పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Kontham Venkatesh లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kontham Venkatesh లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జూన్ 2014, శనివారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: ఏమి నీ సౌందర్యం..: అబ్బ ఎంత కమ్మదనమో.. నీ మాటల మాధుర్యాల తేనియ ఊటలని తెలిసి ఎంతో సంతసించాను..! అబ్బ ఎంత తీయదనమో.. నీ కన్నులు చిమ్మిన మదనుని విరి భాణాలని తెలిసి ఎంతో అబ్బురపడ్డాను..! అబ్బ ఎంత చలువో.. నీ బిగి కౌగిలిన కరిగిన కాలం చిందించిన చిరు స్వేదమని తెలిసి ఎంతో మైమరచిపోయాను..! అబ్బ ఎంత మైకమో.. నీ సోయగపు మేనును వీడిన సమీరం మొసుకుని తెచ్చిన చందనపు సౌరభాలను ఆఘ్రాణించి హతాశుడనయ్యాను..! అబ్బ ఎంత సౌకుమార్యమో.. నీ మెత్తటి చూపులు విరితూపులై సుతిమెత్తగా నా హృదయకుహారాన్ని ఆక్రమించడం అనుభవించి ఎంతో ఆనందపడ్డాను..! ఎంతై మోహమో.. నీ వన్నెలు చిన్నెలు అంబరపు అనంతకోటి తారకల మెరుపులకన్ననూ మించు కౌస్థుభ ప్రభాసమని అర్ధమై విభ్రాంతుడనయ్యాను..! ఏమి నీ సౌందర్యం.. బృందావని విహారం..!! ఏమి నీ సౌందర్యం.. స్వర్గ లోక నివాసం..!! 14/06/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lvc4Vn

Posted by Katta

6, జూన్ 2014, శుక్రవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: నువ్వు-నేను: వెక్కి వెక్కి ఏడుస్తున్నానంటావ్.. ఆగుతూ సాగుతూ పడుతూ లేస్తూ పరివేధన చెందే శ్వాసను నేను..! కన్నులు సముద్రాలను కబళిస్తున్నాయంటావ్.. ఏమీ చేయగలేని చేతగానితనమున పరవళ్ళు త్రొక్కి త్రొక్కి నీ కన్నుల జేరు గర్మజలపు నదీ ప్రస్థానమును నేను..! గుండెలు ఎగిసి పడుతున్నాయంటావ్.. హృదయపు చిందర వందరల చిద్రపు ఆరాట ఆక్రందన ఆర్తనాదమున ఉబికిన నిట్టూర్పును నేను..! క్రియా విహీనమై కళ తప్పినానంటావ్.. మనసు కడవల కొద్దీ కన్నీటిని కార్చి కార్చి వట్టిపోయి స్థానువునై శూన్యముగా మారిన అనంత అనురాగ తటాకపు ఆనవాలు నేను..! ప్రేమ నీవు అనురాగం నేను..! మనసు నీవు మమత నేను..! హృదయం నీవు స్పందన నేను..! చేతలు నీవు చేష్ఠ నేను..! కన్నులు నీవు కన్నీరు నేను..! జతి నీవు గతి నేను..! అజరామరం ఈ బంధం ఆచంద్ర తారార్కం..!! 6/6/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TmYMjn

