పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Rama Krishna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rama Krishna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, ఏప్రిల్ 2014, శనివారం

Rama Krishna కవిత

రెడ్డి రామకృష్ణ//పిల్లలు- మల్లె మొగ్గలు// తరగతి గదిలో పిల్లలు చదువుల చెట్టుకు నిండా తొడిగిన మల్లె మొగ్గలు పగలు రాత్రను భేదం లేదు బెల్లు మోగితే చాలు వరండాలోనే విచ్చుకుంటారు 05/04/2014

by Rama Krishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qb5rIr

Posted by Katta

28, మార్చి 2014, శుక్రవారం

Rama Krishna కవిత

రెడ్డి రామకృష్ణ//కవిత్వపు ముద్ర // తెల్లని కాగితం ముందేసుకొని చేతిలో పెన్ను పట్టుకొని కూచుంటాను కాగితం మీదికి కవితను ఆవాహన చేస్తూ.. మహాకవుల వాక్యాలను మంత్రాల్లాగ మననం చేస్తూ... రాత్రంతా తనలో తాను దహించుకు పోయి తెల్లని వెలిబూడిదై గాలిలో కలిసిపోతుంది తెల్లవారేసరికి చీకటి ఎక్కడా మిగల్లేదు కానీ తూర్పున ఒక నిప్పు కణిక మాత్రం ఆరకుండా రాజుకుంటూ కనపడింది కవిత మాత్రం కానరాలేదు మరొకసారి నగరం నిశ్శబ్దమైన నిశి రాత్రి మేడమీద చుక్కల ఆకాశం కింద అటూ యిటూ పచార్లు చేస్తూ మనసులో వెన్నెల మధురిమను నింపుతూ కవితకై పడిగాపులు కాస్తె మనసు మంచు ముద్దై జలుబు వచ్చింది తప్ప కవిత మాత్రం కానరాలేదు యింకోరోజు తప్పని సరనిపించి కొన్ని అక్షరాల్నికుప్పగా పేపరుపై పోసాను అందులో కొన్ని అక్షరాలైనా భావంతో సమ్యోగం చెంది పదాలుగా ఏర్పడతాయి గదా కాసేపాగి శనగలును ఊదినట్టు ఊదాను పొట్టంతా ఎగిరి పోయి గట్టిగింజలు మిగిలినట్టు కొన్నిపదాలు మాత్రమే మిగిలాయి వాటిని ఒకక్రమంలో అమర్చి మట్టిబొమ్మలు చేసే కళాకారునిలా ఒక ఆకారాన్నిచేకూర్చాను కానీ జీవం కనపడలేదు కవితకోసం నేను తపన పడ్డన్నినాళ్లూ రాలేదు కాని ఒకరోజు మనసంతా దుఃఖ భారాన్ని మోస్తూ ఆందోళనగా ఉన్నఫ్ఫుడు కళ్లనించి కన్నీరు ఒచ్చినంత సహజంగా టప టపా నాలుగు బొట్లుగా జారి మనసు కాగితం మీద తన ముద్రేసిపోయింది *** 28/03/2014

by Rama Krishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hCNdt7

Posted by Katta

25, మార్చి 2014, మంగళవారం

Rama Krishna కవిత

రెడ్డి రామకృష్ణ//కొలత// గాలిలో తేమని హైగ్రోమీటర్ తో కొలుస్తారు హృదయంలో తేమను దేనితో కొలుస్తారు చెమర్చిన కళ్లతో తప్ప భూమి కంపిస్తే దాని తీవ్రతను రిక్టార్ స్కేలులో చూస్తారు కవి హృదయకంపనాన్ని దేనిలో చూస్తారు అతని కవిత్వంతో తప్ప

by Rama Krishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pvAEUv

Posted by Katta

23, మార్చి 2014, ఆదివారం

Rama Krishna కవిత

మితృలార ,విప్లవ వీరుడు కామ్రేడ్ భగత్సింగ్ పై సుమారు 30 యేళ్లక్రిందటి రాసిన నాపాట రెడ్డి రామకృష్ణ//భగత్సింగ్// అక్కలార మీరు ఉయ్యాలో సక్కంగ యినరమ్మ ఉయ్యాలో అన్నలారా మీరు " ఆలించ రారండి " భరత ఖండము కొరకు " బలిజేసి ప్రాణాలు " వేగుసుక్కాలయ్యి " మనల వెలిగేటి వీరుల " గాధలు వినరండి ఉయ్యాలో గబగబ నడవండి ఉయ్యాలో "అక్కలారా" అట్టి వీరులలోన ఉయ్యాలో విప్లవ వీరులు " జాతి మనుగడకొరకు " చేత రైఫిలు పట్టి " ప్రాణాలు విత్తులుగ " త్యాగాలు పండించి " దేశభక్తుల కన్న " త్యాగధనులే మిన్న " చాటిచెప్పిన వీరుల ఉయ్యాలో వీరగాధలు వినుడి ఉయ్యాలో "అక్కలారా" విప్లవ వీరులలొ ఉయ్యాలో జాతిరత్నము తల్లి " వురికొయ్య కేలాడి " జాతి కూపిరిపోసె " వీరుని కధ వినుడి " పేరు భగత్సింగ్ " ఆ భగత్సింగ్ కధ వినుడి ఉయ్యాలో నాటి భారత కధ వినుడి ఉయ్యాలో "అక్కలారా" ఉత్తరా దేశాన " పశ్చిమా దిక్కునా " పంజాబు రాష్ట్రాన " పల్లెటూరులోన " పుట్టెనీ బాలుడు ఉయ్యాలో పుడమి పులకింపగా ఉయ్యాలో "అక్కలారా" నాడు దేశము తీరు " ఏ రీతిగున్నాది " పరదేశ దొరలంత " ఢిల్లీ పాదుషాలైనారు " కష్టాల సంద్రములొ " జనులు కడకీదలేకను " ఉప్పెనై పొంగొచ్చి " ఉద్యమాలే చేసె " ఖద్దరు నాయకులు " ఆ ఉద్యమాలను నడిపి " స్వాతంత్ర్యమను పంట " తాము పండిస్తమన్నారు " దొరలవద్దకు పోయి " దొడ్డవారని పొగిడి " స్వాతంత్ర్య మిమ్మాని ఉయ్యాలో చెయిచాపి అడిగేరు ఉయ్యాలో "అక్కలారా" బాధలతొ బాటుగా " భగత్సింగు పెరిగె " దేశాన్ని చూసాడు " లోకాన్ని చదివాడు " గాంధి నెహ్రూ కాదు " గన్ను పట్టాలనెను " కొండమాటున సూర్యుడు " ఉండి ఫలమేమానె " జనము సంద్రములోనె " తూరేటి సూర్యుడు " పేదోళ్ళ ముంగిళ్ళు " పలకరిస్తాడాని " బాటయిది కాదాని ఉయ్యాలో బాంబు చేపట్టాడు ఉయ్యాలో "అక్కలారా" భగత్సింగంటేను " భయపడి దొరలంత " అరగజము పరుగెత్తి " వారు తిరిగి చూసేవారు " భగత్సింగంటేను " జై అంటు జనులంత " ఉరికి పరుగులు తీసి ఉయ్యాలో వారు ఉప్పొంగి పోయారు ఉయ్యాలో "అక్కలారా" భయపడిన దొరలంత " భగత్సింగుని పట్టి " కుట్రకేసులు పెట్టి " కుత్తుకులు తెంచగా " కుట్రలు పన్నేరు " చరఖాల నాయకులు " నొరు మెదపక కూచుంటె " ఆశయానికి ప్రాణం " అడ్డుకారాదాని " చిరునవ్వుతో ఉరిని ఉయ్యాలో చేరనడిచెను వీరుడు ఉయ్యాలో "అక్కలారా" నడిచిన నడకలు " నదిని పోలినవయ్య " సూసేటి సూపులు " సుక్కలిని పోలేను " పెదవిపై చిరునవ్వు " ఉదయన్ని పోలింది " తలపులన్ని జనుల ఉయ్యాలో మదిల మొలకలై నిలిచాయి ఉయ్యాలో "అక్కలారా" *** 08/09/1986 (ప్రజాసాహితి)

by Rama Krishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f6WBoc

Posted by Katta

18, మార్చి 2014, మంగళవారం

Rama Krishna కవిత

రెడ్డి రామకృష్ణ//వివేకి// శీతాకాలపు సాయంత్రం చలి చీకటి జమిలిగా వస్తుంటే భయపడి తొందర తొందరగా గూటిలోకి చేరిపోతుంటాడు రాత్రంతా మనసులో ఎంతగా మధనపడతాడో వేకువనే చన్నీటిస్నానం చేసి గొప్ప ఆత్మవిశ్వాసం తో పులికడిగిన ముత్యంలా ఉదయాన్నే బయటికి వస్తాడు యిపుడు అతన్ని చూసి చీకటి చలీ రెండూ పారిపోతుంటాయి

by Rama Krishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hwi5MQ

Posted by Katta

12, మార్చి 2014, బుధవారం

Rama Krishna కవిత

రెడ్డి రామకృష్ణ //వ్యసనం // దీంతో గొప్ప చిక్కొచ్చి పడింది చీటికి మాటికి అలిగి పడుకుంటోంది ఎంత బ్రతిమలాడుతానో ఒక్కోసారి వింటేనా..అస్సలు... నాకేమో తనతోటిదే లోకం ఉదయం సాయంత్రం డ్యూటీకి వెల్లేముందూ.. వచ్చిన తరవాత కాసేపన్నా తనముందు కూర్చొని కబుర్లాడకపోతే తోచదు తన ముఖంవిప్పారితే చాలు ప్రపంచం నాకళ్లముందు కదలాడుతుంది తనేమో తరచూ ముఖాన నల్లదుప్పటి కప్పేస్తుంది ఏం చేస్తాం చెప్పండి రెండు మూడు రోజులు ఓపిక పడతాను చివరికి విసిగి తనగురించి బాగా తెలిసిన డాక్టరుకి కబురు పెడతాను ఎక్కడ లింక్ తప్పిందో చూసుకోండి అంటాడు నాకు తెలిసి ఏపొరపాటూ.. కనపడదు అతనొస్తాడు చుట్టూచూస్తాడు ఎక్కడ వుండవలసిన సామాన్లన్నీ అక్కడే వుంటాయి మనసులోపలెక్కడో ఇన్ ఫెక్షన్ చేరి వుంటుంది ఒక ఇంజక్షన్ చేయాలి.. ఐదు వందలు అవుతుందంటాడు తప్పేదేముంది సరే అంటాను ………….. అంతే లోపల ఎక్కడో బల్బు వెలిగి తన ముఖంలో కాంతి చీకటి గదికి తలుపు తీసినట్టు నామనసంతా వెలుగు నిండిపోతుంది ..... ...... అబ్బ ఈ కంప్యూటర్ వుందే మహా వ్యసనం సుమా ***** 12/03/2014

by Rama Krishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1es8HYu

Posted by Katta

8, ఆగస్టు 2012, బుధవారం

రెడ్డిరామకృష్ణ || సముద్రంతొ ఆటలాడే కుర్రాడు ||

సముద్రంతొ ఆటలాడే కుర్రాడిని చూసాను
నిన్న చింతపల్లిలో


సిం హం జూలు పట్టి
దాని పై స్వారీ చేయాలని చూస్తున్నాడు
దెబ్బతిన్న పాములా సర్రున లేచిన కెరటం
బుసకొడుతూ పడగ విప్పితే
దాని పీక పట్టి కోరలు పీకిన వానిలా
నిర్భయంగా దాని చుట్టే తిరుగు తున్నాడు

పన్నెండేళ్ళ బాల్యమే అయినా
గుండెల క్రింద "కట్ట" పెట్టుకొని
సముద్రాన్ని జయించాలని చూస్తున్నాడు

ఒంటి పై చొక్కా కూడా లేని వాడు
బెల్లం దిమ్మకు పట్టిన నల్లని కండచీమలా
సముద్రాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు
ఎన్ని సార్లు విదిలించినా మళ్ళీ మళ్ళీ వచ్చే చీమలా
కెరటం ఎన్ని మార్లు బయటకు నెట్టేస్తున్నా
సముద్రం పైకి దూకుతునే ఉన్నాడు

ఎంత సాహసం వాడిది
సహస వంతులే దేన్నయినా సాధించగలరని
నిరూపించే వాడిలా ఉన్నాడు
రేపటి బతుకు సముద్రాన్ని ఈదటానికి
తనకు తనే తర్ఫీదు పొందుతూ
మరొ ఏకలవ్యునిలా కనిపిస్తున్నాడు

ఈసారి బొటన వేలు కావాలనే దొరలు వస్తే
తెడ్డు తిప్పగల చైతన్యాన్ని స్వాసిస్తున్నట్టుగా ఉన్నాడు.
*07-08-2012

31, జులై 2012, మంగళవారం

రామ కృష్ణ || నిత్య ప్రయాణీకుడు ||

కవి నిరంతర ప్రయాణీకుడుకావాలి
ఒక చొటునుంచి మరో చోటుకో
ఒక ఊరునుంచి మరోఊరుకో
ఒక కాలం నుంచి మరోకాలానికో
ఒక భావనలోంచి మరో ఉత్కృష్ఠ భావననకో
నిరంతరం ప్రయాణిస్తూ ఉండాలి

కవిని చూస్తే నది గుర్తుకు రావాలి
తెల్లని, తంబురాకు కట్టినతీగేదో
మదిలో మెదలాలి

కవిత్వమంటే జలమే కదా
నిన్ను నువ్వు నిష్కల్మషంగా కడుక్కోవటానికి
నీ లోపలిశరీరం స్నానం చేయటానికి
నీ అంతర్ముఖ సౌందర్యాన్ని పెంపొందించు కోవడానికి
కవిత్వాన్ని మించిన సాధనమేముంటుంది

కవి నడిచినంత మేరా
పచ్చదనం పరిఢవిల్లాలి
పూల ముఖాలనుంచి ఆనందం పుప్పొడిలా రాలి పడాలి

పారే నది ఏం చేస్తుంది
తను నడిచినంతమేరా
నేలను పదును చేస్తుంది

తనలోమునిగిన కడవల తో పాటు
రెండు వాక్యాలై వాళ్ళ యిల్లకు చేరుతుంది

కవిని మీటితే
నిండుగ నది ప్రవహిస్తున్నట్టు
తుమ్మెద ఝాంకారమేదొ వినపడాలి
పంచమ స్వరం మనసుల్లో ప్రతిధ్వనించాలి

కవి చుట్టూ ఉన్నవాళ్ళెపుడూ
కవిత్వ మహార్ణవం లో మునిగి తేలాలి
సముద్రంలో మునిగిన వాని శరీరం నిండా
ఉప్పు పేలినట్లు
కవిత్వం లో మునిగిన వాని శరీరం, నిండా పులకించి
చర్మము పై ఆనందం మొగ్గలు తొడగాలి
కవిత్వపు తడి మేను నిండా జాలువారాలి
అక్కడ గాలంతా కవిత్వమై వ్యాపించాలి

కవిత్వమే తప్ప కవి లేని చోట!
అతడు కథలు కథలు గా వినపడాలి.

*30-07-2012

26, జులై 2012, గురువారం

రెడ్డి రామకృష్ణ || నిన్ను తగలెట్ట ||

మనువా నిను తగలబెట్ట
మళ్ళీ మళ్ళీ పుడతవేర "మనువా"
మానవ జాతికి నీవో మచ్చలాగ నిలచినావు "మనువా"

వేల వేల యేళ్ళుగ నువు మానవులను చీల్చినావు
మనుషుల మధ్య నింత అగ్గి బోసి రేపినావు
కూచొని కూడు తింటె కులమో అని గునిసినావు
పంటకాడలేనిమైల వంటకాడ ఎలగొచ్చెర "మనువా"

ఇద్దరు మాటాడుతుంటె మధ్యలోకి వస్తుంటవు
మనసుల్లో ఏవేవో మాయతెరలు కప్పేస్తావ్
శుభకార్యం అయిన గాని చెడగొట్టిపోతుంటావ్
ప్రేమికులను బతకనీక పురుగు మందులందిస్తవ్ "మనువా"

ఊరికి వాడకి మధ్యన గోడలాగ నిలబడతావ్
మంచినీళ్ళ బావికాడ పొంచి పొంచి దాగుంటావ్
బండికాడ బస్సుకాడ సినిమాపెండేలుకాడ
అదునుకొరకు చూస్తుంటవ్ తగువులు పెట్టేస్తుంటావ్ "మనువా"

కారంచేడుల నువ్వు కమ్మవారి పంచజేరి
దళితులమైన మమ్ము దారుణంగా చంపినావు
చుండూరు లోనేమో రెడ్లనెత్తికెక్కినీవు
కత్తులు దూసి మా నెత్తురు వెదజల్లినావు "మనువా"

లక్షింపేటల నీవు చిచ్చర పిడుగయ్యావు
బాంబులు పేల్చినావు ప్రజలను భయపేట్టావు
ఆడవారి చీర చివర కారపు మూటయ్యావు
భూమిని సాకుజూపి బుర్రలు పగలేసావు "మనువా"

కత్తులు గొడ్డళ్ళతోటి కాళ్ళుచేతులిరగగొట్టి
బాకులు బల్లేలు బట్టి బండరాళ్ళు ఎత్తిపట్టి
గుండెలపై గుద్ది నావు ఐదుగురిని చంపినావు
మాలల రక్తంతో నేలనంత తడిపినావు "మనువా"

కమ్మలు రెడ్లయితెనేమి తూర్పుకాపులయితెనేమి
వెలమలు కాళింగులయిన ఎవ్వరయిన ఏమిగాని
నువ్వు దరిని జేరినాక దానవుడవుతాడు మనిషి
దళితుల రక్తం తోనే దాహం గైకొంటాడు "మనువా"

జ్యోతిరావు ఫూలె నిన్ను తరిమితరిమి కొట్టినా
పెరియరు రామస్వామి గొయ్యతీసి పాతినా
అంబేద్కర్ మహాశయుడు అడుసులోకి తొక్కినా
ముళ్ళకంపలాగనువ్వు మళ్ళీ మళ్ళీ లేస్తవేరా "మనువా"

ఏళ్ళకేల్లు గడిచినగానేమి మారింది లేదు
దళితుల వాడలపై దాడులు పెరిగాయి తప్ప
ఆర్ధికంగ బలం లేక అన్యాయం అవుతున్నాం
అధికారం చిక్కినాక .. నీకంత్యక్రియలు చేస్తమురా "మనువా"

మనువా నిను తగలబెట్ట
మళ్ళీ మళ్ళీ పుట్టకురా "2"

(లక్షిం పేట దుర్ఘటనకు స్పందించి రాసినపాట)
*26-07-2012