పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Priya Karumanchi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Priya Karumanchi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, సెప్టెంబర్ 2012, శనివారం

ప్రియ కారుమంచి // మహల్లో కో యిల

ఆకాశాన్ని తాకాలని
ఆశ పడ్డావ్ కానీ
నా మనసు లో ఎగిసే
భావాల్ని కుడా చేరలేక పోయావ్ !!

బ్రతుకు సంద్రాన్ని గొప్పగా
ఈదాలని ఆరాట పడ్డావ్ కానీ
నీ విరహం తో తడిచిన
నా గుండె తడి ని చూడలేక పోయావ్ !!

నక్షత్రాల మెరుపుని చూసి
మురిసి పోయావు కానీ
నా మనసు విరబూసిన వెన్నెలైనా
నీ కోసమే అని తెలుసుకోలేక పోయావ్ !!

అయినా ఇది నీ తప్పు కాదులే
నేను నీ మహల్లో కోయిల నే కానీ
నీ నిశీధి గుండెను చేరే
తీయని గానం చేయలేక పోయానేమో !!