పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

క్రాంతి శ్రీనివాసరావు || జారుడు బండ ||


నిన్నటి జీవితాన్నే
తొడిగి తొడిగి విసుగేసింది

కొత్త చిగురుల కోసం
వేచి వేచి అలుపొచ్చింది

అదే నవ్వూ
అదే పనీ
అదే సంతకం
అదే జీతం
అదే జీవితం

గడి యారం లో ముల్లులా
వయసును కొలుచుకొంటూ
పదవీ విరమణ తలచుకొంటూ
నాకు నేనే యావజ్జీవిత శిక్ష విధించుకొన్నాను

వెన్నెల కురుస్తూనే వుంది
వసంతం వచ్చిపోతూనే వుంది
ఎందులోనూ నేను తడవలేక పోతున్నాను
తామరాకుపై నీటి చుక్కలా
గుండ్రంగా ముడుచుకొని
ఎ సంతోషం అంట కుండా
జీవిత కాన్వాసుపై దొర్లుతూనే వున్నాను

ఎటు కొలిచినా బెత్తెడే
ఎటు చూసినా వత్తిడే
తెగించి త్యజించనూలేను
వరించి సహించనూలేను

నేను నడిచేది జారుడు బండ
కచ్చితంగా పరుగెత్తలేను

నేను వెళ్ళాళ్సింది బోరెడు దూరం
కచ్చితంగా దరిచేరలేను


ఉరివేసిన ఖైదీ
అమలయ్యే వరకు బతికినట్లు

రిక్రూట్ అయ్యుంది మొదలు
రిటైర్ అయ్యేదాకా రొజులు వెళ్ళదీస్తున్నా

కొనకంచి లక్ష్మీనరసింహరావు|| కవిత||

నువ్వు నన్ను వదిలేసి
.నీకు నువ్వే
ఓ..హిరోషిమా అయ్యావు.
కానీనువ్వు వదిలెసిన చోట

నాకు నేనే
ఓ తాజ్ మహల్నై..
 నీకొసం ..నిలుచున్నా

07-09-
2012

బాలు||ఎర్రటి మెతుకులు||

డేరాలు
రోడ్డుప్రక్కన డేరాలు
ఎర్రరంగు,బులుగు రంగు డేరాలు
గట్టిగా బిగించిన తాళ్ళు
లోతుగా నాటిన కడ్డీలు

పిల్లలు కోడిలా
ఓ తల్లి
బండరాతిమీద
సారా గుటకాలు వేస్తూ
కోడిపుంజు

చీకటి అలుముకున్న రాత్రి
వీదిదీపాల వెలుగులు
కొద్ది కొద్దిగా
డేరాలో జొరబడి
చీకటి మీద యుద్దం చేస్తున్నాయ్
కానీ గెలవడం లేదు

చలికాలం
చల్లటిగాలి
రివ్వురివ్వున
తాండవం చేస్తుంది

పున్నమిరాత్రి
పుట్టెడు దుఖంతో
గొడ్డుకారం
కలిపిన నూకలబువ్వ
ఆ పిల్లల కోడి
తన పిల్లలకు
ఎర్రటి మెతుకులు తినిపిస్తుంది

బాలు*07-09-2012*

యజ్ఞపాల్ రాజు||ఇద్దరం||

పున్నమి చంద్రుడినడిగి
పండు వెన్నెలలు
బానలనిండా నింపుకొచ్చాను
స్నానం చేద్దువుగాని
బాల భానుని
బుగ్గలు పుణికి
ఎర్రదనం తీసుకొచ్చాను
బొట్టు పెట్టుకుందువు గాని
నీకై దాచిన
ప్రేమను కొంచెం
పట్టుపురుగులకు ఇచ్చి
అవి ఇచ్చిన పోగులతో
చీరనేసి
లేత చిగుర్లనడిగి
పచ్చరంగేసి
తంగెడుపూలు నవ్వితే
రాలిన
పసుపు పుప్పొడిని
అంచుల్లో చల్లి తీసుకొచ్చాను
కట్టుకుందువు గాని
దారిలో ఎదురుపడ్డ
అడవిపూల సౌరభాలను
గాజు బుడ్డీలో పోసుకొచ్చాను
నిండా పూసుకుందువు గాని
తుమ్మెదల్ని కదిపితే
తియ్యటి తేనెలిచ్చాయి
ఆ మధురాల్ని
కడుపునిండా తాగుదువు గాని
పొందికగా
పొదరిల్లు కట్టాను
ఇద్దరం ఒద్దికగా
ఒదిగిపోదాం గాని
ఓయ్ పిల్లా
నాతో వస్తావేమిటే

07-09-2012

పులుపాటి గురుస్వామి ||ఇది గమనించే స్థితి లోనే ఉంటే....||

వచ్చే వాళ్ళు వస్తున్నారు
పోయే వాళ్ళు పోతున్నారు
ఎవరూ స్పష్టంగా దర్శన మీయరు
పై పై నీటి కింది చేపల్లా
ఎవరూ కడులుతున్నట్టు లేదు

