పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, మార్చి 2014, సోమవారం

Kavi Savyasaachi కవిత

ఉగాది ----- 31/03/2014 ఉగాది మళ్ళీ వచ్చేసింది..కానీ "గాది"క్కడ నిండుకుంది ఉరితాడు ముందు నిల్చుని ఉగాదినెలా స్వాగతించను? పార్థివదేహాల్ని ముందేసుకొని నడుస్తున్న శవాల్ని చూస్తూ వసంతకోకిలల్నెలా ఆహ్వానించను? మానంకోల్పోయిన తల్లుల్ని చూస్తూ మావిచిగురు రుచులెలా వర్ణించను? పల్లెనోళ్ళకు తాళాలుపడి వలసలు పోతున్నాయ్ నీరింకిన ఊఠబావులు కన్నీరింకిన కళ్ళూ ఇక్కడ దర్శనమిస్తున్నాయ్ బీళ్ళువారి నోళ్ళు తెరుచుకున్న పంటభూముల్లో ఇప్పుడు శవాలు మొలకెత్తుతున్నయ్ అప్పులకెరటాల సునామీ అన్నదాతలను ముంచేస్తున్నాయ్ అంబరాంగన కౌగిలిలో ధరలు ఓలలాడుతున్నాయ్ కార్చిచ్చై కుటుంబాల్ని కాల్చేస్తున్నాయ్ కుప్పతొట్లలోకి ఇప్పటికీ విసిరేయబడుతున్న కర్ణులూ అంగడిలో అమ్మకానికిపెట్టిన పసిమొగ్గలు ఉదయించకుండానే అస్తమిస్తున్న ఆడ శిశువులూ రైలుపెట్టెల్లో... చెత్తకుప్పల్లో... మురికిగుంటల్లో... ఖార్ఖానాల్లో... కరిగిపోతున్న బాల్యం.. నా కనులముందు సినిమా రీళ్ళలా సాగుతుంటే..... గుండెలవిసేలా నింగినంటుతున్న రోదనలలో... వసంతకోకిల గానం అది పలికే నవరాగం నాకెలా వినిపిస్తుంది? అతివల రక్తపు రుచిమరిగిన మృగాళ్ళు ఇంకా మనమధ్యే సంచరిస్తుంటే అంగాంగాన్ని ఆబగా ఆరగిస్తుంటే ఉగాదినెలా స్వాగతించను? ఎన్ని వసంతాలు నన్ను దాటుకొనివెళ్ళాయో ఎన్ని ఆమని గీతాలు మదిమాటునదాగాయో కానీ...ప్రతిసారీ నాకు వేపచేదే మిగిలింది... అయినా ఆశచావని మనిషిని... మళ్ళీ నిన్ను స్వాగతిస్తున్నా... ఇప్పటికైనా... మా జీవన ఉగాది షడ్రుచుల సంగమం కావాలని ఆశిస్తున్నా||

by Kavi Savyasaachi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRlU1q

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి