పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, ఏప్రిల్ 2014, శనివారం

Sai Padma కవిత

సాయి పద్మ // నేనూ- నా చుంపాత ముతక పరికిణీ కచ్చపోసి కట్టి నాన్న బుష్కోటు పైన తొడిగి ,పైగా గళ్ళ తువ్వాలు భుజానేసి పగుళ్ళు పట్టిన కాళ్ళతో ,సిమెంట్ దూరిన గోళ్ళతో వాడిపోయిన మల్లెల దండతో, ఎండకి మాడిపోయిన మొహంతో చెమటకి తడిసి రంగుమారి వదులైన బట్టలతో, తిరిగే నేను, ఆ కామపు దున్నపోతుని యెట్ల రెచ్చగొట్టానో అర్ధం కాలేదు రెచ్చగొట్టటానికి ఆకారం తెలీకపోయినా ఆడపిల్లయితే చాలని అప్పుడు అర్ధం కాలేదు నిత్యం నే నెత్తిన పెట్టి తిరిగే నా చుమ్పాత నా మాడుకి గొడుగయ్యింది ఎండ గాడ్పుకి చల్లటి చలివెంద్రమైంది ఆకలి చూపులని వడపోసే ఆచ్చాదన అయింది ఇంతేనా ..ఇంతేనా దున్నపోతు మేస్త్రీ నా కొడుకు మస్తరేస్తానంటూ కన్ను మలిపితే, విసిరికొట్టే చర్నాకోలయింది తాగుబోతు కూలీల విసురు మాటలకి కనబడని ఖడ్గమైంది అంతేనా .. అంతేనా చిరగని బట్టల్లో నన్ను రేచ్చగోట్టావంటూ మునిమాపు వేళల్లో , కళ్ళూ మనసూ మూసుకుపోయి ఓ మృగం నన్ను నలిపెస్తుంటే వాడి మగతానానికి వురేసే ఉరితాడయింది నా చుంపాత ఉరి పడ్డ మగతనంతో లుంగలు తిరుగుతూ వాడు నన్ను రక్షించుకోగల ధైర్యంతో నేను ఇప్పుడు ఎప్పుడు బయటికెళ్ళినా నా చుంపాత మర్చిపోను అది నన్నెప్పుడూ మోసం చేయదు ..! ఎందుకంటె ... పద్యంలో నాకు నమ్మకం లేదు గద్యం , నా మీద దాడి చేసిన వాడి గరుకు గడ్డంలా నన్నెప్పుడూ బాధిస్తూనే ఉంది అక్షరం - నువ్వు చాలీ చాలని బట్టల్లో నన్ను రేచ్చగోట్టావంటూ పలికే చాతకాని మాటల్లా నంగిగా నవ్వుతుంది --సాయి పద్మ ( తన మీద దాడి చేసిన వాడ్ని, తన తలకు బరువులు మోసేందుకు వీలుగా పెట్టుకున్న తువ్వాలు గుడ్డ తో, అతని పురుషాంగాన్ని బిగించి, తనని తాను రక్షించుకున్న ఒక చెల్లెలికి వందనాలతో.. )

by Sai Padma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jh5LCH

Posted by Katta

Kamal Lakshman కవిత

అంగడి బొమ్మలు.........కమల్ లక్ష్మణ్ ఎక్కడ లేదు వ్యభిచారం.. ఎవరు చేయట్లేదు వ్యభిచారం సూటు, బూటు, కోటు వేసుకున్న దగాకోరుల కన్నా చదువు, ఉద్యోగం, పెళ్లి, పేరిట జరిగే వ్యాపారం కన్నా ప్రజా సేవంటూ చేసే పరమ నీచ రాజకీయాల కన్నా పచ్చని నోట్ల కోసం పార్చే నెత్తుటేరుల నరమేధం కన్నా పశు కాంక్షలతో పసి కందులపై జరిగే పరమకిరాతకాల కన్నా అందలమెక్కిన అందమైన అర్హతలున్న కుసంస్కారుల కన్నా నీతులు చెప్పి గోతులు తీసే టక్కరి నక్కల కన్నా కల్తీలతో కర్కశంగా కడుపు కోతలు కోసే రాక్షసుల కన్నా తమ కడుపుల కోసం పరుల కడుపులు కొట్టే బడా బాబుల కన్నా మా తనువులనమ్ముకుని వెలుగులనిచ్చే కొవ్వొత్తులలా ఆకలి కేకలతో చేసే... కడుపులు నింపే మా ఈ వ్యభిచారమో లెక్కా...! కమల్ 05.04.2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hghgMb

Posted by Katta

Viswanath Goud కవిత

విశ్వ మాలికలు 1.అలుకలకీ.... కులుకెక్కువయింది..! నీ సరసన వాటికీ చోటిచ్చినందుకు.!! 2.పగలే వెన్నెల కాయడమంటే ఇదే...! నువ్వు నా ముందు సాక్షాత్కరించావుగా..!! 3.నీ శరీరం చావును జయించాలంటే.... అవయవదానం చెయ్యి, తిరిగి ప్రాణం పొయ్యి.!! 4.వన్నెల వాగువే వలపుల పొంగిస్తూ 5.మతి తప్పిన మనసు గతితప్పిన కలలతో 6.నీరాకతో మదికి జాతరొచ్చింది..! వినపడడం లేదా....కొట్టుకుంటున్న హృదయస్పందనల డప్పు చప్పుడు..!! 7.మల్లెల మాలికవే...! సుగంధాల కవితాక్షరాలను నాహృదయఫలకంపై వెదజల్లుతూ.!! 8.కలలు కరుస్తున్నాయి..! నువ్వేమైనా ఉసిగొల్పావా? 9.నీ బిడియానికెన్ని భావాలో.. ఇష్టమో,కష్టమో అర్థం కాక నా మదిని తికమకపెడుతూ.! 10.నీ జ్ఞాపకాలు కమ్మేసాయి మనసంతా... తనువంతా ఆనందపు జడివాన కురిపిస్తూ.! 11.స్మశానవాసినే...! జీవంలేని ఆశల మద్య జీవించేస్తూ..!! 12.రెండు సుడులున్నాయి..! ఒక్క పెళ్ళైనా కావట్లేదింకా ఏంటో......! 13.ఊహల ఊరేగింపు.! నీజ్ఞాపకాలకు పట్టంకడుతూ.!! 14.నాగుండె కల్లోలకడలే.! నీజ్ఞాపకాల కెరటాలు నిత్యం హోరెత్తుతుంటే.!! 15.సాగుతూనే ఉంటుంది కాలం.! కాలంతీరిన వారిని సాగనంపుతూ..!! 16.వారాలబ్బాయ్ చంద్రుడు..! సగంరోజులు వెన్నెలింట్లో, మిగతాసగం అమాసింట్లో.!! 17.చీకటిని హత్య చేసొచ్చాడు సూరీడు..! చూడు నెత్తుటి కత్తుల కిరణాలతో,ఒళ్ళంతా రుధిరంతో ఎలా ఎర్రబడ్డాడో..!! 18.నాఊహలకు అక్షరాలు కరువయ్యాయి..! చిత్రం....మదిపుస్తక పుటలన్నీ అమాంతం నిండిపోయాయి నీజ్ఞాపకంతో.!! 19.కళ్ళ పొలిమేర దాటని కలలు... ఎక్కడ పుట్టాయో అక్కడే సమాధవుతూ.!! 20.చీకటి చేలో చుక్కల వానజల్లులు కురిసాయి.! మొలకెత్తిన వెలుగులకు చంద్రుడు కాపలాదారు.!! 21.ఆమె ఒక పాలకడలి..! తన జీవితాన్ని మదించి అమృతమంటి ప్రేమ పంచుతుంది.!! 22.నా సహచరిణిది ద్విపాత్రాభినయం..! గారాలు పోవడంలో ప్రేయసిగా, గారంగా చూసుకోవడంలో అమ్మగా.!! 23.ఓర్చుకోవడం ఏ గురువు వద్ద నేర్చుకుందో...! గుండెల్లో అగ్నిపర్వతం బ్రద్దలవుతున్నా చలించదు స్త్రీ. విశ్వనాథ్ 05APR14

by Viswanath Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jgMTDL

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || మనసులు || ====================== మనసులు అలసి పోయాయి మనుషుల మధ్య ఇమడలేక మధ్యంతరంగా సొమ్మసిల్లిపొయాయి అంతరంగాలు సుడులు తిరుగుతుంటే గుండె కుంపట్ల మధ్య సేద తీరలేక మనసులు పొగలు కక్కుతున్నాయి నలిగిపోయే పాదాలచెంత అరిగిపోయే మనసులు నిత్యం క్షోభకు గురవుతూ ఆవేదనతో అలసిపోయాయి గుప్పెడంత మనసులో ఆకాశమంత కష్టాలు తరిమే మబ్బుల్లా- ఉరిమే ఉరుముల్లా వెంటాడే మెరుపుల్లా వేటాడుతున్నాయి పరిగెట్టలేని మనసు తరాల మధ్య అలసిపోయింది రెండు హృదయాల మధ్య మనో వేదనతో గతి తప్పింది గత గాయాలు గుణ పాఠాలైతే నిత్య అన్వేషణలో నిత్యం గాయాలై అలసిన మనసు రక్తం కక్కుతుంది నవ్వుతున్న మనసు ఇప్పుడు ముఖిలిస్తుంది మనిషి మాత్రం నవ్వుతున్నాడు ఇద్దరి మధ్య అవాంతరాలు కళ్ళల్లో రక్త చారలై కనపడుతున్నాయి పగిలిన హృదయాల మధ్య ముక్కలైన మనసుల మధ్య మది ని మేల్కొలుపుతూ హృదిని రగిలిస్తూ మనసు గాయానికి లేపనం కోసం అన్వేషిస్తున్నా ! ================= ఏప్రిల్ 05/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dY8eTB

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dY8cv9

Posted by Katta

Ro Hith కవిత

Saturday English Poem- Hunger/ Ro Hith Hunger: is a burning hut in violent rain. is a deserted highway lit by streetlights. is the empty room with a living clock. Come close listen to my stomach: A great machine digging the ground A factory with revolving gigantic wheels A slum demolished by diabolic juggernauts All the pages of history rapidly flipped A cuckoo crying in the middle of sleep. Place hand on my tummy and feel: The wall of a fort being battered down The kicks of shapeless infant from inside A divine stream that connects all life forms The sacrifice of a fictious goat to the goddess of hunger.

by Ro Hith



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hfWw7l

Posted by Katta

Murthy Kvvs కవిత

EJ-1 ------- The Dog stays content with orts and offals, Yet,It remains Faithful Sometimes one can't be judged by what he takes in.... ----KVVS MURTHY (5-4-14)

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kbHzoO

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lzsVoN

Posted by Katta

Maheswari Goldy కవిత

LIFE IN THE SHADOWS…. MAHESWARI GOLDY Human minds has always emaciated with erudition they fascinated into outer face…!! In the blossoms of the plant every leaf really penetrates into soil…!! Similarly human body perforating striate edges throughout the universe yet getting brighter than requirements…!! Because human willing to lives in eternity's sunrise before that darkness consumes them…!! It devours them like a victim No one can escape that shadow…!! This is ultimate image of lives in the universe it slowly connects With the natural wings of superficial powers finally...!!

by Maheswari Goldy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hNcZyE

Posted by Katta

Kapila Ramkumar కవిత

భవానీ ఫణి ||కోపం||| కోపం ఉంచవచ్చు కానీ అది అద్దం మీంచి జారిపోయే నీటి బిందువులా ఉండాలి తప్ప తారాజువ్వని అంటించే నిప్పురవ్వలా కాదు కాలువలో పరవళ్ళు తొక్కే కొత్తనీరులా ఉండాలి తప్ప భూకంపం తర్వాత వచ్చే సునామీ లా కాదు పులిహోరలో కలిసి మెత్తబడిపోయే పోపులా ఉండాలి తప్ప అన్నంలోనో, పప్పులోనో నక్కి పంటికింద పడే తెల్లని రాయిలా కాదు గోడకేసి కొట్టిన రబ్బరు బంతిలా ఉండాలి తప్ప లక్ష్యాన్ని తునాతునకలు చేసే బాణపు మొనలా ఉండకూడదు శీతాకాలపు పలుచని ఎండలా చురుక్కుమనిపించాలి తప్ప వడదెబ్బతో నిర్జీవం చేసే గ్రీష్మ ప్రతాపంలా ఉండకూడదు దువ్వెనని ఇబ్బందిపెట్టే గిరజాల జుట్టు చిక్కులా ఉండాలి తప్ప ఎంతకీ విడదియ్యలేని చిక్కుముడిలా ఉండకూడదు కోపం అనేది మన మనసుకి తగిలిన గాయాన్ని మాన్పేటందుకు బహిర్గతమవ్వాలి తప్ప దావానలంలా వ్యాపించి మనతో పాటు పక్కవారిని కూడా మాడ్చి మసి చెయ్యకూడదు 9441555402 !!!http://ift.tt/PcN8pe