Posted by Katta

20, మే 2014, మంగళవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: తస్మాత్ జాగ్రత..జాగ్రత..: సెక్యులర్ మతానికి కొత్త దేవుడోచ్చెను..! రజాకర్ల రక్తానికి కొత్త వన్నే తెచ్చెను..!! సెక్యులర్ పైత్యం తెరాస నశాలమునకెక్కెను..! ఓటర్ల ఆశలను పాతాళమున కుక్కెను..!! గ్రేటరు హైదరబాదే అసలయిన లక్ష్యం..! పవరు దక్కుతుందంటే పందిని నంద్యనుట కద చోద్యం..!! అన్యుల మతముల దిట్టిన అసదొద్దీను అసలయిన సెక్యులర్..! క.చ.రా. ఈ కథలను మనం విని బ్రతుకీడ్చుట ఇంకా పెక్యూలియర్..!! హతవిధి ఓ ఓటరు ఏమిటి నీ స్తితి..! వేసావా ఓటును అసలు నీకున్నదా మతి..!! సెక్యులర్ భూతం చూస్తే మళ్ళీ కమ్ముకుంటున్నది..! ఏదయినా మన మంచికే ఇక చుసుకుందాం పద లెమ్మన్నది..!! 20/05/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mQcQfZ

Posted by Katta

10, మే 2014, శనివారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: ఏవి చెలీ..: ఏవి చెలీ హిమ సమూహాల చిలిపి మందహాసాలు.. ఎవరేస్టునెక్కి గగనాన్ని చుంబించి ఎరుపెక్కెనా..? ఏవి చెలీ శీతల సమీర తుషార విలాసాల నయన మనోహరాలు.. వడగాలుల జడిన జలా జలా రాలి రాలి వాలి సోలి చిన్నబోయేనా..? ఏవి చెలీ మందార మరంద మధు సమాకలిత మధుర వాక్ ఝరీ ప్రవాహాలు.. సముద్రుని గాఢ పరిష్వంగమున పరవళ్ళ బిరబిరలు వీడి చితికిన నదీ లలామ బ్రతుకు చిత్రమాయేనా..? ఏవి చెలీ అనురాగ అత్మీయ చందన స్పర్షలు.. పాలవెల్లిని చేరి పవ్వళించెనా..? తలపున రావా..? తెలుపగ లేవా..?? 10/05/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iBWgyO

Posted by Katta

3, మే 2014, శనివారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: నువ్వేమనుకుంటే నాకేంటి..: నువ్వేమనుకుంటే నాకేంటి.. ఇక్కడ నా గుండెలో తిష్ట వేసుకున్నదే నీవు..! నువ్వేమనుకుంటే నాకేంటి.. ఇక్కడ నా శ్వాసలో ఉచ్వాసనిశ్వాసనములయినదే నీవు..! నువ్వేమనుకుంటే నాకేంటి.. అంత తేలికగ నను వదలగలవేమో నేనయితే ప్రాణాలే వదలగలను..! నువ్వేమనుకుంటే నాకేంటి.. నేను నీలో బందీయయి నేనుగ శూన్యమై చాలా రోజులే అయ్యింది..! నువ్వేమనుకుంటే నాకేంటి.. పోతావా..ఉంటావా..ఇది నీ నిరంతర సంఘర్షణ.. చావులోను నీ చేయి వదలని సడలని విశ్వాసం నాది..! నువ్వేమనుకుంటే నాకేంటి.. ప్రాణాలన్ని నీయందుంచి శిలా సదృశ్యుడనయినాను నన్నేవరూ గాయపర్చలేరు..! దిక్కున్న చోట చెప్పుకో..!! చేతనయ్యింది చేసుకో..!! 03/05/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kv00PL

Posted by Katta

2, మే 2014, శుక్రవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: నీవు..: కన్నుల ఆర్ధ్రతా చూడ్కుల నింపి ప్రణయ గీతికలు పలుకు అనురాగవల్లి నీవు..! అంబరం విడచి భువికేతెంచి భవదీయుని సన్ముఖమ్ముననే సంచరించు శీతల కౌముదీ చంద్రికవు నీవు..! వెచ్చని కౌగిలి కమ్మదనమున కరిగిన సౌందర్యపు కర్పూర తరంగం నీవు..! తమకమ్మున మైమరచి మమతల మల్లెల మాలికల డోలికలలో విహరించు నవమోహిని నీవు..! నా నీడ లోని జాఢ నీవు..!! నా తోడులోని నీడ నీవు..!! 02/05/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rLYeh5

Posted by Katta

24, ఏప్రిల్ 2014, గురువారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: ప్రణయదాహం..: ఆవేదనా సముద్రపు అవధులెక్కడ.. నిలువునా దహిస్తున్న నిప్పుకు విరుగుడెక్కడ.. బాధాతప్త హృదయపు ఘోష యెక్కడ.. నిట్టూర్పుల గాఢత నిండిన శ్వాస యెక్కడ.. ఏదేదో వ్రాయాలని.. దావాలనపు ఎడద పరచాలని.. ఏదేదో వ్రాయాలని.. ఎదన రేగు సునామీ ప్రళయాన్ని సమ్హరించాలని.. ఏదేదో వ్రాయాలని.. విధాత వ్రాతను తిరుగబెట్టాలని.. ఏదేదో వ్రాయాలని.. అల్లకల్లోల ఆలోచనా కెరటాలను తీరం చేర్చాలని.. ఏదేదో వ్రాయాలని.. అక్షర తపస్సునావహించి మమతల నందనవనిని వెలయించాలని.. ఏదేదో వ్రాయాలని.. ఎంత వారించి చూసినా..ఇలాగే వ్రాయాలనీ.. ఇలాగే వ్రాయడం మందే లేని రోగం..!! అది అంతే లేని తీయని ప్రణయ దాహం..!! 24/04/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1idkxvb

Posted by Katta

20, ఏప్రిల్ 2014, ఆదివారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: నీవు..: జీవన పోరాటపు ఆటుపోట్లను అవలీలగా ఎదుర్కొను శక్తిని నింపే హృద్యమయిన రూప చిత్రము నీవు కదా..! విజయ సోపానలనధిరోహించి చరిత్రను పునర్ లిఖింప అపూర్వావకాశమును సఫలీకృతంజేయు చైతన్య స్తోత్రస్సు నీవు కదా..! మనస్సున మమతల మల్లియ మాలలు కూర్చిన కన్నుల కదలాడు అత్మీయానురాగ తేజో కాంతి పుంజం నీవు కదా..! ఉల్లమును రంజించి నవరాగ సంగీత శోభలద్దిన సుమధుర స్వరఝరి నీవు కదా..! డెందం ఆమంద కందలిత అరవిందభరితమయ్యే సున్నితోజ్వల సుకోమల చేతనావర్తిత చేష్ట నీవు కదా..! మానవత్వం మూర్తీభవించి రేబవళ్ళు తెలియక భవదీయుని నామ జపమున ప్రణయ తత్వమును శిఖరంజేర్చిన ప్రేమమూర్తివి నీవు కదా..! మాటలకందని భావాలకు కవితలకందని కమ్మదనాలకు అనుభూతులకందని ఆశ్చర్యాలకు ఎల్లలు తేలియని తీయదనాలకు చిరునామా నీవు కదా..! 20/04/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lqmhV8

Posted by Katta

16, ఏప్రిల్ 2014, బుధవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: నువ్వొంటరివి కాదే నా చెలి...: నువ్వొంటరివి కాదే నా చెలి నీ హృదయపు ఉద్యానవనంలో సేదదీరుతున్న నా ఊసులతో బాసలాడుతున్నావు కదా..! నువ్వొంటరివి కాదే నా చెలి నీ మధుర భాషణపు భూషణమున నా సహానుభూతి తరగల తేలియాడుచున్నావు కదా..! నువ్వొంటరివి కాదే నా చెలి ప్రకటిత పరిసరాలందున పంచ భూతాలను నేనావహించి నిను సంభ్రమాచర్యాలలో మునకలేయిస్తున్నాను కదా..! నువ్వొంటరివి కాదే నా చెలి బయలుదేరు సమయాన అనుభూతుల దొంతరలను నీ మనమున బహు ప్రియముగా కూర్చినాను కదా..! నువ్వొంటరివి కాదే నా చెలి మన మమతల బృందావనిలో మయురాంగనవై విహరించుటకు విధాత కల్పనల మొలచిన అనురాగ శిల్పం కదా..! నువ్వొంటరివి కాదే నా చెలి నీలో నేనున్నంత వరకు..!! నువ్వొంటరివి కాదే నా చెలి నన్నావహించి నువ్ నిలుచు వరకు..!! 16/04/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gFhF9m

