పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, ఫిబ్రవరి 2014, శనివారం

Katta Srinivas కవిత



by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Onfo8u

Posted by Katta

Nakka Venkatrao కవిత

అగ్ని గుండె .. ఆకు రాలినంత సహజంగా టపుక్కున వెనక్కి తిరిగి చూడకుండా ఎలా వెల్లిపోతావో ... నిజమే .. అది ఎండి పోయిన పత్రహరితం నీది ..

by Nakka Venkatrao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ha5m40

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

చిరాశ // వనరుల విధ్వ౦స౦ // ************************************************** సహజ వనరుల విధ్వ౦సాన్ని కళ్లప్పగి౦చి చూస్తావే౦...?! కాలే కడుపుతో వాడికి ఊడిగ౦ చేస్తూ వాన్ని కోటీశ్వరున్ని చేస్తావే౦...?! నీ ఒ౦ట్లోని స్వేదాన్ని వాడికి అత్తరుగా పూస్తావే౦...?! ప్రకృతమ్మ ప్రసాద౦లో నావాటా నాకేదని నిగ్గదీసి అడుగవే౦...?! వెన్నెముక విరిగి పోయే౦తగా మరీ అ౦తలా వాడిము౦దు వ౦గిపోతావే౦...?! వేనవేల పోరాటాల్జేసి సాధి౦చుకున్న స్వాత౦త్య్రాన్ని వాడికి కట్టు బానిసగ మారి మరల పోగొట్టుకు౦టావే౦..?! **************************************************** ---- {22/02/2014}

by Chilakapati Rajasheker



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OmJx7W

Posted by Katta

Maddali Srinivas కవిత

కవులకేం ?!! యెన్నైనా చెబుతారు//శ్రీనివాస్//22/02/2014 ------------------------------------------------------------------------------- కవుల కేం యెన్నైనా చెబుతారు! యేమైనా రాస్తారు! కలలన్నీ వెన్నెల్లో తడిపారబోసి అక్షరాలా అమృతాన్ని వొలకబోస్తారు! కవులకేం యెన్నైనా చెబుతారు కాలం కడలిలో మునిగే మా బోట్లకు భావాల తెరచాపల నాధారంగా చేస్తారు ఆదర్శాల దిక్సూచిని చూపించేస్తారు కవులకేం యెన్నైనా చెబుతారు యెడారుల్లో మల్లెలు పూయిస్తారు మండుటెండల్లో మంచినీళ్ళ వూటలు పుట్టిస్తారు బంజరు భూములన్నిటిని సస్య శ్యామలం చేసేస్తారు చీకటి ఖండాలల్లో వెలుగు పుంతలని పుట్టిస్తారు కవులకేం యన్నైనా చెబుతారు నిజం వేడికి కలలన్నీ కరిగి పోయే వేళ వెక్కిరించే వేదనలకి వేదాంతపు లేపనాలు పూసేస్తారు గాయమైన చోటే గేయాలను పుట్టిస్తారు శిశిరంలో నవ వసంతాన్ని గ్రీష్మంలో హేమంతపు చల్లదనాన్ని శరత్తులో రధ సప్తమి నాటి రవి కిరణాలనీ అక్షారలలో ఆవిష్కరిస్తారు కవులకేం యెన్నైనా చెబుతారు పగిలిన అద్దాన్ని అతికించాలనో విరిగిన మనసులను ఒకటి చేయాలనో అక్షరాల సంజీవని తో అద్భుత చికిత్స చేస్తారు కవులకేం యెన్నైనా చెబుతారు కలలతో కడుపు నింపేస్తారు. నిప్పులు కురిపించే ద్వేషపు బడబాగ్నులు చల్లారాలంటే చల్లని కలల సాయం చక్కని కవితా వ్యవసాయం అవసరమే మరి

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f8lpuz

Posted by Katta

Viswanath Goud కవిత

విశ్వనాథ్|ఏముంది నీలో ............ ................. ఆగు నీలోకి చూడాలివాళ నీ మనసు లోతుల్లో ఏముందో తెలుసుకోవాలివాళ క్షణానికోరకంగా స్పందించే నీ గుండె చప్పుల్ల అంతరంగం ఏంటో వింటానివాళ ప్రతిసారి నువ్వు చెప్పే తీపిమాటల మాధుర్యపు ఊట యద లోతుల్లో ఊరిందా, గాలిచినుకులా గొంతు పై నుండి వచ్చిందా తెలుసుకుంటానివాళ కళ్ళలో దాచుకున్న తుప్పెరుగని, చూపుల చురకత్తులు ఏ కమ్మరి సానపట్టాడో ఆచూకీ కనుక్కుంటానివాళ నీ భావాలు తల్లడిల్లిన ప్రతిసారి ఉప్పనలా పొంగే ఆ కన్నీటి సాగరం ఏ ఆవేదన చెందిన మదీ నదుల సంగమమో దూకి చూస్తానివాళ నీ అడుగులు మోపిన మోగే ఆ గజ్జెల సవ్వడులకు సరిగమల స్పందనలు ఏ నాధబ్రహ్మ నేర్పాడో అన్వేషిస్తానివాళ నవ్వినా,ఏడ్చినా ఎర్రబడే ఆ బుగ్గల సున్నితత్వం ఏ పువ్వు అరువిచ్చిందో అడిగేస్తానివాళ అమావాస్యలో కూడా వెన్నెల పండించే నీ నవ్వుల వెలుగుల వెనుక చిదంబర రహస్యమేదో కనుక్కుంటానివాళ కురులను జలపాతాలు చేసి పూలు పండించే ఆ పరిమళాల మహిమ,ఏ వసంత జీతగాడి సేద్యమో అడిగేస్తానివాళ ఆగు నీలోకి చూడాలివాళ నీలో నేనున్నానో లేదో తేల్చుకుంటానివాళ.! 22FEB14

by Viswanath Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gW3v3d

Posted by Katta

Chi Chi కవిత

_ రోతొక వింత _ fighting రాజా తల్చుకుంటే రాజొక్కడై రాజ్యాలు రాజ్యమవుతాయ్!! item రాణీ తల్చుకుంటే వలచిన రాజు గెలుపులన్నీ పాదాల దగ్గర పడతాయ్!! పగలంతా రాజ్యమే పాడు రాజుకని రాణేడుపోపక్క రాత్రంతా రాణే రంకురాజని రాజ్యమేడుపోపక్క రాణి పగటి రహస్యాలు తెలియక , రాజ్యం చాలక రాజేడుపోపక్క రెండు క్షణాల మధ్య దూరమెంతో ఆలోచించుకుంటూ అసలు క్షణమే లేదని తలకెక్కించుకునే తీరికలేని మంత్రేడుపోపక్క పాపం రొజూ యుద్ధమే రాజ్యానికి రాజ్యంతో!! పైవిధంగా ఇంటిదొంగల కనిపించే , కనిపించని మంటల సస్యశ్యామలత్వంలో ఉన్నట్టుండీ ఓ ప్రేమరాజుకి కిరీటం పట్టక, పుణ్యాత్ముల పుర్రెల్ని కరిగించి పెద్ద కిరీటం చేస్కొడానికి దండయాత్ర పండక్కి బండ్లేసుకొచ్చేశాడు!! యుద్ధం ముగిసేవరకు ఇళ్ళకు తాలమేయకూడదన్నదండోరా విని ప్రజలంతా తాలమేసున్న అంతఃపురం ముందు ఆందోళనకి దిగాక కానీ అర్థమవలేదు యుద్ధం item రాణీ కోసమని lol ఎప్పుడో గురుకులంలో కన్నేసి మిగతా ఒళ్లంతా వెయ్యలనుకునే లోపు రాజ్యం మారిపోయిన రాణిని మరిచిపోలేక యుద్ధం ప్రకటించేసాడా పాపలరాజు!! పాపం రాణీ!! flash back ని go back అనలేక , fresh life కి byebye చెప్పలేక చెలికత్తెలతో చిల్లరేడుపులేడుస్తూ ఇద్దర్రాజుల్లో winner కోసం నిద్దర మానేసి wait చేస్తోంది!! చస్తే రాజు వస్తే రాణి అనే titleతో start అయిన ఈ warలో ప్రజలందరూ valentines అయిపోయారు తొక్కలోది!! మంత్రిమోహన్సింగ్ కి రాణీ కంత్రీ అని తెల్సినా కుడా సిపాయిలకిచ్చే జీతాలకి న్యాయం చేయాలనుకుని రాజుల మగతనాల పందానికి తన తలకాయని కూడా కాసేసాడు!! ఆ విధంగా మొదలైన ప్రేమయుద్దంలో చివరాఖరికి ముగ్గురే మిగిలారు ఇద్దర్రాజులు ఒక రాణి..so, యుద్దమింకా అయిపోలేదు!! ఒకడేమో మొహమ్మద్ గజినీ లాంటోడు , ఇంకోడేమో రజినీకాంత్ లాంటోడు రాణేమో మిగిల్నోడే నా bigboss అని చెప్పి climax start చేసేసింది ఇద్దర్రాజులు కత్తులన్నీ కొట్టుకుని విరిగిపోయాక ఒక నిర్ణయానికొచ్చేసారు ఎవరి తలా తెగేలా లేదు మా ఇద్దరికీ రాణివైపో అని proposal పెట్టేసారు situation అర్థం చేసుకున్న రాణి గారి మెదల్లో ఇంకో మహత్తరమైన idea మొలిచింది futureలో ఇంకో రాజెవడైనా వస్తే వాడితో కుడా fight లేకుండా రాజీ పడిపోవాలనగానే past రాజుకి , present రాజుకి కాళ్ళు , చేతులు కత్తులైపోయాయే తప్ప రాణి గారి creativity మీద కనీసం చిన్న complaint కూడా చేయలేదు ఒళ్లంతా ఏడుస్తున్నా కుల్లుని చంపుకోలేని రాజులు ఇద్దరికీ వద్దనుకుని వెళ్లిపోయారు ఏడ తానున్నాడో రాjaaaaaaaaaaaaa అని పాడుకుంటూ రాణి కూడా పుట్టింటికి వెళ్ళి మరో స్వయంవరానికి సిగ్గుపడుతూ green signal ఇచ్చేసింది.. తర్వాత జరిగిన సర్వేలో తెలిసిందేంటంటే రాజ్యాలన్నీ ఇలానే జనాల నిత్య కల్యాణం , పచ్చ తోరణాలతో విలవిలలాడుతున్నాయని రాజులు రాణులు తప్ప వేరే జనాలే లేరని________________Chi Chi(22/2/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gW3uMC

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

ఏమిటో ఈ స్తబ్దత ఎందుకో ఈ నిశ్శబ్దం అంతా నా చుట్టూ వున్నా నేను ఒంటరినే అందరికి ఆకసం లో పున్నమి కాన్పిస్తే నాకెందుకో అంతా నిశీధి భావన అందరి మోములోను మోదం నా మదిలో తెలియని ఖేదం ఈ గుండె బరువుకు కారణం ఏమిటో నీ నగుమోము కనిపించక నీ పలకరింపు లేక .. నీ మాటకు బానిసను పలకరిస్తే పులకరించే అల్పసంతోషిని మౌనం గా బాదించటం నీకు న్యాయమా చెలి 11పార్ధ !!22feb 14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1deT46j

Posted by Katta

Santosh Kumar K కవిత

|| ఎండుటాకులు || దిక్కు తోచక.. దారి తెలియక దయచూపే నాధుడే లేనపుడు దేహి అని అర్ధించకు..!! దయాగుణం దేవుడెరుగు.. దేహాన్ని దోచుకుపోతున్న దానవుల సామ్రజ్యం ఇది...!! ఆహ్లాదం కనుమరుగాయేను వర్షానికి బదులు ఆమ్లాలు కురుస్తున్న తరుణంలో.. తోడులేని ప్రయాణము అసాధ్యమాయెను.. తిరిగొచ్చే మార్గమంతా తోడేల్ల మందలతో నిండిపోగా.. దుర్మార్గుల దుస్సహసాల దారుల్లో తెగిపడిన అమాయకపు అవనుల గొంతులు ఎన్నో...!! నిజమని వేడుకున్నా.. అరాచకమని అరిచినా.. వినపడదు.. కనపడదు.. భయపెడుతున్న భవిష్యత్ చీకట్లలో కళ్ళులేని న్యాయదేవతకు!! నింగికెగిసెను... అంతరించిపోయెను.. ఆశలు కావవి.. ఆవిర్లు కావవి.. ప్రాణాలు కావవి...! ప్రతి ఆడకూతురి అడియాశల కలయికలో ఆవిరైన ఉత్సాహాలు రెక్కలు లేని పక్షుల్లా బధపడుతుంటే చూసి.. నవ్వి.. హేలన చేసి పట్టుకోలేనంత పైకెగిరిపోయెను వాస్తవ సమాజంలో కనికారం చూపే మనసులు.. అవి కలిగిన మనుషులు.!! కోరిక కోరితే కోపాలు తలెత్తి చూస్తే ఛీవాట్లు నలుగురిలో నవ్వితే నవ్వులపాలు మాటలొస్తున్నా మాటాడలేని మౌనాలు ఒకటా రెండా.. ఇంతి పడే ఇక్కట్లు గోడుచెప్పని జీవమెరుగని ఎండుటాకులు!! #సంతోషహేలి #Sanoetics 22FEB2014

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jnmDaN

Posted by Katta

Abd Wahed కవిత

కెరటాలు, తుఫానులు నా చేతిలొ మిగల్లేదు ప్రవహించే నీరేదీ నా ఉనికిలొ మిగల్లేదు నేనూ నా ప్రతిబింబం మా ఇద్దరిదే అద్దం మాట్లాడే పాత్రలేవి మనకథలో మిగల్లేదు మట్టిబొమ్మ మనుగడపై వర్షాలే కురుస్తున్నా గుండె కరిగె చినుకులేవి మబ్బుల్లో మిగల్లేదు ఆలోచన దుమ్ముధూళి పట్టుకునే తిరుగుతున్న ఎగరేసే దమ్ములేవి ఈ గాలిలో మిగల్లేదు పడకగదిలొ ప్రేమకథల దీపమారిపోతున్నా కంటతడిని కలిగించే చమురు పొగలో మిగల్లేదు వెంటాడే జ్ఙాపకాన్ని అనువదించె ప్రయత్నంలో వెదుకుతున్న పదాలేవి నా భాషలొ మిగల్లేదు బతుకుతోట వీస్తున్నది సుగంధమే కాబోలూ ఆస్వాదన మంచులాంటి పువ్వుల్లో మిగల్లేదు నిశ్వాసల నిట్టూర్పులు కంటి నుంచి రాలుతున్న ప్రాణమేది నడుస్తున్న ఊపిరిలో మిగల్లేదు

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gpXeKH

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ | పోలికలు ....................... జొన్నచేను మంచె కింద తలలూపే కంకులు పురేడుపిట్టల కోసం అల్లిన వలలాంటి అరిసె చేపలకోసం వాగులో పన్నిన మావు పదాలకోసం ఊహల్ని పన్ని కవిసమయంతో పొంచిఉండే కవి. *పాతవాచకం, 'ఎడతెగని ప్రయాణం' నుండి..

