పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Kavi Savyasaachi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kavi Savyasaachi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, ఏప్రిల్ 2014, ఆదివారం

Kavi Savyasaachi కవిత

//సయామి కవలలం// 06/04/2014 నెత్తురు ఇంకని స్థలమేది కన్నీరు తడవని చెలమేది యుగాలెన్ని మారినా.. కాలమెంత కరిగినా... కళ్ళముందె దౌర్జన్యం కరడుగట్టినా దుర్మార్గం నీ ముందే నిరంతరం జరుగుతున్న దౌర్భాగ్యం ఎక్కడుంది చలనం నీలో ఒక్కసారి మదితెరిచి చూడు లోలో చైతన్యమంటె రక్తపు నది హోరు గుండెనిండ ఉదయించే సూర్యుడి జోరు మనిషిని గుర్తించలేని మానవత్వమెందుకు మదినిండా కుళ్ళుతో మరుమల్లెల దుర్ఘంధం నీ అణువణువున దాగున్న మలినాలను వెలికితీయ్ లోపలున్నదాన్ని ముందు ప్రక్షాళన చెయ్ ముందుతరం భవితకు పూదారులు పరచవోయ్ ఎవడేదో వాగేస్తే మనకెందుకు తుడిచెయ్ పిచ్చిపువ్వులను చూస్తూ వగపెందుకు వదిలెయ్ మలినంలోనే మరి తామర వికసించదా మదిలోన ఫ్రెముంటె మరందమే కురవదా ప్రాంతాలువేరైనా ఫ్రేమ చెరిగిపోవునా గోడలుకట్టెసినా గుండెలు విడిపోవునా ప్రవహించే తెలుగు వెలుగు రక్తమొకటేగా గుండె గుండెనూ కలిపిన తెనుగు దారమొకటేగా విశ్వభావనే విరులు కావాలందరికీ ప్రేమామృతధారలే కురియాలి మదిలోకి కలిసుంటె కలదు సుఖం...ఇదివరలో విడివడినా సయామీ కవలలమే మనం

by Kavi Savyasaachi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q97w61

Posted by Katta

31, మార్చి 2014, సోమవారం

Kavi Savyasaachi కవిత

మిత్రులకోసం..కొన్ని..మినీ..కవితలు... ఎప్పుడో రాసుకున్నవి.... 31/03/2014 ఖమ్మం ----- ఖమ్మం కళలకు గుమ్మం మతవిద్వేషాలనసలే నమ్మం ప్రేమ సుధాధారలమ్మం భరతమాత చరణాల విరిసిన చిరు సుమం ఖమ్మం అనూష ----- వసంతకోకిల గొంతుమూగవోయింది మావిచిగురెపుడో మాడిపోయింది కట్టుకున్న కలలసౌధం కూలిపోయింది అర్థరాత్రి అనూష రాలిపోయింది విభజన ----- జనామోదం మాకక్కరలేదు ఓటు..సీటు...మాకెంతో స్వీటు గుండెల్ని రెండుగా చీలుస్తాం మాతృభాష నాలికని నిలువుగా తెగ్గొస్తాం తెలంగాణ ------ నా తెలంగాణ తీగలు తెగిన వీణ రక్తాశృవుల రోదన తెగిపడిన వీరుల ఆక్రందన అన్నపు మెతుకుల ఆవేదన

by Kavi Savyasaachi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PaGLCT

Posted by Katta

Kavi Savyasaachi కవిత

||ఈ చరిత్ర నీ రక్తంతో|| నువ్వెవడిని ప్రశ్నిస్తావ్? నువ్వెవడని ప్రశ్నేస్తావ్? నువ్వేమని అడుగుతావ్? నువ్వేదని కడుగుతావ్? వీడు..... నీకు బాగా తెల్సినోడే ఎప్పుడూ కావల్సినోడే...కానీ వీడో ముళ్ళపొదైనా కావచ్చు.. ముళ్ళపందైనా... వీడుమాత్రం కుళ్ళు వెధవ సొల్లు గజ్జి కుక్క... చొంగలు కార్చేసుకుంటు.. చీకట్లు పేర్చేసుకుంటు నోట్లను విసిరేసుకుంటు ఓట్లను పోగేసుకుంటు రాత్రిగొంతుల్లో సారానింపుకుంటు కపట ప్రేమపలుకులొంపుకుంటు జెర్రిలా పాకుతూ కాళ్ళు తెగనాకుతూ డ్రైనేజ్ నోటితో వాగుతూ అసత్యాల అంటకాగుతూ వీడెవడో... గుర్తొచ్చాడా...? అవును...వాడే...వీడు!! నీ గతానికి గోరీకట్టినోడు వర్తమానపు వంచనగాడు భవిత భస్మంచేసేవాడు.. నీ బతుకు భొంచేసేవాడు ఆడు సరే...నువ్వేంటి? నీ జ్ఞానం మోకాలా? అజ్ఞానపు అరికాలా? చరిత్ర చూడలేదా? ధరిత్రి చెప్పలేదా? కాలం నిన్నెప్పుడైనా కనికరించిందా? వెన్నెలెప్పుడైనా నీ బతుకులో కురిసిందా? కష్టాలు.....కన్నీళ్ళు ఆకలికేకలు....ఆక్రందనలు రోగాలూ...రొష్టులూ ఎముకలపోగులూ...రగిలే చితిమంటలూ... ఇవికాక....ఇంకేమైనావుంటే చెప్పు కడుపుమండి అరుస్తావ్ జబ్బలుతెగ చరుస్తావ్ చీపులిక్కరివ్వగానె చిందులు తొక్కేస్తావ్ ఐదు వందలనగానె అర్రులు సాచేస్తావ్ ఎక్కింది దిక్కముందె ఎవడికొ ఓటేసేస్తావ్ ఇగ అడగడానికి నీ హక్కేంది? నీ తిక్కకు లెక్కేంది? తెల్లరేప్పటికి నీ కిక్కు దిగుద్ది నీ బతుకప్పటికే తెల్లారిపోద్ది నువ్వోటేసినోడు మొహమైనా చూడడు అద్దాలమేడనుండి అడుగైనా దాటడు నువ్ తాగినసారా నీ సారాన్ని తాగుతుంది నీ ఆలి సింధూరం రాలి ధూళిలోన కలుస్తుంది ఆడుమాత్రం............. బతుకులు చిదిమేస్తూ... చితుకులు పోగేస్తూ... చితులు వెలిగిస్తూ... ఊసరవెల్లై రంగులు మారుస్తూ... ఈ కధలూ...ఈ వ్యధలూ ఇంకానా...ఇకచాలు!! ఆడు మళ్ళీ కనబడితే... చెప్పిడిచి కొట్టు పాళ్ళూడగొట్టు ఆడి సారాలో ముంచి తీసి అగ్గెట్టు....తన్నితగలెట్టు "అప్పుడే మళ్ళొకడు పుట్టడు మీ కడుపులు కొట్టడు""

by Kavi Savyasaachi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ohxbhg

Posted by Katta

Kavi Savyasaachi కవిత

ఉగాది ----- 31/03/2014 ఉగాది మళ్ళీ వచ్చేసింది..కానీ "గాది"క్కడ నిండుకుంది ఉరితాడు ముందు నిల్చుని ఉగాదినెలా స్వాగతించను? పార్థివదేహాల్ని ముందేసుకొని నడుస్తున్న శవాల్ని చూస్తూ వసంతకోకిలల్నెలా ఆహ్వానించను? మానంకోల్పోయిన తల్లుల్ని చూస్తూ మావిచిగురు రుచులెలా వర్ణించను? పల్లెనోళ్ళకు తాళాలుపడి వలసలు పోతున్నాయ్ నీరింకిన ఊఠబావులు కన్నీరింకిన కళ్ళూ ఇక్కడ దర్శనమిస్తున్నాయ్ బీళ్ళువారి నోళ్ళు తెరుచుకున్న పంటభూముల్లో ఇప్పుడు శవాలు మొలకెత్తుతున్నయ్ అప్పులకెరటాల సునామీ అన్నదాతలను ముంచేస్తున్నాయ్ అంబరాంగన కౌగిలిలో ధరలు ఓలలాడుతున్నాయ్ కార్చిచ్చై కుటుంబాల్ని కాల్చేస్తున్నాయ్ కుప్పతొట్లలోకి ఇప్పటికీ విసిరేయబడుతున్న కర్ణులూ అంగడిలో అమ్మకానికిపెట్టిన పసిమొగ్గలు ఉదయించకుండానే అస్తమిస్తున్న ఆడ శిశువులూ రైలుపెట్టెల్లో... చెత్తకుప్పల్లో... మురికిగుంటల్లో... ఖార్ఖానాల్లో... కరిగిపోతున్న బాల్యం.. నా కనులముందు సినిమా రీళ్ళలా సాగుతుంటే..... గుండెలవిసేలా నింగినంటుతున్న రోదనలలో... వసంతకోకిల గానం అది పలికే నవరాగం నాకెలా వినిపిస్తుంది? అతివల రక్తపు రుచిమరిగిన మృగాళ్ళు ఇంకా మనమధ్యే సంచరిస్తుంటే అంగాంగాన్ని ఆబగా ఆరగిస్తుంటే ఉగాదినెలా స్వాగతించను? ఎన్ని వసంతాలు నన్ను దాటుకొనివెళ్ళాయో ఎన్ని ఆమని గీతాలు మదిమాటునదాగాయో కానీ...ప్రతిసారీ నాకు వేపచేదే మిగిలింది... అయినా ఆశచావని మనిషిని... మళ్ళీ నిన్ను స్వాగతిస్తున్నా... ఇప్పటికైనా... మా జీవన ఉగాది షడ్రుచుల సంగమం కావాలని ఆశిస్తున్నా||

by Kavi Savyasaachi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRlU1q

Posted by Katta