పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, మార్చి 2014, గురువారం

Ramakrishna Kalvakunta కవిత

-ఒక్కటే కావొచ్చు! పదునైన వాక్యమొక్కటే కావొచ్చు జీవితమంతా దారిదీపమై నడిపించడానికి వేకువ కిరణమొక్కటే కావొచ్చు దుః ఖపురాత్రుల చీకట్లను చీల్చడానికి ఆత్మీయతాపూరిత అశ్రుబిందువొక్కటే కావొచ్చు ఒంటరి నిశ్శబ్దానికి ఓదార్పు గీతమై ఊరడించడానికి కడలితరంగమొక్కటే కావొచ్చు కాళ్ళను తడుపుతూ పలకరించడానికి కొంటె చూపు ఒక్కటే కావొచ్చు హృదయాన్ని మధుర కవనమయం చేయడానికి నాదమొక్కటే కావొచ్చు అంతరంగంలో ప్రతి ధ్వనించడానికి అంకురమొక్కటే కావొచ్చు భావాల పక్షుల రెక్కలకు పురుడుపోసే తల్లి చెట్టు కావడానికి అక్షర మొక్కటే కావొచ్చు గుండె కొలిమిలో దగ్ధమై నగలా మెరియడానికి చినుకొక్కటే కావొచ్చు వేదనా మేఘాల్ని చీలుస్తూ వరదై ముసురుకొని ముంచెత్తడానికి కుట్ర ఒక్కటే కావొచ్చు మనుషుల్ని ,మనసుల్ని మూలాల్తో పెకలించడానికి ద్రవించే కారుణ్య బిందువొక్కటే కావొచ్చు నిన్ను దయా సముద్రుణ్ణి చేయడానికి ఆత్మీయతాస్పర్శ ఒక్కటే కావొచ్చు జీవితమంతా అనుభూతుల పరిమళాలతో వికసించడానికి కవిత్వ కరచాలనమొక్కటే కావొచ్చు కోట్ల అశ్రు జలపాతాల్ని అధిగమించడానికి మట్టి రేణువొక్కటే కావొచ్చు మనిషి చరిత్ర లిఖించడానికి ........ డా .కలువకుంట రామకృష్ణ

by Ramakrishna Kalvakunta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pcVcTq

Posted by Katta

Surya Prakash Sharma Perepa కవిత

వేదాధ్యయ-లాలి ___________________________ నిండు వెన్నెల తల్లికన్నుల చల్లగా లాలి కన్ను సోకిన కలల కాటుక కమ్మగా లాలి సందె సీకటి మాగన్నును ముద్దులాడులె లాలి అమ్మపాటే చెవిని నిమురులె జోలపాటై లాలి నాన్న చేతులు వీపు చరుచులె వెచ్చగాలాలి నిదురపో బంగారుపాపా హాయిగా లాలీ...

by Surya Prakash Sharma Perepa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jRByJC

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/Glitters Off ఈ రాత్రి కొన్ని నక్షత్రాలు ఆకాశానికి వేలాడుతూ సత్యాలుగా కనబడుతూ/ పగలు మళ్ళా అదృశ్యమవుతూ అబద్దాలుగా పరిక్రమణం విచ్చిన్నమో విభజనో తట్టని నిర్జీవ పాలపుంతలు అక్కడక్కడా ఈరోజు మళ్ళా బాల్కనిలో కూర్చోవాలి కాసేపు వీటిని లెక్కించడానికి వేళ్ళ బెత్తంతో దండెం మీద వేసిన పాత చొక్కాలా రోజు అవే నక్షత్రాలు అటూ ఇటూ మారుతూ ఎవరో కాసిని బియ్యపు గింజలను ఇక్కడ జల్లారు మొలకెత్తకుండా అడుగంటేవి కనిపించకుండా కనుమరుగయ్యేవి కూటమి మొత్తం ఒక్కసారిగా పళ్ళికిలించిందా అనంత తారాజువ్వలు ఎవరూ విసరకుండానే నింగిలో ఇప్పుడు ఇంకొన్ని కొత్త ఆశలను స్వప్నిస్తూ ఈ రాత్రి గడపాలి నేను తిలక్ బొమ్మరాజు 27.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dw5exe

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి హాయి పగలంతా కష్టపడి అలసిపోయిన జీవితానికి ఆకాశం రాత్రిగంధం పూస్తుంటే ఎంత హాయి జీవితమంతా అలసిపోయిన హృదయాన్ని ఆకాశం తనలో ఐక్యం చేసుకుంటుంటే ఎంత హాయి ఆకాశమే ఇప్పుడు తన నివాసమై నా నుండి విముక్తి పొందిన నా ఆత్మకి ఎంత హాయి 27Mar2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jRBucQ

Posted by Katta

Patwardhan Mv కవిత

సందర్భం--03:: ఇది ఎవరిది ?? ((((మిత్రులందరికీ విన్నపం...మీకు నా ప్రయత్నం-- సందర్భం -దీనికి నేను ఎన్నుకున్న విధానం- నచ్చితే మీ స్పందనను సమాధానం తెలియచేయడం ద్వారా చూపి ముందుకు పోవడానికి సహకరించండి.సమాధానాలు రాకుంటే ఈ శీర్షిక ప్రయోజనం (ఈ రూపంలో) నెరవేరదు కదా!! శీర్షిక ముందుకు పోవడానికి కావల్సింది మీ సమాధానం.మీ సూచనలూ,సలహాలూ నిరభ్యంతరంగా తెలియజేయండి ))))) హలో !! సాహిత్య మిత్రులకు లంగిడీలు!!.అదే--వందనాలు. ఇవాళ్టి సందర్భానికి స్వాగతం.ఇవ్వాళ కూడా నేను ఒక మాంచి కవిత్వ భాగాన్ని ఇవ్వబోతున్నాను.బాబ్బాబూ!క్కొంచేం టైం తీసుకున్నా సరే ఎవరిదో మాత్రం తప్పక చెప్పండి. ఈ సాహిత్య క్రీడకు మీ కోపరెషన్ ఇవ్వండి.లెట్'స్ బిగిన్ నౌ. /////...భవిష్యత్తు ఎలా వచ్చినా --స్వాగతం చెప్పలేను రోగిని రాగిని చేయలేని నర్సులా రేసులో గెలుపొందలేని హార్సులా కళకళల్లాడని ఖాళీ పర్సులా జీవంలేని ఫ్రీవర్సులా వస్తే భవిష్యత్తుకు స్వాగతం పలుకలేను నాయనమ్మలా నడ్డి వంగిపోయి వస్తే ప్రేయసిలా భావించి చేయి సాచలేను రాక్షసిలా లక్షల ప్రాణుల్ని కుక్షిని పెట్టుకుంటూ వస్తే ససేమీ దాక్షిణ్యం చూపలేను. మహారాజులా మొహం నిండా బూజుతో-గతంపై మోజుతో మదగజం మీద అపరంజి అంబారీలో వస్తే దుర్నిరీక్ష హర్యక్షాన్నై అమాంతం లంఘించి ఆ గజాన్నీ,గజారూఢుణ్ణీ అంతం చెస్తాను.////// ఈ వ్యంగ్యంతో కూడిన పలుకుల ములుకులు ఎవరివి??? నాకు తెలుసు...మీకూ సమాధానం తెలుసని.మరి ఆలస్యం ఎందుకు??మీ సమయం మొదలౌతున్నది ఇప్పుడు. 27-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hxDHHI

Posted by Katta

Syam Prasad Bezawada కవిత

బహుజన నావికులారా! మీకు మీరే రాజులు! యేరులుగా పారుతున్న దరిద్రాన్ని దారికట్టి సహకరించి నిల్వ కోరు బహుజన నావికులారా! యేరులుగా పారుతున్న దరిద్రాన్ని దారికట్టి సహకరించి నిల్వ కోరు బహుజన నావికులారా! యేదయినా అది సరే, మీకూ వాటా అడుగుతున్న మూర్ఖుల్లారా! ఆరగింపుకు అన్నంచాలు అసిధ్ధం మీకెందుకు? ప్రభుత్వ నిర్మాణానికి యిసుక రేణువులు ప్రజలు ప్రజా రక్తమే వ్యాపక పరివాహక యింధనం పెట్టుబడకి పదిరెట్లుగ పట్టుబడిని తేగలిగిన వ్యాపారాలన్నింటా నేడు రాజకీయమే రాజం! 'తాము ప్రజలు కాదం'టూ వారే ఆసనార్హులు 'తమ రక్తం ప్రజలం'టే అదే వారసత్వం! నల్లధనం, ఎర్రధనం అన్నీ చెల్లే రాజ్యం తెలిసొస్తే తగవుగాని, కలిసొస్తే తిరుగులేదు! జీవితాల కర్ధ మర్ధమేనని తెలుసినోళ్ళు అర్దాకలి ప్రజలంటే వ్యర్ధులనే అలుసు నోళ్ళు గ్రధ్ధల తలదన్నేపద్దును కూడిన మనసు రాజకీయ వాదానికి మతం వారికొక సొగసు! సమైఖ్యపు సంబరం విభజన కొక వితండం ఇసుక మాఫియా మీరే? గనుల తవ్వకం మీదే? ఎర్రచందన బొమ్మ మీరు! దుప్పిమాంసం కొమ్ము మీరు! గంజాయి పొగ రొమ్ములు మీరు! చీకటి కొట్టు అమ్ములు మీరు! కన్నెదార కనులు మీరు! పోలవరం పంటమీరు! జగన్ మాయ జత మీరు! చంద్రుని చంధస్సు మీరు! భంగి అనంత భాగోతం ఆనక్క వివేక వేదాంతం లోక సభను శివనృత్యం నాటకాల చిరంజీవం........! వీరంతా నడుంకట్టి విరగ్గొట్టిందేదీ? పట్టిన దారిద్ర్యానికి చట్టంలో చోటేగదా? కనిపించే కిరణుల్లో అనిపించే కాంతి మీరు దూరపు కాషాయానికి అందని ఆధారం మీరే! బాపనోని చదువు దాటి కమ్ముకొన్న కమ్మదనం కదిరి నరసిమ్హుడి కధతోనే సరి పెడతారా? మొదళ్ళను మీకుంచి, తూడులు తుంపుకు పోతూ, తన్నుకు చావండని తరాలుగ సాగుతున్నకర్కశ యత్నమే ఈ ఆధిపత్య వ్యవసాయం! ఎందుకు మీరూ సాయం? నాలుగు దిశలా నరకులు నడుమ పుట్టినాళ్ళ అరుపులు కాదు మట్టి, దేశమంటే మనుషులు మరి, ఎవరీ దుర్గతికాది పురుషులు? అడవీ, ఆలమందలు అడవిలోని వాళ్ళందరు ఎవరి సొత్తని యీ చిందులు ఎవరి రక్తపుటేరుల విందులు? స్వతంత్ర మెప్పుడొచ్చింది? స్వరాజ్య మెవరి కొచ్చింది? సమస్యసాగిల పడితే సమరం సాకు పెడతారు వుల్లిపాయ వులికి పడితే వుప్పుజల్లుతుంటారు వేమశతకము మనకే రామబాణము మనకే కామసూత్రమని పుట్టిన పాముకాటు విషమూ మనకే! తెల్లవాడి జులుముకన్న నల్లవాడి విషంమిన్న! భూ వాయువు వదల్లేదు జీవజలం మిగల్లేదు దారి మళ్ళిన సంపద ప్రపంచపు పెట్టుబడై పోగా భౌగోళిక సహాయమంటూ భారతాన్ని ముంచుతుంది! సాములోడి కొక దణ్ణం రాములోడి కొక దణ్ణం అడుగడుగున మోకరిల్లి అమ్మగార్ల కొక దణ్ణం! అగుపించెడి సాటి మనిషి ఆలింగన ప్రేమ కదా పరమంటూ ప్రేమకొరకు వరాలిచ్చు దేవుడేల? అన్నార్ధికి భుక్తిచూపు విధమే మనమతం కదా అజీర్ణమే తేనుపుగా తలకెత్తిన తత్వమేల? ఆవు కంటే పెయ్యిని, ఆలి కంటే కొడుకుని కోరే కుమతుల నీతికి చేదోడైన వాదం గో మాత, పురుషోత్తమ వూహ జనిత నినాదం! అన్నీ తెలుసు మీకు, బడుగుల నావికులు మీరు! తిన్నదరక్కపోతే విషం త్రాగిచావొచ్చుగా? తప్పదన్నట్టు స్వజనాలను బందీచేస్తారెందుకు? అనుబంధం చూపలేని మను బంధాలెందుకు మీకు? మీది కాని మతానికి మీరూ సతమతమెందుకు? రాజకీయ వాటా కాదు రాజ్యం నడపాలి మీరు మీలో మేధ లేదని కొందరు మిగులు దాన మిస్తారట! ఎవడబ్బ సొమ్మంటూ ఆటవిడుపు లెమ్మంటూ అధికారం అందుకోండి అదిమీదే, నమ్మిపొండి! అడవినీతి సింహరాజు అసలు నీతి నీకు నువ్వే రాజు!

by Syam Prasad Bezawada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jyWn0q

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

-- చిరాశ // వస౦త౦ // *************************************** వస౦తాన్ని ఆహ్వాని౦చే౦దుకై నేను ...........విరగ బూసిన వనాన్నౌతాను ప్రకృతి సోయగాన్ని అ౦ద౦గా అక్షరీకరి౦చే౦దుకై నేను ............భావకవి కవనాన్నౌతాను మావిచిగురు వగరుదనాన్ని గొ౦తులో పొదువుకుని నేను ......... మధుర౦గా కూసే కోకిల గానాన్నౌతాను *************************************** --- {27/03/2014}

by Chilakapati Rajasheker



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jyWmJW

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ --------।। కొన్ని నవ్వులు కొనుక్కోవాలి ।। అంగడిలో గాలించినా సరే కొన్ని నవ్వులు కొనుక్కోవాలి నవ్వటం మరిచిపోయిన ఈ పెదవుల కోసం . కిలోల కొద్దీ కాకపోయినా కనీసం గ్రాముల్లోనైనా ఖరీదు చేసుకోవాలి గుండెనిండా నిండిపోయే గుప్పెడు నవ్వులని . పొత్తిళ్ళలో ఉన్నప్పుడు అడక్కుండానే అమ్మ ఎన్ని నవ్వులను మూటకట్టి కానుకగా ఇచ్చేదో ! మరి ఇవాలేంటి ? రెండు పదుల వయసులోనే జీవితం ఎడారిగా మారిపోయినట్టు ముఖాన చిరునవ్వుల పరదాలు ఊగవే.. !? వైరాగ్యం కమ్ముకున్నట్టు, ఇక ఏ బాగ్యం దరి చేరనట్టు, మధుమాసం మళ్ళీ రానట్టు ఈ జీవితాలు ఇంతేనా ? నవ్వులు ఎవరి సొంతమూ కాదే ! ఏ హృదయంతరాల్లో బందీ కాలేదే ! మరి నీపై ఎందుకు కత్తికట్టాయి ? ఒక్కసారి నీ మనసుని చుట్టిముట్టిన ముళ్ళ కంచెలను పెకలించి చూడు అక్కడ ఎందుకు తులసివనమై ఆ నవ్వుల మొలకలు మొలకెత్తవో చూద్దాం . జైలుపక్షిగా కాక స్వేచ్చా కపోతానివై ఎగురు దరహాస శిఖరాలు నీ ఆగమనానికి ఎలా స్వాగతం పలకవో చూడు ! (27-03-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dvxksC

Posted by Katta

DrArukonda Narasimhudu కవిత

కరీంనగర్ జిల్లా పునర్నిర్మాణ వ్యాసాలకు ఆహ్వానం తెలంగాణ విద్యావంతుల వేదిక, కరీంనగర్ జిల్లా శాఖ తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా లోని సమస్యలను, అవసరాలను మరియు వాటి పరిష్కారం కోసం చేపట్టవలసిన చర్యలకు సంబంధిచిన అంశాలను రేపు కొత్తగా ఎన్నిక కాబోయే ప్రజా ప్రతినుధుల ముందు మరియు ప్రభుత్వం ముందు ఉంచడానికిగాను ఒక పుస్తకంగా తీసుకురావాలని భావిస్తున్నది. కావున జిల్లాలొని రచయితలు, విద్యావంతులు, ఉద్యమకారులు, ఆలోచనాపరులు, మెధావులైన ప్రజలు వివిధ ప్రాంతాలలో గల సమస్యలను, అవసరాలను గుర్తించి, పరిష్కారాలను కూడ సూచించే వ్యాసాలను, రచనలను ఏప్రిల్, 15, 2014 రోజులోగ ముక్కెర రాజు, అధ్యక్షులు,తెలంగాణ విద్యావంతుల వేదిక, ఇ.నెం.20-182/1, విద్యానగర్, పో: హుజురాబాద్, జి:కరీంనగర్ 9440545576అడ్రస్ కు పంపాలని జిల్లా శాఖ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం.

by DrArukonda Narasimhudu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dvxhwP

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P64xzy

Posted by Katta

Chi Chi కవిత

_ మర్మాగారం_ అక్షరాలు తొడగని ఆలోచనలెలా ఉంటాయో తెలుసా? శవాలు కనే కలల్లా , మరాలు దాటని చెరల్లా!! జన్యుపరంగా జబ్బులోస్తాయని శాస్త్రం సంకెక్కినోల్ల సారం నిజమే!! జన్యు పరమైన జబ్బుల్లో అన్నిటికన్నా పెద్దది జన్మే!! కాదు కాదు..జన్మెలా జబ్బవుతుందని ప్రశ్నించి జన్మించినోల్లంతా శాస్త్రాల జల్లెడలో ప్రాణాన్ని పడేసినా ప్రాణమొచ్చేస్తుంది జన్మనొదిలేసి!! తెలుసు జబ్బవ్వని జన్మ బాగుంది..జన్మవ్వని ప్రాణం బాగుంది ప్రాణమవ్వనిదేముందని చెప్పే శాస్త్రమేదైనా బాగుంది!! బాగున్నదంతా బాగుంది..బాలేనిదంతా బాగుంది అసలు బాలేనిదేముంది?? ఉంటే జబ్బున్నట్టే , జన్మ జబ్బైనట్టే జబ్బు కూడా బాగుంది అనేస్కుంటే పోలా!! ప్రాణాన్ని జబ్బనట్లేదుగా!! జన్మకెన్ని జబ్బులున్నా , జన్మే జబ్బైనా బాగుందన్నా, బాలేదన్నా ప్రాణానికంటదు ఏ జన్మా , ఏ జబ్బూ!! అయినా ప్రాణానికి లేని బాగోగుల బాధ అదిచ్చిన జన్మాలకెందుకో ఆలోచనకే తెలియపోతే అక్షరాలకేం తెలుస్తుంది!! ఇంక జడాల గురించెందుకులే అవి ప్రాణానికి జన్మకి ఆలోచనకి అతీతంగా అవసరం లేని ప్రశ్నలకు అర్థం కాని సమాధానాలుగా..గా..గా..గా..... వార్నీ!! ఇంతసేపు చెప్పిందంతా సోల్లైపోయింది జడాలు గుర్తురాగానే జై జడం_________________________________(27/3/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NYMryo

Posted by Katta

Tarun Chakravarthy కవిత



by Tarun Chakravarthy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j8vRbN

Posted by Katta

కాశి రాజు కవిత

||పండగలాంటోడు|| ఏపపువ్వు ఎవడన్నాతెత్తాడు ఉత్తునొచ్చేదే కదా! సిన్నోన్ని పంపి పాలు తెమ్మను ఊళ్లోకెల్లి బెల్లమూ సామాన్లూ పట్రా అని తిడతున్నట్టు దుఖిస్తుంటే అందీ అందని ఏప రొబ్బని అందుకుని కోసిన పువ్వంతా జల్లిపోతాడు మా నాన అదంతా ఏరుకుని, గుమ్మాలో అరిసిన సాపమీద గుట్టగా పోసేసి పురుకోసనిండా మామిడాకుల్ని మాటాడకుండా గుచ్చేత్తాను. నాగులు దండలూ అయిపోయాక అక్క గడపలకి పసుపు రాస్తుంటే, దాన్ని తన్నుకుంటూ మెక్కలపీట తెచ్చుకున్నాక, మా గుమ్మలకి పచ్చగా ఏలాడేది మాయమ్మ ఉగాది పచ్చట్లో బెల్లం, మామిడి ముక్కా చెరుకూ, చింతపండు సరింగా ఉన్నాయో లేదో అలిసిపోయే అమ్మకి తోడయ్యే అక్క ఆరాటపడే నాన్నకి ఆటపట్టించే నేను కలిసిపోయాక అరచేతిలో పచ్చడి అందరి వొంకా సూసి తింటే అదో తుత్తి అమ్మా, నాన్న అలాగే ఉన్నాక ఏళ్ళు గడిచాఛి మేం గడసరులయ్యాకా ఆ పచ్చడిది అదే రుసి మా ఊళ్ళో ఉగాదంటే వేచి సూసే అమ్మకి తెచ్చిపెట్టే నానతోడు

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gFfRP2

Posted by Katta

Sk Razaq కవిత

|| ఇంకా ఎందుకు మౌనం ? || రజాక్ ఇంకా ఎందుకు మౌనం ? ఎన్నికల తుఫాను తీరందాటి హోరేత్తిస్తువుంటే మెలుకువగా ఉంటూ, నిద్ర నటిస్తూ ఇంకా ఎందుకు మౌనం ? నీ ఇంట్లో ప్రతి వస్తువు ధరాఘాతాలతో దాడి చేస్తూ ఉంటే దాగి దాగి, నక్కి నక్కి, దరిద్రాన్ని దుప్పటి గా చేసుకొని, ఇంకా ఎందుకు నిద్ర నటిస్తావ్? కరెంట్ షాకులు, దోమల దాడులు, సర్దుబాటు పోటులు భరిస్తూ ఎన్నాళ్ళు నిన్ను నువ్వు సర్దిచేప్పుకుంటావ్ ? ఇంకా ఎందుకు మౌనం వహిస్తావ్ ? KG నుంచి PG దాక చదువులు చదివి నిశానిగాళ్ళ నవీన దోపిడీకి తెలిసి తెలిసి దాసానుదాసుడవుతావ్ ? సత్య ప్రపంచం ఒక నిత్య నరకం అని తెలిసీ, అది చేదు కలగా భావించి, మెలుకువలోకి రావడానికి ఇంకా ఎందుకు భయపడతావ్ ? ఇంకా ఎందుకు మౌనం ? ఇంకా ఎందుకు మెలుకువగా ఉంటూ నిద్ర నటిస్తావ్? పోటి చేసే ప్రతి నాయకుడు కేడి, రౌడి, డాన్, స్మగ్లర్, యాక్టర్, కాంట్రాక్టర్ అని అన్ని తెలిసి, దోచుకోవడం కోసమే వారు పార్టీల పెట్టారని తెలిసి తెలిసి, కళ్ళు మూసుకొని ఇంకా ఎందుకు పాపం చేస్తావ్ ? మెలుకువగా ఉంటూనే నిద్ర నటిస్తావ్ ? ఇంకా ఎందుకు మౌనం ? ఎంతకాలం సహిస్తావ్ ఇ దారుణం ? వెయ్యి గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలి వానకు గల్లంతౌవుతాయి చలి చీమకు చిక్కిన సర్పమైనా శల్యమౌతాయ్ నిద్రపుచ్చితే పాపాయి నిద్రపోవు, నిద్ర నటిస్తే దేశం, దేశద్రోహులపాలౌ ని ఇంటికి నువ్వు పరిమితమైతే, దేశాభ్యున్నతికి దశదిశా చుపెదేవరు? ని జాతి జాగ్రుతికి కంకణం కట్టేది ఎవరు ? ఇంకా ఎందుకు మౌనం ? మెలుకువగా ఉంటూ, నిద్ర నటిస్తు ఇంకా ఎందుకు మౌనం ? ఓటు నీ ఆయుధం మంచి నాయకుడిని మీరే ఎంచుకోండి, ఎంచుకున్న నాయకుడినే ఒటువేసి గెలిపించుకోండి. దేశ, రాష్ట్ర భవితను మార్చుకోండి ..... జైహింద్. || రజాక్ || 27-03-2014

by Sk Razaq



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gFfRyA

Posted by Katta

Yasaswi Sateesh కవిత

యశస్వి’|| చెత్త...గోల|| అన్నియ్యా! చందనాల స్వామిని మోసుకొచ్చావెందుకు!! అగ్గిచిలకరిస్తారు.. తాతాచార్యులు వారు చిటపటలాడాలేమో కదలకపోతే బతికున్నావా అని గద్దిస్తారు అఘోరాలా వస్తారు ఒక హారర్ సినిమా చూపిస్తారు భయపడలేదని నీకు చూడ్డం రాలే పో! అంటారు పాప పుణ్యాలలెక్కల్లో మిన్న ఒరిజినల్ కవుల్లో అన్న అందని ద్రాక్షపళ్ళు అక్కరలేదంటారు పులిసిన ద్రాక్షరసాల్నే సేవిస్తారు హారన్ కవిత్వానికి పట్టుకొమ్మ వారు హారర్ వ్యక్తిత్వానికి జీవగర్ర వీరే కవి, నట విమర్శకేంద్రులు ఒకరు యక్షగాన ప్రారంభంలో సూత్రధారిని అడిగారు.. "ఏమమ్మా మాధవీ! ఆ పచ్చని చెట్టుకు చెప్పవే.. నన్నొక పాట పాడమని అనమని పాపం అడగ్గానే వచ్చారు..ఆనాడు అలరులు కురిపించారు ఆభీల ఉగ్ర ఉత్తాల ఒగ్గాళ ఔగ్ర్య కరాళ గోర ఘోర, దబ్బఱ, దారుణ, ప్రచండ బకుర భీకరంగా కవిత్వం చెప్పే తపనలో ఉంటారు వితండవాదానికే ఎందుకో మనసొగ్గుతారు తనని ఇంకా గుర్తించలేదే అని సనుక్కుంటారు కవుల కలాల్లోపల ఇరుక్కుంటారు వారికెంతో గౌరవమిచ్చామని ఎప్పుడు కనుక్కుంటారో!! who the hell are we.. అరె! కాస్త మర్యాదివ్వరాదె!! ఇంటి మధ్యలో దుమ్మోసి.. ఎందుకీ మనాది నీకు అంటరు!! ** "..ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ!! ఎవడ్రా ఆ చెత్త .. నన్ను కాదన్నది!! .." ** ఇంతకు మించి ఏం చేస్తాం..అన్నియ్యా!! ఎంత ఒరిజినల్ కాకపోయినా చంటబ్బాయ్ సినిమాలో కవయిత్రి కాలేం.. కదా!! ==27.3.14==

