పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Saif Ali Gorey Syed లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Saif Ali Gorey Syed లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, మార్చి 2014, ఆదివారం

Saif Ali Gorey Syed కవిత

ఎప్పటికీ మనం ఇంతే .. a poem by GOREY SAIF ALI 1. నిన్ను నేను పోగోట్టుకోలేదు నువ్వు నన్ను వదిలి వెళ్ళలేదు జస్ట్ నువ్వు నా ఎదురుగా అలా చెట్టుకొమ్మల్లో వెళ్ళిపోయావ్ అంతే . 2. నిన్ను నేను ఏ రాత్రి వదిలిపెట్టలేదు నువ్వు నన్ను ఏ రాత్రి వదిలిపెట్టలేదు జస్ట్ మన మధ్య అలా మేఘాలు వచ్చి పోతున్నాయి అంతే. 3. నేను నిన్ను ఇంకా అర్ధం చేసుకోలేదు నువ్వు నన్ను అర్ధం చేయించే ప్రయత్నం చెయ్యడం లేదు జస్ట్ నీ పాటేదో అలా నా ముందుకు వచ్చి హమ్మ్ చేసి వెల్తుంటావ్ అంతే. 4. నేను నీ ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు నువ్వు నా ఇష్టమో లేదో అడగలేదు జస్ట్ నువ్వు నీ ఇష్టమొచ్చినప్పుడు నన్ను తడిపేసి వెల్తుంటావ్ అంతే. 5. నువ్వు ఇటువైపు లేవని బెంగ లేదు నేను అటువైపు లేనని బాధలేదు జస్ట్ గోడేదో అడ్డమున్నా కాని ఎక్కడో ఖుషి ఖుషిగా అల్లుకోపోతావ్ అంతే. 6. నేను నీ గురించి ఏమనుకుంటానో నువ్వు నా గురించి ఏమనుకుంటావో నాకు తెల్వదు జస్ట్ ప్రపంచం మనిద్దరి గురించి ఎంతో అనుకుంటది అంతే 7. నువ్వు వేరు నేను వేరు అయినా కలవక తప్పదు జస్ట్ పీచు మిఠాయి అయిపోయాక నన్ను పారేస్తారు అంతే. 8. నువ్వు కనిపించకడం లేదే అని నేను వెతకడం లేదు నా కోసం నువ్వు కనిపించాలనే ప్రయతం చెయ్యడం లేదు జస్ట్ నీ స్థాయిలో నువ్వు నన్ను ప్రేమించుకుంటూ వెల్తున్నావ్ అంతే .

by Saif Ali Gorey Syed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e552TJ

Posted by Katta

25, ఫిబ్రవరి 2014, మంగళవారం

Saif Ali Gorey Syed కవిత

ఖమ్మం జిల్లా కు చెందిన కవులకు అద్భుత అవకాశం నా దర్శకత్వం లో లవ్ ఇన్ ఖమ్మం LOVE in KHAMMAM cinema తయారవుతున్న విషయం మీ అందరికి తెలిసిందే. ఈ సినిమాకు ఖమ్మం జిల్లా చరిత్ర మీద రచించిన జానపద శైలి లో పాటలు కావాలి ఈ సినిమాకు బేషరముగా పాటలు రాసే ఆసక్తి ఉన్న కవులు బేషరముగా నన్ను సంప్రదించగలరు director@aimwonders.com www.filmywonders.com

by Saif Ali Gorey Syed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cM2hGd

Posted by Katta

20, ఫిబ్రవరి 2014, గురువారం

Saif Ali Gorey Syed కవిత

కవి అంటే ఎవడు? poem by GOREY SAIF ALI \u003C3 కవి అంటే ఎవడు రెక్కలున్న పక్షిలాంటోడు ఆఫ్రికాలో చెట్టైనా ... అమలాపురం లో కొమ్మైనా తనదే అనుకునే వాడు . కవి అంటే ఎవడు సరిహద్దురేఖలను పట్టించుకోకుండా... చల్లని వెన్నెలకన్నా గోప్పదైనాదేదో ప్రపంచానికి ఇచ్చేవాడు. . కవి అంటే ఎవడు పుట్టిన చోటనే బురదగుంటలా ఉండి పోకుండా పాయలు పాయలుగా మారి నలువైపులా పచ్చదనానికి జీవం పోస్తూ పారే జీవ నది లాంటోడు . . కవి అంటే ఎవడు ? ఏ రంగు తుమ్మేదవాలినా లేదా ఏ వర్గపు చచ్చిన మనిషి శవం పైన ఐనా తన పరిమళం లో మార్పు రానటువంటి సుకుమారమైన పువ్వులాంటోడు. . కవి అంటే ఎవడు ఒక ప్రాంతానికి రాజు లా కాకుండా ప్రతి పాపాయికి నచ్చే ఆకాశం లో తారలాంటోడు. . కవి అంటే ఎవడు? ప్రాంతాలను పట్టించుకోకుండా ఎక్కడ ప్రేమ లభిస్తే అక్కడ తన హృదయాన్ని వర్షించే మేఘం లాంటోడు. . కవి అంటే ఎవడు మెదడుకి గుండేకి మధ్యలో మంచి రక్తాన్ని మోసే నరం లాంటోడు. . కవి అంటే ఎవడు? ఎంతో మంది బాటసారులకు లక్ష్యానికి చేర్చే రహదారి చౌరస్తా లాంటోడు. . కవి అంటే ఎవడు ? చినిగిన అమ్మ చీరను అతుకులు వేసే సూది లాంటోడు. . కవి అంటే ఎవడు ? సీసానుంచి బయటకు రాగానే అనంతమయిన గాలితో కలిసి అనంతుడిగా మారిపోయే అత్తరు లాంటోడు. . కవి అంటే ఎవడు? మనసులని కలిపే పెదాలపైన చిరునవ్వులాంటోడు. . కవి అంటే ఎవడు? మనుషుల్ని కలుపుకుంటూ మనుషుల్లో మనిషి గా బతికే దేవుడు

by Saif Ali Gorey Syed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eXML6F

