పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
John hyde kanumuri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
John hyde kanumuri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జూన్ 2014, శుక్రవారం

John Hyde Kanumuri కవిత

రాత్రిమైదానం ||జాన్ హైడ్ కనుమూరి|| ~*~ ఓ రహస్య ప్రేయసీ! నేనొచ్చేలోగా కదులుతున్న బస్సు లోంచి అల్విదా చెపుతూ వూపిన చేతినీడల్లోంచి కన్నుల్లో మెరిసిన జలసయాలలో మునిగితేలుతున్నా ఉతికి ఆరేసిన వస్త్రాల్లా జ్ఞాపకాలను కాలం క్లిప్పులకెప్పుడో తగిలించా ఇప్పుడవి పీలికలు పీలికలుగా బయట పడ్తున్నాయి ప్రేమంటే తెలియని ఏ చిహ్నాల మద్యనో చిగురించిన పచ్చదనాన్నో వలచి వలచి ఏకంకాని రైలుపట్టాలమయ్యాము। కాలచక్రాలు కదిలిపోతుంటే మారింది నువ్వో… నేనో…? స్వప్న రాగాలకేం అన్నీతానై పలికిస్తుంది ఒక్కో స్వరాన్ని పల్కడానికి ఎన్ని నరాలు తంతిలయ్యే సమన్వయమో! నదిపై పిల్లగాలి అలల్ని తెచ్చినట్టు తేలియాడిస్తుంది తెరచాపెత్తిన పడవలో ఈలపాటై గానమాలపిస్తుంది ఇప్పుడు జ్ఞాపకాలు ఝడివానై కురుస్తున్నాయి తడిసిన దేహంతో ఈ వంటరి రాత్రి దాటేదెలాగో? నన్ను నేను చూసేందెకు నలుమూల్నించీ మెరుపు తళుక్కుమంటోది తడిపిన తనమేదో చలై మెలిపెడ్తున్నా ఒకొక్కటి గా విప్పే వస్త్రాలలో ఒక్కో రూపమైపోతున్నావు మన పరిచయం ఎక్కడిది? అక్షరాలవెనుక బలపమై పరుగెట్టిన పక్కింటి పరిచయమా! పాఠశాలనుండి హైస్కూలుకు ఎదిగి వయసు వయ్యారమేదో దూరంచేస్తుందని పూలరేక సొగసుల్ని జతచేసి కవితాగానాన్ని నేర్పేందుకు నీవిచ్చిన తొలిలేఖ అర్థంకాని కన్నుల్లో ఏ స్వప్నాన్ని వెదికావో? ఇప్పుడు నవ్వొస్తుంది కదూ! ప్రతి సంవత్సరం ఉత్తీర్ణులమై తరగతిగది వదిలేస్తుంటే ఎంత వుత్సాహంగా వుండేదో! ఊరికున్న హైస్కూలును వదిలేసాం కదా! ఇప్పుడది కాన్వెంటుకు పోతున్న పిల్లల్ని చూసి దారితప్పిన వంటరి పక్షిలా బిక్కుబిక్కుమంటూంది మనం ఆడిన ఆటలకు సాక్షిగా నిలిచిన సూరయ్యతోట నామరూపాలు కోల్పోయినట్టే ఆటలుకూడా కనుమరుగయ్యాయి కదా! ఇప్పుడు మార్కుల రేసులు కంప్యూటరు చిప్సు బాల్యమయ్యింది విడిపోయిన మనకాలేజీ దార్లకు ఎన్ని రహస్యమార్గాలు వెతకలేదూ! జీవితమెప్పుడూ అద్దంలో భూతంలా కనపడలేదు కలుసుకున్న క్షణాలన్నీ కబుర్లై గడిపెయ్యలేదూ! అత్తయ్యా! అంటూ అడుగెట్టగానే ఎంత గుండె దడ దడ! ఇప్పుడా గుండె చప్పుళ్ళేవి? ముసిముసిగా నవ్విన మౌనాన్ని శాస్త్రంగా రాయాలనుందిప్పుడు కానీ ఆ నవ్వుల నిగారింపేదీ? ఎక్కడా ఎవ్వరిలోనూ కనపడదేం? జీవనయానం కోసం బందీలౌతూ నవ్వుల్ని తాకట్టు పెట్టేందుకు ఎక్కడెక్కడికో వలసపోతున్నాం కదూ! అయినా అమ్మనీకు ఎలా అత్తయ్యిందో? ఎన్నడైనా మతంవేరని కులంవేరని అనుకున్నామా? ఆన్నట్టు ఇప్పుడొచ్చిపలుకరిచాలన్నా అత్తయ్య లేదు తెలుసా? విడివడిపోతున్న బంధాలకు దూరంగా జరిగింది. వెన్నెల పొద్దులో విప్పుకుంటున్న అరటిపువ్వుల డొప్పల శబ్దాల్ని వినడం నేర్చివుంటే కాటుకరెప్పల చప్పుళ్ళను ఒక్కోముత్యమై వొదిగే హారాన్నిచేసి విజయాన్నేదో వడిసిపట్టి వినువీధుల్లో తిరిగేవాణ్ణేమో! ఆ కీచురాళ్ళకు ధ్వని సంగీతాన్ని నేర్పిందెవ్వరు? ఎన్ని రాత్రులు గీతమాలపించాలని ప్రయత్నించామో? స్మృతి సమాధి తలుపులు తెరుచుకుంటున్నాయి అనంత యాత్రకు ఆహ్వానం పలుకుతున్నాయి సంఘటనలు చిన్నివైనా వెదకి తడిమి చూస్తున్నాయి ఆశించినదేమైనా దొరుకుతుందా! వెదకులాట నానుంచి నీవు నీనుంచి నేను ఆశించినదేమీ లేనప్పుడు ఎందుకీ వెర్రి ఆలోచనలు? రంగుల స్వప్నాలెలావస్తాయనే నిరంతర అలజడి ఒక్కసారైనా ఇంద్రచాపానికి చినుకు వెలుతుర్లమై నిలిచామా? నియంత్రించే ఆంక్షలమద్య బందీలం స్వేచ్చారెక్కల్ని ఎప్పుడైనా చూస్తే కదా! పండిన తలతో యిప్పుడు స్వేచ్చను నిర్వచిస్తున్నాం చిత్రంగా వుంది కదూ! పందిరి తోరణం కడుతున్నప్పుడైనా గూడు కట్టూకున్న మనసుని ఆరాధనా దీపంగా వెలిగించాలనిపించలేదేం? శుభలేఖల్ని రెక్కలుగా కట్టి అందరినీ ఆహ్వానించా నడుస్తున్న ఏడడుగుల క్రింద మనసు నలుగుతుందని అనిపించలేదేం? గోదారి అలలపై సరంగు పాడిన పదం ఏ విషాదాన్ని వొలికించదేం? నదిలోతుల్ని కొల్వడానికి తనదగ్గర కొలతలేవీ లేవంటూ వేస్తున్న గడతో ఊర్ల తీరాలు దాటించేస్తున్నాడు మనమే ఏదో తెలియని వెలితి తీరాల్లోకి అడుగుపెడ్తున్నాం బహుశ అలజడి చెందిన నీ కళ్ళను చూసి కొత్తసిగ్గు శింగారమనుకున్నదేమో ఆ గట్టు పై నీకోసం పూలపల్లకి ఎదురుచూస్తుంది రాలేని నా కాళ్ళు బరువెక్కుతున్నాయి అప్పుడెప్పుడో మిఠాయి మోసుకొస్తూ పరుగెత్తుకొచ్చిన గస స్పర్శ నాకు లేదుకదూ! ఈ రోజు మాట్లాడాలని వుంది। నీచెవి నాకోసం కాదు కదా! జాబిలేదో కొత్తరెక్కల్ని తొడిగి వెన్నెల విహారానికొచ్చినట్లుంది ఏ కాంతీలేని నాలోకి పదే పదే దూరాలని చూస్తోంది సంసార చక్రానికి బిగించబడ్డపుడు నీ బంధాలేవో! అన్నీ రేఖామాత్ర లక్ష్మణ రేఖలే! జీవితాన్ని వెదుక్కుంటూ వెదుక్కుంటూ ఏ సడీలేని సమయాన నా వెంటొచ్చిన ఓ వనిత బంధాలేవో కూర్చింది అనురాగమై అల్లుకుందో! అవసరాలే తీర్చిందో! కేర్ కేర్ మన్న శబ్దంవెనుక ఆకలుందో ఆత్రముందో నేర్వాల్సివచ్చింది నడక నేరుస్తున్న పాదంముందు మూడుచక్రాల బండిని నేనే ఇద్దరు నల్గురయ్యే పదఘట్టాలలో ఏది మరచానో… ఏది కూర్చానో…? ఓ చల్లని సాయంత్రం కిక్కిరిసిన సుల్తాను బజారులో ఏ పిల్లల దుస్తుల మద్యనుంచో చిరునవ్వై పలుకరించావు బెదురు బెదురు అరుపులకు కోడి పిల్లల్ని రెక్కల్తో కప్పినట్టు కాలమేదో కప్పేసింది హఠాత్తుగా వులిక్కిపడింది నేనా? నా మనసా? నా పరిస్థితా? అప్పుడప్పుడు నీ కనుల పలకరింపులు సరికొత్తగాయాన్ని చెసాయి గాయాలు కొత్త కాదు కదా! నోట్లతో కట్లుకడుతున్నా! ఇప్పుడు మన ఇష్టాల్ని కలబోసుకుని స్వప్నలిపికి భాష్యాల్ని తప్పిపోయిన దారుల్ని అన్వేషిస్తూ వేర్వేరు బిందువులమై చెరొ వొడ్డున నిలబడి సంకేతాలను నిరంతరం వెదజల్లుతున్నాం దాచుకుంటున్న శ్రమబిందువుల్ని ఎగురుతున్న గ్రద్దేదో తన్నుకుపొతుంది ఏమి కూరుస్తున్నామనేది శేష ప్రశ్న? అప్పుడెప్పుడో నగరానికి నీ వస్తున్నావని తెలిసి కన్నుల్లో వత్తులేసి అర్థరాత్రో అపరాత్రో ఇరానీ చయ్ చప్పరిస్తూ నిదుర కళ్ళతో ఎదురుచూసిన అఫ్జల్ గంజ్ బస్సు స్టేషను యింకావుంది మస్సును తెరిచిన ఆకాశంచేసి చార్మినార్ గుమ్మటాలపైనుంచి చూసిన నగర సౌందర్యమెంతగా మారిందో తెలుసా! మక్కా మసీదులో ఎగిరే పావురాల మద్య జొన్నగింజల మవ్వాలని ప్రయత్నించలేదూ! పావురాలింకా గింజలకోసం పోటీపడ్తున్నాయి. ఖండాల్ని దాటొచ్చి కనువిందుచేసి నీ జడలో మందారాన్ని లాగిన జిరాఫీ కాని చోటులో కలిసుండలేమంటూ తనువు చాలిస్తే భర్తీ చేయలేని 'ఝూ ' వెలవెలపోతుంది తెలుసా! నీ వంటూండేదానివి చల్లదనాన్ని రాతిలోనో చోటులోనో దాచుకున్న బిర్లా మందిర్ వెన్నెలకొండగా మెరుస్తుందని పరుచుకున్న హైటెక్ రోడ్ల నియాన్ కాంతిలో పరుగులెడుతూ అటుచూసే తీరికేది? ద్వారాలులేని అంతఃపురాలచల్లదనం మర్చిపోటట్టు గోల్కండ ఖిలా నగరం మద్యకొచ్చింది తెలుసా! ఏమగ్గాలనుంది తెచ్చావో చీరెంతో బాగుందని మురిసి మురిసిన నా యింతి ఎంత పదిలంగా దాచిందో ఇంకా అలానేవుంది తెలుసా? నగరం మనల్ని మింగేసిందేమో! ఇప్పుడు నీవచ్చావని తెలిసీ రోజూ ఎదురెదురు మట్టాడుతున్నట్టే గాలి తరంగాలలో సుక్ష్మాతి సూక్ష్మ భాగాలుగా విడిపోయి కలవలేక పోతున్నాం నీ వొచ్చిన పనుల మద్య యిల్లు దూరమై కలుసుకొనే చోటుకోసం వురుకులు పరుగులు ఎన్నో పనుల్ని పక్కకుపెట్టి ప్రయాణ సమయంకోసం నడుస్తున్న దారిలో ట్రాఫిక్ ఆటంకాలు దాటి చేరేసరికి జిడ్డుమొహంతో నేను పడిగాపులు బస్సుకోసమో కదులుతున్న బస్సులోంచి నాకోసమో చూపులన్నీ గడియారంపై చూసి చూసి విసుగెత్తిన మొహంతో నీవు ఉస్సూరుమంటూ నిట్టూర్పుతో మట్లాడాలేని మౌనంతో మూగబొయిన సైగలే మన బందానికి సరికొత్త దారంతో ముడివేసాం కదూ! ఇప్పుడేదైనా మాట్లడొచ్చు నిర్భయంగా చెవిలో గుసగుసలాడొచ్చు ఉత్సహ రింగు టోనుకోసం ఎదురుచూడొచ్చు సాలెగూడులో చిక్కుకున్న బంధానికి తీరికేది మనల్ని ఓలలాడించిన స్వరాలన్నీ ఒకొక్కటిగా మూగపోతున్నాయి శృతిచేయని స్వరాలమద్య ఇప్పుడిక స్వప్నాల్లేవు అన్నీ అగ్రిమెంటులే అన్నీ కరెన్సీ కొలమానాలే వెలితి వెలితిగా తడుముకుంటున్న బాల్యం గుర్తులు తవ్వుకుంటున్న జ్ఞాపకాలు వసంతాలిప్పుడు రంగుల్లోకి మారాయి పసుపు నీళ్ళతో పనేంటి? నా కిప్పుడు ఏదేను వనంలోనో బృందావనంలోనో తిరగాలనుంది దావీదు మ్రోగించిన పిల్లనగ్రోవి గీతమవ్వాలనివుంది పిచ్చిగా దేహాలు ముక్కలౌతున్నాయి మన రేపటి కలలపై మిస్సైల్స్ ఎక్కుపెట్టబడ్డాయి నిన్ను అందర్ని వంటరిగా ఎలా వదలాలి? వెర్రి వెక్కిరింతేదో వినిపిస్తున్నా నా గుండెను ఎదురొడ్డుతున్నా ఓ రహస్య ప్రేయసీ వీడ్కోలుకై వూపిన చేయి మసక మసగ్గా కదిలిపోతుంటే కలవర పెడుతున్న ఈ రాత్రి మైదానాన్ని ఎలానైనా దాటి వేకువలో విరిసే సూర్య పుష్పమవ్వాలని వుంది వర్షానికి ముందు యెగిరే తూనిగల గుంపునవ్వాలని వుంది రేపటి స్వాగతోత్సవానికి సిద్దపడాలని వుంది వేకువలో కోయిల గొంతుల కొత్తగీతమవ్వాలని వుంది. ~***~ ........రచనా సమయం 2007 ...20.6.2014

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UjyWxd

Posted by Katta

19, జూన్ 2014, గురువారం

John Hyde Kanumuri కవిత

నా నంబరు మారలేదు ||జాన్ హైడ్ కనుమూరి|| ~*~ నాకు మొబైలిప్పుడు కేవలం సాంకేతిక సమాచార సాధనమే కాదు నా దేహాన్ని, ఆలోచనల్ని వైబ్రేట్‌చేసే పరికరం కూడా. అవసరాలమధ్య అనుసంధానమౌతున్న అనేకనెంబర్లతోపాటు నీ నంబరు అలానేవుంది అప్పుడప్పుడూ ఏదొకటి వెదకుతున్నప్పుడు నీ పేరుతో నంబరు కన్పిస్తుంది అంతటి వెదకులాటలో ఓ జ్ఞాపకం సన్నగా తడుతుంది ఒక్కసారి ప్రయత్నిద్దామని మదిలో తొలుస్తుంది ప్రయత్నించిన వెనువెంటనే కలిసుంటే ఈ పద్యమే లేదు అందుబాటులో లేవనో, పరిథిలో లేవనో పదే పదే పలుకుతుంది దగ్గరవ్వాలనే ఆలోచనకు విభజన రేఖేదో అడ్డమొస్తుందేమో! వాణిజ్య బేరీజులమధ్య నెంబర్లు మారుస్తుంటాము కానీ ఆది నా దగ్గర వుండదు వాడని నెంబర్లను తీసివేస్తుంటాము మరి నా నంబరు నీ దగ్గరుందో లేదో నాకిప్పుడు నీ పిలుపునుంచో, మాటల్లోంచో పొందే తరంగ తాకిడికోసం నీ నుంచి రింగు కావాలి నా నెంబరు మారలేదు సుమా! హఠాత్తుగా జీవితాన్ని ఏమీ మార్చలేదు అయినా అదే ఐడియా 9912159531 *** 19.6.2014 04:37 hours ISD

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1phdimF

Posted by Katta

17, జూన్ 2014, మంగళవారం

John Hyde Kanumuri కవిత

పుస్తకం తెరచి ఎన్నాళ్ళయ్యిందో! ~*~ పళ్ళచక్రాలను బిగించుకున్నట్లు అంతా నియమితంగా తిరుగుతుంది ఓ వయస్సు దేహంపై వాలాక నిద్రపొరను వదిలేయడం ఎంతకీ అర్థంకాదు కాలేజీ రోజుల్లో నీళ్ళు కుమ్మరించినా మత్తువదలని కళ్ళేనా అనే ఆశ్చర్యం ఎవ్వరూ నిద్రలేవని సమయానికి పాలప్యాకెట్టును ఆహ్వానిస్తే ఇక వంటగదిలోంచి కాఫీ వాసన పక్కింటికి చేరుతుంది పొయ్యిపై అన్నం ఉడుకుతుంది చూస్తుండు అని అమ్మచెబితే పొంగిన ఎసరుతో ఆరిపోయిన కట్టెలపొయ్యి ఎగాదిగాచూసింది నేనేనా! కొద్దిగా నడక ఓ బ్రెస్సు పేస్టులతో వ్యాయామం కొలతప్రాకారం గొంతులోకి కొంచెం దిగాక వాటికి తోడుగా కొన్ని మాత్రలు ఇక ఆఫీసుకు బయలుదేరాలనే ఆత్రం మొదలౌతుంది దేహాన్ని కొంచెం కడిగి కావలసినవేవో సర్దుకుని ముఖ్యంగా తాళాలు, కళ్ళజోడు రోడ్డెక్కి వాహనం కోసం ఎదురుచూపులు ఆలస్యమైదేమోనని బేజారులు ఒక్కసారి వాహనం ఎక్కాక మళ్ళీ తిరిగి ఎక్కినచోటే దిగేదాకా ఎక్కడున్నానో నాకే తెలియని స్థితి ఎందుకంటే రోజూ ఏదొక సమస్యల ఫైళ్ళు తెరుచుకుంటూనే ఉంటాయి తెరుచుకున్న కంప్యూటరు వేడెక్కిన తన దేహాం ఎప్పుడు చల్లబడుతుందోనని చూస్తూనే వుంటుంది ఇంటికిచేరాక ఆకలి నాలుగు మార్గాల రోడ్డెక్కిన కొత్తకారులా పరుగెడుతుంది మళ్ళీ కొలతలతో ఆహారం జతగా మాత్రలు అరాకొరా అంతర్జాలవిహారం మొదలయ్యాక అలసట రెప్పలపై వాలుతుంది దేహం ఎప్పుడు పక్కపై వాలుతుందో! దాచుకున్న ఆశల ఇష్టాలు అలా షెల్పుల్లో దాక్కున్నట్టే ఉంటాయి కొనుక్కున్న పుస్తకమో మిత్రులు ప్రేమగా పంపిన పుస్తకమో అలంకారాలైన అనేక పుస్తకాలు క్షణాలు కణాల మద్య నిరంతరం సంఘర్షణ పుస్తకం తెరచి చాలారోజులయ్యింది. .....................17.6.2014 21:30 గంటలు

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ly0O69

Posted by Katta

13, జూన్ 2014, శుక్రవారం

John Hyde Kanumuri కవిత

ఆ రాత్రి - ||జాన్ హైడ్ కనుమూరి|| గజల్ కలలోనైనా మెలకువనైనా గుర్తుండేదీ ఆ రాత్రి నీతో నడచీ అలుపును మరచీ సాగినదీ ఆ రాత్రి నిన్ను నన్నూ కలినదెవరో తెలిసేలోగా కాలం పరిచిన తిన్నెలపై వెన్నెల పరచినదీ ఆ రాత్రి నిట్టూర్పు సెగలతో క్షణాలు యుగాలుగా నీకై వేచివున్న మదిగదిని రెప్పవేయనిదీ ఆ రాత్రి శిశిరానికి ఆకురాలిన కొమ్మను నేనై పొటమరింతల చిగురుకై ప్రసవవేదనైనదీ ఆ రాత్రి హోరు గాలిలోచిక్కి ఒంటరైన పక్షికి దిగులుగా గుబులు గుబులుగా గడచినదీ ఆ రాత్రి కలలుకన్న తనువున నిదురనే తరిమి వేలవేల వీణెలు మీటిన సంగీతమైనదీ ఆ రాత్రి ఎదురెదురు రేవులలో కలవలేని కనులుగా దరి చేరని నది అలలపై ఊగి ఊగి సాగినదీ ఆ రాత్రి అప్పగింతల పర్వమే తెగిన శాశ్వత బంధంగా తలచి తలచి వర్షించే కనులతో తడిసినదీ ఆ రాత్రి నెలరాజునిండిన తోటలో రేయంతా పాటగా కూ'జాను'వొంపిన గజళ్ళతో కడుపు నిండినదీ ఆ రాత్రి ---------------------------------- May 14th, - June 12th 2014

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v6YbQn

Posted by Katta

3, జూన్ 2014, మంగళవారం

John Hyde Kanumuri కవిత

హమ్మయ్య గడచింది రాత్రి |జాన్ హైడ్ కనుమూరి | *** సాయంకాలం అవ్వగానే వస్తూ పోతున్న విద్యుత్తు మేఘావృతమైన ఆకాశం వుక్కపోతకు చెమటపట్టిన దేహం హఠాత్తుగా ఉరుములు మెరుపులు కిటికీలను విరగ్గొట్టే హోరు గాలి కొద్దిగా చినుకులు గాలితో పాటు వస్తుంటే తలుపులు మూయాలనే పిలుపులు ఎక్కడో ట్రాన్స్‌ఫార్మర్ పేలిన చప్పుడు ఇక విద్ద్యుత్తు రాదని నిర్ణయించుకొని ఇటుదొర్లి అటుదొర్లితే కంటికి నిద్రేమీ సరిపోక మండుతుంటే ఇదిగో ఇప్పుడే పలకరించడానికి వచ్చింది విద్యుత్తు. రాత్రి మాటేమోగాని ఆఫీసులో చెయ్యాల్సిన పనులు చాలానే వున్నాయి. 3.6.2014.....08:22 hours ISD

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o4LRhd

Posted by Katta

31, మే 2014, శనివారం

John Hyde Kanumuri కవిత

ఇన్నాళ్ళూ వలస పోవడం భౌతికమనుకున్నాను అంతర్జాలానికి కూడా వర్తిస్తుందని ఇప్పుడే అర్థమయ్యింది చాట్ గదులనుంచి మెసింజెర్లకు బజ్లనుండి మి చాట్‌కు బ్లాగులు బాగోగులు ట్విట్టర్, ఆర్కూట్, ...ఫేసుబుక్కు వాట్సప్............... యుపిస్.. మోనిటర్... కీ బోర్డు.... మౌస్స్స్ లాప్ టాప్...... ఐ పాడ్.. ఇదో ... అదో .... ఎదొక మొబైల్...... తృప్తి అసంతృప్తుల మధ్య కొత్తదనాన్నేదో వెదక్కుంటూ వలసపోవల్సిందే !!! ........................................31.5.2014 06:50 hours ISD

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1krqvEX

Posted by Katta

25, మే 2014, ఆదివారం

John Hyde Kanumuri కవిత

??? ||జాన్ హైడ్ కనుమూరి|| నీ శ్రమవున్నంత మాత్రాన ఈ రహదారి సొంతమేమీ కాదు కొందరు ముళ్ళను నరుక్కుంటూ కాలిబాటలో నడిచివెళ్ళారు కొందరు కంకరరాళ్ళను పరచుకుంటూ ఎడ్లబళ్ళను తోలుకెళ్ళారు దోచుకున్న సంపదను తరలించేందుకు చెమటచుక్కల ఇందనాలతో రోడ్డురోళ్ళను నడిపారు కొందరు ఊరు నాల్గక్షరాలు నేర్చాక కాలిబాట రోడ్డయ్యింది నాచుట్టూ పరుచుకున్న విషవలయంలో ఊర్లోని రోడ్డు ఊరుమీదనుంచి రహదారిగా మారింది నేనింకా తొక్కాలనుకునే సైకిలికిప్పుడు ఆ రహదారిపై అనుమతిలేదు నా ఊరిదేహభాగమైన రహదారిపై కారు నడపాలంటే, బస్సెక్కివెళ్ళాలంటే పన్నుచెల్లించాల్సిందే! * * * కాలిబాటకు కాలంలో ఎన్ని మార్పులు * * * అంతర్జాల ప్రయాణంలో మార్పువెంట మార్పులు నాదైనదేదీ నాది కాదు *******************25.5.2014 6:00 - 7:25 pm ISD

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oh6f0u

Posted by Katta

1, మే 2014, గురువారం

John Hyde Kanumuri కవిత

తరతరాలుగా ఏమీ లేదిక్కడ నినాదాలు తప్ప ప్రపంచ కార్మికులారా! ఏకంకండి! ఏమిసాధించాం మళ్ళీ బానిసత్వానికి తెరలు తీద్దాం కాంట్రాక్టు పనులన్నీ బానిసత్వమేగా! చెమట రంగు పులుముకొని నినదిద్దాం చెమటకు అన్నిరంగులొక్కటే అక్కడో బిర్యానీ దొరుకుతుంది! ఈ రోజు గడిచిపోతుంది ఎండిన డొక్కలు మండే కడుపులపై ఎసి కార్లు దూసుకుపోతాయి నిన్నెవరో పుట్టారు! ఈ రోజెవరో గిట్టారు! ఎవ్వరు మిగిల్చిందేమీ లేదు అలా అలా విదిల్చిన అక్షరాలను అద్దాల మేడల్లో పదిలపర్చుకుంటున్నారెవరో! రెక్కల కష్టం నాదే! ఆకలి అరుపు నాదే! ఆత్మఘోష, కంఠశోష కన్నీటి చెరువులెండిపోతున్నాయి సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు ఏమీ లేదిక్కడ నినాదాలు తప్ప .............some mixed feelings 1.5.2014 05:40 hours ISD

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nK3RPa

Posted by Katta

29, ఏప్రిల్ 2014, మంగళవారం

John Hyde Kanumuri కవిత

అప్పుడప్పుడూ కళ్ళెదుటే సరోవరం కదిలించబడతుంది కదలలేని స్థితిలోపడి ఎదురుచూస్తుంటాం సహాయమందించే స్పర్శకోసం నిరాశగా సంవత్సరాలు గడచిపోతాయి అలా పడివుండటం అలవాటయ్యిందనుకుంటారు తోసుకువెళ్ళడాన్కి మనసే లేదనుకుంటారు దేహాన్ని కృంగదీసిన వ్యాధి అంతరంగాన్ని కృంగదీస్తుందని ఎవరికైనా ఎలా తెలుస్తుంది? చెట్లు ఆకుల్ని రాల్చినట్టు కాలం సంవత్సరాలను రాలుస్తుంది కదిలే దేహాలన్నీ కదలిపోతుంటాయి ఎవరికోసమో ఎదురుచూసినంతకాలం అలా పడివుండటం తప్పదు * * * నన్ను నన్నుగా ఎరిగి దేహాన్నీ అంతరంగాన్నీ లేవనెత్తి సాగిపొమ్మని ఆజ్ఞాపించినవాడి మాట ఆశ్చర్యమే! *****************29.04.2014 04:50 hrs ISD

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kfvZnY

Posted by Katta

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

John Hyde Kanumuri కవిత

Gazal |John hyde Kanumuri| అలా అలా దాగిన జలతారు పరదాలచాటు గుర్తుందిలే గల గలా సాగిన నవ్వులతీరు మరల మరల గుర్తుందిలే నీకై నిరీక్షించి నిరీక్షించిన ఆ సాయంకాలం కనులెదుటే మెరుపులా వచ్చిపోయిన జాడ గుర్తుందిలే! పరాకుగా విదిల్చిన మాటకు నొచ్చుకున్నావో లేదో ప్రక్కకు తిరిగి గిర్రున రాల్చిన ముత్యపుబొట్టు గుర్తుందిలే ! చిగురుతొడిగిన మొగ్గ సిగ్గులొలికిన నా బుగ్గ అందానికే అందమని చదివిన ఆనాటి కవిత గుర్తుందిలే! గుబులుపెట్టిన ఆ నీలిమేఘం భళ్ళున రాలితే చెట్టునీడలో ఒదిగి ఒదిగి తడిన ఆ వాన గుర్తుందిలే! బాటసారినై అలసి నీ గుమ్మాన దాహమడిగితే చిరునవ్వుల కూజాను ఒంపితడిపిన తీరు గుర్తుందిలే ! **********25.4.2014

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1il7mtf

Posted by Katta

21, ఏప్రిల్ 2014, సోమవారం

John Hyde Kanumuri కవిత

ఎవరైనా ఎందుకు వస్తారు *** పిలిచినంతనే తమ పనులు మానుకుని ఎగురుకుంటూ వస్తారంటావా! ఎప్పుడో ముడిపడిన బంధాన్ని జ్ఞాపకంచేసి కొన్ని క్షణాలు గతంనుంచి వర్తమానానికి వంతెనె కట్టాలని ఎదురుచూస్తుంటావు రాలిపోయిన శిశిరాకులను కుప్పలుచేసి కాల్చాలనుకున్నప్పుడు నీ జ్ఞాపకాలు రేగే పొగలా అన్పిస్తే ఎవరైనా ఎందుకు వస్తారంటావు ! నీవు పంచాలనుకునే గంపలగంపల పళ్ళు రుచీ పచీ లేనివని అనుకుంటుంటే ఎవరైనా ఎందుకు వస్తారంటావు ! నీవు ఎదురుచూస్తున్న సమయానికి నేనెంత బిజీయో నీకు తెలియదు పలకరింపుల స్పర్శాహస్తంకోసం నువ్వు ఎదురు చూస్తుంటావు నీవులేనప్పుడు నలుగురూ చేరితే వారిమధ్య సంతోషాన్నో, దుఃఖాన్నో కొంచెం పులుముకొని వస్తారు కొంచెం గుప్పెటను విధిలించడానికి నీ స్వరాన్ని విప్పి అందరికీ ఎవో జీవన సంగీత సంగతులు విన్పించాలనుకుంటావు నువ్వలా పాడుతుంటే నీకు తెలిసినదెంతో ఉంటుంది అయినా ఎవరికి తెలిసిన కొలతల్తోనే నిన్ను చూడాలనుకుంటారు అన్నవచ్చాడని తమ్ముడూ గురువు వచ్చాడని శిష్యుడు అలావచ్చి మొహం చూపించిలోగా సెల్లుఫోనులోంచి ఎవ్వరో వాలుతారు నీకో నవ్వుముఖం పాడేసి మాట్లాడుతూ మాట్లాడుతూ చల్లగా జారుకుంటారు నీనుంచి నేర్చుకోవడం మానేసి నీవే మారాలంటూ సలహాలిచ్చిపోతారు ఎన్నో ఏళ్ళుగా చూసున్న అదే అరుగును బాధలను, కన్నీళ్ళను పదే పదే ఊడుస్తూ ఒంటరిగానే పాడుకుంటావు. వినడానికి ఎవరైనా ఎందుకు వస్తారు ......................21.4.2014....7:00 ఉదయం

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Qyi3N1

Posted by Katta

20, ఏప్రిల్ 2014, ఆదివారం

John Hyde Kanumuri కవిత

దేహ సంఘర్షణ || జాన్ హైడ్ కనుమూరి || నిదురలోనూ మెలకువలొనూ కవిత్వం పంట పండుతోంది కోత కోయడానికో కుప్ప నూర్చడానికో పరుగెడుతుంటాను రాత్రంతా రాలిన గింజల్ని లెక్కించాలని కన్నులేవో చూస్తుంటాఅయి పొయ్యిలో లేవని పిల్లితో సహచరి యాతనపద్తూంది కొత్తగా వచ్చిన దోమేదో పిల్లల్ని ముద్దాడినట్టుంది ఒక్కటే ముద్దుల పలవరింతలు తేలికౌతున్న దేహాన్ని బంధాలన్నీ లాగిపడ్తుంటాయి వెదజల్లే విత్తనాలు రుచించని ఆహారమై కంపిస్తుంది పిడికిలి పట్టిన గింజలు వెదజల్లడం కోసమే! దున్నబడ్డ భూమిలో వెన్నొంగిన పంటకోసేందుకు కొత్తతరం ముందుకొస్తుంది .....................................................28.9.2011.......20.4.2014

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i25q8O

Posted by Katta

17, ఏప్రిల్ 2014, గురువారం

John Hyde Kanumuri కవిత

రాత్రంతా వర్షం కురుస్తోంది ||John Hyde Kanumuri || వేకువనే తనువంతా అరగదీస్తూ వాకిలిని ఊడ్చిన చీపురును ఎవరు పలకరిస్తారిప్పుడు ఏదోమూల అలా స్తబ్దుగావుంది బురదనిండిన వాకిలిని చూసావా పాదానికి అంటకుండా అక్కడక్కడా వేసిన రాళ్ళపైనుండి అంగలువేస్తూ నడవడం గమనించావా! పొటమరించిన అంకురాలతో నునులేతపచ్చరంగు అలుముకొని శింగారించుకుని నారుమడులు, నాట్ల మధ్య ఆరేసిన పొలాల కలనేత ఊరు బురదవీధుల్లో నడిచెళ్ళిన పశువులమధ్య గిట్టలగుర్తులతో ఆవేదో, గేదేదో, ఎద్దేదో ఎటుగా వెళ్లిందో పసిగట్టడం నేర్చావా! పశువులను తోసుకుంటూ నీరునిండిన గుంతలను దాటుతూ సన్నగా కురిసే చినుకులకు పలక నెత్తినపెట్టి పరుగెట్టి బడి గిలకబావిని చేదుకున్న నీళ్ళో కడుకున్న కాళ్ళో గమనించావా! ఈ రాత్రంతా వర్షం కురియాలి గుమ్మపాల నురగలతో స్వచ్చతనేదోవెతుక్కుంటూ వాకిట నిలబడి నీకోసం పడవలను వదులుతాను! .......original......23.7.2013

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1meOawt

Posted by Katta

10, ఏప్రిల్ 2014, గురువారం

John Hyde Kanumuri కవిత

కొందరిని కలవాలని మనసు ఆశపడ్తుంది నగారానికి చెరో అంచులో ఇద్దరముంటాము నగర ఆంక్షలు కలవకుండా లాగిపడ్తున్నాయి యవ్వన దేహానికి సమయంచిక్కదు సమయందొరికేసరికి దేహం సహకరించదు నగరం ప్రతీకగా మిగుల్తుంది కార్లు, బస్సులు, ట్రైన్లు, ట్రాములు, విమానాలు పరుగెడుతూనే ఉంటాయి 10.4.2014 07:10 ISD

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/R4ckiM

Posted by Katta

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

John Hyde Kanumuri కవిత

కృపాతిసయము *** తరతరములలో నీ ఉపదేశములను మా పితరులకిచ్చి నడిపించితివి, నిలిపితివి ఇలలో చీకటిలో నడచిన జనులకు నీ వాక్యపు వెలుగు జ్యోతులతో నీ త్రోవలలో తొట్రిల్లక నివశింపజేసితివి నేటివరకు మరియ సుతుని మాకొరకిచ్చుటకు నీ దయకు ప్రాప్తురాలుగ జేసితివి వేదన బాధలలో తోడుగనుండి వదనము మార్చితివి నీ రూపులో కలతలందు వెతలయందు కల్లోలపరచిన కన్నీళ్ళయందు ఏకాంతంగా సంధించి అబ్రహాము తండ్రిగా బలపరచితివి సంసోనుకిచ్చిన బలముతో సమూయేలుకిచ్చిన నీ పిలుపుతో సుందరత్రోవలలో నడచుటకు యిమ్ము మరి యాశీర్వాద అపరంజి పాదముల్ సుందరపట్టణ బంగారు వీధులలో నడువ కటాక్షం బొసగ యిచ్చిన గురూతులతో ఆశీర్వదించితివే ఆనందమయముగా మమ్ము మూడింతల దీవెన మాకొసగ మా మససు నీతిఫలములు ఫలియింపగ నీధ్యాసలో మిక్కుటముగ నడువ నీ మధుర స్నేహ వచనమిచ్చితివి మాకొరకు కృపాకనికరము లింకను నిజానుభవములతో నింపి అగష్టస్ కాలమునుండి నింపితివే నిన్నెరిగిన వారికి నా డెందముప్పొంగగ యేసుడే విడువక నింపెనే సదా నందము రత్నములై మెరిసెనిల కృపాతిశయమేరీతి పాడెద పద్మప్రియ తేజునికి మరణం గెల్చిన విజయం వందనమ్ములీ నా పదములెల్ల సుధాకరుడగు యేసుని నిత్యభూషణంగ ధరియింప శాంతి స్వరూపులనుగా మార్చి చైతన్య పరచితివి ఇలలో ప్రీతిగల నీమాట, పాటలు ఆశతో మేము నేర్వగా శృతిచేసి మమ్ములను సుందర సింగారము చేసితివి పరమేరీతి పోనగునో నీ దాసు నీలాగు దెల్పితివే దావీదు రాజ కుమార జయకుమార తరలితివే స్లీవకు మము రక్షించగ ఏమిచూసో నుర్వితిగుచుండ నీ వాక్యఖడ్గాన పరంజి చేసి చీల్చితివే కీళ్ళ మూల్గులను సుందరంబే స్సియోను మార్గము పద్మమే వికసింప ధరిత్రిపాడెనే శ్రావమై ఆకసం జయగీతమెత్తి సంగీతమే అలరారే ప్రతినోట నీ ప్రేమ కొనియాడగ మధురమేగా మాటిమాటికి రుచి చూతును, ధ్యానింతుము బోధింతును ఎల్లవేళల హల్లెలూయ, హల్లెలూయ హల్లెలూయ, హల్లెలూయ ఆమేన్ ... ఆమేన్

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Pr4T3S

Posted by Katta

3, ఏప్రిల్ 2014, గురువారం

John Hyde Kanumuri కవిత

కృపాతిసయము *** తరతరములలో నీ ఉపదేశములను మా పితరులకిచ్చి నడిపించితివి, నిలిపితివి ఇలలో చీకటిలో నడచిన జనులకు నీ వాక్యపు వెలుగు జ్యోతులతో నీ త్రోవలలో తొట్రిల్లక నివశింపజేసితివి నేటివరకు మరియ సుతుని మాకొరకిచ్చుటకు నీ దయకు ప్రాప్తురాలుగ జేసితివి వేదన బాధలలో తోడుగనుండి వదనము మార్చితివి నీ రూపులో కలతలందు వెతలయందు కల్లోలపరచిన కన్నీళ్ళయందు ఏకాంతంగా సంధించి అబ్రహాము తండ్రిగా బలపరచితివి సంసోనుకిచ్చిన బలముతో సమూయేలుకిచ్చిన నీ పిలుపుతో సుందరత్రోవలలో నడచుటకు యిమ్ము మరి యాశీర్వాద అపరంజి పాదముల్ సుందరపట్టణ బంగారు వీధులలో నడువ కటాక్షం బొసగ యిచ్చిన గురూతులతో ఆశీర్వదించితివే ఆనందమయముగా మమ్ము మూడింతల దీవెన మాకొసగ మా మససు నీతిఫలములు ఫలియింపగ నీధ్యాసలో మిక్కుటముగ నడువ నీ మధుర స్నేహ వచనమిచ్చితివి మాకొరకు కృపాకనికరము లింకను నిజానుభవములతో నింపి అగష్టస్ కాలమునుండి నింపితివే నిన్నెరిగిన వారికి నా డెందముప్పొంగగ యేసుడే విడువక నింపెనే సదా నందము రత్నములై మెరిసెనిల కృపాతిశయమేరీతి పాడెద పద్మప్రియ తేజునికి మరణం గెల్చిన విజయం వందనమ్ములీ నా పదములెల్ల సుధాకరుడగు యేసుని నిత్యభూషణంగ ధరియింప శాంతి స్వరూపులనుగా మార్చి చైతన్య పరచితివి ఇలలో ప్రీతిగల నీమాట, పాటలు ఆశతో మేము నేర్వగా శృతిచేసి మమ్ములను సుందర సింగారము చేసితివి పరమేరీతి పోనగునో నీ దాసు నీలాగు దెల్పితివే దావీదు రాజ కుమార జయకుమార తరలితివే స్లీవకు మము రక్షించగ ఏమిచూసో నుర్వితిగుచుండ నీ వాక్యఖడ్గాన పరంజి చేసి చీల్చితివే కీళ్ళ మూల్గులను సుందరంబే స్సియోను మార్గము పద్మమే వికసింప ధరిత్రిపాడెనే శ్రావమై ఆకసం జయగీతమెత్తి సంగీతమే అలరారే ప్రతినోట నీ ప్రేమ కొనియాడగ మధురమేగా మాటిమాటికి రుచి చూతును, ధ్యానింతుము బోధింతును ఎల్లవేళల హల్లెలూయ, హల్లెలూయ హల్లెలూయ, హల్లెలూయ ఆమేన్ ... ఆమేన్

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Pr4T3S

Posted by Katta

15, మార్చి 2014, శనివారం

John Hyde Kanumuri కవిత

?? //జాన్ హైడ్ కనుమూరి// ---- మోహించేది రాక్షసే కావచ్చు ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడే వెనుకెనుక ఓ యుద్దానికి వ్యూహ రచన జరుగుతుంది మోహించేది రాణికూడా కావచ్చు తిరస్కరింపబడిన బిగికౌగిలి చెఱశాల పాల్చేస్తుంది లొంగని గుణశీలత యోసేపుదే చెఱశాలనుండి ప్రధానపదవికి వ్యూహ రచన జరుగుతుంది *** రకరకాల మోహాలు, సన్మోహాలు మధ్య లక్ష్మణుణ్ణి యోసేపులను గుర్తించడమెలా!! *** ప్రతీకలన్నీ ప్రక్కకుతోసి ప్రధానపదవికోసం ముక్కుచెవులుకాదు ఎవరి గొంతైనా కోద్దాం ఎవరు ఎవరినైనా మోహించి శయనమందిర పరదాలన్నీ చించేద్దాం!! వంగివంగి మోసే దేహాలపై బాహాటంగానే శయనిద్దాం *** కాపాడాల్సింది ప్రధాన పదవొక్కటే!!!!!! పొందాల్సిందీ ప్రధాన పదవొక్కటే!!!!!! .........................................15.3.2014

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fIh6eZ

Posted by Katta

8, మార్చి 2014, శనివారం

John Hyde Kanumuri కవిత

అవీ... ఇవీ...కొన్ని ఫెంటోలు ఒక చిరునవ్వు వెంట నాల్గక్షరాలు ఒలికించి చూసావా! ఎప్పుడైనా! *** నడినెత్తిన ఎండపొడలో స్నేహ కౌగిలికై నగ్నపాదాల నడిచావా! *** గుమ్మటాలలోని పావురాలు గింజలేరుకుంటూ తీసే కూనిరాగం విన్నావా! *** ఎదురుచూసి సొమ్మసిల్లిన పూరేకులను ప్రేమారగా ముద్దాడావా! *** తలుపు తెరిచిన గదిలో పగులగొట్టిన సుగంధాన్ని ఆఘ్రాణించావా! *** కొంగలబారు రెక్కల శబ్దం వెనుకెనుకే పయనించాలని చూసావా! *** ఒక్కసారి ఇటువస్తావా పొరలువిప్పి బాల్యంలోకి దూకి ఆడుకుందాం 12.08.2012

