పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Rama Krishna Perugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rama Krishna Perugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, మే 2014, శుక్రవారం

Rama Krishna Perugu కవిత

హైకూలు //పెరుగు రామకృష్ణ // 1.ఆశల్ని, ఆకుల్ని నిర్దాక్షిణ్యంగా రాల్చేసింది శిశిరం 2.ప్రమాదంలో పసిపాప ఆ నమ్మకపు చూపు నన్ను గుచ్చు తుంది.. 3.స్టార్ హోటల్ అదనపు ఆకర్షణ చిలక జోస్యం 4.కలికాలం ఇప్పుడు అద్దాలు కూడా అబద్దాలు నేర్చాయ్ ... 5.పొలం మధ్యలో కొంగల అసెంబ్లీ .. 09-05-2014

by Rama Krishna Perugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1owoqMD

Posted by Katta

4, మే 2014, ఆదివారం

Rama Krishna Perugu కవిత

అమెరికా తెలుగు సంఘం (ఆటా) సాహిత్య పోటీల విజేతలు జూలై 3,4,5 వ తేదీలలో ఫిలడెల్ఫియాలో జరగబోయే 13 వ ఆటా మహాసభల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక సంచిక ‘అక్షర’ కోసం ఆటా నిర్వాహకులు సాహిత్య పోటీలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు ఐదు వందల మంది రచయితలు ఈ పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. వివిధ అంశాలలో వచ్చిన రచనలను ఆయా రంగాలలో నిష్ణాతులైన వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, రచనలను నిశితంగా పరిశీలించి ఈ క్రింది విజేతలను నిర్ణయించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు జూలై 4,5 వ తేదీలలో ఆటా మహాసభల ప్రత్యేక సాహిత్య కార్యక్రమాల వేదిక మీద బహుమతి ప్రదానం జరుగుతుంది. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వోల్గా, అఫ్సర్, శంకగిరి నారాయణ స్వామి, వంశీకృష్ణ గార్లకు ఆటా మహాసభల సమన్వయ కర్త పర్మేష్ భీంరెడ్డి గారు హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియజేశారు. కథల విభాగం: మొదటి మూడు బహుమతులు ($116): మేస్ట్రుబాబు మరినేరు! – డా.చింతకిందిశ్రీనివాసరావు (విశాఖపట్నం) విముక్త – వారణాసి నాగలక్ష్మి (హైదరాబాద్) ఇప్పుడే అందిన వార్త – పెద్దింటి అశోక్ కుమార్ (కరీంనగర్) కన్సొలేషన్ బహుమతులు ($58): ఇప్పుడైనా చెప్పనీయమ్మా – జి. ఎస్ లక్ష్మి (హైదరాబాద్) సర్వం శ్రీజగన్నాథం – ఆనందరావు పట్నాయక్ (రాయగడ) చందమామోళ్ళవ్వ – రాధ మండువ (చిత్తూరు) అరచేతి చాటు సూర్యుడు – రాజేష్ యాళ్ల (విశాఖపట్నం) కవిత్వ విభాగం: మొదటి మూడు బహుమతులు ($116): నాలాగే నువ్వూ – మొహన తులసి (చికాగో) వలసపక్షి – నిషిగంధ (ఫ్లోరిడా) వీడ్కోలు వేళ – స్వాతీ కుమారి బండ్లమూడి (తిరుపతి) కన్సొలేషన్ బహుమతులు ($58): మౌనశిఖరాలెదురైనప్పుడు – పాయల మురళీకృష్ణ (విశాఖపట్నం) దుబ్బ కాళ్ళు – అన్నవరం దేవేందర్ (కరీంనగర్) సెల్ఫీ – తైదల అంజయ్య (కరీంనగర్) పరిమళ భరిత కాంతి దీపం – పెరుగు రామకృష్ణ (నెల్లూరు) వ్యాసాల విభాగం: బహుమతులు ($116): అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథా సాహిత్యం – డా. తన్నీరు కళ్యాణ్ కుమార్ (గుంటూరు) ఆ ముప్ఫై గంటలు – దాసరి అమరేంద్ర ---------------------------------------------------------------------------------- విజేతలకు అభినందనలు! బహుమతి పొందిన రచనలు సావనీర్ లో ప్రచురింపబడతాయి. జూలై 10 వ తేదీ వరకు బహుమతి పొందిన మీ రచనలను ఎక్కడా ప్రచురించవద్దని మనవి. విజేతలకి ఆటా జ్ఞాపిక, బహుమతి జూలై మూడవ వారం పోస్టులో పంపించబడతాయి. ధన్యవాదాలు, -ఆటా సావనీర్ సంపాదకులు

by Rama Krishna Perugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kHyHog

Posted by Katta

24, ఏప్రిల్ 2014, గురువారం

22, ఏప్రిల్ 2014, మంగళవారం

Rama Krishna Perugu కవిత

Haiku ధాత్రి దినం ప్లాస్టిక్ గింజల్లో ప్రపంచం అనుసృజన ;పెరుగు సృజన ;లేరోయ్ గార్మన్

by Rama Krishna Perugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f1xc4N

Posted by Katta

1, ఫిబ్రవరి 2014, శనివారం

Rama Krishna Perugu కవిత

//పెరుగు రామకృష్ణ // గల్లంతు ... ! // వాడి పారేసే సంస్కృతి దురాక్రమణలో పాత పని ముట్లకి తుప్పు పట్టి బంగారం లాంటి శ్రమ చేసే చేతులకి గోరింటాకు పెట్టాయి .. పరదేశపు సెంటు స్ప్రే ల వరదలో స్థానిక అత్తర్ ఆసామి అడ్రెస్సు గల్లంతు సరికొత్త "మాల్" సంతల్లో దేశీయ వస్తువులన్నీ దారిమారిన దయనీయ వైనం విలువ లేని చెత్తలో హస్త కళల కుప్ప.. ఒక నులివెచ్చని స్పర్స నాలుగు గోడలు దాటాక ఇప్పుడు మనిషికూడా పెట్టుబడిలేని వ్యాపారవస్తువే .. ? 31-01-2014

by Rama Krishna Perugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fGvNfK

Posted by Katta

Rama Krishna Perugu కవిత



by Rama Krishna Perugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dfm1OC

Posted by Katta

22, ఆగస్టు 2012, బుధవారం

పెరుగు రామకృష్ణ || మనదేశం-మన గీతం..||


నీలి సముద్రం మీద
గుండెని లాగి కట్టి రాసిన వేదమే జనగణమన ..
శవాలు గుట్టలుగా మిగులుతున్నప్పుడు
మరణం మీటిన రహస్య శబ్ద తంత్రీ నాదమే జనగణమన..
సింధు నది ఆవలి వొడ్డు నుండి
గంగా నది ఈవలి వొడ్డు వరకు జలతరంగిణి లా సాగే
ఒక మహా ప్రవాహ సంగీతమే జనగణమన..
పాట అందర్నీ పరవశింప చేసినా
గానం ఎప్పుడూ తల వంచదు ...
కాలంలో జారిపోయిన
అద్భుత క్షణాల్ని దోసిట్లో పెడుతుంది...
భారత దేశం ఒక తేజో మండల దీపం
ఇక్కడి మనిషిది కాన్తివంతపు దేహం
అందుకే
నా దేశాన్ని నేను జనగణమన తోనే అలంకరిస్తాను..
ప్రతి పౌరుడి గుండెలమీద పచ్చబొట్టులా దాన్ని పొదుగుతాను
శాంతి కాముకుడ్నై ,యుద్ధరహిత
మరోప్రపంచం కోసం మళ్ళీ మళ్ళీ జనగణమన ఆవిష్కరిస్తాను
నా గీతానికి ఆత్మాభిమానం ఎక్కువ...
నా దేశానికి గర్వమెక్కువ..
ఒక పురాతన ఉద్యమం లో అమరుల సాక్షిగా
మనుషులు పుష్పించడం కోసం జనగణమన ఆలపిస్తాను
భారతమాతను జనగణమన తోనే అభిషేకిస్తాను..
హిమాలయాల జీవన తాత్వికతను సుజల్లం,సుఫలాం లా
ప్రతి భారతీయుడి గుండెల్లోకి వొంపుతాను
అవును...
గురి కోసం నేను పాటని ఆయుధం చేస్తాను
దానికి జనగణమనగా నామకరణం చేస్తాను
నా గీతం లో కాంతి మసి బారదు
నా గీతం లో జాగృతి ఎప్పటికీ ఆరదు
అలుపెరగని గళాలతో, కోట్ల గొంతులతో
జయ జయహే నినాదాల తో
ఈ జాతీయ గీతం తోనే శత్రువుని జయిస్తాను...!
*21.8.2012

