పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Rammohan Dingari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rammohan Dingari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జులై 2012, శుక్రవారం

రామ్మోహన్ డింగరి || నువ్వు యెండి పోయిన తోరణంలా .. ||

వాడిన శరీరాన్ని వీధి వాకిట్లో ..పారేసి,
.బతుకున్న శవంలా....
యెదిరి చూస్తుంటావ్ ...

కడుపులో ఇథోపియాలు దాచుకొని ..

ఇంకొకడి ఆకలి తీర్చడానికి ..
నీకంటూ కోరికలుండవు ..
కానీ కోరికలు ..తీరుస్తుంటావ్
రాత్రుల్లు నిద్ర లేక
పగలు కలలు కనలేక ..

నీకంటూ జీవితం లేక
యెవడో విత్తిన విత్తనాన్ని

వ్రణం చేసుకొంటావ్ ....

చితికిన సంధ్య అయిపోతావ్..

అసలెవరు నువ్వు ..

నీకంటూ యేదీ లేదు

నువ్విలాగే ...తినేసి పారేసే విస్తరి .
*26-07-2012

15, జులై 2012, ఆదివారం

రామ్మోహన్ డింగరి || నా ఆలోచనా చిలుకొయ్యకి ..||


నిన్నటి నీ జ్ఞాపకం

వేళ్ళాడుతునే వుంది .

ప్రతీ సారి ,ప్రతీ క్షణం

వర్తమానంలో తగుల్తూ ..!

ప్రతీసారి అనుకొంటా ..

ఆ చిలుకొయ్యని వూడ బెరకాలని ,

కానీ అనుభూతి బావుందని ఆగిపోతా....!

*14-07-2012

11, జులై 2012, బుధవారం

రామ్మోహన్ డింగరి॥ఈ సాయంత్రాలు॥

ఈ సాయంత్రాలు
చీకటి దుప్పటి కప్పుకొనే..
సాయంత్రాలు..
నన్ను నే అన్వేషించుకొనే, నన్ను నే ఆవిష్కరించుకొనే సాయంత్రాలు..
స్పటిక చషకాల్లో పొంగే
బంగారు రంగు ద్రావకం
నాలోకి ...లోలోకి ప్రవహించి
పొద్దుంనించి నే వేసుకున్న ముసుగులన్నీ తీసేసి ..
నాకు నేనై 

ఇక
ముఖేశ్ ,తలత్ ,గులామలీ ..
ద్వారమ్,మాన్డలీన్ మధ్య బీతొవెన్ తో కొట్టుక పోతా...!
*11.7.2012