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gFfRyr

Posted by Katta

Chandrasekhar Vemulapally కవిత

చంద్రశేఖర్ వేములపల్లి || ఆమె నా మనో సామ్రాజ్ఞి || ఇన్నినాళ్ళ నుంచి అని చెప్పలేను. ఎన్ని యేళ్ళుగానో నేను ఈ ఆలోచనల కుటీరం లో .... ఆమె కోసమే బస చేస్తూ ఉన్నది. ఆమె కోసమే ఈ మాటలు, ఈ బాష, ఈ పలకటం నేర్చుకున్నది. నా శరీరాన్ని, నన్ను బలోపేతం చేసుకున్నది. ఆమె ఇష్టపడుతుందనే నాకుగా నేను బరువు పెరిగింది. నా జీవితం లో నేను ఎదురుచూసింది కోరుకున్నది. ఎదురుచూసి పొందిందీ సంద్యా సమయంలోనో సూర్యోదయ వేళల్లోనో ఆకస్మికంగా నో అలవోకగా నో .... ఎప్పుడైనా కనుసన్నల్లోంచి ఆమె నన్ను చూస్తుండటాన్నే ఎన్ని యేళ్ళు గడిచినా ఎందుకో తెలియదు .... ఇంకా ఈ గుండె కొట్టుకోవడం మానలేదు. ఆమెను చూసి తీవ్రంగా .... పక్కటెముకలు అదిరేలా ఒక్క రాత్తిరిని కూడా నేనెరుగను ఆమె అనుగ్రహము ఆమె అనుమోదము పొందని ఆమె తోడులేని నిద్దుర కలల లోకి .... నేను జారడం మేలుకొనే వేళల్లో నా కనురెప్పలకు తెల్లవారినట్లు తెలియదు. వేడి వేడి నిద్దుర కాఫీ పరిమళాలతో ఆమె గోరువెచ్చని స్పర్శ, పరామర్శ .... నన్ను తట్టేవరకూ 27 MAR 2014

by Chandrasekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hwlJVO

Posted by Katta

Rajkumar Bunga కవిత

ఆర్కే ||నిద్ర|| అ ల సి పో యా ను ఒరేయ్ బుజ్జోడ ఆయాసంగా ఉందని లోపలివాడికో మాటేసాను. సంహార దేవేత వచ్చి ఓడించకముందే, విజయపతాకం ఎగురవేసి శాశ్వతంగా బొజ్జోరా అని లోపలి బుజ్జోడు బయట బుజ్జోడితో ఒకటే గొడవ - విరామం లేకుండా! కన్నులనిండా నిద్ర - ఆనందమే కా ని గుండె లోతుల్లో పసికూనల అలజడి సంగతేంటో !! ఆర్కే ||నిద్ర|| 20140327

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o3AlF7

Posted by Katta

Jwalitha Denchanala Jwalitha కవిత

జ్వలిత/ నిస్సందేహ పార్ధివ దేహాన్ని శతశతాబ్దాల చరిత్ర పునరావృతం బ్రమల భ్రమణాల వ్రణం కోటికోట్ల గొంతుకల గాయం(నం) నిర్నిర్మిత నిర్ణయాలు నిర్నిశ్చిత యుద్దాలు నిర్నిర్ణిత ఉద్యమాలు నిర్నిర్ద్వంద్వ హామీలు నిర్నిబద్ద ప్రయోగాలు నిర్నిస్సంగ విరోధాలు నిర్నిశీధి ప్రకాశాలు నిర్నిషిద్ద అత్యాచారాలు నిన్ర్నిసంఖ్యాక కాంక్షాశిఖరాలు నిర్నవ నిర్మాణ లంకాగృహాలు నిర్నిదగ్ధ భస్మసరస్సులు అనాయాచిత మధిరా ప్రవాహాలు అకాల మరణాధారిత అపత్నులు అసహాయ అలింగ ప్రసవాలు నిర్నిరోధ జాడ్య హేతువులౌ నేరస్వామ్య రాజ్యాన నిర్నిస్సంఘటిత సమూహాల వ్యూహాత్మక ద్రోహాల సమావేశాల్లో నేనొక నిర్నిస్సందేహ పార్ధివ దేహాని 'నోటా'ఓటు నాపాలిట అలౌకికానంద లౌకిక అస్త్రం/శస్త్రం ..... జ్వలిత 9989198943

by Jwalitha Denchanala Jwalitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hwlJFl

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ || రంకుల రాట్నం|| పదవి రాదని - పరువు కోసం ప్రజల సైతం- మభ్యపెట్టి లాభ నష్టపు - లెక్కలేస్తూ గోతికాడి - నక్కలాగ అదునుకోసం - ఎదురుచూసే దొంగచూపులు - పట్టుకుని చేరేదీసే - బుజ్జగింపులు .1 ఇంతకాలం - అంటకాగి కొంతమూల్యం - వెనకవేసి కంటకాలను - తాళలేక సొంత గూటిని - కూల్చివేయ పరుల పంచకు పరుగులిడుతు గొర్రె దాటు సాకుల వెన్నుపోట్లు! .2 తెలిసి తెలిసి బూదిలోనె పడుకొనే కుక్కవోలె ముక్కచూసి తోకవూపులు మొక్కవోని నమ్మకాలతో చొంగకార్చె కేతిగాళ్ళు ఎన్నికల కలలలోనే పగటివేషగాళ్ళు ఎన్నికలవేళలోనే మన్నికైన నృత్యాలు ఖర్చులేని వినోదంనీలి చలన చిత్రం! కొత్తబిచ్చగాడు పొద్దెరుగని చందాన ఎక్కే గుమ్మం - దిగే గుమ్మం! ఎక్కడో పడతాడు తాతీసిన గోతిలో కోలుకోలేని మచ్చలా! మిగిలిపోతాడు! 3. ప్రమాణాలు పాటించడు ప్రణామాలు పెడుతుంటడు! పరిణామాలూహించడు పరిమాణమే హద్దంటడు! .4 నే చెప్పింది వేదంనన్ను అనుకరిస్తే పాపం! మీరెట్టపోతే నాకెందుకు అడ్డదారైనా సిగ్గువదిలైనా గద్దెక్కటమే నా గురి! తెగ బొక్కటమే తదుపరి! .5 చొక్కా మార్చటం చక్కగా యేమార్చటం చెక్కభజన చేయటం తార్చైనా కుర్చీ ఎక్కటం! రానివాడికి చోటులేదు రాక్షసత్వం అబ్బనోడికి రాజకీయ మనుగడుండదు! .6 27.3.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gEHkQJ

Posted by Katta

Jyothirmayi Malla కవిత

(నిన్న విశాఖ సహృదయ సాహితి నిర్వహించిన ఉగాది కవిసమ్మేళనంలో నా భాగం ఈ గజల్) గజల్ ||జ్యోతిర్మయి మళ్ళ|| నీకోసమె జన్మ అంత గడపలేదా ఆడదీ నీతోడిదె లోకమంటు నడవలేదా ఆడదీ నవ్వుపువ్వులు కురిపించగ నందనమే నీ ఇల్లు బాధలున్న బయటపడక నిలవలేదా ఆడదీ ఇద్దరొక్కటైన క్షణం ధన్యతగా భావించి తనువుమనసు అణువణువు ఇవ్వలేదా ఆడదీ ముల్లుగుచ్చుకుంటె నువ్వు విలవిలలాడుదులే కడుపుచీల్చు బాధనంతా ఓర్చలేదా ఆడదీ సుఖముదుఃఖము ఏదైనా ఒడిదుడుకులు ఎన్నున్నా ఆశ నింపు జ్యోతిగా వెలగలేదా ఆడదీ అమ్మగా అక్కగా ఆలిగా కూతురుగా బ్రతుకంతా ఉగాదిగా మలచలేదా ఆడదీ

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P4qTBx

Posted by Katta

Swatee Sripada కవిత

ఒక్క క్షణం 1. ఒక్క క్షణం నేనూ నా ఉనికీ నీ చుట్టూ అత్తరుసువాసనలా అలుముకు పోతూ అదృశ్యమై ....... 2. సుప్తాసుప్త అవస్థల్లో కలల అంచుల చుట్టూ అల్లుకున్న పట్టుకుచ్చుల దారాలమాదిరి తలపు వీచికలకే ఊయలలూగే నీ ఊహల సయ్యాటలో ఒక లిప్తనై అగరు పొగనై....... 3. నా చుట్టూ పరచుకు౦టూ పోతున్న శూన్యవనాలను ఉ౦డు౦డీ పలకరించే చిరువెచ్చని వెలుగు వెల్లువలా సుషుప్తిలో ఆదమరచిన హరిత భావాల మొహంపై నీళ్ళు చల్లి రంగుల నెమలీక సౌకుమార్యంతో ఒళ్లంతా నిమిరి కొత్త చివుళ్ళను మేల్కొలిపే నక్షత్రాల గమకాల్లా నీ అడుగుల సడి ........... 4. ఒక్క క్షణం నేనంటూ ఉన్న ఏ ఒక్క క్షణమైనా అది నీ ఊపిరి ఆవిరిలోనే...

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1duaVfk

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ | అదంతా జీవితమేనా ? ........................................ మనమెలా పెరిగాం .నలభై ఏళ్ళ కిందటి మాట అది ! కాలికి చెప్పుల్లేని,చేతికి వాచిల్లేని, కనీసం సైకిల్లేని బాల్యం అది . అవసరాలకు పైసల్లేని కాలం అది .అయినా మనమెలా పెరిగాం. పెరిగామా .నిజంగానే చదివామా .అదంతా జీవితమేనా? తలదిండు లగ్జరీగా నిలదీసిన రోజుల్లో మన నిద్రలన్నీ నిజమైన నిద్రలేనా? కనీసం ఒక్క ప్రేమైనా లేని యవ్వనకాలమంతా వృధాపద్దుగానే జీవితం పుటలో రాసేద్దామా ? రోజుల్ని తపనలతో నింపి,ఎదగడం,అందరిముందు ఒదగడం మెట్టుమెట్టుకీ ఒద్దికగా నిలిచిన ఆ బాల్యమంతా వొట్టి శూన్యమేనా? అయినా మనమెలా పెరిగాం. పంతుళ్ళని 'ఐదు వరహాల'తో ,పిల్లవాళ్ళని 'పప్పుబెల్లాల'తో సంతృప్తి పరిచిన రోజుల్లో చదివిన చదువులు నిజంగానే ఏమీకానీ చదువులేనా? దండించి చెప్పే చదువుల్లో నేర్చిన విద్యలు జీవితాన్ని దండనగానే మిగిల్చిందా? నడిచి నడిచి కాళ్ళ సత్తువకొద్దీ పరుగెత్తి పరుగెత్తీ స్కూల్ బెల్లుకుముందే చేరుకున్న రోజుల్లో హాస్టల్ పురుగుల అన్నంతో ఆకలిని జయించిన కాలాల్లో ఏ విద్యాసక్తి మనసును నింపిందో ! చదువులతీరూ, పెంపకాలజోరూ కలిసికట్టుగా ఇన్నేళ్ళలో ఇచ్చిన తీర్పేమిటో ! తరగతి గదుల్లో తారుమారవుతున్న ఆసక్తులు చివరికి ఆత్మహత్యల్లానో, అసహనపు వ్యక్తిత్వాలుగానో మారి మర్యాదలు మన్ననలులేని మసకమసక రేపటిలా ఉదయించడం లేదా?! 27.3.2014

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iCuvow

Posted by Katta

Rama Krishna Perugu కవిత



by Rama Krishna Perugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dtEZHR

Posted by Katta

Afsar Afsar కవిత

అతని సంతకం కింద ఇంకో కొత్త నిప్పు వాగు! ~ కవులు రాజకీయాలు మాట్లాడవచ్చా లేదా అన్నది ఇప్పుడు అప్రస్తుతమైన ప్రశ్న! నా మటుకు నాకు ఇది మనిషి గాలి పీల్చవచ్చా లేదా అన్న ప్రశ్న లాంటిదే! అయితే, వొక వచన రచయిత రాజకీయాలు మాట్లాడడానికి, వొక కవి రాజకీయాలు మాట్లాడడానికి తేడా వుందని మాత్రం నేనొప్పుకుంటాను. రాజకీయ భావాల వ్యక్తీకరణలో వచనరచయితకి వున్న అభివ్యక్తి స్వేచ్చ కవికి లేదు – ఎందుకంటే, అంతిమంగా కవిత్వం అనుభూతి కళ కనుక! కవిత చదివాక అది ఎదో వొక అనుభూతిని మిగల్చకపోతే, రాసిన వాక్యాలన్నీ వృధా అయిపోయినట్టే! ఇలా వృధా కాని వాక్యాలతో రాజకీయ కవిత్వం రాసిన వాళ్ళు చాలా తక్కువ, తెలుగు కవిత్వం అనే కాదు, ప్రపంచకవిత్వంలో కూడా! రాజకీయ తీవ్రతా, అనుభూతి సాంద్రతా వొకే వొరలో యిమడవన్న అభిప్రాయమూ వుంది. అది కేవలం అభిప్రాయమే అని నిరూపించే కవులు మనకి అప్పుడప్పుడూ తారసపడతారు. అలాంటి కవి చేరన్ రుద్రమూర్తి. చేరన్ ఇప్పటికే కవిసంగమస్థలిలో బాగా తెలిసిన పేరు. చేరన్ గొంతుక మనకి తెలుసు. ఈ మధ్య నెల రోజులుగా చదువుతున్న పుస్తకం - You Cannot Turn Away- చేరన్ కవిత్వపు కొత్త ఇంగ్లీష్ అనువాదాలు. ఈ పుస్తకం చివరి భాగంలో చేరన్ కొత్త కవిత్వం కూడా వుంది. చేరన్ కొత్త కవిత్వం వొక అనూహ్యమైన క్లుప్తత వేపు మళ్ళుతోంది. చాలా మామూలుగా అనిపించే మాటల్లో లోతైన దుఃఖాన్ని తవ్వుతోంది. పదచిత్రాలూ ప్రతీకల వంటి కవిత్వ భాషని వదిలేసి, మాయవస్త్రాల్ని చింపి పోగులు పెట్టి, తప్పక రాసి తీరాల్సిందేదో రాయడం కోసం చేరన్. ఈ నాలుగు మాటలూ వినండి, అవి చేరన్ చిర్నామా అనుకుంటాను. లేదంటే, చేరన్ లాంటి వొక కవి మాత్రమే రాసుకోగలిగిన epitaph కూడా కావచ్చు. నా చితి కాలిపోతే కాలిపోనీ అందులోంచి చిన్ని వెలుగు రవ్వని నేను. ఆ వెలుగురవ్వలోంచి వొక పాట పుట్టుకొస్తోంది... వొక చేరన్ కవిత: ~ గొంతుక -- దోస్త్, ఇంకా ఏముంది నన్నడగడానికి? పోయిన వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు రాలిపోయిన వాళ్ళు పోయే వాళ్ళు బతికిన వాళ్ళు ధ్వంసమైన వాళ్ళు ఎదిగిన వాళ్ళు కుప్పకూలిన వాళ్ళు గుర్తున్న వాళ్ళు గుర్తు లేని వాళ్ళు జారిపోయిన వాళ్ళు పుట్టిన వాళ్ళు ప్రవహించుకుంటూ వెళ్ళిన వాళ్ళు పరిభ్రమిస్తున్న వాళ్ళు. వాళ్ళలో ఎంత మంది నాకు తెలుసో నీకేం తెలుసు?! సముద్రాల ఆవల బతుకుతున్న వాణ్ని నేను నా తెర మీద నెత్తుటి నదులు. నా చుట్టూరా కరిగిపోతున్న నది మీద వొక మంచుతెప్ప కదిలిపోతోంది. దాని మీద తడిసిన రెక్కల గాయపడిన పక్షి. ఏ దారీ తోచని వాళ్ళలో చిక్కుబడింది ఆ నదా? ఆ పక్షా? నన్నెందుకులే అడుగుతావ్?!

by Afsar Afsar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P2ZboJ

Posted by Katta