ముసుగులు బిగుసుకు పోయి
పోరాడుతున్న ఊపిరి,
ముత్యపు గింజలు రాలుతున్న
చలిగాలి నిగ నిగల కాలాన్ని
ఎవరూ పలకరిస్తున్నట్టు లేదు

ఎదుగుతున్న కోరికలు ఎదురు తిరిగి
పసిపిల్లల వయసు ఆకాశ వీధుల్లోకి
ఊహించని స్కేటింగ్ చేస్తుంటే
అద్దం ముడతల విషాదం లో మునిగి
వాకిట్లో వాలిన వెన్నెల కిచ కిచలు
ఎవర్ని చెక్కిలిగిలి పెడ్తున్నట్టు లేదు

కాంక్రీటు ప్రేమల ఉపరితలాల మీద
వాడి పోతున్న అనుభందాల మొలకల నాడి దొరకక
కోలుకోలేని కౌగిలి వ్యసనాల మోజులో
రాత్రుళ్ళు పగళ్ళు నిద్రను మేల్కొలిపి రంగరించుకున్నా
చెమట ఆరని తృప్తిలేని బలవంతపు సజీవ యుద్ధంలో
ఎవరూ కంటి నిండా తృప్తిగా పల్కరించుకుంటున్నట్టు లేదు
మనసు మనసు తియ్యగా హత్తుకుంటున్నట్టు లేదు

వచ్చేవాళ్ళు వస్తున్నారు
పోయే వాళ్ళు పోతున్నారు
ఎవరూ స్వచ్చంగా దర్శన మీయరు
పై పై చిగురుటాకుల కదలికల్లా
ఎవరూ స్పష్టంగా శ్వాసిస్తున్నట్టు లేదు .

6-9-2012
 

కాశి రాజు || అక్షర ఆత్మీయత||

గౌరవనీయులైన అని
గౌరవించి రాసినా
ఉబయకుసులోపరి అని
ఊరిస్తూ రాసినా
ప్రియమైన అని
ప్రియంగా రాసినా
ఒకప్పుడు ఉత్తరాలదే ఊపంతా
మనసులోని భావాన్ని
మరో మనసుకి చేరేట్టు రాయడం
మనకప్పుడు మచ్చికే కదా !
మరి ఇప్పుడెందుకు
హాయ్
హలో
హౌఆర్ యూ డూయింగ్?
అంటూ
అయస్కాంత తరంగాలకి
అలవాటు పడిపోతున్నాం !
ఈ యంత్రాలన్నీ
మన మనసుకి మంత్రాలేసి
మన మద్య సాన్నిహిత్య్యాన్ని మరిపించేస్తున్నాయి
కారణాలేమైనా కానియ్యండి
మనమంతా పెరిగి”పోతున్నా”మనే బ్రమలో వున్నాం
వద్దు
మన మద్య ఈ దూరాలొద్దు
అక్షరాలై
ఆప్యాయంగా మాట్లాడుకుందాం
అల్లుకుపోతూ
అతుక్కుని ఉందాం
అందుకే
అందరూ రండి
అక్షరాలుగా వచ్చి అల్లుకుపోండి !
అక్షర ఆత్మీయతని చాటి చెప్పండి

04-09-2012

జితేందర్ బత్తుల || జీవిత ప్రయాణం ||

జీవితం ౩ అక్షరాల మజిలి లాంటి సుధీర్గ ప్రయాణం
అందులో ఎన్నెనో సప్త స్వరాల సంగీత గీతాలు
అలసిన మనసుకు సేద తిరేల జరిగే పరిచయాలు
బాధ కలిగినప్పుడు నలుగురు సంతోషం పంచే స్నేహితులు
అనురాగాల త్రివేణి సంగమాలు
ఆప్యాతల లోగిల్ల బంధువులు
ప్రేమను నిండుగా నింపే తల్లితండ్రులు
మనల్ని కంటికి రెప్పల చూసుకునే కుటుంబం
తనివి తీర పలకరించే ప్రేమ భాంధవ్యాలు
ఒకటి తల్లితండ్రుల ప్రేమ
ఒకటి చెల్లలి ప్రేమ
ఒకటి అన్న ప్రేమ
ఒకటి స్నేహితుని ప్రేమ
ఒకటి అర్థాంగి ప్రేమ
జీవితంలో ఎన్నో ఆనంద క్షణాలు
పుట్టినపుడు తల్లికి సంతోషం
ప్రయోజికుడివి అయ్యినప్పుడు కుటుంబానికి సంతోషం
ప్రవాహం ఒక నీటి చుక్కగా మారి ఈ లోకాన
మొదలయింది మన జీవిత గమ్యం..................

07-09-2012

క్రాంతి శ్రీనివాసరావు || జారుడు బండ ||

నిన్నటి జీవితాన్నే
తొడిగి తొడిగి విసుగేసింది

కొత్త చిగురుల కోసం
వేచి వేచి అలుపొచ్చింది

అదే నవ్వూ
అదే పనీ
అదే సంతకం
అదే జీతం
అదే జీవితం

గడి యారం లో ముల్లులా
వయసును కొలుచుకొంటూ
పదవీ విరమణ తలచుకొంటూ
నాకు నేనే యావజ్జీవిత శిక్ష విధించుకొన్నాను

వెన్నెల కురుస్తూనే వుంది
వసంతం వచ్చిపోతూనే వుంది
ఎందులోనూ నేను తడవలేక పోతున్నాను
తామరాకుపై నీటి చుక్కలా
గుండ్రంగా ముడుచుకొని
ఎ సంతోషం అంట కుండా
జీవిత కాన్వాసుపై దొర్లుతూనే వున్నాను

ఎటు కొలిచినా బెత్తెడే
ఎటు చూసినా వత్తిడే
తెగించి త్యజించనూలేను
వరించి సహించనూలేను

నేను నడిచేది జారుడు బండ
కచ్చితంగా పరుగెత్తలేను

నేను వెళ్ళాళ్సింది బోరెడు దూరం
కచ్చితంగా దరిచేరలేను


ఉరివేసిన ఖైదీ
అమలయ్యే వరకు బతికినట్లు

రిక్రూట్ అయ్యుంది మొదలు
రిటైర్ అయ్యేదాకా రొజులు వెళ్ళదీస్తున్నా

07-09-

పీచు శ్రీనివాస్ రెడ్డి ||దొంగల అడ్డా ||

కూడు గుడ్డ కోసం
కూలి పని కోసం
అడ్డా చేరుకునే చిరుజీవులు
కష్టానికే అంకితమైన చిరంజీవులు

ఈ బ్రతుకుల్లో

కోటి దీపాలు వెలుగుతాయనుకున్న పేదోడి ఆశకు
గండి కొడుతున్నాడు .
వాడి వృత్తి రాజకీయమే
ఆర్ధిక బంధాలే రాజకీయాల అడ్డా

ఓ చంద్రున్ని చీకటి కప్పేసింది

అమావాస్య ముసుగులో
వాడేం చేశాడో ఎవడికి తెలుసు

ఓ చంద్రుడు పున్నమి పాట పాడుతున్నాడు

జనం బ్రతుకుల్ని వేలం వేస్తూ
కొత్త దుకాణం తెరిచి దందా చేస్తున్నాడు

వేషగాళ్ళు కొత్త వేషాలేస్తున్నారు

పదవి ఫకీరులవుతున్నారు

వాళ్ళ రథానికి ఏడు గుర్రాలు ఏడు మార్గాలు

ఏ దారైనా, వెనుదిరుగితే వాళ్లకి కనిపించని జనం మనమే

ఒకడు ఎంగిలి మెతుకులు చల్లి

కల్తీ ప్రేమను చూపి
ఖజానా ఖాళీ చేసి
కాసుల శిఖరం ఎక్కి శేఖరుడై పోయాడు

అధికారం వాళ్ళ అబ్బ సొత్తే నట .

జనం
వాళ్ళ తాత ముత్తాతలు రాసిచ్చిన జాగీరట
నోట్లో ' రెండు ' మెతుకులు పెట్టి
మన జేబులు ఖాళీ చేసిన వారి వారసులోస్తారట
బ్రతుకున్న ఈ కట్టెలను పూర్తిగా కాల్చడానికి .
వాళ్ళ వృత్తే రాజకీయం .

ఉన్నోనికి ఊం కొట్టి

అవకాశాన్ని అమ్ముకుంటారు
అవసరమైతే అన్నీ అమ్ముకుంటారు
సంధులు చేసుకుంటారు
సంచులు పంచుకుంటారు
వాళ్ళ వృత్తే రాజకీయం
వాళ్లకి ' జీతం ' కంటే ' గీతం ' ఎక్కువ
లేక్కలేసినా తేలని ఆస్తులు
వాడుకుంటూనే ఏవీ మావి కావంటారు
రాజకీయం , దోచుకునే దొంగల అడ్డా

05-09-2012

సిద్దెంకి ..//మరిపోతున్నను//.. 05.09.12

మారిపోతున్నాను
మారిపోతున్నాను
ఔను నిజంగానే మారిపోతున్నాను
నన్ను నేను హిప్నటైస్ చేసుకుంటున్నాను
మనిషిని మనసుని మస్తిష్కాన్ని
ఆలోచనను ఆచరనను ఒకటేమిటి
'టోక్' గా మారిపోతున్నను

జోక్ లొద్దు

ప్రస్తుతతం మారడమే నా రోక్
ముసుగు పరదా మాటుగ పరిగెడుతున్నను
ప్రశ్నలొద్దు

ఊసరవెల్లి ఊరికే మార్చదు రంగు

మనుగడ కోసం
వ్యాపార వస్తువవుతున్న మనిషి
నైతిక విలువలకు నహి
భౌతిక విలువలకు బాయ్ లతో
బహుబాగ మర్చేసుకుంటున్నాను మనసు
అంతరాన్ని అంతరం తో పేర్చుతున్నాను
నీతులువల్లించే నేనే
వినిమయ విషం సరళీకరణ సహవాసం
గ్లోబలీకరణ గొడ్డలి వేటుకి మారటం ఎంత సహజమో
మార్చుకోవటం కూడా అంతే అవసరం

భావాల్ని బహుచక్కగ చెక్కే నేనే

అక్షరాల అల్లికను తెంపి పదాల పొదకు అగ్గివెడుతూ
మాడిపోతున్నాను మారిపొతున్నను
ఒకటే బాణం,ఒకటే మాట ఒకతే భర్య
మోసపు మటలు,సంక్యకు మించి సర్సపురాల్లు
అవ్సరాన్ని బట్టి అవతారం మంచిదే...

