప్రేలాపన// నేనూ అతనూ రెండు గ్లాసులూ కొన్ని నిమిషాలూ ఒక జీవితం ఇంకేం లేదు కాస్త కవిత్వం వొలికి మనసుపై మరకలు పడ్డాయంతే మరక మంచిదే..... 15/02/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m7AwgA

Posted by Katta

12, మార్చి 2014, బుధవారం

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ //చివరికి ఏం పీకాం?// బతికేందుకు ఇంకా ఏం చేయగలం బతకటం తప్ప వేలి చివర వెలుతురులతికించుకొని జీతమిచ్చే జీవితం తో వేటాడబడుతూనే ఉంటాం గుడిమెట్లదగ్గర రూపాయ్ కో రెండ్రూపాయలకో పుణ్యం కొనేస్కున్నాక పాదాలని భుజాలపై ఉంచి తిరుగుతూనే ఉంటాం ఇక్కడెవరూ బతికించలేరు బతకనిస్తారంతే వెన్నెల రాత్రులూ, చల్లని గాలులూ,ఆకలి కోరికలూ మొదలగు సుందర దృశ్యాల్లేని కళ్లతో ఖాలీ గ్లాసుల్లా ఒక్కొక్కడూ తమతమ టేబుళ్ళపై కదలికల్లేక ప్రాణం లేని దేహంలా కదులుతూంటారు ఎక్కడా ఉండని ముద్దుల్లో చక్కెర శాతాలూ కౌగిళ్ళ స్వాంతనలూ, మనుషుల మద్య ప్రేమలూ, దేవుడి కరుణా కటాక్ష వీక్షణల కోసం వెతికీ...,వెతికీ..., తీరా చివరికి అవన్నీ శూణ్యాలని తెలుసుకొనీ బట్టతలల్తో దువ్వెన చేతిలో పట్టుకొని తమ సమాధి పై కూర్చుని పొగిలి పొగిలి ఏడ్చే మనుషులని చూస్తూ మనమూ కదుల్దామనే అనుకుంటాం చిత్రంగా అప్పటికే మనలని దారాలతో భందించిన సాలె పురుగొకటి మనవైపే పరుగెత్తుకొస్తూంటుంది.... బతికున్న శవపు జీవితానికి నామ సార్ధకత లభించాక.. అప్పుడరుస్తాడు కాట్లో కాటమ రాజు గంజాయి దమ్ము లాగుతూ,తోలు గోచీ లోంచి పృష్టాన్ని గోక్కుంటూ, నాగు పాము కళ్లతో నవ్వుతూ "చిచ్చా అబ్ ఖేల్ ఖతం దుక్నం బంద్ వచ్చి నీ సమాధిలో పడుకో నేన్నీకు విశ్రాంతినిస్తాను...." అని 12/03/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cPPaqh

Posted by Katta

7, మార్చి 2014, శుక్రవారం

Naresh Kumar కవిత

సొన్నయిల నరేష్కుమార్ // నువ్వలా// నువ్వూ నడిచే ఉండి ఉంటావ్ కొన్ని అక్షరాల వెంట ఎప్పుడొ అప్పుడు... వధించే ఉంటావ్ కదూ మరికొన్ని అమాయక క్షణాలని విస్కీ బాటిల్ లో ముంచి నడిచే జనాలు ఉన్న శూన్యపు దారివెంట నా అడుగుల ని పోలిన మనిషి మొహాన్ని చూసే ఉంటావ్ లే.... వెచ్చని టే కేటిల్ లో మరిగిన నిమిషాలని గొంతులోకొంపు కుంటూ ఒక స్వేచ్చా గానమై గాల్లో నిలుచున్నప్పుడు మిత్రుడా...! నువ్వూ నాలానే ఒక ఎర్రని వానపామై ఎవరిమొహం పైనో పాకే ఉంటావ్ ఇవాలంటే ఒక మగాడిగానో మహా ఉన్నతుడి గానో ఓ ముసుక్కప్పుకున్నావ్ గానీ నాకు తెలుసు నాలా నువ్వూ అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు అచ్చంగా మనిషి గానే ఉండి ఉంటావ్........ 07/03/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lCxsJb

