పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Chi Chi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Chi Chi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, జూన్ 2014, మంగళవారం

Chi Chi కవిత

_స్వాధీనం_ ఇంతవరకేమీ ఆలోచించనట్టు మాటంటే ఏంటో తెలీనట్టు చర్యప్రతిచర్యల అవగాహనా శూన్యమేదో నిత్యం ఆవహించుకుని కారణలేమితో కల్పించుకున్న సముపార్జనకు విడుదలగా పట్టుకుంటే.. పట్టుకునే ఉందది!! దాని పట్టునొదిలి సాగుతున్నదంతా కారణమనుకునే కల్పితంలో ఆలోచనలే మాటలే చర్యప్రతిచర్యలే కార్యాలే అవగాహనగా!! అద్భుతం శూన్యానికి సర్వానికి మధ్య అవగాహనో ఆలోచనో నిలిస్తే చెరిగిపోతోందదే నిత్యంగా అవగాహనో ఆలోచనో.. కల్పితమూ సత్యమై స్వాధీనం మిగులుతూ!!_________(24/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pbPipu

Posted by Katta

16, జూన్ 2014, సోమవారం

Chi Chi కవిత

_ఆవాహన_ ఇక్కడే ఆగిపో భయమొద్దనుకుంటే!! భయపడాలనుంటే సరిపడా దూరం పో!! భయమే రాకుంటే నువ్విక్కడున్నట్టే.. భయమే లేదనుకుంటే నువ్వున్నా లేకున్నా ఒక్కటే!! పిలుస్తున్నాయి విను.. అవి ప్రేమో కామమో కన్న పేగు కూతలు కావు!! కళ్ళు లోడలేని మట్టిని చూపు తోడేసి వెళ్తే అణువులయ్యుండే భూగర్భాంతర్యాలు!! సమయాన్ని తాకద్దు.. సరి సూటి మార్గమొకటే ఆవిర్భావాల మూలమొకటే నిత్య ప్రక్రియం స్వయంభూ దేహం!! లింగ విభజనమే ఉత్తర దక్షిణ దృవం క్షేత్రగుండ విసర్జనం స్త్రీత్వం పురుషత్వం!! వినిపించాయా మూలాలు ప్రత్యక్షానుభూతిలో ప్రమేయలేమిలో పలకరిస్తున్న జన్మలు.. అవి ఖండాలన్నిట్లో చిగురిస్తున్న మొదళ్ళు .. అవకాశ మొహానికి ఇంకా లొంగని చలనాలు నువ్వనుకునే మనుషులే వాళ్ళు నిన్నేమనుకోని నీ వాళ్ళు.. మొహం చెందితే మనుషులైపోతారు.. లేదంటే మరుగునే పోతారు!! భయం వారి గురించి కాదు నువ్వు కూడా అటువంటొక్కణువేనని అర్దమైతే కలిగే నివ్వెర గురించి!!

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lsCbry

Posted by Katta

15, జూన్ 2014, ఆదివారం

Chi Chi కవిత

_పాట పాట_ మోగుతూనే ఉన్నాయ్ గుండె గంటలు.. కావాలనీ వద్దనీ !! ఒరవడులెన్నో ఊహల నిజంలో.. నిజంలో ఊపిరికందని ఉనుకుల్లో!! ప్రమాదవశాత్తుల్లో ప్రయాణం పాటలా!! శృతులన్నీ రసపట్టి అర్థం పుట్టని రాగాలలో శ్రావ్యతను హత్య చేసి గుండెలోకి పారిపోతుంటే వద్దని మోగింది గుండె.. పాట పైకొచ్చేసింది!! ఇప్పుడీ పాట అర్థం వెతుక్కుంటోంది శృతుల్లో..రాగాల్లో..అర్థాల్లో !! గుండెకి గంటలు బారమవుతుంటే పాటకో పాట గుర్తొచ్చింది.. కావాలనీ వద్దనీ!! తన పాటే పాడుతున్న పాటను చూసి కావాలని మోగింది గుండె.. బారం పంచుకున్న పాటని గుండెలో పెట్ట్టుకున్నాక అర్థం పుట్టింది రాగానికి!! ప్రయాణం కావాలని ఉనుకులొద్దని.. పాటాడుతోంది ఊపిరిలా!! ___________________________(15/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1loyDq9

Posted by Katta

Chi Chi కవిత

_GamblE_ పాము తల్లో వజ్రం కాసినా కోరల్లో విషం పోదు పాపం పాము కోపమొస్తే అన్నీ కరుస్తాయ్ దాని కెమిస్ట్రీ అలా ఏడ్చింది.. మన కరెన్సీ లా!! పెంటలకీ బొచ్చుకీ కూడా పందాలు ప్రాణమ్మీదకొచ్చే పౌరుషాలు పాములే మేలు!! రహదారుల్లో రహస్యాలుండవ్ లావాదేవులుండవ్ రవాణాలే!! రహస్యాలకు దార్లే ఉండవ్ లాభనష్టాలే కలుస్తాయ్ రాజీలే.. తీగెక్కడో తెలిసేవరకు!! భేరాలు కుదరకపోతేనే డొంక కదిలేది.. కలయికలవేగా మరి.. డొంకతిరుగుళ్లో బయలయ్యే బంధాలు సరఫరాల ఫలాలు లాభాల రాజీలు నష్టాల మాజీలు వాళ్ళూ వీళ్ళూ!! ______________________________(15/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SKysin

Posted by Katta

13, జూన్ 2014, శుక్రవారం

Chi Chi కవిత

_నరం_ గాలెక్కింది బుడ్డలో ఊదకుండా!! బొమ్మకు తెలీదు అద్దంలో బుడ్డలో ఏముందో.. బొమ్మననుకున్న బుడ్డకి అద్దం తెలీదు!! ఎగురుతోందది బొమ్మెటు తోస్తే అటు గాలికి తెలీకుండా బుడ్డ పగలకుండా!! బొమ్మను కాదు..బొమ్మను కూడా నీడ చెప్పింది..నీడని కూడా గాలి పెరిగింది బుడ్డనుకుంటే!! పెరుగుతూనే ఉంది గాలనకుంటే.. గాలికే వదిలేశాక బుడ్డ పగిలింది!! గాలుంది గాలిననుకోకుండా బొమ్మలేకుండా!! _________________(14/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mS9ohr

Posted by Katta

Chi Chi కవిత

_వనిత_ నువ్విష్టం నువ్వుగావుంటే నిన్నొదలని లోకం నీ చుట్టే కాపు కాస్తావని కాయలిస్తావని చూపునిలిపే చూపు చూస్తావని!! ప్రకృతే నీకు పరిచారికై ప్రస్థానమిచ్చింది పరువాలకు.. ప్రాణాన్ని మరిపించు ప్రణయాలతో మౌనమూ మొహమై మనసు కట్టేసి మాట లేకుండా మాయకొడతావు.. మనువు ముసుగని కూడా తెలుసు నీకు!! ప్రాణం పోస్తావ్ గింజకు తల్లనుకోకు!! గింజలెవరివైనా పూస్తావ్ మానభయం నీకు!! లెక్క తప్పని స్వేచ్చతో గూడెతికి కొలువుకున్నా నిక్కపొడవలేవు నీ మీదకు నిజమొస్తే !! పలాన కాని పడుచుకి ప్రపంచమే చులకన .. పడకేసే పనిలోనే పరిచయాల ప్రకటన!! నాటకమే పతి పత్ని నాటకమే మాతృమూర్తి నాటకమే పడుపు వృత్తి నిజమొకటే నీకు నీవు ఎవరికెవరు ఏమవ్వరు.. నువ్విష్టం నువ్వుగా ఉంటే నీ కష్టం ఉండనివ్వదని తెలుసు నాకు.. నాటకాలు నాకెందుకు నేను ప్రకృతికి పరిచారకున్ని పురుషున్ని!!_____________(13/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pQTO9K

Posted by Katta

12, జూన్ 2014, గురువారం

Chi Chi కవిత

_మెతుకు_ ఇల్లొదిలేది ఇంటికోసమే విల్లొదిలే బాణంలా!! సందులు గొందులు ఎత్తుపల్లాలు వింతలు విద్యలు చుట్టూ బాణాలతో గురులు తప్పకుండా చేదించేది గుప్పెట్లో మెతుకులేసే యుద్దాన్నే.. బాణాలు బాణాలకు రాస్కుంటే రాలే మెతుకులు కూడా బాణాలకే.. విల్లు మళ్ళీ పిలుస్తుంది ఇల్లొక విచిత్రం!! యుద్ధం సందిస్తుందిప్పుడు ఇళ్ళమీదకి ఇదింకా విచిత్రం!! ఇళ్ళకి యుద్దానికి మద్య యుద్దంలో మెతుకుని గెలుస్తూ ఉంటేనే బాణానికి విల్లు ఇరువైపులా!! లేదంటే యుద్దాలుండవ్ ముద్దలుండవ్ ఇళ్లుండవ్ బాణాలుండవ్!! _____________________________(12/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qxHdIr