Posted by Katta

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Saif Ali Gorey Syed కవిత

ఒక రోజు తప్పక వస్తుంది* poem by గొరే సైఫ్ అలి ఒక రోజు తప్పక వస్తుంది అది ఎంత దుఖభరితంగా ఉంటదంటే బాబ్రి మసీదు కూల్చిన రోజు కలిగిన సంతోష స్థాయికి మించి న దు:ఖం 2 అది చాలా సమీపం లో ఉంది బైబిల్ లోనో ఖురాణులో నే చెప్పిన ప్రళయ దినానికన్నా ముందుగానే చాలా దెగ్గరలో ఉంది ఆరోజు 3 విదేశి కంపేనీలు అన్నీ మన నదీ జలాల నుంచి మనల్ని అన్ని రంగాల్లో అన్ని రకాలుగా దోచుకోవడనికి ఇంకేం మిగల్చని రోజు 4 పిచ్చి నాయకుల రధ యాత్రల్లో అలసిన భక్తులకు సొంత దేశం లో గుక్కెడు మంచి నీళ్ళు దొరకని క్షణాల్లో ఆరోజు అసలైన దేవుడు కనిపిస్తాడు. 5 అప్పుడు తప్పక తెలిసి వస్తుంది ఎవరో మన వాళ్ళే మనకు తప్పు దారి పట్టించారని , సొంత గడ్డ బిడ్డలైన దళితులని ,ముస్లింలని అనుమానిస్తూ ద్వేశిస్తూ అసలు కాల్చెయ్యాల్సినవేమిటో వదిలేసి సొంత సొదరులని కాల్చేసుకుంటూ నరికేసుకుంటూ వచ్చామని 6 .అప్పుడు ఆ రోజు తెలుస్తుంది మనల్ని ఈశాన్యపు రాష్త్రాలో తూర్పు పశ్చిమ దక్షిణాది రాష్ట్రాలో ఇతర భారతీయ భాషా ప్రాంతీయ వాసులో తెలంగానా ఆంధ్రా వాళ్ళో కాదు మనల్ని ఒకరికొకరం దోచుకోలేదని ఇంకెవరో దోచుకున్నారని . 7 .అప్పుడు ఆ రోజు తెలుస్తుంది శవానికి మాత్రమే సొంత కోడుకులు చితి పెట్టడం ఆనవాయితి ఈ దేశం లో కానీ, పచ్చని దేశానికి మతం పేరు తో వాడలు ఊర్లు అన్నీ కలిపి ఉంచిన దేశానికి చితిపెట్టడం కూడా జరిగిందని భరత మాత అస్థికలు ఏరుకునే రోజు తెలుస్తుంది 8 రేపటి ఆరోజు పిల్లలు నేటి తమ తండ్రులు ఓటేసిన మూర్ఖత్వానికి తాము విలువైన దేదో కోల్పోయామని తెలుసుకుంటారు 9 ఇప్పటి తరానికి దమ్ములేకపోయినా రేపటి తరం తప్పక అసలైన జాతిగా బతికెందుకు ఓ విప్లవం సహాయం తీసుకుంటది 10 ఆకుపచ్చ జెండానో కాషాయపు జెండానో పట్టకుండా మరో వర్ణపు జెండాతో కాంక్రీటు అరణ్యాలలో ఓ విప్లవం తెస్తారు . ఆరోజు భారత రత్న పొందిన మహాత్ముల సంతోషానికి మించి భగత్ సింగ్ ఆత్మ సంతోషిస్తుంది

by Saif Ali Gorey Syed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bSWBdk

Posted by Katta

8, ఆగస్టు 2012, బుధవారం

సైఫ్ అలీ || ట్రోపోస్ఫేర్ హని ||

1
అవివాహిత సమయం ఆపుకున్న వేళ
గుండే అలారాల జుగల్ బంది మొదలవుతుంది

2

ఆదివారం పాఠశాల ప్లేగ్రౌండ్లో
రెండు తుమ్మేదలు ఎప్పుడూ ఎగురుతుంటాయి


3
చీకటి దారిలో పెద్ద గుంట లాంటి ఓ గంట సమయం .
పాతాలం లో ఉన్న గోపురం
తలెత్తుకుని గర్వంగా పిల్లగాలులకు ఊగుతుంటది .

4

అంతలో నే
గోడమీదున్న ఆకాశం లో
చీకటి వచ్చి కూర్చున్న ప్రతిసారి ..
అందుబాటులో ఉన్న మౌనం తో
తరిమే ప్రయత్నం


5

గాలి నింపుకుంటూ ప్రతీక్షణం
జీవితం ఎగరేస్తూ ఎగరేస్తూ ..

6

సమీపం లో ఎవరో ఏవో శబ్దాలు చేస్తున్నా
భూమినుండి భూమికి చాలా దూరంలో పట్టించుకోని ప్రవాహం
5

సూర్యుడిని ఎవరో ఖూని చేస్తే వచ్చిన నల్లటి రక్తం అది
మరింత చిక్కగా సమయాన్ని మింగేస్తుంది

7
శ్వాస వెనక్కు వెల్తూ ముందుకు వస్తుంది
ఏవో సంఖ్యలు ఆజ్ఞాపిస్తుంటే
మారువేషం లో ఉన్న వేషాలన్ని వెలుగుతున్నాయి


8
లోయ లో ప్రార్ధన చేస్తున్నా భక్టుడేవరో
మౌనంగా ప్రార్ధన చేసి వెనక్కు వచ్చేస్తాడు


9
దేవతా వస్త్రాల మీద
రెండు తేనే టీగల తేనే లోని బ్యాక్టీరియాల సంగమం.
*08-08-2012