అనువాద కవితలు : ఆదివారం ఆంధ్రప్రభ అనుబంధ పత్రిక Dt:01.06.2014 ప్రచురణ. .... || ఋతువు ॥.... .(Season). *త్రుప్పు - త్రుప్పంటే పరిపక్వత , త్రుప్పంటే ముదురు మొక్కజొన్న, త్రుప్పంటే పతనమై పండే పంట కోత . పరపరాగ సంపర్క సమయం ఇది. పంట చేల మీది పైర గాలిలో అల్లుతున్నవి వాన కోయిలలు నృత్యాలను తూలికల బాణాల లాంటి ఎగిరే వెలుగు రేఖల వంటి జొన్న పొత్తుల కేసరాలతో. ప్రియమైనవి మాకు పిల్ల గాలులు వినిపించే పదబంధాలు , వెదురు పొదల వెండి ఆకుల్లా గుచ్చుకునే జొన్న కర్రల కరకు రాపిళ్ళ ధ్వనులు . రైతులం మేము -- కంకుల కేసరాలు కపిల వర్ణంగా మారాలని పోగేసుకున్నాం పొడుగాటి సాయం సంధ్యా నీడలను పేనుకున్నాం గడ్డితాళ్ళను తాటి నెగళ్ల పొగలతో . కాచు కున్నాం చీడ తెచ్చే మార్పు కోసం ! వేచి ఉన్నాం త్రుప్పు ఇచ్చే భరోసా కోసం! మూలం : వోలె సోయింకా ,నైజీరియన్ నోబెల్ లారియేట్. స్వేచ్చానువాదం : నాగరాజు రామస్వామి. * నైజీరియన్ 'ఒగున్' mythology లో 'rust'(త్రుప్పు) అన్నపదం పతనానంతర ప్రగతికి ప్రతీక. దీన్ని రైతు మాటగా, పంటపొలాల సందర్భం లో కూడా ప్రతిభావంతంగా ప్రయోగించాడు కవి. ---Dt:05.06.2014.
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1meVDsU
Posted by Katta
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1meVDsU
Posted by Katta