పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఏప్రిల్ 2014, బుధవారం

Pardhasaradhi Vutukuru కవిత

పసితనం లో చదువులు బాల్యం ఆటలు యవ్వనం లో ఉద్యోగాల వేట బాధ్యతలు వివాహం అయితే అర్ధం కాని ఆరాటం భార్య పిల్లలు చదువులు పెళ్ళిళ్ళు ఏమి చేస్తున్నామో ఎలా జరిగిపోతుందో తెలియదు జీవితం కళ్ళు తెరిచే సరికి బాధ్యతలు తీరేసరికి వృద్దాప్యం జీవితాన్ని సుఖం గా అనుభవించాలి అంటే వయసుతో సంబంధం లేదు పరిపక్వత కూడిన ప్రేమ ప్రేమ నిండిన మనసుతో ఆప్యాయత కూడిన మోముతో ఒకరికొకరు తోడూ నీడ లా నవ్వుకునే జంట ఎంత పూర్వజన్మ సుక్రుతమో కదా నీ స్పర్శ చాలు నేస్తమా జన్మ జన్మలు తోడువుంటా !!పార్ధ !!23apr 14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ifGn2l

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || దృశ్యం || ============================== కళ్ళముందే దృశ్యాలు అదృశ్యమవుతున్నాయి దేహాలు విగత జీవులై సంచరిస్తున్నాయి తవ్వకాల్లో ముద్రలు బయలుపడుతున్నాయి గతాలన్నీ గాయాలై ఆనవాళ్ళుగా మిగులుతున్నాయి రూపాలు అమాంతంగా మాయమవుతున్నాయి ఛారాలు మాత్రం ఆచారంగా వస్తూనే ఉన్నాయి వంశపారంపర్య వృక్షంలో కుల వివక్షత జన్యుపరలోపమై ఊడలు వ్రేలాడదీస్తుంది ఆకులే నిత్యం రాలిపోతున్నాయి చీకటైన మనసుకు చిన్న మిణుగురు కాంతి దీపమై కనిపిస్తుంది ఇంద్రజాలంలా అన్నీశూన్యంగానే వెక్కిరిస్తున్నాయి జీవితమే కనికట్టై కళ్ళనే మార్చేసింది కాలంలో జీవితం గారడీ విద్యలా బురిడీ కొట్టిస్తుంది ఊడల్లో నీడలు మాత్రం నాతోనే కదులుతున్నాయి జ్ఞాపకాలు సజీవం గా మెదులుతున్నాయి అంకురం ఒక్కటే ... మధ్యలో కేళీలే చెలగాటమాడుతున్నాయి ========================== ఏప్రిల్ 23/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2cCBt

Posted by Katta

Sriramoju Haragopal కవిత

జిందగీ దేనెవాలే... నడుస్తున్నపుడు నా పాదాలను మోస్తున్నదెవరు నా నడకకు బాటలు తీస్తున్నదెవరు మేఘాల రుమాళ్ళు చుట్టి ఆకాశాన్నితోడు పయనం కట్టించి మెరుపుల ఇష్టసఖులను తోడుపంపి నాకన్నా ముందే దారిలో ఆశల చెలిమెలు నింపి చెట్లకు ప్రియమోహనాల సద్దులు కట్టి తానే దారంతా పూలదువ్వెనలెగురేస్తూ వాన చినుకులదుప్పటి కొప్పెర పెడుతున్నదెవరు అనంతమైన అనురాగాల రుతువేదికల చలివేంద్రాలు పెట్టి అలిసిపోని ఇష్టాల గాలికుచ్చుల వీవెనలు కట్టి పాదాలకింద చల్లటి మమతల కొండవాగుల్ని పరిచి గుండెగొడుగు పట్టిన చెట్లబాటలో తొవ్వలు తొక్కించి మజిలి మజిలీకి పాటలసత్రాలు కట్టించినదెవరు నువ్వేనని నాకు తెలుసు వెనక్కి తిరిగి నిన్ను చూడకుండా నా చూపుల నెత్తుకపోతున్నారెవరో నా మనసును చీల్చుకపోతున్నారెవరో సాగనంపిన నువ్వే ఎదురొచ్చేవేళకు నా వూపిరులాపివుంచు కాటుక కరిగి జారిన కళ్ళల్లో నిలిపివుంచిన కొత్త కన్నీటి ముత్యాలమాల నీకే ఇవ్వాలని నా మనసుకు నేను మాటిచ్చా

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2cCl0

Posted by Katta

Pulipati Guruswamy కవిత

అసంకల్పిత రసన // డా.పులిపాటి గురుస్వామి // ఊహలతో కూడిన కలలు కొన్ని నక్షత్రపు ఆశ్చర్యాల్ని వానచినుకుల చలికాంతినీ ధారగా ఆస్వాదించే సమయాన నువ్వు నన్ను అవలీలగా కలిచివేస్తావు ఒక్క వేకువ యవ్వనాన్నీ కూడా నిరాశగా నీ ధ్యాస నుండి వేరుగా తిప్పనూ లేను పనికిమాలిన వ్యసనమని తోచిన ప్రతి కలయికా నా ఆనందపు చలనాల్లో వేడుక చేసుకుంది నిను కలిగిన తలపు నా అణువుల అలల పై పూల ఋతువును వెలిగించెనెందుకో... కళ్ళల్లోంచి కళ్ళల్లోకి ప్రవహించిన నిశ్శబ్ధమూ సౌందర్యంతో నిగనిగ లాడిన సమయాన్ని దాచిన స్థలం తెలుసుకోవటం సుళువే సుళువే తేలికైన బతుకు నీ లే స్పర్శను రెపరెపలతో అల్లుకుంటుంది . ..... 23-4-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNocgU

Posted by Katta

Rambabu Challa కవిత

చల్లా గౙల్-9/ Dt. 23-4-2014 కలనైనా ఊహనైనా చిరు ప్రాయం నాకివ్వు ఇహమైనా పరమైనా పసి ప్రాయం నాకివ్వు కొసరి కొసరి తినిపించే అమ్మ గొరుముద్దలు కడుపార ఆరగించు ఆ భాగ్యం నాకివ్వు నాన్న తీపి ముద్దులతో బామ్మ నీతి సుద్దులతో గుండెలకు హత్తుకొనే ఆ మమతలు నాకివ్వు తొలకరిలో మెరుపునై జల్లుల్లోచినుకునై తనివితీర తడిసిపోవు ఆరోజులు నాకివ్వు పుస్తకాల్లో కాగితాలు పడవలుగా మలచి నీటిపైన తేల్చియాడు ఆ ఆటలు నాకివ్వు వయ్యారాలొలకబొసే గాలిపటాలెగరేసి మెఘాల్లో విహరించే ఆ భావన నాకివ్వు ఆశలతో ఆహుతైన తనువెందుకు "చల్లా" స్వచ్ఛమైన మనసుండే ఆ బాల్యం నాకివ్వు

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mziWQP

Posted by Katta

Abd Wahed కవిత



by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNb2k4

Posted by Katta

నేనే ఇమ్రాన్ శాస్త్రి కవిత

"నేను-నేను= మనం" రచన:ఇమ్రాన్ శాస్త్రి మాత కడుపులో నుంచి భూమాత కడుపులో వెళ్ళే ప్రయాణంలో..ఎంతోమంది తారసపడ్తారు.... కాని ఎవరికి వాళ్ళు ఏదో ఒక సంబంధంతోనే ముడిపడ్తారు అమ్మ దగ్గర్నుంచి కనే అమ్మాయి/అబ్బాయి వరకు.... "మానవ సంబంధాలన్ని అవసరాలే"' అని ఎక్కడో చదివినట్టు గుర్తు..నిజమేనేమొ... ప్రయోజకుడికి పక్కనుంటూ పనికి రానివాడిని పక్కకు కూడా రానివ్వని తండ్రులు.. కలెక్టర్ అయితె సోదర భావాన్ని క్లీనర్ అయితె చీదర భావాన్ని వ్యక్తపరిచే సోదరులు.. సంపాదన బాగుంటే వేడన్నం అంతంతమాత్రంగా ఉంటే చద్దనం పెట్టి ప్రేమగా అవమానించి, జాలిగా హెచ్చరించే బంధువులు.. వాళ్ల దగ్గర లేని దాన్ని మన దగ్గర నుంచి పొందాలనే(బ్రతకడానికి కావలసినవన్ని) స్వభావంతో{స్వార్ధంతో అన్నా తప్పు లేదు} ప్రవర్తించే స్నేహితులు.. ఒకటో తారీఖు నాడు ఇక్కడ ప్రేమ అమ్మబడును అనే ఆభరణాన్ని మెడలో వేసుకునే భార్యలు.. మూర మల్లెపూలకో,మూడొందల రూపాయల చీరకో ఆకట్టుకోవచ్చని నమ్మే భర్తలు.. కన్నాక పోషించడం మీ బాధ్యత ఎదిగాకా మిమ్మల్ని చూడడం చూడకపోవడం మా ఇష్టం అని సమర్ధించుకునే పిల్లలు.. ఇన్ని అవశేషాలకు కాస్త పక్కకు జరగాలని ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మనిషికి అనిపిస్తుంది కాని తప్పక ఏదో ఒక వేషం వేసుకుని సశేషంగా సాగిపొతున్నాడు... తన నుంచి తాను దూరమవుతూ నలుగురితో ఏకమవ్వాలని.....!

by నేనే ఇమ్రాన్ శాస్త్రి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f69hkS

Posted by Katta

Manjunadha Reddy కవిత

నాలో నాకే భాధ మాటలు నేర్చుకోలేక మదిలో భాధ అనురాగం పంచుకోలేక గుండెలో భాధ అమితమైన ప్రేమఉన్న సమాజం పోకడలేక ఒంటరైపోతున్నాను ఓదార్పు లేక ఓడిపోతున్నాను నా మనస్సు ఒప్పుకోదు మౌనం విడిచి మమకారంగా మాట్లాడడానికి ఏదో ఓ హద్దు దాన్ని ఆనకట్ట వేసి ఆపేస్తుంది ఆనందానికి ఆశలు చిగురిస్తున్నట్లే ఉంటాయీ కానీ అవి చిగురులోనే చీమలు పెట్టిన చెదులులా ఎందుకు మరిపోతున్నాయో నాకైతే తెలియట్లేదు అవకాశాలు అదునుగా వస్తుఉంటాయీ కానీ వాటిని ఎలా గేలం వేసి ఏరా చూపి పట్టాలో నా పసిడి మనస్సుకు తెలియట్లేదు అమ్మ వాడిన చుసిన ప్రేమే నాకు తెలుసు కానీ కమ్మని కళలు మొదులైయక కాలం నాకు శాపంగా మారుతుంది నలుగురు నా చుట్టూ ఉన్న నేను ఒంటరినే నా ఆలోచనలను పంచుకోలేక నా బాధకు నేను బదిదున్నే నా నవ్వును నలుగురికి పంచాలని అనుకుంట కానీ అది నాలోనే దాగుడు మూతలు ఆడుకొని వెళిపోతుంది @ 23/04/2014 time 7.50pm

by Manjunadha Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hiHfS7

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

ప్రశ్న రాజీనామా ===================రావెల పురుషోత్తమ రావు పేశ్నిస్తున్నంత కాలం ప్రవాహ వేగంతో మెదడు పనిచేస్తూ వునే వుండేది. కొండలమీదనుండి జారిపడే జలపాతంలా చలన ద్యుతితో విద్యుత్తులా సాగుతూ వుండేది మనసు. అవతలి వాళ్ళను ఉక్కిరి బికీరిచేస్తూ అయోమయంలోకి వాళ్ళను నెట్టే స్తూ వుండేది. నీతినిజాయితీలు యేమాత్రం లోపించినా నాప్రశ్నోపనిషత్తు గజ గజ వణికిస్తూ వుండేది. నిలువు టద్దంలా వారికి నా ప్రశ్నలు సోదాహరణమై నిలిచేవి. ఇప్పుడు కాలమంతా మారిపోయింది. ప్రశ్నిచే వాళ్ళకూ ముడుపులు ముడతాయనీ--లోక సభ సాక్షిగా నిరూపితమైందని చదివాను. ప్రశ్నలు సంధించకుండాకూడా బహుమానాలనందుకునే దౌర్భాగ్యం దాపురించింది. కుల మతాలకు దగ్గరగానే కుళ్ళు రాజకీయం కులీనమనుకునేలా ప్రవర్తిస్తున్నది. ప్రశ్నలలో నిప్పు స్థానంలో నీళ్ళు ప్రవేశించడం మొదలయింది. మనిషి దుర్మార్గాలకు సోదాహరణంగా నిలవడం మొదలయింది. ఇక ఎవరిని పశ్నించాలి ఎందరిని ప్రశ్నించాలి? గంపగుత్తగా అంతటా కాలుష్యమే రాజ్యమేలుతుంటే పీల్చీ గాలిని కూడా మనమే కలుషితం జేసుకుంటూ పోతుంటే ప్రశ్నలకింకా విలువేముంటుంది? అందుకే ప్రశ్నించినా సరయిన సమాధానం రాబట్టలేమని తెలిసి ప్రశ్నించే ధోరణికే స్వస్తిచెప్పే ఆలోచనలో ఉన్నాను. కోట్లను అధికారాన్నడ్డంపెట్టుకుని పోగేసుకున్న జద్విఖ్యాతులూ వాగ్దాన వర్షంలో జనాన్ని తడిపి ఆతర్వాత తప్పించుకు తిరిగే నాయకమ్మన్యులూ మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుని ప్రవర్తించే రోజులు అతి సమీపంలో ఉన్నాయని గమనించి మరీ మీ గమ్యాన్ని గమనాన్నీ మార్చుకునేలా చూసుకోండి అదే చాలు అదే పదివేలు-- ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hi654h

Posted by Katta

Sukanya Beegudem కవిత

!!శూన్యమా!!..@ సుకన్య23/04/2014. ఊహల్లో కవ్విస్తూ ఒంటరి తనాన్ని చేదిస్తూ ఊసులతో మురిపిస్తూ ఊహకందనివి తెలిపిస్తూ నిలుస్తావనుకున్న కవ్విస్తూ ... కనులముందు మధుర తన్మయత్వంలో ముంచేస్తూ స్వేచ్చా ప్రపంచాన కట్టుక రెక్కలు విపంచి విన్యాసాలలా ... వలపుల సరిగమల నాట్యమాడిస్తూ మేని తేనియల తేలియాడిస్తూ అనంత నవ్వుల నందిస్తూ ఆత్మీయతను పంచుతూ అనురాగాలను అద్దుతూ ప్రేమోజ్వలాలు రేపుతూ రేయింబవళ్ళు ఏకం చేస్తూ .... ఎందుకమ్మా ... అన్ని నీవై .. నన్నల్లుకుంటావు .. మిథ్యలా ... శూన్యమా !!

by Sukanya Beegudem



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jLB9Ie

Posted by Katta

Venugopal Rao కవిత

నా పిచ్చిగానీ నాకెప్పుడు న్యాయం జరిగిందని మా అమ్మలను అమ్ముమ్మలను దాసీలుగా చెరబట్టి దొరసానులకు సేవచేయించి దొరల కోర్కెలు తీర్చుకుంటే నా పెద్దయ్యలు కళ్ళు మూసుకున్నారే తప్ప తిరగబడలేదు వాళ్లకు ముందే తెలుసేమో తిరగబడితే ఒరిగేదేమీ లేదని స్వతంత్ర దేశాన దళితులకు రక్షనంటే నిజమేననుకున్న నా అక్కచెల్లెల్ల అంగాంగాలను వర్ణిస్తుంటే తాకరాని చోట చేతులేసి గేలి చేస్తుంటే చుండూరు చైతన్య్హం తిరగబడింది ఆడోల్లపై దౌర్జన్యం ఏంటని ప్రశ్నించింది కామంతో తెరుచుకున్న కళ్ళు ఎరుపెక్కాయి అగ్రవర్ణ దురహంకారం బుసలు కొట్టింది ధనబలంతో మదమెక్కిన కండకావరం వెంటపడి దాడి చేసింది నా చైతన్య్హం పై ప్రశ్నించిన నా దళితుని కంఠన్ని నరికేసింది న్యాయం అడిగిన నేరానికి నా తమ్ముడు చుండూరు చేలల్లో శవమయ్యాడు నావాళ్ళ రక్తం చూసి రాత్రి తెరమరుగయ్యింది తెల్లారంగనే అంతా షరా మామూలే మాకు మళ్ళీ న్యాయం చేస్తామని పెద్దల హామీలు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి దుండగులకు దండగేస్తామన్నారు అయినా మా పద్మారావు పిచ్చిగానీ దళితుని కత్తికి ఈ రాజ్యంలో పదును ఎక్కడ ఉంటది లక్షల విలువ చేసే నల్సార్ యూనివర్సిటీ లా డిగ్రీ బతుకు లేని బీదోల్ల పక్కన ఎందుకు ఉంటది ఇరవై ఏళ్ళ కాలంలో నిజాన్ని నిర్ధారణ చేయలేదని నా తమ్మున్ని ఎవరూ విగాతజీవుడ్ని చెయ్యలేదంటారు ఏం చేస్తాం ఏం జరిగినా చూస్తూ ఊరుకోవాలి కత్తి తిప్పటం మాని కళ్ళు మూసుకోవాలి మన అయ్యలే నయం న్యాయం జరగదని ముందే మేలుకొన్నారు, మనకోసం కొంతకాలం బతికారు మనరాజ్యం వచ్చేదాక అంతే మరి

by Venugopal Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iKxk8c

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

కన్నెగంటి లిమరిక్కు.....గాలితిత్తులు...23.4.14. పొత్తులు అధికారం కోసం వేసే ఎత్తులు ఎవరికీ అర్థం కాని గమ్మత్తులు నక్కలు కూడా విస్తు పోయే జిత్తులు ఎన్నికలై పోయాక గాలిపోయిన తిత్తులు.

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hhWSZU

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్|| దీనికి సమాధానం ఏది? || ఊళ్ళో పెళ్ళైతే కుక్కలకు హడవుడని ఎందుకన్నారో కాని కాట్లాడుకుంటున్నప్పుడు కుప్పతొట్టి రణరంగమైంది అయినా అది నాకు ఆశ్చర్యమనిపించలేదు! పక్కనేవున్న సర్కారీ హాస్టలు పోరగాళ్ళు ఫంక్షన్‌హాలు గేటువద్ద పడిగాపులు కాస్తూ బతిమాలుకుంటుంటే వాచ్‌మన్‌ పొండిరా పొండని అరుస్తుంటే ముక్కున వేలుపడింది! సర్కారు వాళ్ళ కడుపులను అర్థాకలి గురిచేసి మిగిలిన దానిని అర్థంగా మార్చి బొక్కసానికి బొక్కపెట్టి తమ బొక్కసం నింపుకుంటున్నపుడు ఆశ్చర్యమేసింది! అందుకేనేమో ఆ పోరళ్ళప్పుడప్పుడు బడికెళ్ళే దారిలో వంకర చూపులతో ఇండ్ల దొడ్లో కొబ్బరికాయలకో జామకాయలకో గోడలు దూకి రాళ్ళు రువ్వుతుంటే గమనించాను కొండకచో గద్దించే వాడిని! పల్లెటూళ్ళో అమ్మ అయ్య వీరి బాగుకోసం తాపత్రయంతో హాస్టల్‌కు తోలితే అజమాయిషీ లేని వీళ్ళు యిలా అర్థాకలితోనో బాల్య చాపల్యంతోనో పొరుగువాడి వస్తువులపై కన్నేస్తున్నారంటే.... ఏమటర్థం? సంక్షేమం ఇలా సంక్షోభాల్ని సంక్లిష్టతలని పురుడుపోసుకుంటుంటే సమాధానం ఎక్కడ దొరుకుతుంది! రేపు బాల నేరస్తులగానో, కరుడుగట్టిన నేరగాళ్ళైతే సమాధానం ఏది? 23.04.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gQHOif

Posted by Katta

Harish Babu కవిత

!!ఎవేవో ఘోషలు!!భీమ్!! ఎవేవో ఘోషలు ఎవేవో ఆర్తనాదలు వినబడుతున్నాయ్ వాళ్ళు ఎవరై ఉంటారు....? చినసుబ్బడు..,ఎర్రెంకడు లాంటి మాల..,మాదిగలు తప్ప బుక్కేడు బువ్వ కోసం భూమిని తాకితే అదేమో కమ్మోడిని..,కాపోడిని పంపింది నన్నో అంటరానోడు ముట్టుకున్నాడని ఇంకేంది గొడ్డళ్ళు..,బడెసెళ్ళతో కారపు పోట్లలతో మనువు అంటరాని పల్లెపై స్వైర విహారం చేసాడు చీకట్లో గుమ్మంలో పెట్టాల్సిన దీపాన్ని చచ్చిన పీనుగ ముందు పెట్టేలా చేసాడు.

by Harish Babu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1my4iJv

Posted by Katta

Satya NeelaHamsa కవిత

" స్త్రీ " ^^^^^^ -సత్య నీకూ కడలికి తేడాలేదు దాని అలలు అర్థమనా అగాధo అర్థం కాదు నీకూ ప్రకృతికి తేడాలేదు పరిణామాలు అర్థమైనా ప్రళయం అర్థం కాదు నీకు పూలకి తేదాలేదు వాడే పరువాలర్థమైనా వీడని పరిమళాలర్థం కాదు నీకూ నింగికి తేడాలేదు అందినట్టే ఉన్నా అంతు మాత్రం అర్థం కాదు నీకు వాగుకి తేడాలేదు వొంపులు అర్థమైనా సుడులర్థం కాదు నీకు నిప్పుకి తేడాలేదు ఆరిపోయిన తరువాత కాని, అస్థిత్వం అర్థం కాదు నీకు నీటికి తేడాలేదు ఏ పాత్రకి ఆరూపం!, అసలు రూపం అర్థం కాదు నీకూ నేలకి తేడాలేదు ఓర్పు అర్థమైనా నిరీక్షణ అర్థం కాదు నీకూ తరువుకి తేడాలేదు ఫలాలర్థమైనా త్యాగమెందుకో అర్థం కాదు నీకూ వర్షానికి తేడాలేదు అవసరం అర్థమైనా ఆగమనమెప్పుడూ అర్థం కాదు నీకూ తుఫానికి తేడాలేదు భీభత్సం అర్థమైనా నిశ్శబ్ధం అర్థం కాదు నీకూ గాలికి తేడాలేదు కనపడకుండా గుండెల్లో ఎలా నిండుతుందో అర్థం కాదు :)

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l0uNaC

Posted by Katta

Sasi Bala కవిత

''మా ఆసరా చిత్ర సౌరభాలు'' లో విజేతగా నిలిపిన నా కవిత అన్న ..మనసు ......శశిబాల (23 ఏప్రిల్ 14 ) ------------------------------------ అమ్మా నాన్నా ఎవరూ లేని అనాథలం... దిక్కూ మొక్కూ లేని విధి వంచితులం విధి ఆడిన వింత ఆటలో గెలుపెరుగని పావులం ..దీనమైన శిశువులం నీతో పుట్టిన అన్నయ్యను నేనే ...నిను కాపాడే కన్నయ్యను నేనే చిన్నదైనా ,పెద్దదైనా నీతిగా సంపాందించి నీ కడుపు నింపుతా కన్నవారు మనలను వదిలి అనంతలోకాలకు వెళ్ళినా ..నీకు తోడు నీడగా నన్నుంచారు నీ కంట నీరు రానీనమ్మా ....నా కంటి పాపవు లేమ్మా గుండెలపై నిను మోస్తాను ...గుండె నిండ నిను దాస్తాను నీ దారిని పువ్వులు పరవకున్నా ..కరకు ముళ్ళు తాకనీయను అమ్మనై నిను లాలిస్తా ...నాన్ననై నిను పోషిస్తా సమాజపు రక్కసి కోరలనుండి అనుక్షణం నిన్ను కాపాడుతా

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jKlAAv

Posted by Katta

Uday Dalith కవిత

ఎందుకలా ఓప్రేమ కవిత రాయమంటే చైతన్య పద్యాలు పాడతావు నువ్వు శృంగార వర్ణానివే అనుకున్నా నువ్వు చైతన్య కిరణానివి కూడా నీ అందం నాకు బంధనమనుకున్నా అది స్ఫూర్తి గ్రంధమై ఇవాళ ప్రపంచ దర్శనమైంది పన్నీరు వాసనలొలికే నీ పెదవులు మధువులు పూయించే పూరెమ్మలనుకున్నా కానీ అవి తేట తెలుగులో ప్రవచనాలు పలికిస్తుంటే నులివెచ్చని నా వయస్సు సామాజిక హితమని వింతగా పరుగులు తీస్తుంది ప్రతి యామినిలో మగసిరులు కోరే కనువిందు నీవని అనుకున్నా కానీ అరుదైన నీ వ్యక్తిత్వం జాగృతిలో జనించి కటిక చీకట్లలో నాకు ఉషోదయమై ప్రతి పూటా పరవశింపజేస్తుంది

by Uday Dalith



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f4DeSd

Posted by Katta

రంజిత్ రెడ్డి కర్ర కవిత

Click like this page...

by రంజిత్ రెడ్డి కర్ర



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ieyBzP

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//ఔ...అన్నా// రెండుకండ్ల సిద్దాంతమంటే ఏందన్నా కండ్లు మూస్కపోవుడు తమ్మీ పునఃనిర్మాణమంటే ఏందన్నా కూలగొట్టి కట్టుడ్రా తమ్మీ బలి దేవతంటే ఎవురన్నా ఇటలీ గ్రామదేవత తమ్మీ గీ ఎర్రజెండ లేందన్నా తాతలెక్క పాతవి తమ్మీ ముస్లిం పార్టీల ఇస్పెషల్ ఏందన్నా నాకే ఉర్దూ రాదు నీకేం చెప్ప తమ్మీ కమలం పూస్తుందా అన్నా నీళ్ళేడ ఉన్నయ్ తమ్మీ గీ పొత్తుల కదేందన్నా అమెరికల కాట్రాంక్టు పెళ్ళి లెక్క తమ్మీ ఔ.. అన్నా... ఎలక్చన్లు ఎందుకన్నా అరె గీయింత తెల్వదా దండుకోనికి పంచుకోనికి తమ్మీ ....23.04.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rljdHn

Posted by Katta

Naresh Nandam కవిత

మైనారిటీ || నరేష్ నందం 23.04.2014 -------------------------- ఉదయం స్కై బాబా షేర్ చేసిన డా. దిలావర్ గారి త్రి’శూల’ నొప్పి కవిత స్ఫూర్తిగా.. -------------------------- మనసులను ముళ్లకు గుచ్చి సొంతగడ్డ మీదే పరాయితనం మూలాలను శోధిస్తూ వెక్కిరిస్తోంది చూడు ఈ ప్రాంతీయవాదం! ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పుడు నోరున్నోళ్లదేనట రాజ్యం! వారి లంగలఫంగ మాటలకు పరవశించి, అంగాంగాలను కత్తిరించాలని ఫత్వాలు ఇచ్చి, అమ్మల మానాలపై బూతుల కవితలు కూర్చే గోప్ప కవుల, రచయితల సమూహాలకేం తెలుస్తుంది? ఊహ తెలిసినప్పటి నుంచి నాది అనుకున్న చోటులో, మరెవ్వడో వచ్చి వెకిలి నవ్వుతో నువ్వు పరాయోడివని వెక్కిరించి.. నిన్ను తంతాం, తరిమేస్తాం, నాలుకలు తెగ్గోస్తామంటూ.. మూడ్ వచ్చినప్పుడల్లా బెదిరించి, నోటికొచ్చిన పచ్చిబూతులన్నీ పరమ ఆనందంగా సంకీర్తన చేస్తోంటే.. రోజుకోసారి పక్కవాడిని చూసి కడుపుమండి కుళ్లునిండిన కళ్లతో కుమిలిచచ్చే వారికేం తెలుస్తుంది? వలస బతుకుల మీద విరక్తితో, సెటిలర్లనే మాటల ఈటెల పోటుని భరించలేని అశక్తతతో.. దీనమ్మా జీవితం.. ఎవడి కడుపుకొడుతున్నామని మేమీ నగరంలో అంటరానివాళ్లమయ్యామనే ప్రశ్నకు జవాబుదొరకని తనంపై కోపం, ఉద్రేకం.. రెండవతరగతి పౌరుడిగా బతకటంలో నొప్పి ఎలా తెలుస్తుంది?? మా కడుపులో పెట్టుకుని చూసుకుంటామనే మాట పెదాలు దాటకముందే.. నీయబ్బా ఆంధ్రోడా.. మా జాగలకొచ్చి బతుకుత మమ్మల్నే పైసలిమ్మంటవారా.. అని కూసే ఆ మహానుభావుల నోళ్లను ఎన్ని వేల సార్లు ఫినాయిలుతో కడగాల్నో..?? కర్రీపాయింటు గాళ్లే కదా అని జాలి కూడా చూపకుండా, వాడి కంచంలోని ఎంగిలి కూడు తింటోన్న ఈ నా పెద్దమనుషులను ఏమని పొగడాల్నో..?? నోటితో పలకరించి నొసటితో వెక్కిరించే గోప్ప సంస్కృతీసంప్రదాయాల వారసులైన పాదుషా ముద్దుబిడ్డలను చూసి వారి పాలన ఇంకెంత బాగుంటుందో అని పొంగిపోవాల్నో..?? అన్యాయమంటే.ఎక్కడో గుజరాతులో జరిగేది మాత్రమే కాదు.. అరాచకమంటే.. కడుపులో పిండాన్ని తీసి ముక్కలుగా నరకటం మాత్రమే కాదు.. తనకు సంబంధంలేని సంఘటనకు, సాక్షిగా కూడా లేని సందర్భానికి నిందల కుండలను నెత్తిన మోస్తూ తిరగాల్సిరావటం కూడా అన్యాయమే.. అలాంటి అన్యాయానికి మద్ధతు తెలుపుతూ కవితలనే పేరుమీద విశృంఖలతనూ, మనసులోనీ పర్వర్షన్‌నూ వాంతి చేసుకోవటమూ అరాచకమే..

by Naresh Nandam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hgwhMH

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ఆకాంక్ష నువ్వలా చూస్తూనే ఉండు నీ సొగసైన చూపులతో; ఆ చూపుల వెన్నెలలో అభ్యంగన చేస్తూనే ఉంటా! నువ్వలా నవ్వుతూనే ఉండు నీ మధురమైన నవ్వులతో! ఆ నవ్వుల పువ్వులలో మకరంధం గ్రోలుతూనే ఉంటా! నువ్వలా ప్రేమిస్తూనే ఉండు నీ రమ్యమైన హృదయంతో; ఆ ప్రేమసౌందర్య సుగంధంలో నేను కరిగిపోతూనే ఉంటా! నువ్వలా జీవిస్తూనే ఉండు నీ అద్బుత జీవనగానంతో; ఆ జీవనగానధ్యానంలో నా మరణాన్నే నేను రద్దు చేసుకుంటా! 23Apr2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iJdKt3

Posted by Katta

Varala Anand కవిత



by Varala Anand



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nnNeZt

Posted by Katta

విష్వక్సేనుడు వినోద్ కవిత

రా ... మళ్ళీ పుట్టేద్దాం!! | Viswaksenudu Vinod మన సుధీర్ఘ ప్రయాణపు నిట్టూర్పు విడిచిన వాయుప్రవాహం వసంత కోయిలకు పోటీగా వెదురువనాల్లో దూరి వేణుగానాలాలపిస్తోంది. వేసవి చిచ్చులు రాల్చిన నీ కొపపు నిప్పు కణికలు తనువంతటినీ తడిమి తగలబెట్టినా మనసు శితలంలో మంచుముక్కలా చల్లబడుతోంది. నా గుబులు గుండె గవిలో మిణుగుర్లా మెరిసిన సందేహానికి సమాధి కట్టిన సంశయమేదో మేధోసంపత్తికి అసంతృప్తిని మిగిల్చింది. చవకబారు తెలివితేటలు వికటించి చిక్కి శల్యమైన నా సందేహ దేహం కాస్తా శిధిలమై శిలాజంగా నిర్వీరమైపోయింది. పవిత్రంగా నిర్మించుకున్న మన ప్రేమవంతెన మాత్రం రామసేతులా కలల అలలపై తేలియడి సజీవంగా మిగిలిపోయింది. ఇవాల్టి ప్రేమను రెట్టించి రేపటికి మరింతపొందడానికని నిన్నను నెట్టేసి కొత్త ప్రభాతమేదో ఉత్సుకతతో ఎదురుచూస్తోంది. రా... ఎంచక్కా రేపు మళ్ళీ పుట్టేద్దాం!!

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jIWwKi

Posted by Katta

Padma Bikkani కవిత

* *ఆ.....అక్షరాలు.....* * ఎలాజరిగిందో మరి అంతరంగంలో ఆలోచనలు అక్షరాలుగా ప్యూపాలు పగల గొట్టుకొన్నట్టున్నాయ్ ఎందుకనో మరి పదాలై పెదాలు దాటించాలని ప్రయత్నం చేస్తే ఓడిపోయిన సైన్యం లా దిగాలుగ వెనుతిరిగాయి .. ఉక్రోషంగా ఎత్తుకు పైఎత్తుగా మాటల పదాలను కొటగోడలుగా పేర్చుదాం అంటే బరువైన పదాలేవీ బాష లో ఇమడ్చ లేక గుండె తలుపులు గడియ వేసుకొన్నాయి.. ఏమైందో ఇక నీలి రంగు సిరా లో వెతలుగా కొన్ని అక్షరాలను తడిపేస్తూ నింపబోతే ఆ సాంద్రత బరువు తట్టుకోలేక ఇంకు చుక్కలకు 'కన్నీటి 'చుక్కలు నేస్తాలయ్యాయ్ ఎలాగో ఒకనాటికి తడిసీ తడవని అక్షరాలని తడారిన గుండె పై రాల్చుకున్నాక కాలం భూతమైంది కవిత గతమైంది సగం కరిగిన కొవ్వొత్తి చేతిలో పట్టుకొని చిరిగిన పుస్తకాలలో రెండు శూన్యాల నడుమ ఇరుక్కున్న అక్షరాలను చూడబోతే పురాతన పుస్తకంలోని తప్పిపోయిన కాగితాలు పచారీ సామానుకి వలువలైపోతే జరీ అంచులా మెరుస్తూ ఆ అక్షరాలు.. నా అక్షరాలు... **పద్మ**23|4|2014

by Padma Bikkani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tA8tc6

Posted by Katta

Krishna Mani కవిత

చిన్న మనసు *************** అగసూడు అగసూడు అందమైన అంగడి అమ్మకొంగు వట్టుకొని అడుగు మీద అడుగేస్తి సంచివట్టి అమ్మ నింపె వారందాక కడుపులు ! దిక్కులు వట్టి నా మొకం మెరిసిపోతి మనసున నెత్తిమీద టోంగ గొట్టి అమ్మగుంజె ముందుకు ! శనగ పల్లీలు తెల్లమురుకు పెద్ద పాపడ కడుపుగోకి అడిగిన ఓపలేక పానము చిల్లర సదిరి ఇప్పిచ్చే కారం బఠానీలు దవడలు గుంజె ,కడుపు నిండె అయినా మనసు నిండలేదు ! పక్కపోరడు నాకవట్టె పాల ఐస్క్రీం కారే చుక్కల వట్టి సప్పరిద్దమంటె ఉరిమురిమి సూడవట్టె పిల్లిమొకపోడు ! నెత్తిమీద సంచెత్తి ఎడమచేతిల నన్నుపట్టి నడసవట్టే మాయమ్మ జాతర దాటి ఇంటికి తోవ్వవడితే నడవనంది పానము ! అంగట్ల నడవనంటె మల్ల వారం తోల్కరాదని బిగవట్టిన చెమ్మ తుడిషి అమ్మ చేతినదింపట్టి ప్రేమతోడ అడుగులు ! కాళ్ళు గుంజంగ ఇల్లు జేరితి దూపకు చెంబెత్తి దించితి సాప మీద కాళ్ళు సాపుకుంటే ఒళ్ళు మరిశిన నిద్దురాయే ! కృష్ణ మణి I 23-04-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tA8qgl

Posted by Katta

Arcube Kavi కవిత

ఈ యుద్దం కొనసగుతుంది-9 _____________________ఆర్క్యూబ్ తెలంగాణ-కాళ్ళకింది మట్టిని కుంకుమ భరిణకెత్తుకున్న బతుకుపూల సాగువాటు అది నవంబర్ ఒకటి దక్కన్ ప్రవాహ సోయగంలో " దొంగల మర్రై " కలలు మెళకువలోకి పురివిప్పే ప్రతీ సంధర్భమ్మీద ధాడి చేయాలనే కదా మనకు ఆ ఒకటీనే సర్వస్వం చేసి పూల నేల మీద పిట్టల్ని కూల్చివేస్తున్నది అందుకే- ఆ వీణిప్పుడు గ్లొబల్ తాంబాలమ్మీద మానుకోట రాయై శృతి చేసుకుంటున్నది