Posted by Katta

1, మార్చి 2014, శనివారం

Naresh Kumar కవిత

నరేష్కుమార్ \\పురాతన ప్రయాణం\\ దేహాత్మల్లోంచి విడివడి వొడివాడి చిక్కిపోయిన మనసుతో చలిస్తూ చరిస్తోన్న రైలు నన్ను మోసుకుంటూ.... కదుల్తోంటాను నేనూ చలించని పాదపు ప్రయాణంలో చరిస్తూ... కొన్ని చెట్లనూ కొన్ని ద్రృశ్యాలనూ వొరుసుకుంటూ వెల్తోన్న రైలు వొకానొక సరస్సుపక్కగా వెల్తూ తనని తాను చూస్కుంటుంది నీటి అద్దంలో అచ్చం. నాలా ఉంటుంది రైలు ఓపెన్ సెసేం మంత్రం గుర్తున్నా తెరువబ్డ్డ ద్వారం దారివ్వదు... మళ్ళీ మళ్ళీ కొన్ని దృశ్యాలు కిటికీలోంచి తిరిగి తిరిగి చూస్తూంటాయ్ రైలొక నదిని దాటుతూన్నప్పుడు కొన్ని నాణేలకు బదులుగా రెండు నిర్వేదపు నిట్టూర్పులని తీసుకుంటుంది... ఒక్కోక్కసారి ప్రయాణం ఓ అర్థరాత్రిని చీల్చుతున్నప్పుడు స్వప్నస్ఖలనం లా జారి ముందు రాలిపడతాడొకడు దారివ్వలేని తెరుచుకున్న ద్వారం దగ్గిర అగ్గిపెట్టె రెండు మనసులనీ వెలిగించాక అతనడుగుతాడు.. "ఎక్కడిదాకా...?" సిగరెట్టు ఙ్ఞాపకాన్ని కొనవేలితో విదిలిస్తూ.. "బయల్దేరిన చోటికె !" బదులిస్తాన్నేను 01/02/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pKJxN3

Posted by Katta

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ //ఏం మనిషో// కెరీర్ గ్రాఫ్ లో ఈమూలనుంచీ ఆ మూలదాకా సాగిన గీత ముడతలు పడకుండా మాంజాదారంలా బిగదీసుకుపోయి మనసులెండినా ప్రవహించటం మానని మనుషులు.. చల్ హట్..! పోరా నాయనా..! ఎవడికీ కాళ్ళు లేవిప్పుడు కార్లొచ్చాక చే గువేరా మొహమ్ముందు పొగలు కక్కే సిగార్... కాదురా బాబూ అది బండి సైలెన్సర్... ఆ సామ్రాజ్యవాద వ్యతిరేకిని అవమానిస్తూ గుప్పున ఎగిసిన నల్ల పెట్రోల్ పొగ.. రేకుడబ్బాలకీ,బీరు కీశేలకీ సల్లటి ఐస్కిరేయ్.... రేయ్..రేయ్..!! మురికి నా...డకా..! ఇక్కడెవడూ చీకడు నీది ఇప్పుడు కలర్ పేపర్లో పొట్లం కట్టిన శీతాకాలం యాభై రూపాయలే... అదిగో... నడీ రోడ్డు మీద పుచ్చ పువ్వులా విచ్చుకొని వెచ్చని రక్తాన్ని ఉమ్మేసిన మెదడొకటి ట్రాఫిక్ అంతరాయానికి సంతోషిస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ తో టీవీ గాడు... ఎర్రని లైటొకటి పసుపుగా బిక్కమొకమేయగానే ఆగరా.. ఇంకా దానికళ్ళు పచ్చ బడనేలేదు ఆగరా...నీ... డిజిటల్ కెమెరాలో బండి పృష్టాన్ని బందిస్తూ ఒక్కసారిగా పెళ్ళుబికిన లోహభూత ధూమ భూయిష్ట ప్రవాహానికి వెనకడుగేసిన శాంతి వర్ణపు దేహమొకటి.. పాంథుడా...! చూడకు చూడకటు నీలో ఎక్కడో ఉన్న మనిషిని లేపే బిచ్చగాడొస్తాడేమో ఆశగా.. నీ జేబుని ఈర్షగా చూస్తూ "చుట్టూ పక్కా చూడకురా చిన్నవాడ" .... చచ్చిపోతున్న సూర్యుడు కృష్ణ లోకింకి పోయాక ఇంటికొచ్చి అశాంతంగా సంతోష జీవితాన్ని ఆస్వాదిస్తుంటే హూహ్... ! అతనేంటీ..!? రోజూ ప్రేమ కావాలీ.., మనుషుల ఆప్యాయతాళింగనం కావాలీ అంటూ... ఇంకా మనిషిలానే ఉండిపోయాడు పాపం హవ్ ఫన్నీ మాన్ హి ఈజ్ ఒహ్..! గాడ్..!! బ్లెస్ హిం ప్లీస్ రేయ్...! గార్డ్...!! త్రో హిం ఔట్... 28/02/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jE1kSm

Posted by Katta