||ఈ చరిత్ర నీ రక్తంతో|| నువ్వెవడిని ప్రశ్నిస్తావ్? నువ్వెవడని ప్రశ్నేస్తావ్? నువ్వేమని అడుగుతావ్? నువ్వేదని కడుగుతావ్? వీడు..... నీకు బాగా తెల్సినోడే ఎప్పుడూ కావల్సినోడే...కానీ వీడో ముళ్ళపొదైనా కావచ్చు.. ముళ్ళపందైనా... వీడుమాత్రం కుళ్ళు వెధవ సొల్లు గజ్జి కుక్క... చొంగలు కార్చేసుకుంటు.. చీకట్లు పేర్చేసుకుంటు నోట్లను విసిరేసుకుంటు ఓట్లను పోగేసుకుంటు రాత్రిగొంతుల్లో సారానింపుకుంటు కపట ప్రేమపలుకులొంపుకుంటు జెర్రిలా పాకుతూ కాళ్ళు తెగనాకుతూ డ్రైనేజ్ నోటితో వాగుతూ అసత్యాల అంటకాగుతూ వీడెవడో... గుర్తొచ్చాడా...? అవును...వాడే...వీడు!! నీ గతానికి గోరీకట్టినోడు వర్తమానపు వంచనగాడు భవిత భస్మంచేసేవాడు.. నీ బతుకు భొంచేసేవాడు ఆడు సరే...నువ్వేంటి? నీ జ్ఞానం మోకాలా? అజ్ఞానపు అరికాలా? చరిత్ర చూడలేదా? ధరిత్రి చెప్పలేదా? కాలం నిన్నెప్పుడైనా కనికరించిందా? వెన్నెలెప్పుడైనా నీ బతుకులో కురిసిందా? కష్టాలు.....కన్నీళ్ళు ఆకలికేకలు....ఆక్రందనలు రోగాలూ...రొష్టులూ ఎముకలపోగులూ...రగిలే చితిమంటలూ... ఇవికాక....ఇంకేమైనావుంటే చెప్పు కడుపుమండి అరుస్తావ్ జబ్బలుతెగ చరుస్తావ్ చీపులిక్కరివ్వగానె చిందులు తొక్కేస్తావ్ ఐదు వందలనగానె అర్రులు సాచేస్తావ్ ఎక్కింది దిక్కముందె ఎవడికొ ఓటేసేస్తావ్ ఇగ అడగడానికి నీ హక్కేంది? నీ తిక్కకు లెక్కేంది? తెల్లరేప్పటికి నీ కిక్కు దిగుద్ది నీ బతుకప్పటికే తెల్లారిపోద్ది నువ్వోటేసినోడు మొహమైనా చూడడు అద్దాలమేడనుండి అడుగైనా దాటడు నువ్ తాగినసారా నీ సారాన్ని తాగుతుంది నీ ఆలి సింధూరం రాలి ధూళిలోన కలుస్తుంది ఆడుమాత్రం............. బతుకులు చిదిమేస్తూ... చితుకులు పోగేస్తూ... చితులు వెలిగిస్తూ... ఊసరవెల్లై రంగులు మారుస్తూ... ఈ కధలూ...ఈ వ్యధలూ ఇంకానా...ఇకచాలు!! ఆడు మళ్ళీ కనబడితే... చెప్పిడిచి కొట్టు పాళ్ళూడగొట్టు ఆడి సారాలో ముంచి తీసి అగ్గెట్టు....తన్నితగలెట్టు "అప్పుడే మళ్ళొకడు పుట్టడు మీ కడుపులు కొట్టడు""
by Kavi Savyasaachi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ohxbhg
Posted by Katta
by Kavi Savyasaachi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ohxbhg
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి