పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, మార్చి 2014, ఆదివారం

Satya NeelaHamsa కవిత

-- అయినా ఆ కళే వేరు.. ^^^^^^^^^^^^^^^^^^^^^^^ -సత్య విధి వధిలేసిన బతుకుల మధ్య గొంతులొ ఎండిన మెతుకుల మధ్య పల్లపు దారుల గతుకుల మధ్య కడుపు కాలితే పుట్టేది కళ, అయినా ఆ ఆకలితీర్చే కళే వేరు... రెప రెప లాడే నెత్తుటి జెండా భుజాన మోసే పథాన సాగి ఎదురు నిలిచిన నిబ్బర గుండెల విప్లవాల తో పుట్టేది కళ, అయినా ఆ ఉద్యమాల కళే వేరు... విజయవికాస కష్ట స్వేధమై సత్యబీజపు నిత్యసేధ్యమై కృషి కార్యాల ఇష్ట సాధనై ప్రతిఘటన నుండి పుట్టేది కళ, అయినా ఆ ప్రగతినిచ్చే కళే వేరు... పెద్దలు పేర్చిన ఫలాల పంట తోడుక నీడగ కదిలే వెంట ధార్మిక జ్ఞాన కర్మలనుండి సంప్రదాయం నుండి పుట్టేది కళ, అయినా ఆ సంస్కరించే కళే వేరు... -సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mkPlK9

Posted by Katta

Sriramoju Haragopal కవిత

ఒక’ సారీ‘ నిన్న రాత్రి సినీవాలి వెన్నెలలు రాలిపోయిన జాబిలి చెట్టు నింగిలో చుక్కలు నిదురవనంలో కలలసుమాలు ఎత్తుకపోయినట్లు గాలిపెదవులు తడారిపోయి కీచురాళ్లతో మాట్లాడించినట్లు నేలజారిన పూలపుప్పొడుల మీద కరుకుపాదాల మరకలు వెనకకు మర్లిపోయిన కొండవాగు ఆత్మీయశైతల్యం మనసుబండలైపోయిన గుండెకొండ శైథిల్యం ప్రశ్నలే పట్టువిడని విక్రమార్కులై జవాబుల బేతాళులే అంతులేని అహాల చెట్లెక్కి పోతే జీవితకావ్యంలో చింపేసిన మాటలకథలు అతుకుపడని ఆంతర్యాల అంతర్యానం ఎవరు ముందు ఎవరు వెనుక సందేహాలే శాసించే స్నేహాల మోహంమీద నిస్సందేహంగా కన్నీటిలిపి వుండే వుంటుంది నీవైతేనేం, నీదైతేనేం ఏకాంతమేగా నేనైతేనేం వొదలని మౌనం

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gQuCyx

Posted by Katta

Jaligama Narasimha Rao కవిత



by Jaligama Narasimha Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mkPjSE

Posted by Katta

Rama Krishna Perugu కవిత



by Rama Krishna Perugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gQuCia

Posted by Katta

Radha Ramanaguptha Jandhyam కవిత

JAYA NAMA Ugadi subhakanshalu...

by Radha Ramanaguptha Jandhyam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gQuCi0

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

మృదువుగా , మధురం గా కవిత ని కవిత లా రాయాలన్న విశ్వప్రయత్నం లో ఇంకో సారి ఓడిపోతూ ............... నిశీధి | దురాశ | జీవితం ఒక్కసారి హత్తుకో నన్ను మనస్పూర్తిగా , మరో ఆశగా తడికళ్ళతో తమకంగా తత్వాలకి తపనలకి దూరంగా నాలో నన్ను వెతుక్కునే ప్రయత్నం ఫలించేలా తెలియక వేసిన తడబాటు అడుగులు మధుర జ్ఞాపకాలై తెలిసిన మెలుకువ ఒప్పులు ముందుటడుగుల్లా మిగిలిపోయేలా కళ్ళ పుసుల్లా కరిగిపోయే ఊసులుగా కాకుండా కంటి రెప్పలా మిగిలే ఇంకో ఉదయాన్నివ్వు నిద్ర లో ఉలిక్కిపడే పసితనం ని జో కొట్టే అప్యాయతవవ్వు పువ్వులో నవ్వు చూడగలిగే నవ్వుల వెనక దాగున్న బాధ అర్ధం అయ్యేలా మృదుత్వాన్ని ఒక సారైనా ఇవ్వు తీరని కోరిక అంటావా ? హుమ్మ్ నా నిన్నుగా నీతో కలిసి నీతో పాటు ఓడిపోతూ నాలో నిన్ను గెలిపిస్తూ నీ భయాలు వేదనలు నాలో దాచుకుంటూ ప్రయాణిస్తూన్నానుగా ఆ మాత్రం చేయలేవా? నా కోసం ? ఒక్కసారి మెత్తగా హత్తుకోలేవా ? బాధలన్ని బరువు తగ్గిన మేఘాల్ల్లా కరిగి కన్నీటిలో జారి పరుగులెత్తేలా కౌగిలించుకోలేవా ? నిశీ !! 30 / 03 / 14

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mkPkWB

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-35 బొంది లో కరెంట్ ఉన్నట్టుండి కట్ అయినపుడు అంతసేపు నవనవలాడే దేహం బిర్ర బిగుసుకొని కట్టెలా మారిపోతుంది... సంపాదించుకున్న అనుభవాలన్నీ అంతటితో తెగిపోవలసిందేనా...? పునర్జన్మ ఉంటేగనక అక్కడికి బదిలీ అవుతాయా ...? ఏ ఉపన్యాసమూ..ఏ ఉపదేశమూ ఈ దాహాన్ని పూర్తిగా తీర్చదెందుకని..? శూన్యంలో ప్రవహించే వాయువు వంటి మన్సు ఏదో చెబుదామని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది... అంతర్జాలంలో ఒక కిటికీ నుంచి ఇంకో కిటికీ కి ఎలా పోతుంటామో అంతర్ ప్రపంచంలో కూడా అదే తంతు..! ------------------------------------------------- 30-3-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jLRcdM

Posted by Katta

Rajkumar Bunga కవిత

ఆర్కే ||బుంగలు (1)|| ఔను ... ఎంత ఉతికిన మనసు పరిశుద్దత సంతరించుకోవడం లేదు. బహుసా మాసిన గుడ్డతో శవాన్ని మనసుని కలిపి చుట్టాలేమో! ఏమో మనసు గుర్రం ఎగరావచ్చు.... పరిశుద్దినివైపు!! ఆర్కే ||బుంగలు (1)||20140330

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gQ6lJ2

Posted by Katta

Nirmalarani Thota కవిత

ఏదో పద సవ్వడి..వడివడిగా గుమ్మానికి వ్రేలాడుతూ చూపుల తోరణాలు . . వయ్యారి వసంతమా వచ్చేస్తున్నావా? నీ మూన్నాళ్ళ వగలన్ని మళ్ళీ ఒలికిస్తావా ? చివుళ్ళు వేయడం ఆనక చిదిమేయడం నీకే చెల్లు.. వినిపిస్తుందా నీకు ఎండుటాకుల గలగలలో అడియాశల ఆత్మ విలాపం కనిపిస్తుందా నీకు మోడుబారిన గుండెల్లో ఆత్మీయతల చరమ గీతం నా పిచ్చిగానీ . . గడిచిపోయిన నిన్నటి శిథిల శిశిరంలో రాలిపోయిన ఆశల ఆకులెన్నని ఈ వసంతాన్నడిగితే ఏం చెపుతుంది ? అది రాలిన చోటే తను పుట్టానని మిడిసిపడుతూ గర్వంగా చెపుతుందా..? లేక ఇదే ప్రశ్న రేపు నేను రాలిపోయాక వచ్చే వసంతాన్నడుగుతావా అని దిగులు పూల హారాలతో బదులిస్తుందా.? కాలానికి ఋతువులెన్ని మారినా అనుభూతుల చివుళ్ళ జాడేది? పంచ వన్నెల పంచాంగాలెన్ని పరచినా మస్తిష్కపు మంచు పొరలు తొలగవేం? యుగాలు దాటే ఉగాదులెన్ని ఎదురొచ్చినా ఎద కోయిల కూయదేం? పల్లవించని స్పందనల్లో గొంతు దాటని కూజితాలన్నీ నిశ్శబ్ధ సంగీతాలేనా? ఉదయించని స్తబ్ధ ఉగాదులేనా? నిర్మలారాణి తోట [ తేది: 30.03.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hoeOBN

Posted by Katta

Gvs Nageswararao కవిత

//సంకల్పం// గరిమెళ్ళ నాగేశ్వర రావు// మొన్న రాత్రివేళ హఠాత్తుగా మాయమైపోయిన వెన్నెల ఎక్కడికి వెళ్ళిపోయిందో అని వెదుక్కుంటూ వుంటే... వేపచెట్టు కొమ్మల రెమ్మల్లోంచి పువ్వులై నవ్వుతూ కనిపించిందది. కోయిల గానం లోంచి వినిపించే ధ్వానం లోనూ చిగురుల వగరులని దానం చేసిన మామిడి కొమ్మ త్యాగం దాగుందట మొగ్గ తొడిగేవేళ మల్లె మొక్క మదిలో.. మన్మధుడు రధమెక్కి కదులుతూ మెదిలి ఉంటాడు.. అందుకే గమ్మత్తుగా మత్తెంకించే ఈ పరిమళం. తూరుపు కొండల లోంచి శిరసెత్తిన తొలికిరణం వేకువ దేహం మీద కాలం కానుకలా వెలిగే ఆభరణం మేఘం తో మేఘం తాకినప్పుడు మోగిన మోహన రాగమేదో మలయ వీచికతో కలిసి మంగళ గీతం పాడిందట ఊహా జనిత ఉత్ప్రేరకం లాంటి ఉత్సాహమే కదా ఉగాది అంటే! ఊహల ఉయ్యాల దగ్గర హృదయపు చెవి పెట్టి విను కొత్త శిశువు చెబుతుంది రేపటి ఉగ్గుపాల ఊసులు వసంతాన్ని స్వాగతిస్తూ తొలికోడి కూయగానే మొదలయ్యింది సంవత్సరం పొడవునా సాగాల్సిన జీవనోత్సవం. నోరు తెరచి స్వాగతించగానే ఆరు రుచులపచ్చడి ఆలోచనల లోలోపలికీ చేరి అరిగినట్టే ఉంది.. నవనాడులనూ శుద్ది చేసి జీవన యుద్ధానికి సిద్ధం చేస్తుంది. పంచాంగ శ్రవణంలో వినిపించే భవితవ్యం ఒక హెచ్చరిక రాజ్యపూజ్యమెదురైతే ఉప్పొంగి పొంగి పోకు అవమానం బెదిరిస్తే భయపడుతూ లొంగిపోకు మేషమైన సింహమైన, మిధునమైన మీనమైన రాశి ఫలం చెబుతుందట గంటల పంచాంగం రాశేదైన రాసిందేదైనా అసలు బలం నీలోనే ఉందన్నది యదార్ధం కందాయ ఫలంలో సున్నా ఎక్కడ ఉన్నా నీహృదయం లో దానిని చేరనీకు ఆగ్రహం పోయి గ్రహాలన్నీ అనుగ్రహాలించాలంటే చెయ్యాలి నువ్వొక దానం..నువ్వుల దానం కాదది అహాన్ని దహనం చేస్తూ 'నేను ని వదిలే దానం అది. మిత్రమా ఈ పండగవేళ మది మలినానికీ తలకడిగి కొత్తగా ధరించి మానవత్వాన్ని పట్టుదల వస్త్రంలా. శాంతి ఎప్పుడూ హోమగుండం లోచి పుట్టదు. అది ప్రేమ భాండం లోంచి పుడుతుంది. పదిమంది కలిసిన చోటే పండగ మొదలౌతుంది చిరునవ్వు పూసిన చోటే ఉగాది చిగురిస్తుంది . 30/3/2014

by Gvs Nageswararao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hoeNhn

Posted by Katta

Kushagari Yanganna కవిత



by Kushagari Yanganna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oe2qti

Posted by Katta

Chandrasekhar Vemulapally కవిత

చంద్రశేఖర్ వేములపల్లి || నా చెలి! || దూరంగా ఎక్కడికో నీవు వెళ్ళిపోతూ తలుపులు మూసివేస్తున్న భావనే కన్నీళ్ళై, నా బుగ్గలపై జారి నా ప్రపంచం .... శూన్యం అయిపోతున్నట్లుంటుంది నా భుజస్కందాలే నాకు దూరమై .... నా మనోగతం చీకటి అయోమయమై కాలం భారంగా కదులుతున్నట్లు గోడమీద గడియారమూ, గుండె లయను కోల్పోయి అసంతులనంగా వేగంగా కొట్టుకుంటున్నట్లుంటుంది. నీవు పక్కనున్నప్పటి నీ స్నేహ ఆత్మీయ బుజ్జగింపులు నా మది తెరపై జ్ఞాపకాలై అస్పష్టంగా .... పదే పదే కదులుతూ నీ ప్రతి ఊహ తోనూ నా హృదయం ఆవిరై ఒంటరితనం పై .... తీవ్రమైన అసహ్యం పెరుగుతూ తెలియని అలజడి, న్న నరనరాల్లో పెరిగి ముచ్చెమటలు పడుతుంటాయి. గదిలోని ప్రతి వస్తువు మౌనంగా నీ పేరే జపిస్తూ నా మనసును కలవరపెడుతుంటుంది. తీయని సెంట్ వాసన .... ఏదో బెడ్ రూం లో వరదలై పారి తలగడను అతుక్కునున్న సువాసనల జాడలు బెడ్ రూం నేలపై పరుచుకునున్న నీవు విడిచిన ఆ దుస్తులు వెదజల్లుతున్న నీ స్వేద మత్తు వాసనలు పీల్చేకొద్దీ .... విపరీత భావనలేవో చెలరేగి నా గుండె అల్లల్లాడుతుంది. అకస్మాత్తుగా నా మనస్సు ఖాళీ అయిపోయి నేను అపస్మారక స్థితిలోకి జారుకుంటున్నట్లు నా సర్వమై అమూల్యమైన లక్షణం నిన్ను శాశ్వతంగా కోల్పోతున్నానన్న కారణం ఏదో నన్ను ప్రశ్నిస్తుంటుంది. నిజానికి .... నీవు నానుంచి కోరుకున్నదేమిటని? నా ఆత్మ సమర్పణ నీన్నే ప్రేమిస్తున్నాననే ఆలోచనను దాచలేని నా ఎద భావనను .... నా నోట వినాలనే అని. నీ ఆత్మ సౌందర్యం ప్రకాశమేమో నీ కళ్ళలోనే కనిపిస్తుంది నీ పెదవుల్నుంచి త్రుళ్ళిపడే .... తియ్యని మాటలు మదిని ఊరిస్తూ స్వర్గం ఎంతో సమీపంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. నీవు నా పక్కన ఉన్నప్పుడు నీ నవ్వు నా ప్రపంచాన్ని ఆశావహం గా మారుస్తూ, జంట నక్ష త్రాల్లా ఏ వజ్రాలూ కెంపులకు లేని మెరుపుల్లా లక్షల్లో అరుదైన ఒకే ఒక్క జంటలా మన ప్రేమ మనకు అరుదైన ఆనందాన్నిస్తూ ఏ ప్రత్యామ్నాయమూ లేని దివినుంచి దిగివచ్చి .... భువిలో నా కోసమే జన్మించిన మణివో మాణిక్యానివో అన్నట్లు ఎన్ని జన్మలైనా ఎంత మదనపడైనా పొందాల్సిన సందర్శనీయ బహుమానం నీ అనురాగం అనిపిస్తుంది. నా హృదయం నీకు సమర్పించుకుంటున్నాను నీపై నాకున్న ప్రేమకి గౌరవ సూచన గా సంపూర్ణంగా .... అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది ఆ బ్రహ్మ ఎంతో కష్ట పడి అనురాగము, ప్రేమ .... సమతుల్యం గా శిల్పంగా నిన్ను చెక్కాడేమో అని నా అంతరాంతరాల్లో తుడిచివెయ్యలేని రాగ బంధం నీ ప్రేమే అని అంకితమిస్తున్నాను. నా అమరప్రేమను .... ఎంతో వినమ్రంగా నీవూ, నేనూ ఒకరికి ఒకరం చేరువైన క్షణాల్లో తగిలే నీ వెచ్చని శ్వాస కోసం .... నీ అనురాగం స్నేహం ఆత్మీయతల కోసం .... శారీరకంగా, మానసికంగా నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. నీ ప్రతి కోరిక నా ఆత్మ అభీష్టమే అనుకుని జీవన చరమ ఘట్టం .... స్వర్గం చేరేవరకూ .... కలిసుంటానని మాటిస్తున్నాను. నా ఆత్మ, నీ ఆత్మ ప్రేమకు కట్టుబడి ఉంటుందని 30MAR14

by Chandrasekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNXmq4

Posted by Katta

Tarun Chakravarthy కవిత

తరుణ్ చక్రవర్తి ||నేను ....|| నేను మాట్లాడకపోతే ప్రపంచం మూగవోతుంది నేను కదలకపోతే ఈ జగం నిశ్చలమవుతుంది నేను వినకపోతే ఈ లోకం వేదన అరణ్య రోదనవుతుంది నేను చూడకపోతే వెలుగు చీకటయిపోతుంది నేను శ్వాసించకపోతే గాలులు స్థంభించిపోతాయి ........ నేను అనంతాన్ని నేను దిగ్దిగంతాన్ని నేను తరంగాన్ని నేను కిమ్మీరపు గాలి తెమ్మెరను నేను రేణువును, గోపగోపికా కోపతాప స్వాంతనపు వేణువును నేను భావాన్ని, నేను పక్ష్యాదుల కిలకిలారావాన్ని నేను జగత్తును, నేనే మహత్తును నేను మరచిపోబడ్డ గతాన్ని, నేను దద్ధరిల్లుతున్న ఉద్యమకారుడి స్వగతాన్ని.... నేను మరీచిని, నేను లోక పునర్నిర్మాణం కోసం వెన్నెముకనిచ్చిన దధీచిని. నేను చేతస్సును, నేను ప్రజాశ్రేయస్సు కోసం ఆవిష్కృతమవుతున్న హవిస్సును... నేను కుసుమపేశల శిరీశను, నేను జిగీషను నేను కవిత్వపు వస్త్వైక్యాన్ని, నేను కవి భావనలోని ఏకాత్మతను నేను ప్రపంచపు చైతన్యాన్ని, మానవ హృదయాశావధి నిండిన భావనాత్మక ఔన్నత్యపు ఉనికిని.. నేను భీరువును, నేను ధీరుడిని.... నేను భీకర ఆయుధాన్ని, తండ్రి యెదపై ఆడే చిన్నారి నవ్వుల శీకరాన్ని... నేను బలవంతుడి ధాష్టీకానికి తెగిపడ్డ మెడను.. నేను చలిచీమల చే కట్టబడ్డ దుర్భేద్యపు గోడను... నేను మానవాంతర్గత సంద్రపు కల్లోలాన్ని.. నేను తిమిరలోకపు గుండెలు చీల్చిన ఉదయ శరాన్ని... నేను యుద్ధ సేనాని రథ కేతనాన్ని.. నేను సమాజంలోని అధిపత్యవాదులచే కుంచించబడుతున్న గౌరవమనే వేతనాన్ని... నేను మనిషి గుండెలో విరుస్తున్న వాత్సల్య శిల్పాన్ని.... నేను బండరాళ్ళ ను చీల్చుకుని మొలకెత్తుతున్న వికసిత పుష్పాన్ని.... ... ... ... నేను గాలిని.... నేను వెలుగును... నేను స్వాంతనను... నేను చైతన్యాన్ని.. నేను మనిషి మస్తిష్కంలో ఇంకా ఇంకని మా న వ త్వ పు జా డ ను.....

by Tarun Chakravarthy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNXm9E

Posted by Katta

Ramesh Ragula కవిత



by Ramesh Ragula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oe2pWg

Posted by Katta

Pratapreddy Kasula కవిత

http://ift.tt/1oe2pFW

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oe2pFW

Posted by Katta

Manjunadha Reddy కవిత

ఏమి చేయాలో ఏమి చేస్తున్నామో ఎక్కడికి వేళ్ళలో ఎవరిని కలవాలో ఎవరితో మాట్లాడాలో తెలియలేదు ఎవరికి ఏమి ఇష్టము ఏది కష్టము తెలియదు ధర్మము ఏమి అధర్మము ఏమి తెలియదు దానమేది దొరతనమేది తెలియదు దావా ఏది ద్వారం ఏది తెలియదు మంచి ఏది మర్మము ఏది తెలియదు అందము ఎందుకు ఆనందము ఎందుకు తెలియదు ఆవేశాలు ఆక్రోశాలు ఎందుకు తెలియదు ఆలోచనలు అవసరాలు ఎందుకు తెలియదు సుఖమెందుకు దుఖమందుకు తెలియదు వేశామెందుకు వెతుకులాట ఎందుకు తెలియదు వేదన ఎందుకు వెక్కిరింత ఎందుకు తెలియదు పాట ఎందుకు అట ఎందుకు తెలియదు పల్లవి ఎందుకు పరువం ఎందుకు తెలియదు శాసనం ఏంటి చామంతి ఎవరు తెలియదు భంధం అనుభంధం ఏమిటికి తెలియదు త్యాగం స్నేహం ఏమిటికో తెలియదు @ G. Manju 30/03/2014

by Manjunadha Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mj4nA3

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

అరుణమణులు... 1 మరో మారు పార్టి జెండ మార్చావా కండువా!? ఎటుబడితే అటునడిచే రాజకీయ శిఖండివా!? 2 ఎవరికైన వుండాలోయ్ ప్రజాస్వామ్య నిబద్దత వోటు తోటి ఋజువుచెయ్ రాజకీయ విశుద్దత. 3 ఎన్నికలపుడే పుట్టే "నేత" కాడు హ్యూమనిస్టు ఓట్లు గుంజె ఎత్తుగడల చిఠాయే మ్యానిఫెస్టు. 4 చేతిలోకి డబ్బువస్తె అవుతావా నరపతి!? నోటు కోరకు ఓటునమ్మి కోల్పోకోయ్ పరపతి!! 5 "మూసీ"నది చరిత్రంత మురుగు నీట మునిగింది ప్రజాస్వామ్య ఘనతనంత పచ్చ నోటు మింగింది. . 30.3.14.

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rSrUvQ

Posted by Katta

Venkata Hanumantha Ramakrishna Tummalachervu కవిత

నా కాశ్మీర్ భూలోకం లో నాకం లా విలసిల్లేది నా కాశ్మీర్ // నా తల్లి తలపై మల్లె పువ్వై పరిమళించేది నా కాశ్మీర్ // ఆకశం లో వెలుతురు తోటై మురిపించేది నా కాశ్మీర్ // అందాల గుల్మొహర్ లా విరబూసేది నా కాశ్మీర్// పసి పాప నవ్వులా మంచు వెన్నెలలు కాసేది నా కాశ్మీర్ // శంకర బోధామృత పునీత పులకిత గాత్ర నా కాశ్మీర్ // సనాతన భారత జీవిత పథ నిర్దేశిక నా కాశ్మీర్ // అరమరిక లెరుగని నా పూర్వీకుల అమాయకత్వానికి బలి పశువైంది నా కాశ్మీర్ // ఆశ్రయ దాతలను నిరాశ్రయులను చేసి// స్వాతంత్ర పోరాటం అంటారు నర మాంస భక్షకులు // వితండ వాదాన్ని చరిత్ర చేసి అబద్ధాన్ని బాగ అలంకరించి // మా నెత్తుటి మరకలపై మసి పూసి మాయం చేసి // అన్యాయాన్ని న్యాయం గా నిరూపిస్తున్నాయి ధివాంధములు // మా శరీరాన్ని ఒక్కో ముక్కా కొరుక్కు తింటూ // చచ్చి పోతున్నాం బాబో అని మొత్తుకొంటుంటే // మా ఆకలి తీరడమే సెక్క్యులరిజం అంటాయి గుంట నక్కలు // నా వాళ్ళను చంపే ఇజం నాభూమిని దిగమింగే ఇజం // నా దెశం విడగొట్టే ఇజం ఎంత పెద్ద నిజమైనా // అది మా పాలిటి పగబట్టిన మరణ శాసనం // మా కాశ్మీర్ మాకు కావాలి మా దెశం మాది కావలి // మాకు బిరుదులొద్దు మాకు సెక్క్యులరిజం భుజ కీర్తులొద్దు// మాకు మాకశ్మీర్ కావాలి మా స్వర్గం మాకు కావాలి // హెల్ విథ్ యువర్ సెక్క్యులరిజం . హెల్ విథ్ యువర్ ఎక్ష్స్ట్రీమిజం // కశ్మీర్ మాది మా తాత తండ్రులది మా కాశ్మీర్ మాకు కావాలి // 30/3/14

by Venkata Hanumantha Ramakrishna Tummalachervu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNw1Eo

Posted by Katta

Vakkalanka Vaseera కవిత

పిడికెడు అన్నం, రొట్టిముక్కా... కొన్ని కొడవళ్లని, కొన్ని నాగళ్లని కొన్ని పొలాలని, కొన్ని గ్రామాలని కొన్ని గుడిశెల్ని, కొన్ని మేడల్ని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్కా కడుపులో దాచుకున్నాయి కొన్ని పిడికిళ్లని, కొన్ని నినాదాల్ని కొన్ని పోలింగ్‍బూత్‍లని, కొన్ని తుపాకుల్ని కొన్ని అణుబాంబుల్ని, కొన్ని అడవుల్ని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్కా కడుపులో దాచుకున్నాయి కొంత రక్తాన్ని, కొంత క్రూరత్వాన్ని కొంత ద్వేషాన్ని, కొంత కారుణ్యాన్ని కొంత చీకటిని, కొంత కాంతిని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్కా కడుపులో దాచుకున్నాయి కొన్ని ప్రవాహాల నీటిని కొన్ని కార్చిచ్చుల అగ్నిని కొన్ని శ్వాసల ప్రాణవాయువుల్ని కొన్ని దృశ్యాలని, కొంత నిద్రని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్క కడుపులో దాచుకున్నాయి కొన్ని కలల్ని, కొన్ని కోరికల్ని కొంత సంతోషాన్ని, కొంత దు:ఖాన్ని కొన్ని రోజుల్ని కొన్ని శబ్దాలని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్క కడుపులో దాచుకున్నాయి కొందరు అమ్మల్ని, కొందరు నాన్నల్ని కొందరు పూర్వికుల్ని, కొందరు నరుల్ని కొందరు గ్రామ దేవతల్ని, కొందరు కులదేవతల్ని, కొన్ని వర్షాలని, కొన్ని యజ్ఞాలని పిడికెడు అన్నం, చిన్న రొట్టిముక్క కడుపులో దాచుకున్నాయి మరకల్లేని మనసులతో సృష్టికర్త ప్రసాదంగా పిడికెడు అన్నం, చిన్న రొట్టి ముక్కా ఇచ్చినా పుచ్చుకున్నా, కాలం కొమ్మలు చాచి కాలిబాటనిండా పూల వనాల నీడల్ని అనుగ్రహించదా? కాలం చేయెత్తి దీవించి మానవీయ జీవితానికి దివ్యసుగంధాలు అనుగ్రహించదా? - వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hnvQ2S

