పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Prasad Atluri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Prasad Atluri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జూన్ 2014, బుధవారం

Prasad Atluri కవిత

ప్రసాద్ అట్లూరి || తింగరబుచ్చి || (మణిమాలిక గ్రూప్ లో నేను 'తింగరబుచ్చి' పై రాసిన ద్విపాద మాలికల సమాహారం సరదాగా ...) నువ్వంటే ఇష్టమన్నా.. ఏమి అర్ధమైచచ్చిందో ! నువ్వులడబ్బా నేలకేసి కొట్టింది ... తింగరబుచ్చి!! పోన్లేమని పెళ్ళిచేసుకుంటే 'మొదటి తారీక్కే మొగుడి'వంటుదే... తింగరబుచ్చి !! అద్దంలో చూసుకుని తెగ మురిసిపోతోంది.. 'బంగారానివిగా' అన్నానని కాబోలు .. తింగరబుచ్చి !! నీ గుండెలో చోటు ఇస్తావా" అంటే "ఎన్ని గజాలని" ఎగతాళి చేస్తుందే... తింగరబుచ్చి!! నేనంటే లెక్కలేదా అంటే ! నేను లెక్కల్లో వీకంటు తిప్పుకుంటూ పోతుందేమిటి ..తింగరబుచ్చి పొరపాటున నా మనసు వెన్నలాంటిదన్నా! వెన్నప్పాలు చేసివ్వమని.మారాంచేస్తోంది ...తింగరబుచ్చి !! మూడోనెలని మామిడి కాయలు తెచ్చిస్తే పులుపుచాల్లేదని పక్కింటి చింతచెట్టెక్కింది..తింగరబుచ్చి !! సరే పొన్లేమని పొలానికి పిలిస్తే వడ్లకంకుల్ని తెంపుకుని వళ్ళోదాచుకుంటుందే.. తింగరబుచ్చి!! ప్రేమిస్తావా అనడిగితే ! అధారుకార్డ్ ఉందాని అడుగుతుందేంటి ...తింగరబుచ్చి !! ఏడిపించొద్దన్నా ...ఏమర్ధమయిందో తింగరబుచ్చికి ! కనబటటం మానేసి నా మనసుని ఏడిపిస్తోంది ఇప్పుడు !! ఎటో వెళ్ళిపోయింది మనసు.. అని పాడుకుంటుంటే వచ్చాక కబురంపించు అంటూ పోయిందేంటి.. తింగరబుచ్చి !! చిన్నప్పటి మాస్టారుని భోజనానికి పిలుస్తోందట రాత్రికి అదేపనిగా గోడకుర్చీ సాధన చేస్తోంది...తింగరబుచ్చి !! దస్తావేజులతో వచ్చింది తింగరబుచ్చి ‘నా మనసుపై హక్కులన్నీ నీకే రాసిచ్చేస్తా’ అన్నానని!! 18JUN14

