మహాకవి మహారాజశ్రీ శ్రీ శ్రీ ఆకృతి సామాన్యం, వ్యక్తిత్వం అసామాన్యం అప్పలకొండ దంపతులకు వంశాకురం శ్రీరంగం కుటుంబానికి దత్తత పార్శ్వం ఫలితంగా ‘శ్రీరంగం శ్రీనివాసరావు’ పోట్టిపేరు శ్రీశ్రీ, పేరులోనే విన్నూత్నం ‘శ్రీ’ కి ‘శ్రీ’ కి మధ్య దూరం అగణితం. చదువు సంధ్యలు, విసిరేసే విశాఖ తీరాన ఒకటిన్నర దశాబ్దపు ప్రాయంలోనే వివాహం దత్తపుత్రుడికి దత్తకూతురు జీవన ప్రవేశం అర్థపుష్కరకాలం తర్వాతే జంతుశాస్త్రంలో చదువు డిమాన్స్ట్రేటరు, ఎడిటర్ తొలి కొలువులు రేడియో, మిలిటరీ, నిజాం నవాబు, ఆంధ్రవాణి జీవనయానానికి ఉపయోగిత ఉద్యోగాలు కలాయుదులు ఊహలతో కాగితంపై రాసుకుంటూ పోతారు బరకడం, గీకడం తో తెల్లకాగితాన్ని నలుపు చేసుకుంటారు వెయ్యేళ్ళకోసారో, వేలకొక్కరు వేలుతో కలంకుంచె కదుపుతారు కవితను, కవితాత్మను వేదికపై ఖచ్చితంగా ఆవిష్కరిస్తారు అసంకల్పితచర్యలా హిమగిరి ప్రతిభారోహణం చేసేస్తారు సాహితీ శిఖరాగ్రాన కవనపు మహాప్రస్థాన గానం చేస్తారు ఆ గాననాదఝరికి జగన్నాథుని రథచక్రాలూ కదులుతాయి విదేశాలు కూడా గళాన్నిస్తాయి, దశదిశల్ని మార్చివేస్తాయి. శీశ్రీ లో, రచనల్లో, చిత్రగీతాలు, కవితలు, ప్రహేళికలు, వ్యూలు, రివ్యూలు, ఉపన్యాసాలూ, కథలు, కథనాలు విశ్వసించిన సిద్ధాంతాన్ని రాద్దాంతం చేయక రాపిడిపెట్టి సమైక్యవాదాన్ని సగర్వంగా నమ్మిన కృషీవలుడు విదేశాలకు తన వాదాన్ని వేదంలా అందించాడు వారేవః కేకలను వింటూ వాడి వేడితనాల్ని పంచాడు అరసం, విరసం వేదికేదైనా ‘గురజాడ అడుగుజాడ’న్నాడు సంప్రదాయాన్ని ‘ప్రభవించి’ గ్రాంథిక చందోవిహారం చేయించాడు బాటసారి, భిక్షువర్షీయసి అంటూ ‘హరోంహర’ మహాప్రస్థానం చేశాడు ఖడ్గసృష్టితో చరమరాత్రిని నిర్మించి, ఒకటికింకొకటిని కలిపినా ఒకటేనన్నాడు వ్యూలు, రివ్యూలు, ప్రివ్యూలతో రెక్కవిప్పిన రివల్యూషన్ సృష్టించాడు విశాలాంధ్రలో ఉక్కుపిడికిలి, అగ్నిజ్వాలతో ప్రజారాజ్యాన్ని వీక్షించాడు తెలుగువీరుని మేలుకొలిపి, సంఘ శతృవుల్ని ఖబడ్డారన్నాడు మనసున మనసై, ‘హలో హలో’ ఓ అమ్మాయి! అంటూ దరి చేరాడు హృదయంలో నిదురించే చెలిని వయారి మయూరిలా ఆరాధించాడు వ్యాసక్రీడల్ని ఆడిస్తూ, వ్యక్తికి బహువచనం శక్తన్న సాహితీ అగ్రగణ్యుడు అల్పంలో అనల్పాన్ని, శిల్పశ్లేషప్రాసల్ని జోడీకరించాడు శబ్దప్రయోగాల్లో నవ్యత, ప్రజతో శతచాతురోక్తుల్ని విసిరాడు అష్టావర్షప్రాయంలోనే కవితాప్రచురణా దన్నుని చూపించాడు స్వదస్తూరితో, స్వీయగాలంతో మహాప్రస్థానాన్ని సుస్థిరం చేశాడు తనను తాను సమీక్షించుకొని దార్శనికతని స్వీయదర్శన మొనర్చాడు సౌదామినిని సంపంగితోటకు తరలించి మరోప్రపంచాన్ని చూపించాడు ఊరికేనా అంటే ఊరికే, ఒక నాటిక రాయమంటే ఏనాటికైనా రాస్తానన్నాడు తెలుగు జాతీయ భాష దురభిమానం లేని అభిమతం అన్న భాషాభావకుడు హాల్డేన్ భావాభిరామాల్ని నల్దిక్కులా ప్రతిభా ప్రచారం కావించిన ప్రవీణుడు తిక్కవేమగురజాడలను కవిత్రయపు హోదాలో నిలిపిన భాషాప్రేమికుడు అక్షరాల్ని ముత్యాలసరాలుగా ముగ్ధసమ్మోహన పరచిన నిత్యాక్షరమూర్తి సాటితోటి కవుల్లోని సశాస్త్రీయాన్ని, కృష్ణశాస్త్రీయాన్ని చవిచూశాడు ప్రపంచపు బాధ అంతా తన బాధ అంటూ యోగ్యతాపత్రాన్ని పొంది చావ ఉంటేనే చదవాలన్న చలం సవాల్ విసిరేలా చేసిన చైతన్యమూర్తి తేదీలు, దస్తావేజులు చరిత్రసారం కాదంటూ చెణుకుల్ని చెరిగాడు తెలుగు సాహిత్యాన్ని ఆయన శాసేస్తే, తెలుగు సభల పరాభవం పొందాడు ఆరేడుపదుల వసంతోత్సవాలకు విశాఖ కాకినాడ వాడల పుణ్యం సరిసములులేనితనంతో కావన సాహితీజీవనం, అనంత ఆత్మకథనం రాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రచండ ఘోషా శ్రవణం శతాబ్దపు కవన ప్రకంపనాన్ని తూచక అనుభవించి పలవరించమన్నాడు తెలుగువాడి జాతీయధనం ఓర్వలేనితనం, పొరుగింటి పుల్లకూర బహురుచి శ్రీవాణీతో తెలుగుసాహితీభారతి శుభారంభం, శ్రీశ్రీవాణి యుగపు మలుపు నూతన కవితా భగీరధుడు, సాహితీ మార్క్స్, మానవత్వ ప్రవాహ నదం గురుజాడ త్రివేణీసంగమ గురజాడ, చలంల సహచరుడు, కవి, మనీషి, ప్రపంచాగ్నికి, విశ్వసృష్టికి, భువనఘోషకి నేను సైతం అంటూ సొంతగొంతు నిచ్చిన నాద విద్వాంసుడు, ఆధునికాంధ్ర రథసారధి తన భావనా కవిత్రయాన్ని పరకాయప్రవేశం కావించుకున్న మంత్రగాడు తన రచనల్లో లోక ప్రతిఫలం, తన తపస్సు ఫలించే, జాతిజనుల గీతమంత్రకారుడు వినుతించే, విరుతించే, వినిపించే నవీనగీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం సర్వనాద మూల బిందువైన ఋతమే ప్రణవమన్న ప్రవచకుడు ‘ఆలోచన నా ఉనికికి సూచన’ అన్న మరణం లేని శ్రీశ్రీ, జనన మరణాల మధ్య విరామం శ్రీశ్రీ మరల అవతరిస్తాడన్నది తథ్యమైతే, మరో తోకచుక్క పొడవక తప్పదన్నది సత్యం శ్రామిక ప్రజా జైత్ర యాత్రాపతాక కాకా తప్పదు అన్నదీ కానున్న వాస్తవమే. శ్రీశ్రీ మరో మహాప్రస్థానాన్ని సృష్టించి, తప్పక అందిస్తాడు, అవశ్యం చదివిస్తాడు, విశ్వప్రజ మాత్రం మరో చలాన్ని సిద్ధం చేసుకోవాలి మరో యోగ్యతాపత్రానికి . ఏమో, ఎవరికెరుక? శ్రీశ్రీ-చలం అచలంగా, అచంచలంగా యుగళంగా దర్శనం ఇస్తారేమో! ‘అశీతి’ సంబరాలు జరుపుకుంటున్న వైనంలో మహాప్రస్తానపు మహోన్నత ఘనం ఏ శాతాబ్దంలోనైనా ఏకైక తెలుగు మహాకావ్యం – మహాప్రస్థానం సాగించే మహా ప్రస్థానం శ్రీ శ్రీ జయంతి సందర్భంగా – కొవ్వొత్తిని రెండు వైపులా ముట్టించే ప్రయత్నం రాబోయే దీపావళి కాంతులు ‘శ్రీశ్రీలా విరజిమ్ముతూ, తారాజువ్వల్లా అంబరాన్ని ముద్దాడాయి. శ్రీశ్రీది మహా వ్యక్తిత్వం – శ్రీశ్రీది మహాకావ్యం – మహాప్రస్థానం, మరోప్రపంచం శ్రీశ్రీది సాహితీ జగతిలో మహాభినిష్క్రమణం – పురిపండా అప్పలస్వామి మధుగుళికలు. మహాకవికి శతసహస్ర ప్రనామాలతో అక్షర నీరాజన నమస్సుమాంజలులు ‘మనిషితనపు మహాస్రవంతి’ మహారాజశ్రీ శ్రీ శ్రీ కి వందనాలర్పిస్తూ – “ప్రపంచమును పరిహసిస్తాం – భవిష్యమును పరిపాలిస్తాం” (కొంపెల్ల శర్మ – తెలుగురధం – సాహిత్య్హ,సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్)
by Kompella Sarmafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PTnjdv
Posted by
Katta