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PcN8pe

Posted by Katta

Krishna Kumari Kali కవిత

II ఆవిర్భావం II పుట్టినప్పుడు వెంట తెచ్చిన వాడెవ్వడు ? పోయేటప్పుడు వెంట తీసుకుపోయే వాడెవ్వడు? వచ్చేటప్పుడు తీసుకొస్తారు పాపపుణ్యాల మూట! పోయేటప్పుడు వెంట కొనిపోతారు సంచిత కర్మల సంచి! లక్షాధికారైనా లవణమన్నదే కాక కోట్లకు పడగెత్తినా వరి గోధుమ తిండి గాక మెరుగు బంగారం మింగగలడా? జానెడు పొట్టకు చారెడు గంజి నీళ్ళకోసం పాపాల పుట్టలు పెంచుకోవాలా? కరిగించు కొనేందుకు కోటి జన్మలెత్తాలా? - కాళి >04MAR2014

by Krishna Kumari Kali



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oA6GUe

Posted by Katta

Kapila Ramkumar కవిత

A Journey Of A Poet A journey begins with A thought in our mind Words are chosen and formed. Lines of poem Well Written with meanings With words of emotions and expressions A poet starts with An inspiration of mind, An aspiration in soul mind With reflection On our life experience We start to Compose some Wonderful poetry Expressing our innermost thoughts With deep contemplation To put them in poetry words A journey begins when A poet takes his imagination To a place where No one ever dream or imagine before. A poet's journey ends by Writing another lovely poem And deep reflection A poet remains As a poet When he or she Continue to Write and Share lovely poems with the world. '' Lawrence CH Hiun ''.. 5.4.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oA6G6S

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

నల్ల మిరియాలు...!?..5.4.14. 1.అభ్యర్థుల నోటి నుంచి భారీ డైలాగులు ఎన్నికలయినాక ప్రజల నీట ముంచె వాగులు. 2.ఎన్నికలప్పుడు చల్లిన నోట్ల కట్టలన్నీ పొందుతాడు"నేత"పదవి పొలం గట్లు దున్ని. 3.అభ్యర్థుల బొమ్మ వెనుక రాజకీయ గోత్రాలు గ్రహించవోయ్ ఓటరన్న ఎన్నికలవి"చిత్రా"లు.

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PBM8uG

Posted by Katta

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి || అన్నదాతకు వందనం !! || నీ కండల్ని చీల్చుకుని వచ్చిన స్వేద బింధువు పంటకి ప్రాణం పోస్తుంది ...! దివారాత్రులు నీ దేహం, ప్రాణం, ఆశ, ఆశయం అన్నీ మాకన్నం పెట్టడానికే !!? మెతుకు మెతుకులో మెరిసే నీ స్వేద నాదాన్ని చూసి నా గుండెల్లో నుండి, నీ పాదాలా వేపు నా పదాలు పొంగుకొస్తునే ఉన్నాయి ..!! అవనిని ఆమని చేస్తూ ...యామినైన నీ జీవనం !! యుగ యుగాలుగా దగా పడుతున్న నీ దగ్ధ జీవనం నవ జగాన నీ కష్టాల ఎడారిలో జడివాన కురవాలి !! రైతే రాజంటూ బొంకే రాక్షస లోకంలో రాజుకైనా ప్రాణ ‘భిక్ష’ పెట్టే రైతే ... రుణాల బాధకి పంట చేలల్లో ప్రాణాలు తీసుకుంటే .... అన్నంలో నుండి ఆర్తనాదం కన్నీటి దారై .... నన్ను దహిస్తూ ..!! ------------------------------ 4 – 4 - 2014

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1je61Cs

Posted by Katta

Kamal Lakshman కవిత

ఈవేళ నా మనసు...... ఆకాశంలో తెలియాడుతున్నట్టు బృందావనం లొ విహరిస్తున్నట్టు గోదారి పరవళ్ళతో పోటీ పడుతున్నట్టు మంచు దిబ్బలపై పడుతూ లేస్తూ స.. రి.. గ.. మ లతో కూనిరాగాలు తీస్తూ నీ కోసం పయనిస్తూ.. పయనిస్తూ .. పరుగెత్తి... పరుగెత్తి ...అలసిపోయింది... ఏం లాభం...!!! నా ఊహల ఆవలి తీరం లొ నీవు నీ కలల ఈవలి తీరం లొ నేను...... కమల్ 05.04.2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PuGxXe

Posted by Katta

Chi Chi కవిత

_ పనిలో_ నరాలనవే తెంచుకునేలా నిజం వేట మానేస్తే మిగిలే తృప్తివ్వని నిజంలో అంతా సవ్యమే!! కడుపుమంటలు నిన్ను నువ్వు చూస్కుంటే రావు మరి.. మింగలేనితనంలో నువ్వు కక్కే కన్నీటికి తెలుసు వాటిని తోడిన ఊరి కళ్ళేవో!! బతికున్నోళ్ళలో చావునెతుక్కునే నీ ఉద్వేగపు అసూయానందంలో అంతా భావ్యమే!! నీ చితిమంటలారేలోపు చేరలేని తీరాలేవీ దరికి రావు మరి.. చేరలేనితనంలో నువ్వు కోరే తీరాలకు తెలుసు వాటిని చేరే దార్లేవో!! పరానుగుణమై ఆరాధనకెదురుచూసే లాలస పార్థక్యంలో అంతా దివ్యమే!! నువ్వు తన్నాలనుకునే వారు తప్ప నిన్ను తన్నేవారు లేరు మరి.. తన్నలేనితనంలో నువ్వు కోరే ఆరాధనకు తెలుసు నిన్ను తన్నేదెవరో!! రేపు నేడవుతుందో , నేడు నిన్నవుతుందో తెలియని దుర్లభంలో అంతా నవ్యమే!! నువ్వు తృప్తిని పీల్చే వరకు ఆగమనే క్షణాలు లేవు మరి.. ఆగలేనితనంలో నువ్వు పీల్చని తృప్తికి తెలుసు అసలు తృప్తే లేని పనిలో క్షణమే లేని నువ్వెవరో!!________(4/5/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qbQtBY

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

వేసవి విడిది రావెలపురుషోత్తమరావు ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ దప్పికతో ఆర్చుకుపోతున్న గొంతుకలు వడదెబ్బకు రాలిపడుతున్న పండుటాకులు నీరంటూ ప్రహింపనోపని కుంటలూ, వాగులూ, కాలువలు కరెంట్ రాకను చెప్పలేకపోతున్న కాలఘంటికల పంచాంగాలు తొలకరిజల్లులకోసం చేలగట్లమీదనే నిద్రపొతున్న వ్యవసాయం వేడిని తట్టుకునే సత్తువలేక మట్ట్టికుండల వైపు దీనంగా చూస్తూ ఆరుబయట చొక్కలిప్పుకుని విసనకర్రలుగా వాడుకుంటున్న పల్లెజనం. నోరూరించే బంగినపల్లి మామిడి పళు,రసాలూ కొబ్బరి బోండాలూ చిటారుకొమ్మ మీదనుంచి బుట్త్టకెక్కిన చింతచిగురు రాత్రంతటినీ రసరాజ్యం చేసుకోండని నవ్వులతో సత్కరించే మల్లెలూ సంపెంగలూ సన్నజాజులూ రాత్రుళ్ళూ పగళ్ళూ నిద్రలేకుండా ని శాచరుల్లా వెంటపడి బతిమాలే నేతల అనుచరగణం ఇదేమి క్షోపరా అనుకుంటూ ఉస్సురనుకుంటూ రుతువునీడేరుస్తున్న గ్రీష్మ కోపతాపాలు. o4-o4-2014

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i5ikxB

Posted by Katta

Sri Gajula కవిత

జయనామారంభం//గాజుల శ్రీధర్// 9849719609 మేనిఫెస్టోల మడతపేచీ పంచాంగాలు శ్రవణానందాల్ని పంచుతున్నాయి పంచేంద్రియాల్ని మూసుకుని మూసి ఒడ్డున సామూహిక శీర్సాసనాల్ని వేద్దాం! -05/04/2014

by Sri Gajula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fJYiM0

Posted by Katta

Rama Krishna కవిత

రెడ్డి రామకృష్ణ//పిల్లలు- మల్లె మొగ్గలు// తరగతి గదిలో పిల్లలు చదువుల చెట్టుకు నిండా తొడిగిన మల్లె మొగ్గలు పగలు రాత్రను భేదం లేదు బెల్లు మోగితే చాలు వరండాలోనే విచ్చుకుంటారు 05/04/2014

by Rama Krishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qb5rIr

Posted by Katta

Radha Manduva కవిత

ఎలా రాయడం? రాధ రాజశేఖర్ ________________________________ లోకాన్ని మరమ్మత్తు చేసే మిషతో కథలు, కవితలు, కవిత్వాలు వాటిల్లో నీతి సూక్తులూ రాసి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలిట. రాస్తుంటే లోపల ఎక్కడో - ఫీబుల్ గా 'నేను' చేసే విమర్శ వినిపించదూ - 'నిన్ను చూసుకోవాయ్' అంటూ!!? వందల వేల సూక్తులు రాసో దానికి విరుద్ధంగా విశృంఖలతలను ప్రోత్సహిస్తూ రాసో ఏం బాపుకుంటాం? - సెల్ఫ్ ఎంక్వయిరీ లేకుండా! మనిషిలోని గందరగోళాలూ సమాలోచనలూ సర్దుబాట్లూ కల్లోలాలు - ఇవన్నీ కళలో ప్రతిఫలించాలనే ప్రయత్నం చాలదూ! నియమాలనీ, ప్రయోజనాలనీ ఇరికిస్తూ ఏదో ఫార్మల్ సైకిల్ లాగా ఎలా రాయడం? రాయకపోతే ఏమవుతుంది? ఏమవుతుందో తేల్చుకో...... చూశారా... 'తేల్చుకోవాలిట' ఇది తేల్చుకో అది తేల్చుకో అంటూ ప్రతి విషయానికీ ఏదో 'ముగింపు' ఉంటుందనీ దాన్ని తెలుసుకోవాలని - ఏమిటిది? వెర్రి ప్రయత్నం అసలు దేనికైనా 'అంతం' ఉంటుందా? పోనీ 'ఆరంభం' ఉంటుందా? 'అది' తెలుసుకోవాలి - తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక కలగాలి కలిగిన తర్వాత 'అది' అంత గాఢంగా నిలిచి ఉండాలి. అప్పుడు రాయాలి - ఆ స్థితిలో రాయాలి రాయడాన్నే కర్మణ్యజీవితంగా చేసుకుని రాయాలి. ******

by Radha Manduva



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Oj0jnB

Posted by Katta

Buchi Reddy కవిత

4-4-2014 ****************మేరా భారత్ మహా న్ ??????????????********************* 60 ఏళ్ల స్వాతంత్రం లో జెండాలు మారుతున్నాయి అజెండా లో --పేధరికం-- సమానత్వం లో మార్పు లేక మార్పు రాక ఉన్నొళ్ళు-- ఇంకా ఉన్నొళ్ళు గా లెనొళ్లు--- ఇంకా లెనొళ్లుగా మారుతూ-- దేశ సంపద ౦ తా కొద్దిమంధీ ఉన్నొల్ల స్వంతమవుతూ--- నామకే వాస్తే---మన ధీ అతి పెద్ద ప్రజాసామ్య దేశం ?? సో షా లిస్ట్ సెక్యులర్ రాజ్యం అని రాజ్యాంగం లో రాసుకున్నా అంధ రూ సమానులే అని పాడుకున్నా స్వేచ్ఛ -- స్వాతంత్రం-- ప్రజా సామ్యం- చేతల్లో ఆచరణలో మాటలు--పాటల వరకే పరిమితం మై సో షా లిజం ఆధునికత అబివృద్ది సమా నత్వం--- అన్ని ని నాధాలే పార్ట్ లు మారినా ప్రబుత్వాలు మారినా మార్పు లే ధు దోపిడీ--అవనీతి అనేవి ఈ కుళ్ళు వ్యవస్థలో అంతర్భాగ మై పోయాయి బడుగు జీవుల బ్రతుకు భారం ధూర్భరం అవుతూ--- ధరల పెరుగు ధ ల కొనుగోలు శక్తి లేక స్థోమత లేక తల్ళడిల్ళుతూ సగం కడుపు తో చి టి క న వేలు సంపాధన మూరెడు కర్చు ???? అచ్ఛా ఘర్ అచ్ఛా క ప డా అచ్ఛా ఖానా-- లేక--- లోపించి బతుకుతూ--- నీటికి కరువు విధ్యుత్తు కు కరువు పనికి కరువు బట్ట కు కరువు గింజ ల కు కరువు డబ్బు కు కరువు--- సామాన్యుని బతుకంతా కరువుల మయం ఏమీ లేని తనం తో ఏమీ మిగిలని తనం తో భాధ ల మురికి కష్టాల మురికి కన్నీటి మురికి--- పేరుకపోయి బతుకు మూటను మోసుకుంటూ త ల్ల డ- మల్ల డ మై తపిస్తూ--- రోజు దేవులా ట రోజు ప్రాకులాట రోజు గింజులాట ???? ఎన్నా ళ్ళు ??? ఎన్ని ఏళ్లు ??? దేనికి ????? ఎంధుకు ??? స్వరాజ్యం వచ్చి ఇంతకాల మయనా కరువు ను కరువు గా నే ఉంచుతున్న అన్ని రంగుల జెండాల పాలకులు???? ఇపుడు మిగిలింధీ పేధరికం--- భాధ లు కన్నీళ్ళు--- మోసం ధౌ ర్జన్య ౦---క ప ట త్వం--హింస బియ్యం కోసం --- క్యూ పాల కోసం ---క్యూ కిరోసిన్ కోసం--క్యూ ఉల్లి గడ్డ ల కోసం---క్యూ--- సామాన్యుని బతుకంతా ---క్యూ ల తోనే గడిచిపోతుంధీ జన జీవిత సమస్యల ను పట్టీం చూకోకుండా స్వార్థం తో వారసత్వాలతో ఏళ్లతరబడి రాజరికం--- ఆధిపత్యం కొన్ని కు టూ౦ బాల కె కొన్ని కులాలకే పరిమితం మై ఏధి మార్పు ఎన్నడు మార్పు--- ఇంకేతకాలం ????? ఆకలితో కన్నీళ్ళ తో పేధరికం తో బతుకంతా చిల్లుల తో బాధ ప డే ప్రజలకు--- కారణాల తోరణాలు అవసరం లే ధు జీవితాలు -- మోయా లేనంత బ రూ వై చిక్కుముడుల్లో చిక్కుకొని-- వి డి వ డ లేక ఊపిరాడక--- జింధ గీ కి కధ రు లేని ఈ ధునియా లో మార్పు అవసరం మార్పుకావాలి ఈ బూజు పట్టిన వ్యవస్థ ను కూల ధోయాలి సమ సమాజ స్థాపన రావాలి--కావాలి ఆ రోజు రావాలి అధె మన --ఆశ అధె మన --గమ్యం అదే మన--- ఆ శయం బలవంతుల ధౌ ర్జ న్యాలు ధనవంతుల పన్నాగాలు** ఇంకానా?? ఇక పై చెల్లవు ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఒక జాతి ని వేరోక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ???? ఇక పై సాగ ధు***శ్రీ శ్రీ గారి ని తలుచు కుంటూ--- టి .వి లో పాట***మేరా భారత్ మహా న్ అంటూ ****వింటూ ------------------------------------------------- బుచ్చి రెడ్డి గంగుల

by Buchi Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k8HlPs

Posted by Katta

Padma Rani కవిత

!!నా గడియలు!! ఏమైనాయి ఆ రేయింబగలు కాపుకాసిన గడియలు జీవితాన్నే తృంచి పంచిచ్చిన నావి కాని నా క్షణాలు నా వంతు నిద్రదోచిన నీనవ్వు చూసిన నా నవ్వులు నా నోటికి కాక నీ నోటికి అందించిన అన్నం ముద్దలు నా సుఖమంటే నీవంటూ నిర్వచించిన ఆ గురుతులు ఏదేమైనా నాకొద్దు గతించిన ముసలిస్మృతి దొంతరలు ఇచ్చిచూడు గుప్పెడు నాగుండెకు నీ ప్రేమానురాగాలు తలచుకో కూడి నలుగురితో నిన్ను చెక్కిన నా చేతులు ఇలాగైనా తనివి తీరనీ జీవితపు నా అంతిమ గడియలు 05-4-14