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SSkta7

Posted by Katta

22, మే 2014, గురువారం

Prasad Atluri కవిత

ప్రసాద్ అట్లూరి.. || తరగని దూరం || పెద్దచెఱువు గట్టున చింతచెట్టుపై చిన్నప్పుడు కోతి కొమ్మచ్చి ఆడుతుంటే దొంగ పెట్టాల్సొస్తుందన్న అక్కసుతో చెయ్యితగిల్నా తగల్లేదన్న చిన్నఅబద్దం ముప్పైఏళ్ళయినా దగ్గరకాలేని దూరాలకు మనిద్దరినీ విసరబోతోందని ఆక్షణం తెలిసుంటే ఒకరికోసం ఇంకొకరు మళ్ళీ దొంగమయ్యేవాళ్ళమేమో !! అయినా ..ఎన్నిసార్లు ప్రయత్నించలేదు మనం ఒకరికొకరం దగ్గరవ్వాలని ఆ తరువాత ... గోలీలాటలో నాకోసం నువ్వు ఓడిపోతూ గోడుంబిళ్ళ క్యాచ్ నీకోసం నేనొదిలేస్తూ పంటలేయడానికి చేతులు పట్టుకున్నప్పుడు అవకాశాన్ని వదలకుండా ఎంతసేపు వుండిపోలేదలా ... కానీ ఎందుకనో.. ఓ సన్నని తెర మనల్నివేరుచేస్తుండేది !! బ్రుతుకు బాటలు మనల్ని చెరోవైపుకు చేర్చాక మాటలు రాని పెళ్లి సుభలేఖల్ని మాత్రం ఒకరికొకరం పోస్టుచేసుకుని మురిసిపోయామే .. చొరవతీసుకుని ఎవ్వరమైనా ఒక్క ఫోన్ చేసుంటే దూరమైన పలకరింపు.. దగ్గరై ఆశ్వీరదించకుండేదా పారేసుకున్న మధుర క్షణాల్ని కానుకివ్వకుండా ఉండేదా ? మరెందుకో అలాజరగలేదు ... అప్పుడు కూడా!!!! యంత్రాల మధ్య యాంత్రికమైపోయిన జీవితంలో తలపైకెత్తి చుక్కల్ని చూసే వీలుచిక్కినప్పుడల్లా నువ్వెక్కడో తలుక్కున మెరుస్తూనే ఉంటావ్ నేస్తం ఆరుబయట ఆటల్లో పిల్లలు గొడవపడుతుంటే దగ్గరకుపిలిచి సర్దిచెబుతున్నప్పుడల్లా ఎవరో కుర్రాడు బుంగమూతి పెట్టుకుని రుసరుసలాడుతూ వెళుతుంటే నిన్నునేనో నన్నునువ్వో వదిలేసి వెలుతున్నట్లేవుంటుంది దోస్త్ !! చిన్నతప్పుకు మనం అనుభవిస్తున్న ఇంత పెద్దశిక్ష ఏ న్యాయస్థానమూ ఖరారు చేసింది కాదుగా... మరెందుకింకా అహం జైళ్ళలోనే మగ్గిపోవటం!!! ప్రక్కవాడికి చెయ్యితగిలితేనే పదిసార్లు సారీ చెప్తామే ప్రాణస్నేహితుడికి చెయ్యందించి చేరువ కాలేమా వస్తున్నానేస్తం .. వదిలిన చోటుకే మళ్ళీ తరగని దూరాన్ని .. దగ్గర చేసుకుందామని !! )-బాణం-> 22MAY14

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TxfQU8

Posted by Katta

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి|| ఓటు .. || కులమాతాల కార్చిచ్చులో జనారణ్యాలను తగలబెడుతుంటే కన్నీటితో ఆర్పలేక కుమిలిపోయావే నిత్యావసర ధరలు నింగికెగిరిపోతే నిస్సహాయుడవై నేలచూపులు చూశావే బంధాలను బలవంతంగా తెంచుతుంటే బలవంతుడివైపు బేలగా చూశావే తీరా వెయ్యిగొడ్లను తిన్న రాబందులు వాకిట్లో కొచ్చి నిలబడితే ఓటు బాణమేసి సంహరించకుండా నాకెందుకనుకుని నీళ్ళునములుతావే తీరిక ఎక్కడుందని కాళ్ళు బార్లాజాపుతావే!! మొదటాట సినిమాకైతే ముందుంటావు ఓటెయ్యడానికైతే వెనకెనకకు పోతావే రెండు టీషర్టులు కొనడానికి రోజంతా మాల్సువెంట తిరుగుతావు అరగంట వెచ్చించి ఓటేసి రాలేవా రాత్రి రాత్రంగా పబ్బుల్లో పొర్లుతావు గంటలు గంటలు సెల్లులో సొల్లుకొడతావు అయిదేళ్ళకోసారి ఓటేయమంటే కుదరలేదంటావే!! భవితను బ్రతికించుకోలేని బద్దకం నీకెందుకు సమర్థుడిని ఎన్నుకోలేని బాధ్యతా రాహిత్యమెందుకు అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నీ చేతు(త)లతోనే చంపేస్తావా లే యువతా లే .. ఓటేసి.. ఓడిపోతున్నదేశాన్నిగెలిపించు !! )-బాణం-> 18APR14

