పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Jyothirmayi Malla లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jyothirmayi Malla లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2014, సోమవారం

Jyothirmayi Malla కవిత

మిఠాయిపొట్లం ||జ్యోతిర్మయి మళ్ళ|| బంగారమంటే ఇష్టం నాకు.. పెంకుటింటి పద్మ చెవిలోలాకులు ఉత్తుత్తినే ఊగుతున్నపుడూ మేడింటి మాలక్ష్మి లాకెట్టుగొలుసు మరిమరీ మెరిసిపోతున్నపుడూ ఎక్కడో ఏదో వెలితి.. అలాటివేవీ నాకెందుకు లేవో! అమ్మదగ్గరా నాన్నదగ్గరా ఎన్నోసార్లు బయటపెట్టిన ఆశ ఎన్నాళ్ళయినా నిజమవదెందుకో! పండగపండక్కీ చింతపండేసి తోమితే మెరిసే నా చెవిదిద్దులు ఆలోలాకులూ లాకెట్టుగొలుసూ ఎదురవగానే చిన్నబుచ్చుకుని వన్నెతగ్గుతాయెందుకో! కారణం తెలిసేసరికి నాకు చాలా వయసొచ్చేసింది పద్మ పెంకుటిల్లిపుడు మేడయింది ఆమె చెవుల్తో పాటూ మెడ కూడా మెరుస్తోంది మాలక్ష్మి మేడ ఇపుడు నెత్తిన మరో మూడు మేడల్ని పేర్చుకుంది ఆమె మెడే కాదు వొళ్ళంతా ధగధగలాడుతోంది మా గుడిసె మాత్రం మరికాస్త శిధిలమయింది మా నాన్నలాగే! నా బంగారు ఇష్టం చిటారుకొమ్మన వేళ్ళాడుతోంది ఎప్పటిలాగే!

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V5E6h2

Posted by Katta

15, జూన్ 2014, ఆదివారం

Jyothirmayi Malla కవిత

రేపుందో లేదో ||జ్యోతిర్మయి మళ్ళ|| నువు బాగా చదివి గొప్పోడివవ్వాలని తన కోర్కెల్ని తాకట్టు పెట్టి కొడంత ఆశనే ఆకలిదప్పులకాసరా చేసుకున్న మధ్యతరగతి నాన్నకి తెలీకుండా క్లాసులెగ్గొట్టి సినిమాలు షికార్లు తిరిగి పరీక్ష ఫెయిలయిన సంగతి అప్పుడు తప్పనిసరై దాచిపెట్టినా ఏదో ఒకరోజు నా నిర్లక్ష్యాన్ని క్షమించు నాన్నా అని మీ నాన్నతో అనాలనుకుని ఆగిపోయావా పెంకితనం చేసాడని బెల్టుచ్చుక్కొట్టావని ఏడ్చేడ్చి పడుకున్న చిన్నారి కొడుకు అమాయకపు ముఖం చూసికూడా అహం అడ్డొచ్చి ఓదార్చలేని నిస్సహాయత ఇప్పుడు గుర్తొచ్చి మనసు చివుక్కుమని ఏదో ఒక రోజు నా నిర్దాక్షిణ్యతని మన్నించు బాబూ అని నీ కొడుక్కి చెప్పాలనుకుని వాయిదా వేసావా అయితే ఇంకా ఆగకు ఆరోజే ఈరోజనుకో నీమాట నీతండ్రి చెవిన పడకముందే ఏటెర్రిస్టో నీకంటే ముందడుగేయొచ్చు నీకొడుకు ముఖం నీకేనాటికీ కనపడకుండా చేసేందుకు ఏ బాంబ్లాస్టో నీ వాయిదాని వాడుకోవచ్చు

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1loyF1v

Posted by Katta

8, జూన్ 2014, ఆదివారం

Jyothirmayi Malla కవిత

వృధా ప్రయాస ||జ్యోతిర్మయి మళ్ళ|| నీనుండి వేరుగా.. నిన్నొదిలి దూరంగా.. పారిపోవాలనుకున్నానా అనుకోవడమేంటి పారిపోయానా నువ్వూ వద్దనలేదు..నీకసలు భయం ఉంటేగా లంగరు విప్పని పడవ ఎంతనడిపినా అక్కడే ఉంటుందని నీకు తెలుసు తెలియంది నాకే ఇక్కడ మనసుని మళ్ళించే ధ్యాస పొరలను కడిగే ప్రయాస నిబ్బరంగా నిశ్చయంగా చేసిన పనే అయాక తొంగి చూసానా పొరలు పెరిగాయి పాతవీ ఉన్నాయి..కొత్తవెన్నో పుట్టుకొచ్చాయి ఉతికి ఆరేసిన నారచీరల్లా రెపరెపలాడుతున్నాయి అన్నిటా నీ ముఖచిత్రాలే..అద్దకాలేసినట్టు తెగ ముద్దొస్తున్నాయి ఒక్కదాన్లోనయినా నవ్వకుండా ఉన్నావా ప్రయాస వృధా అయినందుకు భంగపాటో బాధో నాకుంటాయిగా ఊరడించాల్సింది పోయి ఉడికిస్తూ చూస్తావా

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oxrrhb

Posted by Katta

11, మే 2014, ఆదివారం

Jyothirmayi Malla కవిత

గజల్ రచన:సినారె అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు ఈబండి చూడరా నాన్నా ఈ గుఱ్రమింక నీదన్నా తెగమంకుతో చిననాడు దిగలేదు అమ్మ మూపు రొదలలో మౌనపాఠంలా వ్యధలలో జ్ఞానపీఠంలా నా బాల్యమంతా తానే నడిపింది అమ్మచూపు చీకటికి చంద్రబింబంలా ఆకలికి పూర్ణకుంభంలా నిలువెల్ల మమతల వెలుగై నిలిచింది అమ్మ రూపు మెరిసే ప్రభాత కిరణంలా విరిసే వసంత కుసుమంలా పెరిగే సినారె బ్రతుకులో దొరికింది అమ్మ ప్రాపు

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNnxi9

Posted by Katta

10, మే 2014, శనివారం

Jyothirmayi Malla కవిత

థాంక్యూ మస్తిష్కం ||జ్యోతిర్మయి మళ్ళ|| ఎందుకో రాలాయి రెండు నీటిబొట్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటీ కలిసి నీరై ఏరై వాగై వరదై నింగి నుండైతే ఏమో కంటి కొలను నుండి రాలిన వాన ఎందుకూ పనికిరానిది దుఃఖం ద్రవిస్తే వస్తుందా ఇది? గుండెకీ కంటికీ కాంట్రాక్టేమో! కొట్టుకోవడం మీద వత్తిడి హృదయానికి లబ్‌డబ్‌లు నోరుమూసుకున్నాయి బాధా నిరాశా ఘర్షణపడి పుట్టిన ఉరుములదే పైచేయి ఎగసిపడడాన్ని ఎవరాపుతారు? అల్పప్రాణానికి అర్ధాంతరంగా ఆయువు తీరిపోతుందేమోనని మనసుమాట వింటే మసైపోడం ఖాయమని తుఫానుగా మారితే ప్రమాదమని ఊహించి.. తెలివైన మస్తిష్కం పూనుకుని ఊరడిస్తే.. అప్పుడాగాయి ఉరుములూ వానా రెండూ

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oB0DLq

Posted by Katta

9, మే 2014, శుక్రవారం

Jyothirmayi Malla కవిత

గజల్ ||జ్యోతిర్మయి మళ్ళ|| నిన్నువిడిచి నిముషమైన నిలవడమే కష్టం నీవులేని కాలాన్నిక కదపడమే కష్టం కన్నుకన్ను కలిసినపుడు దేహమంత పులకరమే మనసులింత ముడిపడితే మసలడమే కష్టం మధువులొలుకు పలుకులన్ని వినుటకైతె ఆనందమె పరితపించు పెదవులనోదార్చడమే కష్టం చెంతచేరి నిలుచువరకు లోకమంత నందనమే ఎంతబాధ దూరమగుట చెప్పడమే కష్టం నీవునేను ఒకరికొకరు తెలియనపుడు ఇద్దరమే ఇప్పుడైతె విడివిడిగా చూపడమే కష్టం

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l6bCfd

Posted by Katta

1, మే 2014, గురువారం

Jyothirmayi Malla కవిత

ఓటు వెయ్యడమంటే ||జ్యోతిర్మయి మళ్ళ|| ఓటు వెయ్యడమంటే.. ఓ ముద్ర గుద్దేసి నిద్రోడం కాదు నల్లచుక్క పోతుంది నాల్రోజులకే నువు ఎన్నుకున్నది ఓ సన్నాసినయితే పొమ్మన్నా పోడు నాలుగేళ్ళకీ ఓటు వెయ్యడమంటే.. ఒక రోజు సెలవు సంబరం కాదు వెయ్యని నీ ఓటు ఎక్కడో వేస్తుంది ఓ వేటు నీకే తెలీకుండా చేయగలదు లోటు ఓటు వెయ్యడమంటే.. మనజాతీ మనప్రాంతం మనసొంతమంటూ మనోడి మీద చూపే ఇష్టం కాదు మనదేశం మనరాష్ఠ్రం మన ఉన్నతికోరే మంచోడికి కట్టే పట్టం

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKwnQx

Posted by Katta

31, మార్చి 2014, సోమవారం

Jyothirmayi Malla కవిత

||జ్యోతిర్మయి మళ్ళ|| కవి మితృలందరికీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! గజల్ ఆకాశమే ఒక కాగితం హరివిల్లు దించేసుకోనా నామనసునే కుంచెగా ఒక బొమ్మ నే గీసుకోనా ఆ కొండ కోనల్లో ఆగనా ఆ వాగు నీరల్లె సాగనా నాకంటిలో ఆ సోయగం పదిలంగ నిధి చేసుకోనా ఆ తీగ పువ్వల్లె నవ్వనా ఆ కొమ్మలో కోయిలవ్వనా ఈ గుండెతో ఆ గీతిని లతలాగ పెనవేసుకోనా ఓ మేఘ నీలమై మారనా ఓసంధ్య ఎరుపై జారనా ఆ వర్ణ కాంతులే నిండుగా వొళ్ళంత నే పూసుకోనా మధుమాస సుధఅంత గ్రోలనా మదిఅంత పులకింత తేలనా వసంతమంత ఇంతగా నాచెంత ఉంచేసుకోనా ఓ మావి మాలై మురియనా ఓ రంగవల్లై విరియనా ఉగాదివేళ ఓ జ్యోతినై మీకంట నను చూసుకోనా (31-03-2014) (ఈరోజు విశాఖ పోర్ట్ ట్రస్ట్ సాహితీ సంస్థ 'సాగరి ' నిర్వహించిన కవిసమ్మేళనం కోసం నేను రాసి పాడిన గజల్ )

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRlUi5

Posted by Katta

27, మార్చి 2014, గురువారం

Jyothirmayi Malla కవిత

(నిన్న విశాఖ సహృదయ సాహితి నిర్వహించిన ఉగాది కవిసమ్మేళనంలో నా భాగం ఈ గజల్) గజల్ ||జ్యోతిర్మయి మళ్ళ|| నీకోసమె జన్మ అంత గడపలేదా ఆడదీ నీతోడిదె లోకమంటు నడవలేదా ఆడదీ నవ్వుపువ్వులు కురిపించగ నందనమే నీ ఇల్లు బాధలున్న బయటపడక నిలవలేదా ఆడదీ ఇద్దరొక్కటైన క్షణం ధన్యతగా భావించి తనువుమనసు అణువణువు ఇవ్వలేదా ఆడదీ ముల్లుగుచ్చుకుంటె నువ్వు విలవిలలాడుదులే కడుపుచీల్చు బాధనంతా ఓర్చలేదా ఆడదీ సుఖముదుఃఖము ఏదైనా ఒడిదుడుకులు ఎన్నున్నా ఆశ నింపు జ్యోతిగా వెలగలేదా ఆడదీ అమ్మగా అక్కగా ఆలిగా కూతురుగా బ్రతుకంతా ఉగాదిగా మలచలేదా ఆడదీ

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P4qTBx

Posted by Katta

23, మార్చి 2014, ఆదివారం

Jyothirmayi Malla కవిత

|| జ్యోతిర్మయి మళ్ళ|| ఊరికొక్కరు వీళ్ళు... మెట్లు కట్టే మేస్త్రీలు ఇటుకలు మోసే కూలీలు ప్రతిభుంటే సరిపోతుందా నాలుగుగోడలు చూస్తూ అది బతికేస్తుందా ఎంత కోరిక ఎంత తపన ఎంత శోధన ఎంత సాధన ఎన్నుండీ ఏంలాభం ఎత్తుకెత్తే మెట్టు దొరకక? మన ఇల్లు మనం కట్టుకోగలం గానీ విజయశిఖరానికి ఎక్కించే మెట్లు మనం కట్టగలమా అవి ఎవరో కట్టిపెట్టాలి మొదటిమెట్టుమీద మనల్ని నిలబెట్టాలి ఒకో మెట్టూ ఓ విజయానికి పునాది రెండో విజయానికి స్ఫూర్తి అదిగో అలాంటి కట్టుడు పనిగాళ్ళే వీళ్ళు.. మెట్లు కట్టే మేస్త్రీలు ఇటుకలు మోసే కూలీలు కాళ్ళు మొక్కాలనిపించే కళాపోషకులు ఎక్కేందుకు కాదు వారి శ్రమ ఎవరినో ఎక్కించేందుకు వీరి స్వేదం ఎవరికో శీతలపవనం వీరి ఆరాటం ఎవరికో ఆనందం వీరి కష్టం ఎవరికో ఫలితం వీరుకట్టిన మెట్లమీంచి ఇంకొకరు ఎక్కడాన్ని చూస్తూ పడుతున్న చమటని తుడుచుకోడం మర్చిపోయే సహృదయత్వం గెల్చినవారి ఆనందాన్ని తమ ముఖాల్లో వెలిగించుకునే సున్నితత్వం నిస్వార్ధం వీరి రక్తంలో దూరి ప్రవహిస్తుంటుంది మానవత్వం వీరి అడ్రసు వెతుక్కుని నివసిస్తుంటుంది వీళ్ళే..ఆ మెట్లు కట్టే మేస్త్రీలు ఇటుకలు మోసే కూలీలు ఊరికొక్కరుంటే చాలనిపించే దేముళ్ళు ! (సూర్యపేటలో నా గజల్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు సోదర సమానుడు శ్రీ Ganesh Peddireddy గారు పడిన శ్రమ ను చూసినపుడు కలిగిన భావావేశం ఈనాటి ఈ కవిత నా గజల్ ప్రయాణానికి దారి చేసి ఇలాంటి మేస్త్రీలు..శ్రీ కొమ్మోజు సత్యనారాయణ గారు(కొసనా, విశాఖ), శ్రీ Kranthi Srinivasa Rao గారు (ఖమ్మం), శ్రీ Peddireddi ganesh గారు (సూర్యాపేట), శ్రీమతి Hema Valluri గారు..ఇలా ఎందరో..అందరికీ ఈసందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి)

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jpns1H

Posted by Katta

20, మార్చి 2014, గురువారం

Jyothirmayi Malla కవిత

|| జ్యోతిర్మయి మళ్ళ || గజల్ మనసునేలు మాధవుడిని తలవాలని ఉండదా ప్రాణమిచ్చు ప్రేమికుడిని కలవాలని ఉండదా మెరుపుతీగవంటు నన్ను మురిపెముగా పిలిచితే మురిసిపోతు చెంతచేరి నిలవాలని ఉండదా తమలపాకులంటు కళ్ళకద్దుకుంటె పదములు ధన్యములై చేతులెత్తి కొలవాలని ఉండదా అమృతమంటు మధువు అంటు అధరముల పొగిడితే పరవశించి పెదవి విప్పి పిలవాలని ఉండదా నవ్వుముఖము దుఃఖములకు ఔషధమని తలచితే సర్వమోడియైన నువ్వే గెలవాలని ఉండదా ముద్దబంతివి పూలరెమ్మవి జాబిలి నీవంటుంటే మరలమరల ఈ నేలనే మొలవాలని ఉండదా (20-3-14)

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qZ6Enw

Posted by Katta

15, ఫిబ్రవరి 2014, శనివారం

Jyothirmayi Malla కవిత

ప్రేమధ్యానం ||జ్యోతిర్మయి మళ్ళ|| నులివెచ్చని మనప్రేమను ధ్యానంలో చూసుకోనీ చెలిమెచ్చిన తలపులనొక కావ్యంగా రాసుకోనీ విరిచూపులు విసిరినపుడు ఎదలోపల సరిగమలు కంటిమెరుపు పూయించిన కుసుమాలను కోసుకోనీ నినుచేరిన క్షణమందున అణువణువూ తరించెను నాచేతులనేదండగ నీమెడలో వేసుకోనీ చెలివలచిన ప్రేమికుడవు హరివిల్లై విరిసావు పదిలముగా నీచిత్రమె మదినిండా గీసుకోనీ నాయెదలో నీతలపులు తుమ్మెదలై చరించెను వికసించిన నా ఆశలు నీవశమే చేసుకోనీ ఇద్దరొకటై మాయమయెను లోకమిపుడు చిత్రంగా నాదేహములోనెనేను నీఊపిరి తీసుకోనీ

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NPrAhU

Posted by Katta

27, జులై 2012, శుక్రవారం

జ్యోతిర్మయి మళ్ళ || అన్‌టచబుల్ అటాచ్మెంట్ ||

నువ్వు నాలాకాక
నేను నీలాకాక
భిన్నంగా
ఉన్నా..

నాకిష్టం
నువ్వు
నీకిష్టం
నేను

నువ్వెక్కడో
నేనిక్కడ
వేర్వేరుగా
ఉన్నా..

నాతో
నువ్వు
నీతో
నేను
*26-07-2012

26, జులై 2012, గురువారం

జ్యోతిర్మయి మళ్ళ || తపోయోగం ||

పంజరమే..
లోపల చిక్కుకుని
గిలగిలా కొట్టుకోవడం నచ్చిన
అందమైన బందిఖానా ఇది.

శిరసావహమే..
లోపలికి నెట్టి గడియ పెట్టిన
నీ ఆజ్ఞ !
అమూల్యమైన నజరానా ఇది.

నయనసదృసమే..
చూట్టూ నిలబెట్టిన
నీవేలిముద్రలు పొదిగిన ఇనుపచువ్వలు !
అపురూప ఖజానా నాకిది.

పరవశమే..
ఇక్కడ వదిలెళ్ళిన
నీఊపిరి తరంగ రవళి !
అదురుగుండె కదిలించు సహానా ఇది.

ఆనందాతిరేకమే..
నీసడి కోసం సవ్వడి కోసం
నీ వేలికొస కోసం
మోమంతా కనులుగా
మేనంతా చెవులుగా మారినది !
దీక్షగా నిరీక్షించు తపోయోగమిది.
*26-07-2012

25, జులై 2012, బుధవారం

జ్యోతిర్మయి మళ్ళ || తపోయోగం ||

పంజరమే..
లోపల చిక్కుకుని
గిలగిలా కొట్టుకోవడం నచ్చిన
అందమైన బందిఖానా ఇది.

శిరసావహమే..
లోపలికి నెట్టి గడియ పెట్టిన
నీ ఆజ్ఞ !
అమూల్యమైన నజరానా ఇది.

నయనసదృసమే..
చూట్టూ నిలబెట్టిన
నీవేలిముద్రలు పొదిగిన ఇనుపచువ్వలు !
అపురూప ఖజానా నాకిది.

పరవశమే..
ఇక్కడ వదిలెళ్ళిన
నీఊపిరి తరంగ రవళి !
అదురుగుండె కదిలించు సహానా ఇది.

ఆనందాతిరేకమే..
నీసడి కోసం సవ్వడి కోసం
నీ వేలికొస కోసం
మోమంతా కనులుగా
మేనంతా చెవులుగా మారినది !
దీక్షగా నిరీక్షించు తపోయోగమిది.


*25.7.2012

19, జులై 2012, గురువారం

జ్యోతిర్మయి మళ్ళ || క్రానిక్ డిసీజ్ ||

అదేపనిగా ఒకేపేరు ఉచ్ఛరించడం
పదేపదే అదేరూపు నిదుర చెడగొట్టడం
మళ్ళీ మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడాలనుకోవడం
ఒక్క సారైనా ఎలాగోలా కలవాలనుకోవడం
ఇలాంటివే ఇంకా ఎన్నో...ఇండికేషన్స్

అపుడపుడూ శరీరం స్వాధీనం తప్పడం
ఉండుండీ మెదడేమో మొద్దుబారడం
రాను రానూ మనసేమో వశం తప్పడం
ఇంచుమించు ఇహపరాలు మర్చిపోవడం
ఇవికాక మరెన్నో... సింప్టమ్స్

ఇదేదో జబ్బేమోనని ఎవరో చెబితే
మంచి డాక్టరని నమ్మివెళితే
పల్సు చూడలేదు పిల్సూ ఇవ్వలేదు
కళ్ళజోడొకసారి పైకెత్తి నావైపు
తెల్లబోయి చూసిందా తెల్లకోటు
కళ్ళు మూసుకొనుండిపోయి కాసేపు
తెల్లకాగితం చూపాడు ప్రిస్క్రిప్షనంటు

అటుఇటు తిప్పిచూసా ఏమీలేదు
తెల్లబోవడం ఇపుడు నావంతు
ఆనక ఒక చీటీ ఇచ్చాడు
అక్కడ రాసుందిలా..

