వర్చస్వి//పసిడి గుమ్మం // ----- - ----- ----- ----- --- ఎక్కడెక్కడివో కవిత్వాలు ఆ పూటకి రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోతాయి ఆ పచ్చని పదాల చెట్టును వెదుక్కుంటూ! ఇక ఆలశ్యమ్ చేయక, కొన్ని కిశోర శుకపికాల కవితా సంకీర్తనలో, మరి కొన్ని మైనాల జిలిబిలి కులుకుల పలుకులోగానీ - సిద్దంగా ఉంచుకున్న చిట్టి మైకు ముక్కులోంచి కుహుకుహూరవాలుగా రాలి ఆహూతుల వొళ్ళో వచ్చి పడతాయి. కావడానికి అది తులసి వనమే అయినా రాలిపడ్డ అవి గమ్మత్తుగా అక్కడి మెదళ్ళలో గంజాయి మత్తుగా ఉవ్వెత్తున పరుచుకుంటుంది. పాడుతున్న పిట్టల గుండెలు రగిలి పుడుతున్న వెచ్చటి వాతావరణం ఆ ప్రాంగణం లో తీయని సెగలా ఎగిసిపడుతుంది. అంతలోనే కసిగా ఓ చల్లని వెన్నెల సోన హృదయ తలాల్లో శీతలాల్ని పరిచి పారేస్తుంది. మరోప్రక్క తీయని శరాల్లా తగిలిన కవితా పంక్తుల ధాటికి కవన వనంలో చొరబడిన ఓ విరహపు వేదన అక్కడికక్కడే శిశిరంలా రాలి పడి ఆవిరైపోతుంది. అమోఘమైన కవితాగర్జనకు మురిసిన మేఘం ఇక ఉండబట్టలేక ఆనందపు జల్లుల్నికుండపోతలా కురిపించి పోతుంది. ఆ అరగంటలో ఆరారు ఋతువులూ అ ‘పసిడి గుమ్మానికి’ (Golden Threshold) పసుపు పారాణులుగా మారిపోతాయి. ఆ పచ్చటి చెట్టు, పిట్టలకి పెట్టనికోటైనందుకు గర్వించి ఆ పూటకి ‘క్యా-ఖూబ్’ అంటూ హాయిగా ఊపిరి తీసుకుంటుంది. మళ్ళీ నెల తిరగకుండానే మరింత పత్రహరితాన్ని తొడుక్కుని ‘కవిసంగమాన్ని’ స్వాగతిస్తూ పచ్చటి గొడుగు పడుతుంది. //24.2.14// (మన Kavi Yakoob ని తలుచుకుంటూ)
by Humorist N Humanist Varchaswi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pkk9xm
Posted by Katta
by Humorist N Humanist Varchaswi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pkk9xm
Posted by Katta