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1le1xzW

Posted by Katta

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి || ఎలా ...|| పువ్వుల్లో మకరందాల్ని నవ్వుల్లోకి వెన్నెల వెలుగుల్ని కళ్ళల్లోకి నింపుకొస్తే నీ పరిచయం శాశ్వతమని మురిసిపోయా నీ ప్రేమ నిజమనుకుని గుండెకు అప్పజెప్పా హృదయాంతరాళలోకి వేళ్ళూనుకున్నావనీ మనసు తోటలో వసంతమై విరబూస్తావని అనుకుంటే శిశిరమైనా రాకముందే చిరురించిన ఆశల్ని రాల్చేసి కళ్ళముందే ప్రేమవృక్షాన్ని కూల్చేసి వెళ్లిపోయావ్ నువ్వున్నప్పుడు క్షణమై కరిగిన కాలం లేనప్పుడు యుగమై గడ్డ కట్టుకుపోయింది నువ్వున్నప్పుడు నీడలా వెంటవచ్చిన ఆనందం లేనప్పుడు ఎదురుపడినా తలత్రిప్పుకు వెళ్ళిపోతోంది మర్మం తెలియని మదికి ఇవన్నీ చెప్పేదెలా నువ్వేనిండిన తననుండి నిన్ను వేరుచేసేదెలా మారాంచేసే మనసుతో మాటలెలా కలిపేది ఊరుకోని హృదయాన ఊరడింపునెలా నింపేది ?!! )-బాణం-> 04MAR14

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mJ8B49

Posted by Katta

31, మార్చి 2014, సోమవారం

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి ||పచ్చనోట్ల వసంతం || ఎన్నికల రుతువులో పచ్చనోట్ల వసంతమొచ్చింది చేదు చెట్ల పువ్వుల నిండా రాజకీయ పరిమళాలు తెచ్చింది దొరికిన ఆకుల్ని దొరికినట్టే తిన్న నోరుపెగల్ని గండుకోయిలలు వాగ్దానాల పాటలే పాడుతున్నాయ్ నేడు ప్రజావనమంతా.... మదికొమ్మ చాటున దాగిన ఓటుల్ని ఒడుపుగా కోసుకోవాలన్న ఆత్రుతే అన్నిచోట్లా ఏదో ఒక నిచ్చెన వాడుకొని ఎగబ్రాకేద్దామన్న ఆరాటమే ఎక్కడ చూసినా .. పంచాగ శ్రవణాలకి వేదికలెక్కడ మిగిలాయ్ కవిసమ్మేళనాలకి ప్రేక్షకుల్నెక్కడ ఉండనిచ్చారు ఊరూరా ఊకదంపుడు ఉపన్యాసాలతోనే వీధులు హోరెత్తిపోతుంటే .. షడ్రుచులు కలిపి వడ్డిస్తారనుకుని ఆశపడి ఏరు దాటించడానికి సాయపడ్డావో మళ్ళీ ఐదేళ్ళు ఎదురు చూడాల్సిందే మళ్ళీ ఆ ముఖం నీకు కనబడాలంటే .. )-బాణం-> 31MAR14

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hSP7G8

Posted by Katta

28, మార్చి 2014, శుక్రవారం

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి || పగిలే మాటలు || (సారంగ పత్రికలో ప్రచురితమైన నా కవిత ..) నాలుగు రోడ్ల కూడలిలో నలుగురు నిలబడేచోటు చేతికర్ర ఊతమైనాడెవడో నోరుతెరిచి నాలుగు పైసలడిగితే పగిలే ప్రతిమాట ఆకలై అర్ధిస్తుంది ! దర్నాచౌక్ దరిదాపుల్లో కలక్టరాఫీస్ కాంపౌడుల్లో ఒకేలాంటోళ్ళు నలుగురొక్కటై తమలోని ఆవేదనల్ని వ్యక్తపరుస్తుంటే పగిలే ప్రతిమాట పోరాటమై నినదిస్తుంది ! తలోరంగు అద్దుకున్న ఓ నాలుగు ఖద్దరు చొక్కాలు టీవీ చానళ్ళ చర్చావేదికలపై ప్రాంతాల్నితొడుక్కుని రచ్చచేస్తుంటే పగిలే ప్రతిమాటా వాదమై విడిపోతుంది! నడిచే బస్సులో నల్గురుంటారని హాస్టల్ రూముల్లో అందరుంటారని ఆశపడ్డ ఆడపిల్ల వంటరిదై చిక్కినప్పుడు మృగాలు మూకుమ్మడిగా కమ్ముకుంటే పగిలే ప్రతిమాటా ఆక్రందనై కేకలేస్తుంది! మాట పగిలిన శబ్దానికి ఉలిక్కిపడతామే కాని పగిలే మాటలు తగులుతాయని తప్పుకుంటామే కాని అవసరాన్ని గుర్తించి ఆలంబనగా నిలబడలేమేం? )-బాణం-> 28MAR14 http://ift.tt/1hDxGcz

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hDxGcz

Posted by Katta

20, మార్చి 2014, గురువారం

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి||ఊరపిచ్చుక || చూడచక్కని ఊరపిచ్చుక ఎచ్చటికో ఎగిరిపోయింది ఖాళీఅయిన పల్లెల్ని చూడలేక ఇరుకైన నగరాల్లో ఇమడలేక వడ్లగింజల్ని చకచకా వలిచే నైపుణ్యం ఏ రైతుకీ తెలుపకుండా గూడుకట్టటంలో తన ప్రావీణ్యం ఏ ఆర్కిటెక్కుకీ నేర్పకుండా కిచకిచల పాట ఏ గాయకుడికి కంటస్తా వచ్చేలా నేర్పకుండా తుమ్మచెట్టు కొమ్మలకీ జమ్ముగడ్డి రెమ్మలకీ చెప్పకుండా హటాత్తుగా మాయమైపోయింది ..... అద్దంలో తనని చూసుకుని కాళ్ళతో తన్నుతూ అల్లర్లు వడ్లకంకులపై వాలుగా వాలుతూ గింజలు పీకుతూ కుస్తీలు చూర్లలో చెక్కర్లు కొడుతూ చూపరులకు కనువిందులూ చేసే చూడచక్కని ఊరపిచ్చుక ఎచ్చటికో ఎగిరిపోయింది ఏదీ అనుకునేలోపే ఇక లేదమో అనుకునేలా బహుసా ఏ కామందుడి కోరికలో పెంచడానికి లేహ్యంగా మారుంటుంది టెక్నాలజీ పేరుతో మనిషి చేస్తున్న దారుణాలకి ఏ బలిపీఠమో ఎక్కుంటుంది లేక తనపై సెల్ టవర్ బహ్మస్త్రం వేసావేం స్వామీ అంటూ ఏ దేముడినో అడగగానికి వెళ్ళుంటుది .... (ప్రపంచ పిచ్చుక దినోత్సవం సందర్భంగా ......మన బాల్యంలో భాగమైన నిత్య బంధువును దూరంచేసుకున్న భారమైన హృదయంతో ...) posted in Dec'12

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lS47b1

Posted by Katta

19, ఫిబ్రవరి 2014, బుధవారం

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి||దగాపడ్డ గుండెలు|| భంగపడ్డ బిడ్డలారా దగాపడ్డ తమ్ములారా బెంగ పడకండి ! విడిపోతే పడిపోతామేంటి ? ఐనా ఎగసే ప్రతికెరటం పడే లెగుస్తుందిగా! అణుబాంబు మీదపడినా చిగుర్లు చిగురించలేదా ప్రగతిలో పయనించట్లేదా! కష్టపడే గుణం కల్గినోడివే తెలివైన బుర్ర ఉన్నవోడివే ఉప్పెన్లెన్నొచ్చినా లెక్కచేయనోడివే!! ఒక బిడ్డను నవ్వించడానికి రెండో బిడ్డను ఏడిపించిన సవతితల్లి ప్రేమకు మధనపడకు! నీకేం కావాలో అడక్కుండా ఉరికొయ్యకు వేలాడేసిన పెద్దరికానికి పెద్దగా విలువనివ్వకు! పగబట్టినట్టు కాటేసిన కాలనాగుల కర్కశకోరలకు చిక్కినందుకు చిన్నబుచ్చుకోకు ! ఆఖరి నిముషం వరకూ ఆశపెట్టి వంతపాడిన తోడుదొంగల్ని తలచి అతాశుడివై మిన్నకుండిపోకు! లే తమ్ముడూ లే.. లేచి నిలబడు నీ జాతి నీకై వేచిచూస్తోంది.. ఎవడి పాపాన్ని వాడికే వదిలేసి కర్యోన్ముఖుడివికా.. నీ బిడ్డలను రక్షించు వాళ్ళ ఆశలను బ్రతికించు ఇంకెప్పుడూ విడిపోని పడిపోని మరో రాజ్యాన్ని నిర్మించు.. కాదన్నవాడి కళ్ళుభైర్లు కమ్మేలా నువ్వేంటో రేపు నిరూపించు !! >--బాణం-> 19FEB14 ( తెలంగాణా ఆకాంక్ష నెరవేర్చడం తప్పుకాదు ... ఆంధ్రా గోడును వినకుండా భరోసా కల్పించకుండా విడగొట్టిన పాపం మాత్రం ప్రబుత్వ పెద్దలదే ... సీమాంద్ర ప్రజలకు బాసటగా నాలుగు మాటలు ... )

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MxQ6Dg

Posted by Katta

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి ||నువ్వే కావాలి || (ప్రేమికుల దినం సందర్భంగా ...) నువ్వు కనిపెస్తే కమనీయ ద్రుశ్యం కనుమరుగైతే కరిగిన స్వప్నం నీ చూపుల్లొ భందీనవటం నాకు ఇష్టం నీ తలపుల్లొనైనా నేనుండకపొవటం చాలా కష్టం నువ్వెక్క వుంటే అక్కడే ఊండాలనిపిస్తుంది నువ్వేంచేస్తున్నావో తెలిస్తే బాగుండనిపిస్తుంది నువ్వెప్పుడొస్తావా అని మది ఎదురుచూస్తుంటుంది నువ్వెల్లిపోతావేమో అని అది బెదిరిపోతుంటుంది ప్రతి మాటా నీదే అనిపిస్తుంటుంది ప్రతి పాటా నీదై వినిపిస్తుంటుంది ప్రతి చిత్రం నీలాగే కనిపిస్తుంది ప్రతి క్షణం నిన్నే చూడాలనిపిస్తుంది ప్రతి జన్మకూ నువ్వే నా తోడనిపిస్తుంది జన్మజన్మలకూ నువ్వె కావాలనిపిస్తుంది. 14FEB14 ......ప్రసాద్ అట్లూరి

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cBx1q3

Posted by Katta

10, ఫిబ్రవరి 2014, సోమవారం

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి || అఘాయిత్యం|| కొసరి తినిపించిన అమ్మను విడిచి బుజాలపై మోసిన నాన్నను మరిచి ఏంటి తమ్ముడూ ఈ అఘాయిత్యం? చదువులో తడబడితే మళ్ళీ నిలబడలేవా ప్రియురాలు కాదంటే ఇహ ప్రేమే దొరకదంటావా! అర్ధాంతరంగా తనువుచాలిస్తే కష్టం కరిగిపోతుందా? తాళంకప్పతోటే చెవికూడా తయారవుతుందిగా ప్రతిసమస్యకీ పరిష్కారంకూడా తప్పకుంటుందిగా విరక్తి చీకటి కమ్మినా అభిమతపు వేకువ రాకుండదుగా! సృష్టిలోని జీవులన్నిటిలో తెలివైన మానవుడివే నవ్వగలిగే వరాన్ని నువ్వొక్కడివే పొందినోడివే ఆలోచించగలిగే ఐశ్వర్యం కలిగినోడివే కదామరి! సమస్యలన్నిటికీ చావే పరిష్కారమై ఉండివుంటే మానవజాతెప్పుడో తన మనుగడ కోల్పోయుండేదిగా! నమ్ముకున్నాళ్ళ నెప్పుడూ నట్టేటముంచకు..తమ్ముడూ.. >--బాణం--> 10FEB14 (క్షణికావేశంలో, వత్తిడిలో జీవితాల్ని త్యజిస్తున్న యువతకి నా ఆత్మీయ విన్నపం ...)

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dc2KCl

Posted by Katta

6, ఫిబ్రవరి 2014, గురువారం

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి || తెలియలేదు || చిరునవ్వుల పువ్వుల్ని గుండెలపై గుమ్మరించినప్పుడు తెలియలేదు చెల్లాచెదురైన ఆశలన్నీ ఒక్కటొక్కటిగా నన్ను వచ్చిచేరతాయని! పరిచయాల పరిమళాల్ని మనసుకు పూస్తున్నప్పుడు తెలియలేదు వశం తప్పిన పరవశం వొంటరినైన నన్ను వెతుక్కుంటూ రాబోతోందని! నువ్వు గుర్తుకొస్తే .. నన్ను నేను పదేపదే పోగొట్టుకుంటానని తెలియలేదేంటప్పుడు! నువ్వు గుర్తుకొస్తే ..వెళ్ళిన కాలాన్నే మళ్ళీమళ్ళీ పిలుస్తుంటానని తెలియలేదేంటప్పుడు! తెలియలేదేంటి ? ఈ చిన్నిమనసులో ప్రేమకి అంకురార్పణ అప్పుడే జరగబోతోందని! తెలియలేదేంటి ? ప్రేమభాషలో ప్రణయకావ్యానికి ముందుమాట లిఖించబడుతోందని!! >-బాణం-> 05FEB14