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bUyywQ

Posted by Katta

Suresh Vanguri కవిత

సురేష్ వంగూరి ॥ గజల్ ॥ చల్లని కాంతుల వానకి తడవాలని సరదా చిక్కని చీకటి గోడను పొడవాలని సరదా లేదనుకోవటమే ప్రాప్తి కాదనుకోవటమే తృప్తి దుఃఖపు దుప్పటి దులిపి మడవాలని సరదా ఎంతకాలమిలా ఉగ్గబట్టుకుని ఊపిరాపుకుని ఒంటరి గదిలో ధైర్యంగా ఏడవాలని సరదా అడ్డంగా తలలూపే అనుభవాల నోర్మూసేయ్ వాస్తవాల వీధుల్లో భయంగా నడవాలని సరదా కుదిరినట్టుగా బతికేస్తే కుదరదులే వంగూరీ మరణం కుళ్లుకునేలా ప్రాణం విడవాలని సరదా 22-02-2014

by Suresh Vanguri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jn4Jor

Posted by Katta

Maheswari Goldy కవిత

MY LOVE PLEASURE …! MAHESWARI GOLDY. You are the sun in my life I’ve found in you I never knew that I could love anyone As much as you My love for you is stronger…!! I think I always had a beautiful face This was definitely due to my sheer and smile…!! Meanwhile You had to love me I felt immensely graceful towards universe…!! But I was realized The secret of my beauty Is only due to your love…!! I am saying one thing with my pure mind You are my life You are my destiny…!! My love for you cannot be measured Through nights of endless pleasure It’s clear to me now I swear that for you I will be there…!! Many people told me When you will come out from your love Definitely you will win the world…!! I said them I should conquer his love Thereto, I was also ready to my breath And leave this world exactly My love for you is endless…!!

by Maheswari Goldy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jn4I3S

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ddvpTy

Posted by Katta

Kapila Ramkumar కవిత

Poetry - Time Does Not Bring Relief Time does not bring relief; you all have lied Who told me time would ease me of my pain! I miss him in the weeping of the rain; I want him at the shrinking of the tide; The old snows melt from every mountain-side, And last year’s leaves are smoke in every lane; But last year’s bitter loving must remain Heaped on my heart, and my old thoughts abide! There are a hundred places where I fear To go,—so with his memory they brim! And entering with relief some quiet place Where never fell his foot or shone his face I say, ‘There is no memory of him here!’ And so stand stricken, so remembering him! Millay was an American lyrical poet, playwright, and feminist. She received the Pulitzer Prize for Poetry in 1923, the third woman to win the award for poetry, and was also known for her activism and her many love affairs. She used the pseudonym Nancy Boyd for her prose work.Happy Birthday, Edna St. Vincent Millay, born 22 February 1892, died 19 October 1950

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Mi3xqg

Posted by Katta

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || లోపటి ప్రపంచపు మాటలు || మన మెందుకో అవతలి వారిని త్వరగా అపార్ధం చేసుకుంటాం కానీ లోతుల్లోకి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అతి సాధారణ విషయాలకు అతిగా నవ్వేవారిని చూసి, ఎంత బహిర్ముఖులో అనుకుంటాం కానీ, ఒంటరి ఆగాధాల లోతులు కనిపించకుండా కప్పేసేందుకు చేసే ప్రయత్నమే అదని గమనించం. పగలూ రాత్రీ తేడా లేకుండా నిద్రాదేవత ఒడిలో ఊయల లూగుతున్నవారిని చూసి ఎంత నిర్విచారంగా జీవితాన్ని గడిపేస్తున్నారో అనుకుంటామే కానీ, వారి గుండెల నిండుగా విచారం గూడుకట్టుకున్నదన్న విషయాన్ని గమనించలేం. తక్కువ మాటలను, ఎక్కువ వేగంతో చెప్పేస్తే ముక్కుసూటి మనిషనుకుని మురిసిపోతాం కానీ, రహస్యాల కవాటాలను విప్పారకుండా దాచేసే ప్రయత్నమనే వాసన పట్టుకోలేం కాక పట్టుకోం. నాకసలు ఏడుపే రాదనే వారిని చూసి వారికెంత గుండె నిబ్బరమే అని ధైర్యానికి ప్రతిరూపంగా భావిస్తాం. కానీ వారెంత బలహీనులో గుండె తలుపులను తట్టగలవారుంటేనే తెలుస్తుంది. చిన్న చిన్న విషయాలకే కంటతడి పెట్టేవారి కన్నీటీ బిందువులు ఓ సారి కదిలిస్తే అది జిత్తులమారితనం కాదు అమాయతను రంగరించుకున్న మొత్తని హృదయ స్పందనేసుమా అని మాట్లాడుతుంది. ఆటలో అరటిపండ్లలాంటి తొక్కలో విషయాలకో వ్యక్తి అతిగా కోపిస్తున్నారంటే, అది ఆధిపత్య ప్రదర్శనో, మితిమీరిన అహంకార ప్రదర్శనమో నని అసహ్యించుకోవలసిన పనిలేదు. వారు ప్రేమరాహిత్యపు దాహంతో కొట్టుమిట్టాడుతున్నారనే భాష్యం కళ్ళ వెనక తడినడిగితే చెబుతుంది. మనుషులర్దం కావాలంటే బాహ్య ప్రపంచపు భాషలన్నీ వస్తేనే చాలదు. లోపటి లోకాల ఊసులు తెలియాలి, మార్మిక లోతులనోసారి తిరిగి తిరిగి రావాలి. గుండెల లోపలికి కొంచెం ప్రేమను వొంపుకోవాలి, చాపే చేతులతో హృదయాలను అందుకోవాలి. పరిగెడితేనే తీరం చేరలేవు నేస్తం, ఓ సారీ నిలబడి భారం బేరీజు వేయగలగాలి. http://ift.tt/1ddpvC2 ►(కొన్నాళ్ళ క్రిందట రాసుకున్న కవిత) 05-04-2013

