పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Nvn Chary లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nvn Chary లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, జూన్ 2014, ఆదివారం

Nvn Chary కవిత

ఇలా ఆలోచిద్దాం డా ఎన్.వి.ఎన్.చారి 22-06-2014 పిల్లలకు రెక్క లిచ్కాం వాటిని ఎదగనిచ్చాం ఇక వాటిని ఎగరనిద్దాం మన బాధ్యతల త్రాళ్ళతో బంధించడం కాదు భావ్యం ప్రేమానురాగాల వినీలాకాశంలో స్వేచ్చా విహంగాలు కావాలి వారు వాళ్ళ ఆనందమే కదా మన కళ్ళలో వెలుగులు నింపేది

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1yydhB5

Posted by Katta

21, జూన్ 2014, శనివారం

Nvn Chary కవిత

దృశ్య అనుభవం డా ఎన్.వి.ఎన్.చారి 21-06-2014 వామ హస్తమందు వాగేటి సెల్ఫోను హండి లొక్క చేత నదుము చుండు వాడి వెనుక వామ వలపులొలుకుచుండ ఆక్సిడెంటు నాప నబ్బ తరమె

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pvzTht

Posted by Katta

Nvn Chary కవిత

ప్రదానం డా . ఎన్.వి.ఎన్.చారి 21-06-2014 వరంగల్ ఎంతున్నదనేది కాదు ముఖ్యం దానమెంత చేసావన్నదే ప్రధానం అది జ్ఞానమైనా ,ధనమైనా ఏదైనా .......

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UpkzaN

Posted by Katta

20, జూన్ 2014, శుక్రవారం

Nvn Chary కవిత

మధ్య తరగతి మందహాసం డా . ఎన్.వి.ఎన్.చారి 1990 లో మేం గౌతమి నవ్యసాహితి ,చర్ల ద్వారా తీసిన నవస్వరాలు సంకలనం నుండీ నా కవిత 20-06-2014 ఆకాశం మేఘావృత్తం నా మనస్సు చింతాక్రాంతమ్ గొంతు చించుకొనేడుస్తుంది ఆకాశం గొంతెండి మౌనంగా రోదిస్తోంది నా మానసం ! నెలసరి జీతం దిన వెచ్చాల కమ్ముడు పోగా ఎమ్ప్టీ పర్సు ఏంటీ అని వెక్కిరిస్తోంది డబ్బులేనివాడికి పర్సెందుకన్నట్లు బ్లాక్ మెయిల్ చేస్తోంది ఎప్పుడో జారిపోతానని అందుకే నా హృదయం వ్యధా భరితం ! పక్కింటి పెక్కింటిని చూచి నాలోసగం నాపై అలిగింది పిల్లల వలువలకీ , చదువులకీ ఇంటిలోని గోల్డునంతా తాకట్టు పత్రాలు తినేసాయి ఉన్నొక్క ఇంటిని చూసినప్పుడల్లా మూడో అమ్మాయి పెల్లెప్పుడంటోంది అందు కే నా మది శోకపు నది ! ఈ పండుగలొకటి మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు మా దశమ గ్రహాలిద్దరికీ తిండికే వంద నోటప్పు తెచ్చినవాణ్ణి కానుకలంటే తలెక్కడ తాకట్టుపెట్టనూ అందుకే నామనస్సుకు లేదు ఉషస్సు ఇంటిచుట్టు అప్పులు ఆఫీసులో అప్పులు ఎటుచూసినా అప్పుల కుప్పలు ముళ్ళపూడి అప్పారావుని నేనే నేమో నన్న భ్రాంతి కనిపించిన ప్రతి వాన్నీ తప్పించుకు తిరుగువాన్ని కనిపెంచిన పెద్దలకు తిండిపెట్టలేని అశక్తున్ని అందుకే నాచిత్తం ఒక చింతల పొత్తం ! చావు కూడా నాకు శత్రువే రమ్మంటే దూరంగా పోతోంది అనారోగ్యం మాత్రం భయపడకు నేనున్నానంటోంది అందుకే ఈ మధ్య తరగతి మది అనంత దుర్భర దు:ఖ జలధి

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1if4JdL

Posted by Katta

19, జూన్ 2014, గురువారం

Nvn Chary కవిత

ఏడుపు డా .ఎన్.వి.ఎన్.చారి 19-06-2014 పక్కవాడి పై ఏడుపు సుఖాల శిఖరంనుండి పడదోస్తుంది మన ఏడుపు మనమేడుస్తే మనసు తేలికవుతుంది ఆరోగ్యం ఆశీర్వదిస్తుంది

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UQYMsZ

Posted by Katta

13, జూన్ 2014, శుక్రవారం

Nvn Chary కవిత

పాపం పసివారు (హిమచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విద్యార్థులకు నివాళితో ) - డా.ఎన్.వి.ఎన్.చారి.వరంగల్ 9866610429 నది నాగరికతకు చిహ్నమన్నారు జీవనాధారమన్నారు ఓ నదీ నీవది మరిచావ్ బియాస్ ఇందర్ని కలాస్ చేసావ్ కాపాడేవాడే పాడె కట్టినట్లు ఇంజనీరింగ్ లోనే యువ ఇంజన్లు మాయమయ్యా య్ ఆశా కిరణాలు ఆరిపోయాయ్ వికసించే మొగ్గలు అంతలోనే వాడిపోయాయ్ జలప్రవాహ వేగానికి ఆగమయ్యాయ్ కన్నవారి కన్నులను గంగమ్మను చేసాయ్ అసమర్థ పాలనా వ్యవస్థకు బలయ్యాయ్ ఇసుక మాఫియాల దురాగతాల సాక్షిగా ఇరువది ఐదు ప్రాణాలు హారీ అన్నాయ్ జవాబు లేని ప్రశ్నలు మిగిల్చాయ్ ఓడింది వారు కాదు అస్తవ్యస్థ వ్యవస్థ

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lluI2a

Posted by Katta

1, ఏప్రిల్ 2014, మంగళవారం

Nvn Chary కవిత

డా .ఎన్.వి.న్.చారి 01-04-2014 ఓటరన్న కో మాట 1. ఓటు ఓటు అంటు ఒడుపుగా వస్తారు మాట లెన్నొ జెప్పి మాయ జేయ ఆశ లెన్నొ జూపి అందల మెక్కింత్రు ఒక్క చూపు చూడు ఓట రన్న 2. కాస్టు పేస్టు పూసి కంగారు పెడతారు హార్టు బీటు పెంచి స్మార్టు గాను మతము పేరు జెప్పి మర్యాద జేస్తారు ఒక్క చూపు చూడు ఓట రన్న 3. కొత్త నోట్ల తోడ పుత్తడి తోడను చెత్త కాగితముగ చేతురు నిన్నయ్య డబ్బుకాశ పడక ధక్షున్ని గెలిపెంచు ఒక్క చూపు చూడు ఓట రన్న 4. బ్రాంది బాటిలిచ్చి భ్రాంతిలో ముంచేసి దండు కుందురోట్లు దండి గాను త్రాగి చెడకు మయ్య తత్వంబు తెలుసుకో ఒక్క చూపు చూడు ఓట రన్న 5. చెప్ప నలవి కాని తిప్పలెన్నొ పడుచు మాయ చేతు రయ్య మంత్ర మేసి వారి మాట వినిన పాణిలో చిప్పరా ఒక్క చూపు చూడు ఓట రన్న

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Oa5Exg

Posted by Katta

31, మార్చి 2014, సోమవారం

Nvn Chary కవిత

ఎన్.వి.ఎన్.చారి సహృదయ సంస్కృతిక కార్య దర్శి జయనామ చైత్ర శుద్ధ పాడ్యమి - ఉగాది శుభా కాంక్షలు నవ వర్షమ రారమ్మిక నవ యవనిక నెత్తుచుంటి నవరస స్పూర్తిన్ భవదాకృతిశ్రీ కృతిగా కవనమ్మున కోరుచుంటి! కావుము జగతిన్ "జయ"హో వత్సర రాజమా విమల వాత్సల్యంబు వర్షించుచున్ నియతిన్ తప్పక రమ్మిటన్ కుటిల దుర్నీతిన్నివారింపగన్ దయతో సజ్జన పక్షపాతి వగుచు సద్బావంబు శోబిల్లగన్ జయవై సహృద యాకృతిన్మనుమాసాంతమ్ము శాంతమ్ముతో లేజిగురాకులందు పవళించితివేమొ విలాస మూర్తివై రాజిలు చుంటివేమొ సుమ రాజిని పుత్తడి రేణు వద్దుచున్ రాజిలుకమ్మ కమ్మని స్వరార్చన యందున స్రొక్కుచుంటివో ఈ జన వాహినిన్ నిలుమ! ఈప్సిత కాంక్షలు దీర్ప శ్రీ జయా ఏదియు కాదు శాశ్వతము మేదినియంతయు భ్రాంతి మంతమే నాదని విర్ర వీగునెడ నాశ విభుండును నవ్వకుండునే వేదన హెచ్చు నీ మదిని వ్రేల్చెడి నేనను భావముండినన్ శ్రేయ వసంతమై తనరు జీవత మంతయు అహంము వీడినన్

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pw2K45

Posted by Katta

20, మార్చి 2014, గురువారం

Nvn Chary కవిత

ఎన్నికలు -ఏలికలు ఎన్. వి. ఎన్. చారి 20-03-2014 పార్టీలు మారినా పోటీలు చేసినా ఫోటోలు మారునా ఫోజులు మారునా జండాలు మారినా ఎజండాలు మారునా నిన్న బూతులు తిట్టి నేడు ఉత్తముడన్నచో ఉత్త ముండవు నీవె అందురు నల్ల తోలుకు తెలుపు రానె రాదు చింత జచ్చిన పులుపు చచ్చునె ఓటరా చూడు నేడొక జాతరా వేటాడు పక్షివి సోదరా మంచి (ఓ)వేటు వేసి చూడరా

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gctwNj

Posted by Katta

17, మార్చి 2014, సోమవారం

Nvn Chary కవిత

ఎన్.వి.ఎన్.చారి 17-03-2014 "రంగు పడుద్ది " ఓట్ల రన్ "గులలో " నాయకుల పాట్లు కొత్త రంగును అద్దుకుంటూ పాత రంగుల్ని తిట్టుకుంటూ పొత్తు రంగుల హొలీ జోరుగా ఆడుతున్నారు ఓడేదెప్పుడూ ఓటరే గదా

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p2B2d6

Posted by Katta

15, మార్చి 2014, శనివారం

Nvn Chary కవిత

ఆ పవనం ఏ తీరాన్ని తాకుతుందో అర్థమైంది ఏ వనం పుష్పమో తేటతెల్లమైంది సీమంద్ర (కా)గాయం తెలంగాణా లేపనం (రంగుల్ని) పూసుకుంటున్నది అభిమానపు పునాదులపై తన ఆనవాళ్ళను పేర్చుకుంటున్నది

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kswJrl

Posted by Katta

11, మార్చి 2014, మంగళవారం

Nvn Chary కవిత

ఎన్నికలలో ఎన్ని "కలలో " మరెన్ని" కళలో " నటనలు నాట్యాలు ఓటరునూరించే విరించిని మించిన వాగ్దానాలు చట్ట సభల్ని చట్టు బండలు చేసిన ముఖాలే మాస్కులు మార్చుకుంటూ జనాన్ని ఏమార్చు కుంటూ పార్టీల మాస్కులు మార్చుకుంటూ తస్మాత్ జాగ్రత్త సావధాన సావధాన సుముహూర్త సావధాన ఓటుకు నోటు తీసుకుంటే మన నోటికి తాళాలే ఒక్కరోజు ఆశ పడితే ఐదేళ్ళు మన బ్రతుకులు కుదేలే ఓటు ఆయుధమున్న అర్జునులం మనం లక్ష్యాన్ని గురిపెడదాం ఓట్ల పండుగ నాడే కాదు బిర్యానీ ప్రతిరోజూ వసంతం విరియాలి

by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i1AV0c

Posted by Katta