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MVoiIF

Posted by Katta

15, ఫిబ్రవరి 2014, శనివారం

John Hyde Kanumuri కవిత

ఒక మంచి ప్రయోగం -కందుర్తి ఏ కావ్యానికైనా ఒక కథ అనేది వుంటుంది. ఇది యితివృతానికి సంబంధించిన కథ. కాని యీ కావ్యం వెనకాల మరో కథ వుంది. ముందుగా మనవిచేస్తాను. శుమారు ఆరేండ్ల క్రితం మిత్రులు శ్రీ సి. నారాయణరెడ్డికి కరీంనగరంలో సన్మానం జరిగిన సందర్భంగా నేను అక్కడికి వెళ్ళాను. ఆరోజుల్లో చిరంజీవి కృష్ణారావు ఆ జిల్లాకు సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు. మాకుగల స్నేహ బాంధవ్యాలవల్ల నేను సన్మాన సంఘంవారి ఈతిథ్యం స్వీకరించక కృష్ణారావు యింట్లో మకాంవేశాను. అప్పటికి కృష్ణారావు ఏమీ వ్రాయడంలేదు. దాదాపుగా కవితా సన్యాసంచేసి కూర్చున్నాడు. ఆఅరాత్రి చాలా చాలా పొద్దు పొయ్యేవరకు సాగిన సంభాషణలో , ఏ పూర్వజన్మ సుకృతంవల్లనో కొద్దో గొప్పో అబ్బిన కవితా శక్తిని సాధనద్వారా పదును పెట్టుకోకుండా లౌకిక వ్యవహార నిమగ్నతవల్ల దానిని గాలికి వదలి పెట్టడం ఎంత అన్యాయమో నేను వివరించాను. నాకు మొదల్నుంచి రెండు పిచ్చులున్నాయి. ఒకటి – నేను వ్రాసినా వ్రాయకపోయినా కనపడిన ప్రతివాడినీ రాయమనీ ప్రోత్సహించడం, రెండవది ఆధునిక వచన గేయానికి సంప్రదాయవాదులైన కవి పండితుల మెప్పును గూడా వీలైనంత వరకు సాధించడం, ఆనాటి నా వాదన ఆయన గుండెల్లో పశ్చాత్తాప ఆనలజ్వాలలు లేపిందని నాకు తెలియలేదప్పుడు. తరువాత ఒక ఏడాది వ్యవధితో ఒకసారి మా యింటికి వచ్చి "ఇదిగో, నీవుకోరిన కావ్య"మని చేతికందిచ్చాడు. నేనా విషయం ఏనాడో మర్చిపోయాను. మళ్ళీ అది స్పృహకు వచ్చి పరమానంద భరితుణ్ణయ్యాను. అందువల్ల యీ కావ్యము కృష్ణారావు బిడ్డమత్రమేకాదు, నా బిడ్డకూడా. పైగా నేను స్థాపించిన ఫ్రీవర్స్ ఫ్రంట్ తరుపున ప్రకటించ బడుతున్నందువల్ల దీనితో నా బంధుత్వం మరీ ఎక్కువైంది. రచనలో ఎంత బద్దకం చూపాడో తత్ర్పచురణలో గూడా అంత చేయబట్టి గాని లేకుంటే ఇది ఏనాడో అచ్చు గావలసింది. సకాలంలో అచ్చయి వుంటే కృష్ణారావు యిటువంటి మరికొన్ని కావ్యాలు యీ పాటికి వ్రాసి వుండేవాడని నాకు గట్టినమ్మకం. అయినా యిప్పుడు మించి పోయిందిలేదు. ఈ కవి యావదాంధ్రావనిని సుమారు ఒక దశాబ్దం పాటు ముంచెత్తిన అభ్యుదయ కవితోద్యమంలో పుట్టి పెరిగినవాడు. అందువల్లనే యా కావ్యంలో యితివృత్తం అధోజగత్సహోదదుల దుర్భర నిత్యజీవిత వర్ణనగా రూపొందింది. మురికి వాడల్లో నివసించే బీదా బిక్కి ప్రజల జీవితంలోని కఠోర సత్యాలను ప్రజల దృష్టికి తీసికొని రావడానికి, తద్వారా వ్యంగ్యంగా సంఘంచేస్తున్న మహాపరాధాన్ని స్ఫురింపచేయడానికి చేసిన యా ప్రయత్నం నూటికినూరు పాళ్ళు అభ్యుదయ ప్రయత్నం. ఈ మురికివాడకు తనే చెప్పినట్లు, యీ "ఒకొక్క నగరం దేహం మీద మానని రాచపుండుల"కు కవిగారు పెట్టిన ముద్దుపేరు "వైతరణి". మానవాభ్యదయానికి ఆటంకంగా యీ మహానది ప్రవహిస్తున్నదని, దారిద్ర్యానికి ఐశ్వర్యానికీ మధ్య దాటరాని సరిహద్దుగా తయారైందని బహుశా కవిగారి వూహ. వచన కవితోద్యమానికి ప్రత్యేకంగా ఒక తత్వమంటూ ఏమీలేదని ఆనాటి అభ్యుదయ కవిత్వపు తత్వమే మరికొంత విస్తృతమైన రూపంలో యిమిడి వున్నదనీ నేనొక సందర్భంలో ప్రతిపాదించాను. ప్రత్యేక తత్వంలేకుండా ఒక ఉద్యమమం ఉంటుందా? అనే సందేహం అలా వుంచుదాం. ఉద్యమం అంటున్నానంటే యిది ఒక ఉధ్యమస్థాయిలో వ్యాపిస్తూవున్నదని చెప్పడమే నా భావం. ఇప్పటికీ అభ్యుదయ కవితా తత్వమే రాజ్యం చేస్తున్నదనడానికి యీ కావ్యం మంచి ఉదాహరణ.ఉఒక దృష్టితో చూస్తే గురజాడ, రాయప్రోలులతో ప్రారంభమైన నవ్య కవిత్వ మంతా అభ్యుదయోద్యమంలో భాగమే. కొత్తనుగురించి అన్వేషించిన ప్రతి ప్రయత్నమూ అభ్యుదయోద్యమ నిర్వచనం కిందకే వస్తుంది. ఈ జరిగిన ప్రయత్నాల్లో కూడా కొన్ని అనుకొన్నంత కొత్తను సాధించలేకపోవడం , పాతదానినే కొత్తమూసలో పోయడం వంటివికూడా జరుగుతూవుంటాయి. ప్రేమ కవితా ప్రభావితమై సాగిన నవ్య కవితోద్యమ శాఖ యిటువంటిది. ఫలితమేదైనా కొత్తకోసం జరిగిన ప్రయత్నం కాబట్టి, ఉదారంగా అలోచిస్తే అభ్యుదయ తత్వపు విశాలార్థ కిందికి తీసుకోవచ్చు. ఆ ప్రయత్నం యొక్క పర్యవసానమేమిటి, అది ప్రజలను ఎంతగా ఆకర్షించింది, ఆనందపరచింది, వారు దానినెంతగా ఆదరించారు అనే ప్రశ్నలు తర్వాత. ఆరంభంలో సరియైన దారినేరిఎంచుకొని మధ్యలో పొరపాటున అడ్డదారులు తొక్కే ఉద్యమాలు కొన్ని: కళ కళకోసమే అని నమ్మిన ప్రేమ కవులు ఎంత విఫలులైనారో, అభ్యుదయ తత్వం ఒంటబట్టి కూడా ప్రయోగం ప్రయోగం కోసమే అన్న ధోరణిలో రచనలుచేసిన ప్రయోగవాద కవులు కూడా అంతే విఫలులయ్యారు. ప్రజలకూ కవిత్వానికీ గల సంబంధం సరిగా గుర్తించనందువల్లే యీ వైఫల్యం పొందవలసి వస్తుంది. స్థూలంగా చూసినట్టయితే ఏ కాలంలోనైనా రెండే రెండు కవితా తత్వాలు వుంటాయి. ఒకటి ముందుచూపు; రెందవది వెనుక చూపు. ముందుచూపుగ కవిత్వం అభ్యుదయ కవిత్వం. అయితే ప్రతి కవీ కాలప్రభావంచేత కొద్దో గొప్పో ముందుచూపు కలిగే వుంటాడు. జరిగే మార్పుకు అతడు కూడా దోహదం చేస్తూనే వుంటాడు. అందువల్ల కవులందరికి సమిష్టి కృషిగానే సంప్రదాయం కొంచం కొంచంగా మారుతూ వుంటుంది. ప్రజల ఆమోదం పొందుతూ, వారిని తనతో పాటు తీసికపోతూ, మార్పు వస్తుంటుంది. ఈ విధంగా జరిగే మార్పు స్థిరంగా దేశంలో పాతుకుపోతుంది. అదే సమయంలో కొందరు తీవ్రవాదులు ఒకటినుండి వందవరకు ఒకేసారి గంతేసినట్లు, ప్రజలను తమతో తీసికెళ్ళాలనే ధ్యాస వదలి తామొక్కరే ముందుకు పరుత్తారు. ఈ ప్రజలు మూఢులంటారు; తామొక శతాబ్దం ముందున్నామంటారు; యీ పాడు ఆంధ్రదేశములో పుట్టబట్టి కాని ఏ యింగ్లండులోనో పుట్టినట్లయితే తనకు నోబిల్‌బహుమతి వచ్చివుండేదని నమ్ముతారు. ఇదంతా తన దేశము, తన కాలము, తన ప్రజలను నిర్లక్ష్యముచేసి, నేలవిడిచి చేసే సాముగా తయారవుతుంది. మనకు చూడడానికి కొంత వినోదముగా వుంటుంది తప్ప యిటఉవంటి ఉద్యమాలవల్ల ఫలితమేమి వుండదు. ప్రజలను విస్మరించిన ప్రతి కవితోద్యమము ఏమైనదో సాహిత్య చరిత్ర తెలిసిన వారికి విదితమే. గురజాడనుండి క్రమ పరిణామం పొందుతూ వస్తున్న కవితా విప్లవంలో యీ నాటికి తేలిన సారాంశమేమంటే, కవితా స్వరూపం అభ్యుదయభావన, స్వరూపంలో వచనా కవితా పద్ధతి. ఈ రెంటినీ సమర్థవంతంగా నిర్వహించడమూ నేటి కవుల కర్తవ్యం, ఈ దృష్టితో చూసినట్లయితే కవిత్వంలో కేవలం రసానుభూతి వాదన నిలవదు. ఆచరణలో అది కవితా పరిధిని సంకుచితంచేసి, కవితా వ్యవసాయాన్ని దాని యందభిమానం గల కొందరు మేధావులకు మాత్రమే పరిమితం చేస్తుంది. అప్పుడు ప్రభంధ కవులకూ మనకూ వుండే తేడా చాలా స్వల్పం. అందుకే ఆధునిక కవిత వస్త్వాశ్రయ మార్గానికి తిరగాలని నేనంత పట్టుదలగా ప్రతిపాదించడం. సామాజిక అభ్యున్నతి సండేశంగాగల అభ్యుదయ కవిత్వానికి వస్త్వాశ్రయ మార్గమే చక్కగాఉపకరిస్తుంది. దాని విస్త్రుతికి దోహదం చేస్తుంది. ప్రభంధాలలోని వస్త్వాశ్రయత కేవలం నామమాత్రం. వర్ణనాధిక్యతవల్ల అవి దాదాపు మన ప్రేమ కవుల ఆత్మాశ్రయ కవితా భావనలకు దగ్గరి చుట్టాలుగా వున్నాయి. కాగా అనుసరణీయము భారతములోని వస్త్వాశ్రయ మార్గము. "వైతరణి" కావ్యంలో ఒకే కేంద్ర కథావస్తువునకు సంబంధించిన వివిధ భావపరంపర ఒకదానితో ఒకటి పెనవేసుకున్న వివిధ ఖండికల రూపంలో సమకూర్చబడింది. అందువల్ల వస్త్వాశ్రయ కావ్యమార్గానికి చాలా దగ్గిరలో వుంది. ఒకే విషయాన్ని గూర్చిన మనసులో భావజలధి మననంచేసి రసామృత ఖండాన్ని పుట్టించే అలవాటు చాలామంది ఆధునిక కవులకులేదు. పాఠకుని హృదయంలో రసావిష్కరణ చాలా సులభంగా జరుగుతుందనుకుంటున్నారు. లేకుంటే పాఠకులది తప్పనుకుంటున్నారు. కావ్యంలో తాను ప్రతిష్టించే వివిధ ప్రతిభాంశలచేతా, తన అనుభూతిని జగదనుభూతితో మేళవించి ప్రజల హృదయాలను చూరగొనాలనే సంకల్పంచేతా కవి కృతకృత్యుడు కాగలగుతాడు. ఆ విధమైన కావ్యాలను సృష్టించగలిగినప్పుడే ఆధునిక కవితలో వచ్చిన విప్లవం సార్థకమవుతుంది.. వచన కవితా వికాసం జరగడానికి వస్త్వాశ్రయ మార్గం అనుసరణీయమని అంఘీకరిస్తే ఆ మార్గం పూర్తిగా వృద్ధిపొందడానికి మిత్రులు డా. అరిపిరాల విశ్వం స్థాపించిన "భావలయ" సిద్ధాంతము, శ్రీ కోవెల సంపత్కుమారాచార్య ప్రతిపాదించిన "భావగణ" సిద్ధాంతము బాగా వుపయోగపడే సాధనాలు. వీటినిగురించి యింకా స్పష్టముగా నిర్వచించవలసి వుంది. ఈ "వైతరిణి" కావ్యం "భావలయ" సిద్ధాంతానికి చక్కని లక్ష్యమని నా అభిప్రాయం. "మండు వేసవిలో మల్లెపూల అంగడి పెట్టినవారు పాలబుగ్గల పసి పిల్లడికి పనస తొన అందించినవారు" అని ప్రారంభమైన ఖండికలో కవితా శిల్ప రహస్యం చక్కగా ఆవిష్కరించబడింది. తన కథానాయకులైన మురికి పేట వాసులు తమ సహజవృత్తులను అవలంభిస్తూనే సంఘానికి ఎంత మహోపకారం చేస్తున్నారో , వారి వునికి సంఘానికి ఎంత అవసరమో వర్ణన స్పష్టం చేస్తున్నది. ఇటువంటి ప్రయోజన కారులను మురికిపేటల్లో బధించి వుంచడం సంఘం చేస్తున్న దోషమనే వ్యంగ్యం భాషింపచేస్తూ చేసిన యీ వర్ణన మనోహరంగా వుంది. "వెలుతురుస్తంభం" అనే ఖండికలో కవి "మహామహులు ప్రయాణంచేసే శకటాలకు అనామకులైన సారథు"లైన తన కథా నాయకులు "అన్యాయపు ఆజ్ఞలు శిరసావహించని అనుమానాస్పదులైన సైలికు"అలి కూడా చెప్పి ప్రజల్లోల్ర్ తిరుగుబాటు తత్వాన్ని స్పురింపజేసి ఒక హెచ్చరిక చేసాడు. "చీకటిలో వెలురు స్తంభం నాటించి, సామాన్య మానవుడు అసామాన్యుడని చాటించి అందరికీ వెలుగును పంచి క్రొత్త త్రోవలు త్రొక్కుతారట" తన కథానాయకులు. ఇంతకంటే కవితాత్మకంగానూ, సరళ మనోహరంగానూ ప్రజల స్వభావాన్ని వర్ణించడం కష్టసాద్యం. చిరంజీవి కృష్ణారావు ఆధునిక తెనుగు సాహిత్యానికి పాత కాపే. ఆయనను గురించి ఎక్కువగా రాయనవసరంలేదు. కాని నాకు అభిమాన ప్రయోగమైన వ్స్త్వాశ్రయ కవితా మార్గంలో యీ ప్రయత్నం జరిగింది కాబట్టి యింతగా రాయవసి వచ్చింది. తీరికలేని ఉద్యోగపు విధులను నిర్వర్తించుకుంటూనే, సాహిత్యానికి కొంత సమయాన్ని సమకూర్చుకో గలిగితే ఆయన యింకా యిటువంటి యింతకంటే మంచి కావ్యాలు రాయగలడని నా విశ్వాసం. కందుర్తి ఫ్రీవర్స్ ఫ్రంట్ , హైదరాబాదు. 25.01.1967

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f3Fnek

Posted by Katta

12, ఫిబ్రవరి 2014, బుధవారం

John Hyde Kanumuri కవిత

నిన్ను ఎందుకో కలవలేకపోతున్నా! ఊరించినదేదో సన్మోహనపరచి ఆనందాన్నేదో నీవిస్తావని రహస్య దారులవెంట నడచి నిన్నుచేరాను నీ అడుగులకు మడుగులొత్తానో నా పాదాలకు లేపానాలే పూసావో ఓ గుడ్డిప్రేమతో నను బంధీనిచేసావు నిన్ను నాలో వొంపుకున్న ప్రతిసారీ మేఘాల పాన్పుపై పవళింపచేసావనుకున్నాను కళ్ళుతెరిచినక్షణం ముళ్ళనుపరిచో,బురదను పక్కేసో నన్ను ఒంటరిగా వదిలేసావు ఈ బాధలు నాకెందుకని ఎన్నిసార్లు అనుకున్నానో!! అయినా మల్లెలు గుభాళించినట్టు పెదవినంటినదేదో పదేపదే గమ్మత్తుగా నీవైపు లాగేస్తుంది వెన్నెలను విడచి చీకటి వెలుతురులమధ్య దోబులాచులాటలతో పాదాక్రాంతుణ్ణిచేసావు వినోదమైన చోటుల్లో చన్నీటిస్నానం చక్కిలిగిలిపెట్టినట్టు స్వరగతులతో చిందేయించావు నేను నిన్ను ప్రేమించాననుకుంటే నన్నాక్రమించి నాట్యమాడిన నీపాదాలు ఆరు పెగ్గులనంతరం వాంతిని పరచి పొర్లించావు సన్మోహాలను తెంచుకోవడానికి నరాలెంతగా విలవిలలాడయో తెలుసా! అందుకే నీ ప్రేమాలింగనాలకు విడాకులిచ్చేసా!! ఎన్నిసార్లు గుర్తొచ్చావో ఎన్నిసార్లు ఎందరితో కబురంపావో నా కోసం ఎంత విరహ సందేశాలంపినా ఎందుకో నిన్ను కవలేకపోతున్నా!! *** (మానేసిన మద్యపానం గుర్తొచ్చి) **12.2.2014** 17:15 ISD

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gthITh

Posted by Katta