విన్మ్రంగా నమస్కరిస్తున్నా

గౌరవ మిస్టెర్ పూలే మన్నించు
మీ వారసత్వానికిగండీ కొడుతున్న
నేనిపుడు కిరాయి గది కోసం
ముదిరాజు అవతారమెత్తిన
పరాయి మాదిగ పంతుల్ని.


05-09-2012

డా. రావి రంగారావు || గుండెకాయను పీకేసుకొని||

పెద్ద ఇబ్బందేమీ లేదు
కాకపొతే
మనిషి మనిషిగా బతకలేకపోతున్నాడు...

పెద్ద ఇబ్బందేమీ లేదు

కాకపొతే
మనిషి విలువ పాతాళానికి పడిపోతుంటే
మసి విలువ ఆకాశా న్నంటుతోంది...

పెద్ద ఇబ్బందేమీ లేదు

కాకపొతే
తలకాయలు లేని వాళ్ళు
కిరీటాలకోసం ఎగబడుతున్నారు,
తలకాయలు ఉన్నవాళ్ళు
తమ తలల సంగతే మరిచిపోయారు...

పెద్ద ఇబ్బందేమీ లేదు

కాకపోతే
ప్రాణాల జల్లులు కురవాల్సిన ప్రజాస్వామ్య కాలంలో
మండే నెత్తుటి ఎండలు జనాన్ని చంపుతున్నాయి...

ఈ రోజు పూవు లెంత “దయనీయం”గా అడుగుతున్నాయో తెలుసా-

మురికి మెడల్లో వేసి మమ్మల్ని అపవిత్రం చేయొద్దని...
రాళ్ళు రప్పలు ఎంత “మొండి”గా కోరుకుంటున్నాయో తెలుసా-
చిల్లర పోరాటాలకు మమ్మల్ని పావులుగా చేయొద్దని...
కిరసనాయిలు, పెట్రోలు ఎంత “ఆవేశం”గా ప్రశ్నిస్తున్నాయో తెలుసా-
పదహారణాల బంగారు ఆడతనం మీద బంగారం కోసం మమ్మల్ని మంటలుగా మార్చొద్దని...
సోడాలు, సీసాబుడ్లు ఎంత “గొంతు”పగిలేలా ప్రాధేయపడుతున్నాయో తెలుసా-
పచ్చి పగల “డ్రయినేజ్” లో మా బతుకు కాయలు పారేయొద్దని...

పెద్ద ఇబ్బందేమీ లేదు

కాకపొతే
మానవత్వం లేకుండా
ఎదగా లనుకుంటున్నాడు మనిషి,
గుండెకాయను పీకేసుకొని
దాంతో క్రికెట్ అడుకోవాలనుకుంటున్నాడు మనిషి...

పెద్ద ఇబ్బందేమీ లేదు

కాకపొతే
ఈ పూలు, ఈ రాళ్ళు, ఈ కిరసనాయిలు, ఈ సోడాబుడ్లు...
అమానుషాలకు తాము ఆసరా కాకూడ దని
ఏకగ్రీవంగా తీర్మానించుకున్నాయి,
ఇన్నాళ్ళూ విషాన్ని మోస్తూ వచ్చిన పాత్రలు
ఇప్పుడిప్పుడే తిరగబడుతున్నాయి.\

05-09-2012

శ్రీనివాసు గడ్డపాటి||జై తెలంగాణ||

ఓ బాపూ.....
నీరాట్నం మాకిప్పుడు
శాంతిచిహ్నంగాదు
ఆకలికేకల క్రాంతిచిహ్నం
మగ్గంతాళ్ళే
ఉరితాళ్ళై
బతుకుల్ని దోస్తున్నై
కిర్రుకిర్రుమంటున్న రాట్నంసప్పుడు
సావుపాటపడుతున్నట్లుంది
మిత్తులుగట్టలేక
వలసబొయినగుడిసెలల్ల
పల్లేర్లు మొలుస్తున్నై
బడిబాటబట్టాల్సిన బాల్యం
బతుకుబాట ఎతుకుతుంటే
ఇప్పుడు
మేం బాడాల్సింది
జాతీయగీతం గాదు
జై తెలంగాణ.....జై తెలంగాణ
..........
ఓ బాపూ.....
నీరాట్నం మాకిప్పుడు
శాంతిచిహ్నంగాదు
ఆకలికేకల క్రాంతిచిహ్నం
మగ్గంతాళ్ళే
ఉరితాళ్ళై
బతుకుల్ని దోస్తున్నై
కిర్రుకిర్రుమంటున్న రాట్నంసప్పుడు
సావుపాటపడుతున్నట్లుంది
మిత్తులుగట్టలేక
వలసబొయినగుడిసెలల్ల
పల్లేర్లు మొలుస్తున్నై
బడిబాటబట్టాల్సిన బాల్యం
బతుకుబాట ఎతుకుతుంటే
ఇప్పుడు
మేం బాడాల్సింది
జాతీయగీతం గాదు
జై తెలంగాణ.....జై తెలంగాణ
..........
ఓ బాపూ.....
నీరాట్నం మాకిప్పుడు
శాంతిచిహ్నంగాదు
ఆకలికేకల క్రాంతిచిహ్నం
మగ్గంతాళ్ళే
ఉరితాళ్ళై
బతుకుల్ని దోస్తున్నై
కిర్రుకిర్రుమంటున్న రాట్నంసప్పుడు
సావుపాటపడుతున్నట్లుంది
మిత్తులుగట్టలేక
వలసబొయినగుడిసెలల్ల
పల్లేర్లు మొలుస్తున్నై
బడిబాటబట్టాల్సిన బాల్యం
బతుకుబాట ఎతుకుతుంటే
ఇప్పుడు
మేం బాడాల్సింది
జాతీయగీతం గాదు
జై తెలంగాణ.....జై తెలంగాణ
..........
ఓ బాపూ.....
నీరాట్నం మాకిప్పుడు
శాంతిచిహ్నంగాదు
ఆకలికేకల క్రాంతిచిహ్నం
మగ్గంతాళ్ళే
ఉరితాళ్ళై
బతుకుల్ని దోస్తున్నై
కిర్రుకిర్రుమంటున్న రాట్నంసప్పుడు
సావుపాటపడుతున్నట్లుంది
మిత్తులుగట్టలేక
వలసబొయినగుడిసెలల్ల
పల్లేర్లు మొలుస్తున్నై
బడిబాటబట్టాల్సిన బాల్యం
బతుకుబాట ఎతుకుతుంటే
ఇప్పుడు
మేం బాడాల్సింది
జాతీయగీతం గాదు
జై తెలంగాణ.....

బాటసారి //కులాల కీచులాట //

కులాల కీచులాట
ఆదినుండి
అనాదిగా
మనుషుల మధ్యే చిత్రంగా !

యుగాలు మారినా

కులపిచ్చి చావదు !
తరాలు మారినా
వారసత్వం తరిగిపోదు . .

ఎప్పుడు తెలుసుకుంటాం

వున్నది ఒకటే జాతని
మంచి చెడు అనే
ఇద్దరే వ్యక్తులని ..!

ఉన్నోడు లేనోడు

అన్న రెండే కులాలని..
కులాల కీచులాట మనకు తప్ప
మరే జాతికి లేదని !

నీ కష్టంలో

ఆపన్న హస్తం ఇచ్చేవాడు
ఏకులమైతే ఏంటి
ఏ మతమైతే ఒరిగేదేంటి ?

ఎందుకూ పనికిరావ్

ఒక పెళ్ళికి
చావుకి తప్ప
నీ లోని కులగజ్జి కి మతం మందు పూయడానికి తప్ప

మనిషిని మనిషిగా చూద్దాం

మంచిని పెంచుదాం
వీలయితే సాయం చేద్దాం
కులంలేని సమాజాన్ని సృష్టిద్దాం


 05-09-2012

శ్రీ రాం మడ్డు ||- గ్రహాంతరవాసి పెయింటింగ్ -||

అనుభవం ఆవిరైపోతుంది
జ్ఞాపకం చప్పబడిపోతుంది
జీవితమూ ఒక రోజు చల్లబడిపోతుంది

వెనుకకి తిరిగి చూస్తే

నడచివచ్చిన రహదారంతా
మాయమై ఉంటుంది

అంతుచిక్కని మార్మిక పొగమంచు...

అందని ఆకాశం క్రింద
కాలి క్రింది నేల కూడా కంపిస్తూ ఉంటుంది
కాస్తోకూస్తో నువ్వు నమ్మగలిగేది ఆ నేలని మాత్రమే
అదీ మాయమైన రోజున ఏది మిగులుతుందో జీవితానికి?

నిన్ను నువ్వే నమ్మలేవు

నీతోనే నీకు రాద్ధాంతం
నువ్వెవరో నీకే తెలియదు
స్వల్పమైన ఎరుక గల మరమనిషివి నీవు
ఆ ఎరుకని కూడా నమ్మలేవు
లైఫ్ ఈజ్ అన్సెర్టినిటీ
జీవితమొక అనిశ్చిత మేఘం
నిగూఢ నక్షత్ర ధూళి
గ్రహాంతరవాసి పెయింటింగ్ 


05-09-2012

వంశీ // మెటమార్ఫసిస్ //

ఎపుడైనా,
ఎన్ని యుగాలింకా నేలలోనే మొలకెత్తాలని
లేని రెక్కలు అతికించుకుని ఎగరాలనుకున్నావా,
చీమనో దోమనో ఆవహించి
సగంమిగిలిన రంధ్రాన్వేషణ సాగించాలనుకున్నావా,
అతీంద్రీయాల్ని ఆవేశించుకుని మనుషుల్ని
మృగాలు చేసే అమృతత్వం సాధించాలనుకున్నావా,

ఎపుడైనా

విరుస్తున్న గులాబీతో
మురుస్తున్న తుమ్మెద తొలిమాటలు వినాలనుకున్నావా,
కురుస్తున్న చినుకు తాకి
కరుస్తున్న చలిని విడదీయాలనుకున్నావా,

పరారుణకిరణాలెక్కి

అరుణగ్రహంమీద గడ్డకట్టిన సమయాన్ని
భాష్పీకరించి ప్రవాసుడివవ్వాలనుకున్నావా ,
స్రవించే శోకాలు
సమీపించని సుదూర వ్యోమతీరాన
గమించి క్షయించే నక్షత్రాన్ని ఓదార్చాలనుకున్నవా,

నీ ఉద్వేగాలకు మూలమైన రసాయనచర్యలో

ఉత్ప్రేరకమేదో తెలుసుకుని
ఉద్దేశాలు మార్చుకోవాలనుకున్నావా,
పరస్పర విరుధ్దాలైన నీ
అంతర్ముఖాల పూర్వవృత్తాంతాల
నిజనిర్ధారణకు భ్రూణంలోకి ప్రయానించావా..

ఒకరినొకరు తోసుకుని దాటుకుని

చేరే చివరిమజిలీ చీకట్లోంచి శూన్యంలోకే అనిపించిందా,
కోట్ల అనుభవాల్తో నిర్మించుకున్న నీ ప్రపంచం
నిన్నెపుడైనా ఒంటరిని చేసి ఏడిపించిందా..

చీకటి నాకేసిన వెలుగుల్లో

నిశ్శబ్ధంగా పారుతున్న వీధులగుండా
రాతియుగపు సంగీతం పీలుస్తూ, ఒడ్డుచేరక
నడిసముద్రపు శక్తిస్థలిలో మునగాలనిపించిందా,

బలహీనతల సర్దుబాట్లతో

చిర్నవ్వు తారసపడ్డా అందుకోలేని దురదృష్టాల్ని
కలిపి కుట్టుకున్న చర్మపు పొరల్ని
ఒక్కొక్కటే వొలుచుకుంటూ నీకు నువ్
నగ్నంగా నిజంగా పరావర్తనం అవ్వాలనిపించిందా..

నన్ను ఙ్నప్తించుకో మిత్రమా

నీకలా అనిపిస్తే,
కనీసం నన్నో ఆలోచనలాగా ఐనా గాల్లో కలిపెయ్,

నేను,

అస్థిత్వపోరులో
నాగరికతలు మారుతూ పునరుద్భవిస్తున్న నడిచే శవాన్ని..

5.9.12

శూన్యత || పూర్ణిమా సిరి||

శూన్యం లో ఏమీ ఉండవనీ
ఏమీ ఉండకుంటే అది శూన్యమని
నిర్వచించిన వాళ్ళని ఏమనాలి
అది నిజమే అనుకోని
నిర్లిప్తంగా ఉన్న నన్నేమనుకోవాలి

ఒక్కోసారి అదే శూన్యం

అనంతాలకు దగ్గరి దారిలా
మనలోకి మనని తీసుకెళ్ళే
స్వయంనిర్మిత పుష్పక విమానం లా
ఒక వింతలా ,విభ్రాంతిలా
ఎన్నో అలసటలను తీర్చే విశ్రాంతిలా

మరిప్పుడు అదే శూన్యం

ఒక జ్ణాన సరస్వతిలా
ఒక్కో అక్షరం మళ్ళీ నేర్పిస్తూ..
అమ్మలా లాలిస్తూ..
నేస్తం లా ఓదారుస్తూ..
నాలోకి నన్ను ప్రవహింపజేస్తూ..

హ్మ్! అందుకే అప్పుడప్పుడూ

ఖాళీ తనం కూడా
కావాల్సినతనమే...

5.9.2012

అఫ్సర్||An Empty Episode-4 ||

కొన్ని కాఫీ సమయాలు

నాలుగో సన్నివేశం: ఖాళీతనం డొల్లతనమో/బోలు తనమో కాదు, చాలా సార్లు అది నిలదీస్తుంది, తలపోతకి తలుపు తీస్తుంది. నీతో నువ్వు కలబడడానికి స్థలాన్ని, కాలాన్ని సృష్టిస్తుంది. ఈ సృష్టిలోంచి నువ్వు నువ్వవవుతావ్, వొక చిరునవ్వవుతావ్! ఈ గుట్టు విప్పడం తెలియకపోతే వికల కలకల మవుతావ్!


1


ఈ కఫే నన్నెంత కలవరపెడ్తుందో! దీని కప్పూ సాసర్ల కలుపుగోలు గలగలల్లో నా వొంటరితనమో/ రికామీ తనమో/ ఏమీ కానీ/ ఏమీ లేనితనమో ఎంత దయలేకుండా మోగుతుందో?


వొక ఏకాకి కాఫీ కప్పు ముందు నేను.


నా ఆలోచనల్నీ, ఆవేశాల్నీ, వుద్వేగాల్నీ(శాంతమో/అశాంతమో!) అన్నీట్నీ ఆ కప్పులోకి దాని పరిమళపు నురగలోకి వొంపుకొని

అందులోకే నా చూపుల్ని తదేకంగా ముంచుకుంటూ

ఎంత సేపని


ఎంత


సేపని


ఇలా----

కూర్చుంటాను నన్ను నేను కూర్చుకుంటూ రెప్పలార్పక ఏమార్చి చూసుకుంటూ.


2



కఫే
నన్నెంత నిలదీస్తుందో?

నిటారుగా నిలబడ్డ ఈ జావా కాఫీ కప్పు వొక్కో సారి వొక్కోలా

కనిపిస్తుందీ అనిపిస్తుందీ

వొక ఎడతెగని – తెంపడానికి మనసొప్పనే వొప్పని, తెంపే సమయానికి నవనాడులూ తెగిపోయే – సంభాషణ తరవాత నువ్వొదిలి వెళ్ళిన చిలిపి నవ్వులా-


3


నా వీపెనక వొక అదృశ్య గుయెర్నికాలోని వెయ్యేసి ముఖాలన్నీ

నన్ను గుచ్చి గుచ్చి చూస్తూండగా
పగలబడి నవ్వుతూండగా

ఇక్కడలేని నీతో నీలో నేను మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ

ప్రతిసారీ అనుకుంటా ఇప్పుడే ఇక్కడికి నువ్వొచ్చి వెళ్ళావని
నీవున్న క్షణాల భారాన్ని ఈ కుర్చీ ఇంకా మోస్తోందనీ..!

4


వొకరినొకరం దాటుకుంటూ వెళ్లిపోయాక గుండెలదిరేలా పాడుతుంది పిచ్చి Adele అదే పాట

సెల్ఫోన్ అలల మీంచి!

ఎవరు చెప్పారామెకి నాలోపలివన్నీ?


కప్పులో కాఫీ చల్లారి గొంతులోకి వెళ్లిపోతుంది ఎలాగో!


ఎప్పటికప్పుడు కప్పు ఖాళీ కావాల్సిందే

నీ లోపల ఎంత ఖాళీ వుందో నీకు తెలియడానికి,
నువ్వందులో ఏం నింపుకోవాలో తెలుసుకోడానికి.

5


అయినా తెలుస్తుందా చెప్పు,

ఈ ఖాళీ ఎంత ఖాళీనో?


05-09-2012

కర్లపాలెం హనుమంత రావు॥రహస్యకవాటం॥

మాటల మీద నుంచి మాటల మీదకు దూకటం కాదు
మంత్రకవాటాలను ఒక్కక్కొక్కటే తెరుచుకుంటూ పోవటం కవిత్వం
లోపలి చీకటికి వెలుగుల రంగులద్దే అద్దకం పని కవిత్వమంటే
నాడులు నీవే కావచ్చు ధమనుల బాధను అర్థం చేసుకోవడమే పచ్చిదనాన్ని పచ్చదనంగా అనువదించే కళే కదా కవిత్వమంటే!
ఎడారిలో నడుస్తూ కూడా ఒయాసిస్సులను మోసుకుతిరిగే కూలీపనికి సిద్ధమా!
బోరుబావిలో పడ్డ బిడ్డ మాదిరి
ఊహలు ఊపిరికొసం విలవిలలాడితేనే కవిత్వ జ్వరం తగులుకున్నట్లు
ఉపమాల కోసం జపమాల తిప్పుతూ కూర్చొకు
ఊర్వసి మరో పురూరవుడితొ లేచిపోవచ్చు
కవిత్వం సాక్షాత్కరించడానికి ఎన్ని మన్వంతరాలు శోధించాలోతెలుసా!
పసిబిడ్డ పకపకల పక్కలకి పోయి నిలబడాలి…కాస్త కాకెంగిలి కవిత్వం దొరకుతుంది
పడుచుపిల్ల వాల్చూపుల్లో తడిసి ముద్దవాలి…ప్రబంధాల చలిగాలి వణికిస్తుంది
అమ్మలాలింపు నాన్న గద్దింపు అన్న అల్లరివేధింపు చెల్లి బుంగమూతి సాధింపు
కవివే అయుంటే నీఇల్లే ఒక భువనవిజయంకదరా బాబూ!
ఇరుగింటి పంచాంగంవారి బహుళ శుద్ధపూర్ణిమ పర్వంలోనే కాదు
పొరుగింటి క్యేలండరు ముప్పయ్యో తారీఖు అడుగునా అణిగుంటుంది కవిత్వం... కాస్త తడిమి చూడు
తాగొచ్చిన మొగుడు తన్నినా తను కంచం ఖాళీ చేసిందాక పచ్చిగంగ ముట్టని తడికవతలి తల్లి తడికళ్ళలోకి తొంగి చూడు
'మానిషాద'కన్న మహావిషాదమైన కవిత్వం వరదలై పారుతుంటుందక్కడ
ఎక్కడ లేదు కవిత్వం!
గుడిబైట గుడ్డి బిచ్చగాడి పర్చుకు పడుకున్న చింకిపాతలో లేదా!
బడికెళ్ళే బుడ్డడి స్కూలుబ్యాగు బుక్కుల బరువు కింద నలగడంలేదా !
పొలంగట్టు మీద మట్టికుప్పలా పడున్న అన్నదాత గుండెల్లో కదుంకట్టుంది తట్టల తట్టల కవిత్వం
అడవి చీకటి దారుల్లో జనం వెలుగుల కోసం అహోరాత్రాలు తుపాకీ మడమల మీదే కునికిపాట్లు పడే అన్నల కంటిరెప్పల మరుగుతుంటుంది కవిత్వం
పట్టించుకోవాలే గాని బడ్జెట్ ప్రసంగాల్లొ సన్మానపత్రాల్లోనూ అధికప్రసంగిలా అప్పుడప్పుడూచప్పుడు చేస్తూనే ఉంటుంది కవిత్వం
తాతలకాలం నాటి తాళపత్రాలగ్రంథాలనుంచి పక్కింటి సీతకు రాంబాబు రాసిన ప్రేమలేఖల దాకా...వెదుక్కుంటూ పోతే అంతా కవిత్వమేలే!
మేలైన కవిత్వమే ఏదీ?..ఎక్కడా ఆ రహస్య కవాటం?
ఖాళీ పదాల అర్థాలను పీకి పాకాన పెట్టి... పద్యాల ప్రతిపదార్థాలను తవ్విపోసి…
వెర్రి గీతాల చరణాల వెంట పిచ్చిగా పరుగెత్తితే వినిపించేది
సిల్కుస్మితలు చీరకుచ్చెళ్ళ చప్పుళ్ళు
సీతాకోక చిలుక రెక్కల సవ్వళ్ళ రహస్యం కావాలా!
పగలంతా వళ్ళు పుళ్ళు చేసుకుని రాత్రి హోటల్ బల్లల సందులమధ్య కలతనిద్రలో ఉలికులికిపడే బుడ్డోడి గుండెలు తట్టి చూడు
అక్కడ తెరుచుకుంటుంది అసలు కవిత్వరహస్యకవాటం
05-09-2012

చింతం ప్రవీణ్||నా తెలుగు||

మాతృదేశంలోనే
ఇప్పుడొక మైలపడ్డపదం తెలుగు

నడుస్తున్న చరిత్రలోనే

అటకెక్కిన తాళపత్ర్రగ్రంధం తెలుగు

మడికట్టుక్కూర్చున్న ఇంగిలీషు బళ్ళో

ఇప్పుడొక అంటరానిపదం తెలుగు

చర్చలు లేని ఎంకౌంటర్లు జరిగిపోతూ ఉంటే

తల దాచుకున్న మిలిటెంటులా ఉంది తెలుగు

అమ్మా నాన్నల అశలకు మసిపూసిన మమ్మీ డాడీలు

ఈ శతాబ్దపు బాషా పరిణామం

సీసాపాలనే అమ్మపాలుగా సిద్ధాంతీకరించడం

ఈ శతాబ్దపు మేధో వికాసం

పోగుచేసుకున్న బాష అంతా

కాన్వెంట్ బళ్ళో
కార్పోరేట్ కౌగిళ్ళో
సమాధి చేస్తూ
వీసా పాస్ పోర్టులు నిస్సిగ్గుగా
పరాయిబాషని మన నాలుకలపై అతికిస్తున్నాయ్

మోఖానికి రంగులేసుకున్నోళ్ళు

తెలుగులోనే మాట్లాడుతున్నప్పుడు
దేషబాషలందు నా తెలుగు లెస్సే?

మనమిప్పుడు

తలాకొంచెం సిగ్గుపడదాం
స్వంత ఇంట్లో పరాయిలా ఉన్న మన తెలుగును చూసి
స్వంత వూర్ళో వెలికి గురౌతున్న మన తెలుగును చూసి

మనమిప్పుడు

మూకుమ్మడిగా తల దించుకుందాం
తేనెలొలుకు తెలుగుకు తగులుతున్న బెత్తం దెబ్బలను చూసి

ఇక

ఇప్పుడు మనకు కావలసింది
హోదాలు సొదలు కావు

ఆకలితో అలమటిస్తున్నవాడికి

అందలమెందుకు?

పదండి

కొత్త శిలాశాసనం వేద్దాం
తెలుగును బతికించడానికి
సామూహికంగా ఉద్యమిద్దాం
తెలుగుకు ప్రాణప్రతిష్ట చేద్దాం....


28.08.2012