19, ఆగస్టు 2012, ఆదివారం

పెరుగు రామకృష్ణ // పసిడి విందు..//



నాకేమో
ఆకు పచ్చ ఆకాశంలో
వేలాడే బంగారు చంద్రుడి మల్లె వుంది
బంగినపల్లి మామిడి ..

పడమటి తోటల్లోంచి
రహస్యంగా కోసుకొచ్చి రుచి చూసిన
పుల్లటి జ్ఞాపకం..
తలుస్తూనే నోరూరిస్తూ
ఇప్పటికీ వెంటాడుతూనే వుంది..

జ్ఞాపకాల గడ్డిని పేర్చి
బంగారు నిధిని దాచి పెట్టినట్టు
నాన్న మాకందరికీ పంచిన మామిడి రుచి
నాన్న తోనే చడి లేకుండా సెలవు తీసుకుంది ..

ఎండాకాలం
మా ధాన్యపు గది
మామిడి అత్తరు పూసుకున్నట్లు
రసాలు,బేనీషా,మల్గూబా,దిల్ పసంద్
సువాసనలుగా
మా మీద వల విసిరేది..

వేసవి సెలవుల్లో
దిస మొలలతో
దిగుడు బావుల్లో ఈతతో అలిసాక
ప్రాణం నింపుకోడానికి
చెట్టునుంచి తాజా మామిడి పండ్లు
కోసుకు తిన్నప్పుడు
కొత్త రూపును తోడుక్కున్నట్లుండేది..

పిడికెడు సద్దెన్నం తో పాటు
మా తోట మాలి కుటుంబానికి
రాలిపడిన పండ్లు పంచి
అమ్మ చేసే పసిడి విందు
మాకు కను విందు చేసేది..

మరేమో ఇప్పుడీ
కార్బైడ్ రాక్షసి రాకతో
విస్తరించాల్సిన హృదయలన్నీ
ముడుచుకు పోయినట్లు
మమతలన్నీ ఒక్కసారి చెరసాల చేరినట్లు
మూగపోయిన మామిడి దరహాసం
మండీల్లోనే మగ్గిపోతుంది ..

నగరపు వీధుల్లో కార్బైడ్ పల్లకీలో
మెరుస్తున్న మామిడి బుట్టలు
ఇవాళ ఒక గతించిన జ్ఞాపకమే
చెదరిన ఒక తియ్యని స్వప్నమే..!!

*18-08-2012

14, ఆగస్టు 2012, మంగళవారం

పెరుగు రామకృష్ణ // కొత్త సిలబస్సు ..//



ఏడ్చినా నవ్వినట్టే ఏడ్వు
కన్నీటికి కరిగే గుండెల్లేని ఎడారిలో
కోకిల పాటకి శ్రోత వుండడు..

మాట్లాడినా ,మాట్లాడనట్టే..మాట్లాడు
వంచానాలంకారమే
ముఖార విందమైన అద్దం ముందు
స్వచ్చత కి ప్రతిబింబం వుండదు..