Posted by Katta

Chi Chi కవిత

_పెళ్లి _ అంతవరకూ లేని స్పృహ!! పక్కనే ఉండే జీవితం ఒక మనిషిలో ఒక మనిషితో.. ప్రపంచానికో సాక్ష్యంగా ఇద్దరినీ బందించే విడుదల!! ఒకరికి రెండు మనసులవుతాయ్ అవ్వాలి!! అదో వీడ్కోలు ఎన్నో విప్పలేని ముడులకి.. అదో స్తిరత్వం ఎన్నో గోచరించని గమ్యాలకి.. అదో సమాదానం ఎన్నో సందేహాల మర్మానికి.. అదో అర్థం ఎన్నో అనర్థాల ప్రశ్నలకి!! హక్కు రెండు దేహాలకి .. దిక్కు మనిషి మానానికి.. జోకు పెటాకులకి.. సాకు విడాకులకి!!____(11/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pkN85W

Posted by Katta

10, జూన్ 2014, మంగళవారం

Chi Chi కవిత

_O_ ఇసుకను లెక్కేస్కుంటున్నాడాడు ఒక్కో రేణువు ఒక్కో జీవితంగా!! లెక్కేసి వెనక కుప్పేస్కున్న ఇసుక జీవిస్తోందింకా.. సముద్రాలన్నిటినీ అలా తీరాలతో పూడ్చేశాక అంతా ఒక తీరమై లెక్క ముగిసింది మొదటి రేణువు దగ్గర!! ఒకటి తోనే ముగిసిన లెక్కను చూసి విసుగుతో వెనక్కు తిరిగి చూస్తే సముద్రాల్లేవ్!! ఇన్ని తీరాలు దాటినా సముద్రం రాలేదని మళ్ళీ మొదటి రేణువుతో లెక్క మొదలు!! సముద్రమే వాడు చేరాల్సిన తీరం.. ఎదురొచ్చాక పూడ్చడానికే వాడి ఈ తాపత్రయం!!_______(10/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kWdRUz

Posted by Katta

9, జూన్ 2014, సోమవారం

Chi Chi కవిత

_సావుగిరాకి_ ప్రాణవ్యాప్తి మితమే పదార్థసమ్మిళితమై.. అవతలేమ్లేదు!! మితానుభవాలలో అనుభవసఖ్యం కాని ఆవలను ప్రతిభింభించే తత్త్వం వలన ఒరిగేదేదున్నా లేకున్నా దేహానుభవాలకి తర్కం నశిస్తుంది ప్రాణం మిగులుతుంది అవతలేమ్లేదు!!________(10/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mwcvLQ

Posted by Katta

7, జూన్ 2014, శనివారం

Chi Chi కవిత

_ClimaX_ పూల వర్షం అగరొత్తుల గుబాళింపు ముక్కులో పత్తి మళ్ళీ ఊపిరాడకుండా అందర్రుణాలు తీర్చే నాణాల స్పర్శ పక్కతోడేలేరు అంతా కిందే నాకూ ఎగరాలనుంది డప్పుకి కానీ.. జాగ్రత్తరా ఏ రాకెటో మీదొస్తే నడిరోడ్డే నా చితి!! మీడియా వచ్చే స్థాయికి రాకుండానేపోతున్నా.. పోన్లే నేనొదిలినా నన్నొదల్రు హాల్లో వాల్ క్లాక్ పక్కన నా ఫోటో పెట్టమని ఆఖరి sms చేశా ఇంట్లో అందరికీ!! టైం చూసినప్పుడల్లా నన్ను చూడాలి.. చ!! క్లాక్ లోనే పెట్టమనాల్సింది.. పోన్లే రెడ్లైట్ పడితే శవం కూడా ఆగాలా!! ఏంటో పెరట్లో పాతేస్తే పొయ్యెదిగా..పోన్లే రేయ్ మట్టి మాత్రమే వేసి కప్పండి రాల్లేస్తే అవిటి పంజరమైపొతా.. తూ.. నోట్లో రూపాయ్ !!_________(8/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pQhj56

Posted by Katta

Chi Chi కవిత

_GreeD_ స్వతహాగా రారెవరూ కార్యాలయ క్రియలకి.. కర్మ కాదిది జన్మ కారణం లేనిది!! మొలకల మొలకలే అంట్లతో కలవనివే కలుపులు కలిసొచ్చే పంటలకి.. లోడెవరు చూసారని మొలకలింటి లోతుల్ని!! అక్కడంట్లు లేవు పంటలకీ..కలుపులకీ!! ప్రక్రియక్రియలాలయమే పుడమి గర్భ సంభోగం!! ప్రస్తుతమూ కాదిది గతభవితలు లేనిది.. అంట్ల మొలకలకూయలేసి స్వీయాలకు స్వస్తి పలికి కులుకుతున్న వరమాలను సావ దెం.... ఎందుకులే!! అంటులే ఐశ్వర్యం స్వయాకారం స్మశానం మానవీయమే మూడం !! ___________________(7/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TpVo7i

Posted by Katta

6, జూన్ 2014, శుక్రవారం

Chi Chi కవిత

_ComplainT_ కష్టాలు చెట్లకు పుట్లకూ కాక మనుషులకొస్తాయా!! లాక్కెల్లినా పీక్కెల్లినా నొప్పెక్కడానికి మనకేమైనా పళ్ళు కాయలు కాస్తున్నాయా !! మహా మనసుకి నొప్పే మందు తలకు తలపే నొప్పి పుండు లేదు!! కనిపించని గాయాలను కనిపెంచే ప్రమాదాలేగా మనవి.. ఏ చెట్టో వచ్చి చెయ్యో కాలో పీక్కెల్తే కష్టమేంటో తెలిసేడ్చి కళ్ళు తుడిచేస్కోచ్చు!! నొప్పినభియోగించాలంటే నొప్పించాల్సింది మనిషవ్వాల్సిందే గాయం కనిపించినా కనిపించకున్నా మన తత్వమంతే!! చీమో పామో అయితే పగలుండవ్ నొప్పించేది మనిషైతేనే కష్టాలు మనుషులక్కూడా !!____(6/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tO6MFh

Posted by Katta

5, జూన్ 2014, గురువారం

Chi Chi కవిత

_SanE_ మానం మోడుబారిన చోట తోట మొలిచింది పూలిసరడానికి.. తను కాసిన పూలే ..తోటకైతే మొక్కలకే వేరు ప్రతి పువ్వూ !! >ఏమైంది పూలకాట్లు నేలకి గాలొస్తే మొక్కలనొదిలి తోట దాటి గాలికవే పోతుంటే ఈగలిసురుతున్నాయి పూజల్ని పూలకే పూలమీదే !! >ఐతే ఏ ఈగదేపువ్వో ఈగలన్నీ పువ్వుకే..పూలన్నీ ఈగకే తేనెలారిపోయాక పట్టంతా గాలికే !! >మానమేంటి మరి మొక్కలకీ లేదు .. తోటకీ లేదు పూలకీ లేదు.. గాలికీ లేదు ఈగకీ లేదు.. తేనెకీ లేదు > మరెక్కడుంది తోటంతా ఈగలని చోటునొదిలిన మాలిలో!!_____(5/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1owXs75

Posted by Katta

4, జూన్ 2014, బుధవారం

Chi Chi కవిత

_విరుగుడు_ మౌనంతోనే చేరుకోలేనిదాన్ని మాటలతో చేరుకోలేవ్!! యత్నాలన్నీ భ్రమణాలే శూన్యం చుట్టూ.. ఆటుపో ఇటుపో ఎటోపో చుక్కలకొలువులే గీతలైనా రాతలైనా !! ఏమొచ్చింది!! అదో లోపలూరింపు పూరింపు ఇంపంతేగా.. అడ్డమే ఆసరా అడ్డం పేరు మనిషని నీకు తెలీదా !! ఎందుకులే .. లోడుకుంటే పెరుగుతాయ్ మాటలు మౌనం చుట్టూ!! మౌనాన్ని లోడి చూస్తే అదో తర్పణంగా పదార్తమంతా పూడిపోతుంది చీకటి వెలుగుల్లేని ఊబిలో!! ఊబెక్కడో తెలీని శూన్యంలో శూన్యం కూడా తెలీక పుట్టే మొదటి మాటేదవుతుందో !! అది కదా పిలుస్తోంది మాటలన్నిటినీ రమ్మనోసారి వాటమ్మ బాబుల దగ్గరకి కొరివెట్టుకుని.. పొతే పోలా ఒక్కో చుక్కగా !! _________________________________(4/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1na7Faj

Posted by Katta

3, జూన్ 2014, మంగళవారం

Chi Chi కవిత

_RomancE_ కలిసే ఉన్నాయవి కారణమే లేకున్నా!! ఒకటుంటే ఇంకొకటుండదు కానీ రెండూ ఉన్నాయ్ మొదలునంటే ఉన్న చివరిలా మొదలవకుండా ముగియకుండా !! అదో చర్యహీన జ్వాల !! ఆ రెండిటి నడుమా ఆహ్వానించే వీడ్కోలుగా రగులుతూ కలయికొందనివ్వని నిత్య శత్రువు ప్రాణమది!! విరసమే సరసంగా అపరిచయ మిత ప్రేమికులా రెండు బతుకు చావు !!_____________(3/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2KyOI

Posted by Katta

Chi Chi కవిత

_వాదం_ అపవాదెరుగనిదేది !! అమ్మాయ్యలతో మొదలు అందరి వాదవాదం అసలాద్యంతమనటమే నాటకం!! ఇంద్రియించుకున్న దేహజగంలో అర్థమో పీడగా .. భావమో క్రీడగా అవయవాలాకలికి ప్రాణమో చీడగా మండలమే లేని మొండి ప్రత్యక్ష్యంలో తలనుండెన్ని వాదాలు దూకాయో గండికొట్టినట్టు మొండాల్లోకి !! చురుకు చచ్చి మెదళ్ళు ముండమోసాయని గుండెలదురుతుంటే కడుపులు పైకి కక్కుతున్నాయి ఆకలికో వాదాన్ని.. ఎన్నాకల్లో !! తీరాయాంటే లేదు కడుపుల కిందాకలితో అడుక్కోని బిచ్చగాళ్ళని కక్కుతూ గుణించుకునే ఆకల్లతో ధన్యవాదాన్ని అడుక్కోవడం !! ధన్యవాదిస్తే పెరుగుతుందే తప్ప ఏ వాదానికీ ఆకలి తీరదు వాగుడాగదు !!___________(3/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oqWEke

Posted by Katta

2, జూన్ 2014, సోమవారం

Chi Chi కవిత

_సంస్కరణ_ నిలువెత్తు కొలువే సాక్ష్యంగా కొలతలొదిలిన యోచనేదో కొలుస్తోంది చదరాన్ని!! వైపులెన్నైనా చూపొకటిగా లోతులన్నిటినీ చదునుగా రాతలెరుగని చదువుగా !! మలుచుకోమని మనసునేసి వెంబడిస్తూ మనసుతోనే ఉంది లేదుల తర్కమహిమను దాటుకెళ్లే దారికాచి వదిలిపోయాయ్ జంటపక్షులు ఒక్కటై నా నేనుతో!! సాక్షి కూడా కాను ఇప్పుడు సదరమైన ఈ సృష్టిలో మరుపు వరమై స్థితిని మార్చే యోచనెందుకు మనిషిలో ?? ____________________________(2/6/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rCsvEc

Posted by Katta

22, మే 2014, గురువారం

Chi Chi కవిత

_ఇంకా_ మారు..మార్చు మారకు..మార్చు మారు..మార్చకు మారకు..మార్చకు మార్పుంది మార్పులేదు.. మారుతుంది మారదు.. ఇంతే..ఇలానే మారలేరు మారలేదు!! __(22/5/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n3zhyp

Posted by Katta

21, మే 2014, బుధవారం

Chi Chi కవిత

_చోటంతే_ ముందున్నవి ముందరే వెనకున్నవెనకే.. తిరుగుతున్నాయ్ తిప్పుతూ ముందెనకల్లేనివి.. నువ్వాటి ముందో వెనకో తెలియకుండానే తిరుక్కొ!! ఈ గానుగలోపడి మొలుస్తూ పీనుగయ్యాక్కూడా తిరుక్కునే గమనం నీది స్థిరమై అస్తికలుగా!! ఆగమనమే లేని వెలుగుందిక్కడ ఆరిపోకుండా!! తెలుపుకాదు వెలుగంటే చీకటంటే నలుపే రంగుల్లేని వెలుగుతో రంగులన్నిటినీ రంగరించుకోడమే ఈ రంగస్థల బహిర్గత రంకు!! >మరి వెలుగంటే?? రంగస్థలానిది.. రంగులు కానిది ఏం లేని చోటులో వెలుగొందుతున్న వాటన్నిట్లో ఉన్నది..అంతే!! >ఏం లేని చోటా!!.. అంటే?? ఎలా ఉంటుందో చెప్పగల్గితే అదేంలేని చోటెలా అవుతుందిరా.. చచ్చుప్రశ్న చోటంతే!!_______________(21/5/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Si4RNw

Posted by Katta