పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Murthyraju Adluri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Murthyraju Adluri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఏప్రిల్ 2014, శనివారం

Murthyraju Adluri కవిత

[మూర్తిరాజు అడ్లూరి]ఒక్క మగాడివి ఐనందుకేనా? -------------------------------- శారీరకంగా నేను నీకంటె బలహీనురాలను గావచ్చు బుద్ధి బలములో నేను నేకంటె ఎక్కువే గదా నీ కఠిన వాక్కుఠార ధార నా చల్లని పిక స్వరమ్ములో తడవలేదా ప్రస్పుటమయ్యే నీ మేల్ ఐడీ కి[మేల్ ఇగొ కి] నా హృదయాన్ని మౌసు గా మార్చలేదా అసంపూర్ణ నీ జీవితానికి పరిపూర్ణత నిచ్చిన నన్ను అదిమిపెట్టకు, నాలోని చైతన్యపు చిరుతకు తిరుగ బడు అనే అలోచన వచ్చినప్పుడు నీ అడ్రస్ ప్రూఫ్ ఏమిస్తావు? ఒక్క మగాడివి ఐనందుకేనా నాకు సహన శీలి బిరుదునిచ్చి నిరంతర దహన జీవిగా మార్చినావు

by Murthyraju Adluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OSAtH5

Posted by Katta

22, మార్చి 2014, శనివారం

Murthyraju Adluri కవిత

భగత్ సింగ్ [మూర్తి రాజు అడ్లూరి]23/3/2014 ------------- భగత్ సింగ్ ఇతడు భగత్ సింగ్ ఇతడు భగ భగ మండె అగ్ని కీల ఇతడు సామ్రాజ్య వాద కలపు వనానికి అంటిన కార్చిచ్చు ఇతడు భూర్జువా పాలకులపై దూకిన కొదమ సింగమితడు ;భగత్ సింగ్ ఇతడు; పాఠ్య పుస్తకాలలో కనిపించని పాఠ మితడు పాఠ శాలలో వినిపించని గీతమితడు బ్రిటిష్ వారి గుండెలో మ్రోగిన మరణ మృదంగమితడు ;భగత్ సింగ్ ఇతడు; నవయువుకుల్లో పరుగెత్తె వెచ్చని రుధిర ధార ఇతడు కవి కలాల్లో ప్రవహించే యెర్రని సిరా ఇతడు ;భగత్ సింగ్ ఇతడు; దురహంకార తెల్ల జాతిపై బుసకొట్టిన నాగు ఇతడు అణగార్చిన నల్లనీతిపై విసిరేసిన బాంబు ఇతడు ఆకాశములొ మెరిసిన అరుణారుణ తార ఇతడు ;భగత్ సింగ్ ఇతడు; పుట్టిన ప్రతి శిశువు ఎత్తిన పిడికిలి ఇతడు దేశం కోసం యమ పాశాన్నే ఎదిరించిన షహీద్ ఇతడు ;భగత్ సింగ్ ఇతడు; 23/3/2014 ;భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా;

by Murthyraju Adluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nNUgrB

Posted by Katta

29, సెప్టెంబర్ 2012, శనివారం

మూర్తిరాజు అడ్లూరి // నీవు ఏది పొందలేవు


అది నాదె
ఇదినాదె
అన్ని నీ ఇంట్లొ
వుండాలని
ఆశపడ్డావు
ఏది కాకుండా
నీవు వీధినపడ్డావు

స్వార్థం మూసీ కంపు
నీదేహమంత ప్రవహిస్తుంది

నీఅవాగ్దానాలే
నీగొంతులో అబద్దపు
పుండ్లు గా పుడుతాయి

స్వార్థమా నీవు ఏదిపొందలేవు

26/09/2012

మూర్తిరాజు.అడ్లూరి // ఒక్క సారి మాగూడెం వచ్చిచూడు


మానేల నీపాదాలకు
ఆక్యుపంక్చర్ చికిత్స చేస్తది
మాగాలి నీఊపిరినే గాదు
మన్సునుగూడ శుభ్రంచేస్తది

ఒక్కసారి మా ఆకు పచ్చని
చేలనిచూడు
నీ కంటికి మందు విందు

ఒక్కసారి మాచెలిమ
నీరు తాగి చూడు
నీలోని ప్రతి కణం
యవ్వనమే

నిజమా ఐతే పొదాం పద
ఆ!
వద్దు మాగూడెం నేనే గుర్తు పట్టలేను
నేను హిస్టారికల్ ప్రజెంటు లో చెప్పాను.

8, సెప్టెంబర్ 2012, శనివారం

మూర్తిరాజు అడ్లూరి // లైక్ //


ఏ డిగ్రీలు లేని కాలంలో
గుండెలలో రసవద్భాండాలు
కుమ్మరించినప్పుడు
నా అంతరాత్మ లైక్ చేసినా
నా అహం చూపుడు వ్రేలు
మౌస్ నొక్క డానికి మొరాయించింది

ఇప్పుడు గీటురాయు కాని పట్టా ఒకటి
నీపేరుకు కొక్కెంగా వేసుకున్నావు

పదవి కుర్చిపై కూర్చొని
ఏమి చెప్పినా లైక్ కొట్టుతున్నాను

అందుకే లైక్ ఒక ఒక సారి నాకు అన్ లైక్
07/0902012

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

మూర్తిరాజు అడ్లూరి //అక్షర విన్యాసం//


పుస్తకం లోని అక్షరాలు
ఏదో ఒక భంగిమలో
నర్తిస్తూనే వుంటాయి

పుస్తకానికి నారెండు కళ్ళు
అతికించినప్పుడు అక్షరాలన్ని
వింత వింత ఆసనాలతో
యోగాచేసినట్టు,
నాజూకు కొమ్మలు జిమ్నాస్టిక్
చేసినట్టు వుంటుంది

పరమాణువులు
అణువులై,పదార్థమై నట్లు
అక్షరాలు పదాలై, వాక్యాలై
రసభావ పదార్థాలైతాయి

పరమాణువు విస్పోటనం
అక్షరం మహావిస్పోటనం
అక్షరాలన్ని అద్భుతాలె
ఒక్కటెదో అత్యద్భుతంగ
నాకు అంతర్నేత్రాన్నిస్తుంది
తాను మాత్రం రూపాంతరం
చెందకుండ అన్నింటికి
రూపాన్నిస్తూ విలాసంగ
విన్యాసం చెస్తుంది

03/09/2012