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tA5Bvz

Posted by Katta

Annavaram Devender కవిత

తొవ్వ ........అన్నవరం దేవేందర్ ....23.04.2014 కరీంనగర్ లో ‘విద్యుల్లత’ లు విరచిమ్మిన కాలం కరీంనగర్ జిల్లా సాహిత్యానికి పత్రికా రంగానికి పెట్టింది పేరు .జిల్లా నుంచి 1969 లో సంవత్సరం పాటు ‘విద్యుల్లత ‘యువ సాహిత్య మాస పత్రిక నడిచింది .సాహితీ మిత్ర మండలి దీనిని ప్రచురించింది .దీనికి సంపాదకులుగా బి.విజయకుమార్ (జీవగడ్డ విజయకుమార్ గా ప్రసిద్దులు ),జి .లింగారెడ్డి (డాక్టర్ గోపు లింగారెడ్డి ,ప్రఖ్యాత జానపద సాహితీ వేత్త ,రెండేళ్ళ కింద మరణించారు ).వి.వెంకటరెడ్డి లు వ్యవహరించారు .అప్పుడు వీళ్ళంతా విద్యార్థులే జమ్మికుంట కళాశాలలో చదువుకొంటడ్రు.ఇటీవల నా పాత పుస్తకాలు సదురుతుంటే విద్యుల్లత జన్మదిన కథల సంచిక దొరికింది (ఆగస్ట్ –సెప్టెంబర్ -1970 )ఇందులో ఏడు కథలు ఉన్నాయి .ఈ పత్రిక కు శ్రీ శ్రీ .కొడవటిగంటి ,కే.వి రమణారెడ్డి ,అద్దేపల్లి రామమోహనరావు ,తాడిగిరి పోతరాజు ,చలం ,రాసిన ఉత్తరాలు ఉన్నాయి .నలబై నాలుగేండ్ల కింది సాహిత్య పత్రిక చూస్తే గంమతి అనిపిచ్చి ఈ కాలం లో రాస్తున్న . ఇంకా ఇందులో మెట్టు మురళీధర్ రావ్ ‘సుడుగుండం ‘,సి .ఎస్ రావ్ ‘గంజయిగొట్టాలు,అత్తలూరి నరసిహ్మరావ్ ‘నిద్ర పింగళి రంగా రావ్ ‘ఆకలి ‘,రవికాంత్ ‘ఉదయం ‘,ఆగ్నేయ ‘నింద లేందే ‘యం.యన్ రావ్ ‘హింస ను నిషేదించిన పులి రాజు ‘కథలు ఉన్నాయి .అట్లనే పి.యన్ .స్వామి ప్రఖ్యాత రచయిత కిషన్ చందర్ తో ముఖాముఖి ఉన్నది .ఆపుడే తెలంగాణా నుంచి ఇంత గొప్ప పత్రిక వెలువడింది .ఆ తరువాత కాలం లో ఆగి పోయింది .కరీంనగర్ కేంద్రంగా ఆనాటి సాహిత్యం ప్రచురణకు కరీంనగర్ బుక్ ట్రస్ట్ ఏర్పడింది .’బదులా’ కథా సంకలనం కూడా ఇక్కన్నుంచే వచ్చింది .శ్రీశ్రీ ‘రెక్క విప్పిన రేవల్యుషన్’ఇక్కన్నే అచ్చయింది . అసలు కరీంనగర్ లో 1954లో బోయినపల్లి వెంకటరామరావ్ సంపాదకత్వాన ‘సారస్వత జ్యోతి ‘త్రైమాస పత్రిక వెలువడింది .అదే కాలంలో కమల్ కరిమనగారీ సంపాదకత్వంలో మానేరు ఉర్దు పత్రిక ‘పంచాయితి యుగం ‘పాతికలు వెలువడ్డాయి .1977 లో మలయశ్రీ సంపాదకత్వం లో సత్యార్తి పత్రిక వెలువడింది .తెలుగు సాహిత్యానికి కరీంనగర్ అందించినది ఎంతో ఉన్నది .ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో పత్రికలు వస్తున్నాయి సిరిసిల్ల నుంచు ‘దిక్సూచి ‘సాహిత్య పత్రిక వస్తుండే....అట్లనే తెలంగాణా ఆవిర్భావం నాటి నుంచి ఇక్కడి మిత్రులు ‘వాగు ‘సాహిత్య పత్రిక వెలువరించేందుకు సన్నాహాలు చేస్తుండ్రు ..వాళ్ళను స్వాగతిస్తాం

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rhUGVp

Posted by Katta

Kavi Yakoob కవిత

జయహో కవిత్వం ! కవిసంగమం - ఫేస్బుక్ లో ఒక గ్రూప్ : వచనకవిత్వం గురించి, మరీ ముఖ్యంగా కవిత్వసృజన,సంబంధిత అంశాల గురించి నిరంతర సంభాషణ కొరకు ఒక వేదికగా ఈ సమూహం ఏర్పరచబడింది. http://ift.tt/1jynLpu త్రిపురనేని శ్రీనివాస్ ॥ కవిత్వం కావాలి కవిత్వం ! .......................................................... కవిత్వం కావాలి కవిత్వం అక్షరం నిండా జలజలలాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం ............. కవిత్వం వేరు వచనం వేరు సాదాసీదా డీలా వాక్యం రాసి కవిత్వమని బుకాయించకు కవిత్వాన్ని వంచించకు వచనమై తేలిపోతావ్- కవిత్వం కావాలి కవిత్వం అక్షరం నిండా కువకువలాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం .......... - కవిత్వసృజన,కవిత్వపఠనం,కవిత్వ సంబంధిత అంశాలు -ఇవన్నీ అవగాహన చేసుకుంటూ ముందుకు సాగేందుకు వీలుగా ప్రతినెలా 'కవిసంగమం'సీరీస్ సభలు 'పోయెట్రీ వర్క్ షాపు'ల్లా జరుపుకుంటున్నాం.వీలయినప్పుడల్లా కవిత్వానికి సంబంధించిన అనేక అంశాలను వాల్ మీద పోస్ట్ చేసుకుంటున్నాం. ప్రముఖ కవులతో ముఖాముఖి ద్వారా కవిత్వ రచన గురించిన విషయాలు నేర్చుకుంటూ 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్' మార్గంలో సాగుతున్నాం. Important Note : ~Join in కవిసంగమం with ORIGINAL profile Photo. ~Don't send Join requests if your profile picture is not with original face. ............................................................................ ఈ గ్రూపు లో ~ 1. కవితలకు ఫోటోలు పెట్టవద్దు.[సీనరీలు గట్రా] 2. ఒకరోజులో ఒక కవిత మాత్రమే పోస్ట్ చెయ్యాలి. 3. ఇతర పత్రికలలో, అంతర్జాల పత్రికలలో ప్రచురితమైన మీ కవితల,కవితావ్యాసాల 'లింక్స్'ను సరాసరి ఇక్కడ పోస్ట్ చెయ్యవద్దు. ఆ రచనను టైపు చేసి కానీ ,కాపీ,పేస్ట్ చెయ్యడం ద్వారాగానీ పోస్ట్ చేస్తూ క్రింద బ్రాకెట్ లో సదరు పత్రిక యొక్క పేరును రాయండి.[అలా లేని పక్షంలో అటువంటి పోస్టింగును పోస్ట్తె చేసినవారికి తెలుపకుండానే తొలగించడం జరుగుతుంది] 4. కవిత్వానికి సంబంధించని పోస్టింగులు వెంటనే తొలగించబడతాయి. 5. కవితాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించేవారిని, 'కవిసంగమం' గ్రూపు సమగ్రతకు భంగం కల్గించేవారిని వారికి తెలపకుండానే తొలగించడం జరుగుతుంది.ఈ విషయంలో 'అడ్మిన్'లు ఎవరికీ జవాబుదారీగా ఉండనవసరం లేదు. 6. కవిత కింద కేవలం లైక్ కొట్టిన వారికీ,కామెంటు రాసినవారికి -ఒక్కొక్కరికి ఒక 'థ్యాంక్స్' చెప్పడానికి మాత్రమే పరిమితం కాకుండా,అవసరమైన చోట్ల ఆ కామెంటుకు వివరణ కానీ,ఇంకాస్త కవితకు సంబందించిన విషయం కానీ చెప్పదలుచుకున్నప్పుడు రాయడం బాగుంటుంది. 7.కవితలలోని అంశాలకు, కామెంట్ల లోని విషయాలకు పోస్ట్ చేసినవారే బాధ్యులు. వాటితో 'అడ్మిన్'లు గానీ,'కవిసంగమం' గ్రూపుకానీ ఏకీభవించారని అనుకోవసరం లేదు. ..... Note 1 ~ ఒకరోజులో ఒక కవిత మాత్రమే పోస్ట్ చెయ్యండి. ఒకటికన్నా ఎక్కువ కవితలు పోస్ట్ చేసినచో ఆ పోస్ట్ తొలగించడం జరుగుతుంది. NOTE : 2 ~ కవిత పోస్ట్ చేసేటప్పుడు-కవితా శీర్శిక తప్పక పెట్టండి. [*ఉదా: కవి పేరు | కవితా శీర్షిక ] అలాగే కవిత క్రింద తేదీ తప్పక వెయ్యండి.[*ఉదా: 30.8.2012 ] మిత్రులారా! సహకవులు రాసిన కవితలపై మీ స్పందనలు రాయండి.ప్రోత్సహించండి. మంచి 'కవితా'వరణం సృష్టించండి !! Note:3~EVERY SATURDAY - SPECIALLY FOR POSTING ENGLISH POETRY . ....... *సాధ్యమైనంతవరకూ సభ్యులు తెలుగులిపిలో చర్చలు సాగించవలసిందిగా మనవి. తెలుగులిపిలో టైపు ఎలా చెయ్యాలో తెలీని వాళ్ళు http://lekhini.org/ or http://epalaka.com/ తో మొదలుపెట్టవచ్చు. : *నిర్వాహకులు*

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jynLpu

Posted by Katta

నరసింహ శర్మ మంత్రాల కవిత

కృతజ్ఞతలు

by నరసింహ శర్మ మంత్రాల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jynLpm

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

మువ్వలు ............ మతం ఇరువైపులా పదునుకత్తే కౄరత త్రుంచుతూ పెంచుతూ మత ప్రవక్తలు వేల ఏండ్లు గడచినా పదవులు కొనసాగిస్తూ 'వాధూలస'23/04/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mx0V5v