by Padma Rani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jLpfQK

Posted by Katta

Srinivas Vasudev కవిత

ఈ వారం వింగ్డ్ వర్డ్ ని Jayashree Naidu గారు ప్రెజెంట్ చేస్తున్నారు. జీవితం నిస్సారం అనే సత్యాన్ని కవయిత్రి కమలాదాస్ ఓ కవిత ద్వారా ప్రపంచానికి తెలియజేసే పనే ఈ కవిత Dance of Eunuchs. ఆమె కవితల్లో చాలా పాప్యులర్ ఐన కవిత ఇది. జీవితపు నిస్సారానికి శారీరక నిస్తేజానికీ పెద్ద తేడాలేదని చెప్పే కవిత. ఆ విషయం చెప్పటానికి ఆమె హిజ్రాలని కవితా వస్తువుగా వాడి ఓ గొప్ప కవితని ప్రపంచానికందించారు. ఆ కవిత గురించి జయశ్రీ నాయుడు గారు ఏమంటున్నారో చూద్దాం. అలానే ఆ కవితనీ... 1984 లొ మొట్ట మొదటగా ఒక భారతీయ కవయిత్రి నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ చెయ్యబడింది. ఒక విస్తృత సాహితీ పయనాన్ని, జీవితానుభవాల్నీ కథలూ కవితలుగా వ్యక్తీకరించి భారతీయ ఆంగ్ల సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది. ఆమెనే కేరళలోని త్రిస్సూర్ లో పుట్టి డెబ్భై అయిదేళ్ళ పూర్ణ జీవితానుభవాల్ని విస్తృత సహిత్య అంశాలుగా వెలువరించిన మళయాళ కథా రచయిత్రి, ఆంగ్ల కవయిత్రి కమలా దాస్. కథల్లోనూ కవితల్లోనూ సామాజిక వర్గంగా స్త్రీలకు ఎదురయ్యే శారీరిక మానసిక భావ సంఘర్షణలు అతి సహజంగా వెలువరించిన ఆమె రచనలకు అప్పటి పాఠక లోకం కొంత ఉలిక్కి పడినా సంబాళించుకుని ఆమె అభివ్యక్తిని అభినందించింది. టైం మాగజైన్ చేత "ఆధునిక ఆంగ్ల భారతీయ కవిత్వానికి మాతృ"సమానురాలిగా (mother of modern English Indian Poetry) ఆమె రచనల్లో The Dance of The Eunuchs అన్నది ఒక విభిన్నమైన రచన. కవిత ఆసాంతం ఒక పాటలా సాగి పోతుంది. మండుటెండలో ఆ నపుంసకులు చేసే నృత్యం లో వారి అలంకరణలోని ధగ ధగలూ, తలలోని పూల సుగంధాలూ, పెదవుల మీద మెరిసే నవ్వులున్నా, వాటి వెనుక వారి విషాద నైరశ్యపు జీవితపు లోతుల్ని కూడా స్పష్టంగా వర్ణిస్తుంది కవయిత్రి....... The Dance of the Eunuchs ------------------------------------ It was hot, so hot, before the eunuchs came To dance, wide skirts going round and round, cymbals Richly clashing, and anklets jingling, jingling Jingling... Beneath the fiery gulmohur, with Long braids flying, dark eyes flashing, they danced and They dance, oh, they danced till they bled... There were green Tattoos on their cheeks, jasmines in their hair, some Were dark and some were almost fair. Their voices Were harsh, their songs melancholy; they sang of Lovers dying and or children left unborn.... Some beat their drums; others beat their sorry breasts And wailed, and writhed in vacant ecstasy. They Were thin in limbs and dry; like half-burnt logs from Funeral pyres, a drought and a rottenness Were in each of them. Even the crows were so Silent on trees, and the children wide-eyed, still; All were watching these poor creatures' convulsions The sky crackled then, thunder came, and lightning And rain, a meagre rain that smelt of dust in Attics and the urine of lizards and mice.... [From Summer in Calcutta]

by Srinivas Vasudev



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q8usUD

Posted by Katta