పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
koppula vasundhara లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
koppula vasundhara లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, సెప్టెంబర్ 2012, శనివారం

కొప్పుల వసుంధర॥Tell me why ...??॥


చెప్పగలవా...??


నాకీ ఒంటరితనం ఎందుకో..

నువ్వెక్కడ ఉంటె..
నేనక్కడ ఉండలేక పోతున్నానో..
కొన్ని యుగాల ఈ నా అన్వేషణ
నా ఆరాధన ఎందుకోసమో.
చెప్పగలవా...??

నా ప్రశాంతత
ఏ గూటిలో..ప్రశాంతంగా నిదిరిస్తోందో..
చెప్పగలవా..??
నా వేదన
నా కన్నీరు
ఏది చేతకాక
ఏం చేయాలలో పాలుపోక..
నే అరిచే అరుపులో..శభ్దం
ప్రతిధ్వనించి తిరిగి నన్నే ఎందుకు చేరుతుందో..
చెప్పగలవా..??

రాసే కొద్ది పేజీలే తప్ప
మాటలు ,మనసు ఖాళీ అవని
ఈ ఖాళీతనం ఏమిటో..
కనీసం, నువ్వైనా..చెప్పగలవా...???