Posted by Katta

31, మార్చి 2014, సోమవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: జయనామ ఉగాదికి స్వాగతం...: చైత్రం పూసి కరవాలం దూసి ఓరగ చూసిన చూపుకు చీకటి రక్కసి వడి వడిగా తొలగుచున్న వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! లేత భానుని నులి వెచ్చని కిరణాల కౌగిటిలో శిశిరపు మంచు తదాత్మ్యముగా కరుగుచున్న వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! కరిగిన హిమం కనుమరుగై నీలి ఆకసపుటంచులను చేరి కరి మబ్బులకు కాంతినిచ్చిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! మంచు సముద్రం మాయమవుతూ మోడులు బోయిన ప్రకృతికాంత నుదుటన పచ్చని సింధూరం దిద్దిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! ప్రకృతి కన్య పచ్చని సోయగమునకు విచలితుడయిన చెరుకు విలుకాడు విరివానను శర పరంపరగా కురిపించిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! వత్సరం క్రితమే ఎటో వెళ్ళిపోయిన వసంత కన్య పంచశరుని వింటి మహిమన తిరిగి మహికరుదెంచిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! వసంతం సంతసమొందగ తరులతా సమూహం కుసుమరాగ పుప్పొడి శోభిత భాసితయయి అవని ఎదన ఆకుపచ్చ వస్త్రమును అచ్చాదనముగా పరచిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! భూతలమున అమృతభాండం రసాల వృక్షం చిగురుల గ్రోలి మధించిన కోయిల కూజిత రాగములాలపించిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! ప్రసూనములు హొయలుపోయి జావళీలు పాడుతున్న వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! నవ మల్లియల పరిమళాలు చేమంతుల విరహ వేధనలు చెలి సిగను చేరి హృదయ కుహారములో వసంతములాడిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! ఎటు చూసినా సౌందర్య లోక ఉద్యాన వనమై వనం వనం శుక పికల సమ్మేళనమయిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! దివినున్న అందాలు ఆసాంతం భువికి దిగుమతయిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! సంతోశం సమరసతా సౌందర్యం సౌహార్ధం క్రమత జాగురూకత తప్ప ఇంకేమీ వలదంటున్న జయనామ ఉగాదికి స్వాగతం..! జయనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు...!! 31/03/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rWN0ck

Posted by Katta

22, మార్చి 2014, శనివారం

Kontham Venkatesh కవిత

కొంతం వెంకటేశ్: కాలమా నువ్వెక్కడ..: కాలమా నువ్వెక్కడ నా చెలి కమ్మని కౌగిలి నులి వెచ్చదనమున కరిగిపోయావు కదా...! కాలమా నువ్వెక్కడ నా చెలి తేనియల అధరాల మధురాల తేలియాడి తెరమరుగయ్యావు కదా...! కాలమా నువ్వెక్కడ నా చెలి గులాబి బుగ్గల సోయగమునకు మతితప్పి సంభ్రమాశ్చర్యాలలో మునకలేసావు కదా...! కాలమా నువ్వెక్కడ నా చెలి వాలిసోలిన కంఠసీమన శంఖమును గాంచి సొమ్మసిల్లావు కదా...! కాలమా నువ్వెక్కడ నా చెలి నడుమొంపున మాయమై ఆకసమున నెలవంక రసరాజును రాబిలుచుటకు పయనమయ్యావు కదా...! కాలమా నువ్వెక్కడ నా చెలి మమతల బృందావనపు ప్రణయ మురళీగానమై మైమరచి హృదయాలయమున అర్చనకు కొలువుదీరావు కదా...! 22/03/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nNUgI5

Posted by Katta

18, మార్చి 2014, మంగళవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: జగన్మిధ్య..: ఏవి చెలీ నీ నయనాల తోనల తొణికిసలాడు సుమనోహర రసోద్దీపనా చంద్రికల సహస్రాలు..? ఏవి చెలీ నీ అధరాల తేనియ జలపాతాల తేలియాడిన వాక్ గంగా సుమధుర స్వర ప్రవాహాలు..? ఏవి చెలీ నీ ముఖ మందారముపై శాశ్వతమై సేదదీరిన మార్ధవపు సొగసుల సౌదామినులు..? ఏవి చెలీ నీ హృదయ కమలమున తిష్టవేసిన ప్రణయ సుధా మాధురీ మహిమల మహాద్భుతాలు..? ఏవి చెలీ నీ కమ్మని కౌగిలిన రేగిన మమతల తరగల మధురోహల మకరందాలు..? ఏవి చెలీ నీ ప్రేరణా శరముల పాశుపతపు ప్రచండ తరంగాలు..? నా జీవన ఎడారిలో ఎలకోయిల ఎందుకు నీ పిలుపు లేనిది..? నా జగత్తు మిధ్యే కదా నీలో నా తలపు రానిది..? 17/03/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iVQHgN

Posted by Katta

16, మార్చి 2014, ఆదివారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: హోలి...: హోలి అదెక్కడ.. సంధ్యా సుందరిని ముద్దాడి సిగ్గులుపోయిన తామరసాప్తుని కెంజాయ లోన కదా..! హోలి అదెక్కడ.. తుషార శీతల సరోవరాన నెలరేణి అనురాగ చూడ్కుల నడుమ వగలుపోయిన కలువ వాసంతి దగ్గర కదా..! హోలి అదెక్కడ.. రయమున పరుగెడుతున్న రవి కీరణం చందానికి నీలి వర్ణం పులుముకున్న అంబరపు సంబరానిది కదా..! హోలి అదెక్కడ.. మధ్యాహ్నాపు మార్తాండుని పరిష్వంగమున నలుపు తెలుపుల మిశ్రమాన్ని సంతరించుకున్న సముద్రుడి సరదాలది కదా..!! హోలి అదెక్కడ.. పంచశరుని వింటి దాటికి పులకించిన వనకన్య చిలిపిదనపు సెగల లోన కదా..! హోలి అదెక్కడ.. నీ చూపులు నా చూపులతో పెనవేసి విరితూపులు అయినప్పుడు కదా..! హోలి అదెక్కడ.. నా కన్నులు నీ కన్నులతో ఊసులాడి బాసలు చేసిన సేసల లోన కదా..! హోలి అదెక్కడ.. నీ హృదయం నా డెందం గూడి కుసుమ రంజిత సరాగములను ఆలపించుట లోన కదా..! హోలి అదెక్కడ.. నా ద్యాస నీ శ్వాస జతగూడి సంతసమున మయిమరచిపోవుట లోన కదా..! హోలి అదెక్కడ.. నీ మనో ఆకాశములో నా మనస్సు సంచరించి హరివిల్లయి విరిజల్లును వర్షించినపుడు కదా..! హోలి అదెక్కడ.. నేనే నీవై నీవే నేనై అనంతదారులలో అర్ధనారీశ్వర తత్వమును ఆవిష్కరించుట లోన కదా..! హోలి పండుగ శుభాకాంక్షలు..!! 16/03/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iQshW3

Posted by Katta

15, మార్చి 2014, శనివారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: నిరాశ ఏల..: నిరాశ ఏలనే నా చెలి.. కష్టాల కొలిమిలో నిను వదలడం నా తరమా..! డీలా ఏలనే నా చెలి.. నష్టాల నెగడులో నిను వీడటం నా వశమా..! బెంగేలనే నా చెలి.. నిర్జీవం కమ్మిన నిస్సత్తువలో నిను ముంచేయటం నా తలపా..! బేలతనమేలనే నా చెలి.. విదీర్ణమయిన నీ ముఖచంద్రం కాంచుటయే నా తపమా..! నేనున్నాను అన్నింటా..!! ఎల్ల వేళలా నీ చెంత..!! 15/03/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gn2Q6t

Posted by Katta

10, మార్చి 2014, సోమవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: ఋణము..: ఈ ఎద వాకిలి తలుపు తెరిచింది నీవే అనంతాకాశపు శూన్యం ఆవరించిన నా మనో మండలములో కోటి ప్రేరణా తారకలను వెలిగించినావు..! ఈ బదిరాంధక హృదయ సంద్రాన్ని లంఘించినదీ నీవే నా నిరాశ నిస్సత్తువ నిశీధి చట్రాన్ని ధనుమాడి ఆశల జాబిల్లివై చైతన్య జ్యోతికల వెలుగులు నింపినావు..! కాంతి విహీన కన్నుల కోటి సూర్యుల దివ్య ప్రభలను వెలిగించినదీ నీవే అంకిత భావమును నా కణకణమున ప్రవహింపజేసి విజయ తీరాల దారుల్లో నను విహరింపజేసినావు..! చేష్టలుడిగి అలసిన హస్తపు ద్వయమున పరిపుష్ఠిని చేకూర్చినదీ నీవే రుధిర జ్వాలవై అణువణువును నన్నాక్రమించి కష్ట సహిష్ణతను చేతల కూర్చినావు..! జాజ్వల్యమానముగా అంతహ్ చేతనమై నాలో వెలసినావు..!! సాధనా చంద్రికల సరోజనివై నా ఎద తటాకమున శాశ్వతముగ నిలిచినావు..!! మరో జన్మ కావాలి..!! నీ ఋణము తీరాలి..!! 10/03/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fk3MgH

Posted by Katta

8, మార్చి 2014, శనివారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: అభినందన..: మండవ మిశ్ర శంకర భగవద్పాదుల న్యాయమూర్తి ఎవరోయి.. నరకాసుర వధ యందున నారసమెత్తినది ఎవరోయి.. కఠిన తపమునాచరించి అపర్ణయయిన ఆది ప్రేమమయి ఎవరోయి.. నిండు సభలో పండు మనసుతో రఘునందను వరించినది ఎవరోయి.. ఆంగ్ల రాక్షసులను వామ హస్తమున తరిమివేసినది ఎవరోయి.. కాకతీయ వంశప్రభకు వెలుగులద్దినది ఎవరోయి.. చంద్రమండలమున యాత్ర సల్పిన ధీరోద్ధాత్త మూర్తి ఎవరోయి.. అవనిన వెలసిన వనితా విరి కమలాలకు శ్రమ సౌందర్య విరాట్ తేజోమూర్తులకు ఇవియే నా మంగళ శాసనములు..! హృదయపూర్వక అభినందన చందనాలు..!! 08/03/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nsFi6E

Posted by Katta

7, మార్చి 2014, శుక్రవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: ఆకాంక్ష..: మార్చి8 అంతర్జాతీయ మహిళా దినోస్తవం మళ్ళీ వచ్చింది.. ఆకాశములో ఆమే సగం అని ఆకర్షనీయమయిన నినాదాలు.. పబ్బుల్లో క్లబ్బుల్లో డిస్కౌంట్ల సరదాలు.. వయారాలు ఒలకబోయుటే టాలెంటని తీర్పులు.. సందేశం పంపుటయే కేరింగ్ అని వివరణలు.. సౌందర్యం సౌష్టవమంటూ చర్చోపచర్చలు.. దినోస్తవం మాటున తద్దినం జరుపుట కదా ఇది..! దినోస్తవం మాటున వ్యాపార వికృతి కదా ఇది..! దినోస్తవం మాటున దివాళాకోరుతనం కదా ఇది..! దినోస్తవం మాటున అంధానుకరణం కదా ఇది..! దినోస్తవం మాటున పురుషాధిక్యత కొనసాగింపు కదా ఇది..! దినోస్తవం మాటున స్త్రీని అంగడి సరుకు చేయుట కదా ఇది..! భౄణ హత్యలపై ఘోష లేదు..!! సాధికారికతపై సంభాషణ లేదు..!! సంపద సమానత్వంపై సంవేదన లేదు..!! వంటింట్లో నలుగుతున్న శ్రమకు న్యాయం చేసే ప్రతిన లేదు..!! ఇటువంటి అంతర్జాతీయ మహిళా దినోస్తవం వస్తే ఏంటి..అది రాకుంటే ఏంటి..?? నిజమయిన శుభాకాంక్షలు పలికే రోజోకటి రావాలని తలపోస్తూ.. వస్తుందని నమ్ముతూ.. సమస్త స్త్రీ శక్తికి నమస్సుమాంజలులు...!!! 07/03/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NGk090

Posted by Katta

6, మార్చి 2014, గురువారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: షరామామూలే..: షరామామూలే నా అలుకలు నీ కులుకులు..! షరామామూలే నా గుసగుసలు నీ రుసరుసలు..! షరామామూలే నీ గర్జనలు నా తర్జనభర్జనలు..! షరామామూలే ప్రణయ బృందావనమున నేను ప్రళయ ఝంఝామారుతము వోలె నీవు..! షరామామూలే సంపెంగ మొగ్గల నవ్వుల విరివాన నేను అర విరిసిన కెంపు గులాబీ బుగ్గల తోయజాక్షి నీవు..! షరామామూలే పరుచుకున్న పచ్చదనపు సౌభాగ్యం నీవు వెచ్చని నీ కౌగిలిన ఒదిగిపోయిన కొత్తదనం నేను..! షరామామూలే నాలో నిండిన నీవు నీలో మిగిలిన నేను..! 5/2/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NUNDTO

Posted by Katta

27, ఫిబ్రవరి 2014, గురువారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: మహా శివరాత్రి..: ఆది బిక్షువు జగతి అవతరించిన వేళ.. చిదానంద రూపమున సన్నుతి కలిగించిన వేళ.. అభిషేక ధారల ఆరగించిన వేళ.. బిల్వ పత్ర సమర్పణ మార్గమున కనికరించిన వేళ.. ఉపవాస దీక్షల దక్షతన కొంగు బంగారమయిన వేళ.. కణ కణం శివ శివం దాల్చిన శంకరుడు కొలువుదీరాడు శ్రికంఠుడై బోళా శంకరుడు పృథ్విన అమృత ధారలను చిమ్మాడు..!! మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు...!!! 27/02/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ezJJFK

Posted by Katta

26, ఫిబ్రవరి 2014, బుధవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: స్వాగతం..: ఎలా తెలుపను చెలీ ఎలా తెలుపను...!! హాయి వెల్లువలెత్తగ నీకు స్వాగతం..!! ఆవరించిన శూన్యం ఆనందపడగ నీకు స్వాగతం..!! అణువణువు తమకమున తేలిపోగ నీకు స్వాగతం..!! మనసు మురిసి మయూరమవగ నీకు స్వాగతం..!! ఎద పారవశ్యపు పరిమళాలు విరజిమ్మగ నీకు స్వాగతం..!! కౌగిలిన బంధీవై వెచ్చని చలువన చేష్టలుడిగిన నీకు స్వాగతం..!! ఎలా తెలుపను చెలీ ఎలా తెలుపను..!! 26/02/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fHv14h

Posted by Katta