పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, జూన్ 2014, ఆదివారం

Abd Wahed కవిత

వృద్ధాప్యదినోత్సవం సందర్భంగా రాసిన నా కవిత ఫాదర్స్ డే రోజున కూడా పోస్టు చేయాలనిపించింది. మలిసంధ్య నెత్తురంతా చెమటై వెలుగునిచ్చింది దీపం మిణుకు మిణుకు మంటోంది నరాల పొడుగునా నడిచి నడిచి, నడిచి నడిచి ... కాయం గాయమై కరిగింది అడుగడుగున లెక్కలు, వడి వడిగా చిక్కులు కనుకొలకుల్లో మొలకేసిన మొక్కలను కన్నీళ్ళతో సాకి సాకి, సాకి సాకి... కనురెప్పల దుప్పటిలో పరచుకున్న ఆశలు ఊపిరిని మూటగట్టి పంటి కింద దాచిపెట్టి నడిచి,నడిచి ... నడిచి, నడిచి... చివరకు ఆవిరిగా మిగిలానని తెలియరాలేదు స్వంత నీడలు చెప్పేవరకు... దారిలో కూలబడ్డానికి ఒక్కసారి ఎదురుదెబ్బ తగిలితే ఎంత బాగుండు గుండె తునకలను సానబెట్టాలని చూస్తే ఆ మెరుపులే కళ్ళను పొడుస్తాయని చీకటి పడ్డాకే తెలిసింది నెర్రెలు పడిన బీడు చర్మం చుక్క నీటి కోసం దిక్కులు చూస్తోంది (వృద్ధులైన మీ తల్లిదండ్రుల ముందు విసుగ్గా – ఊఫ్ – అని కూడా అనవద్దు : ఖురాన్)

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1loDRlW

Posted by Katta

Sky Baaba కవిత

Friends, My 4 poems at a time.. http://ift.tt/1loyFyy

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1loyFyy

Posted by Katta

ఎం.నారాయణ శర్మ కవిత

చివరాఖరి ప్రశ్న ____________________________ 1 నల్లని రాయిమించి కిందికి వాలుతున్నకొంగలా గుడ్డుమించి దు:ఖం పారుతుంటే నగరపు ఒంటరితనం నుంఛి తేరుకునేందుకు నేను వర్షంలో ముఖం దాచుకుంటా మూలం అందని చివుళ్లు గాలివాటుకు కొమ్మల సందున దూరి దాక్కున్నట్టు 2 వేళ్లు కంటిని పొడిచేసినట్టు నన్ను నేను పొడిచేసుకోడం కంటే లోకం మీద విజయమేముంటుంది వర్షం మురుకినీరవుతున్న ఆక్వా కాలంలో ఎండి చారికలవటం తప్ప నదులకు జీవితమెందుకో 3 వాడి మీసాలు మాత్రమే కుర్చీ మోస్తుంటే రాజ్యాన్నానందిస్తాయి చీమల్ని చంపేందుకు వాడు నదుల్ని చల్లుతాడు వెలుగుతున్న సిగరెట్ని చూసి గొంతెండిపోయిన నదుల్లా నువ్వు నేను వణికి పోతూ 4 కాస్త గుమ్మనికి పసుప్పూసేసి కాసిని పూలూ పళ్లూ కొమ్మనించి వేరుచేసి క్లిప్ పెట్టుకుని వెనకకి అలా వదిలేసి భారం భారంగా గడిపేద్దాం ఈ రోజూ అన్ని ఖాలీ దినాల్లాగే నిన్నటిలా మిగిలిపోతుంది.

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1loyGm2

Posted by Katta

Jyothirmayi Malla కవిత

రేపుందో లేదో ||జ్యోతిర్మయి మళ్ళ|| నువు బాగా చదివి గొప్పోడివవ్వాలని తన కోర్కెల్ని తాకట్టు పెట్టి కొడంత ఆశనే ఆకలిదప్పులకాసరా చేసుకున్న మధ్యతరగతి నాన్నకి తెలీకుండా క్లాసులెగ్గొట్టి సినిమాలు షికార్లు తిరిగి పరీక్ష ఫెయిలయిన సంగతి అప్పుడు తప్పనిసరై దాచిపెట్టినా ఏదో ఒకరోజు నా నిర్లక్ష్యాన్ని క్షమించు నాన్నా అని మీ నాన్నతో అనాలనుకుని ఆగిపోయావా పెంకితనం చేసాడని బెల్టుచ్చుక్కొట్టావని ఏడ్చేడ్చి పడుకున్న చిన్నారి కొడుకు అమాయకపు ముఖం చూసికూడా అహం అడ్డొచ్చి ఓదార్చలేని నిస్సహాయత ఇప్పుడు గుర్తొచ్చి మనసు చివుక్కుమని ఏదో ఒక రోజు నా నిర్దాక్షిణ్యతని మన్నించు బాబూ అని నీ కొడుక్కి చెప్పాలనుకుని వాయిదా వేసావా అయితే ఇంకా ఆగకు ఆరోజే ఈరోజనుకో నీమాట నీతండ్రి చెవిన పడకముందే ఏటెర్రిస్టో నీకంటే ముందడుగేయొచ్చు నీకొడుకు ముఖం నీకేనాటికీ కనపడకుండా చేసేందుకు ఏ బాంబ్లాస్టో నీ వాయిదాని వాడుకోవచ్చు

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1loyF1v

Posted by Katta

Arcube Kavi కవిత

తుర్క గోవిందం ______________ఆర్క్యూబ్ గలీజ్ పనులు గలీజ్ మనుషులు రోత శివా ..శివా.. తానమే జెయ్యరు సోరుప్పు రాలిన గోడలు గూడలు దెగిన చెప్పులు ఏడికాడ మోరీలు గల్లీ నిండ పందులు మా మాదిగోల్లు నయం బాషా..ఏషం అంతా అలగే ఇంటిపొంటుంటే వాడ కట్టంత కంటే తలుసుకుంటనే ఓకారం ఏండ్లు పూండ్లైనా వీళ్ళ దిమాక్ పన్ జెయ్యది " హిందూ "మహా సముద్రంల మీనార్ పొద్దు పొడుస్తదా అల్లా అంటే ఈ దేశంల అన్నం పుడుతదా నిత్తె నమాజ్ జేత్తే అమీర్ లై పోతరా సారే జహాసే అచ్చా.. అబ్బో..ఈ దేశస్తులమైపోదామనే ?! అదే పాన్ టేలా అదే బీడీ సాటా అరేక్ మాల్ పాంచ్ రుపాయ్ అవే తోపుడు బండ్లు నాటివట్టి అవే మూసలు ఇక్కడ బడెదైనా గుడే మనువు నోట పుట్టిందే అక్షరం చచ్చినట్టు పాడాల్సిందే వందే మాతరం ఔ ఈ చమన్ల కమలమే పూస్తది ఈ దునియ వామన హస్తపు గుప్పిట అసలుకు సమస్యంతా మైనార్టోళ్ళే దేశమంత రామ రథం నడిపినా జెంకుతలేరు గుజరాత్ ల కుంకుమ కల్లాలు దులిపినా రంజాన్ మాసం ఆగుత లేదు మొండి తుర్కలు దేశమిడువరు ఊరోళ్ళంతే - వాళ్ళకు ఉర్సు సంబరం దర్గా గొప్ప నమ్మకం పీర్ల పండుగల వాళ్ళూ వీళ్ళు పాలూ నీల్లు ఉత్త అమాయకులు మేధావులు గొంతెత్తరు హేతు వాదం బొత్లికె నడువది సచార్ కమిటి సత్యం నాసనమైపోతది బాజాప్తా జరుపుదాం ఘర్ వాపస్ కు ప్లాటినం జూబ్లీ కాలమిక్కడ త్రిశూలం పార్లమెంటుకు పచ్చ చెంకీలు పడై ఎర్రకోట మీద నెలవంక నిలువది జమానా నుంచి మన చాందసవాదుల్దే రాజ్యం అటుజూడు- ఆ ఇద్దరు గడ్డం మియ్యలు సెప్టెంబర్ 11 లెక్క గొడుతున్నరు ఉర్దూల ఏం సోంచాయిస్తార్రొ బోర్లవడ్డ చరిత్రను దువాతో నిద్ర లేపుతరా జంబూ ద్వీపం నీ అబ్బదా అంటే ఇజ్జత్ కా సవాల్ _ _ టప టప టప టప .... నేలకు పరిమళమద్దుతున్న ఆ రెక్కల గుంపు ..అవేమిటి లౌకిక విలువలు .. గుడ్లు పెట్టక ముందే గూళ్ళు చెరపాలే అక్కడ జరుగుతున్నది ఇఫ్తార్ విందే గదా జల్ది నడు తిరుమల తిరుపతి దేవస్తానం మాంచి మోకా మీదున్నది తుర్క గోవిందంతో - ఈద్ ముబారక్ చెపుదాం * * *

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1y4Uv4f

Posted by Katta

Chi Chi కవిత

_పాట పాట_ మోగుతూనే ఉన్నాయ్ గుండె గంటలు.. కావాలనీ వద్దనీ !! ఒరవడులెన్నో ఊహల నిజంలో.. నిజంలో ఊపిరికందని ఉనుకుల్లో!! ప్రమాదవశాత్తుల్లో ప్రయాణం పాటలా!! శృతులన్నీ రసపట్టి అర్థం పుట్టని రాగాలలో శ్రావ్యతను హత్య చేసి గుండెలోకి పారిపోతుంటే వద్దని మోగింది గుండె.. పాట పైకొచ్చేసింది!! ఇప్పుడీ పాట అర్థం వెతుక్కుంటోంది శృతుల్లో..రాగాల్లో..అర్థాల్లో !! గుండెకి గంటలు బారమవుతుంటే పాటకో పాట గుర్తొచ్చింది.. కావాలనీ వద్దనీ!! తన పాటే పాడుతున్న పాటను చూసి కావాలని మోగింది గుండె.. బారం పంచుకున్న పాటని గుండెలో పెట్ట్టుకున్నాక అర్థం పుట్టింది రాగానికి!! ప్రయాణం కావాలని ఉనుకులొద్దని.. పాటాడుతోంది ఊపిరిలా!! ___________________________(15/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1loyDq9

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

ఉమ్మడి కుటుంబం అన్న పదం విని ఎన్నిరోజులయిందో ప్రతి చోట చిన్న కుటుంబాలే ఒక్కరు లేక ఇద్దరు ఎవరి జీవితము వారిదే ఎవడి కష్టాలు వాడివే వీళ్ళని పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రులు ఎవరికీ అవసరం లేదు మానవత్వం తో వాటా వేసుకునే కొడుకులు వద్దు అనలేక వృద్దాశ్రమం చేర్చే సుపుత్రులు సొంత వాళ్ళకే అవకాశం లేకపోతె బాబాయి పిన్ని పరాయిలే భార్యా భర్తల మధ్య సమన్వయము లోపిస్తే విడాకులే శరణ్యం మూడో వ్యక్తీ కి తావు లేదు ఇద్దరు పనులలో వుంటే పిల్లల పరిస్తితి కేవలం డబ్బుతో హాస్టల్ చదువులు చూసే అవకాసం వుండదు వాళ్ళ దృష్టిలో కుడా తల్లి తండ్రులు atm యంత్రాలే పిల్లలతో కుటుంబం తో సమన్వయము చేసే పెద్దల తో కూడిన పెద్ద కుటుంబాలు ఇక కనపడవేమో కదా !!పార్దః !!15/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1y4UrRU

Posted by Katta

Jaya Reddy Boda కవిత

// జయ రెడ్డి బోడ // నాన్న బాట // వద్దన్నావు వాయిదా తీరనిదే కొలువు కోల్పోయి రావొద్దన్నావు చివరి చూపు కూడా త్యాగం చేసావు కొన ఊపిరి లో కూడా కొడుకు క్షేమమే కోరుకున్నావు అసలు నువ్వు గుర్తు పట్టావో లేదో కానీ నీ తర్వాత చిన్నాన కూడ అచ్చం నీలాగే బతుకు బాట మరవొద్దన్నాడు నీ వెన్నంటే వెళ్ళాడు తల్లితో మీరు వరుసగా అనంతంలో సుఖంగా సేదదీరుతూ మాకేమో సంవత్సరాలు గడుస్తున్నాయి మదిలో నిలిచిన మీ ఙ్యాపకాలు అలాగే మాతో నిలుస్తూ ఆ అమ్మల ముఖంలో ముడిపడి గోచరిస్తున్నాయి అయినా మీ కోరిక మేరకు మేము కష్టపడి జీవిస్తూ మీరిచ్చిన స్పూర్థినే మా యువలోనికిచ్చి మీ తోవలోనే నడుస్తూ వస్తున్నాం నాన్న హ్యాపి ఫాధర్స్డ్ డే ...! ( 15 - 06 - 2014 )

by Jaya Reddy Boda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1y4UugH

Posted by Katta

Challa Ssj Ram Phani కవిత



by Challa Ssj Ram Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hXpDO6

Posted by Katta

Valluripalli Shanti Prabodha కవిత

నీ బాటలోనే .. నాన్నా … భవ బంధాలకి దూరమై అప్పుడే ఇరవై ఏళ్ళయిపోయిందా అసలు ఎలా గడిపేశాం ఇన్నాళ్ళూ .. ఇన్నేళ్ళూ .. ఊహు .. నీవెక్కడికీ పోలేదు నాన్నా… మా తోనే ఉన్నావు ఎప్పటికీ ఉంటావు చిటికెన వేలు పట్టుకొని నడుస్తూ నీవు చెప్పిన బుద్దులు మీరలేదు నీవు నేర్పిన నడక తప్పలేదు కళ్ళజోడు కిందనుంచి సూటిగా చూసే చూపు ఇప్పటికీ మమ్మల్ని కాపు కాస్తూనే … పై పై మెరుగుల తళుకు బెళుకుల నేటి సమాజంలో నిత్యం గేలం వేసే వస్తు ప్రపంచంలో ఎగుడు దిగుడుల బాటలో కాళ్ళకు తగిలే రాళ్ళూ రప్పలూ ఏరిపారేస్తూ .. ఒక్కోసారి డక్కా మొక్కీలు తింటూ అడుగులో అడుగులేసుకుంటూ కదులుతూనే ఉన్నాం నెమనెమ్మదిగా నైనా నీవు నేర్పిన ఆ .. అడుగుజాడల్లోనే వి. శాంతిప్రబోధ

by Valluripalli Shanti Prabodha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hXpFWb

Posted by Katta

Lugendra Pillai కవిత

కరణం లుగేంద్ర పిళ్ళై //అతనో...జీవితాన్ని చెక్కిన అమర శిల్పి// బీడి పొగతో నిండి చెమట వాసన వేస్తుంటాడు సూర్యుడి క్రింద ఎక్కడెక్కడో తిరిగి కర్రిబారిన మోహంతో ఇంటికొస్తాడు.. పంటి బిగువున బాధల్ని దిగమింగి నవ్వడం మరిచిపోయిన మౌన రుషిగా కనిపిస్తాడు పలకిద్దామన్నా భయం వేసి ఓ మూలన దాక్కొని చూస్తూంటే చిన్న పిల్లాడై పోయి ఆడుకుంటాడు నాకోసం ఏనుగవుతాడు.. నాకోసం గంతులేస్తాడు నేనడిగిన చిన్న పలకకోసం క్రోసెడు దూరం నడిచేస్తాడు.. అతడో నా జీవితానికో ట్రాపిక్ కానిస్టేబుల్ అప్పుడప్పుడు అపేస్తాడు....కసిరేస్తాడు క్రమం తప్పితే బెత్తమై వాంచేస్తాడు నా గమ్యం నిర్దేశించే సిగ్నల్ లైట్ అవుతాడు.. ఇప్పుడు తెలుస్తోంది.. గదమాయించే మాటల వెనుక ఓ గురువున్నాడని హెచ్చరించే ఆ చేతల వెనుక నాకోసమే తపించే ఓ హృదయం వున్నదని నా జీవితాన్ని ఇంత అందంగా చెక్కిన అమర శిల్పి జక్కన్న అతనేగా. నాన్న లేకుంటే నేను దారం తెగిన గాలిపటమేగా....15/6/2014

by Lugendra Pillai



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lCQoqA

Posted by Katta

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||మొదలులోకి ...|| నేను సాంద్రమైపోతాను ...కానీ ఆవెంటనే ఉక్కిరిబిక్కిరై ఉనికిలోకి తేలిపోతాను నేను సరళమైపోతాను ...ఏం లాభం భయం రెక్కలు మొలచి క్రిందికి జారిపోతాను నేను అప్పుడప్పుడూ నిలిచిపోతాను ....క్షణాల్లోనే రంగువెలసి మరుక్షణమే ఎవడిలానో మారిపోయేందుకు పరుగులిడతాను.. చుట్టూ ఎన్ని భూతాలో ..అన్ని వాటిలానే మారాలంటున్నాయి అందుకే నన్ను నేనే ఉండచుట్టుకొని ... వేగంగా విప్పుకొంటూ కొత్త గాలిపటమై ఎగురుతుంటాను అయునా ఎలాఉన్నా మరోలానే ఉండాలనిపిస్తుంది ......ఎందుకంటే నాకంటే ముందే ఎవడో అచ్చం నాలానే ఎగురుతుంటాడక్కడ నాకొసం ఈలోకం సిద్దపరిచిన గాజుపూల పానుపు గుచ్చుకొంన్నప్పుడల్లా నన్ను నేను గుర్తుపట్టే ప్రయత్నంలో మునిగిపోతాను ....మళ్ళీ సరళమై సాంద్రమై స్తాణువై తల్లి పేగులో వెతుకులాడుతాను .....

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lCQnTF

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

నాన్న కళ్ళద్దాలు తుడిచి శుభ్రంచేసాను ఇప్పుడు ఆయన లక్ష్యం నెరవెరేందుకుమార్గం బాగా సులువయినట్లున్నది. గమ్యం బాగా చేరువయినట్లు తోస్తున్నది. ---------------------------------------------------

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1osZols

Posted by Katta

Srinivas Reddy Paaruvella కవిత

ఆమె లాగే నాన్న || పారువెల్ల ఆకలిలో అన్నం ముద్దలా మారినవాడు అడుగులకు చూపునిచ్చినవాడు దూరభారాల కొలతలని చెరిపేస్తూ అతనెప్పుడూ వొంట్లో నెత్తురై ప్రవహిస్తుంటాడు తోడుగా అమ్మలాగే...

by Srinivas Reddy Paaruvella



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p6Z2ge

Posted by Katta

Rajarshi Rajasekhar Reddy కవిత



by Rajarshi Rajasekhar Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hWSGBr

Posted by Katta

Ravinder Vilasagaram కవిత

ఆత్మీయత అమ్మతో తెలిసింది అనురాగం నాన్నయౌ వెలిగాడు

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mZbyMe

Posted by Katta

Sasi Sri కవిత

రాళ్ళబండి శశిశ్రీ // లెక్కల్లో జీవితం // అన్నీ దృక్పథాల వ్యాసార్ధాలతో మన చుట్టూ నిర్మించుకునే వృత్త పరిధులే ఎవరు కాదన్నారు మనిషి దృష్టి వైశాల్యం πr2 కాదని?! ఎటు నుంచి చూసినా అన్నీ లెక్కలూ, తీసివేతలే అటు ఇటు కాని ఆలోచనల అలసటలే కూడికకు పనికి రాని వ్యర్థ సంఘటనల సమాహారాలే ఏ నిష్పత్తిలో నిర్వచించను మది మజిలీలను, జీవిత గమ్యాలను?! అనుభూతుల నెయ్యాలను, అభిజాత్యపు కయ్యాలను?! చిరిగిన పేజీలలో వగరు అనుభవాలు పెరిగిన పరిణితి సాక్షిగా తరగిన ఆనందాలు ఎప్పుడూ వుండే నిటూర్పులను అప్పుడప్పుడూ వచ్చే ఓదార్పులు నల్లిఫై చేస్తూనే ఉంటాయి బ్రతుకు సమీకరణాలలో! గుండెనిండుగా శ్వాస తీసుకొని మళ్ళీ ప్రారంభిద్దామా మారని మన నడకని?! పునరావృత్తమయ్యే పర్వాలలోకి మోనాటనీ వీడని రొటీన్ లోకి- 15-6-2014

by Sasi Sri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lwsvRk

Posted by Katta

Jagadish Yamijala కవిత

చదివినవే ఇవి... --------------------------------- నువ్వు అనుకున్నట్టు నీ నీడ కూడా నడవడం లేదు ... మరెందుకు ఇతరుల వద్ద ఆశించడం...? ------------------------------------- ఏది పొందాలో అనే దానిలో స్పష్టంగా ఉండాలి లేకుంటే నువ్వు ఏదీ పొందలేవు ---------------------------------- ఈరోజు మీరు నవ్వేది రేపటి ఏడుపుకోసమే అయితే ఈరోజు నవ్వడాన్నిఆపకండి... రేపు ఏడవడాన్ని అడ్డుకోవడం ఎలాగు అనే దానిని ఆలోచిస్తూ నవ్వండి ----------------------------------- ఈరోజు వరకు జరిగిగ్న దానినే ఆలోచించడం కన్నా ఇక ఎలా జరగాలి అని ఆలోచించిన వాళ్ళే బతకడం తెలిసిన వాళ్ళు ---------------------------- నేరం చేసిన వ్యక్తీ తనకు న్యాయం అడుగుతున్నాడు నేరానికి బలైన వ్యక్తీ న్యాయం అడుగుతున్నాడు ఎవరికి న్యాయం చెయ్యాలని డబ్బు నిర్ణయిస్తోంది --------------------------- తమిళంలో కవి కన్నదాసన్ అనుసృజన - యామిజాల జగదీశ్ 15.6.2014 ---------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TYhXR0

Posted by Katta

Padma Bikkani కవిత

||అలౌకికం|| అందమైన ఆవేశాన్ని ఇంకు చుక్కలో ఈదమని ఆజ్ఞాపించితే పక్కున నవ్వింది. ఆజ్ఞకు తలవంచటమేకాని తలపుల జల్లు లకు ఎదురీతరాదుఅని. పోనీ నటనా కౌశలం కి తెర తీయమంటే నటనే రాదు తిరిగి ముసుగేలా అని తగువులాడింది ప్రబంధాలు వ్రాయిపోనీ అంటే ఆ పరాకాష్ట పైత్యం నాకేలా అని కస్సుమంది రౌధ్రాన్ని చూపించమంటే నేను రాజ్యాలను కోల్పోయిన నిరుపేదనా అని చిరుఅలుక ప్రదర్శిచింది పోని ఏ చతురతో చాతుర్యమో కన్పర్చమంటే కయ్యినలేసిందినేను మాటకారినాఅంటూ.. పోనీ నిశీదిగీతాలు ఆలపించమని అడిగితే నాకేల ఆ విరహగీతిక అని కినుక వహించింది ఏ ఆకారంలోనూ ఇమడలేని 'శిల'వా అంటే చట్టుక్కున ఎగిసి పడింది చెంగున దూకే జలపాతంలా. అంబరాన్ని అంటే ఆప్యాయతలా మరకతం తో దోబూచులాడిన దూదిపింజలా, రివ్వున ఎగిరే విహంగంలా పాశాలు లేని స్వేచ్ఛాజీవిలా...

by Padma Bikkani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qPoOqA

Posted by Katta

Yessaar Katta కవిత

సురెక || తెలుగు గజల్-15 .. చిన్నమనసును తీర్చిదిద్దగ నాన్న సేవన చాలదా పిన్నమనిషిని గొప్పచేయగ నాన్న పాలన చాలదా. .. కోరికలను మోసుకుంటూ కష్టకాలము సాగినపుడు మదికి తనుపుల నివ్వగా నాన్న దీవెన చాలదా. .. సంపదలను కోసుకుంటూ నష్టకాలము వేచినపుడు హృదికి మెలపుల నివ్వగా నాన్న లాలన చాలదా. .. ఈసులెన్నో మోసుకుంటూ మనికిబండి ఆగినపుడు బతుకు బాగును చేయగా నాన్న భావన చాలదా. .. నిక్కులను చూసుకుంటూ తప్పుడడుగు వేసినపుడు సుధల ఝరులు చూపగా నాన్న ఆలన చాలదా. .. పితృదినోత్సవ సందర్భంగా- కొద్దికాలం క్రితం స్వర్గస్తులయిన మానాన్నగారి స్మృతిలో : (తెలుగు గజల్ -15* 15/06/2014)

by Yessaar Katta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sfxQS7

Posted by Katta

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి ||కనిపెంచే దైవం ...!! || తాను ఒక వెన్నెల దీపమై ... చీకట్లను దాచుకుని పున్నమిని పంచే మా నాన్నే కనిపించే దైవం... శిథిలమవుతున్న తన దేహపు గాయాలపై మా చిరునవ్వులను లేపనం గా రాస్తాడు ఎడారి తానై మాకు నీడై తోడుగాఉంటారు భావి బంగరు జీవితానికి కొత్త పూల దారి ని వెసే ఆ కనిపించే ..కని పెంచే దేవుడే నాన్న జన్మ కారక.. ప్రేరకా ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోను.. నీవిచ్చిన ఈదేహాన్ని ప్రాణాన్ని నీ పాదాలపై పెట్టటం తప్ప!!

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qP4ztf

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ నాన్న @ ఆయనెవరో నాకు అమ్మ చెప్పే దాక తెలియదు.కానీ అయన చేతి వెళ్ళు పట్టుకుని ఈ ప్రపంచం లోకి అడుగు పెట్టాను నా లోని శక్తిని ...క్రమ శిక్షణని నాకు పరిచయం చేశాడు. నాకు తెలియని ఈ లోకాన్ని ఆయనే చూపాడు అమ్మ కడుపులో ఎన్ని గింగిరీలు కొట్టినా నాన్న చేయి పట్టుకోగానే.. ప్రపంచాన్ని జయించిన ధైర్యాన్ని నింపాడు. అవును,.అందుకే నాన్నంటే నాకిష్టం. అమ్మ కడుపులో ఉన్నన్నాళ్ళు నాన్న గుండెలోనే నా నివాసం . తరువాత ఆ గుండెలే నాకు మైదానం. అమ్మతో శారీరక విభజన జరిగాకా నాన్న బోజ్జపైన్నే నా విహారం. రక్తాన్ని మాంసంగా చేసిన అమ్మ కంటే ఆ మాంసాన్ని మన్వత్వంగా తీర్చి దిద్దిన నాన్నంటే నాకు బాగా ఇష్టం పెరిగింది.కానీ ఇద్దరు నాకు గొప్పే. ఒకరు ఉచ్చ్వాసం...ఒకరు నిశ్వాసం. ఈ రక్తనాళాల శరీరాకృతికి ప్రాణం అమ్మ ఈ హృదయ స్పందనలకు భావం నాన్న . _ కొత్త అనిల్ కుమార్ 16 / 6 / 2014

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qP4BRG

Posted by Katta

Suresh Vanguri కవిత

సురేష్ వంగూరి ॥ ఎప్పటికప్పుడు ॥ ఎప్పటికప్పుడు కన్నీళ్ళతో నన్ను వెతుక్కోవటమే కదా నీకు తెలిసిన ప్రేమ ఎప్పటికప్పుడు ప్రేమకు కట్టుబడటం తప్ప నన్ను ప్రేమించి నీకేం ఒరిగిందని ఎప్పటికప్పుడు నిన్ను చూసే నేర్చుకుంటున్నా కొంచెం కొంచెంగా ప్రేమకు అలవాటుపడుతున్నా అప్పుడప్పుడు మట్టి కలంతో ఏవో రెండు పిచ్చి కవితలు నీ బంగారు పాదాల దగ్గర 15-06-2013

by Suresh Vanguri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TXXrzM

Posted by Katta

Rajeswararao Konda కవిత

మనిషికి గాయం అయితే తగ్గుతుంది..! మనసుకి గాయం అయితే మాత్రం మానదు నేస్తమా..!! @రాజేష్@

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SKDOKe

Posted by Katta

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || నాన్నపేగు అప్పుడు అమ్మమాటకోసం అడవుల్లోకి వదిలినా కన్నపేగుని వదలని మనసుతో ప్రాణాలొదిలింది తనే. మరోసారి మామ కత్తికి బలికాకుండా కాచేందుకు అర్ధరాత్రి వానలో గంపకెత్తుకుని నదినిసైతం లెక్కచేయకుండా దాటించి కాచుకుందీ తానే. బాధలన్నీ గాంభీర్యపు కవళికల చాటున దాచేసి వున్నదంతా ఇచ్చేసేదీ తనంటే తనే నిజమే సుమా దేవుడ్నయినా దయతో కాచుకునేది నాన్నే అమ్మతర్వాత అమ్మంతటిదీ తనే. అశ్వద్ధామా హత: చెవికి సోకగానే ఆయుధాల్నీ, ప్రాణాల్నీ వదిలేంత పుత్రశోకం. గురుధర్మం రూపంలో తూస్తే ప్రేమగా కనపడకపోవచ్చు. వందతప్పుల్ని చూస్తూ కళ్ళుమూసుకున్న కట్టడిని లోకం గుడ్డిదనుకోవచ్చు. అమ్మప్రేమలా అది ఊటబావి కాదు నిరంతరం తడిగా కనిపించేందుకు అమ్మతో సహా నీచుట్టూ తన దేహాన్నే ఫణంగా పెట్టి నిలుచున్న రాతికోట. అప్పగింతలప్పటి వరదగుడి ఎదురుదెబ్బల్ని కాచే జీవితపు బడి గుండెలపై జేబుని ఊయలచేసి ఊపే ఒడి పుట్టగానే తల్లిపేగుని కత్తిరించినా పోయేవరకూ అంటిపెట్టుకుంటుందేమో నాన్నపేగు. బిడ్డలు తాకినప్పుడల్లా అదిమనల్ని సాకుతున్నట్లు కనబడుతుంది. ► 15-06-2014 ► http://ift.tt/TXXrjh

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TXXrjh

Posted by Katta

Prasad PV కవిత

ఈ రోజు మధ్యాహ్నం 12.30 గం:లకు 10 టీవీ లో మన కాశీరాజు "అక్షరం" ప్రోగ్రాం ప్రసారమవుతుంది. Please watch. .

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SKDNWJ

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

ఏమిటి బంధాలు ఎందుకు ఈ అనుబంధాలు ఏమై పోతున్నారు ఎక్కడికి వెళుతున్నారు ఉహ తెలియని క్షణం నుంచి మనకు తోడూ వుండి ప్రతి దాంట్లో తోడూ నీడ గా వుండి ఏడిస్తే నేను వున్నాను అని ఓదార్చి చిన్న దెబ్బ తగిలితే నాకోసం నిద్రకాచి పువ్వుల పెంచి తరగని ఆప్యాయత పంచి జీవితం లో తామే ముఖ్యం అనే భావన పెంచి మదిలో ధైర్యాన్ని గుండె దిటవు ఉంచి ఒక్కరోజు కనబడక పొతే నాకోసం వెతుకుతూ వచ్చి నిను వీడను అని భరోసా ఇచ్చి నిర్దాక్షిణ్యం గా ఈ ప్రపంచం లో ఒదిలేసి వెళితే ఎక్కడ వెతకాలి ఆ ప్రేమ అనురాగం ఆప్యాయత ఎప్పుడు కనిపిస్తుంది ఆ చెరగని చిరునవ్వు ఇక ఎప్పటికీ కనపడదు నీకు నీవే భరోసా ఈ భావం గుండెల్లో వస్తే .. ఏమి చెప్పాలి చిత్రం చుస్తే గతం జ్ఞాపకాలు వెంటాడుతాయి అన్నీ నిజాలే .. కాని వాటిని పదిల పరిచిన నువ్వెక్కడ నాన్నా !!పార్ధ !!15/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SKDLyj

Posted by Katta

Kapila Ramkumar కవిత

ఈ రోజు ఉదయం 10 గంటలకు ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్‌ లో నివాళులర్పించిన ఖమ్మం సాహితీ మిత్రులు

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TXXoEe

Posted by Katta

Ramasastry Venkata Sankisa కవిత



by Ramasastry Venkata Sankisa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qgqBHN

Posted by Katta

Satya Srinivas కవిత

కనుపాప కుండీ ఇద్దరం కలిసి మొలకల్ని నాటుతున్నప్పుడు ఇరువురి కౌగిలింతప్పటి చేతి వేళ్ళ మధ్యన ఖాళీలో చీకటి వెలుగు ఒకటవ్వడానికి చోటు ఆవిర్భవిస్తుంది సాంగత్యపు చూపులోని మౌన గీతం ఎప్పటికీ మట్టిలో జీవకణంలా మిగిలిపోతుంది (9-6-14)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qgqyMf

Posted by Katta

Kavitha Chakra కవిత

ఆకాశమంత ప్రేమ..!! అన్నీ గుర్తు... ఇంటి అరుగు మీద కూర్చుని చెరుకు ముక్కల బెరడు తీసి తినిపించిన లాలన .. వేలు పట్టుకుని దారి చూపించిన చెలిమి... రాసిన తప్పు చూపించి, రాత నేర్పిన తీరూ బడిలో మస్టారుకి నన్ను అప్పజెప్పి, బేలగా చూస్తున్న నన్ను... అంతకన్నా ప్రేమగా చూస్తూ వెళ్ళిన నీ చూపూ... మొదటిసారి నువ్వు నేర్పిన దేవుడి శ్లోకం... ప్రతీరొజూ యెత్తుకుని తిరుగుతూ చెప్పిన నీతి కథలూ... తీయటి గొంతులో రాగాన్ని నేర్పిన గానామృతం .... వాన పడి వెలిసాక మొక్కలు నాటుతూ చెప్పిన కబుర్లూ... అదే వానలో నువు లేవని తెలిసీ... వర్శాన్ని ఆగిపొమ్మని కన్నీటితో చేసిన అభ్యర్థన... అన్నీ గుర్తున్నాయి... నువ్వు ఇచ్చిన జీవితం ఉంది... నీ లోటూ ఎప్పుడూ ఉంది... పొగ మంచులాంటి నా అల్లరీ... ఆకాశమంటి నీ ప్రేమా... నేను వేసె ప్రతీ అడుగులో... నీ ఉనికే నాన్నా!! నాకు తెలుసు... నువ్వెక్కడున్నా... నీ శ్వాస నేనే అని!! - కవితాచక్ర

by Kavitha Chakra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SKyuH1

Posted by Katta

Rajender Kalluri కవిత

## My Great Leader is " మా నాన్న " ## నీ అభిమాన నాయకుడు ఎవరంటే ఎం చెప్తాం ? నేనైతే చాల పేర్లే చెప్పేస్తాను కాని ఇదే ప్రశ్నకు 12 years పిల్లాడు చెప్పిన సమాధానం ఏంటో తెల్సా ? సరిగ్గా మూడు నెలల క్రితం , ఒక టీ స్టాల్ దగ్గర ఒక అబ్బాయి ఆశ్చర్యంగా నా చేతుల్లో ఉన్న బుక్ కవర్ పేజి చదువుతుంటే , బుక్ ఇచ్చేసి చదువుకోమన్నా .... ఆ బుక్ పట్టుకుని పేజి లు తిరగేస్తుంటే Casual గా అడిగా " Who is your favourite Leader ? " అని వెంటనే " మా నాన్న " అని సమాధానం ఇచ్చాడు ... ఆశ్చర్యం వేసింది ఏంటా అని ! అందరు ఎవరెవరి పేర్లో చెప్తూ ఉంటారు , ఇతనేంటి ఇలా ఆశ్చర్యంగా చెప్పాడా అని అడిగా " మీ నాన్న గ్రేట్ లీడర్ అని నీకేందుకు అనిపించింది ? " అని " మా నాన్న బ్రతికున్నప్పుడు చాల హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ చదువుకునే వాణ్ని , ఇప్పుడాయన లేరు , అందుకే ఇక్కడ ఇలా పని చేయాల్సి వస్తుంది , అలాంటి రోజులు మళ్లీ వస్తాయా ? రావుగా ..... అందుకే అయన ruling అంటే నాకు చాల ఇష్టం " అన్నాడు " పన్నెండేళ్ళ పిల్లాడు చెప్పిన పన్నెండు మాటలు నిజంగా ఆశ్చర్యాని కలిగించించాయి. ఆ వయసులో, తనెందుకలా అన్నాడో తెలిదు గాని , కాసేపు ఆలోచిస్తే నాకు అనిపించింది నిజంగా " నాన్నను మించిన గొప్ప నాయకుడుంటాడా ? " అని :) " హ్యాప్పీ ఫాదర్'s డే " kAlluRi [ 15 - 06 - 14 ]

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SKyt5G

Posted by Katta

Maheswari Goldy కవిత

|| మ హా ప్ర తి ని ధి || మహేశ్వరి గోల్డి ఓ మహా శిఖరం నాన్న ... ఆత్మీయ కొలువుల ప్రతినిధి నాన్న ... స్వచ్చతల ప్రేమ చిరునామ నాన్న ... అందరాని సన్నిధిలో మహోన్నత వ్యక్తిత్వపు ఊపిరిలూదిన అమృత బిందువు సేవిస్తూ మహర్షుల వద్ద ఓనమాలు నేర్చిన భువి పై ఓ మహా మేధావి నాన్న ... మమకారపు మధువులు చిలికితే జాలువారిన రాగ బిందువుల మధుర స్వాంతన నాన్న ... అనునిత్యం అనురాగమంత్రపు ఆహార్యం శ్వాసిస్తూ మమతల వంతెనపై భవితల దైర్యానికి ఆదర్శగురువు నాన్న ... అలాంటి తొలిగురువులు అందరికి ఓ అభినవ తనయిగా పాదాభివందనం చేస్తూ ఈ ఆదిత్య ప్రభాతాన శుభ అబినందనలతో మహేశ్వరి గోల్డీ ..........................! 15/06/2014

by Maheswari Goldy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qgqw6W

Posted by Katta

Prasad PV కవిత

|| నాన్న || అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంటే వద్దని మారాం చేసినపుడు నీ మమకారాన్ని కలిపి ఒక్కో ముద్దా నా నోటికందిస్తే అప్పటికే నిండిపోయిన నా కడుపు ఎలా వెలితవుతుందో తెలీదు.. రుచి తెలియని నీ మమకారం ఆహారమవుతుంటే అన్నం ముద్ద తింటూ నిన్ను చూసినపుడు ఆకలిని తీర్చే ఆకాశం కనిపించింది చదువు కోసం నీకు దూరంగా ఇల్లెల్లిపోతున్నపుడు ఆడపిల్లను సాగనంపుతున్నట్టు నన్ను తడిమి తడిమి ముద్దెట్టుకుంటుంటే నీ గుండె కన్నీటి చెలమల్లో తానమాడుతూ కనిపించింది. బాధలు,బాధ్యతలంటే ఏంటనడిగినపుడు నీ చిరునవ్వే సమాధానమైంది మాకు. వాటి అర్థాన్ని కూడా మాకు తెలీనివ్వకుండా ఇంటినే కాదు అందర్నీ ఒంటి స్థంభంలా మోస్తూ భారాన్ని భరించే భూమికి నాన్నవయ్యావు

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SKysyE

Posted by Katta

Chi Chi కవిత

_GamblE_ పాము తల్లో వజ్రం కాసినా కోరల్లో విషం పోదు పాపం పాము కోపమొస్తే అన్నీ కరుస్తాయ్ దాని కెమిస్ట్రీ అలా ఏడ్చింది.. మన కరెన్సీ లా!! పెంటలకీ బొచ్చుకీ కూడా పందాలు ప్రాణమ్మీదకొచ్చే పౌరుషాలు పాములే మేలు!! రహదారుల్లో రహస్యాలుండవ్ లావాదేవులుండవ్ రవాణాలే!! రహస్యాలకు దార్లే ఉండవ్ లాభనష్టాలే కలుస్తాయ్ రాజీలే.. తీగెక్కడో తెలిసేవరకు!! భేరాలు కుదరకపోతేనే డొంక కదిలేది.. కలయికలవేగా మరి.. డొంకతిరుగుళ్లో బయలయ్యే బంధాలు సరఫరాల ఫలాలు లాభాల రాజీలు నష్టాల మాజీలు వాళ్ళూ వీళ్ళూ!! ______________________________(15/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SKysin

Posted by Katta

Rasoolkhan Poet కవిత

*నాన్న* పచ్చని పల్లెను వదలి పట్నం వచ్చిన నాన్న తన జీవితంలో పచ్చదనాన్ని కోల్పోయాడు కొలిమిలో కాలే బొగ్గులా కన్నీటి కొలనులా కష్టాలతో స్నేహం చేస్తూ మా కడుపులు నింపడానికి కదిలే నాన్నలో..... కనిపించని ఆత్మస్ధయిర్యం మా కర్తవ్యాన్ని గుర్తు చేసేది మా కోసం చదువులు కొనలేక అచేతనంగా చూస్తు మౌనంగా రోదించే నాన్న చెంపలపై ముత్యాల్లా మెరిసే కన్నీటి చుక్కలు చుక్కానిలా మాకు దారి చూపేవి నాన్న చివరిదాక కొవ్వొత్తిలా వెలుగును పంచుతూనే కరిగిపోయాడు మా జీవితాలలో చీకటి చుక్కను తరిమి పోయాడు నాన్నంటే ఆనందం నాన్నంటే ఆదర్శం నాన్నంటే ఆత్మీయ స్పర్శ నాన్నంటే నిన్నటి తీపి కల నాన్నంటే మా బ్రతుకులలో కురిసిన వెన్నెల ధార అవును .....నాన్నే మాకు అన్నీ. పి రసూల్ ఖాన్

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qgquMq

Posted by Katta

Rajeswararao Konda కవిత

నా దరి చేరాలని-ఆ కెరటానికెంత ఆరాటం...!! /15.06.14// @ రాజేష్ @

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SKys1F

Posted by Katta

Rajeswararao Konda కవిత

ఏ మతమైనా కోరేది.. "మంచే" ఏ మతమైనా ఆచరించేది... "ధర్మమే" ఏ మతమైనా బోధించేది... "శ్శాంతే" ఏ మతమైనా పొరుగువారికి చేసేది..."సేవే" కాదని ఏ మతమనగలదు అన్ని మతాలసారం మోక్షమే కదా నేస్తమా..!!

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SKyrLj

Posted by Katta

Sharada Sivapurapu కవిత

ఇదే నా(?) జీవితం? // శారద శివపురపు నన్ను పిలచి పిలచి నిద్రలోకి జారుకున్న సూరీడు పొద్దున్నే పొడుచుకొచ్చి చిర్నవ్వులు చింది స్తున్నాడు నడిరాతిరి నిశ్శబ్దంగా ఉబికి వచ్చిన ఆత్మీయతల వెల్లువ వేకువ సొదల్లో, రొదల్లో పెదవి దాటి పయనించదులె తెగిన ఆశల రెక్కలతో సుదూర గమ్యాల స్వప్నాలు దిక్కుతోచని గమనంలో, మారిపోయే నా గమ్యాలు నిర్వచించేనా? తరుముకొచ్చే రాత్రీ, పగళ్ళు? పడమర పయనంలో తూరుపు చూపుల ఆశావాదం రాత్రి పగలు కాని ఏకాంతంలో నన్ను నేను చూసుకుంటే నాకు నేనే ఒక అపరిచితుడిగా పరిచయమవుతుంటే రెప్పలు మూసుకుని వాటేసుకున్న చిక్కని చీకట్లో చుక్కలాంటి పొద్దుల కై ఎప్పటికీ వెతుకులాట మెరుపులాంటి వెలుతురులో కనులు విడివడని, ఇదిఅని తెలియని నీరసంలాంటి ని స్తేజపు నిర్వేదం. నిశీధిలో జాగృతిలో, స్వప్నాలు కనులు దాటి కదలలేవు ప్రతి రాత్రి ముడి విడిన బంధాలు పగలెప్పటికీ ప్రశ్నలే. ఎదబంధాలు ఎదురుబొదురుగా, ఎన్నడు కలవని రైలుపట్టా లే, ఏంలాభం? గుండె చిక్కుకున్నాకా తెలిసిందది తెగిన గాలిపటమని. శబ్దంలోంచి నిశ్శబ్దానికి, ప్రేమతత్వంలోంచి ప్రేమ రాహిత్యానికి, అగాధంలోంచి ఆకాశానికి, ఆకాశంలోంచి అగాధానికీ దూరం ఒక క్షణమని తెలుసుకొనేందుకొక జీవితకాలం. 14/06/2014

by Sharada Sivapurapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qgqtbj

Posted by Katta

ఎం.నారాయణ శర్మ కవిత

వర్చస్వికవిత-బియాస్ ___________________________________ అభ్యుదయవాదం కవిత్వానికి అందించిన పరిభాషలో"కాలిక స్పృహ "ఒకటి.ఒక సాధారణమైన సాహిత్యభాషలో చెబితే తక్షణ స్పందన(immidiate Responce).సమకాలీన సామాజిక పరిస్థితుల గురించిసమగ్రమైన అవగాహనతో,ప్రేరణతో కవిత్వం రాయటం.విమర్శకుల అభిప్రాయం ప్రకారం "దిగంబర కవిత్వం"కూడా ఈ స్పృహని కొనసాగించింది.కొయ్యగుర్రం అలాంటిదే.నిజానికి తక్షణ స్పందనకు,కాలిక స్పృహకు ఒక వెంట్రుకవాసి వైరుధ్యముంది.కాలిక స్పృహలో ఒక శాశ్వత ప్రాతిపదిక ఉంటుంది.తక్షణ స్పందనలో అది అన్ని అంశాలలో సాధ్యం కాక పోవచ్చు. మానవీయ సంస్పర్శలేని కవిత్వాన్ని సామాజిక దృష్టితో అనుభవించలేం. కవిసంగమంలో సమకాలీన జరిగిన అనేక సంఘటనలకు స్పందించి,బాధ్యతగా రాస్తున్న సందర్భాలు కనిపిస్తాయి..ఆ క్రమంలో ఈ మధ్యన హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ప్రమాదంపట్ల కొన్ని మానవీయ స్పందనలు కవితలుగా రూపుదిద్దుకున్నాయి. డా.ఎన్.వి.ఎన్.చారి.-"పాపం పసివారు",ప్రణయ్ -"దారుణం","ఎలా చెప్పనురా నువ్విక రావని " శారద శివపురపు,వర్చస్వి-"బియాస్"అరుణ నారదభట్ల "కాలం"-మొదలైనవన్నీ ఈ క్రమంలోనివే. సంజీవదేవ్"Transformation of impresion into expression is Art"అన్నారు.మనసులో ముద్రింపబడిన స్థాయి కవిత్వాన్ని పాఠకుడి హృదయానికి చేర్చుతుంది.వర్చస్వి "బియాస్" ఒక ప్రమాద వాతావరణం నుంచి గత,వర్తమాన ,భవిష్యకాలాలలోని యాంత్రిక స్పందనలను కవిత్వం చేసారు..ఒక నిశ్చేష్టమైన రస స్థితి ఇందులో కనిపిస్తుంది.అనేక వాక్యాలలో ఒక నిర్వేదం ధ్వనిస్తుంది.అచేతనమౌతున్న మానవీయతని పరోక్షంగ తిరస్కరిస్తున్న వాక్యాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ కవిత్వీకరణాంశాన్ని కూడా మాట్లాడుకోవాలి మొదటి రెండు యూనిట్లు మనకు విషయాన్నిపరిచయం చేసి,అందులో నిష్పన్నం చేస్తాయి. "అప్పుడప్పుడూ స్వప్నాల రెప్పల మధ్య ఓ హరివిల్లుని చూసొద్దామనుకునే ఉల్లాసపు వెల్లువకు ఏదో తెలీని తప్పిదపు ఆనకట్ట అడ్డుపడిపోతుంది! చూస్తుండగానే కంటిలో చలమలు చిన్నగా చిలవలు పలవలై విరుచుకు పడ్డ వరదై కనీళ్ళ చితిని పేరుస్తుంది." అంశాన్ని పరిచయమంచేయడం దగ్గరినించి వర్చస్వి సాధించిన భారత(baalence)గమనించ దగ్గది.రెండవ వాక్యంలో మనసు ధ్:ఖ భరిత మయ్యే భాగాన్ని అంచలంచలుగా చెప్పడం కనిపిస్తుంది.మూడవ వాక్యం నించి మనిషిలోని యాంత్రిక స్పందనలను కవిత్వం చేస్తారు. " కోల్పోయిన లేత కలల్ని వొత్తులేసుకుని వెతికీ వెతికీ వేసారిన కళ్ళు- నివాళిగా వెలిగే కొవ్వొత్తులవుతాయి ! రోజులు దొర్లాక దొర్లిపడ్డ కన్నీటి కెరటాలన్నీ చుక్కలు చుక్కలుగా కాసింత కుదుట పడిపోతుంటాయి. పగిలిపోగా మిగిలిన గుండెల్ని స్మృతులుగా శృతిచేసుకుని జాలిగా నేమరేసుకుంటాయి ! ఎప్పటిలా దీటైన యంత్రాంగం తనపని తాను చేసుకు పోతూ ఎక్కడో మేటవేసిన ఇసుకలో ఇంకి పోతుంది! కుర్రకారుతో పోటీపడి ‘అశ్రద్దా-అప్రమత్తతలు’ పొగరైన వైట్ కాలర్ల నేరాలుగా ఎగురుతాయి. ‘సౌందర్యాన్ని వీక్షించదలచిన కన్ను చిన్న నలుసైనా పడకుండా రక్షించుకోవడం నేర్వాలనే’ అంశం- రేపటి స్కూలు సిలబస్ లో ‘బియాస్’ పాఠంగా వెలిసి తప్పించుకుంటుంది! "నిజానికి ఇందులో చెప్పిన అంశాలన్నీ ఒక అంశాత్మక పరిశీలన(Case Study) గా కనిపిస్తాయి.సాధారణ జనం,సంబంధీకులు,రాజకీయనాయకులు,మేథో వర్గం వీరందరూ పరోక్షంగా వరుసగా ఈ వాక్యాలనుండి వ్యక్త మౌతారు. కాలికంగా అవసరమైన జగరుకతని ప్రదర్శించడమే కాకుండా,తగిన భారత కలిగిన హృదయ స్పందనని,సామాజిక దృష్టిని వర్చస్విగారి కవిత వ్యక్తం చేస్తుంది.సామాజిక స్థితిగతుల్ని సమకాలికంగా అంచనా వేయనప్పుడు స్పందించనప్పుడు కవిత్వ వస్తువులో,దృష్టిలో,కవిత్వీకరణలో మూస తొంగి చూస్తుంది.దీన్నించి మరల్చుకుని కవిఎలా ప్రవర్తించాలో ఈ కవిత గుర్తుకు చేస్తుంది.

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pZ5asz

Posted by Katta

Chandrasekhar Vemulapally కవిత

చంద్రశేఖర్ వేములపల్లి || నేరమా ప్రేమ!? || సందేహం లేని, తిరస్కరణ కాని నేర రహిత భావన ఒకటి అగ్ని సమీపానికి వెళుతున్నట్లో చీకటి అయోమయంలో పచార్లు చేస్తున్నట్లో అజాగ్రత్త, అసాద్యం కోరికల ఒత్తిడి భారమై హృదయం ముక్కలయ్యే దిశగా కదులుతూ సరైనదో కాదో అని పట్టించుకోవాలనిపించని ఆ చేతులు .... చుట్టూ అల్లుకునుంటే చాలనే ఆ అనుభూతిని పొందితే చాలనిపించే ఒక వింత వుద్వేగం ఆ సమయం, ఆ అనుభూతి అపూర్వతను పదిలంగా దాచేసుకోవాలనిపిస్తూ ఆ కళ్ళలో ఆ నవ్వు లో ఆ ముద్దు లో .... అవిగో ఆశల ఇంద్రధనస్సు రంగులు ఊరిస్తూ రక్తం ఉరకలెత్తేలా చేస్తూ తప్పు వైపు అడుగులేస్తున్నామని మది వివేకం హెచ్చరిస్తున్నా తప్పుకాదనే భావననే చూడాలని తెలియని అనుభూతిని తీపి స్పర్శనే కోరుకుంటూ ఆ దేవుడే దిగివచ్చి ఏదైనా కోరిక కోరాల్సొస్తే ఈ అనుభవం, ఇలాగే ఉండాలని ప్రార్ధించాలనిపిస్తూ, ఆ అలౌక్య నిషిద్ద నిట్టూర్పులను కలలా కనేలా చూడమని అడగాలనిపిస్తూ నేరం కాని, సందేహం లేని గొప్ప కామోద్దీపన .... అది ప్రేమో ఏమో కానీ దూరం చెయ్యొద్దని .... ఓ దైవమా! అది ప్రేమే అయితే ఆ అనుభూతిని శాశ్వతం చెయ్యమని మన్నించమని కోరుకుంటూ, ఆ ప్రేమిక/ప్రేమికుడు ని నేననుకుంటూ .... 15JUN2014

by Chandrasekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lmFmko

Posted by Katta

Annavaram Devender కవిత

ఇయ్యాల ( 15.06.2014)'నమస్తే తెలంగాణ'బతుకమ్మ ల 'రానే వచ్చింది '