రెండు పెగ్గుల ఆలింగానాల మధ్య
కరచాలనం చేస్తూ,
పెదవులు పూలు పూయటం
స్నేహ రుతువుకు సంకేతం కాదు..

అనివార్యాల ఒడంబడిక మాత్రమే
జీవితం వ్యాపారమై పోయిన వ్యవస్థ లో
రోజూ మరణించడం,
మళ్ళీ రోజూ బ్రతకటం
స్నానమయ్యాక గుడ్డలు తొడిగి నట్టే ..

ఇప్పుడు నీతి వాక్యాలు,
వచన ప్రవచనాలు కాదు కావాల్సింది,
ప్రమాదం అంచుల్లో చిక్కుకోక తప్పించుకుంటూ
బ్రతకడం నేర్పే కొత్త సిలబస్సు...!!

*13-08-2012

12, ఆగస్టు 2012, ఆదివారం

పెరుగు రామకృష్ణ || లోలోపలికే... ||


ఎక్కడె క్కడని వెతుక్కోను
నా చిరునామాని నేను..?

ఏ తలుపు తట్టి చూసినా
గుప్పున పరాయి వాసనే

కునుకు నేను తీస్తాను
కలలు వాడు కంటాడు

పెదవి నేను విప్పితే
చిరునవ్వు మాత్రం వాడిదే

గిలకల బావిలో చేద నేను
దాహం వాడు తీర్చు కుంటాడు

చెమటలు నాకు పడుతుంటే
చిరుగాలి వాడి వైపు వీస్తుంది

తెడ్డు నేను వేస్తున్నాను
చుక్కాని వాడి చేతుల్లో వుంది

విత్తు నేను నాతుతున్నాను
ఫలాలు వాడు కోస్తున్నాడు

ప్రపంచీకరణ గొడుగు కింద
నా ఉనికి నేను కోల్పోయాక

ఇక అన్వేషణ
నా లోలోపలికే....!



*12-08-2012

11, ఆగస్టు 2012, శనివారం

పెరుగు రామకృష్ణ //లోహలయ //

సమ్మెట సమ్మెటలుగా
నిగిడిన కండరాల బిగువంతా
ఇనుము పొగరుని

చపటగా చితక్కొట్టి
కొడవల్ని ప్రసవిస్తుంది
నాగేటి కర్రుని నిర్మిస్తుంది
చెట్టుని కూల్చే గొడ్డలి
మోటకు వేలాడే సంకెల
ఒక సుత్తె,ఒక గునపం
దైహిక శ్రమనంతా పిండి పిండి
ఇనుప ముద్డ ముక్కు పిండి
పనిముట్లకు ప్రాణం పోసిన
మొరటు విదాతై పోతుంది
నిప్పుల కొలిమిలో
రగిలిన లోహమే కనిపిస్తుంది
కరిగిన కండ కనిపించదు
నిప్పుల కావిడైన దేహం దృష్టి న్చాడు
కూలిన చెట్లు తప్ప
కూల్చిన గొడ్డలి ఊసే లేనట్టు
కోత కోసిన పైరు కుప్పలు తప్ప
కొడవలి జాడైనా లేనట్టు
ఇప్పుడు కమ్మరి ఇంటి నిండా
కన్నీళ్లు కారుస్తున్న ఆకలి
ఫ్యాక్టరీ చిమ్నీల కంటే పెద్దగా
కేకలు పెడుతోంది దీనంగా..!

(కను మరుగై పోతున్న కమ్మరి కోసం..)

*10-08-2012

4, ఆగస్టు 2012, శనివారం

పెరుగు రామకృష్ణ||హిమ శిల్పాలు..!||


గాడితప్పిన
జీవితానికి నిబద్దత తెలీదు
నిన్ను నీవు హత్య చేసుకుంటున్నట్లు
దోసిలితో విషం పట్టుకు తాగేస్తున్నట్లుంది
నీ చుట్టూ పరిబ్రమిస్తున్న
ఒక్కొక్క హిమ శిల్పమూ
నిన్ను అసహ్యించుకుంటున్నా కూడా
అధికారం నీ అరచేతిలో బొంగరంలా తిరుగుతుంది..
చిరిగి పోయిన దేహాల్ని చూసినప్పుడల్లా
నిన్ను నీవు అంగార తల్పం మీద నెట్టుకుంటూన్నట్టు
నీవెప్పుడూ అనుకొనేలేదు
ఒక వెర్రి ఆనంద మేదో నిన్ను స్వస్థత పరుస్తుంది
నిర్మలమైనది
నిజాయితీది
పరిసుద్దమైనది
ఏదీ లేనట్లు ఆత్మ ఇప్పుడు అల్లాడి పోతుంది
ఇదంతా నీకు అర్థం కాక పోవచ్చు
స్వార్థం నీ కోటు గుండీకి అందంగా గుచ్చిన పువ్వుకదా?
అవినీతి నీ కలం పోటులోని పాసుపతాస్త్రం కదా ?
వేల ముఖాల కన్నీళ్లు కూడా
ఒక్కసారైనా నీ ప్రతిబింబం చూసుకునేప్పుడు
వెక్కిరించడం లేదు ..
ఆత్మ ఏమిటీ?
పరమాత్మ ఏమిటీ..?
ధర్మాధర్మాలు రెండుపడవలు కాదు కదా
అవిప్పుడు నీ చేతిలోని త్రాసు మాత్రమేగా
ధనం మూలం ఇదం జగత్..
అనంతంగా సుఖించి ,
అంతరించి పోవాలి
విలాసాల ఊయల లూగాలి
మొదలు ,చివర లేని బతుకులు కదా
అధికార దుప్పటి కింద చేతులు చాపాల్సిందే
ఆశ్రిత బందు ప్రీతితో మగ్గి మాసిన మరకవ్వాల్సిందే
నిజాయితీగా ఒక నిజం చెపుతున్నా ..
శిక్షించడానికి ఎవరూ లేరిక్కడ
ఏ అనుభవం లేని పసి దేహంతో నీవు నిలబడ్డప్పుడు
నైతిక విలువలు తప్పోద్దంటూ
నీ తండ్రి మాత్రమే నిన్ను శిక్షించే వాడు
సుఖనిద్రల దేవులాటలో పయనిస్తున్నప్పుడు
పసుపు రాసిన చెర్నాకోలతో కొట్టి
పవిత్రంగా నిన్ను మేల్కొల్పడానికి
ఇప్పుడెవరూ లేరు..
చీకటి పల్లకీలలో ఊరేగుతున్నావు
కాగడాలు కాకపోయినా
కొవ్వొత్తులు వెలిగించే చేతులే కరువు ..
కోట్ల కుంభకోణాల వెలుగు వాకిట్లోకి వచ్చేలోపు
సుఖదుఖాల అసలు జాడ తెల్సుకో..?

*4.8.2012

పెరుగు రామకృష్ణ॥గ్రీస్ మేడం॥

 గంధర్వ కన్య లా
ఆమె నడిచినంత మేర
వెన్నెల పరుచుకుంది..
"కల్లిమెర"(శుభోదయం) అంటూ నేను
కరచాలనమైనప్పుడు
దూరంగానో
దగ్గరగానో ...
ఒక అమృత హస్తం
నన్ను కాపు కాస్తున్నట్లుంది ..

నాకు తెలిసినంతవరకు
మగాణ్ని
ఆమెలాంటి
ఆత్మ వలయమేదో
కాపాడుతున్నట్లుంది..

ఆమెని చూసాక
స్త్రీ లేకపోతే ...
స్త్రీ సముద్రతీర లాంతరుగా మారక పోతే..
జీవనసాగరంలో మగాడు
జాడ తెలీని ఓడ అవుతాడేమో..?

నేను దగ్ద మౌతున్న ఎర్రని రాత్రి
ఆశల్ని వెలిగించు కుంటున్నప్పుడు
మస్తిష్కాన్ని పడమటివైపు మళ్ళిస్తున్నప్పుడు
కూలుతున్న దేహపు గోడల్ని సరిచేసు కుంటున్నప్పుడు ...

ఆమె స్నేహం
మధ్య ధరా సముద్రపు నీలి కెరటంగా
రోజూ నా హృదయ తీరాన్ని తాకుతూంది
ధ్యానంలో ఉన్న ఒలింపస్ పర్వతంలా
భావ ప్రవాహమైన పీనస్ నదిలా...

దృశ్యం మీద రెప్పల దుప్పటి కప్పుకున్నాక
"కల్లి నిక్ష్ ట "(శుభ రాత్రి)చెప్పి
ఆమె
బుగ్గపై అద్దిన ముద్దు ముద్రలా
పొడవాటి స్వప్న మేదో
ఆత్మరేఖగా దుప్పటిని చీలుస్తుంది ..

ప్రపంచం ఇప్పుడే మొదలైందో
ముగింపు కొచ్చిందో తెలీదు కానీ
మనిషి పుట్టినప్పటి నుండి
స్త్రీ.. ప్రేమించడం మాత్రమే చేస్తుంది

అనంతమైన అవని మీద
ఆ ఒడ్డయినా
ఈ ఒడ్డయినా
ఆమె కు
లాలించి పాలించడమే తెలిసింది ..
కన్నబిడ్డ జైలు కెళ్ళినప్పుడు
కరపత్రమైన గోర్కీ అమ్మలా...

శోక శిఖరాలు
ఎక్కినా
దిగినా...
మగాడ్ని ఆనంద డోలికల్లో ఊగించే
ఆరోహణ
అవరోహణ...
క్రమం తెలిసింది మాత్రం
ఆమె
ఒక్క దానికే..!
*3.8.2012

2, ఆగస్టు 2012, గురువారం

పెరుగు రామకృష్ణ||మృత్యు ఘంటికలు...||


మట్టితో,
ప్రకృతితో

మమేకమై
మహిమాన్విత మైంది
మనిషి బ్రతుకు..
పైరుపంటల,పాడియావుల
పురాతన బందం గుండెల్లో
పదిలపరుచుకుని
ఆత్మ సాంగత్యంతో నడుస్తున్నాడు
పచ్చని ప్రపంచాన్ని చూసినప్పుడు
చెట్టు మొదల్లో నిల్చునప్పుడు
అమ్మ పొట్టలో తలదాల్చుకున్నట్లు వుంటుంది..
నిర్మలమో
ప్రశాంతమో
ఏదయితేనేం..
ఈ నేలను సుజలాం,సుఫలాం,
సస్య శ్యామలాం చేసిన
సృష్టి కర్తకు వందనం..
ఎన్ని రంగులు,
ఎన్నిపువ్వులు
ఎన్ని అందాలు అద్దిన
సృజనకారునికి అభినందనం..
దురదృష్టం..
కాలుష్యం కల చెరుపుతుంది
ఏవీ ..
తుమ్మెదనై పూల మొక్కల మధ్య
పరుగెత్తిన కలల ప్రపంచపు కొసలు
ఇప్పుడు
ఎవరో రహస్య శిబిరం నిర్మించుకున్నట్లు
పొలం మధ్యన పొగ గొట్టాలు లేస్తున్నాయి
గెణాల పాదులు తీసిన పొలం
రాత్రికి రాత్రి రొయ్యలగుంట లై
రసాయన స్నానం చేస్తుంది..
రక్తం రంగు నింపుకున్న దేహాలు
పచ్చదనాన్ని మార్చురీకి తరలిస్తున్నాయి
భూమి శిధిలమై మనిషికి
బూడిద బహుకరిస్తుంది..
దీప ద్రవాలన్నీ ఆవిరై
ఆమ్ల వర్షాలు కురిపిస్తున్నాయి
మనిషికీ మనిషికీ
మనిషికీ మట్టికీ మధ్య
పరిచయ నిర్మాణం భారమై పోతుంది
రెప్పమూసినప్పటి నల్లని దృశ్యాలన్నీ
మనిషి బతుకును మసక బారుస్తున్నాయి
అంతా వ్యాపార వ్యాపకమే ..
తరాల నాటి మది గోడలనిండా
నింపుకున్న ఆకు పచ్చటి అడవి
ఇప్పుడొక శిధిల జ్ఞాపకమే..
వేడెక్కిన భూమి మీద
మృత్యు ఘంటికలు మోగుతూ
బ్రతుకు వస్త్ర పోగుల్ని నిలువునా జ్వలిస్తూ..
అతి తీవ్ర గ్రీష్మాల్ని
స్వాగతించాల్సి వస్తోంది..
వెన్నెలని ఏరుకున్న చోటనే
కంకాళాల వికార వంతెన మీద నడవాల్సి వస్తుంది..
నిషిద్ద ప్రపంచపు గది ముందు
శరీర తొడుగుల్ని విడిచి
ఏమీ లేని తనం తో మిగలాల్సి వస్తుంది
ఇప్పుడు
మనిషి స్వార్ధంతో మట్టిని మింగేస్తుంటే..
భద్రకాళిలా రుద్ర రూపం దాల్చి
ప్రళయంలా మట్టి విరుచుకు పడి
మనిషిని మింగేస్తుంది..!!
*2.8.2012

30, జులై 2012, సోమవారం

పెరుగు రామకృష్ణ || స్వార్ది.. ||

కొమ్మ చివురు తొడిగేందుకు
ఆనందంగా రాలిపోతుంది
పండుటాకు..

మనసు బరువు దించేందుకు
కన్నువీడి ధారగా జారి పోతుంది
కన్నీరు ..

ముత్యమై మెరిసి పోయేందుకు
ఆకాశాన్ని వొదిలేస్తుంది
చినుకు..

తన సుఖం కోసం
ఎదుటి మనిషి చిర్నవ్వులన్నీ
దోచేసుకుంటాడు
మనిషి..
-29-07-2012

26, జులై 2012, గురువారం

పెరుగు .రామకృష్ణ || దిన చర్య..! ||

ఒక సాయంత్రం
నల్ల సముద్రమైపోయాక
తన ఉద్యగం లోంచి ఆమె
నా ఉద్యోగంలోంచి నేను
బైటికొచ్చి వొడ్డున పడ్డాక తీరిగ్గా కలుసుకుంటూ
చీకటి సముద్ర తీరం మీద జంట
పక్షులమై రెక్కలార్చి కూర్చుంటాం ....

వాళ్ళ ఆఫీసు కబుర్లతో ఆమె
నా దిన చర్య గూర్చి నేను
బతుకు ఫైళ్ళు తెరుచుకుంటాం

అవసరాల గురించి కొంచెం
ఆనందాల గురించి కొంచెం
కొన్ని దిగుల్లై పోతాం
కాసిన్ని చిరునువ్వ్లవుతాం
జారుతున్న చీకటి యవనికలా
ఆలోచనల కెరటాల మై పోతాం

కబుర్ల కలనేత ముగిసాక
ఒక చానల్లో సీరియల్....
మరో సిడి లోంచి హరిప్రసాద్ చౌరాసియా
అలా గాలిలో ప్రవహించాక
ఆమె కునుకులోంచి మత్తులోకి జారుకుంటూ ..
ఆమె శ్వాస నా చాతి పై పాములా పాకుతూ ....
నన్ను గుండెలకు హత్తుకుని గాడంగా నిద్రిస్తుంది ..!

ఉదయం నుంచి నా లోపల...లోలోపల
అల్లరి చేస్తూ ఆలోచిస్తూ ,ఆక్రోసిస్తూ ఆవేసిస్తున్న
ఓ పద్యం అప్పుడే మేల్కొని
యిక రాత్రంతా నిద్ర పోనీకుండా చేస్తుంది ..!!
నన్ను ప్రసవ వేదనకు గురిచేస్తుంది...
*25-07-2012