పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, ఏప్రిల్ 2014, బుధవారం

Sriramoju Haragopal కవిత

కవి ఏమున్నది శ్రీశ్రీ మనకు గర్వ కారణం? ఎప్పటిలెక్కనె ఎలక్షన్లు దారుణం అందరు సిధ్దాంతులే ప్రజాధనం గాయబ్ అందరు మననేతలే మహాకవీ సాయెబ్ తిట్లడానికి తిట్లు నిషేధింపబడ్డయి గాని పెట్టుడు మీసాలకు సంపెంగనూనె శాని అలవోకగ వాగ్దానాలు వడగండ్ల వానలు వాణ్ణి వీడు వీణ్ణి వాడు తెగ తెగిడే జాణలు వూకుంటె మహాప్రస్థానమె రాసేస్తరు వూకొడితే చందమామకథ చెపుతరు రాజకీయ గుంజులాట రంకురాట్నమయ్యింది కప్పలతక్కెడ నేతల కామన్ ఎజెండయింది మరోప్రపంచం ఒకటి నేల మీదికొచ్చునా ఆకలి దుఃఖంలేని రాజ్యమనేదుండునా ఎందుకయ్య ఆశపెట్టి పద పదమన్నావు ఏదో మార్పు వొస్తుందని స్వప్నమొక్కటిచ్చావు రేపటివెలుగులకొరకు ప్రాణమిచ్చు రణంబాట తిరుగుబాటులన్నీ జరుగుబాటు కొరకేనట తుపాకీల మొనలనుండి జారుడుబండాట ఎటుపోయెనొ మనలో మానవత్వమన్నమాట ఎప్పటాటె పేదలకు ఎండినవే చిప్పలు తప్పదీస్తె ఈ నేతల తప్పునేమొ తిప్పలు ఏమున్నది ఏమున్నది ఏమున్నది మిగిలి? రానున్నద రానున్నద కొత్తపొద్దు రగిలి

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rG9Yl2

Posted by Katta

Venu Madhav కవిత

కార్మిక దినోత్సవం సందర్భంగా వాడు ఉదయాన్నే సూర్యుడు కీ ఎదురు వెళ్లి స్వాగతం పలుకుతాడు వాడు చేతికి సంచి తగిలించుకొని చిత్తు కాగితాలు ఎరుకుంటాడు వాడు బడికి వెళ్ళే పిల్లలని చూస్తూ ఏదో ఒకరోజు బడికి వెళ్ళాలని అశపడతాడు వాడు తన చిరునవ్వు వెనకాల ఎన్నో కన్నీటి గాయాలను దాచేస్తాడు వాడు ఇనుము నూ సుత్తి తో కొడుతూ తన గుండె ని గట్టిపరుచుకుంటాడు వాడే బాల కార్మికుడు,రేపటి ఈ దేశ పౌరుడు మీ వేణు

by Venu Madhav



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nInHKH

Posted by Katta

Kalyan Krishna Kumar కవిత

శ్రీయుత శ్రీరంగం రెండక్షరాల అరుణం రెండు శకాల కవనం రెండు జీవుల అంతర్నేత్రం.. సగం చచ్చిన సోమరిపోతులకు .. మరోప్రపంచపు అంచులు చూపి.. దారి తప్పిన బాటసారికి చుక్కానై.. భువన ఘోషకు వెర్రిగొంతుక అరువిచ్చి జయభేరీ..గంటలు..గంటలు మ్రోగిస్తూ..మ్రోగిస్తూ..మ్రోగిస్తూ ఆకాశదీపపు మిణుకులు కన్నుల నిల్పి.. దిక్కులు పిక్కటిల్లగా ఋక్కులు చెప్పి అందరిచె కలం పట్టించిన మహనీయ మూర్తి..! నీ మార్గం అనితర సాధ్యం.. అవతారం అది మాత్రం అద్వైతం అక్షర సత్యం.. శిశుర్వేత్తి గానరసం మీ కవితాధారం వార్ధక్యపు నలిగిన ముడతకు జీవం మీ ఆవేశం సాహసిని నిద్రలేపుతూ.. ..పోతేపోనీ.. సతుల్ సుతుల్..హితుల్ అంటూ కళకు ధైర్యం నూరి.. బలిసినవాడికి గోరీకడుతూ.. బక్క వాడికి- అభ్యుదయపు ఘోషలు వినిపిస్తు.. నిశ్చల నిశ్చితాల వడ్డించిన విస్తరి జీవితాల ను నిలదీస్తూ.. మాయ మిథ్యా అనే వేదాంతిని నిగ్గదీస్తూ.. కాలువ కట్టిన ఘర్మజలానికి అంజలి ఘటిస్తూ.. మన బ్రతుకూ ఓ బ్రతుకేనా.. అని ఛెళ్ళున చరిచి, కవిత..కవిత ల కాలువకట్టి.. రస సేద్యం చేసిన రవి.. పవీ..కవి.. నవ కవితకు సింధూరం నీవై.. దగాపడిన తమ్ములకై.. జగన్నాధ రధచక్రం ..ఇరుసు నీవై.. స్వర్గాన్ని కరిగించి.. స్వప్నాలను పగిలించి పద్యమై.. వాద్యమై ..వైప్లవగీతం వీవై పేదల గుండెల.. చీకటి లో ఆకటితో ప్రాకులాడి.. ఆక్రోశిస్తూ.. ఆలోచిస్తూ.. వెదుకుతూ.. వెర్రివవుతూ.. తపించి.. తలంచి.. తరించి.. జ్వాలాతోరణమై.. రణం..రణం.. నీ పదం పదం వెర్రి కుర్రవాని.. ఊరు దిష్టిబొమ్మని దూనమాడి.. రక్తంతో తడిసిన దేశచరిత్రల ఆచ్ఛాదన..తొలిగించి.. గర్జిస్తూ.. గాండ్రిస్తూ.. కేక లేస్తూ.. శ్రమిస్తూ.. హలమై, స్వేద జలమై.. యువక నరమై.. పేదల గుండెవై తెగిన బ్రతుకుల వెలుగు దివ్వై సాధు తత్వపు ఆశలో.. అశయాలలో.. సత్యమై .. నిత్యమై.. నిత్యమై.. సత్యమై .. నిత్యసత్యమై.. బహుళ పంచమి నాడు నిశీధి నీడలలో.. గొంతు చించుకు అరచినా వినలేని.. వినికిడి లేని.. నిద్రనటించే జనసమూహం పై విసిగిన ప్రాణి వై .. వడివడిగా మరేడకో .. రవి తేజములలరగ .. నిప్పులు చిమ్ముకుంటూ వెళ్ళిపోయావు కదయ్యా.. ఓ బ్రహ్మశ్రీ.. శ్రీశ్రీ.. నీ కవితలో కలిసి పోతిమి.. కరిగి పోతిమి.. మమ్ము మేము మరచి పోతిమి.. మహాప్రస్థనం తో జాగృతమైతిమి.. అభ్యుదయం నీ ఆదర్శం అరుణోదయం..నీ ధ్యేయం మేల్కొలుపు నీ ఆరాటం నిత్యనూతనం నీ భావరాజసం జయహో.. ఆంధ్ర తేజ జయహో .. ఆంధ్ర కవిరాజ - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 30.04.2014 (నూట నాలుగు వత్సరాల క్రితం పుట్టిన ఓ కవితా సంద్రానికి.. కాస్తంత అంజలి ఘటిస్తూ... శ్రీశ్రీగా పిలువబడే శ్రీయుత శ్రీరంగం శ్రీనివాసరావు 104 వ జయంతిని పురస్కరించుకుని.. ఆమ్మహాత్మునికి కరణం అర్పించిన ఓ చిరు పుష్పం..)

by Kalyan Krishna Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iHTdWm

Posted by Katta

Kompella Sarma కవిత

మహాకవి మహారాజశ్రీ శ్రీ శ్రీ (30 ఏప్రిల్ - జయంతి) ఆకృతి సామాన్యం, వ్యక్తిత్వం అసామాన్యం అప్పలకొండ దంపతులకు వంశాకురం శ్రీరంగం కుటుంబానికి దత్తత పార్శ్వం ఫలితంగా ‘శ్రీరంగం శ్రీనివాసరావు’ పోట్టిపేరు శ్రీశ్రీ, పేరులోనే విన్నూత్నం ‘శ్రీ’ కి ‘శ్రీ’ కి మధ్య దూరం అగణితం. చదువు సంధ్యలు, విసిరేసే విశాఖ తీరాన ఒకటిన్నర దశాబ్దపు ప్రాయంలోనే వివాహం దత్తపుత్రుడికి దత్తకూతురు జీవన ప్రవేశం అర్థపుష్కరకాలం తర్వాతే జంతుశాస్త్రంలో చదువు డిమాన్స్ట్రేటరు, ఎడిటర్ తొలి కొలువులు రేడియో, మిలిటరీ, నిజాం నవాబు, ఆంధ్రవాణి జీవనయానానికి ఉపయోగిత ఉద్యోగాలు కలాయుదులు ఊహలతో కాగితంపై రాసుకుంటూ పోతారు బరకడం, గీకడం తో తెల్లకాగితాన్ని నలుపు చేసుకుంటారు వెయ్యేళ్ళకోసారో, వేలకొక్కరు వేలుతో కలంకుంచె కదుపుతారు కవితను, కవితాత్మను వేదికపై ఖచ్చితంగా ఆవిష్కరిస్తారు అసంకల్పితచర్యలా హిమగిరి ప్రతిభారోహణం చేసేస్తారు సాహితీ శిఖరాగ్రాన కవనపు మహాప్రస్థాన గానం చేస్తారు ఆ గాననాదఝరికి జగన్నాథుని రథచక్రాలూ కదులుతాయి విదేశాలు కూడా గళాన్నిస్తాయి, దశదిశల్ని మార్చివేస్తాయి. శీశ్రీ లో, రచనల్లో, చిత్రగీతాలు, కవితలు, ప్రహేళికలు, వ్యూలు, రివ్యూలు, ఉపన్యాసాలూ, కథలు, కథనాలు విశ్వసించిన సిద్ధాంతాన్ని రాద్దాంతం చేయక రాపిడిపెట్టి సమైక్యవాదాన్ని సగర్వంగా నమ్మిన కృషీవలుడు విదేశాలకు తన వాదాన్ని వేదంలా అందించాడు వారేవః కేకలను వింటూ వాడి వేడితనాల్ని పంచాడు అరసం, విరసం వేదికేదైనా ‘గురజాడ అడుగుజాడ’న్నాడు సంప్రదాయాన్ని ‘ప్రభవించి’ గ్రాంథిక చందోవిహారం చేయించాడు బాటసారి, భిక్షువర్షీయసి అంటూ ‘హరోంహర’ మహాప్రస్థానం చేశాడు ఖడ్గసృష్టితో చరమరాత్రిని నిర్మించి, ఒకటికింకొకటిని కలిపినా ఒకటేనన్నాడు వ్యూలు, రివ్యూలు, ప్రివ్యూలతో రెక్కవిప్పిన రివల్యూషన్ సృష్టించాడు విశాలాంధ్రలో ఉక్కుపిడికిలి, అగ్నిజ్వాలతో ప్రజారాజ్యాన్ని వీక్షించాడు తెలుగువీరుని మేలుకొలిపి, సంఘ శతృవుల్ని ఖబడ్డారన్నాడు మనసున మనసై, ‘హలో హలో’ ఓ అమ్మాయి! అంటూ దరి చేరాడు హృదయంలో నిదురించే చెలిని వయారి మయూరిలా ఆరాధించాడు వ్యాసక్రీడల్ని ఆడిస్తూ, వ్యక్తికి బహువచనం శక్తన్న సాహితీ అగ్రగణ్యుడు అల్పంలో అనల్పాన్ని, శిల్పశ్లేషప్రాసల్ని జోడీకరించాడు శబ్దప్రయోగాల్లో నవ్యత, ప్రజతో శతచాతురోక్తుల్ని విసిరాడు అష్టావర్షప్రాయంలోనే కవితాప్రచురణా దన్నుని చూపించాడు స్వదస్తూరితో, స్వీయగాలంతో మహాప్రస్థానాన్ని సుస్థిరం చేశాడు తనను తాను సమీక్షించుకొని దార్శనికతని స్వీయదర్శన మొనర్చాడు సౌదామినిని సంపంగితోటకు తరలించి మరోప్రపంచాన్ని చూపించాడు ఊరికేనా అంటే ఊరికే, ఒక నాటిక రాయమంటే ఏనాటికైనా రాస్తానన్నాడు తెలుగు జాతీయ భాష దురభిమానం లేని అభిమతం అన్న భాషాభావకుడు హాల్డేన్ భావాభిరామాల్ని నల్దిక్కులా ప్రతిభా ప్రచారం కావించిన ప్రవీణుడు తిక్కవేమగురజాడలను కవిత్రయపు హోదాలో నిలిపిన భాషాప్రేమికుడు అక్షరాల్ని ముత్యాలసరాలుగా ముగ్ధసమ్మోహన పరచిన నిత్యాక్షరమూర్తి సాటితోటి కవుల్లోని సశాస్త్రీయాన్ని, కృష్ణశాస్త్రీయాన్ని చవిచూశాడు ప్రపంచపు బాధ అంతా తన బాధ అంటూ యోగ్యతాపత్రాన్ని పొంది చావ ఉంటేనే చదవాలన్న చలం సవాల్ విసిరేలా చేసిన చైతన్యమూర్తి తేదీలు, దస్తావేజులు చరిత్రసారం కాదంటూ చెణుకుల్ని చెరిగాడు తెలుగు సాహిత్యాన్ని ఆయన శాసేస్తే, తెలుగు సభల పరాభవం పొందాడు ఆరేడుపదుల వసంతోత్సవాలకు విశాఖ కాకినాడ వాడల పుణ్యం సరిసములులేనితనంతో కావన సాహితీజీవనం, అనంత ఆత్మకథనం రాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రచండ ఘోషా శ్రవణం శతాబ్దపు కవన ప్రకంపనాన్ని తూచక అనుభవించి పలవరించమన్నాడు తెలుగువాడి జాతీయధనం ఓర్వలేనితనం, పొరుగింటి పుల్లకూర బహురుచి శ్రీవాణీతో తెలుగుసాహితీభారతి శుభారంభం, శ్రీశ్రీవాణి యుగపు మలుపు నూతన కవితా భగీరధుడు, సాహితీ మార్క్స్, మానవత్వ ప్రవాహ నదం గురుజాడ త్రివేణీసంగమ గురజాడ, చలంల సహచరుడు, కవి, మనీషి, ప్రపంచాగ్నికి, విశ్వసృష్టికి, భువనఘోషకి నేను సైతం అంటూ సొంతగొంతు నిచ్చిన నాద విద్వాంసుడు, ఆధునికాంధ్ర రథసారధి తన భావనా కవిత్రయాన్ని పరకాయప్రవేశం కావించుకున్న మంత్రగాడు తన రచనల్లో లోక ప్రతిఫలం, తన తపస్సు ఫలించే, జాతిజనుల గీతమంత్రకారుడు వినుతించే, విరుతించే, వినిపించే నవీనగీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం సర్వనాద మూల బిందువైన ఋతమే ప్రణవమన్న ప్రవచకుడు ‘ఆలోచన నా ఉనికికి సూచన’ అన్న మరణం లేని శ్రీశ్రీ, జనన మరణాల మధ్య విరామం శ్రీశ్రీ మరల అవతరిస్తాడన్నది తథ్యమైతే, మరో తోకచుక్క పొడవక తప్పదన్నది సత్యం శ్రామిక ప్రజా జైత్ర యాత్రాపతాక కాకా తప్పదు అన్నదీ కానున్న వాస్తవమే. శ్రీశ్రీ మరో మహాప్రస్థానాన్ని సృష్టించి, తప్పక అందిస్తాడు, అవశ్యం చదివిస్తాడు, విశ్వప్రజ మాత్రం మరో చలాన్ని సిద్ధం చేసుకోవాలి మరో యోగ్యతాపత్రానికి . ఏమో, ఎవరికెరుక? శ్రీశ్రీ-చలం అచలంగా, అచంచలంగా యుగళంగా దర్శనం ఇస్తారేమో! ‘అశీతి’ సంబరాలు జరుపుకుంటున్న వైనంలో మహాప్రస్తానపు మహోన్నత ఘనం ఏ శాతాబ్దంలోనైనా ఏకైక తెలుగు మహాకావ్యం – మహాప్రస్థానం సాగించే మహా ప్రస్థానం శ్రీ శ్రీ జయంతి సందర్భంగా – కొవ్వొత్తిని రెండు వైపులా ముట్టించే ప్రయత్నం రాబోయే దీపావళి కాంతులు ‘శ్రీశ్రీలా విరజిమ్ముతూ, తారాజువ్వల్లా అంబరాన్ని ముద్దాడాయి. శ్రీశ్రీది మహా వ్యక్తిత్వం – శ్రీశ్రీది మహాకావ్యం – మహాప్రస్థానం, మరోప్రపంచం శ్రీశ్రీది సాహితీ జగతిలో మహాభినిష్క్రమణం – పురిపండా అప్పలస్వామి మధుగుళికలు. మహాకవికి శతసహస్ర ప్రనామాలతో అక్షర నీరాజన నమస్సుమాంజలులు ‘మనిషితనపు మహాస్రవంతి’ మహారాజశ్రీ శ్రీ శ్రీ కి వందనాలర్పిస్తూ – “ప్రపంచమును పరిహసిస్తాం – భవిష్యమును పరిపాలిస్తాం” (కొంపెల్ల శర్మ – తెలుగురధం – సాహిత్య్హ,సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్)

by Kompella Sarma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QZsZ6N

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

వాస్తవస్తవం రావెల పురుషోత్తమరావు ************************************ కొంతమంది కుర్ర వాళ్ళు మత్తులకూ మందులకూ దాసులు అరాచకాలలో అకృత్యాలలో అనవరతం దోషులు. కొంతమంది యువతులు రేవ్ పార్టీలకు విధేయులు అసభ్యానికీ అశ్లీలతకూ ఆద్యంతం ఉదాహృతులు. కొంతమంది విద్యార్ధులు తండ్రుల చాటు సంపాదనపరులు అక్రమాలకూ అన్యాయాలకూ అధర్మాలకు వీళ్ళందరూ జగనేక వీరులు. ======================== 30-4-2014 {మహాకవి శ్రీ శ్రీకి నివాళిగా}

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pO3ogT

Posted by Katta

Subhash Koti కవిత

శ్రీ శ్రీ జయంతి నేడు, అందుకే ఈ కవిత...... మేం నిన్ను ప్రేమిస్తాం! // నవీన్ కోటి -------------- మేం నిన్ను ప్రేమిస్తాం! మట్టిని ప్రేమించినట్టు మట్టిని ప్రేమించే మనిషిని ప్రేమించినట్టు తల్లిని ప్రేమించినట్టు తల్లిని ప్రేమించే బిడ్డను ప్రేమించినట్టు మేం నిన్ను ప్రేమిస్తాం! మహా కవీ! మంచి నీటి మహా సముద్రమా! సరుకుల్నేతప్ప మనుషుల్ని ప్రేమించలేని చోట వరిపైర్ల మధ్య పారే వాగును ప్రేమించినట్టు మేం నిన్ను ప్రేమిస్తాం! దేవుళ్ళనే తప్ప మనుషుల్ని ఆరాధించ లేని చోట పొలం ఎండిన రైతు వాన దేవుణ్ణి ఆరాధించినట్టు మేం నిన్ను ఆరాధిస్తాం! మహా కవీ! ఒంటరైన వాడి వెంట నడిచే సాహస సమూహమా! శివాలెత్తుతున్న చీకటి రాత్రి నాడు పున్నమి చంద్రుని లాగా నేడు నీ అవసరముంది మాకు నిన్నటి కంటే ఎక్కువగా! మనిషికీ మనిషికీ మధ్య మరింత ఎత్తుగా లేచిన గోడల్ని పగుల గొట్టాల్సిన పని ఉంది మాకు నిన్నటి కంటే ఎక్కువగా! మహా కవీ! నేల కూలిన వాడి చేత కవాతు చేయించే కవిత్వమా! వలలు లేని లోకంలో పక్షులెగరడం కావాలి మాకు కలలు నిజమయ్యే లోకంలో కలిసి బతకడం కావాలి మాకు! ప్రజలు విజయాన్ని స్వప్నించిన కాంక్షారణ్యమా! ఆశ చావలేదు ఎవరెస్టు ఎడారి కాలేదు సీతాకోకచిలుక ఇంకా తన రంగులు కోల్పోలేదు ఇంద్ర ధనస్సులో ఏ రంగూ మాయం కాలేదు! మహా కవీ! అనితర సాధ్యమైనా, అత్యున్నతమైన నీ మార్గం కావాలిప్పుడు! మేం నీ బాటలో నడుస్తాం ఈ రోజు కాకపోతే రేపైనా నిలుస్తాం! గెలుస్తాం! నిలిచి గెలుస్తాం! గెలిచి నిలుస్తాం! తేది:30-04-2014 ( రచనా కాలం: శ్రీ శ్రీ శత జయంతి సందర్భంగా 2009 లో )

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hdrIiX

Posted by Katta

Chi Chi కవిత

_CommoditY_ మానమర్యాదలంటే అబ్బో అనుకున్నామనిషన్న తేడాలో అమ్ముడయ్యేలా ఉంటే వెంట్రుకయిపోయే ముందుచూపు మదుపనుకోలా.. మనిషనుకునే విలువనంతా కాజేసిన డబ్బునే మనిషనుకుంటే పోలా!! బాగుంది..డబ్బాగుంది డబ్బు మనిషయ్యాక , మనిషేమవుతాడు?? తెలీదు!! డబ్బుకీ తెలీదు..మనిషికీ తెలీదు డబ్బైన మనిషికీ తెలీదు..మనిషైన డబ్బుకీ తెలీదు ఇంకేం తెలుసు నా గబ్బులోది ఇంతే తెలుసు!! ఆపాదమస్తకం ఓ ప్రశ్నగా దిగే ఈ జన్మకి సంతలో సరుకైపోవడమే సమాధానం!! బాగుంది కదా అమ్మడం అంటే డబ్బుని కొనుక్కోడమే కొనడం అంటే డబ్బుని అమ్మేయటమే మధ్యలో ఏదుంటే ఏంటి మనిషీ డబ్బు ఒకటయ్యాక!! అవసరమిలా చేయిస్తోంది అవమానించినా పర్లా డబ్బుతోనే తుడిచేస్కుంటారు డబ్బులూ..మనుషులూ అంతలా అరిగిపోయారు మరి ఒకరిలో ఒకరు..ఒకరై!! విలువ కట్టలేం జన్మకి..విలువుంటేగా విలువిచ్చుకో ఉన్నంతలో ఉన్నంతిచ్చుకో విలువిచ్చినంతలో ఇక్కడ సరుకంటే విలువే సరుకుని బట్టే విలువ కాబట్టి!! ఈ విధంగా డబ్బు మనిషైపోయింది..విలువ సరుకైపోయింది____ (30/4/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hdrKr5

Posted by Katta

Bandla Madhava Rao కవిత

కవి మిత్రులారా! మే 1వ తేదీన గత 15 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా నిరాటంకంగా సాగుతున్న "కవిత్వంతో ఒక సాయంత్రం" కవిత్వపు పండుగ కార్యక్రమం లో అందరం కలుద్దాం రండి. .(ఒకానొక సందర్భంలో ఒక కవి తనకు ఈ కవి సమ్మేళనంలో చోటు కల్పించలేదని ఆ ప్రాంగణంలోనే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించాడు కూడా. అయినా కార్యక్రమానికి ఏటువంటి ఆటంకం కలుగలేదు.) 10 సంవత్సరాలుగా అప్రతిహతంగా వెలువడుతున్న "కవిత" సాంవత్సరిక సంచిక ఆవిష్కరణ కూడా రేపే. ప్రముఖ కవి శివారెడ్డి చేతులమీదగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరూ రండి. సాహితీ మిత్రులు, విజయవాడ.

by Bandla Madhava Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PCRFRr

Posted by Katta

CV Ramana కవిత

Thanks to friends who reminded me of Sri Sri's birthday today , apart from being a poling day. I am not a poet like any of you. I just enjoy reading. Yet, I am posting one of Maha Kavi Sri Sri's poems from Maha Prastaanam. "పేదలు " "అంతేలే పేదల గుండెలు అశ్రువులే నిండిన కుండలు శ్మశాన శిశిర కాంతులలో చలి బారిన వెలి రాబండలు " " అంతేలే పేదల చేతులు శ్లధ శైశిర పలాశ రీతులు విసుష్కములు పరిపాండురములు విచలించెడు విషాద హేతులు అంతేలే పేదల కన్నులు , వినమ్రములు వెతల వ్రణమ్ములు తుఫాను లో తడిసిన జడిసిన గోమాతల కన్నుల తమ్ములు ! అంతేలే పేదల బ్రతుకులు తిరిపెమునకు పిడికెడు మెతుకులు తరువెరుగని దీర్ఘ రాతిరి లో తల పగిలెడి తలపుల అతుకులు ! " I don't know whether quotes are allowed in this group or only original poetry. Just took this chance, on a memorable day.

by CV Ramana



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n0SmAf

Posted by Katta

Wilson Rao Kommavarapu కవిత

జీవన లిపి // 30.04.2014//కె.విల్సన్ రావు -------------------------------- ఆశల్నొదులుకుని ఆశయాల్ని భుజనేసుకున్నామని నమ్మబలుకుతూ పసిగట్టలేనంతగా మన సజీవ దెహాల్లోని ఒక్కొక్క అంగాన్నీ కత్తిరించి బతుకుల్ని అంధకారంలో తోసే అరాచకీయులు మన జీవితాల్ని బాగు చేస్తామని వాగ్దానాలు చేస్తుంటే నమ్ముదామా..? నయవంచకులు నయా వంచకులై మన దేహ నదుల్లో జలకాలాడాలని చూస్తున్నారు- నిరంతరం మన మెదడును చెంచాలు చెంచాలుగా నంజుకు తినడమే అజండాగా అన్ని రకాల జెండాల్ని మార్చి మార్చి మోస్తూ ధన నిషాలో సుఖాల్ని అనుభవించే గండు చీమలకు " నో టా " చెబుదాం! మన కస్టాల్నీ, కన్నీళ్ళనీ గుర్తెరిగి దు:ఖ మూలాల్ని తెలుసుకుని తనని తాను దానం చేసుకుంటూ మనిషి పాదముద్రల్ని కాంతిమయం చేస్తూ ప్రయాణిస్తున్న రాటుదేలిన ఆలోచనాపరుడ్ని నమ్ముదాం... మనకోసం గంధం చెక్కలా అరిగిపోతూ చైతన్యపు గొడుగును తలపై నాటుకుని జనవాహినిలోకి ప్రవహిస్తున్న వివేచన జెండా ఆసరాతో.. మనకు మనం అసహనపు ముసురులోంచి విముక్తులమై జీవన సత్యాలను విప్పి చెప్పే పరాధీనతకు లొంగని మానవాయుధాలమవుదాం. సజీవ అలంబనైన మనసున్న ఆత్మ విశ్వాసిని ఎన్నుకుని ఒక వినూత్న జీవన పరిమళ సూర్యోదయాన్ని కలగందాం...

by Wilson Rao Kommavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n0Glej

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | మాంజా | జబ్బు పడ్డ సమాజం పై జాలిపడ్డ సూర్యుడి కంటిలో నుండి జారే కన్నీటిలా కురుస్తున్న వర్షం అంచులలో నిలబడి స్తబ్దంగా కళ్ళ చివర గడ్డకట్టుకుపోయిన దుఃఖంని చినుకులలో తడిపి బాధ భారాలని పైకి తెలియనివ్వని హృదయాలు అబద్దపు నవ్వుల నెర్రెలతో నిస్తేజమైన ఎండమావి లా గడ్డ కట్టిన మనసు మూలల్లో కదిలించే కధల కన్నీరు తో ఆశలకి కి అభావాల మధ్య ఊగిసలాడే రిలేషన్ షిప్స్ మాంజాలు చేతులనే కోస్తాయో ? మనసులనే కటీ పతంగ్ చేస్తాయో ? నిర్లిప్తమయిన నిట్టుర్పులతో బండరాళ్లను చేస్తాయో ? నిశీ !!! 30/04/14 *After listening to Swanand Kirkire’s Manza

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nGvI2J

Posted by Katta

Jayashree Naidu కవిత

శ్రీ శ్రీ జయంతి-30-04-1910 సందర్భంగా... శ్రీ శ్రీ రచన... సిప్రాలి -- మే మే గేయాలనుంచి ఆ 'మహా కవి'తాత్మను గుర్తు చేసుకుంటూ... సిరి సిరి మువ్వలం చెరిగిన దవ్వులం మృత్యువు పెరట్లో మందార పువ్వులం భగవంతుని వితంతువులం కరుణకు మా బ్రతుకు కవనం మా మెతుకు సిరి సిరి గంటలం చీకటి పంటలం మృత్యువు గొంతున మొరసే మంటలం భగవంతుని మారని చెక్కులం భళ్ళున తెల్లారే ఋషి వాక్కులం కష్టాలు మా పదజాలం కవనం మా త్రిశూలం సిరి సిరి గజ్జెలం తెరమరుగుజ్జులం మృత్యువు కోరల్లో సర్పపు రజ్జులం భగవంతుని చిరునామాలం పగలు రేల పరిణామాలం ఆశ్చర్యాని కవధులం ఆవేశాల పరిథులం ** ** **

by Jayashree Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rEdjkL

Posted by Katta

Sravanthi Itharaju కవిత

సౌగంధిక జాజరలు!( నా దశమినాటి జాబిలికి అంకితం) ప్రియా! నా వలపుతోటలోకి నిన్న అందమైన జాబిలి తొంగిచూచింది నా సొగసుల చెలికాడా! నిను జ్ఞప్తికి తెచ్చింది ఇంతలో ఎక్కడిదో ఓ పిల్లగాలి నా కురులను కదిపింది నీ చేతుల చిలిపిచేతలను చేరవేసింది సిగలో ముడిచిన మూడు మూరల మల్లె చెండు మెల్లిగా జారింది అది నీ వొడిలో ఉన్నానన్న తీయటి అనుభూతినిచ్చింది ఎర్రగులాబీ రెమ్మకు నా చీరె చెంగు తగులుకుంది అది నీ చేతచిక్కిన నాటి తీపి జ్ఞాపకాలని పంచింది నడకల వొడుపుల నా ఎర్రంచు తెల్లచీరె రివరివలాడింది మగసిరి ఉట్టిపడే నీ స్వరాన్ని నా చెవిని మ్రోగించింది ఝుమ్మని తుమ్మెద జాజి పందిరిపై వ్రాలింది ఘుమఘుమలాడే నీ కొంటె కోరికల తెలిపింది చేమంతి కొమ్మపై ఓ అందాల పూజంట పూసింది అవి నీవూ నేనుగా నా మది తలచి మురిసింది ప్రకృతి అంతా నీ , నా మయమే కదా! నా ప్రియా! రావేల ఈవేళ..ఓ ప్రియా..నా ప్రియా..! మొగలిపువ్వు విచ్చినా,గుచ్చినా అందమే.. ఈ రేయి నీవు నాకందినా అలిగినా నాకానందమే! సౌగంధిక జాజరలు!( నా దశమినాటి జాబిలికి అంకితం) ప్రియా! నా వలపుతోటలోకి నిన్న అందమైన జాబిలి తొంగిచూచింది నా సొగసుల చెలికాడా! నిను జ్ఞప్తికి తెచ్చింది ఇంతలో ఎక్కడిదో ఓ పిల్లగాలి నా కురులను కదిపింది నీ చేతుల చిలిపిచేతలను చేరవేసింది సిగలో ముడిచిన మూడు మూరల మల్లె చెండు మెల్లిగా జారింది అది నీ వొడిలో ఉన్నానన్న తీయటి అనుభూతినిచ్చింది ఎర్రగులాబీ రెమ్మకు నా చీరె చెంగు తగులుకుంది అది నీ చేతచిక్కిన నాటి తీపి జ్ఞాపకాలని పంచింది నడకల వొడుపుల నా ఎర్రంచు తెల్లచీరె రివరివలాడింది మగసిరి ఉట్టిపడే నీ స్వరాన్ని నా చెవిని మ్రోగించింది ఝుమ్మని తుమ్మెద జాజి పందిరిపై వ్రాలింది ఘుమఘుమలాడే నీ కొంటె కోరికల తెలిపింది చేమంతి కొమ్మపై ఓ అందాల పూజంట పూసింది అవి నీవూ నేనుగా నా మది తలచి మురిసింది ప్రకృతి అంతా నీ , నా మయమే కదా! నా ప్రియా! రావేల ఈవేళ..ఓ ప్రియా..నా ప్రియా..! మొగలిపువ్వు విచ్చినా,గుచ్చినా అందమే.. ఈ రేయి నీవు నాకందినా అలిగినా నాకానందమే!

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PQ4nfG

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి గాయం పువ్వుకి గాయమై కన్నీరు కారుస్తుంటే పచ్చని ఆకులతో తన గాయానికి కట్టు కడదామని ఆకులని తెంపితే, ఆకులు కూడా ఎర్రని రక్తాన్ని స్రవిస్తుంటే హృదయం ద్రవిస్తూ నేను! ఓ పుష్పమా ఇక వికసించకు నీ కన్నీటి నవ్వుతో నన్ను మాటిమాటికి వేధించకు; నా మనసుకి కట్టు కట్టేవారెవరూ లేరిక్కడ! 30Apr2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QYAon6

Posted by Katta

యాకయ్య వైట్ల కవిత

శ్రీరంగం శ్రీనివాస రావు (శ్రీశ్రీ) జన్మదిన సందర్భముగా నా ఈ కవిత IIమనుషులం... మేము మనుషులం..? II ---- యాకయ్య . వైట్ల మనుషులం... మేము మనుషులం మానవత్వం చూస్తే మాకు మూర్చరోగం. మంచి మనిషిని చూస్తే మాకు వాడిది పిచ్చిలోకం. నిప్పు కణికలు సృష్టించే రాతి బండలు కరిగించే నీటి కొండలు చేదించే నేల విడిచి నింగి సాముచేసినా నీతి మాత్రం నాటిదే ఊసరవెల్లి మా ఆప్తుడే. ధైర్యం లేని బ్రతుకులు... దెయ్యంలా నతుకులు కుక్కలా గతుకుడు ... "బొక్క"ల కై వెతుకుడు ఛీ... ఛీ... చిపురుకున్న మురికి మేము... ఈ నేలకి పట్టిన చీడ మేము. కాశాయానికి కాళ్ళు పడుతాం, సువార్తల కి హరులమవుతాం, నడి వీధిన గొంతెత్తి గోరీలు కడతాం. మరణించే క్షణమునైనా, ఈ మనిషికి తెలిసేనా...? "మనిషి" మాత్రమే దేవుడవుతాడని. "ఆది"... "అమ్మా "... అంటూ ఇంట్లో ఆరాధనా. "నీ"... అమ్మ... "ధీ"నమ్మా... "వీ"డమ్మా... అంటూ వీధిలో స్తోత్రం. భరత మాత బిడ్డలం మేము... బరితెగించిన గోడ్డులం మేము. ప్రేమా... పొంగూ... అంతా పైమాటే "పైకం" ఆపిచూడు నీ ప్రాణం ఎవరో... నీ గానమేవరో తెలిసే. నింగి చివరన... ఆ నేల అంచున అంతా కలిసినట్టే మా మనుషులంతా... అంటి ముట్టనట్టే. పాశానికి ప్రాణం ఇస్తాం విషానికి వెన్ను విరుస్తాం ఆపదలకి హస్తమిస్తాం ఆకలిగొన్న చూపుకి ఆవిరవుతాం, రోషానికి రొమ్ము చూపుతాం రొక్కం ఇస్తే చక్కగా ఈ చిక్కులని చలిమంటకాస్తం. మహానీయులమైనా..... మహనీచులమైనా.... మనుషులం... మేము మనుషులం మానవత్వం చూస్తే మాకు మూర్చరోగం. మంచి మనిషిని చూస్తే మాకు, వాడిది పిచ్చిలోకం. Dt. 20/12/13

by యాకయ్య వైట్ల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jg5zEC

Posted by Katta

Rambabu Challa కవిత

చల్లా గౙల్-11/ Dt.30-4-2014 ఉంగా ఉంగా బుల్లి పాటలు పాడుతున్నావా అమ్మ కొంగుతో బూచి ఆటలు ఆడుతున్నావా తల్లిపాలను త్రాగి ఆకలి తీరిందంటే పువ్వుల్లాంటి బోసినవ్వులు రువ్వుతున్నావా బొమ్మల పెళ్ళి చేసి ఆటపాటలతో అలసి నాన్న కాళ్లపై తూగుటుయ్యాల ఊగుతున్నావా అన్నమూపుపై చేరి గుర్రపు స్వారి చేసి బొమ్మ కత్తితో బామ్మ మీదికి దూకుతున్నవా చందమామను చూపి కావాలంటూ ఏడ్చి తాతగారిని కోరికలెన్నోకోరుతున్నావా ముద్దు మాటలు పలికే ఆ సందడి రాసే "చల్లా" అందరి మదిలో అనుబంధాన్ని పెంచుతున్నావా

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jg5Asg

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

నిజము పలుకువాడు నిష్ఠురమ్ముగ తోచు - పిచ్చివాడని వెలివేయుచుంద్రు ! నీతిగా వెలిగెడి నిప్పును ముద్దాడు ధైర్య మెవరి కుండు ధరణి మీద ?

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1km6eTc

Posted by Katta

Arcube Kavi కవిత

కుళ్ళిన పళ్ళతోట-6 ________________ ఆర్క్యూబ్ లకలుక లోన్ని జూత్తే ఎల్.ఐ.సి ఏజెంట్ కు బామ్మర్దే గుర్తస్తడు ఇక ఇకలూ పకపకలూ నవ్వులు నువ్వులై రార పోరలు గల్ల దుంకుతై పంటిమీద గార పారతో చెక్కు పోదా పిల్లలంతే సత్యవంతులు! దాళ్ళదడ లాడిత్తరు గోల్కొండ దర్వాజకు తలుపుల్లేవు దొంగలు వడరు.. మతలబేంది? ' తాళంగొప్ప ముత్యాలు లేని డబ్బ ' మర్మమేంది పండ్లూసి పోవుడు పాపం ! పోడుపు కథలు పాకానవఢ్తై టీవీ పెడితే ఇకారానికి చెలికత్తే .. యాంకరట ముఖం నిండ పండ్లనిరబోసుకొని మూడు వంకర్లు ముప్పై ఆరు కొంకర్లు నోరు దెరిస్తె బాష _రెక్కలు తెగి ఊసిళ్ళపురుగై ఊషిపడ్తది 1815 జూన్ 18 యుద్దం వాటర్లూ ఐనా దొరికింది భారీ పల్లడంపే ఠండా ఠండా కూల్ కూల్ మూడో ప్రపంచ యుద్దం నడుస్తున్నది నయా నెపోలియన్ హీరోగా మారి పల్లమీద వడుతడు కాస్మోటిక్ డెంటిస్ట్రికి కడుపు పండుద్ది గుట్కాకు గుడి కట్ట్టుడు కూల్ డ్రింకులల్ల పొట్టు పొట్టు తడుపుడు పొగతో పొగనెట్టుడు ఫాస్టు పుడ్దులల్ల అణగవట్టి బొండిగ పిసుకుడు పన్ను పాసిపోయి సుక్రోసు పులుసుడుA ల్యాక్టో బ్యాసిలై బలుసుడు నిండా పిప్పి పూతవట్తి బతుకు అంచులు రాలుతుంటై ఔ మన పంటి పొక్కే డెంటిస్టుకు పర్తల కెమికల్ పేస్టుల వ్యూహం ఫలించి దారిద్ర్య రేఖ రెండు దవడలు స..స..స.. సలుపుతుంటై * * * * ·

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o1V5JD

Posted by Katta

R K Chowdary Jasti కవిత

రాగధ్వని జాస్తి రామకృష్ణ చౌదరి ఆ మధుర రాగం ఇంకెక్కడుంది నాలో; నీలోకి ఎప్పుడో ప్రవహించింది కదా నాలో మిగిలింది కేవలం శబ్దమే కదా ఇక నాలో ఉన్నది శూన్యమే కదా ఇక నాలో ఉన్నది నిశ్శబ్దమే కదా; అయినా నా రాగమే కదా నీలో సరాగమై నీకు జీవితాన్నిచ్చింది నాకు మరణాన్ని మిగిల్చింది; అయినా పరవాలేదు; నాలో నా అంతస్సులో మహా సత్యం ఉంది; అదే నా మోక్షం! అలాగని నాలోకి ప్రవహించకు నీలోంచి తప్పించుకోవడానికి; ఆ శూన్యంలో, ఆ నిశ్శబ్దంలో ఆ సత్యంలో, అంతరించిపోతావ్! 30Apr2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jekO0M

Posted by Katta

Abd Wahed కవిత

గాలి గాలి వెంట వేలు పట్టుకుని నడిచాను జలతారులా పెనవేసుకున్న హాయి భారాన్ని మోస్తూ గాలికౌగిలి భారమే... అరవయ్యేళ్ళుగా నా మెదడులో ప్రతిష్ఠంచుకున్న శిలాసౌందర్యం చెక్కుచెదరని గాలిమేడ... ఐదేళ్ళకోసారి గాలిముద్దులకు పెదాలపై ఎడారి విస్తరిస్తోంది... కంటిలో ఆశ కొడిగడుతోంది... గాలి కౌగిట, ఉక్కుభీముడిలా ముక్కచెక్కలైన కలల అవశేషాలు చీకటి చెలమల్లో చెల్లాచెదరు... ఇంకా గాలికౌగిటి వాసన పోలేదు భ్రమల చేతులు వీపును తడుతున్నాయి.. కలల తునకలు నేలరాలుతున్న సంగీతం వింటూనే ఉన్నాను.. గాలికౌగిట పట్టిన చెమట ఆరేలా లేదు.... శాంతికపోతంలా ఆకాశంలో ఎగురుతోంది గాలి చకోరపక్షిలా శాంతి కోసం నేలపై నేను... మళ్ళీ ఐదేళ్ళ విరహం ఒక మహోత్సవం లాంటి మరో కౌగిలి గాలులు వీస్తూనే ఉన్నాయి... రంగు రంగుల గాలులు ఎన్నటికీ మారని మట్టిరంగులా నేను...

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nDuSUr

Posted by Katta

Pusyami Sagar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ రాసిన కవిత //ఊరుపేరెంది మరి//కవిత్వ విశ్లేషణ _______పుష్యమి సాగర్... పల్లె నుంచి పట్నం పోయిన వలస బతుకుల చిత్రమే నరేష్ కుమార్ గారు రాసిన కవిత !!ఉరు పేరేంది మరి !!...చాల చక్కని మాండలికం లో రాసిన ప్రతి అక్షరం బతుకు చిత్రమే..అందరు దైనందిన జీవితం లో ఉరుకులు పరుగులతో సాగుతూనే వుంటారు ఎంత యాంత్రికమైన కూడా ...ఇక్కడ పల్లె నుంచి పట్నం వచ్చిన వ్యక్తుల ఆలోచన, వారి లో వుండే వ్యధ, అంతరంగ వ్యక్తీకరణ కన్పిస్తుంది ...మేము ఎలా ఉన్నామో చూడండి అంటూ ఇలా అంటారు ఇంట్లకేంచి ఆఫీస్కూ//ఆఫీస్ల ఖుదాహఫీజుల్జెప్పి ఇంట్లకూ...//"బైంగన్ కా జిందగీ" అనుకుంటనే బేషరం గాల్ల లెక్క//బజార్లపొంట నడుస్తనే ఉంటం ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టి అందులో మమేకం అయినపుడు తన పాత రోజులులను తలచుకొని బాధ పడుతున్నాడు ...పల్లె నుంచి పట్నం వచ్చిన వలసవాది మరి పొద్దున నుంచి సాయంత్రం దాక ప్రపంచాన్ని చుట్టి వచ్చిన సూరుడు పొద్దు పొడిచే వరకు అంత వేగం గా ఎలా సాగుతుంది ...ఇదే ఆలోచన నుంచి అన్నం తినడం కూడా మర్చిపోతాం .. మల్ల ఎర్రవడి వొర్రెల దుంకుతడు//గ్రాండ్గ బతుకుతున్నం అనుకుంటనే రావొత్తు ఏన్నో పారేస్కొని//పల్లెం ల మారన్నం బెట్టుకునుడు పల్లె నుంచి కడుపు నింపు కోవటాని కి పట్నం వచ్చినపుడు మరల అదే పల్లె భాష కాని, వారి అలవాట్లు ...మాట కాని పలకరిస్తే.....మనసు కొట్టుకుంటుంది ఒకసారి అన్నా నా పల్లె ను చూడాలి ..అక్కడ నేను కోల్పోయిన ప్రతి ఒక్కటి ని ముద్దాడాలని ఉంది ...ఒక జానపద గాయకుడి పాట కన్న ఊరు కి రప్పించే శక్తి ఉన్నదీ అంటే ...గొప్ప పాట దా ...లేక పాట రాసేలా ప్రేరేపించిన ఊరుదా ...ఏమో!!!! ...తను తిరిగిన వీధులను ...గుర్తు చేసుకుంటూ మొత్తం తిరగ మనసు అవుతుంది .....మల్ల ఎప్పుడు అయిన ఊరికి వెళ్తే ...అక్కడ తన పల్లెతనం కాకుండా కొత్త గా ...పట్నం మొహం కన్పిస్తుంది ...????!!! నిజమే ...పల్లె నగరీకరణ అయినపుడు అంతే కదా.,... ఎప్పుడన్న ఓసారి //రేడియల కెల్లి గొరటెంకన్న వొర్లినప్పుడు//యాదికచ్చిన ఊరు కండ్లల్లకెల్లి కార్కత్తది.../గల్లిలల్ల గాయి గాయి తిర్గబుద్దైతది పల్లె పట్నపు మొకమేస్కొని//గడంచెలగూసోని//నవ్వుతాంటది... తన ఆత్మ పల్లెటూర్లో నే వదిలేసి యంత్రకత ను నింపుకొని సాగుతున్న పట్నం బతుకును తలుచుకొని విచారిస్తున్నప్పుడు తన పల్లె తమ్ముడు మారిన తన పల్లె కి ఏమి పేరు పెడదాం అన్నప్పుడు నిజంగా పల్లె మనసు ఎంత గా క్షోబించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ... మాడుప్మొకమేస్కొని//మంచాల గుసుంటే//కడుపుల కత్తివెట్టినట్టు తమ్ముడచ్చి అడుగుతడు//"అన్నా మనూరికి కొత్త పేరేం బెడ్దామే" అని మొత్తానికి నరేష్ గారు పట్నం మింగేసిన పల్లె ని మరోసారి చిత్రం పై కి తీసుకు వచ్చారు తన కవిత ద్వారా., ...వారి కవితలేప్పుడు కూడా సామాజిక అంశాల ను తడుముతూ ..ముందుకు సాగుతుంది ..కాకపోతే అచ్చమైన తెలంగాణా మాండలికం లో ఉన్నదు వలన కొన్ని అర్థం కానివి వుండి ఉండొచ్చు ఉదాహరణ కు "సిల్పర్లతోటి" , "సైబాత్ సమజైనట్టు"మనకతం "గాయి గాయి! వంటి కొత్త పదాలు అర్థం చేసుకోవడం ..ముఖ్యం గా తెలంగాణా మాండలిక ము తో పరిచయం లేని వాళ్ళకి కొత్త గానే అనిపిస్తుంది ..కొన్ని వాటికి వివరణ ఇచ్చి ఉంటె బాగుండేది ...అది మరింత చేరువ గా వెళ్ళేది పాటకుడి మనసు లో కి ..మంచి కవిత ని అందించిన నరేష్ కుమార్ గారికి వందనాలు ... సెలవు ఏప్రిల్ 30, 2014 ----- సొన్నాయిల నరేష్కుమార్ //ఊరుపేరెంది మరి// ఉర్కుతనే ఉంటం అందరం ఇంట్లకేంచి ఆఫీస్కూ ఆఫీస్ల ఖుదాహఫీజుల్జెప్పి ఇంట్లకూ... "బైంగన్ కా జిందగీ" అనుకుంటనే బేషరం గాల్ల లెక్క బజార్లపొంట నడుస్తనే ఉంటం ఏదో పీకుదాం అని తెల్లవడ్డ సూర్యుడు పొద్దూకంగ సైబాత్ సమజైనట్టు మల్ల ఎర్రవడి వొర్రెల దుంకుతడు మనకతం గాదు గ్రాండ్గ బతుకుతున్నం అనుకుంటనే రావొత్తు ఏన్నో పారేస్కొని పల్లెం ల మారన్నం బెట్టుకునుడు మర్శిపోతం. ఎప్పుడన్న ఓసారి రేడియల కెల్లి గొరటెంకన్న వొర్లినప్పుడు యాదికచ్చిన ఊరు కండ్లల్లకెల్లి కార్కత్తది... ఊల్లెకు వొయ్ సిల్పర్లతోటి గల్లిలల్ల గాయి గాయి తిర్గబుద్దైతది సికింద్రవాద్ల తలుపుదీశి ఊర్కడుగువెడ్తే పల్లె పట్నపు మొకమేస్కొని గడంచెలగూసోని నవ్వుతాంటది... మాడుప్మొకమేస్కొని మంచాల గుసుంటే సర్వపిండి ని పిజ్జా లెక్క కొరుక్కుంట పక్కపొంటి కూసోని కడుపుల కత్తివెట్టినట్టు తమ్ముడచ్చి అడుగుతడు "అన్నా మనూరికి కొత్త పేరేం బెడ్దామే" అని

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pKXRHG

Posted by Katta

Yessaar Katta కవిత

సురెక||వోటు బా(పా)ట.. 1. దేశము బాగునే కోరుకో వోటేసి భాగమై ఆదుకో ! వోటరన్నా నీవు మేలుకో వోటేసి దేశాన్ని ఏలుకో !! 2. సందు చూసి దండుకోకు మందు వేసి పండుకోకు ! నోట్లజాతరల సొమ్ముషోకు వోటునెపుడు అమ్ముకోకు !! 3. నేతల్ని కంట కనిపెట్టు ‘నోటా’తొ వారి పనిపట్టు ! నోటి మాటలు కట్టిపెట్టు వోటు బాటకు పట్టుపట్టు !! 4. వోటుంటే రాదంట చేటు దానితోనె వేయిర వేటు ! వోటుంటే లేదంట లోటు అదివేసి నీ సత్త చాటు !! 5. వచ్చింది వోట్ల పండుగ వోట్లేసి చేద్దాం నిండుగ ! బద్దకించి ఇంట్లొ ఉండక వేద్దాం వోట్లన్ని మెండుగ !! .. (నేటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా-30/04/2014)

by Yessaar Katta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pKXRrc

Posted by Katta

Vijay Lenka కవిత

Nirmalarani Thota అ . . అమ్మ . . అక్షరాలు.. ! గుండెల్ని కదిలించేశారు, వారి కోసం ఈ నా పోస్ట్: ఆది ప్రణవ నాదమది అమ్మ అనే పదం ఓంకారం మారు పేరు అమ్మ అనే స్వరం అహంకారంతో మమ్మీ చేసేస్తున్నాం మమతల మొగ్గల్ని మొదట్లోనే తుంచేస్తున్నాం తెనుగున భావ ప్రకటన మృగ్యమవు తుంటే ఆంగ్ల మృగ త్రష్ణల వెనుక మనం పడుతుంటే జిహ్వకు పదును పెడతాను ఆలోచనల ఖడ్గాని విదిలిస్తాను ఒంటరి సైనికుడ్నైనా సరే నా యుద్ధం నేను చేస్తాను

by Vijay Lenka



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1haO7gO

Posted by Katta