పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, మార్చి 2014, సోమవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: జయనామ ఉగాదికి స్వాగతం...: చైత్రం పూసి కరవాలం దూసి ఓరగ చూసిన చూపుకు చీకటి రక్కసి వడి వడిగా తొలగుచున్న వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! లేత భానుని నులి వెచ్చని కిరణాల కౌగిటిలో శిశిరపు మంచు తదాత్మ్యముగా కరుగుచున్న వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! కరిగిన హిమం కనుమరుగై నీలి ఆకసపుటంచులను చేరి కరి మబ్బులకు కాంతినిచ్చిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! మంచు సముద్రం మాయమవుతూ మోడులు బోయిన ప్రకృతికాంత నుదుటన పచ్చని సింధూరం దిద్దిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! ప్రకృతి కన్య పచ్చని సోయగమునకు విచలితుడయిన చెరుకు విలుకాడు విరివానను శర పరంపరగా కురిపించిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! వత్సరం క్రితమే ఎటో వెళ్ళిపోయిన వసంత కన్య పంచశరుని వింటి మహిమన తిరిగి మహికరుదెంచిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! వసంతం సంతసమొందగ తరులతా సమూహం కుసుమరాగ పుప్పొడి శోభిత భాసితయయి అవని ఎదన ఆకుపచ్చ వస్త్రమును అచ్చాదనముగా పరచిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! భూతలమున అమృతభాండం రసాల వృక్షం చిగురుల గ్రోలి మధించిన కోయిల కూజిత రాగములాలపించిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! ప్రసూనములు హొయలుపోయి జావళీలు పాడుతున్న వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! నవ మల్లియల పరిమళాలు చేమంతుల విరహ వేధనలు చెలి సిగను చేరి హృదయ కుహారములో వసంతములాడిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! ఎటు చూసినా సౌందర్య లోక ఉద్యాన వనమై వనం వనం శుక పికల సమ్మేళనమయిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! దివినున్న అందాలు ఆసాంతం భువికి దిగుమతయిన వేళ జయనామ ఉగాదికి స్వాగతం..! సంతోశం సమరసతా సౌందర్యం సౌహార్ధం క్రమత జాగురూకత తప్ప ఇంకేమీ వలదంటున్న జయనామ ఉగాదికి స్వాగతం..! జయనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు...!! 31/03/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rWN0ck

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి