పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Nvmvarma Kalidindi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nvmvarma Kalidindi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, జూన్ 2014, మంగళవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//నేను మాత్రం ఇద్దరిని (193 నుండి 211 వరకు)// 193. వెలుగులో పరిశ్రమిస్తున్న పగలు నేనే చీకటిలో విశ్రమిస్తున్న రేయిని నేనే తన చుట్టూ తాను పరిబ్రమిస్తున్న భూమి ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 194. శూన్యంలోకి శాటిలైట్లు పంపిస్తున్న నాగరికుడు నేనే భూమాతని కాలుష్యం చేస్తున్న అనాగరికుడూ నేనే సమతుల్యం లేని పలితం విషతుల్యం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 195. రాత్రి సైతం పూర్తిగ ఉండని విద్యుత్ సరఫరా నేనే పారిశ్రామిక అభివృద్ది చేస్తానంటూ ప్రగల్బాలు పలికేదీ నేనే ఉత్పత్తి మాట మరచేవి ఉత్తుత్తి ఎన్నికల హామీలు ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 196. కడుపు నిండని కళాకారుడు నేనే కీర్తికాంక్ష తరగని దాతనీ నేనే అర్ధాకలి తీర్చేది మృత్యువు ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 197. ఆలోచనలతో పదునెక్కిన మేధావి నేనే ఆవలింతలతో పరుపుదిగని బద్దకస్తుడూ నేనే ఆచరణకు నోచుకోని ఆవిష్కరణల గమ్యం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 198. ఆడబిడ్డలకు ఆంక్షలు పెట్టే సమాజాన్ని నేనే వాడికేం మగాడంటూ వెనకేసుకొచ్చే కుటుంబాన్ని నేనే సభ్యత సంస్కారం మరిచాక మానవుడూ దానవుడూ ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 199. సర్వాంతర్యామికి గుడికట్టిన స్థల పురాణం నేనే సర్వదర్శనానికి వెలపెట్టిన ధర్మకర్తనూ నేనే పేదలకి దర్శనమీయక అభాసుపాలైంది దేవుడొక్కడే నేను మాత్రం ఇద్దరిని. 200. శవాలు దొరికిన చుండూరు దమనకాండ నేనే సాక్షాలు దొరకని న్యాయ పరిశోదన అరణ్యకాండ నేనే దురాగతాన్ని ఎండగట్టలేని దృతరాష్ట్రని నీతి ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 201. ఉద్యమాన్ని ముందుండి నడిపిన సాహిత్యాన్ని నేనే బండబూతులు రాసి కవినన్న కపిని నేనే చరిత్రకి సాక్ష్యం సమకాలీన సాహిత్యం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 202. విద్య వైద్యం ప్రాధమిక హక్కులకి పైకం పెట్టిన ప్రభుత్వం నేనే అన్నీ ఉచితమంటూ మానిఫెస్టో ప్రకటించిన రాజకీయం నేనే నాకింత బిక్షవేసి ఊరిని దోచుకోమన్న ఓటరు ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని. 203. పట్టెడన్నం బిక్ష వేయని స్వార్ధపరుడు నేనే దేవుడికి ముడుపులు కట్టే బక్తుడిని నేనే మానవుడే మాదవుడని మరిచింది లోభి ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని. 204. కవిగా నీతిభోదలు చేస్తూ అఃతర్జాలంలో నేనే వక్రబుద్దులతో సమాజంలో మృగాడిగా తిరుగుతూ నేనే దొరకనులే అన్న బ్రమలో ఉండేది దొంగ ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని. 205. స్వ పరిపాలన నినాదమై నేనే కుటుంబ పాలన నిర్వహిస్తూ నేనే తీరిన కోరిక ముఖ్యమంత్రి పదవి ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 206. ముంపు గ్రామాలు ఆంధ్రావని తేల్చిన కేంద్రప్రభుత్వ ఆర్డినెన్సు నేనే ఆగ్రామల విద్యార్ధులకు బస్పాసులివ్వని తెలంగాణ ప్రభుత్వాన్నీ నేనే ఉద్యమాలు ప్రభుత్వాల నడుమ నిర్బాగ్యులైన నిర్వాసితులంతా ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 207. MRPలకు అమ్మకాలు నెరిపే చిల్లర కొట్టు నేనే discountలు ఆఫర్లు ఇచ్చే బడా బడా మాల్సు నేనే FDIల పుణ్యమాని సగం అమ్ముడుపోయిన భారతావని ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 208. ఎర్రచందనం ఎగుమతిచేసే స్మగ్లరు నేనే హవాలాలో పార్టీఫండు పంపే రాజపోషకుడు నేనే దొరకడెన్నడూ స్మగ్లరు; దొరికేది కూలీ ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని. 209. విద్యార్ధులకి నీతిపాఠాలు చెప్పే గురువుని నేనే దొంగ సర్టిఫికేట్లతో చదువుకున్న B.E.D విద్యార్ధి నేనే గుణం లేని గురువులు చెప్పే పాఠంలో మిగిలింది వృత్తి ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 210. సంక్రాంతి పండగని దేశ విదేశాల నుంచి వచ్చేది నేనే జూదమే ప్రతిష్ఠగా జీవితాన్ని పందెం కాసేది నేనే పండగనే పందెం చేయగలిగింది భీమవరం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 211. సంక్షేమ పధకాలు మా ఘనతంటూ ప్రకటించే పార్టీ నేనే తలసరి అప్పులు, లోటు బడ్జెట్ల ప్రభుత్వాన్ని నేనే ఎవడబ్బ సొమ్మంటూ ప్రశ్నించలేనిది గొర్రలమంద ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని.......23.06.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lMS2XZ

Posted by Katta

20, జూన్ 2014, శుక్రవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//సందర్బాలు// తెలిసీతెలియక తెలియనితనం కాక సందర్బోచితంగానే కురుస్తుంది గాలిలోనే ఆవిరైన వర్షం ఒయాసిస్సులా బ్రమపెట్టి ఎడారిలో ఇసుక తుఫానుగా ఎగసిపడుతుంది. జల గళ మని కళ కల పరుగు తీసి తటాకంలో కాస్త సేద తీరి గట్టు ఎత్తు కొలిచి నది లోతు తొలిచి సముద్రంలో స్థిమిత పడి ఉప్పు కప్పురంబు పద్యం చెబుతుంది. అగ్గిపుల్ల బుగ్గ కొరికి ఆకాశంలోకి ఎగసి ఎగసి చుట్టి పక్కల అందినంతా బుగ్గి చేసి అగ్గి నివురు గప్పి వేటకై వేటుకై ఎదురు చూస్తుంది. వెన్నలతొ పోటీ పడి తెల్లవారు జాము ఆధిపత్యం సాధించి వెన్నెలే కురిసిందా అన్నట్టు మంచు దుప్పటి పాకృతిలో మురిపించి వెలుగు ఒడిలో కరిగి కలిసి పోతుంది....feb..2014

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1w1cvKA

Posted by Katta

17, జూన్ 2014, మంగళవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//నేను మాత్రం ఇద్దరిని 189to192// 189. రుణమాఫీపై ఎటూ తేల్చని ప్రభుత్వాన్ని నేనే సాగునీరు విడుదల చేసిన ప్రభుత్వాన్ని నేనే దిక్కుతోచని స్థితిలో మిగిలింది బక్కరైతు ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని. 190. మానవ నాగరికత ఆనవాలు జీవనదిని నేనే ఏటా విళయమై జనాన్ని మింగుతున్న విషాదాన్ని నేనే నిర్లక్ష్యానికి నిలువుటద్దం ప్రభుత్వయంత్రాంగం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 191. ఊరించి ఊరించి కళ్ళాపి చల్లే రుతుపవనాలు నేనే అకాల అల్పపీడనమై పంటలు ముంచే తుఫానులు నేనే కాలుష్యంతో తన గొయ్య తానే తవ్వుకున్న మనిషి ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని. 192. బండెడు పుస్తకాలు మధ్య గానుగెద్దు ఐన విధ్యార్ధి నేనే ర్యాంకులు గ్రేడులతో ప్రగల్బాలు పలికే విధ్యాసంస్థలు నేనే చదువులు తప్ప జ్ణానాన్ని పంచలేని విద్యలన్నీ ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని....16.06.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SQ9C0j

Posted by Katta

16, జూన్ 2014, సోమవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//బతుకుతీపి ఉప్పన// జీవితం కన్నా సత్యమెపుడైనా చూసావా కళ్ళతో... కన్నీటికన్నా ప్రతిచర్య తెలుసా జీవితంలో... కన్నీటిని ఒకసారి రుచి చూడు సముద్రం ఎండిన ఆ ఉప్పుమడిని జీవితమని తెలుసుకో ఈ సంద్రం వెనుకేదో మర్మముంది కొన్నిసార్లు మేఘమై వనాన్ని విస్తరిస్తుంది ఒక్కోసారి ఉప్పెనై సునామీఐ అందరినీ మింగేస్తుంది కానీ నిత్యం ఉప్పుమళ్ళలో ఎండుతూ తనని తాను దహించుకుంటుంది ఉప్పులేని ఉర్చిని ఊహించుకోలేనట్టే ప్రేమలేని జీవితాన్ని ఊహించుకోలేము ప్రత్యూష ప్రద్యోష ప్రద్యోష ప్రత్యూహాల నడుమ సందిగ్దావస్థకి పేర్లు పెట్టుకున్నట్టే ప్రతీ భందుత్వానికి ఓ పేరు పెట్టుకుంటాం కాశీమజలీ కధలు చిన్నప్పటినుంచీ చదువుకున్నా ఆగని బాటసారిలా కొందరు మిగిలిపోతారు మిగులు తేల్చుకుని బిక్కమొహమేసుకుని బిడ్డలని హత్తుకున్నాక ఇప్పుడూ అదే వాసన ఉప్పు రుచిలాంటి వాసన కడుక్కోవాలనో స్తానం చేయమనో తీపిపండుకు పట్టిన పురుగు తొలుస్తుంది కొందరు స్తానమే చేస్తారు తడిని పొడి గుడ్డతో తుడిచాకా మళ్ళీ చెమట పడుతుంది కళ్లలో నిండిన జీవితమొకటి కన్నీళ్ళ కన్నా ప్రతిచర్య లేదంది కానీ చెమట పడుతూనే ఉంది అకాల వర్షంలో తడిసిన ఉప్పుమడి దగ్గరనుంచి తలితండ్రులున్న అనాధ అరుస్తున్నాడు కోర్టులో హియరింగ్ చెప్పేరోజు స్వీట్లకి బదులు ఉప్పు పంచితే బాగుండు.....15.06.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1owoU9s

Posted by Katta

14, జూన్ 2014, శనివారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//"జయహో"// గోరేటి ఎంకన్న చేతులు మొక్కిన నిలువెత్తు పాదాలు కల్గిన వాడా.... గుండెలోని బాధని ఎందుకలా కళ్ళనుంచి జార్చి కళ్ళబడ్డావ్? పచ్చని చెట్టు పిట్టల రెక్కల కింద పసికూనను నేను, అశక్తుడనై నిష్కర్షగా నిష్క్రమించానే గానీ నన్నక్కడే త్రిషొల్డ్ గోల్డ్ లో వదులుకున్నా వద్దు అలా పిలవకండి అన్నా "అన్నా" అని పిలిస్తే నా పరిమితి తెలియక తికమక పడ్డానే కానీ తమ్మీ అని పిలిస్తే నీ రెండో కన్నునై దుఖఃని పంచుకుందునే కనీసం కళ్ళజోడునై, నీ కన్నీరులో తడిసి పునీతుడనౌదునే కటకాలు పనిచేసినంతకాలం నీ ముక్కు మీద జారుడు బల్ల ఆడుకుందునే అన్నా, చిన్నప్పుడెప్పుడో చదివిన గుర్తు "ఆధారాలు లేని అపనిందలు పదే పదే నీపై మోపుతున్నారంటే విజయానికి నువ్వు చేరువలో ఉన్నట్టు" ఆ కంట తడి వదిలిపెట్టు మా గుండె తడి నిలబెట్టు "ఓ భాగ్యశాలీ" కవిత్వం కావాలి కవిత్వం "జయహో"........15.12.2013....14.06.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TW0fNR

Posted by Katta

13, జూన్ 2014, శుక్రవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//లౌకికం// భూమి నలుపలకలా గుండ్రమా నాలుగో దిక్కుని వెనక్కి తిరిగి ఎలా చూడటం? ఈ భూమి నిండా రాత్రంతా ఒక్క సమానంగా చీకటి పరుచుకుంది ఎన్నో జన్మల పుణ్యమన్న జన్మలో రాత్రి లేదా చీకటి దుఖః ఎందులకు! దుఖఃని అధికమించడమే సంతోషమా? దుఖః తదుపరి కలిగేది సంతోషమా? సంతోషమా? దుఖఃమా? ఏది ముందు వెనుక గుడ్డా! పిల్లా? రా ఈరాత్రినీ సర్వాంతర్యామిని రాతిలో మిగిల్చిన చోట వెదుకుదాం గుడిగంట ముందు యత్ భావం తత్ భవతి అన్నది వినకు నీకు నిండా కావల్సింది దుఖఃమైనప్పుడు అర్ధరాత్రి వెలుతురు కోసం వెతక్కు ఏదో రాద్దామనో రాద్దాంతం చేద్దామనో తాపత్రయం పడకు ఈ భూమి గుండ్రంగా ఉంది తన చుట్టూ తాను తిరుగుతుంది చందమామ కధలు చెబుతుంది రెక్కల గుర్రం ఎక్కకముందు ఒక్కసారి అడుగు ఎక్కడికి తీసుకుపోతావని అక్కడుంది వెలుతురా చీకటా అని అడుగు వెలుతురైతే నీడ పడుతుందో లేదో చూసుకో ఆ నీడని సంధ్య తరువాయి మింగిన చీకటి మర్మమేమిటో అడుగు.............11.06.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1prBFBU

Posted by Katta

10, జూన్ 2014, మంగళవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//విన్నపం// చూసావా తండ్రీ ప్రజాస్వామ్యాన్ని అధికారానికి బలులిచ్చి సబ్సిటీలతో ఉచితాలతో ప్రజలని సోంబేరులని బిచ్చగాళ్ళని చేసి బతుకెళ్ళదీస్తున్న నాయకులంతా ఇప్పుడు రైతు వెంట పడ్డారు తండ్రీ తండ్రీ రైతునందరూ ఇప్పుడు దేశానికి వెన్నుముక అంటున్నారు వ్యవసాయం ఆపదలో ఉందంటున్నారు ఇన్ పుట్ సబ్సెటీ మద్దతు ధర దాటి రుణ మాఫీ చేస్తామంటున్నారు ఇన్సూరెన్స్ కట్టిన లైలా తూఫాను పరిహారం సగం రైతులని పరిహాసం చేసిపోతే ఆ మాట ఎవరికీ పట్టదు తండ్రీ తండ్రీ అప్పో సప్పో తాకట్టో వడ్డీతో నిలువు దోపీడీనో చచ్చే వరకూ ఏ రైతైనా వ్యవసాయం మానాడా అలగ్జాండర్ రైతైతే ఆగుప్పెట్లో నాలుగు మెతుకులుంటాయని రైతెప్పుడూ మాతా కబళం అని చెయ్యి చాపడని చెప్పు తండ్రీ తండ్రీ చెప్పు తండ్రీ నువ్వూ గుప్పెడు విత్తనాలు జల్లి తండ్రివైనావని చెప్పు తండ్రీ నీ బిడ్డలని బిక్షగాళ్ళని చెయ్యొద్దని చెప్పు తండ్రీ...........24.05.2014.....10.06.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pB2PDX

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//అంతా మనోళ్ళే// తలతిక్క వెనకాల ఓ వెర్రిబాగులోడు ఉంటాడు వాడు ప్రశ్నించే ఆశలకి నువ్వు తాగిన నీళ్ళేంటో తెలుసు పిచ్చోడు కదా ఏం సాధించావురా అంటూ తనతో సమానంగా పోల్చుకుంటాడు ఈ లెక్కలకి తిక్కలకి ముదరాలంటే కొంచం మద్యం అవసరమే నచ్చితే పర్వాలేదు నచ్చకపోతే తాగి వాగాడన్న సానుభూతి మిగులుతుంది సాధించు సాధించు అంటూ చెవిలో పోరు పెట్టి సాధించినా వీడికీ తెలుసు సంపాదించి ఏం పట్టుకుపోతావురా? అని గొంది ఏడుమేడలరాజు గారి ఇంటి ముందు రాత్రంతా అరచి మిట్టమద్యహాణం లేచి బిత్తరచూపులు చూసిన వాడూ పిచ్చోడే నీలా నాలా......09.06.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oPb1Pv

Posted by Katta

8, జూన్ 2014, ఆదివారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//నేను మాత్రం ఇద్దరిని..186-87-89// 186. రాజధానిలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే తెలంగాణాకి ఎక్కువ సమయం కేటాఇస్తానన్న పార్టీ అధ్యక్షుడూ నేనే ఎంతకీ అర్ధం కానిది రెండు కళ్ళ సిద్దాంతం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 187. తొలి నెల జీతాలే కష్టమన్న మాజీ C.E.O నేనే హంగు ఆర్బాటాలతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ నేనే ఆదాయం లేనప్పుడు పొదుపు పాటించాలన్న ఆర్ధిక సూత్రం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 189. వ్యవసాయం దండగని అవాకులు పేలింది నేనే రైతు రుణ మాఫీ మ్యానిఫెస్టో ప్రకటించింది నేనే హామీలు అమలుతో ప్రజలని అప్పులపాలు చేసే పార్టీలన్నీ ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని.....08.06.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o2tuw2

Posted by Katta

6, జూన్ 2014, శుక్రవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//నేను మాత్రం ఇద్దరిని-181to185// 181. మనోభావలకి మద్దతిచ్చిన పార్టీలో నేనే రుణమాఫీలకి సంక్షేమపధకాలకి వెంపర్లాడుతూ నేనే ప్రా0తాలు ఎన్నైనా ప్రజలు పార్టీలన్నీ ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 182. టీ అమ్ముకొన్న సాధారణ వ్యక్తిని నేనే నమో మంత్రంతో ప్రధానికాబోతున్న మోడీనీ నేనే కార్పొరేట్ విన్యాసాలు వదలకపోతే పలితం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 183. విభజించి పాలించాలనుకున్నది నేనే రెండిటికీ చెడ్డ రేవడీ నేనే నమ్మకం కోల్పోయాక దక్కే గౌరవం తిరస్కారం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 184. అష్టకష్టాలు పడి చదివిన ఇంజనీరు నేనే సాహిత్యమంటూ ఉదరపోషణకు నోచుకోని కవినీ నేనే తలితండ్రుల కష్టాలు తీర్చే కొడుకు ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని. 185. ఓటరుగా చిన్న దొంగ నేనే నాయకుడిగా పెద్ద దొంగ నేనే అధికారం దక్కిన మంచిదొంగ ఒక్కడే నేను మాత్రం ఇద్దరిని........24.05.2014.....06.06.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nWcTK8

Posted by Katta

4, జూన్ 2014, బుధవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//వలస రైలు// ఆగని ఎక్సప్రెసుకు టాటాలు చెప్పి ఆగి వెళ్ళిపోతున్న పాసింజర్ రైలును చూస్తే డిగ్రీల రెక్కలు మొలచి పట్టాలుమీద రైలై ఎగిరేవరకూ.. పల్లెటూరు పిల్లలకి ఎంత దిగాలో కదా! చెమిటోళ్ళ ముందు గుడ్డి బిక్షగాడు పాడే పాట మాఫియా చేతిలో వికలాంగులై చేతులు చాచే పిల్లలు ఒకే పేపరు నలుగురు చదువుతూ ఇరవయ్ రూపాయలకి నీళ్ళ సీసా కొని పోలవరం ముంపు గ్రామాల మీద చర్చించే జనాలు పది రూపాయలకి టీ తాగుతూ విని కాలక్షేపం చేసే కుర్రకారు బెర్తుల కోసం టికెట్ కండక్టర్ బేరాలు ఇంటినుంచి తెచ్చుకొన్న మధ్యతరగతి అల్పాహారాలు మంచినీళ్ళ కోసం వచ్చే స్టేషనుకై ఎదురుచూపులు గమనించి చూస్తే రైలొక మినీ భారతదేశం అనుకున్నంతలోనే అనుకోకుండా నిజానికి ఈ రైలొక అనకొండ ఊళ్ళకి ఊళ్ళని వలస రూపేనా మింగేసి పట్నం బండరాయికి చుట్టుకొని అరగని ఎముకలని మురికివాడలోకి విసిరేసే విషపు నాగు సాగనంపిన రోజు నుంచీ పాసింజరూ ఎక్సప్రెసూ జనరల్ స్లీపర్ ఏసీ అన్నీ పల్లె ఎదురుచూపులని మోసగిస్తూనే ఉన్నాయి బతికుంటేనో బతుకు బాగుంటేనో వస్తాడని చూసిన పల్లె కళ్ళు పత్తికాయల్లా పేలి ప్లాటుఫాం మీద అడుక్కుంటూ స్ధిరపడిపోయాయి అక్కడక్కడా మిగిలిన పల్లె బతుకులు వేరుశెనగ కాయలో బఠానీలో ఏదో ఒకటి ఆ రైలులోనే అమ్ముకుంటూ కాలంవెళ్ళబుచ్చుతున్నాయి ఇప్పటికీ పాలమూరులోనూ విజయనగరంలోనూ రాయలసీమ పల్లెలోనూ నాయకులంతా ఊదరగొడుతున్నారు దేశాన్ని అభివృద్ది పధంలో నడిపిస్తామని హెలీకాప్టరులో వెళ్ళిపోతున్నారు పల్లెలు ఊళ్ళు, గల్లీలు, కాలనీలు, నగరాలు దేశానికి దేశాన్నే దోచుకున్న దొంగల పోటోలు అతికించాల్సివస్తే ఏ రైల్వే స్టేషన్ ఐనా సరిపోతుందా! వాస్తవానికి పట్టాలు దాటలేని జంతువులుకన్నా పట్టాలు మీద చేసుకున్న ఆత్మహత్యలకన్నా ఈ రైలు మింగేసిన జీవితాలే ఎక్కువ ఈ రైలు పట్టాణాన్ని ప్రేమించే అనకొండ ప్రయాణం తరగని భారతదేశం దేశమంతా రైలు ప్రయాణ అవశేషాలు ఈ వలస రైలు పండగకి గర్బిణి పబ్బానికి అమ్ముకున్న పొలం పొట్టపట్టుకుని పల్లెకువచ్చిన రోజు మాత్రం చరిత్ర పుస్తకం......04.06.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h9ULJO

Posted by Katta

25, మే 2014, ఆదివారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//రుతుపవనాలు// ఆలోచనలు ఇంకని అక్షరాలు కాగితపు పడవలో కొట్టుకు పోయి అకాల మేనెల వర్షంలో మునిగి ముగుసి పోయాయి తెలవారుతుంది పై పై పొరలు తడిసిన మనసు గీష్మతాపంలో పొగలు కక్కుతుంది ఉక్కబోతలా వెళ్ళగగ్గుతూ అక్కసు గాలిని విసనకర్రనడిగి నీడన అణిగిమణిగి బతకాల్సిన కాలం ఎండిన చెరువు అడుసులో ఎగిరెగిరిపడ్డావో మట్టగిడసలా ఒట్టిచేతులకే దొరికిపోతావ్ నీదైన రుతుపవనం రావాలంటే అలపీడనం గూడు కట్టాలి తుఫాను ఒకటి తీరం దాటాలి రోహిణి కార్తెలో తగుబెట్టిన కొల్లేటి కిక్కిసకర్ర మేకలు ఎగురుతున్నాయ్ సిద్దంగా ఉండు కళ్ళని మేఘావృతం చేసుకొని....24.05.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ouBylW

Posted by Katta

22, మే 2014, గురువారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//షరా మామూలే// తీసుకున్న విశ్రాంతికి తెరదించాలో తనదనుకున్న భాద్యతకి తెర ఎత్తాలో ఇప్పటిదొక సమయం గెలిచిన తరువాత ఇప్పుడంతా తనవాళ్ళే అనే తరుణం రా రాళ్ళేసుకున్న చేతులతోనే కరచాలనాలు గాయపరుచుకున్న దేహాలతోనే ఆలింగనాలు వినగ వినగ అబద్దమే నిజం మాయకు మరోమారు ఎలుగెత్తిన ప్రవచనాలు గొర్రెల మందకి ముందు నడిచినోడే కాపరి వెనుకుండి నడిపేటోడు ఒట్టి బేఖారి తలో ఓటు వేసి చేతులు దులిపేసుకున్నాం ఇక్కనుంచే అసలు తమాషా నువ్వూ నేను గెలిచాం సరే మరి ఓడిన మనం ఎవరు? నోటి దగ్గర నాల్గుమెతుకులు లాగి పంచబక్షపరమాన్నాల కల కన్నదెవరు? పద్దులన్నీ రద్దులే ఎకరాలు ఇండ్లు, ఉద్యోగాలు ఎన్నిసుద్దులని సద్దె మూట విప్పకు నవ్విపోగలరు ఐదేండ్ల ఆట షురూ రాజుకు కాపలా కాస్తూ బంట్లూ గుర్రాలూ ఏనుగులు చస్తూ చెక్ చెప్పే రోజు కోసం ఎదురొడ్డి పోరాడుతూ.. చదరంగం రణరంగం కొత్తేమీ కాదు చెక్ చెప్పిన ఒక్క సందర్భంలోనైనా సామాన్యుడు గెలిచాడా ఉష్ గప్ చిప్ ఎలక్షన్లు వచ్చేవరకూ మళ్ళీ తూచ్.....20.05.2014....22.05.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jFv8ke

Posted by Katta

21, మే 2014, బుధవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//ఉభయకుశలోపరి// నడి వేసవిలో నీడలా ప్రయాణం మధ్యలో వాడు తారసపడతాడు ఒకటి వెనుక ఒకటి వెనువెంటనే గుక్కతిప్పుకోనివ్వక కుశల ప్రశ్నలు మొక్కుబడిగా కొన్నింటికి మరుగున దాగి కొన్నింటికి జవాబులిచ్చాను వచ్చినంత వేగంగా వాడెళ్ళెపోతూ మళ్ళీ వస్తానన్నాడు వాడిపోయిన వనంలా ఇప్పుడింక నావంతు వాడి కోసం ఎదురు చూస్తూ.....04.05.2014....21.05.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mXv7Iq

Posted by Katta

14, మే 2014, బుధవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//వారసత్వం// ఒట్టి మాటలు కోటలు దాటినప్పుడు భుజకీర్తులు బెంబేలు పెట్టారు పొదలు పట్టిన జంతువొకటి మైదానంలో ఒట్టిగడ్డి లేదంది తీరా మేడలెట్టా కట్టారంటే కోట మట్టి నవ్వింది వారసులు లేని చోట వాల మూపుతూ కపి కవ్విస్తుంది నాలుగు మెతుకులకే కడుపు నింపగల అమ్మచేయి ఏ మేనమామ ఇంటిదో తెలియక మూర్కత్వమొకటి వారసత్వంగా దొరకని బాల్యం విడిచి అన్నీ పుట్టుకతో తెలుసని విర్రవీగుతుంది మేనమామ కూతుర్ని ఎందుకు వద్దన్నానంటే సగం పిచ్చ పూర్తవుతుందిరా బామర్దీ........14.05.2014. (19.04.2014. ఒక రాత్రి 8కవితలు ఆరోది)

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T172FY

Posted by Katta

13, మే 2014, మంగళవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//సరే...కానీ// గొడుగు పట్టడమే జీవితమంటావా ఏకాలనికా గొడుగు నిజమంటావా.. పత్రహరితం పల్లవించి చిత్తడి నేల చివురుపట్టిన కురిసిన వర్షంలో మేను తడవక కాలు మెదపక నిఖార్సు ఏసంకాలం ఒయాసిస్సులు వెక్కిరించినప్పుడు మాడు పగిలిన రోజుల్లో దాహం తీరక నీడ దొరకక గొడుగు పట్టాలంటావా... సరే కానీ బయటకు వెళ్ళి నన్ను తెరిచేముందు చిరుగుల్ని కాస్త కుట్టవూ....13.05.2014. (19.04.2014 ఒకరాత్రి 8కవితలు ఐదోది)

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ghuHw5

Posted by Katta

12, మే 2014, సోమవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//శల్య సారధ్యం// సముద్రతీరం పైపెచ్చు గాలిలో తేమ ఉదయాన్నెప్పుడో రాసుకున్న టాల్కం పౌడర్ ఎంతసేపుంటుంది ఉత్తుత్తి కబుర్లకి ఉత్తరప్రత్యుత్తరాలెందుకు? రాసుకున్న రంగులకి మెరుగులెందుకు? కానీయ్ ఎంతకాలం బెదిరిస్తావ్! చచ్చిపోవాలని ఉందని వెన్నరాస్తావ్! ఆఖరి మాటకి కారణం ఒకటుండాలి సమస్యకి పరిష్కారమూ ఉండే తీరాలి తిట్టుకున్నా సరే నవ్వక నేనేమంటాను మగాణ్ణి చెప్పుకోలేన్నప్పుడు మన్నించి ఒక పని చేయి ఎవరికీ చెప్పకు......12.05.2014 (19.04.2014. ఒక రాత్రి 8కవితలు నాలుగోది)

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1skLlL2

Posted by Katta

11, మే 2014, ఆదివారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//ఇద్దరు హద్దు// పెళ్ళికి ముందు బ్రహ్మచారిని పెళ్ళైన రోజే నాకో పాప ఐదేళ్ళకి ఇంకో పాప ఇద్దరితో కలిపి ముగ్గురు పిల్లలం హాయిగా ఆడుకొంటున్నాం. ______________________ క్షమించాలి రాజు గారూ ఇద్దరుమించి పిల్లలుంటే ఎలక్షన్లో పోటీ చేయడానికి లేదు _____________________ హమయ్య బతికి పోయాను.......11.05..02014. (19.04.2014 ఒక రాత్రి ఎనిమిది కవితలు మూడోది)

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCUdR1

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

"సముద్ర ఘోష" కవయిత్రి:శిలాలోలిత. ఇలాంటి కవితని ఏ మగాడూ రాయలేక పోయాడెందుకు? చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం నాకిది, ఈ కవితకు ఎన్ని శీర్షికలు పెట్టొచ్చోకదూ నా జీవితం లోంచి మా అత్త గారి పేరు మీ జీవితంలోంచి ఎన్నో ఎన్నెనో పేర్లు, ఎందరు స్త్రీలు తల్లిగా చెల్లిగా ప్రియురాలిగా భార్యగా అత్తగా మామ్మలుగా తమ తమ జీవితాలని ధారబోయలేదు...చివరికి ఆ సముద్ర ఘోషలా మిగిలిపోలేదు. "ఎడారులు ఒకప్పటి సముద్రాలేమో" ఆసక్తి కలిగించే ఎత్తుగడతో మొదలై "నత్తగుల్ల ఘనీబవించిన సముద్రానికి ప్రతీక" అన్నప్పుడు ఒక్కసారి ఒళ్ళు జలదరించింది. "నత్తగుల్ల విన్పించే హోరు అనంతానంత రహస్యాల నివేదిక ఆ నివేదికల శబ్దంలో నేను ఎప్పటికైనా సముద్రంలా మారతాను సముద్రమే నా గమ్యం నత్త గుల్ల నినదించే హోరు సారాంశం" నత్తగుల్ల వినిపించే ఆ రహస్యం ఏమిటి ఈ సమాజానికి తెలియందా కాదుకదా...సముద్రమంతటి స్త్రీలని నత్తగుల్లగా మార్చిన పాపం ఎవరిది నీది నాది మన అందరిదీ...ఎదారి నత్తగుల్ల అందులో వినిపించే సముద్రపు హోరుని కవయిత్రి కవిత సారాంశంగా చెప్పిన తీరు ఆమె పరిణితిని సుస్పష్టం చేసాయి అనటం అతిసయోక్తి ఏ మాత్రమూ కాదు. "ఎడారుల్లా పరుచుకున్న స్త్రీలు ఒకప్పుడు సముద్రాలేనేమో కాలం జీవితాన్ని ఎడారిని చేసి నత్తగుల్లల్లా మార్చింది కాబోలు ఎల్లవేళలా నత్తగుల్ల విన్పించే హోరు లాంటి నిరంతర పోరాట శబ్దం" ఈ ముగింపులో ఎంత చక్కగా చెప్పారు "కాలం జీవితాన్ని ఎడారిని చేసి నత్తగుల్లల్లా మార్చింది కాబోలు" అలోచింపచేసే కవిత. సందర్భం ఏదైనా స్త్రీ అడుగడునా నిత్యం అణగదొక్కబడుతూనే ఉంది, కవయిత్రి శిలాలోలిత గారి కలం ఇలా సమాజాన్ని ప్రశ్నిస్తూ మరిన్ని కవితలతో కనువిప్పు కలిగిస్తూ కవనం కొనసాగించాలని కోరుకొంటున్నాను. మన అందరం చదువుకున్నదే భూమి ఒకప్పుడు పూర్తిగా మంచుతో నిండి కాలక్రమేణా కరుగుతూ...సముద్రాలు భూమి ఇత్యాదులు ఖండాలుగా ఏర్పడుతూ వివిధ దేశాలుగా రూపాంతరం చెందింది...పోతే భారతదేశంలో స్త్రీని దేవతగా కొలవడం సర్వసాధారణం మరి ఈ కర్మ భూమిలో "గృహ హింస" చట్టం అవసరం ఎందుకొచ్చింది, సముద్రాలంటి స్త్రీలు ఎడారిలో నత్తగుల్లలా ఎందుకు మిగిలారు ఈ మాతృ దినోత్సవ సందర్బంగా ఒక సారి ఆలోచిద్దాం......మీ వర్మ కలిదిండి. "సముద్రఘోష" ఎడారులుఒకప్పటి సముద్రలేనేమో ఎడారుల్లోని నత్తగుల్లను చెవి కానిస్తే సముద్రమై ఘోషిస్తుంది నత్తగుల్ల ఘనీభవించిన సముద్రానికి ప్రతీక నత్తగుల్ల విన్పించే హోరు అనంతానంత రహస్యాల నివేదిక ఆ నివేదికల శబ్దంలో నేను ఎప్పటికైనా సముద్రంలా మారతాను సముద్రమే నా గమ్యం నత్త గుల్ల నినదించే హోరు సారాంశం ఎడారుల్లా పరుచుకున్న స్త్రీలు ఒకప్పుడు సముద్రాలేనేమో కాలం జీవితాన్ని ఎడారిని చేసి నత్తగుల్లల్లా మార్చింది కాబోలు ఎల్లవేళలా నత్తగుల్ల విన్పించే హోరు లాంటి నిరంతర పోరాట శబ్దం 11.05.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCU8Ns

Posted by Katta

10, మే 2014, శనివారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//నడుమ// నిలబడిన చొటే తీరమన్నట్టు గుప్పెట నిండా ఇసుక బిగించి సముద్రంలోకి తొంగి చూస్తాను ఇసుకనుండి తైలంబు అసాద్యమైనప్పటికీ తడినేదో ఇంకించుకోవాలని బిగబడతాను రాలిన బొట్లతో జారిన ఇసుక కొంత మిగిలిన కొంతలో వేళ్ళమద్యనుంచి జారుతూ ఇంకొంత కాళ్ళకింద తీరం నిండా ఇసుకే ఐనా, గుప్పెట్లో ఉన్నదాన్నేదో సొంతం చేసుకోవాలని తాపత్రయం కడవరకూ.....10.05.2014. (19.04.2014.ఒక రాత్రి 8కవితలు రెండోది)

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oB0He5

Posted by Katta