Posted by Katta

Pusyami Sagar కవిత

KB గారు రాసిన కవిత !!ద గ్రేట్ స్టుపిడిటి|| కవిత్వ విశ్లేషణ నడుస్తున్న చరిత్ర ని సెటైరికల్ గా వ్యక్తీకరించారు కింది కవిత లో ..అసలు ప్రజాస్వ్యమ్యం ప్రజాస్వామ్యం లో జనమే బలము ...జనమే బలహీనత ...తమని తాము ఉద్ధరించుకునే ప్రక్రియ ఏది అయినా వుంది అంటే అది ఓటు అనే వజ్రాయుధము తో నే ...కాని అది ఈ రోజు ఎలా దుర్వినియోగం అవుతుంది , అసలు జనాలు వ్యక్తిత్వము గల వారు కావాలి....తన అవసరాన్ని నొక్కి చెప్తున్నారు ...జనం లో వున్న బలహీనతలని ఆధారం గా చేసుకొని దోచుకుంటున్న నోరు మెదపని ఆవులాంటి జనాలు ...కావాలి ఆవులు కాని బర్రెలు కాని పాలు పిండినపుడు ప్రతిఘటించవు దాని లక్షణం అది ...అలనే జనం కూడా తమను తమ ఫలాన్ని కష్టాన్ని పిండుకున్న కూడా నోరు మెదపని జనం కావాలి ..ఇది చైతన్య రహిత నికి సూచిక కావొచ్చు ..., అవును మన జనం ఎప్పుడు గొర్రెలే కదా ... //పొదుగుల నుండి రక్తం పిండుతున్నా//ప్రతిఘటించడం చాతకాని బర్రె లు ../// ప్రతి ఒక్క లైన్ లో పోలిక బాగున్నాయి వ్యంగం గా చెప్తూ ...ఇలాంటి జనలు మన దేశం లో తర తర లా నుంచి తల రాతలు మారక అదే ప్రజాస్వ్యామ్య ఊబి లో కొట్టుకు పోతూనే వున్నారు ...అజ్ఞానం తో వుండే వారిని తమ అవసరాల కోసం వాడుకొనే వాడే అవకాశ వాది ..నాయకులకు కావాల్సింది ఇలాంటి వారే కదా... వోటు విలువను కాగితానికో ...మందుకో అమ్ముకునే జనం కావాలి , అవును నిజమే ఓటు హక్కు గురించి గొంతెత్తి మొత్తుకుంటున్నా కాని మనకు పట్టదు ...చదువుకున్న వారు ఎలాగు వోటు వెయ్యరు .ఇలాంటి జనమే కావాలంటాడు ..., ఇక్కడ వోటరు ను అమ్ముకుంటుంది ఓటు కాదు తన శరీరాన్నే...బాగుంది వేశ్య తో పోల్చడం .. !!రెండు కాగితాలకు, ఓ క్వార్టర్ మందుకో తనను తానమ్ముకునే వేశ్యల్లాంటి జనాలు,!! జనాలు తాము మనుషులం అన్న సంగతి ఎప్పుడో మరిచార ఏమో అలానే అనిపిస్తుంది ...కొన్ని జంతువుల లాంటి జనాలు కావాలి ఎలాంటి మనస్తత్వం కల వారు కావలి అంటే గాడిదల్లాంటి (చాకిరి చేసేందుకు), గొర్రెల్లాంటి (గుడ్డి గా అనుసరించేదుకు), పాముల్లాంటి (ఆలోచనలేకుండా ముందుకు వెళ్లేందుకు), జిత్తుల మారి తెలివి కి (నక్క ) ఇలాంటి లక్షణాలు ఉన్న జనం కావాలి అవును ఇక ఇలాంటి వారు వున్నప్పుడు డెమోక్రసీ లో వోటు ఎక్కడ బతుకుతుంది గాడిదల్లాంటి, గొర్రెల్లాంటి, పాముల్లాంటి, నక్కల్లాంటి// మనిషి ని ఇంకో మనిషి ని తల్చుకోవాలంటే సిగ్గు తో తలదించుకోవాలనే విధం అయిన మనుషులు కావాలి నాకు, అవును ఇంత దిగజారిన విలువలతో వున్నప్పుడు ఎవరైనా తనని మనిషి గా చూడటానికి ఇష్టం చూపిస్తాడ ..., మనిషనేవాడిని తలుచుకోవాలంటేనే,//సిగ్గుతో తలలొంచుకునేటట్లు బతికే జనాలు. ఇప్పుడు ఉన్న నాయకులకి చైత్యనం తో నిండుకున్న జనాలు అవసరం లేదు ..ఎప్పుడు అయితే జనాలు చైత్యనం గా ఆలోచించటం మొదలు పెడతారో అప్పుడు అభివృద్ధి కి బాటలు వేసుకుంటారు .కాని అలా ఆలోచించే వారు గా వుండటం నాయకులకి ఇష్టం లేదు ..., కళ్ళు ఉండి చూడలేక, చేతులు ఉండి పని చెయ్యలేక, సోమరులు, బతుకంటే ఏమిటో ... బతకడం చేతాకని .దద్దమ్మలు నాకు అవసరం అని తన కోరిక ను వెల్లడించాడు ...చైతన్యం ఉన్న చోట ఎపుడు ప్రశ్న ఉదయిస్తుంది ....కదా అందుకు ...జనాలు చైతన్య దిశా గా అడుగులు వెయ్యడం ఇష్టం లేదు ...అవే కింది వాక్యాలలో చాల బలం గా వ్యక్తీకరించారు చూడండి... కళ్లుండి చూడని జనాలు,//మెదడుండి ఆలోచించని జనాలు,//కాళ్లూ చేతులూ వుండి//పనిచేయని సోమరి జనాలు.//బతుకంటే ఏంటో తెలియని జనాలు,//బతకడం చేతకాని జనాలు, ఇంకో తరాన్ని పుట్టించలేని నపుంసక వ్యక్తిత్వాన్ని అలాగే తానూ చెప్పినట్లు వినే బసవన్నల్లాంటి జనాలు కావలి ... బీజమూ లేక, అండమూ రాక//కొత్త సృష్టికి నోచుకోలేక, ఆవిరైపోయే//నపుంసకుల్లాంటి జనాలు కావాలి. నేననుకొనెట్లు మాత్రమే ఆడగల//బొమ్మల్లాంటి జనాలు కావాలి నాకిప్పుడు. క్లైమక్ష్ లో ఇలాంటి సరుకు (జనాలు ఎప్పుడు సరుకు వస్తువు లంటే వారు కదా) ...నేను కొనుక్కోవాలి ఎంత మంది దొరకొచ్చు ...ఓ వంద కోట్లు ..అంటే భారత దేశం లో ఉన్న ప్రజానీకం అన్నమాట... కవిత ఆసాంతం కూడా చాల చక్కగా వ్యంగ్యం గా సాగిపోతుంది ..నాకు ఒక విషయము లో అర్థం కాలేదు ...కవి గారి ఉద్దేశం ప్రకారం 100 కోట్ల ప్రజలలో కొద్ది మందికి అయిన కూడా చైత్యన్య వంతులు లేరా ? (చదువుకున్న వాళ్ళు ఓటు ని దూరం గా పెట్టటం కూడా ఒక కారణం ? కావొచ్చు )...., చదువుకున్న తెలివిగల సమూహం కూడా మౌనం గా వుంటే ఇదే జరుగుతుంది ఏమో ...ఏది ఏమైనా చక్కని కవిత ను అందించిన భాస్కర్ గారు అబినందనీయులు ...వారు ప్రతి విషయాన్ని కొత్త గా చెప్పటానికి ప్రయత్నిస్తారు ...తీసుకున్న వస్తువు సమకాలిన అంశానికి ప్రతికలే ...ముందు మనం మన ఆలోచన మారితే ...దేశానికి బాగుటుంది. వ్యంగ్యం గా చెపుతూ ...వ్యవస్థ లో ని లోపాన్ని ..మారవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు ....మంచి కవిత ను అందించిన భాస్కర్ కొండ్రెడ్డి గారి కి ధన్యవాదాలు ... ==== నా కిప్పుడు జనం కావాలి. పల్లకీలో ఎక్కించి,.ఒహోం ఒహోం అంటూ మోసుకెల్లే బలిసిన భుజాల్లాంటి జనాలు. రెండు మెతుకులు కూడు కోసం, కుక్కల్లా కాళ్లు నాకే విశ్వాసం గల జనాలు. పొదుగుల నుండి రక్తం పిండుతున్నా ప్రతిఘటించడం చాతకాని బర్రెల్లాంటి జనాలు. రెండు కాగితాలకు, ఓ క్వార్టర్ మందుకో తనను తానమ్ముకునే వేశ్యల్లాంటి జనాలు, నాకిప్పుడు జనం కావాలి. గాడిదల్లాంటి, గొర్రెల్లాంటి, పాముల్లాంటి, నక్కల్లాంటి ఇంకా ఇంకా కొన్ని జంతువుల్లాంటి జనాలు అసలు నేను మనిషిననే సంగతే మరిచిన జనాలు మనిషనేవాడిని తలుచుకోవాలంటేనే, సిగ్గుతో తలలొంచుకునేటట్లు బతికే జనాలు. నాకిప్పుడు జనం కావాలి. కళ్లుండి చూడని జనాలు, మెదడుండి ఆలోచించని జనాలు, కాళ్లూ చేతులూ వుండి పనిచేయని సోమరి జనాలు. బతుకంటే ఏంటో తెలియని జనాలు, బతకడం చేతకాని జనాలు, నాకిప్పుడు జనం కావాలి. బీజమూ లేక, అండమూ రాక కొత్త సృష్టికి నోచుకోలేక, ఆవిరైపోయే నపుంసకుల్లాంటి జనాలు కావాలి. నేననుకొనెట్లు మాత్రమే ఆడగల బొమ్మల్లాంటి జనాలు కావాలి నాకిప్పుడు. 2 ఓ ఆర్డర్ కి సప్లైయ్ చేయాలి. ఎంత మంది దొరకచ్చిక్కడ? షుమారుగా ఓ వంద కోట్లు! అంటూ చక్కని ముగింపు ఇచ్చారు .. ఓ ఆర్డర్ కి సప్లైయ్ చేయాలి. ఎంత మంది దొరకచ్చిక్కడ? షుమారుగా ఓ వంద కోట్లు! ఏప్రిల్ 23, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rhAuDb

