కవిత్వంతో ఏడడుగులు – 27 . మన కేరళ సోదరులు మంచి కవిత్వం అందిస్తున్నారనడానికి ఇదొక మంచి ఉదాహరణ. గాలికి దీపం అటూ ఇటూ కదలాడడం ఒక ప్రకృతి సిద్ధమైన అనుభవం. దానికి ఒక తాత్త్విక ఊహను జతపరచడం కవిత్వపు సొగసు. మనిషికి ఎప్పుడూ ఒకరి నీడలో బ్రతుకుతూ, తన ఉనికిని కోల్పోవడం కన్నా దుఃఖభాజనమైన విషయం మరొకటి ఉండదు. ముఖ్యంగా స్వేచ్ఛా ప్రియులకి. లౌకికమైన అవసరాలకీ, (ప్రధానమంత్రో, మరో మంత్రో, సలహాదారో వంటి) లౌల్యాలకీ గొప్ప గొప్ప మేధావులే తమ స్వాతంత్ర్యాన్నీ, వాక్స్వాతంత్ర్యాన్ని, తనఖాపెట్టుకుని, ఒకరి నీడలో మసలడం మనం నిత్యం చూస్తున్నదే అనుకొండి. ఈ కవిత అలాంటి వాళ్ళని ఉద్దేశించి వ్రాసినది కాదు. దాస్యం కోరుకునేవాళ్లకి స్వాతంత్ర్యపు విలువ తెలీదు. భావదాస్యాన్ని మించిన దాస్యం మరొకటి ఉండదు. అది అంతఘోరమైనది. (హెచ్చరిక: మనమందరమూ ఈ క్షణంలో కూడా ఏదోరకమైన భావదాస్యానికి, తెలిసీ, తెలియకా లోనై ఉన్నవాళ్ళమే. కనుక ఒకరిని ఆక్షేపించే పనిలేదు. స్వేచ్ఛ అన్నది మనకున్న భావదాస్యాలనుండి విముక్తి అవడానికి ప్రయత్నిస్తూ, కొత్తవాటికి దాసులం కాకుండా పరిరక్షించుకునే నిరంతర ప్రక్రియ.) కవి ఎంతబాగా చెబుతున్నాడో గమనించండి. దీపంక్రింద నీడ చేసే విన్యాసం కేవలం వినోదానికి కాదట, ఎల్లప్పుడూ దీపం ( ప్రమిద, లేదా కొవ్వొత్తి) క్రింద పొర్లుతూ ఉండడం వల్ల కలిగే దుఃఖాన్ని మరిచిపోవడానికి చేసే ప్రక్రియ...ట. నిరాకారమైన నీడకే అంత స్వాతంత్ర్యేచ్ఛ ఉంటే, మనకి ఎంత ఉండాలి. అది ఎవరికి వారు ఆత్మావలోకనం చేసుకుని తెలుసుకోవలసిన విషయం.. ప్రయాస... వీరన్ కుట్టీ, మలయాళ కవి. . ఈ నీడ, ముందుకీ వెనక్కీ నడయాడుతూ తనరూపాన్ని పెంచుకుంటూ, కుంచించుకుంటూ పోవడం అదేదో కాలక్షేపానికి ఆడే వినోదక్రీడ కాదు. . అది, తను ఎల్లకాలమూ ఒకరి పాదాలక్రిందే పొర్లుతూ తన ఉనికి కోల్పోతున్నందుకు పడే దుఃఖాన్ని మరిచిపోడానికి చేసే ప్రయాస... . వీరన్ కుట్టీ, మలయాళ కవి . . The Effort . This Is No Trivial Pastime, This Play of the Shadow, Stretching and Shrinking Its Own Image... It Could Be an Attempt To Forget the Sorrow Of Being Overshadowed, Forever Stuck Beneath Another…! . Malayalam Original: Veeran Kutty Veeran Kutty is a Lecturer at Government College, Madapally, Kerala. (English Rendering: Girija Chandran)
by Nauduri Murty
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gaZB2q
Posted by Katta
by Nauduri Murty
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gaZB2q
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి