పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Srinivas Iduri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Srinivas Iduri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

ఈడూరి శ్రీనివాస్ //కొత్త కవి//


ఏంటోయ్ కొత్త కవీ
రాస్తున్నావ్ అవీ ఇవీ
నీ రాతలు ప్రవహించాలి
యువరక్తం వుడికించాలి

శ్రీశ్రీని బట్టీ పట్టినా
సినారేని చుట్టుముట్టినా
అక్షరం అందలమెక్కదు
నీ లక్ష్యం నిదురలేవదు

బూతు బొమ్మకు చొంగ కార్చే
యూతు నడక మార్చాలి
పబ్బుల్లో పడి తాగిన
పది బీర్లూ కక్కించాలి

హాబీగా ప్రేమించే
బేబీలను మార్చాలి
బాయిఫ్రెండు కల్చరెంత
బ్యాడు ట్రెండో తెలపాలి

అడ్డంగా దండుకున్న
ఉద్దండుల తల వంచాలి
గలీజు గనుల గజనీలను
వురికంబం ఎక్కించాలి

నీ కలం నినదించాలి
వ్యవస్తను ఎదిరించాలి
యువతను రగిలించాలి
భవితను బతికించాలి

08/09/12

31, ఆగస్టు 2012, శుక్రవారం

ఈడూరి శ్రీనివాస్ ||అంకురం||


గాఢాంధకారంలో జగత్తు
గాఢ నిద్రలో నేను
ఇంతలో ఏదో అలజడి
ఒక స్త్రీ మూర్తి రోదన
నేను ఏదో ద్రవంలో
తేలుతున్న భావన
నెమ్మదిగా కిందికి జారుతున్నా
అలా మొద్లైంది
నా తొలి ప్రయాణం
అంతలోనే ఏదొ అడ్డంకి
స్త్రీ మూర్తి ఊపిరి బిగించింది
నన్ను ఏదో శక్తి బయటికి నెట్టింది
నాకు భయంతో ఏడుపొచ్చింది
అక్కడున్న అందరికీ నవ్వొచ్చింది
మగ బిడ్డ అన్న మాట వినిపించింది
సరిగ్గా అప్పుడే....అంకురించింది
పురుషాహంకారం!!!

30/8/2012

28, ఆగస్టు 2012, మంగళవారం

ఈడూరి శ్రీనివాస్ ||ఒకప్పుడు||

ఒకప్పుడు భూమ్మీద మనుషులుండేవారట
మంచితనం, మర్యాద పంచుతుండేవారట.

ఏవైపు చూసినా పచ్చదనం వుండేదట
నదీ పరివాహకాల్లో నాగరికత విరిసేదట.

ఏనోటి మాట విన్నా మనసు పులకరించేదట
ఏఇంటి తలుపు తట్టినా ఆప్యాయత పలకరించేదట.

శ్రమైక జీవన సౌందర్యం అనుభవించేవారట
చెరపకురా చెడేవు అని చెప్పుకునేవారట.

ఆ రోజులు పోయాయి, అవతారాలు మారాయి
విలువలు తరిగాయి, స్వార్ధాలు పెరిగాయి

నేడు భూమ్మీద వున్న జనం మనుషులు కానేకారు
యాంత్రికంగా బతుకు లాగే మరమనుషులు వీరు

జురాసిక్కు పార్కులో స్పీలుబర్గు చూపించినట్లు
రాక్షస బల్లుల్లా మనుషులు మళ్ళీ పుడతారట

అమ్మ నన్ను ఈరోజు జూకి తీసుకెడుతోంది
మనుషుల్ని చూపిస్తా రారమ్మని అంటోంది

అంతరించిపోతున్న మనిషి జాతీ వందనం
ఫ్యూచర్లో ఎక్కడో మళ్ళీ కలుద్దాం మనమందరం!!!!

27/8/12

21, ఆగస్టు 2012, మంగళవారం

ఈడూరి శ్రీనివాస్ || హైదరాబాదు ||

హైదరాబాదు రహదారులు
నరకానికి అవి అడ్డదారులు
వేశావంటే బయటకు అడుగు
చుక్కలు కనబడకుంటే నన్నడుగు
లెఫ్టూ రైటూ జనాలకి తెలియవు
ట్రాఫిక్ లైట్లు ఎన్నడూ వెలగవు
పొలీసులు నడిచే ఏటీయెమ్ములు
జేబులు నింపును అవినీతి సొమ్ములు
పామరులకు తప్పవు చలానులు
ధనవంతులకేమొ సలాములు
రాత్రంతా రోడ్లపై గొప్పోళ్ళ పిల్లల రేసులు
తెల్లారితే బస్సులకోసం రన్నింగ్ రేసులు
బండున్న ప్రతివాడూ ప్రతిభావంతుడు
రోడ్డెక్కితే అశోకవనంలో హనుమంతుడు
ఈ నగరానికి ముద్దుపేరు హైటెక్ సిటీ
దారంతా శవాల గుట్టలు వాట్ ఎ పిటీ
*20-08-2012

19, ఆగస్టు 2012, ఆదివారం

ఈడూరి శ్రీనివాస్ || వలపు - ఘజల్ ||


నీ వలపు మది తాకిన సమీరం లాగుంది
ఆ తలపు నను వీడని భ్రమరం లాగుంది

నీ చూపు తాకగానె శిలనైన నాకు
కన్ను కన్ను కలపడమే సమరం లాగుంది

ప్రేమ అనే పదానికి ఇంత పటిమ ఎక్కడిదో
ఆ ఊహే వేసవిలో శిశిరం లాగుంది

ఎంత కాదన్నా నీ వెంటే నడుస్తున్నా
నీ తీరే అసమ్మతి శిబిరం లాగుంది

ఇన్ని నెలల నిరీక్షణ ముగిసేనా తొందరలో
నీ వాలుచూపు ప్రేమాలయ శిఖరం లాగుంది

చెరిగిపోని ప్రణయాలు చరిత్రలో ఎన్నున్నా
ఈడూరీ, నీ కధ అమరం లాగుంది.

*18-08-2012

17, ఆగస్టు 2012, శుక్రవారం

ఈడూరి శ్రీనివాస్ || వేదికపై వెన్నెల కురిసింది ||



YAKhOOB అంటూ ఆహూతులనగా

మన SUBODHalu వినేందుకు

SARKAR తానే దిగిరాగా

AFSARasalu ఆడిపాడగా

యువకవులు NARASINGAలై గర్జించగా

SIVA రెడ్డొచ్చి మొదలాడె

ఆNANDAm KATTAలు తెంచుకుంది

కవిత్వం KASI తీరింది

వేదికపై వెన్నెల కురిసింది




KIRANam GALI వీచింది

ఎందRO HITulu వెంటరాగా

చిక్కటి మీగడ PERUGU

GURUSWAMula VARAలు

KRISHNAVENI జలాలు

KAPILA తీర్థాలు

BOBBY NEE నది పరవళ్ళు తొక్కింది

వేదికపై వెన్నెల కురిసింది




RISHI తత్వం కనిపించింది

CHNADRA SEKHARa వీక్షణాలతో

పంచబూతాలు MERCY చూపగా

RENUKA దేవి ఆశీర్వదించింది

అందరి JAYA ధ్వానాల మధ్య

వేదికపై వెన్నెల కురిసింది.


(15-08-2012 నాటి కవిసంగమం గురించి అందరూ తమ తమ అభిప్రాయాలను, అనుభవాలను వ్యక్తపరిచారు. నేను మాత్రం నా భావాల్ని కవిత్వ రూపంలో ప్రకటిద్దామని ఇప్పటిదాకా ఆగాను ఎందుకంటే ఈరోజు దాకా ఎవరూ కవితలు పోస్ట్ చేయొద్దు అన్నారు కాబట్టి. ఇందులో అందరి పేర్లూ ప్రస్తావించడం కష్టం కాబట్టి తమ పేరు లేదని ఎవరూ చిన్నబుచ్చుకోవద్దు. సరదాగా చేసిన చిన్న ప్రయత్నం మాత్రమే.)

11, ఆగస్టు 2012, శనివారం

శ్రీనివాస్ ఈడూరి ||నా రుబాయి||

ఈ మధ్య సామల సదాశివ మాస్టారు గురించి తెలుసుకున్నప్పుడు రుబాయిల గురించి కూడా తెలిసింది. చిన్న ప్రయత్నం చేశాను. పెద్దలు చదివి సలహాలు ఇవ్వగలరు

చెలి పాద సవ్వడి అదిగో గుండె లయ సరిచూసుకో
రస రాణి నవ్వింది కసిగా వలపు వీణ శ్రుతిచేసుకో
తనతో గడిపిన అనుక్షణం ఒక సుందర కావ్యం
అపురూప మానస చిత్రం కుంచెతో నీ మదిగీసుకో
ఈడూరీ మరణంలోనూ ప్రేయసిని పెనవేసుకో.


*10-08-2012

4, ఆగస్టు 2012, శనివారం

శ్రీనివాస్ ఐదూరి॥మరణం తరువాత॥


చూడాలని ఉంది నాకు చందమామ వెనుక కూడా
చేరాలని ఉంది నాకు దిగంతాల ఆవల కూడా

ఉరకలేసే లేత మనసు అణిగి మణిగి ఉండలేదు
ఆడాలని ఉంది నాకు బాల్యం తరువాత కూడా

మనసు తోడు రాకుంటే విజయానికి విలువెక్కడిది
గెలవాలని ఉంది నాకు ఓటమి తరువాత కూడా

ప్రేమ అమరమనుకుంటే అంతమన్న మాటెందుకు
రమించాలనుంది నాకు ప్రణయం తరువాత కూడా

కానరాని లోకాలపై మమకారం నాకెందుకు
బతకాలని ఉంది నాకు మరణం తరువాత కూడా
*3.8.2012