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ddpvC2

Posted by Katta

Mala Chidanand కవిత

||శ్రుతి|| నీ దరి చేరిన అనురాగానికి నీ కౌగిలిలో కరిగిపోవాలనే తపన అనుక్షణం మదిలో చెలరేగి నిరీక్షణ తీసుకొస్తున్న వింత భాద తీయని మైకం కమ్ముతున్నట్టుగా ఎదలో ఏదో కొత్త రాగాల ఆలాపన శ్రుతిచేస్తున్న సుందర సమయాన తేనెలొలుకు నీ పలుకులే నా మనసుకు హాయి కలిగించిన తరుణాన నీ శ్వాసలో కలిసి ఒకటైపోయిన ఈ అద్భుత సమయాన నీవందించిన ఈ క్షణం మరువలేను 'సఖా'నేనెన్నడూ.... ||Malachidanand ||22-2-14||

by Mala Chidanand



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ddngie

Posted by Katta

Vani Koratamaddi కవిత

మా నాన్న గారు క్రీ.శే. శ్రీ కొరటమద్ది.నరసిం హయ్య గారు రచించిన కవిత ఇది నాన్న గారు కె,యన్.కౌండిన్య అనే కలం పేరుతో కధలు కవితలు రాస్తూ వుండే వారు అప్పట్లొ అవి పెద్దగా ప్రచురణకి నోచుకోలేదు కవి మిత్రులకి పరిచయం చెయ్యాలనే ప్రయత్నం చేశాను . రచన. క్రీ.శే శ్రీ.కొరటమద్ది నరసిం హయ్య గారు. వలపుల వలయంలో వల సాయంసంధ్యా సమయం అది అరుణరాగ రంజిత తరుణం కెంజాయ వలువ ధరించిన సంధ్యా వధూటం దోబూచులాడే చంద్రునికి స్వాగతం పల్కింది తెరమాటుకు తప్పుకుంది వెన్నెల వెన్నెల!! ఎటు చూచిన వెన్నెల! అనుభవింప లేకున్నాను నిరాశాపూరిత ఏకాంతం భరింపరాని వంటరితనం నన్ను వేధిస్తున్నాయ్ క్షణాలు యుగాలుగ నడుస్తున్నాయ్ నెచ్చెలి రాకకోసం నాద్రుక్కులువీక్షిస్తున్నాయ్ ఇంతలో అందాల అరదం వలపుల పూల రధం కళ్ళెంలేని గుర్రాలు భ్రమరాలే పగ్గాలు సుమశరుని సారద్యంలో ప్రేమరధం నాఎదుట నిలిచింది నాలో ఆశలు నింపింది అందులో అందాల రాసి పంచవన్నెల రాణి వలపుల పూబోణి-అలవోకగా నావైపు చూచింది నాలో ఆశలు రేకేత్తించింది నన్నూరించింది నన్నందుకొంది ఆశలు నిండిన హ్రుదయంతో స్వర్గసీమలనేలే ఆశలతో అరదాన్నదిరోహించాను వలపులరాణి సంగాతంలో పయనం సాగించాను ఎటకో ఎటకెటకో!! గమ్యం తెలియని పయనం స్వర్గసీమల్లోనికా? మిన్నంటే కెరటాల సాగరమధ్యంలోనికా ఎటకో ఎటకెటకో!! గమ్యం తెలియని పయనం దశ దిశలా పయనించింది భూమ్యాకాశాలు నాక నరకాలు ప్రణయ ధామాలు ప్రళయ కుహరాలు అన్నింటిని చుట్టేసింది గిరగిరా - గిర గిరాలు చుట్టేసింది అగాధమైన వలయాల్లోకి (పడిపోయింది) పడవేసింది. నామేను కంపించింది నాభ్రమ తొలగింది కళ్లు తెరుచుకున్నాను అటునిటు చూచాను నిజం తెలుసుకొన్నాను వలపు లేదు-వలపులరాణి లేదు అంతాభ్రమ అంతా మృగ్యం మిగిలిందొక్కటే "వలపు"లో ని "వల" అదే నన్నాశా వలయంలో చుట్టేసిన వలపు లేని వల 29/2/1972 హోళికా పూర్ణిమ విరోధికృత. ROBERT BROWINGS "A LAST RIDE TOGETHER" ఆధారంగా

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NkoSjL

Posted by Katta

R K Chowdary Jasti కవిత

The Smile Those lovely flowers So nicely settled in That green tresses Meeting with my eyes With their sweet feelings And painting their smile On my fading face And preaching their bliss To my heart of sighs And drawing me into Their heart in the skies Where they covet me To live as cohort Of myself! R K Chowdary 22FEB2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mzkiOz

Posted by Katta

Satya NeelaHamsa కవిత

పోరుబిడ్డ : ^^^^^^ -సత్య నినదించిన నీ నినాదాలు మా పిడికిలి బిగి పెంచుతున్నై చిందించిన నీ నిధిరాశౄవులు మా నుదుటన తిలకాలై వెలుగుతున్నై నవరాజ్యం నవస్వప్నం నీ కండ్లల్ల జూసుకుంటిమి స్వప్నం సకారమైతే , నువ్ రాజైతవనుకుంటిమి ఈ సంబరాన్నేం చేసుకోము పంచుకోనే నీవులేక సంతోషాల నడుమన హత్తుకునే గుండె లేక కలల పంట ఇంటికొచ్చే పోరు బిడ్డ చూడరా అమ్మ కడుపుడు కోతలని ఇంకనైనా ఆపురా ... నీ వీరత్వం తెలిసినోల్లం అమరత్వం తెల్సుకోలేకపోతిమి ఉద్యమాల నడుమ ... నీ ఉద్వేగాన్నాపలేకపోతిమి ఉద్యమాలనుపయోగించుకున్నోల్లు, ఉద్వేగాలతో ఆడుకున్నోల్లు, ఊడ్చుకొని పోతరు... ఉసురుగొట్టుకు పోతరు మాచేతిలో మాకొచ్చిందీ, నీ త్యాగాలతో తడిసిన కూడు నవ తెలంగాణకి నవ రత్నాలు పొదిగి నీ కల సాకారం చేస్తం చూడు.. -సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gU8p0B

Posted by Katta

Kavi Yakoob కవిత

ఇవాళే.....!

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d33ypb

Posted by Katta

Sasi Bala కవిత

ఎవరు నీవు?............................శశి ............................ ఎవరు నీవు ???? నీవు నాకు ఏమవుతావు? నీకు సర్వస్వము నేనే అన్నట్లు నీ మది తలుపులు తెరచి, వాకిట నిలచి, ఏ మాలిన్యమూ అంటని మధురమైన ప్రేమామృతాన్ని నీగుండెలలో నింపుకుని నా కోసమే పంచడానికి ఎదురు చూస్తున్ననీ కన్నులకు నా రూపమే అపురూపమై జన్మజన్మల అనుబంధమైనట్లు..... గతమంతా మరపించి, మది పులకించిపోయేలా ఎన్ని జన్మలైనా తోడుండాలని కోరే నీవెవరు? పరమాత్ముడి మరో రూపానివా? వలచి వరించ వచ్చిన నీకు ఏమివ్వగలను? నాకున్న ఈ చిన్న హృదయం తప్ప... ఏ బంధాలతోనూ కట్టిపడేయలేని అనుబంధంతో పెనవేసుకున్న నీకు నేనేమవ్వగలను? విశాలమైన నీ హృదయంలో "బందీ"ని తప్ప..... ఈ ప్రశ్నకు బదులు ......... ..................................... నేనెవరో కాదు నీలో వున్నా నీవుని నేను నీ ఊపిరిలో ఊపిరిని నీ కంటిలో పాపని నీకు బాధ కలిగితే నీ కంట నిండే అశ్రువును నీకు మోదము కలిగితే నీ పెదవులపై చిరునవ్వును నీకు ఆవేశం కలిగితే నీ మోమున తోచే అరుణిమను జన్మ జన్మకూ నీతో వుండే నీ తోడును నీ నీడను........22 feb 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mz9srW

Posted by Katta

Kapila Ramkumar కవిత

Jayashree Naidu ||The Nightingale of India, Sarojini Naidu || The Nightingale of India, Sarojini Naidu- is the synonym for Indian poetry in English. The sweetest thoughts are embedded in the shortest possible words And a poet at heart and in her writings too! The songs of yester-years flow in the music of her poems. Here is one such poem - *Alabaster* Alabaster is a stone used to make decorative boxes and even statues. Perfumes and Spices are stored in these decorative boxes to reflect their worth. Sarojini Naidu gives a new comparative for heart that has "the spice and the scent" of life. Alabaster LIKE this alabaster box whose art Is frail as a cassia-flower, is my heart, Carven with delicate dreams and wrought With many a subtle and exquisite thought. Therein I treasure the spice and scent Of rich and passionate memories blent Like odours of cinnamon, sandal and clove, Of song and sorrow and life and love. 22.2.2014 ఉ 6.55

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gp6Ipw

Posted by Katta

Jayashree Naidu కవిత

The Nightingale of India, Sarojini Naidu needs no introduction. She is the synonym for Indian poetry in English. The sweetest thoughts are embedded in the shortest possible words And a poet at heart and in her writings too! The songs of yester-years flow in the music of her poems. Here is one such poem - *Alabaster* Alabaster is a stone used to make decorative boxes and even statues. Perfumes and Spices are stored in these decorative boxes to reflect their worth. Sarojini Naidu gives a new comparative for heart that has "the spice and the scent" of life. Alabaster LIKE this alabaster box whose art Is frail as a cassia-flower, is my heart, Carven with delicate dreams and wrought With many a subtle and exquisite thought. Therein I treasure the spice and scent Of rich and passionate memories blent Like odours of cinnamon, sandal and clove, Of song and sorrow and life and love. Sarojini Naidu