"ఆఒక్కటీ అడక్కు ప్లీజ్
తెలిస్తే నేనే నయం చేసుకోనూ
ఇరవయ్యేళ్ళ నా ఈ

క్రానిక్ డిసీజ్ ?"
(మొన్నొకరోజు ఎక్కడో చదివా లవ్ చెయ్యడం అనేది ఒక సివియర్ డిసీజ్ అని..దాని ప్రేరణ ఈ కవిత)

18, జులై 2012, బుధవారం

జ్యోతిర్మయి మళ్ళ || పెర్ ఫెక్ట్ ట్రీట్ మెంట్.||

ముదిరే దాకా మేం గుర్తుకురామా?
మందలిస్తూ మందులిచ్చాడు
మా కుటుంబ వైద్యుడు..

ఏం భయం లేదు పిచ్చీ, నేనున్నాగా!
వెచ్చగా భరోసా ఇచ్చాడు
నన్ను కట్టుకున్నోడు..

రెండో ట్రీట్ మెంటే
ముందుగా పనిచేసింది !
*18-07-2012

16, జులై 2012, సోమవారం

జ్యోతిర్మయి మళ్ళ || నాలోని నువ్వు ||








కనుచూపు మేరంతా నువ్వే కనిపిస్తున్నావు
నా కంటిపాప లో కొలువున్నావా?

గుండె భారంగా ఉంది
నువ్వు మరీ ఇంత బరువా?

నాలుక ఏం పలికినా నీపేరే వస్తోంది బయటికి
స్వరపేటికను స్వాధీన పరుచుకున్నావా?

ఏ వైపూ దారి లేదు మనసు గదికి
ఎలా చొరబడ్డావు దొంగవా?

నా ప్రతి కదలికనూ శాసిస్తున్నావు
కండరనరాలన్నిటినీ ఆక్రమించావా?

నీతలపు తప్ప మరేం చేయనని మొరాయిస్తోంది మెదడు
ఏకచత్రాధిపత్యం సాగిస్తున్నావా?

ఇదేం చిత్రం, నా అద్దం నిన్ను చూపిస్తోంది
నేనే నువ్వయిపోయావా?
*16-07-2012

15, జులై 2012, ఆదివారం

జ్యోతిర్మయి మళ్ళ || ఒకరికి ఒకరు ||

నువ్వేనాలోకం
'నీకోసం నేను' అంటుందామె

ఇష్టపడడమే ఇష్టం ఆమెకు
ఒదిగుండడంలోనే హాయి ఆమెకు
పిచ్చిది...
లోకాన్ని గెలిచినంత తృప్తి అందులో

నువ్వూ నేనూ ఒకటే
'మనకోసం మనం' అంటాడతను

నిజాల్ని ప్రేమిస్తాడు
నిరాడంబరతను ఆస్వాదిస్తాడు
మేధావి..
ఏం తెలీదతనికి అతని దృష్టిలో !
*15-07-2012

14, జులై 2012, శనివారం

జ్యోతిర్మయి మళ్ళ॥ఒకరికి ఒకరు॥


నువ్వేనాలోకం
'నీకోసం నేను' అంటుందామె

ఇష్టపడడమే ఇష్టం ఆమెకు
ఒదిగుండడంలోనే హాయి ఆమెకు
పిచ్చిది...
లోకాన్ని గెలిచినంత తృప్తి అందులో

నువ్వూ నేనూ ఒకటే
'మనకోసం మనం' అంటాడతను

నిజాల్ని ప్రేమిస్తాడు
నిరాడంబరతను ఆస్వాదిస్తాడు
మేధావి..
ఏం తెలీదతనికి అతని దృష్టిలో!
*13.7.2012