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

ఒక భావ తరంగం ................................. చరిత్ర అఘాయిత్యాల అగాధం తవ్వి చూస్తే నెత్తురు పీల్చిన మట్టి పెంకుల సొరంగం చరిత్ర కొందరి అమానుషాల అమానత్ ఒకరి సౌధం కూల్చిన రాళ్లతో మరొకరి దుర్భేద్య దుర్గం చరిత్ర భూగోళం నుండి ఖగోళానికి వేసిన చిక్కుముడి విప్పడానికి యుగాల తరబడి కొనసాగుతున్న యత్నావళి చరిత్ర అభిమతాల విత్తులు చల్లి మతాల మొక్కల్ని పెంచి మనుషుల మధ్య పెంచుతున్న దూరం చరిత్ర కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో కలిసి చేసుకున్న ఒడంబడిక మనిషి శిల్పం ఇంకా అసంపూర్ణం 'వాధూలస'23/04/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ppj61y

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

మనసే లేని నాకు మనసుని పరిచయం చేసావు ప్రేమే తెలియని మనసుకి ప్రేమగా పలకరించావు నాకోసమే వచ్చిన ప్రేమను స్వీకరించనా స్వీకరించిన ప్రేమే సర్వస్వమై నీకోసమే వస్తే విధి నీకిది తగదని వారిస్తే ఎదురు తిరగానా భీరువులా తలవంచనా ... ప్రతిదీ ప్రశ్నలే కదా నీకొరకై నీ వస్తే నాకోరకై వేచి వుందువా ఇన్ని ప్రశ్నలలో నేను ప్రశ్న లా మిగల వలసిందేనా నా భావం అర్ధం అయితే ఆస్వాదించు ఆసలు అర్ధమే లేదనుకుంటే తిరస్కరించు .. నా ప్రాణమా !!పార్ధ !!22apr 14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fmPE2z

Posted by Katta

Kapila Ramkumar కవిత

ఈ పీఠీకలు సాహిత్య వాటికలు Posted on: Mon 21 Apr 01:53:59.260211 2014 ప్రపంచ సాహిత్య పరిణామ క్రమాన్ని పరికిస్తూ, దిశదశలను దర్శిస్తూ, సైద్ధాంతిక భూమికతో కూడిన లక్ష్యాలను శ్వాసిస్తూ, నిర్ధిష్ట మార్గాన్వేషైన నిరంతర సాహిత్య సాధకుడు కె.శివారెడ్డి. కవిత్వమే జీవితంగా జీవితమే కవిత్వంగా అక్షరాల్ని ఆయుధాలు చేస్తున్న కవి ఆయన. శివారెడ్డి కవిత్వం మహోజ్వల అగ్నిధార. వచనం మహోద్వేగ జలపాతం. ఇప్పటికీ తనకు తాను తన శబ్ధ ప్రపంచంలో తన ఆత్మశైలిని కొత్తగా పునర్‌ నిర్మించుకుంటూ, క్షిపణి లాంటి వాక్యమై జనిస్తుంటాడు. కవిత్వంలోకి అడుగిడిన ఈయన తొలి దశలో సమీక్షలు రాసి ఉండవచ్చునేమో గాని, కవిగా పరిణితి చెందిన తరువాత, సాహిత్య ప్రక్రియల్లో కవిత్వం తప్ప మిగిలిన ప్రక్రియల జోలికి వెళ్లినట్లు అగుపించరు. ఆయన శ్వాస ధ్యాస కవిత్వంగానే కనిపిస్తుంది. యువ కవులను, నవ కవులను ప్రోత్సహించడానికయితేనేమి, మోమాటానికైతేనేమి, స్నేహిత ధర్మానికైతేనేమి - దాదాపు 86 పుస్తకాలకు పీఠికలు రాశారు. ఈ పీఠికలు ఆషామాషీగా రాయకుండా, మూడు దశాబ్దాలుగా తెలుగు కవిత్వంలో వచ్చిన పరిణామక్రమాన్ని తీవ్రతను, ప్రపంచ సాహిత్యంతో సరిపోల్చుకుంటూ, చర్చిస్తూ, హెచ్చరిస్తూ విప్లవ కవిత్వ భూమికను తెరపైకి తెస్తూ నిర్మొహమాటంగా రాశారు. ఒక్కొక్క పీఠికను ఒక్కొక్క సాహిత్య వ్యాసంగా పరిగణించవచ్చు. ఈమధ్య పెన్నా శివరామకృష్ణ, గుడిపాటి సంపాదకత్వంలో 'శివారెడ్డి పీఠికలు' అనే సంపుటి వెలువడింది. ఈ పీఠికలన్నీ 1976 - 2010 మధ్య రాసినవి. ఈ ముందు మాటల్లో ఏ కవినీ అభిమానించి, ప్రోత్సాహం మిషతో గోరంతలు కొండంతలుగా చెప్పడం కనిపించదు. అలాగని కవిని కించపరచడమూ, డిస్క్‌రేజీ చేయడమూ ఉండదు. కవిత్వంలో చేరాల్సిన లోతుల్లోకి చేరలేకపోయినా, ఎదగాల్సిన ఎత్తుల్లోకి ఎదగలేకపోయినా, సైద్ధాంతిక పరంగా జాగిపోతున్నా, నిబద్ధత, నిజాయితీ, స్పష్టత లోపిస్తున్నా శివారెడ్డి తన ముందుమాటలో సునిశితమైన సూచనలు చేశారు. సందర్భోచితంగా బాగా రాసే ప్రపంచ కవుల్లో తగిన వారిని 'కోట్‌' చేస్తూ వివరణలిచ్చారు. ఆయన ముందుమాట కవికి కచ్చితంగా ఒక పాఠం. ఆయన పీఠికలో కవికి చేసే హెచ్చరిక ఎలా ఉంటుందంటే 'ఈరోజు కవిత్వాన్ని ముట్టుకోవడం అంటే అగ్నిని ముట్టుకోవడం. ఒక బాధ్యతని నెత్తిన వేసుకోవడం. ఒక బరువును జీవితాంతం మోయడం. అనంత వైవిధ్యంతో కూడిన జీవితాన్ని దాని అనేక ముఖాల్ని అంశాల్నీ తెలివిడితో వ్యక్తీకరించడం'లా ఉంటుంది. 'మన జీవితాన్ని శాసించే రాజకీయం అర్థం కాకుండా, ప్రజా రాజకీయాలు అర్థం కాకుండా, జాతీయ అంతర్జాతీయ స్థితి అంతుబట్టకుండా, నీదైన ఒక రాజకీయ వైఖరి, ప్రాపంచిక దృక్పథం అలవడకుండా- అందులోంచి చూసి, బతుకును విశ్లేషించకుండా ఎవరేని ఒక మంచి కవిత రాస్తారని నేననుకోను' అంటారు శివారెడ్డి. కవికి సొంత గొంతుక అవసరమనే అంశాన్ని దృఢంగా వ్యక్తీకరిస్తూ- 'కవి సొంత గొంతుకతో ఉనికి వ్యక్తిత్వం సంపాదించుకోవాలి. సూటైన, పదునైన, నిజాయితీ గల, నిబద్ధమైన, స్పష్టమైన గొంతుక, సైద్ధాంతిక భూమికాసారంలో చక్కని కవిత్వాన్ని వెదజల్లుతున్న గొంతుక, ఆచరణ బద్ధమైన ఆలోచనలతో తీవ్రమవుతున్న, హరితమవుతున్న గొంతుక కావాలి' అంటారు. కవి వాడిన పదాలు, పద చిత్రాలు పరిశీలించినట్లయితే, కవి ఎంత మెలుకవగా ఉన్నది, ఎవరి పక్షాన నిచిలి ఉన్నది, ఎవరి కోసం పోరాడుతున్నది, అతని ఊహ ఏమిటి? వ్యక్తిత్వం ఏమిటి? అంతా బోధపడుతుంది. ఎంత కాలాన్ని కవిత్వం కోసం కవి ఖర్చు పెట్టిందీ తెలుస్తుంది.' అంటాడు. 'ఈనాడు విప్లవ చైతన్యంతో వస్తున్న కవిత్వమే ప్రధాన స్రవంతిగా భావించాలి. బహుశ ఇదే ఇతర అన్ని రకాల కవిత్వాన్ని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నిర్ధేశిస్తుంది. సైద్ధాంతిక నిబద్ధత విడనాడకుండా చాలా గొప్పగా వైవిధ్యం ప్రదర్శించవచ్చు. ఒక సైద్ధాంతిక భూమిక నుంచి తనదైన ప్రాపంచిక దృక్పధం నుంచి ప్రపంచాన్నీ జీవితాన్ని విశ్లేషిస్తూ కవిత్వం నడవాలి' అంటూ తాను నమ్మి నడుస్తున్న కవితా మార్గాన్ని తన పలు పీఠికల్లో వ్యక్తీకరిస్తాడు శివారెడ్డి. 'మార్క్సియన్‌ ప్రాపంచిక దృక్పథం నుంచి ప్రపంచాన్ని దర్శిస్తున్న కవి దేన్నీ వదలడు. విధ్వంసానికి కారణభూతములవుతున్న అనేకానేక అంశాల్ని పలు కోణాల్లో దర్శించి విశ్లేషిస్తూ తనదైన అనుభవం నుంచి, దృక్పథం నుంచీ జీవితాన్ని విడమర్చుకుంటూ పోతాడు. తన రక్తంలోంచి జన్మించే పద్యం కోసం కవి అహర్నిశలూ ఆరాటపడతాడు. అధ్యయనం చేస్తాడు. దగ్ధమవుతాడు. ఆ దగ్ధంలోంచి పుటం పెట్టుకుని స్వచ్ఛమైన కవి బయటకు వస్తాడు..' అంటూ కవి రాటుతేలి బయటకు వచ్చే వైనాన్ని విప్పి చెప్తాడు శివారెడ్డి. 'మధ్య తరగతి జీవితంలోంచి వచ్చిన కవులు ఒక 'కన్‌ఫ్యూజన్‌'లోకి, ఒక సైద్ధాంతిక డొల్లతనంలోకి, జీవన నిష్క్రియాశూన్యంలోకి, ఒక ఆధ్యాత్మికవాదంలోకి నెట్టబడుతుంటారు. వారు జాగ్రత్త పడకపోతే కవిత్వం 'డి హ్యూమనైజ్‌' అవుతుంది.. గమనించండి...' అంటారు. కవిత్వం ఆత్మక్షేత్రం మధ్య ఎర్రగా పూసి అక్షరంలా బయటకు వస్తుంది. 'రాజ్యానికి మింగుడుపడని, రాజ్యవిచ్ఛేదక కవిత్వం రాయడమంటే ప్రజా రాజకీయాల కవిత్వం రాయడమే'నంటారు. మారుతున్న కాలాన్ని కవి గమనించాలి. వివేచనతో, వివేకంతో, లోచూపుతో ప్రజల భాషను 'ఫిల్టర్‌' చేసుకొని, సొంతం చేసుకొని కవిత్వంగా పరివర్తనం చెందేట్లు చేస్తాడు కవి.. ఏ ప్రక్రియలో కవిత్వం రాసినా కవిత్వానికి ఒక సామాజిక దృక్కోణం ఒక సామాజిక ప్రయోజనం, ఒక దిశానిర్ధేశం, నైర్మల్యం, జీవద్భాష ఉండాలి. కవి గురి కాలం మీదే ఉండాలి. కాలమే అతని ఊపిరిగా సాగిపోతుండాలి. కవిత్వం ఎప్పుడూ అమానవీకరణకు గురి కాకూడదు.' 'కవిత్వం దాన్నదే పరిచయం చేసుకోవాలి గాని మధ్యలో మరొకరు తన ఉద్ధేశాలను అనుసంధించి చదువబోయే కవిత్వం గురించి నాలుగు మాటలు సర్టిఫికేట్లు అవసరమా?' అంటూ ముందుమాటలు రాయించుకోవడం మీద ఒక అసంతృప్తిని శివారెడ్డి వెల్లడించారు. 'ముందుమాట కవికి ఆత్మస్థయిర్యాన్నివ్వాలి పొగడ్తల పూలదండలతో కవిని ఊరి తీయకూడదు.' అంటాడు. ప్రజా వ్యతిరేక పంథాలను ప్రోత్సహిస్తూ తళుకుబెళుకులతో సాహిత్యం చూరుబట్టుక వేలాడుతున్న ముక్కిడి భావాలను ఖండిస్తూ సైద్ధాంతిక నిబద్ధతతో విప్లవ చైతన్యంతో కూడిన ప్రజా సాహిత్యానికి శివారెడ్డి పీఠికల్లో పెద్ద పీట వేశారు. రెండు కథా సంపుటాలు, రెండు పాటల సంపుటాలకుు రాసిన పీఠికలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఆధునిక కవిత్వం ఆర్ధ్రత పొరలు తొలుచుకొని లోపలికెళ్లే మార్గాన్ని, దానికి కావాల్సిన చూపును శివారెడ్డి పీఠికల్లో వెతుక్కోవచ్చు. కొందరు కవులు ఆధునికానంతర వాదం ముసుగులో నైరాశ్యం, ఆత్మవిధ్వంసనం, తాత్వికపరమైన బోలుతనంతో మార్కి ్సస్టు భావజాలాన్ని ధ్వంసించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు మానవ సమూహాల నుంచి విడిపోతూ, విరిగిపోతూ వ్యక్తులు, అవ్యక్తులుగా మారే ప్రమాదం ఉందంటారు శివారెడ్డి. సమాజంలో అధిక సంఖ్యాకులైన అట్టడుగు వర్గాలు తలెత్తుకు నిలబడేందుకు బిగుతునిచ్చే వెన్నుదన్నైన సిద్ధాంతాన్ని పట్టుకుని, కవిత్వ విస్తృతికీ, విశాలత్వానికీ, ఒక గొప్ప ఆశ, ఆకాంక్ష, స్థితప్రజ్ఞతో, ఆరాట పోరాటాలతో, స్వీయాత్మతో సామూహిక ఆత్మని అనుసంధానం చేసుకుంటూ ముందుకుపోయే చైతన్యం ఈ పీఠికల్లో కనబడుతుంది. ఈ పీఠికలు వెలుగు చూసేందుకు సహకరించిన గుడిపాటి, పెన్నా అభినందనీయులు. ఈ పీఠికలు సాహిత్య లక్ష్యాన్ని, మార్గాన్ని నిర్ధేశించుకునే చైతన్యాన్ని నవ కవులకు, యువ కవులకు కలిగిస్తాయి. దశాబ్దాల సాహిత్య పరిణామక్రమాన్ని అర్థం చేసుకోడానికీ ఉపకరిస్తాయి. - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి 9948774243 http://ift.tt/1f38ilg

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fmNaBi

Posted by Katta

Srinivas Vasudev కవిత

త్రిశూలమూ అగ్నిపర్వతమే!// వాసుదేవ్// --------------------------------------- క్షమించేసేయ్ రామా! నా అన్నదమ్ముల్నీ, అక్క చెల్లెళ్లన్ని క్షమించేసేయ్ అజ్ఞానపు మాటల అస్పష్ట నినాదాల్నీ ఆవేశపూరిత అసందర్భపు ప్రేలాపల్నీ క్షమించేసేయ్! కాశ్మీరీ పండింటింట్లో భర్తముందే బట్టలూడదీయబడి మానాన్ని కాపాడుకోవాల్సిన చీరతోనే ప్రాణాన్ని తీసుకున్న అక్కలెందరో........ క్షమించేసేయ్ రామా! ముష్కరుల్ని వారి పాపానికి వారినొదిలేయ్ అక్కడప్పుడు పారింది సింధూరపు ఎర్ర రక్తమే కాళ్ల పారాణినీ ఎండనివ్వలేదు వారెవ్వరూ మత మౌఢ్య సం'గతు' ల్తో గతి తప్పిన వారినీ... దమ్ములేక జమ్మూలో తల్లి వక్షాన్నే కోసుకునే వీరులందరూ పరాయిదేశపు పచ్చ జెండానెగరేసుకునే వారినీ... క్షమించేసేయ్ రామా! క్షమించేసేయ్ వారిపాపం వారిని 'హరిం'చకమానదు హరీ! హరీ! వీరికెవ్వరు నిజాలు చెప్తారు ఇదిగో ఇలా జ్వరప్రేలాపనలోనో వావివరసలు మర్చి చలించినప్పుడో వారించలేకనేగా భాస్వరపు వర్షంలో పశ్మిమాసియాని తుడిచిపారేసావు ---ఇప్పుడక్కడ ఓ మొక్కా మొలవదూ ఓ అక్కా చీర కట్టదు మరే బంధపు మొలకా మొలకెత్తదు క్షమించేసేయ్! రామా! నా భ్రాతులందరూ విజ్ఞులే! సత్యం చిరునామాకై వెతుకుతారు నీ దగ్గరకు రాకామానరు. ఆ త్రిశూలాగ్నిలో వారు పునీతమవుతారు త్రిశూలమంటే వీరికెరుకనా? సత్యం-శివం-సుందరమేగా ఆ మూడు మూర్తులూనూ ప్రేమించేది, లాలించేది, దేవుణ్ణి సత్యంగా చూపించేది త్రిశూలమే.... అదే మనిషి అదే దైవమూనూ నిజమే దైవమైనప్పుడు మూర్ఖత్వపు శృంఖలాలనుంచి విముక్తెప్పుడో! ఎప్పుడో!

by Srinivas Vasudev



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jFOHoA

Posted by Katta

Girija Nookala కవిత

దరిద్ర నారాయణుడు మీ దారిద్ర్యమే మా మహా భాగ్యము మీవ్యసనాలే మా కల్పవ్రుక్షాలు మీకు పోసే మందు మాకు ఐదేళ్ళకు రక్ష మీకు ఇచ్చే నోటు మా అవినీతికి ఆసిశ్శులు మీ డబ్బు మీకు ఇచ్చి ఔదార్యము చూపిస్తాం కుల మత గోడలు కట్టి ఆప్యాయత ఒలికిస్తాం ప్రజలకు ఎన్ని కలలు,నాయకులకు ఎన్ని కల్లలు ఎన్నికల జాతరలోని ఎన్నెన్ని వింతలు! దరిద్ర విశ్వరూపం రాజకీయ రాక్షసుడి పదవి మోక్ష మార్గం ఐదేళ్ళకొకసారి దరిద్రుడే నారాయణుడు భుక్తుడే భక్తుడు. ప్రాణ మాన ఆస్ఠులు హరించే ప్రజాహంతకులు పాలన మరచి బరితెగించి దోచుకునే బందిపోటు దొంగలు మతం కులం జాతి పేరుతో మనసులు చీల్చే నాయక రూప కరటక దమనులు. ప్రజాస్వామ్యం పరమ విచిత్రం స్వాములైన ప్రజలు నిత్యదరిద్రులు దాసులైన ప్రతినిధులు నిధులకు వారసులు ఎన్నికలు మాయ ప్రజల రాజ్యం మిధ్య రాజనీతిలో నీతి, నేతి బీరలో నెయ్యి. మేలుకో ఓటరా మేలుకో, నోటు చూసి,కల్లు తాగి,దిమ్మతిరిగి మీటనొక్కి కల్లు తాగిన విశ్వాసానికి అవినీతికి విత్తునాటి వేళ్ళు ఆనిన వట వ్రుక్ష చేదు ఫలం స్వయం క్రుతం ఓటు వేసిననాడు తెలివి చూపలేదని వగచి ఏడ్చి లేదు లాభం నీతివంతుడికి పట్టం కట్టు మంచి కోసం జల్లెడపట్టు యధా ప్రజా థదా రాజా ఏక్ దిన్ కా సుల్తానువి ఓటు చక్రాయుధ ధరుడవి నీ విచ్చక్షణే నీకు రక్ష.

by Girija Nookala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1flG5Rs

Posted by Katta