by Jayashree Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nUEcPm

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ -|| సాహితీ స్రవంతి విస్తృత సమావేశం ||16.2.2014 మానవ విలువలను నిలబెట్టేదే మిజమైన సాహిత్యమని, అదే సమాజాని సరియైన మార్గంలో నడిపించటానికి ఎంతో దోహదపడుతుందని, నేటి సంక్లిష్ట పరిస్థితులలో సాహిత్య కారుల బాధ్యత ఎంతో వుందని, విష సంస్కృతి వైరస్‌లా వ్యాపిస్తున్న తరుణలో కవులులు, కళాకారులు ప్రజలను తమ రచనలద్వార, కళారూపాలద్వారా చైతన్య పరచాలసిన అవశ్యకత ఎంతోవుందని హైదరాబాద్‌ నుండి వచ్చిన సాహితీ ప్రస్థానం పత్రిక సంపాదకవర్గ బాధ్యులు, వొరప్రసాద్ తమ సౌహార్ద్ర సందేశంలో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సాహితి స్రవంతి విస్తృత సమావేశం స్థానిక ఎన్‌.ఎస్‌.సి.కాలనీ ప్రాథమిక పాఠశాలలో 16.2.2014 నాడు కొత్త ఉత్సాహాన్ని అందించిందని, ఈ స్ఫూర్తితో మరింత పటిష్ఠమైన సాహితీ కార్య క్రమాలు నిర్వహించగలమని అందరూ అభిప్రాయపడ్డారు. కార్యక్రమాన్ని సంపటం దుర్గా ప్రసాద్ ప్రారంభిస్తూ అతిథులను వేదికపైకి అహ్వానించారు. ఈ విస్తృత సమావేశనికి సాహితీస్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి అధ్యక్షతవహించగా, రాష్ట్రకమిటీ బాధ్యులు ఒర ప్రసాద్‌ అతిథిగా విచ్చేసారు. స్థానిక ప్రముఖ కవి, రిటైర్డ్ ఆచార్యులు డా.పి.సుబ్బారావు గారు, రిటైర్డ్ తెలుగు ఉపన్యాసకులు డా.కావూరి పాపయ్య శాస్త్రి, బి.వి.కె. గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్, డా. సి,హెచ్. ఆంజనేయులు, సాహితీస్రవంతి భద్రాచలం బాధ్యులు మాల్యశ్రి, తాతోలు దుర్గచారి, వీధుల రాంబాబు, కొత్తగూడేం-పాల్వంచ బాధ్యులు ప్రముఖ కథకుడు శిరంశెట్టి కాంతారావు,ఇల్లెందు బాధ్యులు బి.ఇందిర, కటుకోజ్వల రమేష్ , మధిర బాధ్యులు పోతగాని సత్యనారాయణ ప్రతినిధులుగా హాజరైనారు. ఈ సమావేశంలో అధ్యక్షోపాన్యాసం చేస్తూ 199 జనవరి 26 న ప్రారంభమై. గత 15 సంవత్సరాలుగా సాహితీ స్రవంతి ఖమ్మం జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం జరిగింది. ఎన్నో సాహితీ సెమినార్లు, కవి సమ్మేళనాలు, కార్యశాలలు, నిర్వహించటం జరిగిందని. కొత్త కవులకు ప్రోత్సాహించటంలో తన వంతు కర్తవ్యాన్ని పోషించిందని, వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించిందని, కవితా సంకలనాలు, చరిత్ర-సైన్‌స్ లాంటి అనువాద పుస్తకాలు వెలువరించి విశేష కృషిచేసి రాష్ట్ర వ్యాప్త సాహితీ స్రవంతిగా విస్తరించడమే కాక రాష్ట్ర స్థాయి నుండి సాహిత్య ప్రస్థానం అనే సాహితీ మాస పత్రికను నడుపుతూ పలువురి ప్రశంసలందుకున్నదని తెలిపారు. కార్యదర్శి రౌతు రవి మాట్లాడుతూ త్వరలోనే వార్షికోత్సవాన్ని. వర్క్‌షాప్ నిర్వహించడానికి ఉగాది కవిసమ్మేళనాన్ని అన్ని కేంద్రాలలో నిర్వహించాలని అంతే కాక సాహితీ ప్రస్థానం కు చందా కట్టి ప్రతీనెల మన కార్యక్రమాలను పత్రికద్వారా విస్తృత ప్రచారం చేయాలని కోరారు 15 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా త్వరలో సాహితి కార్యశాల ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల వారికి ఖమ్మంలో నిర్వహించతలచామని, అలాగే, కవితలు, కథలు పోటీలు నిర్వహించాలని, ఎంపికచేసిన వాటితోనూ, సాహిత్య వ్యాసాలతో ఓక ప్రత్యేక సంచిక వెలువరించాలని,21 ఫిబ్రవరి మాతృ భాషాదినోత్సవం జరపాలని, మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరపాలని, నిర్ణయించామని తెలిపారు. అందుకు అందరూ సహకరించాలని కోరారు. డా,పి.సుబ్బారావు గారు సాహితీ స్రవంతితో ఎంతో సాన్నిహిత్యాన్ని కలిగివున్నానని, వారి అన్ని పార్యక్రమాలలో పాల్గొంటునే వున్నాని. వారు ప్రతీనెల మూడవ ఆదివారం నిర్వహిస్తున్న సాహిత్య అధ్యయన వేదికలో పాల్గొని తన సూచనలు, సలహాలు, యిస్తున్నాన్ని. సదా తనవంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. డా. కావూరి పాపయ్య శాస్త్రి గారు ఎప్పటిలాగే తన సహాయం, సలహాలు, సూచనలు కొనసాగిస్తానని తెలిపారు. భద్రాచలం, కొత్తగూడేం,పాల్వంచ, ఇల్లందు, మధిర ప్రాంతాలనుండి వచ్చిన సాహితీ స్రవంతి బాధ్యులు తమ నివేదికలు సమర్పించారు. బి.వి.కె. విద్యార్థి ఆసు ప్రసాద్‌, స్థానిక సాహితీ స్రవaతి జిల్లా బాధ్యులు ఎం.శేషగిరి, కన్నెగంటి వెంకటయ్య ఈ సందర్భంగా తమ గళంలో చక్కని గేయాలు వినిపించారు. ఈ సమావేశంలోనే ఖమ్మం డివిజన్‌ కమిటీని ఎన్నుకోవటం జరిగింది. డా.కావూరి పాపయ్య శాస్త్రి గౌరవ అధ్యక్షులుగా, సంపటం దుర్గా ప్రసాద్ అధ్యక్షుడుగా, కార్యదర్శిగా కంచర్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా బండారు రమేష్, ఉరిమళ్ల సునంద. శైలజ, ఉపాధ్యక్షులుగా షేక్.నాజర్, గి. వేణుగోపాల్, వి.పాపాచారి, సభ్యులుగా శ్రీధర్, వట్టికూటి మురళి, రవీందర్, ఇ.ప్రసాదరావు ఎన్నికతో నూతన కమిటీ యేర్పడినట్లయింది. ఈ నూతన కమిటీని సాహితీ స్రవంతి జిల్ల బధ్యులు, రాష్ట్ర బాద్యులు అభినందించారు. చివరలో ఎం.శేషగిరి, కపిల రాంకుమార్ తమ తమ అభిప్రాయాలను తెలిపారు. కార్యక్రమాన్ని విశ్లేషణ్కావిస్తూ కన్నెగంటీ వెంకటయ్య ఓ చక్కటీ గజల్‌ ఆపించి, వందన సమర్పణ చేసారు

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f5PvPB

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్||How To Kill ||Keith Douglas Under the parabola of a ball, a child turning into a man, I looked into the air too long. The ball fell in my hand, it sang in the closed fist: Open Open Behold a gift designed to kill. Now in my dial of glass appears the soldier who is going to die. He smiles, and moves about in ways his mother knows, habits of his. The wires touch his face: I cry NOW. Death, like a familiar, hears And look, has made a man of dust of a man of flesh. This sorcery I do. Being damned, I am amused to see the centre of love diffused and the wave of love travel into vacancy. How easy it is to make a ghost. The weightless mosquito touches her tiny shadow on the stone, and with how like, how infinite a lightness, man and shadow meet. They fuse. A shadow is a man when the mosquito death approaches (పొయిట్రీ హంటర్ సౌజన్యంతో) 22.2.2014 ఉ. 5.55

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fo92zg

Posted by Katta

Cv Suresh కవిత

సి.వి. సురేష్ || ఓ .......కవీ|| ఓ కవీ ..........! అలౌకిక ప్రప౦చ౦లో తిరగాడే నీవు ఈ యా౦త్రిక‌ ప్రప౦చానికి నీవో వి౦తే! ఓ కవీ ఓ స౦క్లిష్టతని, ఓ వ్యధని , ఓ అనుభవాన్ని నగిషీలుగా మార్చి అక్షరాలకు కుట్టే నీ నైపుణ్యత ఈ లోకానికో వి౦త అనుభవమే! ఓ కవీ పెచ్చులు పెచ్చులగా రాలిపోతున్న హృదయాల మధ్య లో తడి ఆరని నీ భావనలు విడ్డూరమే!!! ఓ కవీ..! కొలిమిలో కరగదీస్తున్న మనిషితనాల నడుమ కాలి ఆయిధ౦గా మారిన నీ పదునొక ఆశ్చర్యమే 2 అరచేతిన‌ ఇ౦కా వ్రేళ్ళు మొలవక ము౦దే పిడికిలి బిగి౦చిన ఆనవాళ్ళేవో నీ చేతి రేఖల్లో కనిపిస్తాయి మా౦సపు ముద్ద గా వున్నప్పుడే ప్రశ్ని౦చే కణమేదో మెదడులోకి చేరినట్లనిపిస్తు౦ది అసహన౦గా తల్లి గర్భ౦లోనే తిరుగుతున్నప్పుడే చీకటిని చీల్చేసే పదునేదో ని౦పాలనే తపనేదో నీలో కుతకుతలాడి ఉ౦టు౦ది 3 ఓ కవీ! పదానికీ పదానికీ మధ్య ఏవేవో భావాల్ని కలిపి కుడతావ్ అక్షరాల మధ్య కనిపి౦చని సన్నని వ్యధనో ఓ అద్భుత ప్రేమ భావననో మనసు దారాలతో అల్లి కద‌౦బాన్ని చేస్తావ్ ఇ౦కా. మనసులోలోపలి భావాల్ని తవ్వి తీస్తావ్..లేపన౦ పూస్తావ్ అక్షరాలను కరిగిస్తావ్ పదాలను బుజ్జగిస్తావు ఎగదోస్తావు రగిలిస్తావు కాల్చేస్తావు పదునైన అయిధ౦ లాగా మార్చి గు౦డెలోతుల్ని తడుముతావు 2 అయినా... ఓ కవీ! నీ కిదే౦ చపల చిత్త౦....? అక్షరాలను మోసుకెళ్తూ ఒక్కో గదిని ఖాళీ చేసుకొ౦టూ ఇ౦కో అన౦త౦ లోకి వెళ్ళి పోతు౦టావ్? నిత్య అన్వేషకుడిగా.... అలుపెరగని అక్షర శ్రామికుడిలా.!? 22.2.14

by Cv Suresh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fnuW5w

Posted by Katta