పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
DrAcharya Phaneendra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
DrAcharya Phaneendra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2014, సోమవారం

DrAcharya Phaneendra కవిత

కన్నయ కన్నయ నొక కరమున, నీ కన్నయ నింకొక కరమున గలిగి కదలెదో - కన్నయ నమ్మిన యెడ, నీ కన్నయ కిక కడుపు నిండు గదనే తల్లీ! - డా.ఆచార్య ఫణీంద్ర 23/6/2014

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UxV7jf

Posted by Katta

16, జూన్ 2014, సోమవారం

DrAcharya Phaneendra కవిత

I am very very happy to inform all my well-wishers that I am invited by North America Telugu Association (NATA) to attend its 2nd convention to be conducted at Atlanta, U.S. during 4 July 2014 - 6 July 2014. Thanks to Raghu Goverdhana, who not only forwarded my profile to NATA, but also encouraged me to go ahead in each stage till my Visa is approved today. The list of invitees to the convention is given in the link given below. http://ift.tt/1i1LFPQ I will reach Atlanta on 1st July and stay upto 11th July. I don't know who stays where in U.S., but I wish all my intimate relatives and friends meet me there, if possible.

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i1LFPQ

Posted by Katta

12, జూన్ 2014, గురువారం

DrAcharya Phaneendra కవిత

9 జూన్ 2014 నాడు త్యాగరాయ గానసభలో "నమో భరతమాత" - కవిసమ్మేళనం జరిగింది. ప్రముఖ కవి "సుధామ" గారి అధ్యక్షతన జరిగిన ఆ కవిసమ్మేళనంలో "డా. జె. బాపురెడ్డి", "డా. ఉండేల మాలకొండారెడ్డి", "డా. ముదిగొండ శివప్రసాద్", "డా. సి.భవానీ దేవి", "డా. వెనిగళ్ళ రాంబాబు" మొదలైన వారితోబాటు నేను పాల్గొన్నాను. ఆనాడు నేను వినిపించిన నా పద్య కవిత . శక్తివంత భారతం రచన: "కవి దిగ్గజ" డా. ఆచార్య ఫణీంద్ర తలపై హిమాద్రి మకుటము; గళమున హారములు పుణ్య గంగా, యమునల్; జలధి త్రయ సంధి స్థలి పలు వన్నెల పాదపీఠి - భారతి నీకౌ! క్రొత్త దనము నిండె - క్రొంగొత్త కాషాయ వర్ణశోభిత మయె భరతభూమి! కడచి పోయిన కడగండ్లు - గతము గతః స్వర్ణ యుగము లింక వరలు గాక! నాడొక "నరేంద్రు" డుదయించి, నాటి విశ్వ వేదిపై భారతీయ తాత్త్వికత చాటె! నేడొక "నరేంద్రు" డుదయించె - నిలుపు గాక భరత దేశమ్ము నుత్తుంగ పదము పైన!! ఇరువ దెనిమిది రాష్ట్రాల కింక తోడు కంటివి నవ శిశువు, "తెలంగాణ" పేర - పచ్చి బాలెంతరాల! మా భరత మాత! ప్రీతి లాలించి, పాలించి పెంచుమమ్మ! అన్ని రాష్ట్రము లిక అభివృద్ధి పథములన్ తురగ వేగ గతిని పరుగు లిడుత! అచిర కాల మందె అవనిపై భరతాంబ అమిత శక్తివంత దేశ మగును గాక! --- && ---

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qAAk96

Posted by Katta

10, జూన్ 2014, మంగళవారం

DrAcharya Phaneendra కవిత

తెలుగు భాషానుబంధమ్ము రచన : 'కవి దిగ్గజ ' డా. ఆచార్య ఫణీంద్ర ఆంధ్ర, తెలగాణ వేర్వడె, నైన నేమి? తెలుగు భాషానుబంధమ్ము తెగునటయ్య? నిండు జామకాయను కోసి, రెండు జేయ - రూపు మారినన్, మారునా రుచియు, రంగు? పులుగుకు రెండు రెక్క, లవి పూని ప్రపంచము చుట్టి వచ్చెడిన్ - వెలుగుకు రెండు దిక్కు, లవి వెల్లడి జేయు ప్రదేశ మెల్లడన్ - జలధికి రెండు నొడ్డు, లవి శాశ్వత లబ్ధి ప్రజాళి కిచ్చెడిన్ - తెలుగుకు రెండు రాష్ట్రములు ... దివ్యముగా అభివృద్ధి చెందెడిన్! 10/06/2014

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1s2fJiC

Posted by Katta

4, జూన్ 2014, బుధవారం

DrAcharya Phaneendra కవిత

అస్తిత్వం నన్ను నేను వెదికి, నా కగుపింపక చిన్నబోయినాడ నిన్నినాళ్ళు! రమ్మిక తెలగాణ రాష్ట్రమా! నీవింక నన్ను వెదికి ఇమ్ము నాకు మరల! DrAcharya Phaneendra 03/06/2014

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1x27cME

Posted by Katta

2, జూన్ 2014, సోమవారం

DrAcharya Phaneendra కవిత

తెలంగాణ భాగ్య గీతి రచన : డా. ఆచార్య ఫణీంద్ర ‘అరువది తొమ్మిది’న్ మరియు నా పయి రేగిన ఉద్యమాలలో ఒరిగిన కంఠ మాలల మహోన్నత త్యాగ ఫలంబునౌచు, నే డరుగుచు నుండె గాదె ’తెలగాణము’ పూర్ణ స్వతంత్ర మొందుచున్! అరువది యేండ్ల స్వప్న మిది, ఆకృతి దాలిచి ముందు నిల్చెడిన్!! నా ‘తెలంగాణ’ కోటి రత్నాల వీణ సర్వ స్వాతంత్ర్య రాష్ట్రమై సాకృతి గొన - అమరులైన వీరుల ఆత్మ లందె శాంతి! మురియుచుండ్రి ’తెలంగాణ’ భూమి సుతులు!! నేనురా తెలగాణ నిజ రాష్ట్ర సిద్ధికై ఆకాశమంత ఎత్తార్చినాను - నేను దాయాది దుర్నీతి పాలన గూర్చి పద్యాలు గొంతెత్తి పాడినాను - నే దాశరథి కవి నిప్పు లురుము గంట మొడుపులన్ కొన్నింటి బడసినాను - నేను భాగ్యనగరిన్ నిత్య వసంతుడై పద్య ప్రసూనాల పంచినాను – ఐదు కోటుల సీమాంధ్రు లందరికిని మా తెలంగాణ వ్యథ విడమరచి చెప్పి, మూడునర కోట్ల ప్రజలకు ముక్తి గలుగ - పాడినాను తెలంగాణ భాగ్య గీతి! శ్రీలంగూర్చగ దివ్య ‘భద్రగిరి’పై సీతమ్మగా ‘లక్ష్మి’యున్ - ఫాలంబందున జ్ఞాన రేఖలు లిఖింపన్ ‘బాసర’న్ ‘వాణి’యున్ - ‘ఆలంపూరు’న జోగులాంబగ శుభాలందింపగా ‘గౌరి’యున్ - మూలల్ మూడిట నిల్చి ముగ్గురమలున్ బ్రోచున్ తెలంగాణమున్! యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రావిర్భావ శుభాకాంక్షలు! – డా. ఆచార్య ఫణీంద్ర

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n2L0g6

Posted by Katta

29, మే 2014, గురువారం

DrAcharya Phaneendra కవిత

పోల'వరమా' ? శాపమా ? మూడవ పంట కోసమని ముంచగ నెంచిరి ప్రక్క రాష్ట్రమం దేడు విశాల మండలము, లెంత విషాదము ! ఆంధ్ర నాయకుల్ గూడెపు టాదివాసులట గుండెలు బాదుకొనంగ కానరో ? ఏడుపు కళ్ళనీళ్ళపయి ఎత్తుగ 'డ్యామ'ట ! సిగ్గు చేటయో ! - డా. ఆచార్య ఫణీంద్ర 29/05/2014

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oMSSTl

Posted by Katta

4, మే 2014, ఆదివారం

DrAcharya Phaneendra కవిత

డబ్బు కొరకు జనులు 'డ్రామాల' నాడేరు - ఒక్క మాట ముందు, నొకటి వెనుక ! ఉన్న మాట పలుక ఉలికిపా టెక్కువ ! గబ్బు రేపు వారి డబ్బు పిచ్చి !

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kIudxC

Posted by Katta

3, మే 2014, శనివారం

DrAcharya Phaneendra కవిత

నరకమైన నేమి ? నగ్నసత్య మగుచో - దాని స్వీకరింతు ధైర్యముగను ! స్వర్గతుల్య మది - అసత్యమైన యెడల - దాని ఛీత్కరింతు ధర్మమనగ ! (3 may 2014)

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iV7Aqm

Posted by Katta

2, మే 2014, శుక్రవారం

DrAcharya Phaneendra కవిత

నండూరి వారి జయంతి సభ వివరాలు : సాక్షి & నమస్తే తెలంగాణ :

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SfEzf9

Posted by Katta

30, ఏప్రిల్ 2014, బుధవారం

DrAcharya Phaneendra కవిత

నిజము పలుకువాడు నిష్ఠురమ్ముగ తోచు - పిచ్చివాడని వెలివేయుచుంద్రు ! నీతిగా వెలిగెడి నిప్పును ముద్దాడు ధైర్య మెవరి కుండు ధరణి మీద ?

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1km6eTc

Posted by Katta

28, ఏప్రిల్ 2014, సోమవారం

DrAcharya Phaneendra కవిత

జంట నగరాలలోని సాహిత్యాభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం - డా. ఆచార్య ఫణీంద్ర

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rxgZ7I

Posted by Katta

27, ఏప్రిల్ 2014, ఆదివారం

DrAcharya Phaneendra కవిత

ఎప్పుడో … 1996లో ‘ఈనాడు ‘ దినపత్రికలో ప్రచురితమైన నా గేయకవిత ఇది. ఈ ఎన్నికల వేళ మళ్ళీ ఇక్కడ ప్రచురిస్తున్నాను. - డా. ఆచార్య ఫణీంద్ర

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mNw2dj

Posted by Katta

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

DrAcharya Phaneendra కవిత

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును పురస్కరించుకొని నేను రచించిన “తెలంగాణ మహోదయం” పద్యకవిత ఈ నెల ‘మూసీ’ మాసపత్రికలో ప్రచురితమయింది. ఆ ముద్రత కవిత ఇదిగొ.. ఇక్కడ… మీ కోసం….. - డా. ఆచార్య ఫణీంద్ర