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UCRZD2

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

నాన్న అన్న పిలుపే ఒక ధైర్యం నాన్న నీ చిరు నవ్వే ఒక అభయం క్రమశిక్షణలో నాన్న అంటే ఒక భయం ఎన్ని అనుకున్నా నా జీవితం లో నీవు ఒక భాగం బ్రతుకు తెరువు కోసం పోరాటం లో యోధుడిని చేసావు కష్టాలలో గుండె నిబ్బరం అలవాటు చేసావు కొడుకు వివాహం అంటే తెగ సంబరపడిపోయావు నీ కంట తడి నాకు తెలియకుండా గంభీరం గా వున్నావు ప్రయత్నం చేస్తే సాధించ లేనిది ఏది లేదని చూపావు అమ్మకు అనారోగ్యం అయితే పసివాడివే అయ్యావు ఎవరు ఎన్ని చెప్పిన నీ బాధ్యతలు నీవు చేసావు అమ్మ దూరం అయితే పిచ్చివాడివే అయ్యావు అప్పుడు కాని తెలియలేదు నీలోను నా మీద అమ్మ మనసు వుందని చివర వరకు ఎవరికీ బరువు కాకూడదు అనుకున్నావు నవ్వుతూ వెళ్లావు కానీ మళ్ళీ తిరిగి రాలేదు నువ్వు గుర్తుకు వస్తే గుండె బరువు అవుతుంది నాన్నా నీ జ్ఞాపకాలు చాలా ఇచ్చావు జీవితానికి సరిపడా నేను నాన్న ను అయితే కాని తెలియలేదు నాన్న నాన్న ప్రేమ ఎలా వుంటుందో ?? ఎన్నో జన్మల పుణ్యఫలం నాన్న నీ కొడుకు నవటం నలభై ఏళ్ళు భరించావు మమ్మల్ని నలభై నిమిషాలు మోయలేక పోయాము నాన్న నిన్ను .. !!పార్ధ !! ( పితృ దినోత్సవం గా నాన్నకు జ్ఞాపకార్ధం ..... ) 14/06/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mXPCkB

Posted by Katta

Ajay Kumar Kodam కవిత

లవ్‌ యూ..!!అజేయ్‌ నాకింకా గుర్తే.. అప్పుడే కళ్లే తెరుస్తున్న నన్ను చూసిన నీ కళ్లలో.. ప్రపంచాద్భుతాన్ని చూసిన అబ్బురం.. నీ రెండు చేతుల తొలి ఊయల గుండె చప్పుడు జోలపాట కందిపోతానేమోనన్నంత భయంగా తాకిన పెదవుల వణుకు.. చిరుముద్దులోనే నేనున్నాననే కొండంత భరోసా.. ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన జ్ఞాపకం.. పాదాలపై అడుగులేయిస్తూ నేర్పిన నడక.. ప్రతీ అడుగులో మార్గదర్శనం.. ... .. .. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే .. ఇంకా నా వెంట నడుస్తున్న.. నువ్వే ఐ ఆల్వేస్‌ హ్యావ్‌ యూ విత్‌ మీ.. థ్యాంక్యూ వెరీ మచ్‌!!

by Ajay Kumar Kodam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hVxkUO

Posted by Katta

Shiva Shannu Goud కవిత

అలుపే ఎరుగని ప్రయాణం నాది అలుసటే తెలియని మనసునాది అలల్లే ఎగిసిపడే ప్రేమ ని నేను అలల్ని అక్కునా చేర్చుకోలేని తీరానివి నువ్వు నీకోసం నీ ప్రేమ కోసం ఎన్ని సార్లైనా పడుతూ లేస్తూ మళ్ళి పడుతూ పదే పదే నీ దరికి వస్తూవుంటా నువ్వు ఔనన్నా కాదన్నా ....శివ.... 13/03/14

by Shiva Shannu Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UCpJAv

Posted by Katta

Cv Suresh కవిత

సి.వి.సురేష్ ....॥ నా నాన్నవి.॥ (ఫాదర్స్ డే స౦దర్భ౦గా) ఉరకలెత్తే అలని ఏ తీరానికో చేర్చాలో తెలిసిన మర్మానివి.. బిక్కు బిక్కుమనే అధైర్యపు క్షణాలను లెక్కపెట్టి మరీ ఏరిపారేసిన ధైర్యానివి..... నాన్నవి..! ......... నోరు తిరగని ఎన్నో పదాలతో ఎదురొడ్డి నా అక్కున చేర్చిన భాషవీ ....శబ్ధరత్నాకరానివి నాన్నవి......నా నాన్నవి!!! ........ హోరెత్తే స౦ద్ర౦ ఎదురీదే వేళల్లో ఆటు సమయాన్ని.... పోటు ఘడియల్ని లెక్కెట్టి నా చెవిలొ నూరిపోసిన అనుభవైక నావికుడివి నాన్నవి... !! ...... మెదడు లోతుల్లో మట్టి పొరలను తట్టి విదిలి౦చి లేపిన బోధి వృక్షానివి నాన్నవి......!!! ....... కనువిప్పుల లౌక్యాన్ని నా మొదడులో నీ మార్కును మలచి దారి చూపుతున్న చుక్కానివి నా నాన్నావి!!! ...... నీ పొత్తిళ్ళల్లో నీరు పోసుకొని పెరిగిన ఈ చెట్టు ఫలాన్ని రుచి చూడకు౦డానే ఆవిరైపోయిన నాన్నావి......! అన౦త లోకాలకు వెళ్ళిపోయిన నాన్నవి.....!!! Cv Suresh 15.6.2014 …………………

by Cv Suresh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1y1bDI1

Posted by Katta

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు 37 బాల కార్మిక వ్యవస్థపై నేను చాలా ఏళ్ళ క్రిందట " ఐస్ క్రీం పార్లర్ లో" అని ఒక కవిత చదివాను (కవి పేరు సమయానికి గుర్తుకు రావడం లేదు. క్షమించాలి). తెలుగు సాహిత్యంలో ఈ విషయం మీద మళ్ళీ అంత మంచి కవిత చదవలేదు. ఆ కవిత విశేషం ఏమిటంటే అంతవరకు కొన్ని ఉద్యోగాలమీద, వాటి వెనక వ్యక్తులు పడే బాధలమీద, వాళ్ళు అంత కష్టంలోనూ నిష్టగా పనిచేస్తూ మనకు అందించే సేవల విలువల పట్ల ఎవరూ దృష్టిపెట్టలేదు. అలా ప్రయత్నించిన సందర్భాలలో కూడ చాలా సార్లు వాటిని ఉదాత్తీకరించడం తప్ప, ఏ వ్యాఖ్యలూ లేకుండా యథాతథంగా ఒక చిత్రాన్ని కళ్ళముందు చూపిస్తూనే, పాఠకుడిలో ఆ వ్యవస్థలో జరుగుతున్న దోపిడీ, బాధితుడికి జరుగుతున్న అన్యాయంగురించీ సానుభూతుతోకూడిన స్పందన కలిగేలా చేసిన ప్రయత్నాలు బహుకొద్ది. ఆ కవిత ప్రభావం ఎంతగా ఉందంటే, ఆ తర్వాత లబ్దప్రతిష్ఠులైన కవుల సయితం పోస్టుమేన్, హాస్పిటల్ నర్సు మొదలైన చాలా వృత్తులగురించి కాపీ కవిత్వం రాయ ప్రయత్నించేరు. (కాపీ అని ఎందుకు అంటున్నానంటే, తమకి ఆ విషయం మీద స్పందనలేకపోయినా, రాయకపోతే మనల్ని ఎక్కడ కవులుగా గుర్తించరో అన్న భయం చేత. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగితే పరిగెత్తుకుని వెళ్ళి పరామర్శించకపోతే దాన్నుండి లబ్దిపొందడానికి తమకి ఎక్కడ అవకాశంపోతుందో అని భయపడినట్టు, వీళ్ళుకూడా ప్రయత్నించేరు.) మళ్ళీ చాలా రోజులకి ఆ విషయం మీద మన కేరళ కవులలో మోహన్ కృష్ణన్ గారి కలం నుండి మంచి కవిత వచ్చింది. అది మీతో పంచుకుందికి ఆనందిస్తున్నాను. దీన్ని అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ గా మలిచేరు. ఆ లింకు కూడా ఇస్తున్నాను. దయచేసి చూడండి. దీనికి ఏ వ్యాఖ్యలూ అక్కరలేదు. . Watch the poem in video at: http://ift.tt/1mWSsGE పాళా ఐస్ క్రీం ... ఇదిగో నా చిన్ని పలకా, నా బంగారు బలపమా! రేపు తెల్లారేలోగా గనక మీరీ లెక్కలన్నీ చేసేసేరనుకో మీ ఇద్దరికీ పాళా ఐస్ క్రీం కొనిపెడతా, వన్ బై టూ కాదు, చెరొకటీ. కానీ లెక్కలుగనక తప్పుచేసేరో, ఇదిగో పలకా, నిన్ను విసిరి ముక్కలు చేస్తాను, బలపమా, నిన్నూ అంతే, పొడిచి పోగుబెడతా. నాకు లెక్కలు చెయ్యడం చాతగాకనో లేక నిద్రముంచుకోస్తోందనో అడగడం లేదు ఈ ప్లేట్లన్నీ ఇపుడు కడగకపోతే, ఈ గిన్నెలనిండా నీళ్ళు నింపకపోతే నన్ను వాళ్ళు పచ్చడి పచ్చడి చేసెస్తారు. . మోహన్ కృష్ణన్, మలయాళం, ఇండియా . (Note: పాళా: పాళా ఐస్ క్రీం అంటే పాల ఐస్ క్రీమే గాని, పొడుగ్గా కడ్డీలాగ ఉంటుంది. కోన్ లాగ ఉండే రేకుగొట్టాల్లో వెదురుపుల్లచుట్టూ పాలు గడ్డకట్టెలా ఐస్ లో ముంచి తయారు చేస్తారు. నా చిన్నప్పుడు స్కూళ్ళకి ఎదురుగా ఇది అమ్ముతుండేవారు.) శ్రీ మోహన్ కృష్ణన్ కేలికట్ యూనివర్శిటీలో Plant Chemistry లో పరిశోధక విద్యార్థిగా ఉన్నారు. . Paal-Ice . Dear Slate.. Dear Pencil.. If you do all these sums before the day breaks tomorrow, I will buy you a Paal-Ice... Not just one, one each for both of you.. If you do the sums wrong Oh slate, I will throw and break you to pieces. Oh pencil, I will piece and break you it’s not that I don't know Math... Neither is it that I am sleepy... If I don't wash all these plates, If I don't fill water in all these vessels, They will grind me in to a Sammanthi*... . Mohan Krishnan Kalady Malayalam. Indian . Paal-Ice - An Ice fruit made of Milk. (Something like Choco bar) Sammanthi - The side dish to rice made by grinding coconut.

by Nauduri Murty



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lvofRS

Posted by Katta

Si Ra కవిత

Si Ra// Dynamics of Stagnancy and mechanism of poetry // 13-6-14 రోజూ ఒకే ప్రదేశంలో కుర్చొని కవిత్వం రాస్తాం. వేరే ప్రదేశానికి వెల్లి రాసినా మన రచనలపై విశ్వాసం లేనితనం మనల్ని ఆవహిస్తుంది.(ఒక వేల వెల్లిన ఆ ఇంకొక ప్రదేశమే మిమ్మల్ని మీ సాధారణ-తనం నుండి విడుదల చేస్తే మొత్తం గా కొత్త అనుభవాన్ని అనుభూతి చందుతారు. అప్పుడు కవిత్వం రావటం సాధరనం, దాని గురించి ఈ వ్యాసం చివర్లో చెప్తాను* ). అదే కేలెండర్, అదే గడియారం, అవే గోడలు. కాని ఒకొక్క కవిత్వంలో ఒకొక్క సందర్భం, స్థలం, సమయం. సముద్ర గర్భం పై కురుస్తున్న వర్షం గురించి రాస్తాం. ఎముకలు కరిగే లాంటి ఎండ గురించి రాస్తాం. చేదించలేని చీకటి గురించి రాస్తాం, మారుతున్న ౠతువుల గురించి రాస్తాం. ఎప్పుడూ అదే నవ్వు తో ఉన్న, కలవని ముత్తాత ప్రతిమను చూస్తూ, అదే ఫేను శబ్ధం వింటూ, అదే నిశబ్ధంలో కూరుకుపోతూ. ఇన్ని ప్రదేశాలకు మనం ప్రయానం చేస్తుంటాం కానీ ఒకే ప్రడదేశం లో కుర్చోనిఉంటాం. దీనిగురించి ఆలొచిస్తుంటే టక్కుమని అనిపించింది, మనం కవిత్వం ద్వారా చలనం అనేది మరిచిపొయిన వస్తువులతో ఒక రకమైన సంబందం ఏర్పరుచుకుంటాం. ఆ వస్తువు కదలిక-లేని తనం లో మనం కదులుతాం, దాంత్లో ఒక విశ్వాన్నే కనుక్కునేకి ప్రయత్నిస్తాం. ఎక్కువ సార్లు ఆ వస్తువు లోకి పరకాయ ప్రవేశం చేస్తాము కుడా, తెలియకుండానే. ఆ వస్తువు పరిస్తితిని మన ఆనందానికో, బాధకో ముడి వేసి మనగురించి మనమూ, కొత్త విశయాలు కనుక్కుంటాం. ఈ రకంగా ఆ వస్తువుతో ప్రేమలో పడతాం. కవిత్వం మన లోపల జరిగే అలజడి అయినా, కవిత్వం శూన్యం లోంచి పుట్టదు. కవిత్వం పగటికల లాంటిది. ప్రపంచంలో ఏ ప్రదేశమైనా పగటి కలలు కనటానికి, అనుకూలంగానే ఉంటుంది. పగటికలని పోషించటానికి తనవంతు మద్దతు ఇస్తుంది. నిజానికి కవిత్వం రాయటం పగటి కలలు కనటం రెండిటికీ ఆలొచనా విధానం ఒకే రకంగా ఉంటుంది. పగటికలలుకనే ఎవరైనా కవిత్వం రాయగలరు. కాని ఎక్కడ అందరికి కష్టం అవ్తుంది అంటే పూర్తి చేతనం తో పగటికలను కనటం అనే దెగ్గర. అచేతనంగానో, ఉపచేతనం గానో కనిన పగటికలని కవిత్వం రాయలేము. అలా పూర్తి చేతనతో ఉండటం అనేది చుట్టూ ఉన్న పరిసరాలతో, వస్తువులతో ఒక రకమైన ప్రేమలో పడితే తప్ప చెయ్యలేము. ఒక కవి నిర్వానం అన్న స్థాయికి రావలంటే తను ఎలాంటి ప్రదేశానికి వెల్లినా ఆ ప్రదేశంలోని వస్తువులతో ప్రేమలో పడిపోవటం తనకు తెలుసుండాలి. ఆ ప్రదేశం లోని వస్తువుల అచేతనంలో ఒక కదలికను కనుక్కోవగలగాలి. బహుశా ఇలాంటి ఆలొచన నుండే పుట్టింటుంది శ్రీశ్రీ -కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిల్ల, ఆరటితొక్క, హారతి పల్లెం- అన్నీ కవితా వస్తువులే అన్న ఆలొచన. అన్నిటిలోనూ కవి కనుక్కొవాల్సిన ఒక చలనం "నీ వైపే చూస్తూ ఉంటాయ్, తమ లోతును తెలుసుకోమంటాయ్". *ఒక కొత్త ప్రదేశానికి వెల్లినప్పుడు మనకు తెలియకుండానే మనం పూర్తి చేతనటో ఆలొచిస్తుంటాం. మొదటి సారి మనకు కలిగిన అనుభూతి మనకు ఎక్కువకాలం గుతుందటానికి కారనం అదే. మొడటి సారి బస్సు ఎప్పుడు ఎక్కాము, మొదటి సారి ఒంతరిగా యెప్పుడు ప్రయానించాము, మొడటి సారి సముద్రాన్ని చూసినప్పుడూ, అలాంటి సమయాల గురించి మనకు తెలిసో తెలియకనో ఒక జ్ఞాపకం ఉంటుంది. అందుకే ఆ ప్రదేశం గురించి సులభంగానే కవిత్వీకరించేయ గలుగుతాం. కవిత్వం మన ఆలొచనలను విడుదల చేసే ఒక పద్దతి. అలాంటి కొత్త ప్రదేశం, సాధారన తనం నుండీ మనల్నే విడుదల చెస్తుంది కాబట్టి, కవిత్వం కేవలం అలాంటి సమయాల్లో ఉపఫలం మాత్రమే.

by Si Ra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oqvKNS

Posted by Katta