పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Raghothama Rao C లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Raghothama Rao C లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జులై 2012, శనివారం

రఘోత్తమరావు సి॥చిగురింత॥

ఎందుకో ఒక్కోసారి బ్రతుకంటేనే
చీదరపుడుతుంది
నరనరాల్లోనూ పాకుతూ, పారుతూ
అదే రక్తం
పొద్దున వెళ్ళిన దారిలోనే
రాత్రికి మళ్ళిపోయే పయనం
పాత మొహాల్లో మారని కవళికలు
విసుగు....విసుగు

ఒకరోజున
కుంటివాడి ఊతకర్రను చూసాక
మోడువారిన చెక్క ముక్కలాంటి
జీవితం
కొద్దికొద్దిగా చిగురించింది!
*13.7.2012