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kwy43N

Posted by Katta

9, ఏప్రిల్ 2014, బుధవారం

DrAcharya Phaneendra కవిత

రచయితలు తమ ముద్రిత గ్రంథాలను అమ్ముకోవడం ఎలా? 1. మొదట ... ముద్రణకు ముందే రచయిత నిష్పక్షపాతంగా ఆ గ్రంథానికి ప్రచురణ అర్హత ఉందా? .. లేదా? ... అని బేరీజు వేసుకోవాలి. రచనలో పటుత్వం ఉంది ... నలుగురికీ నచ్చుతుంది ... అనుకొంటేనే పెట్టుబడి పెట్టాలి. ముద్రణ సమయంలో గ్రంథం కాస్ట్ ప్రైజ్ కన్న ధర నాలుగింతలు ఎక్కువగా ముద్రించాలి. "గ్రంథం లభించే చోటు" అంటూ - స్వీయవిలాసంతోబాటు కొన్ని వివిధ నగరాల, జిల్లాలలోని ప్రసిద్ధ బుక్ షాపుల అనుమతితో, వారి వారి చిరునామాలను కూడా ఆ గ్రంథంలో ముద్రించాలి. 2. గ్రంథావిష్కరణ రోజు 'సగం ధరకే' అని ప్రకటించి, అమ్మడం వలన కొన్ని అమ్ముడు పోతాయి. లేదా "కొత్త పుస్తకం కొంటే కొన్ని పాత పుస్తకాలు (అమ్ముడు పోనివి) ఉచితం" అని ప్రకటించడం మరొక పద్ధతి. ఇలా బోణీ కొట్టవచ్చు. 3. తరువాత సమీక్షలు వివిధ పత్రికలలో వచ్చాక, కనీసం ఒక పది ఊళ్ళ నుండి గ్రంథం పంపమని లేఖలు వస్తాయి. వారికి “సగం ధరకు, ఇంకా పోస్టేజ్ ఫ్రీగా పంపుతాము” అని ... “డబ్బును ఎం.ఒ. చేయ”మని కార్డు ముక్క వ్రాయాలి. అలా కొంతమందికి అమ్మవచ్చు. 4. ఆ పైన తక్షణం డబ్బును ఆశించకుండా, గ్రంథంలో ముద్రించిన బుక్ షాపులలో 50 ప్రతుల చొప్పున ఉంచాలి. ఒక సంవత్సరం తరువాత తీరుబడిగా వెళ్ళి, అమ్ముడు పోయిన గ్రంథాల డబ్బును (ఆ షాపు వాళ్ళ కమీషను పోను మిగిలింది) తెచ్చుకోవచ్చు. 5. వివిధ నగరాల, జిల్లాల, గ్రామాల, విద్యాసంస్థల గ్రంథాలయాలకు వెళ్ళి కొన్ని ప్రతులను అమ్ముకోవచ్చు.(సాధారణంగా 40% డిస్కౌంటుతో) 6. కొన్ని కళాశాలల, పాఠశాలల ప్రిన్సిపాళ్ళ అనుమతితో తెలుగు పండితులకు, ఉపాధ్యాయులకు, సాహిత్యాభిరుచి గల విద్యార్థులకు కొన్ని ప్రతులను అమ్ముకొంటే కొంత డబ్బు వస్తుంది. ఇక్కడ ప్రిన్సిపాళ్ళకు, ఉపాధ్యాయులకు ఉచితంగా ఇచ్చి ప్రసన్నం చేసుకొని, విద్యార్థులకు 'సగం ధర' అంటే చాలా డబ్బే మూటగట్టుకోవచ్చు. కొన్ని స్కూళ్ళలో విద్యార్థులను సంస్థ సిబ్బంది మరుసటిరోజు పుస్తకం కొనుగోలుకై డబ్బు పట్టుక రావాలని శాసించిన సందర్భాలు కూడా లేకపోలేదు. 7. వివిధ సాహిత్య సభలలో, ఎగ్జిబిషన్లలో, బుక్ ఫేర్ లలో పెట్టే పుస్తక విక్రయం స్టాళ్ళలో వాళ్ళ కమీషన్ రేట్ల ప్రకారం ఒప్పుకొని ఉంచితే, కొంత డబ్బు వస్తుంది. 8. వివిధ పురస్కారాల వివరాలు తెలుసుకొని పంపితే, బహుమతి లభించే స్థాయి ఉంటే, పెద్ద మొత్తమే చేతికందుతుంది. 9. రాష్ట్ర ప్రభుత్వ గ్రంథాలయాల కొనుగోళ్ళ ప్రకటన ఎప్పుడు వచ్చేది కాస్త గమనించి, అప్లై చేస్తే .. సెలెక్టైతే .. కాస్త ఆలస్యంగానైనా మంచి మొత్తమే లభిస్తుంది. 10. చివరగా .. బంగారు కోడిపెట్ట వంటిది 'రాజా రామమోహనరాయ్ ఫౌండేషన్' వారి ప్రకటన! అది ఎప్పుడు వెలువడేది గమనించి అప్లై చేస్తే .. సెలెక్టైతే .. కాస్త ఆలస్యంగానైనా చాల పెద్ద మొత్తమే మన అకౌంటులో వచ్చి పడుతుంది. 11. ఈ మధ్య 'కినిగె ' వంటి సంస్థలు ఇంటర్నెట్ ద్వారా కూడా పుస్తకాలు విక్రయిస్తున్నారు. వారిని కూడా సంప్రదించవచ్చు. కొంత లాభం ఉండవచ్చు. అయితే వీటన్నిటిలోకి ప్రధానమయినది - నా 1వ సూచనే! పటుత్వ రచనను ముద్రించిన ఏ రచయిత కూడా - లాభం పొందినా .. పొందకపోయినా..., నష్టపోడని మాత్రం కచ్చితంగా చెప్పగలను. --- &&& ---

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kLnd1O

Posted by Katta

8, ఏప్రిల్ 2014, మంగళవారం

DrAcharya Phaneendra కవిత

“ఏక పద్య రామాయణం”. “యాగ ఫలంబుగా జననమంది, మహాస్త్ర కళా విదుండునై, యాగము గావగా జని, శివాంకిత చాపము ద్రుంచి, జానకిన్ తా గొని పత్నిగా, పిదప – తండ్రి వచః పరిపాలనన్ వనం బేగి, దశాననున్ దునిమి, ఏలికయౌ రఘురాము మ్రొక్కెదన్!” అందరికీ “శ్రీ రామ నవమి” పర్వదిన శుభాకాంక్షలు!

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qgWz27

Posted by Katta

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

DrAcharya Phaneendra కవిత

మా అబ్బాయి చి|| రోహిత్ గోవర్ధనం ఈ ఎన్నికల వేళ, ఒక అర్థవంతమైన, సమయోచితమైన లఘుచిత్రాన్ని రూపొందించాడు. ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి ఆ లఘుచిత్రాన్ని చూసి, మా అబ్బాయిని ఆశీర్వదించగలరు. ఈ చిత్రంలో నేనూ ఒక పాత్రను ధరించడం నా సౌభాగ్యంగా భావిస్తున్నాను. http://ift.tt/1q7sy6S - డా. ఆచార్య ఫణీంద్ర

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q7sy6S

Posted by Katta

2, ఏప్రిల్ 2014, బుధవారం

DrAcharya Phaneendra కవిత

‘శిరాకదంబం’ అంతర్జాల పత్రికా నిర్వాహకులు ‘రావు ‘గారు ఆ పత్రిక ద్వారా అద్భుతంగా నిర్వహించిన “ఉగాది స్వరాలు” – అంతర్జాల శ్రవ్య (ఆడియో) కవిసమ్మేళనాన్ని ఈ క్రింది లింకును క్లిక్ చేసి వీక్షించండి. http://ift.tt/1mzqjHp

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mzqjHp

Posted by Katta

31, మార్చి 2014, సోమవారం

DrAcharya Phaneendra కవిత

రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో హైదరాబాద్ ‘రవీంద్రభారతి’లో జరిగిన 'ఉగాది కవిసమ్మేళనం' లో నేను వినిపించిన కవిత : రెండు కోకిలలు! రచన: ‘కవి దిగ్గజ‘ డా. ఆచార్య ఫణీంద్ర జయము! జయము! జయము! ‘జయ‘ నామ సంవత్స రాంబికా! ఇదే జయమ్ము నీకు! సకల జయము లింక, సంతోషముల దెచ్చు జనని! ‘వత్సరాది’! స్వాగతమ్ము! విస్తరించి మావి వృక్షమ్ము పెద్దగా రెండు శాఖ లెదిగె నిండుగాను! ఒక్కటి ‘తెలగాణ‘, మొక్క ‘టాంధ్ర ప్రదేశ్‘ - తెలుగు మావి రుచులు ద్విగుణమయ్యె! ఉవ్వెత్తు నెగసిన ‘ఉద్యమ ‘ గ్రీష్మాల మండుటెండల లోన మాడినాము - విరుచుక పడుచును వీపులందు కురియు ‘లాఠి ‘ వర్షాల కల్లాడినాము - బందు, హర్తాళ్ళతో వణుకు శరత్తులన్ పలుమార్లు వడవడ వణికినాము - ఆకులట్లు యువకు లన్యాయముగ రాలు శిశిరాలనే గాంచి చితికినాము – తుదకు నిన్నినాళ్ళ కిపుడు పదియునాల్గు వత్సరముల బాధ లుడిగి, ఫలిత మబ్బి, నేటికి కదా విరియుచు నీ తోటి మాకు చివురులెత్తు వసంతమ్ము చేరుచుండె! భారీ తుఫాను లుడిగెను - నీ రాక ‘ఉగాది‘! మాకు! నిజము! ‘యుగాదే‘! వేరుపడె తెలుగుభ్రాతలు! వారికి, వీరికి శుభమిడు బ్రహ్మాండముగాన్! కార, ముప్పు, వగరు, కడు చేదు, పులుపులే కడచి, కడచి, తుదకు కలిగె తీపి! క్రొత్త వత్సరమున క్రొంగొత్త రుచులతో వండినా ‘ముగాది పచ్చ‘డిదిగొ! మెలగుచు స్నేహభావమున మెండుగ నొక్కరితో మరొక్కరున్ తెలుగు సహోదరుల్ పరమదివ్యముగా సహకారమందుచున్, వెలసెడి రెండు రాష్ట్రముల వేగముగా నభివృద్ధి జెందినన్ - తెలుగిక రెండు భాగముల తేజమునన్ ద్విగుణీకృతంబగున్! నిండుకుండ లట్లు రెండు రాష్ట్రాలలో పూర్తిగ నదులెల్ల పొంగి, పొరలి - దండిగా ప్రజలకు దాహార్తి తీర్చుచున్, పంటభూములకును ప్రాణమిడుత! యాదగిరి నారసింహుని యమిత భక్తి నరిగి, మ్రొక్కులనిడుత సీమాంధ్ర జనులు; సింహగిరి నారసింహుని చేరి, ఇంక మ్రొక్కులిడుత తెలంగాణ భూమి ప్రజలు! ఓ ‘జయాఖ్య వర్షమ’! కను డుత్సహించి - రెండు కోకిలల్ కూసె నీ పండుగ కిక! ఈవు ‘తెలగాణ‘, ‘సీమాంధ్ర‘ ఇరు గృహాల తిని ‘ఉగాది పచ్చడి‘, నిడు దీవెనలను! — &&& —

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hbqWBI

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో హైదరాబాద్ ‘రవీంద్రభారతి’లో 'ఉగాది కవి సమ్మేళనం' : కవిసమ్మేళనంలో పాల్గొన్న కవులు : (కుడి నుండి వరుసగా : శ్రీమతి కొండేపూడి నిర్మల, నేను, శ్రీ వాడ్రేవ్ చిన వీరభద్రుడు, డా. రాళ్ళబండి కవితాప్రసాద్, డా. ఎల్లూరి శివారెడ్డి (కవి సమ్మేళనం అధ్యక్షులు), శ్రీ ముక్తేశ్వర రావ్ (గౌరవ అతిథి), శ్రీ శేషం రామానుజాచార్యులు, డా. మసన చెన్నప్ప, శ్రీ యాకూబ్, డా. ఉండేల మాలకొండా రెడ్డి, డా. తిరుమల శ్రీనివాసాచార్య మొ||గు వారు)

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dK4rJj

Posted by Katta