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LykEDW

Posted by Katta

1, ఫిబ్రవరి 2014, శనివారం

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి || ప్రకృతి యాత్ర ..|| ("కౌముది" మాసపత్రిక లో వచ్చిన నా కవిత) నిశీధి భూతాన్నివెలుగురేఖల ఖడ్గంతో వధించిన వీరుడి విజయ చిద్విలాసం తూరుపు కనుమల పెదవుల్లో మెల్ల మెల్లగా విచ్చుకుంటూ తెల్లవారుతుండటం చూశాను నేలపై వేసిన ముగ్గుల చెట్లపైనుండి రెక్కలొచ్చి ఎగురుతున్న గొబ్బెమ్మల్లా ఆకాశ దారుల్లో పక్షుల గుంపులు డొక్కలకి ఆశల రెక్కల్ని కట్టుకుని బారులు తీరుతుండటం చూశాను ఉదయాన్నే మంచు బిందువులతో ముత్యాల స్నానం చేసిన ప్రకృతిమాత ప్రశాంత సంద్రపు విశాల దర్పణంలో తొలిసంధ్యా బింబాన్ని నుదిటిన సుతారంగా దిద్దుకుంటుండటం చూశాను కాలం చెల్లిన పండుటాకుల బంధాల్ని తెంపుకోలేక తల్లడిల్లుతున్న చెట్ల తల్లులు చిగురుటాకుల నూతనత్వపు అచ్చాదనలు తనువునెక్కడో తాకుతున్న పులకింతలకి తమని తాము వోదార్చుకోవటం చూశాను పైరగాలి పాటలకు పరవశించి నర్తిసూ ఝుంకార నాదామృతాల వెల్లువలో మైమరచి ఆడుతున్న కుసుమాలు బ్రమరాలకు తనువులు అప్పగించి మకరందాలను సమర్పించుకోవడం చూశాను తీరానికి ఆవల్నీ ఆక్రమించుకోవాలన్న బలీయమైన వాంఛ చిరకాలంగా తీరక అల్లకల్లోలమవుతున్న సముద్రుడు అలల పిల్లల్ని అస్తమానం ఉసిగొల్పుతూ దండయాత్రాల్నికొనసాగిస్తుండటం చూశాను భూమిలోని అలజడుల పొరల్ని గుట్టలు పోసుకున్న కొండలు పరిగెడుతున్న ప్రపంచ పోకడలకి నిలువెత్తు మౌనసాక్ష్యపు స్తూపాలై చేతలుడిగి వీక్షించడాన్ని చూశాను సాయంత్రపు సరదాలకి పరదాల్ని దించి ప్రియుడ్ని వదల్లేక వదులుతున్న ప్రియురాల్లా మలిసంధ్యని సాగనంపుతున్న అవని వివర్ణ విచార వదనాన్ని చీకటి చేతుల్తో కప్పుకొని బాధపడుతుండటం చూశాను రాత్రి గూటికి చేరీ చేరటంతోనే పాలపుం(ముం)తని కాలం కవ్వంతో చిలికి వెన్నముద్దల వెన్నెల్ని వెలికితీసిన జాబిలి భూలోకంలో పిల్లలకో ప్రేమికులకో పంచడానికి వినువీధుల్లో బయల్దేరి రావటం చూశాను రచించిన దృశ్య కావ్యపు రంగు కాగితాల్ని మనసు పొరల్లో ఓచోట భద్రంగా దాచుకొని ప్రకృతి యాత్రకు ఆనాటికి విరామాన్ని ప్రకటిస్తూ అలిసిన నా దేహన్ని ధరిత్రి వళ్ళోవాలుస్తోంటే కళ్ళు తృప్తిగా జోలపాడుకోవటం మొదలెట్టాయి ! >-బాణం->01FEB14 http://ift.tt/1aOyzly

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1aOyzly

Posted by Katta