Posted by Katta

Nagalakshmi Varanasi కవిత

జయకేతనమేగరేస్తూ 'జయ' ఉగాది- Dt. 29-3-2014 ప్రభాత స్నానం కావించి ధవళ కాంతుల పేటిక తెరిచి సప్త వర్ణాల సొగసులద్దుకుని జయ నామం ధరించి ఉగాది వస్తోందిట ! దేనితో స్వాగతించను? అరవయ్యేళ్ళ పాత పెంకుటిల్లు ఆరంతస్తుల అపార్టుమెంట్ కాంప్లెక్సుగా మారే క్రమంలో గూళ్లు కోల్పోయిన గువ్వలతో పాటే అంతరించిపోయిందేమో ప్రతిసారీ కుహూ కుహూ అంటూ ఉగాదిని స్వాగతించే కోకిలమ్మ వినిపించకుండా పోయింది ! ఇన్నేళ్లూ శిశిరంలో ఆకులు రాల్చేసి వసంతాగమనంతో చిగురులు తొడిగి పూలతో కాయలతో పిల్లలూగే ఉయ్యాలలతో కళ కళలాడిన చెట్లతో పాటే మావి పూతల్లో చెలరేగిన కూతలమ్మ కూడా మౌనగీతమై కనుమరుగై పోయింది ! అన్ని ఋతువుల్లోనూ ఒకలాగే నిలిచే ఆకాశ హర్మ్యాల నడుమ తలదాచుకునే గూడు లేక తరలిపోయిన శుక పికాల నిష్క్రమణం చూశాక కొమ్మా రెమ్మా కనిపించని కాంక్రీటు అడవిలో శిశిరానికీ, వసంతానికీ తేడా ఏముందని ఆమని అలిగింది! పచ్చని తరుశాఖల పందిరిపై రంగు రంగుల పువ్వులు పేర్చి సీతాకోకమ్మలని ఆహ్వానించే ఆమని అశోకవనంలో సీతమ్మలా శోక ముద్రలో మునిగింది ! పూల రెక్కల్లో ఒదిగి నిదురించి , గాలి పాటల్లో కదిలి నర్తించే వసంత భామిని విడిది చేసే చోటు లేక వడిలిపోయింది, వెడలి పోయింది ! ఇపుడు వసంతం వెంట లేకుండా ఉగాది ఒంటరిగా వస్తుందా ? గుమ్మాలకి వాడని ప్లాస్టిక్ ఆకుల తోరణాలతో స్వాగతిస్తే సెల్ ఫోను రింగు టోనులో కోకిల కూతలు పలకరిస్తే షడ్రుచుల పచ్చడి కూడా కొట్లో కొనితెచ్చిన రెడీమిక్స్ గా కనిపిస్తే ఉగాది ముంగిట్లోకి వస్తుందా ? అవమానపడి వెనుదిరిగి పోతుందా ? మనసు నొచ్చుకున్నా మార్పులు నచ్చకున్నా మానవాళిని మన్నించి చీకట్లని చీల్చే కొత్త వేకువై తూరుపు వాకిట్లో ప్రత్యక్షం కమ్మని వేడుకుంటే ఉగాది కాదంటుందా ? విధ్వంసాలకు స్వస్తి చెప్పి వసుధకు వన్నెలద్దుదాం రమ్మంటే హరిత విప్లవానికి పునాదులేద్దాం పదమంటే, ఉగాది రాకుండా ఉంటుందా ? వస్తుందేమో.... ఎన్నిసార్లు విరిగి పడినా తిరిగి పైకేగసే కడలి కెరటంలా ఎంత అవమానించినా ఋతుచక్రంతో పాటుగా తిరిగి తిరిగి ఆగమించే ఆమని ఈసారి ఒక కొత్త వరవడికి శ్రీ కారం చుట్టేందుకో... ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించే అలవాటుకు స్వస్తి పలికి తీరు మార్చుకోక పోతే , ప్రకృతి సమతుల్యత పట్టించుకోకపోతే తుడిచి పెట్టేస్తానని తర్జని చూపించేందుకో... వస్తుందేమో ! వసంతం గ్రీష్మమై మండి పడే దాకా ఉగాది ఉగ్రవాదై ఉరిమేదాకా సుప్త శిలలై నిలిచిపోకుండా మన తరం చేసిన తప్పిదాలన్నిటినీ తక్షణమే దిద్దుకుని పర్ణశాలల ప్రాంగణాల్లో వసతులిచ్చి తూనీగల సంగీతం వినిపిస్తే, రాలిన పూరెక్కల తివాచి పరిచి భ్రమర గీతాలతో స్వాగతిస్తే వసంతాన్ని వెంట పెట్టుకుని వన్నెల వెన్నెలమ్మలా వెలుగుల వేకువమ్మలా ఉగాది వచ్చేస్తుంది ! వయసుమళ్ళిన సంఘాన్ని వ్యర్ధ ప్రలాపాలిక చాలించి యువతరానికి దారిమ్మనీ, నవ భావాలకు చోటిమ్మనీ ప్రేరేపిస్తూ ఉగాది వస్తుంది ! స్వార్ధ శక్తులకు కాలం చెల్లిపోయిందని హెచ్చరిస్తూ నోటిస్తే వోటిచ్చే రోజులు మారాయనీ యువ శక్తి ప్రభంజనమై దూసుకొచ్చి దేశ పటాన్ని పునర్లిఖిస్తుందనీ జాతి భవితను తీర్చిదిద్దుతుందనీ భరోసా కలిగిస్తూ ఉగాది వస్తుంది ! అన్న దాతకు అప్పుల్లేని జీవితాన్నీ పీడకలలు లేని నిద్రనీ ప్రసాదించి సకల జనావళికీ కూడూ గూడూ ఒనగూడే ఒరవడి సృష్టించేందుకు ఉగాది వడివడిగా వస్తుంది ! కుళ్లిన వ్యవస్థ లోంచే కొత్త మొలకలు పుట్టుకొస్తాయని ఆశల చిగురుల గుబురుల్లో నవ రాగాల మృదు గమకాలు పల్లవించే కోకిలల కొత్త గొంతులు వినిపిస్తూ కలరవాల కలకలమై అదిగో ... అదిగదిగో ... ఉగాది వస్తోంది ! వసంత శోభను వెంట పెట్టుకుని మళ్లీ మన నేలను హరితసీమగా మార్చేందుకు జయ నామం ధరించి ఉగాది వచ్చింది ! జయ జయ ధ్వానాల మధ్య జయ కేతనమెగరేస్తూ ఉగాది వచ్చేసింది ! *************

by Nagalakshmi Varanasi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k9QfYv

Posted by Katta

Rambabu Challa కవిత

చల్లా గౙల్-2/ dated 30-3-2014 పంచ భూతములొక్కటై నను గేలి చేస్తే ఏమి సేతును వంచనాభ్ధి ఒక్క ఉదుటున ముంచి వేస్తే ఏమి సేతును భాష్మ చిల్మను కావలొక అస్పష్ట రూపము కదలెను భ్రమను గొలిపే ఎండ మావిగా మారిపోతే ఏమిసేతును కడలి ఒడ్డున చెలియ పేరును రాసు కొంటిని ప్రేమతో కక్ష గట్టిన జలధి చేతులు చెరిపి వేస్తే ఏమిసేతును ప్రేమ దేవత చిత్రపటమును పూలతో పూజించితే విరులు సైతం పడగ విప్పి కాటు వేస్తే ఏమిసేతును గుండెలో దిగబడిన బాకును పెరికినా బ్రతకొచ్చు "చల్లా" ఆమె రాసిన ప్రేమ లేఖలు నన్ను కాల్చితే ఏమిసేతును

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k9QfIa

Posted by Katta

Abd Wahed కవిత

తేనెకన్న తీయనైన ఆ రోజులు గుర్తున్నాయా అమ్మ ఒడిన నేర్చుకున్న ఓనమాలు గుర్తున్నాయా చింతబరికెతో టీచరు నేర్పించిన ఎక్కాలెన్నో చింతచెట్టు పంచుకున్న ఆ పులుపులు గుర్తున్నాయా గిల్లికజ్జ కోట్లాటలు తాయిలాలు కాకెంగిళ్ళూ కారంలా చురుక్కుమనె జ్ఙాపకాలు గుర్తున్నాయా పై చదువులు, కొత్త కొలువు, అమ్మకంట ముత్యాల్లాగే జారిపడిన ఎడబాటుల ఉప్పునీళ్ళు గుర్తున్నాయా తొలిప్రేమలు తొలిఆశలు ప్రయత్నాలు వైఫల్యాల్లో పడుచుదనం చవిచూసిన పొగరువగరు గుర్తున్నయా చేజారిన కాలంలో చేయలేని సంకల్పాల్లో చేదురుచిని తలచలేని మతిమరుపులు గుర్తున్నాయా

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dGd1c4

Posted by Katta

కంచర్ల సుబ్బానాయుడు కవిత

(^^^) ఉగాది కవితల పోటీ * కవితా ప్రియులకు ఆహ్వానం ఉగాది సందర్భంగా సాహితీ సేవ http://ift.tt/1dGcZkf కూటమి ఆధ్వర్యంలో కవితల పోటి నిర్వహించదలిచాము . ఆసక్తి కల కవులు, కవయిత్రులు ఈ పోటీలలో పాల్గొనగలరు. * కాస్త సామాజిక స్పృహా కలిగిన అంశం రాయొచ్చు * కవిత10 నుండి 35 లైన్లుకు మించరాదు *కవిత కొత్తదై ఉండవలెను. ఏ ఇతర గ్రూప్ ల లోను మరియు ఇతర పత్రికల లోను ప్రచురితమై ఉండరాదు . *కవితల పోటీకి పంపిన కవితలను విజేతలు ప్రకటించే వరకు ఏ ఇతర గ్రూపులలోను, మరే ఇతర చోట్లా పోస్ట్ చెయ్యరాదు * మీ కవితలను ఉగాది కవితల పోటీ అని ఈ పిన్డ్ పోస్ట్ కిందనే తేది స్పష్టం గా వేసి ఈ నెల 31 వ తేది రాత్రి 12 గంటలు లోగా పోస్టు చెయ్యవలెను . * సమయం దాటినా తర్వాత వచ్చిన కవితలు పరిశీలనా లోకి తీసుకోబడవు *న్యాయ నిర్ణేతలుదె తుది నిర్ణయం . ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు. గమనిక ===== ఉగాది కవితల పోటీలలో విజేతలైన వారికి వచ్చే నెలలో హైదరాబాద్లో జరిగే సాహిత్య సభలో బహుమతులు ప్రధానం చెయ్యబడును .. అదే విధం గా గతం లో సాహితీ సేవ నిర్వహించిన కవితల పోటీలో గెలుపొందిన విజేతలు ప్రధమ బహుమతి పొందిన శ్రీనివాస్ వాసుదేవ్ గారికి , ద్వితీయ బహుమతి పొందిన భారతి కాట్రగడ్డ గారికి , తృతీయ బహుమతి పొందిన వర్చస్వీ గారికి కన్సొలేషన్ బహుమతులు పొందిన భాస్కర్ పాలమూరు గారికి ,వెంకటేష్ వలన్దాస్ గారికి , లుగేంద్ర పిళ్ళై గారికి , నవీన్ కుమార్ కొమ్మినేని గారికి కూడా హై దరాబాద్ లో వచ్చే నెలలో జరిగే సాహిత్య సదస్సు లో(తేది త్వరలో ప్రకటించ గలము ) ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేయటం జరుగుతుంది. ఇట్లు కత్తిమండ ప్రతాప్, పుష్యమి సాగర్ అడ్మిన్స్, సాహితీ సేవ. http://ift.tt/1dGcZkf

by కంచర్ల సుబ్బానాయుడు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k9Qhzv

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/తడి ఎడారి..... నేనూ మరికొంచం నిశ్శబ్దం గదిలో ఒంటరిగా ఒకరికిఒకరు తోడుగా కూర్చుని కొన్ని క్షణాలను కష్టంగా ఖర్చుపెడుతూ జ్ఞాపకాల ధూళి ఉప్పు సంద్రంగా నేలంతా తవ్వుతూ కనిపించని రహస్య సొరంగాలను పచ్చని ఆకులపై గాలి బిందువులుగా శోదిస్తూ నిశ్చలంగా కొంచం నిబ్బరంగా నాలో నన్ను చదువుతూ వాడిపోయిన వెన్నెల కెరటాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయోనని హిమపు ఆలోచనలు ఇంకిపోయిన తేనె ఎడారులు వెల్లువెత్తిన శిధిలాలు దివిటీ వెలుగులో కనిపించకుండా ఇప్పుడు ఇంకా ఒంటరిగానే నేనూ నా నిశ్శబ్దం తిలక్ బొమ్మరాజు 30.03.13

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QtRedm

Posted by Katta

Krishna Mani కవిత

ఇంకోటి లేదు ************* ఒక పందిలో ప్రవేశించి చూసాను బురదలో ఉన్న సుఖం ఇంకోటి లేదు ! కోతిలో చేరి చూసా కొమ్మలంచులో ఊగే సుఖం ఇంకోటి లేదు ! ఒక పాములో దిగి చూసా ఒళ్ళు చుట్టుకొని మత్తున పండే సుఖం ఇంకోటి లేదు ! ఒక పక్షిలో ఎగిరి చూసా లోకాన్ని చిన్నగా చూసి మురిసే సుఖం ఇంకోటి లేదు ! సాగరంలో మునిగి చూసా సాధ్యమైనంత ఎక్కువగా ఒదగడంలో ఉన్న సుఖం ఇంకోటి లేదు ! ఒక చెట్టులో దాగి చూసా కన్నీళ్ళతో కడుపు నింపడంలో ఉన్న సుఖం ఇంకోటి లేదు ! మనషిలో తొంగి చూసా పక్కవాడిని తొక్కడంలో ఉన్న సుఖం ఇంకోటి లేదు ! కృష్ణ మణి I 30-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k9zUmI

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

లఘుకవితలు -2: ( http://ift.tt/QtRdGs) ....|| 1-1=0 ॥.... రెండు వాక్యాలు ఒక్క మనసు మాట మౌన సంభాషణం ముచ్చట ముగియనేలేదు ముగిసింది నాటకం కొందరి అర్ధాంతర బతుకు కథ విషాదాంత ఏకాంకిక ! ....|| 2 *2=0 ॥.... రెండు రెండ్లు ఆరంటే కాదంటావు! రెండు రెండ్లు ఎనిమిదంటే కాదంటావు! పోనీ రెండు రెండ్లు మూడంటే కాదనే అంటావు ! ఇక రెండు రెండ్లు నాలుగని చచ్చినా అనను ఎందుకంటే నీవు కానేకాదంటావని నాకు తెలుసు రెండు రెండ్లు జీరోనే మన జీవితాల్లా! మన మధ్య కుదురని సయోధ్యలా ! ....॥ 3,4,5=0 ॥.... ముడులు మూడు వేసినా ఊడుతూనే వున్నవి తాళిబొట్లు , నాలుగు మూలల ఆటలో కూలుతూనే వున్నవి స్తంభాలు , పంచపాండవులు మంచపు కోళ్లు అటక కెక్కాడు ఐదవవాడు , చివరికు మిగిలిన శేషం పూజ్యం ! ....|| 6=0||.... ఛాతీ విరుచుకొంటూ బయటికొచ్చాడు సిక్స్ పాక్స్ వీరుడు! 'అవునవును, సరిలేరులే నీకెవ్వరూ?' ఎకసక్కెమాడింది ఒరుసుకుంటూ వెళ్ళిన బక్క పల్సని గాలి పిల్ల ఎక్కడి నుండి వచ్చి పడిందో నలుసు భగ్గుమంది కన్ను గింజుకు చస్తున్నాడు ఖంగు తిన్నకండల మానవుడు! ---నాగరాజు రామస్వామి, Dt 30.03.2014.

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QtRdGs

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

లఘుకవితలు -2: ( http://ift.tt/QtRdGs) ....|| 1-1=0 ॥.... రెండు వాక్యాలు ఒక్క మనసు మాట మౌన సంభాషణం ముచ్చట ముగియనేలేదు ముగిసింది నాటకం కొందరి అర్ధాంతర బతుకు కథ విషాదాంత ఏకాంకిక ! ....|| 2 *2=0 ॥.... రెండు రెండ్లు ఆరంటే కాదంటావు! రెండు రెండ్లు ఎనిమిదంటే కాదంటావు! పోనీ రెండు రెండ్లు మూడంటే కాదనే అంటావు ! ఇక రెండు రెండ్లు నాలుగని చచ్చినా అనను ఎందుకంటే నీవు కానేకాదంటావని నాకు తెలుసు రెండు రెండ్లు జీరోనే మన జీవితాల్లా! మన మధ్య కుదురని సయోధ్యలా ! ....॥ 3,4,5=0 ॥.... ముడులు మూడు వేసినా ఊడుతూనే వున్నవి తాళిబొట్లు , నాలుగు మూలల ఆటలో కూలుతూనే వున్నవి స్తంభాలు , పంచపాండవులు మంచపు కోళ్లు అటక కెక్కాడు ఐదవవాడు , చివరికు మిగిలిన శేషం పూజ్యం ! ....|| 6=0||.... ఛాతీ విరుచుకొంటూ బయటికొచ్చాడు సిక్స్ పాక్స్ వీరుడు! 'అవునవును, సరిలేరులే నీకెవ్వరూ?' ఎకసక్కెమాడింది ఒరుసుకుంటూ వెళ్ళిన బక్క పల్సని గాలి పిల్ల ఎక్కడి నుండి వచ్చి పడిందో నలుసు భగ్గుమంది కన్ను గింజుకు చస్తున్నాడు ఖంగు తిన్నకండల మానవుడు! ---నాగరాజు రామస్వామి, Dt 30.03.2014.

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QtRdGs

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ | లోపలి మైదానం ................................ రోజూ ఏదో ఒకటి తెలుస్తూనేవుంటుంది,కొత్తగా ఏదో నేర్చుకున్నట్లుగానే ఉంటుంది,మరీముఖ్యంగా నాగురించి నేను. ఒకరిద్దరైనా కలుస్తారు .వాళ్ళు నాలోకి ,నేను వాళ్లలోకి వెళ్లి కూచున్నాక అక్కడికిక ప్రయాణం ముగుస్తుంది. ఆతర్వాత ముగిసినరోజుని లోపలి మైదానంలోకి అలా అలా తిరిగేందుకు పంపిస్తాను.కన్నీళ్లుగానో,బిగ్గరగా నవ్వుకునే నవ్వులగానో, లోపలికే ముడుచుకున్న నిన్నటిలాంటి అనుభవంగానో ఆ మైదానంనిండా ఎత్తుపల్లాల గుంతలు. ఆ తర్వాత అలిసి,సేదతీరి,కలగలిసి,విడివడి వొంటరిగా మిగిలాక వస్తూపోతూవుండే కరెంటుకు వెలిగి ఆరిపోయే బల్బుగురించి ఎవరో ఒకరు ప్రస్తావిస్తారు. 30.3.2014

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jK2nnn

Posted by Katta

Kancharla Srinivas కవిత

కొత్తగ మొలిచిన సరిహద్దులు చూసి రెండుగ చీలిన తెలుగింటిని చూసి ఎక్కడ వాలాలో తెలియక ఆమని సందేశం ఏమని కూయాలోనని రెక్కలాడిస్తున్నావ్ గళ మౌనం వహిస్తున్నావ్... కలవర పడకే కోయిల కుహుకుహూలు కూయిలా తెలుగు తరువుకు కొత్త కొమ్మ కాసింది తెలంగాణ విరబూసిందంతే కొమ్మలు రెండైనా తెలుగు చెట్టొకటే శాఖలు వేరైనా వేరు మూలం ఒకటే యాభై ఆరు వర్ణాల వర్ణమాల వర్ణమేం తగ్గలేదు మా అక్షరాలు అక్షరాలా అలానే ఉన్నాయ్ హల్లులూ పొల్లు పోలేదు ప్రాంతాలు వేరైనా భాష సమైక్యమే జంట తొటల మావి చివుర్లు తిను తెలుగు జాతిని నిలిపే మధుర గానం ఆలపించు...

by Kancharla Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gODaWL

Posted by Katta

Ramakrishna Kalvakunta కవిత



by Ramakrishna Kalvakunta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gbPkD7

Posted by Katta

Boorla Venkateshwarlu కవిత

నోట్ ఎన్నికల సంగ్రామంలో నోట్ల చెట్లూపి కట్టలు రాల్చే గ్రామ సింహాలు ఎప్పుడూ ఒక బొక్కకే లొంగిపోతాయి తెలుసుకో నీ చెమట చుక్కల్ని బ్రాందీ చుక్కల్తో వెలకట్టే వినయపు నక్కలు శవాల్నీ పీక్కుతింటాయి పోల్చుకో ఈ ఐదేళ్లూ నీ ఐదేళ్ళూ నోట్లోకి వెళ్ళాలంటే ఒక నీ బలహీనతను ఉచితంగా తీర్చేవానికంటే నోటివ్వని వాడు “నోటా” కు చోటివ్వని వాడు నోటిని ప్రజల కోసం మైక్ లా వాడేవాడు సింహాసనమెక్కాలోయ్ నోట్ చేస్కో

by Boorla Venkateshwarlu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hmRq7N

Posted by Katta

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు – 27 . మన కేరళ సోదరులు మంచి కవిత్వం అందిస్తున్నారనడానికి ఇదొక మంచి ఉదాహరణ. గాలికి దీపం అటూ ఇటూ కదలాడడం ఒక ప్రకృతి సిద్ధమైన అనుభవం. దానికి ఒక తాత్త్విక ఊహను జతపరచడం కవిత్వపు సొగసు. మనిషికి ఎప్పుడూ ఒకరి నీడలో బ్రతుకుతూ, తన ఉనికిని కోల్పోవడం కన్నా దుఃఖభాజనమైన విషయం మరొకటి ఉండదు. ముఖ్యంగా స్వేచ్ఛా ప్రియులకి. లౌకికమైన అవసరాలకీ, (ప్రధానమంత్రో, మరో మంత్రో, సలహాదారో వంటి) లౌల్యాలకీ గొప్ప గొప్ప మేధావులే తమ స్వాతంత్ర్యాన్నీ, వాక్స్వాతంత్ర్యాన్ని, తనఖాపెట్టుకుని, ఒకరి నీడలో మసలడం మనం నిత్యం చూస్తున్నదే అనుకొండి. ఈ కవిత అలాంటి వాళ్ళని ఉద్దేశించి వ్రాసినది కాదు. దాస్యం కోరుకునేవాళ్లకి స్వాతంత్ర్యపు విలువ తెలీదు. భావదాస్యాన్ని మించిన దాస్యం మరొకటి ఉండదు. అది అంతఘోరమైనది. (హెచ్చరిక: మనమందరమూ ఈ క్షణంలో కూడా ఏదోరకమైన భావదాస్యానికి, తెలిసీ, తెలియకా లోనై ఉన్నవాళ్ళమే. కనుక ఒకరిని ఆక్షేపించే పనిలేదు. స్వేచ్ఛ అన్నది మనకున్న భావదాస్యాలనుండి విముక్తి అవడానికి ప్రయత్నిస్తూ, కొత్తవాటికి దాసులం కాకుండా పరిరక్షించుకునే నిరంతర ప్రక్రియ.) కవి ఎంతబాగా చెబుతున్నాడో గమనించండి. దీపంక్రింద నీడ చేసే విన్యాసం కేవలం వినోదానికి కాదట, ఎల్లప్పుడూ దీపం ( ప్రమిద, లేదా కొవ్వొత్తి) క్రింద పొర్లుతూ ఉండడం వల్ల కలిగే దుఃఖాన్ని మరిచిపోవడానికి చేసే ప్రక్రియ...ట. నిరాకారమైన నీడకే అంత స్వాతంత్ర్యేచ్ఛ ఉంటే, మనకి ఎంత ఉండాలి. అది ఎవరికి వారు ఆత్మావలోకనం చేసుకుని తెలుసుకోవలసిన విషయం.. ప్రయాస... వీరన్ కుట్టీ, మలయాళ కవి. . ఈ నీడ, ముందుకీ వెనక్కీ నడయాడుతూ తనరూపాన్ని పెంచుకుంటూ, కుంచించుకుంటూ పోవడం అదేదో కాలక్షేపానికి ఆడే వినోదక్రీడ కాదు. . అది, తను ఎల్లకాలమూ ఒకరి పాదాలక్రిందే పొర్లుతూ తన ఉనికి కోల్పోతున్నందుకు పడే దుఃఖాన్ని మరిచిపోడానికి చేసే ప్రయాస... . వీరన్ కుట్టీ, మలయాళ కవి . . The Effort . This Is No Trivial Pastime, This Play of the Shadow, Stretching and Shrinking Its Own Image... It Could Be an Attempt To Forget the Sorrow Of Being Overshadowed, Forever Stuck Beneath Another…! . Malayalam Original: Veeran Kutty Veeran Kutty is a Lecturer at Government College, Madapally, Kerala. (English Rendering: Girija Chandran)

by Nauduri Murty



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gaZB2q

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ ఓటు @ _ కొత్త అనిల్ కుమార్ 30/3/2014 కళ్ళు తెరిచి చూడు మనసు పెట్టి చూడు ఓటంటే నీ చేతిలో దీటైన ఆయుధం అలసత్వం తో ఆదమరిస్తే చీకటే. ఓటును నిర్లక్ష్యం చేస్తే సమాజ మనుగడకు చేటే. సేవ ముసుగులో రాజకీయం చేసే సామాజిక ఉద్యోగిని ఎన్నుకో ఓటుతో .. ఎలాంటి వాడు ప్రజలకు కావాలనే ప్రశ్నకు సమాదానం చెప్పు ఓటుతో వేలెత్తి చూపిస్తూ కాలం గడిపేయకు వేలోత్తే సమయమిది ఓటేసి చూయించు . నోటుతో ఓటమ్ముకుని ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు దారుడివి కాబోకు. తడబడి తలవంచకు తలబడి గెలిపించుకో పొరబడితే తగలబడి పోతావ్. _ కొత్త అనిల్ కుమార్

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gCulON

Posted by Katta

Patwardhan Mv కవిత

నమ్మకు నమ్మకు ఈ రేయిని: ఈ రాత్రి చీకటి సిగ్గుపడి, భయపడి తన కళ్ళను గట్టిగా మూసుకుంటుంది. రౌడీ సీసా కరెన్సీని వెంటేసుకొని వీధి గద్దె మీదే ఓటరుపై అత్యాచారం చేస్తుంది. ఈ రాత్రే ప్రజాస్వామ్యానికి వెంటిలేటర్ తొలగించబడి అనుమానం రాని రీతిలో హత్య కావించబడుతుంది. అంతరించిన డైనోసార్లు మళ్ళీ అవతరించే రాత్రి. అసలైన మేనిఫెస్టోలు రాయబడే రాత్రి రేపు ఇనుప బాక్సుల్లో నిండేవి ఈ రాత్రి కార్చిన రక్తపు చుక్కలే ! అవును ఈ రాత్రే ,ఎన్నికల ముందు రాత్రి. 29-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fz2qL9

Posted by Katta

Sadasri Srimanthula కవిత



by Sadasri Srimanthula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fz2niG

Posted by Katta